Rental
-
ఇంట్లోనే వెండితెర
సాక్షి, భీమవరం: వెండితెర వినోదం కొత్త పుంతలు తొక్కుతోంది. టూరింగ్ టాకీస్ రోజుల్లో కొత్త సినిమాలు పట్టణాల్లో మాత్రమే విడుదలయ్యేవి. అప్పట్లో ఎడ్ల బళ్లు కట్టుకుని మరీ ఇంటిళ్లపాది వెళ్లి చూసి వచ్చేవారు. కాలం మారింది. ఇప్పుడు ఎంత పెద్ద హిరో సినిమా అయినా నెలరోజుల్లోనే ఓవర్ ది టాప్ (ఓటీటీ)లో వస్తుంటే ఆధునిక పరిజ్ఞానం హోమ్ థియేటర్ల రూపంలో వెండితెరను ఇంటికే తెస్తోంది. థియేటర్లో చూసిన అనుభూతిని అందిస్తోంది. కొన్నాళ్లు నగరాలకే పరిమితమైన ఈ హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్నిప్రాంతాలకూ విస్తరిస్తోంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూతపడగా ఇళ్లకే పరిమితమైన జనానికి ఓటీటీనే ఏకైక వినోద సాధనమైంది. సినిమాలు నేరుగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్‌స్టార్, ఆహా, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ కావడం మొదలైంది. చౌక ప్లాన్లు, ఇంటిళ్లిపాది చూసే అవకాశం ఉండటంతో కొద్ది రోజుల్లోనే వీటికి ఆదరణ అమాంతం పెరిగిపోయింది. ఇంట్లోనే థియేటర్ అనుభూతి గతంలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే కనిపించే హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. సంపన్న వర్గాలతో పాటు కాస్తోకూస్తో డబ్బున్న వారు కూడా వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. హోం థియేటర్ సెట్ చేయడానికి కనీసం 10 గీ 15 అడుగుల విస్తీర్ణం కలిగిన హాల్ ఉండాలి.నాణ్యమైన సౌండ్ సిస్టమ్, స్క్రీన్, అభిరుచికి తగ్గట్టుగా సిట్టింగ్, ఇంటీరియర్ డికరేషన్ను బట్టి హోం థియేటర్‌కు రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. స్క్రీన్, ప్రొజెక్టర్, యాంప్లిఫయర్, స్పీకర్స్, సౌండ్ ప్రూఫింగ్ తదితరాలను అమర్చుతారు. అధికశాతం మంది రూ.5 లక్షల వరకు వెచ్చిస్తుండగా, కొందరు రూ.10 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు టెక్నీషియన్స్ చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 300కు పైగా హోమ్ థియేటర్లు ఉన్నాయంటున్నారు. తాజాగా ఏలూరు సమీపంలోని 150 విల్లాల్లో కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా హోం థియేటర్లు సిద్ధం చేస్తున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఒక హోం థియేటర్స్ అధినేత ఆర్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. ప్రైవేట్ థియేటర్లకు పెరుగుతున్న ఆదరణ వినోదానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో సినిమాలు చూసేందుకు, ఈవెంట్స్, ప్రత్యేక వేడుకల కోసం మినీ థియేటర్లకు ఆదరణ పెరుగుతోంది. పది మంది లేదా కుటుంబ సభ్యులతో నిర్వహించే బర్త్‌డే పార్టీలు, ఇతర వేడుకలకు ఇవి అనువుగా ఉంటున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ఇవి ట్రెండింగ్‌గా మారాయి. స్క్రీన్, సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, పది మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్, ఇంటీరియర్‌తో ఆకర్షణీయంగా వీటిని తయారుచేస్తున్నారు. 30 X 20 చ.అడుగులు మొదలుకొని కొంత స్థలంలో మినీ హోం థియేటర్లు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఔత్సాహిక యువత ఉపాధి పొందుతున్నారు. ఇటీవల ఈ తరహా మినీ థియేటర్లు భీమవరంలో ఐదు వరకు వచ్చాయి. సీజన్‌ను బట్టి గంటకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు వీటికి అద్దె ఉంటుంది. మరో పక్క యువతను ఆకర్షించేందుకు జ్యూస్, ఐస్‌క్రీం పార్లర్లు, హోటళ్లలోను హోం థియేటర్ల ఏర్పాటుకు వ్యాపారులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈవెంట్ల కోసం ఇటీవల కాలంలో ప్రైవేట్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భీమవరంలోని మా మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్‌లో ఏర్పాటుచేసిన మినీ థియేటర్‌కు ఆదరణ బాగుంది. గంటల చొప్పున థియేటర్‌ను రెంట్‌కు ఇస్తుంటాం. –జి.కృష్ణంరాజు, మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్, భీమవరం -
ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..
దేశవ్యాప్తంగా ముంబయి ఖరీదైన నగరాల్లో మొదటిస్థానంలో ఉందని ‘మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే వెల్లడించింది. కలల నగరం(సిటీ ఆఫ్ డ్రీమ్స్)గా పేరున్న భారత వాణిజ్య రాజధాని ముంబయిలో జీవనవ్యయం భారీగా పెరిగిందని నివేదికలో తెలిపారు. వ్యక్తిగత ఖర్చులు, రవాణా ఖర్చులు, గృహ అద్దెలు అధిక స్థాయిలో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ముంబయి గతంలో కంటే 11 స్థానాలు ఎగబాకి 136వ ర్యాంక్‌కు చేరుకుంది. దిల్లీ 4 స్థానాలు పెరిగి 164వ ర్యాంక్‌కు, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189కు, బెంగళూరు ఆరు స్థానాలు తగ్గి 195కు, హైదరాబాద్ ఎలాంటి మార్పు లేకుండా 202 వద్ద స్థిరంగా ఉంది. పుణె ఎనిమిది స్థానాలు పెరిగి 205కి, కోల్‌కతా నాలుగు స్థానాలు పెరిగి 207కి చేరుకుంది.అంతకుముందు ఏడాదికంటే 2023లో 20 స్థానాలు దిగజారి 147వ ర్యాంక్‌కు చేరుకున్న ముంబయి 2024లో 136వ ర్యాంక్‌కు పెరిగింది. ఎనానమీలో వస్తున్న ఆర్థిక మార్పుల వల్ల ముంబయిలో జీవన వ్యయం పెరుగుతోందని నివేదిక పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో దిల్లీ 169 నుంచి 164కి, కోల్‌కతా 211 నుంచి 207కి, పుణె 215 నుంచి 205కి చేరుకుంది. చెన్నై 184 నుంచి 189కి, బెంగళూరు 189 నుంచి 195కి, హైదరాబాద్ 202 వద్ద నిలకడగా ఉంది. ఆసియావ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో, దిల్లీ 30వ స్థానంలో ఉన్నాయని నివేదిక తెలిపింది.ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో భారత్ చాలావరకు నిలకడగా ఉంది. మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ముంబయి గ్లోబల్ ర్యాంకు పెరిగినప్పటికీ మారుతున్న ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయి. దిల్లీలో గృహ అద్దెలు అత్యధికంగా 12-15 శాతం పెరిగాయి. ముంబయిలో 6-8 శాతం, బెంగళూరులో 3-6 శాతం, పుణె, హైదరాబాద్, చెన్నైలో 2-4 శాతం గృహ అద్దెలో పెరుగుదల కనిపించింది. సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ముంబయిలో అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఈవిభాగంలో చెన్నై తర్వాతి స్థానంలో ఉంది. కోల్‌కతాలో వాటి ధర తక్కువగా ఉంది. కరెంటు బిల్లులు, యుటిలిటీ ఖర్చులు ముంబైలో చాలా ఖరీదయ్యాయి. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరిగాయి. ఈ విభాగంలో బెంగళూరు తర్వాతి స్థానంలో ఉంది.ఇతర దేశాల్లోని ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించడంలో స్థానికంగా ఉన్న హౌసింగ్ ఖర్చులు కీలకంగా మారుతాయని నివేదిక తెలిపింది. దాంతోపాటు ఉద్యోగుల జీవననాణ్యతపై ప్రభావం పడుతుందని చెప్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయ అనిశ్చుతులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుందని, దాంతో సంస్థలు ఇతరదేశాల్లోని ప్రతిభ ఉన్నవారిని ఆకర్షించే పనిలో ఉన్నాయని నివేదిక తెలిపింది. చాలాకంపెనీలు ముంబయిలో తమ కార్యకలాపాలు సాగిస్తుండడంతో విదేశీ ఉద్యోగులకు తగిన జీవనప్రమాణాలు అందించేలా ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఖర్చులు ఎక్కువవుతున్నాయని మెర్సర్ పేర్కొంది.ఇదీ చదవండి: ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అధిక లివింగ్ కాస్ట్ ఉన్న నగరాల్లో హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), జెనీవా (స్విట్జర్లాండ్), బాసెల్ (స్విట్జర్లాండ్), బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ఏంజిల్స్ (యూఎస్) వరుసస్థానాల్లో నిలిచాయి. -
బెంగళూరులో ఓ ఇల్లు.. అలాంటి జంటలకే ప్రాధాన్యం!
దక్షిణాదిలో అత్యంత రద్దీ నగరంగా పేరొందిన బెంగళూరు ఖరీదైన ఇంటి అద్దెలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యువకులకు, ముఖ్యంగా బ్యాచిలర్లకు ఇళ్లు, ఫ్లాట్లు దొరకడం కష్టం. అద్దెకు వచ్చే వారి నేపథ్యం, అకడమిక్ మార్కుల ఆధారంగా కూడా ఇల్లు ఇస్తున్న సంఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదు.మెట్రో నగరంలో అద్దె ఇళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రియమ్ సారస్వత్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు విభిన్నమైన ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. బెంగళూరులోని తన ఇంటిని అద్దెకు ఇస్తున్న ఆయన "బ్యాచిలర్స్, లివ్-ఇన్ కపుల్స్" కు ప్రాధాన్యత ఇస్తున్నారు.వూష్ కో ఫౌండర్ ప్రియమ్ సారస్వత్ ఈ మేరకు తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. బెంగళూరులోని హర్లూర్ రోడ్డులో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని హోమ్ టూర్ చేశారు. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కు సమీపంలో ఉంది. "నేను హర్లూర్ రోడ్లో (హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కు చాలా దగ్గరగా) లో ఈ అందమైన ఇంటిని కొనుగోలు చేశాను. ఇందులో అద్దెకు ఉండేవారి కోసం చూస్తున్నాను. బ్యాచిలర్స్ లేదా లివ్-ఇన్ జంటలకు ప్రాధాన్యం ఉంటుంది" అని ఆయన ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. I purchased this beautiful house at Harlur Road (Very close to HSR Layout) and now looking for tenants to occupy asap 🏡😇Bachelors or Live-In couples preferred ( My way of giving back to the community 😉) Dm if you are interested and RT for good karma ✌️ pic.twitter.com/d7pcC53GI8— Priyam Saraswat (@priyamsaraswat) June 13, 2024 -
TSRTC: రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్న ఆయన.. వారు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్‌కు ఐదు సమస్యలను విన్నవించామన్నారు. ఎండీ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 10 వ తేదీ లోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని వారు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ పరామర్శ -
హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలకు రెక్కలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 24 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా 13 పట్టణాల్లో సగటున 22.4 శాతం మేర అద్దెలు పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) మ్యాజిక్‌బ్రిక్స్ రెంటల్ ఇండెక్స్ ప్రకటించింది. అదే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ పెరుగుదల 4.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) గణాంకాలను మ్యాజిక్‌బ్రిక్స్ విడుదల చేసింది. మ్యాజిక్‌బ్రిక్స్ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్లకు పైగా కస్టమర్ల ప్రాధాన్యతల ఆధారంగా ఈ నివేదికను సంస్థ రూపొందించింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు థానేలో ఇళ్ల ధరలు 57.3 శాతం, గురుగ్రామ్‌లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం చొప్పున పెరిగాయి. ఈ పట్టణాల్లో అద్దెల డిమాండ్‌లో యువత (18.34 ఏళ్లు) పాత్ర 67 శాతంగా ఉంది. 41 శాతం మంది కిరాయిదారులు రూ.10,000–30,000 మధ్య అద్దెల ఇళ్లకు మొగ్గు చూపిస్తున్నారు. అద్దె ఇళ్లల్లో 52.7 శాతం సెమీ ఫర్నిష్డ్ ఇళ్లకే డిమాండ్ ఉంటోంది. కానీ, వీటి సరఫరా 48.7 శాతంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పట్టణీకరణ, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులు అద్దెలు పెరగడానికి కారణాలుగా మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ పేర్కొన్నారు. ఒకవైపు అద్దె ఇళ్లకు అధిక డిమాండ్, మరోవైపు సరఫరా తగినంత లేకపోవడం ధరలను పెంచుతున్నట్టు చెప్పారు. -
ఊపు మీదున్న రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ షాపింగ్ మాల్స్, ఖరీదైన వీధుల్లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ గతేడాది 47 లక్షల చదరపు అడుగులు నమోదైంది. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో 2021తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన నివేదికలో వెల్లడించింది. ‘భారత రిటైల్ రంగం రికవరీ బాటలో ఉంది. ఈ ఏడాదీ ఊపు కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ విదేశీ బ్రాండ్లు ప్రథమ శ్రేణి నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించడమే ఇందుకు కారణం. 2022లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ బెంగళూరులో 16.8 లక్షల నుంచి 19.2 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ ఎన్సీఆర్ 3.6 లక్షల నుంచి 9.6 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో 6.4 లక్షల నుంచి 3.1 లక్షల చదరపు అడుగులకు, ముంబైలో 6.6 లక్షల నుంచి 3.9 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. 2023లో భారత్‌లో కొత్తగా 16 మాల్స్ రాబోతున్నాయి. వచ్చే ఏడాదీ ఇదే స్థాయిలో మాల్స్ ఏర్పాటు కానున్నాయి’ అని వివరించింది. -
స్థలాలకు అద్దె వల.. రూ.3 లక్షలు పెడితే 6 లక్షలు.. 'రియల్' దగా..
‘‘మా ఫామ్‌ల్యాండ్‌లో రూ. 3 లక్షలుపెట్టి రెండు గుంటలు (242 గజాలు) కొంటే ప్రతి నెలా రూ. 15 వేల అద్దె చొప్పున 20 నెలల తర్వాత రూ. 3 లక్షల అసలు సహా మొత్తం రూ. 6 లక్షలు చెల్లిస్తాం. 4 గుంటల స్థలానికి రూ. 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ. 12 లక్షలు ఇస్తాం. 8 గుంటలకు రూ. 12 లక్షలు కడితే నెలకు రూ. 24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తాం’’ హైదరాబాద్‌కు 140 కి.మీ. దూరంలోని నారాయణ్‌ఖేడ్‌లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్ పేరిట వినియోగదారులను ఆకర్షించేందుకు జోరుగా సాగిస్తున్న ప్రచారం ఇది. ప్రీలాంచ్ పేరిట గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో కొందరు బిల్డర్లు వేలాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసి సొమ్ము చేసుకుంటుంటే తాజాగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు. అసలుకు రెట్టింపు ఆశ చూపి... చట్ట నిబంధనల ప్రకారం ఫామ్‌ల్యాండ్ వెంచర్లను రియల్ ఎస్టేట్ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్‌ల్యాండ్ వెంచర్లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిరీ్ణత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్ గడువు తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతోపాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు. ఈ పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా... సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 తదితర సంస్థలు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి. బై బ్యాక్ పేరుతో మోసపోయా... జనగాం జిల్లాలోని పెంబర్తిలో 11 ఎకరాలలో ఓ సంస్థ వేసిన వెంచర్లో బై బ్యాక్ స్కీమ్ కింద రూ. 20 లక్షలకు 183.33 గజాల స్థలం కొన్నా. 12 నెలల తర్వాత లాభం రూ. 10 లక్షలు, మొదట్లో నేను కట్టిన రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 30 లక్షలు తిరిగి చెల్లిస్తామని సంస్థ నాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఏడాది దాటినా సొమ్ము చెల్లించడం లేదు. – ఓ బాధితుడి ఆవేదన. స్కీమ్‌లలో తీసుకొని మోసపోవద్దు... ప్రీలాంచ్, బై బ్యాక్, రెంటల్ గ్యారంటీ అంటూ రకరకాల పేర్లతో సామాన్యులను కొందరు వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. టీఎస్–రెరా, నిర్మాణ అనుమతులు లేని ఏ ప్రాజెక్ట్‌లలోనూ ప్రజలు స్థలాలు కొనుగోలు చేయకూడదు. రెరా రిజి్రస్టేషన్ లేని మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు. –విద్యాధర్, సెక్రటరీ, టీఎస్–రెరా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి... రియల్టీ మార్కెట్‌ను స్కీమ్‌ల పేరుతో కొందరు బిల్డర్లు చెడగొడుతున్నారు. స్థలం కొనుక్కోవాలనుకొనే సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. స్కీమ్‌ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ చదవండి: బీఆర్ఎస్.. బందిపోట్ల రాక్షసుల సమితి -
అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...!
గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా?‘ ఈ మధ్య డిపార్ట్మెంట్ వారు సేకరించిన సమాచారం ప్రకారం పైన అడిగిన ప్రశ్నకు ‘నో‘ అని సమాధానం వచ్చింది. వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది తమకు అదనంగా వచ్చే ఆదాయాన్ని తమ తమ రిటర్నులలో ‘డిక్లేర్‘ చేయడం లేదని తెలిసింది. తేలింది. అలాంటి వారెవరో తెలుసుకోవాలనుందా? ఇంటి మీద అద్దె ఎంతెంతయ్యా? ‘నేను ఎప్పుడూ అద్దెను బ్యాంకులో డిపాజిట్ చేయను. నాకు అక్షరాలా నగదు చేతిలో పడాల్సిందే. రశీదు ఇవ్వను. ఎప్పుడూ వ్యాపారస్తులు .. అటువంటి వారికే ఇస్తాను. ఉద్యోగస్తులకు ఇవ్వను‘ అని సగర్వంగా చెప్తాడు మూడు అంతస్తులున్న ముత్యాల రావు. ‘ఇల్లు, ఫ్లాట్లు నా పేరు మీదే ఉన్నాయి. కాని అద్దె ప్రతి నెలా మా ఆవిడ బ్యాంకు అకౌంటులో జమ చేస్తారు. పాన్ నంబరు మా ఆవిడదే. రశీదు ఇస్తాను. కానీ ఆదాయం మొత్తం రూ. 5 లక్షలు దాటదు‘ అని తానెంతో తెలివిగా ప్లానింగ్ చేసుకుంటున్నానని సంబరపడతాడు నాలుగు ఫ్లాట్లున్న నాగభూషణ రావు గారు. ‘మనం ఎప్పుడూ 50:50నే. సగం బ్యాంకులో జమ.. మిగతా సగం నగదు. నగదు ఇస్తే కానీ రశీదు ఇవ్వను. ఇంటికి రిపేర్లు, పన్నులు, సున్నాలు అన్నింటికీ మనమే చెల్లించాలి కదా. అదెలా రాబట్టాలి?‘ ఇలా ఎదురు ప్రశ్న వేసి బేతాళుడి ప్రశ్నలాగా ఫీల్ అవుతాడు పిచ్చేశ్వర్రావు గారు. ‘వాళ్లిచ్చే 30% రిపేరుకు ఏం సరిపోతుంది. కరోనా తర్వాత రూ. 3 లక్షలు ఖర్చు పెట్టా. అందుకని సగం అద్దె చూపిస్తా‘ .. ఇదీ చాణక్య రావుగారి స్టేట్మెంటు. పేయింగ్ గెస్ట్ హౌస్ ఓనరు పేరాశ రావుగారిది కూడా ఇదే వరస! ఆయన సరసనే చేరారు ఎందరో ఓనర్లు. ‘ఐకమత్యమే మహాబలం‘ అని జ్ఞాపకం చేసుకుంటూ. ‘మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. విల్లా వాడిదే. అక్కడ పన్ను ఎక్కువ. అందుకని రెంటు నా అకౌంటులో వేసుకుంటాను. వాడికి పాన్ లేదు. నేను ఇది ఆదాయంగా చూపించను‘ మితిమీరిన తెలివితేటలున్న మృత్యుంజయ రావు మనసులోని మాట ఇది. ‘నాకు రెండు అగ్రిమెంట్లు. ఒకటి అద్దెది .. సగం. మిగతా సగానికి ఫర్నిచర్, ఏసీ, వాషింగ్ మెషిన్, మంచాల నిమిత్తం అద్దె. ఈ అద్దె చూపించను‘ మందహాసంతో మధుసూదన రావుగారి ముక్తాయింపు. ఇలా అద్దె కింద వచ్చే ఆదాయాన్ని చూపించకుండా ఉండటానికి ఎన్నో అడ్డదార్లు .. ఎగవేతకు ఆలోచనలు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలే.. చట్టం ఒప్పుకోదు. పన్ను కట్టడానికి పంగనామాలు .. చట్టానికి తూట్లు .. ఎగవేతకు అగచాట్లు.. దొరికిన తర్వాత తప్పని పాట్లు. ఇకనైనా కట్టిపెట్టాలి ఈ ముచ్చట్లు. నగదు అయినా, బ్యాంకు ద్వారా అయినా మీరు ఓనర్ అయితే మీకు చేతికొచ్చే అద్దె ఏమాత్రం తగ్గించకుండా చూపించండి. ఫ్లాట్ల విషయంలో నెలసరిగా మెయింటెనెన్సును అద్దెకు కలపకుండా, డైరెక్టుగా వెల్ఫేర్ అసోసియేషన్‌కి ఇప్పించండి. కొంత ఉపశమనం ఉంటుంది. -
హైదరాబాద్‌లో అద్దెలు పెరిగాయ్, సగం జీతం.. ఇంటి అద్దెకే!
సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలు, కార్యాలయాల పునఃప్రారంభంతో అద్దె గృహాలకు గిరాకీ పెరిగింది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లగ్జరీ ఇళ్ల నెలవారీ అద్దెలలో తొలిసారిగా రెండంకెల వృద్ధి నమోదయింది. కరోనా కంటే ముందు ప్రీమియం ప్రాపర్టీల రెంట్లు 5–7 శాతం వృద్ధిని నమోదవుతుండగా.. గత రెండేళ్లలో ఏకంగా 18 శాతం పెరిగాయని అనరాక్ సర్వేలో తేలింది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్‌కు తగిన లగ్జరీ గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణం. అలాగే కరోనా తర్వాతి నుంచి అద్దెదారులు పెద్ద సైజు గృహాల అద్దెలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఫలితంగా అందుబాటుతో పోల్చితే లగ్జరీ ప్రాపర్టీల రెంట్లు పెరిగాయని సర్వే వెల్లడించింది. ♦అత్యధికంగా ముంబైలోని వర్లీలో 18 శాతం మేర అద్దెలు పెరిగాయి. ఇక్కడ 2020లో 2 వేల చ.అ ఇంటి అద్దె రూ.2 లక్షలుగా ఉండగా.. 2022 నాటికి రూ.2.35 లక్షలకు పెరిగింది. టార్డియోలో రెండేళ్ల క్రితం రూ.2.70 లక్షలుగా ఉన్న అద్దె.. ఇప్పుడు 15 శాతం పెరిగి రూ.3.10 లక్షలకు చేరింది. ♦బెంగళూరులోని జేపీ నగర్లో 13 శాతం వృద్ధితో రూ.46 వేల నుంచి రూ.52 వేలకు, రాజాజీనగర్‌లో 16 శాతం వృద్ధితో రూ.56 వేల నుంచి రూ.65 వేలకు అద్దెలు పెరిగాయి. రాజాజీనగర్ అత్యధిక మూలధన విలువను సాధించిన ప్రాంతంగా నిలిచింది. చ.అ. ధర రూ.5,698 నుంచి 9 శాతం వృద్ధి రేటుతో రూ.6,200లకు పెరిగింది. ♦చెన్నైలోని కొత్తూరుపురంలో 14 శాతం ♦వృద్ధితో రూ.74 వేల నుంచి రూ.84 వేలకు, కోల్‌కత్తాలోని బల్లీగంజ్‌లో 10 శాతం పెరుగుదలతో రూ.88 వేల నుంచి రూ.97 వేలకు, ఎన్సీఆర్లోని గోల్ఫ్‌కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్లో 12 శాతం వృద్ధితో రూ.50 వేల నుంచి రూ.56 వేలకు, పుణేలోని కోరాగావ్ పార్క్‌లో 14 శాతం వృద్ధితో రూ.59,500ల నుంచి రూ.68 వేలకు నెలవారీ అద్దెలు పెరిగాయి. జూబ్లీహిల్స్‌లో 62 వేలు.. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో 2 వేల చ.అ. ఇంటి అద్దె రూ.54 వేలుగా ఉండగా.. 2022 నాటికి 15 శాతం మేర పెరిగి రూ.62 వేలకు చేరింది. అలాగే హైటెక్‌సిటీలో 2020లో రూ.53 వేలుగా ఉన్న రెంట్.. ప్రస్తుతం 11 శాతం వృద్ధితో రూ.59 వేలకు పెరిగింది. అలాగే జూబ్లీహిల్స్‌లో 2020లో చ.అ. సగటు ధర రూ.6,950గా ఉండగా.. 2022 నాటికి 6 శాతం వృద్ధి రేటుతో రూ.7,400లకు పెరిగింది. హైటెక్‌సిటీలో రెండేళ్ల క్రితం చ.అ.కు రూ.5,675గా ఉండగా.. ప్రస్తుతం 7 శాతం పెరుగుదలతో రూ.6,100లకు చేరింది. చదవండి👉 లబోదిబో.. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న అమ్ముడు పోని ఇళ్లు -
వాహనాల ‘రెంటల్’ బిజినెస్‌లోకి యమహా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న యమహా మోటార్ కో ఆటోమొబైల్ అసెట్ మేనేజ్మెంట్, సర్వీసెస్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో ఉన్న కంపెనీలకు వాహనాలను సరఫరా చేస్తుంది. ఇందుకోసం కొత్త, పాత వాహనాలను కొనుగోలు చేయనుంది. సర్వీస్, విడిభాగాల కేంద్రాలు సైతం ఏర్పాటవుతాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆసరాగా డెలివరీ సేవలు అందిస్తున్న కంపెనీలతో ప్రధానంగా చేతులు కలుపనున్నట్టు యమహా ప్రకటించింది. షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో వాడకం పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యమని వివరించింది. -
ఆర్బీఐ ‘లాకర్’ షాక్!
ముంబై: బ్యాంకు లాకర్ సేవలను వినియోగించుకుంటున్నారా? అయితే ఆర్బీఐ సవరిత నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. చోరీ, అగ్నిప్రమాదం, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం.. ఇలాంటి కారణాలతో లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే, వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు ఏటా రూ.500 చొప్పున లాకర్ చార్జీలు చెల్లిస్తారనుకోండి.. లాకర్లో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే గరిష్ట పరిహారం రూ.50,000కు మించి రాదు. ఈ విషయంలో బ్యాంకుల బాధ్యతను ఆర్బీఐ పరిమితం చేసింది. అంతేకాదు.. లాకర్లలో చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని ఉంచకూడదు. అలాగే, ‘‘ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, పిడుగులు పడడం కారణంగా లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆ బాధ్యత బ్యాంకులపై ఉండదు’’ అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకులు ఈ మేరకు లాకర్ ఒప్పందంలో సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీ ఆర్టికల్ సేవలను సమీక్షించిన అనంతరం.. వివిధ వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుత, నూతన కస్టమర్లకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. శాఖలవారీగా ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయనే జాబితాను నిర్వహించడమే కాకుండా.. లాకర్లు ఖాళీగా లేకపోతే ప్రతీ దరఖాస్తును విధిగా స్వీకరించి వేచి ఉండే జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించింది. తగిన జాగ్రత్తలు: లాకర్లు/సేఫ్ డిపాజిట్ వాల్ట్‌ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తుల నుంచి భవనాలకు రక్షణ కల్పించుకోవాలని ఆర్బీఐ సూచించింది. ‘‘లాకర్లో ఉంచిన వాటి విషయంలో తమకు ఎటువంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదు. అగ్నిప్రమాదం, చోరీ, దోపిడీ, మోసం ఘటనల వల్ల కస్టమర్‌కు నష్టం వాటిల్లితే క్రితం సంవత్సరం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఇకమీదట లాకర్ ప్రారంభంలోనే మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్‌ను బ్యాంకులు తీసుకోవచ్చు. అయితే సరైన చెల్లింపు చరిత్ర ఉన్న ప్రస్తుత ఖాతాదారుల నుంచి డిపాజిట్ కోసం ఒత్తిడి చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వరుసగా మూడేళ్ల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. లాకర్లను తెరిచే అధికారం బ్యాంకులకు కల్పించింది. ఎస్బీఐ ఒక లాకర్‌కు రూ.2,000–8,000 వరకు వార్షిక అద్దెను వసూలు చేస్తుండడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ఫలితం ఆరు నెలల్లో లాకర్లకు సంబంధించి నిబంధనలను తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విచారణ సందర్భంగా ఆర్బీఐని కోరింది. టెక్నాలజీల సాయంతో చొరబాటుదారులు కస్టమర్ల ప్రమేయం లేకుండా లాకర్లను యాక్సెస్ చేసుకోగలరని.. ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లు బ్యాంకుల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకులు బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది. -
సూపర్ కార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: విలాసవంతమైన లగ్జరీ కార్ల ప్రేమికులకు శుభవార్త . ఇప్పుడు తమ అభిమాన లగ్జరీ కారును అద్దెకు తీసుఉని ఎంచక్కా నగరంలో చక్కర్లు కొట్టొచ్చు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఈ బంపర్ ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. సూపర్ కార్ ప్రియులకు ఈ ప్రత్యేకమైన సేవను అందించే మొదటి విమానాశ్రయంగా హైదరాబాద్‌లోని విమానాశ్రయం అవతరించింది. దీంతో లంబోర్ఘిని గల్లార్డో, జాగ్వార్ ఎఫ్ టైప్, పోర్స్చే 911 కారెరా, ఫోర్డ్ ముస్టాంగ్, లెక్సస్ ఇఎస్ 300 హెచ్, ఆడి ఎ 3 క్యాబ్రియోలెట్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఇ 250, మసెరటి గిబ్లి, బిఎమ్‌డబ్ల్యూ 3 జిటి , వోల్వో ఎస్ 60 వంటి కార్లను ఎంచుకోవచ్చు. దీంతోపాటు టయోటా ఫార్చ్యూనర్ లేదా మారుతి సుజుకి సియాజ్‌ను కూడా లభ్యం. విమానాశ్రయంనుంచి నగరంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే ఇప్పటికే వరకు క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఇపుడు హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణీకులందరూ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత స్థానిక నగర ప్రయాణానికి అద్దె ప్రాతిపదికన లగ్జరీ కారును బుక్ చేసుకోవచ్చు. ఒక డ్రైవర్‌తో లేదా లేకుండా కూడా ఈ ఆఫర్ లభ్యం. అంటే సూపర్ కార్ల డ్రైవింగ్ అనుభవాన్ని కూడా పొందవచ్చన్నమాట. కార్టోక్ ఇచ్చిన నివేదిక ప్రకారం, మీ ఫ్లైట్ హైదరాబాద్‌లోకి రాకముందే మీరు మీకు నచ్చిన కారును ఆన్లైన్లో లేదా ఫోన్ కాల్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి అన్ని కార్లు పూర్తిగా శానిటైజ్ చేస్తున్నట్టు పేర్కొంది. కారు లేదా బైక్ అద్దె మోడల్ దేశవ్యాప్తంగా ట్రెండిగ్‌లో ఉంది. మనాలి లేదా గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో రోజుకు కేవలం రూ .1000 చొప్పున బైక్‌లు / స్కూటర్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు అలాగే డ్రైవర్ లేకుండా సుమారు 5000 రూపాయలు చెల్లించి కారును అద్దెకు తీసుకోనే అవకాశం పలు పర్యాటక నగరాల్లో లభిస్తోంది. మరి హైదరాబాద్‌లో ఎంత చార్జ్ చేయబోతున్నారనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
అద్దెకు తీసుకున్న కెమెరాతో పరార్
అమీర్‌పేట: ఓఎల్ఎక్స్ ద్వారా కెమెరాను అద్దెకు తీసుకున్న వ్యక్తులు కనిపించకుండా పోయారు. దీంతో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప జిల్లా ఎర్రగొండ్లకు చెందిన విక్రమ్‌కుమార్‌రెడ్డి అమీర్‌పేట శవభాగ్‌లోని చిలుకూరి బాలాజీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. షార్డ్ ఫిలీం తీసేందుకు గత ఏడాది రూ.60 వేలు వెచ్చించి కెనాన్ కెమెరా కొనుగోలు చేశాడు. కాగా ఓఎల్ఎక్స్లో పెట్టి కెమెరాను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ నెల 16న లింగరాజు, కిషోర్ అనే వ్యక్తులు వచ్చి రెండు రోజుల పాటు కెమెరా అద్దెకు కావాలని తీసుకుని వెళ్లారు. వారం రోజులు అవుతున్నా కెమెరా తీసుకురాలేదు. వారికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో విక్రమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఓ తండ్రి కన్న కూతురునే.. -
గందరగోళంలో సెజ్ యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ పరిణామాలతో అద్దెలపరంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాటులో స్పష్టత కొరవడటంతో ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వివరాల్లోకి వెడితే.. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్న నేపథ్యంలో తమకు తోడ్పాటు ఇవ్వాలంటూ సెజ్ ఎగుమతిదారులు కేంద్రాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ కొన్ని ఊరట చర్యలు ప్రకటించింది. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెజ్ యూనిట్ల లీజు అద్దె పెరగదు. అలాగే, తొలి త్రైమాసికం లీజు అద్దెను జూలై 31 వరకూ వాయిదా వేస్తూ గత నెల 28న నోటిఫికేషన్ జారీ చేసింది. వాయిదాపడిన చెల్లింపులపై వడ్డీ భారం ఉండబోదని పేర్కొంది. తమ తమ జోన్లలో ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందంటూ ప్రభుత్వ, ప్రైవేట్ సెజ్ డెవలపర్లకు సూచించింది. ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్ని తొలి త్రైమాసికంగా పరిగణిస్తారు. తొలి త్రైమాసికం అద్దెను వాయిదా వేశారు సరే!!. ఈ వాయిదా జులై 31 వరకూ ఉంటుందని పేర్కొనటంతో ఈ వాయిదా వేసిన అద్దెను జూలై 31లోగా చెల్లించేయాలా? లేక జూలై 31 వరకూ అద్దెను వాయిదా వేసి ఆ తరవాత చెల్లించవచ్చా? అనే సందిగ్ధంలో సెజ్ యూనిట్లున్నాయి. దీనిపై స్పష్టత రాకముందే తమ అద్దెలు చెల్లించాల్సిందేనంటూ డెవలపర్లు ఒత్తిడి తెస్తున్నట్లు పలు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని, అద్దె వాయిదాలపై స్పష్టతనివ్వాలని, డెవలపర్లకూ తగు ఆదేశాలివ్వా లని కోరాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ క లిసి 356 నోటిఫైడ్ సెజ్‌లుండగా అందులో విశాఖ, చెన్నై, కాండ్లా సహా 8 ప్రభుత్వ సెజ్‌లున్నాయి. -
టెక్నాలజీని అద్దెకిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు, కార్ల లాగే టెక్నాలజీనీ అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఆన్‌గో ఫ్రేమ్ వర్క్‌లో! మన దేశంతో పాటూ దుబాయ్, మధ్య ప్రాచ్య వంటి దేశాల్లోని కంపెనీలూ కస్టమర్లుగా ఉన్నాయి. జస్ట్, 30 నిమిషాల్లోనే డిజిటల్ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే వీలుండటమే ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ ప్రత్యేకత! అందుబాటు ధరల్లో ఎంటర్ప్రైజ్లకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) కంపెనీలకు టెక్నాలజీలను అద్దెకిస్తున్న ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ రామకృష్ణ కుప్పా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది హైదరాబాద్. ఆచార్య నాగార్జున వర్సిటీలో ఎంఎస్ పూర్తయ్యాక.. బెంగళూరులో ఒకట్రెండు స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తర్వాత అక్కడి నుంచి మైండ్‌ట్రీ టెక్నాలజీ డెవలప్మెంట్ బృందంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరా. తర్వాత మోటరోలాలో సీనియర్ ఇంజనీర్‌గా చేరా. 2009లో ఎస్ఎంఈలకు మొబిలిటీ సొల్యూషన్స్ అందించే క్రియేటివ్ ఎక్స్పర్ట్స్ కన్సల్టింగ్ అనే ఐటీ కంపెనీని ప్రారంభించాం. ఈ సమయంలో తెలిసిన విషయమేంటంటే.. టెక్నాలజీ అభివృద్ధి కోసం అయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నందువల్లే పె ద్ద కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లటం లేదని! అభివృద్ధి వ్యయాన్ని తగ్గించాలంటే ముందుగా సమయాన్ని, నిర్వహణ ఖర్చును తగ్గిస్తే సరిపోతుందని తెలిసి.. రకరకాల టెక్నాలజీలను అద్దెకు ఇస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాం. అలా 2015లో నా భార్య అను అఖిలతో కలిసి రూ.1.2 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ కంపెనీని ప్రారంభించాం. ఏపీ, తెలంగాణ నుంచి 400 కంపెనీలు.. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, కాగ్నెటివ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఈఆర్పీ, వాలెట్ ప్రోగ్రామింగ్ వంటి అన్ని రకాల టెక్నాలజీలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్ధిక, వ్యవసాయ, రియల్ ఎస్టేట్, బీమా, వైద్యం, ఫుడ్ టెక్ రంగాల్లో ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఈ రెండు విభాగాల్లో కలిపి 900 కంపెనీలు మా టెక్నాలజీని అద్దెకు తీసుకున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 400 కంపెనీలుంటాయి. దుబాయ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సుమారు 20 కంపెనీలు కూడా ఉన్నాయి. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ, నిర్మాణ కంపెనీలు వీటిల్లో కొన్ని. ఇక, లోకల్ కంపెనీల్లో ఈ–సహాయ్, పేవైస్, లోహిత, బెల్ రైస్ వంటివి ఉన్నాయి. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్.. ప్రస్తుతం నెలకు 10 ఎంటర్ప్రైజ్లకు, 300 ఎస్ఎంఈలకు ఫ్రేమ్ వర్క్ ఫీచర్స్, ప్రొడక్ట్ ఫీచర్స్, మొబైల్ యాప్, వెబ్ యాప్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్సాఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ సేవలందిస్తున్నాం. టెక్నాలజీని బట్టి నెల అద్దె రూ.2 వేల నుంచి రూ.7 లక్షల వరకున్నాయి. గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి మరో రూ.7 కోట్లకు చేరుకుంటాం. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 10 వేల ఎస్ఎంఈ కస్టమర్లను చేరుకోవాలన్నది టార్గెట్. త్వరలోనే అమెరికాలోని పలు టెలికం కంపెనీలతో టెక్నాలజీ సేవల ఒప్పందం చేసుకోనున్నాం. త్వరలోనే రూ.35 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 94 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 160కి చేర్చనున్నాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.10 కోట్ల నిధులను సమీకరించాం. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూస్ డైరెక్టర్ పారస్ పరేఖ్, విర్టుసా ఐటీ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిషీ చౌహాన్ వంటి ఐదారుగురు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరో రూ.35 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ముంబైకి చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో చ ర్చలు జరుగుతున్నాయి. ‘‘ మా టెక్నాలజీ మీద శిక్షణ, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాలపై అ వగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌కు చెం దిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ హాకీస్టిక్ మీడి యా అనే స్టార్టప్‌ను కొనుగోలు చేశాం. ఎస్ఎంఈ కంపెనీలతో పనిచేసే మరో స్టార్టప్‌ను కొనుగోలు కు ఆసక్తిగా ఉన్నామని’’ రామకృష్ణ వివరించారు. -
ఇంటిని అద్దెకిస్తే రూ. కోటి బీమా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఇంటికి బీమా తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, అద్దెకిచ్చే ఇంటికీ ఉచిత బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది నెస్ట్అవే. ఆన్లైన్ కేంద్రంగా ఇంటి అద్దెల విభాగంలో ఉన్న నెస్ట్అవే ఇంటి యజమానులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం నెస్ట్అవేలో 11 వేల ఇళ్లు నమోదుకాగా.. ఇందులో 25 వేల మంది అద్దెకుంటున్నారని, వీటిల్లో హైదరాబాద్‌లో 1,200 ఇళ్లు, 3,300 మంది అద్దెకుంటున్నారని శుక్రవారమిక్కడ జరిగిన సమావేశంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిశోర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, పుణె, హైదరాబాద్, ఘజియాబాద్, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని.. ఏడాదిలో విజయవాడతో పాటూ చెన్నై నగరాల్లో సేవలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐడీజీ, టైగర్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల నుంచి 43.2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. -
అద్దెకు కారు డ్రైవర్లు
⇒ హైదరాబాద్‌లో డ్రైవర్జ్ సేవలు ప్రారంభం ⇒ అద్దె గంటకు రూ.90 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, బైకులు అద్దెకు తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, దేశంలోనే తొలిసారిగా డ్రైవర్లను కూడా అద్దెకు తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘నెక్ట్స్ డ్రైవ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సర్వీసెస్’ సంస్థ బుధవారమిక్కడ డ్రైవర్జ్ యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గంటలు, రోజులు, నెలవారీ ప్యాకేజీలుగా డ్రైవర్లను అద్దెకివ్వటం ఈ యాప్ ప్రత్యేకత అని సంస్థ సీఈఓ హితచంద్ర కనపర్తి తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ‘గంటల లెక్కన తీసుకుంటే డ్రైవర్ అద్దె గంటకు రూ.90 ఉంటుంది. మీ కార్లో మిమ్మల్ని కావాల్సిన చోట వదిలిపెట్టడమే కాదు. అక్కడ మీ కారును, మిమ్మల్ని వదిలిపెట్టాక డ్రైవర్ బాధ్యత మీకుండదు. కస్టమర్ చెల్లించాల్సింది కూడా అప్పటివరకే. 6 నెలల క్రితం బీటా వర్షన్‌ను ప్రారంభించాం. ఇప్పటివరకు 60 మంది డ్రైవర్లు నమోదయ్యారు. 500 మంది కస్టమర్లు వినియోగించుకున్నారు. ఇపుడు పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తున్నాం’’ అని వివరించారు. 2 నెలల్లో 350–400 డ్రైవర్ల నమోదును లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారాయన. వచ్చే ఏడాది విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు విస్తరిస్తామని తెలియజేశారు. -
బంగారు బాతు..రెండో ఇల్లు
♦ అద్దెకివ్వటంతో అదనపు ఆదాయం ♦ అమ్మకం కోసమైనా ఖాళీగా ఉంచొద్దు ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, సొంతిల్లు... ఈ మధ్యలో కారు!! ఇదీ... ఈ తరం యువత ఆలోచన. ఆదాయాలు పెరుగుతుండటంతో చాలామందికి ఇవన్నీ 30-40 ఏళ్లలోపే సాకారమైపోతున్నాయి. దాంతో చాలా మంది రెండో ఇంటిని కూడా కొనుక్కోగలుగుతున్నారు. మరి ఈ రెండో ఇంటి ద్వారా ♦ అధికాదాయం పొందటమెలా? అందుకూ మార్గాలున్నాయి. రియల్ ఎస్టేట్‌పై డబ్బులు సంపాదించటానికి చాలామంది రకరకాల మార్గాలు ఎంచుకుంటుంటారు. డబ్బులు తగినంతగా ఉంటే ఫ్లాటో, ప్లాటో(స్థలం) కొనేసి, మంచి రేటు వస్తే అమ్మేసి లాభపడాలనుకునే వారు కొందరు. ముందు ఒక ఇంటిని కొనుక్కున్నాక... అదనంగా ఉన్న డబ్బులతో రెండో ఇంటిని కొని, దానిని అద్దెకివ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని భావించే వాళ్లు మరికొందరు. తక్కువలో ఏదైనా ఇల్లు అమ్మకానికొస్తే, దానిని ఠక్కున కొనేసి, మరికొంత లాభానికి అమ్మడం ద్వారా లాభాలు కళ్లజూడాలని ఆలోచించే వాళ్లు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు ఎప్పుడు మంచిరేటు వస్తే, అప్పుడు అమ్మేద్దామనే భావనతో ఇంటిని ఖాళీగా ఉంచుతారు. ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే లాభాలను వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత మందగించిన విషయం తెలిసిందే. ఈ మందగమన కాలంలో ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయం ఇన్వెస్టర్‌కు ఒకింత ఊరటనిస్తుందనేది కాదనలేని వాస్తవం. ♦ఉదాహరణకు మీ దగ్గర కోటి రూపాయల విలువ చేసే ఇల్లు ఉందనుకుందాం. దీనిని నెలకు రూ.50,000 చొప్పున అద్దెకిచ్చారనుకుందాం. అంటే ఏడాదికి మీకు రూ.6 లక్షల ఆదాయం వస్తుంది. అంటే మీ ఇంటి అద్దె ఆదాయం(వార్షిక) మీ మూలధన విలువలో 6 శాతం అన్నమాట. సాధారణంగా మన దేశంలో సగటు ఇంటద్దె ఆదాయం రేటు 2-4 శాతం రేంజ్లో ఉంటుంది. అంటే మూల విలువలో 2-4 శాతమన్న మాట. రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణుల ప్రకారమైతే, మీ ఇల్లు మూలధన విలువలో 2 నుంచి 3 శాతం వరకూ వార్షికంగా ఇంటద్దె రూపంలో లభిస్తుంది. మీరు అందించే సౌకర్యాలు, మీ ఇల్లు ఉండే ఏరియాను బట్టి అద్దె విలువ మారుతుంటుంది. ఢిల్లీ, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇంటి అద్దె ఆదాయం రేటు 6-7 శాతంగా ఉంటోంది. ♦ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీ ఇంటి ద్వారా మంచి అద్దెనూ పొందే అవకాశాలున్నాయి. ఇంటికి సరైన అద్దెను నిర్ణయించడం... మీ ఇంటిమీద మీకు నెలవారీ వచ్చే అద్దెను సరిగా నిర్ణయించడమనేది ప్రధానమైన విషయం. మీ ఇల్లు ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న పరిస్థితులు, మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి అద్దె వస్తుంది. మీ ఇల్లు హౌసింగ్ సొసైటీలో ఉందనుకుందాం. అక్కడ ఉండే ఇళ్లన్నిటికీ ఒకే రకమైన అద్దె లభిస్తుంది. కొంచెం ఎక్కువ అద్దె రావాలంటే, ఇంటీరియర్స్‌ను మార్చడమో, లేక ఫర్నిచర్‌తో సహా అద్దెకు ఇవ్వడమో చేయాలి. ఒకవేళ మీకు ఇండిపెండెంట్ ఇల్లు ఉందనుకుందాం. ఈ తరహా ఇళ్లకైతే సరైన అద్దె నిర్ణయించడం కొంచెం కష్టమైన పని. అయితే ఆ ఏరియాలో ఉండే ఇండిపెండెంట్ ఇళ్లను ఆయా ఇళ్ల యజమానులు ఎంతెంత ధరలకు అద్దెకిచ్చారో వాకబు చేయవచ్చు. ఇక్కడ కూడా అదనపు సౌకర్యాలు కల్పించడం ద్వారా అదనపు అద్దె పొందవచ్చు. కొత్త తరం మార్కెటింగ్.. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నవారే. ఇంటర్నెట్ పుణ్యమాని మీ ఇంటిని మార్కెటింగ్ చేయడం ఇప్పుడు చాలా సులభం. మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్, కామన్‌ఫ్లోర్, హౌసింగ్‌డాట్‌కామ్, మకాన్‌డాట్‌కామ్ తదితర వెబ్సైట్లలో మీరు అద్దెకివ్వాలనుకున్న ఇంటిని గురించి ఉచితంగా అడ్వర్టయిజ్ చేయవచ్చు. ఇక ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్ల ద్వారా మీ రెండో ఇంటిని సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా, హాలిడే హోమ్‌గా అద్దెకు ఇవ్వడం ద్వారా ఒక్క రోజుకు రూ.3,000-రూ.5,000 వరకూ ఆదాయం పొందవచ్చు. అయితే ఇది అన్ని ఇళ్లకూ సాధ్యం కాకపోవచ్చు. దీనికి ఇల్లుండే ప్రాంతమనేది ప్రధానం. త్రీ-స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించడం, మరిన్ని సౌకర్యాలు అందుబాటులో తేవడం ద్వారా మరికొంత అదనంగా అద్దె ఆదాయం పొందే అవకాశమూ ఉంది. మీరు కనుక ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వంటమనిషి/కేర్ టేకర్, డ్రైవర్‌తో కూడిన కారు, స్విమ్మింగ్ ఫూల్, క్లబ్ ఏరియా, జిమ్ తదితర సౌకర్యాలను కూడా అందిస్తే రోజుకు రూ.7,000-10,000 వరకూ కూడా అద్దె పొందవచ్చు. ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్లు 3 శాతం వరకూ సర్వీస్ ఫీజును వసూలు చేస్తాయి. అయితే మీ ఇంటిని సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా అద్దెకు ఇవ్వాలంటే పలు రకాల అనుమతులు, ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. మీరు అద్దెకు ఇవ్వాలనుకుంటున్న ఇల్లు ఏ ప్రాంతంలో ఉందో, ఆ ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ సొసైటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. సంబంధిత మునిసిపాలిటీ అధికారుల నుంచి అనుమతులు పాందాలి. పోలీసుల వెరిఫికేషన్ కూడా తప్పనిసరి. సరైన కిరాయిదారు... మీ ఇంటిని సరైన వ్యక్తికి అద్దెకివ్వటమనేది చాలా తెలివైన పని. అద్దెకు దిగే వ్యక్తి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు? జీతం ఎంత ? తదితర వివరాలను తెలుసుకోవాలి. వీలైతే ఆ వ్యక్తి పనిచేసే కంపెనీ నుంచి రికమండేషన్ లెటర్ తీసుకుంటే మరీ మంచిది. ఇక ఆహారపు అలవాట్లు గురించి మీకు ఏమైనా అభ్యంతరాలు, ఏమైనా షరతులు ఉంటే ముందుగానే వెల్లడించడం ఉత్తమం. ఆ తర్వాత గొడవ పడేకంటే ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటే, మీకు, మీరు అద్దెకు ఇచ్చే వ్యక్తికి మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి. అన్ని వివరాలు నచ్చితే, పూర్తి వివరాలతో కూడిన అగ్రిమెంట్‌ను రాసుకోవాలి. ఒక రకంగా మీ రెండో ఇల్లు మీకు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటింది. అయితే మీకు వచ్చే ఆదాయంలో కనీసం పదో వంతు సొమ్ములతో మీ ఇంటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేయించడం కానీ, అదనపు సౌకర్యాలు కల్పించడం కానీ చేస్తే మీకు వచ్చే అద్దె విలువ మరింతగా పెరుగుతుంది. పన్ను వివరాలు... మీరు మీ ఇంటిని ఎలా అద్దెకు ఇచ్చారనే విషయాన్ని బట్టి పన్ను వివరాలుంటాయి. ఉదాహరణకు మీరు మీ ఇంటిని ఎవరికైనా నివసించడానికి అద్దెకు ఇచ్చారనుకోండి. ఈ అద్దెను ఇంటి ఆద్దె ద్వారా ఆదాయంగా పరిగణిస్తారు. ఒకవేళ సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా మీరు మీ ఇంటిని అద్దెకిస్తే, దానిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అద్దె ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతారు. మీరు అద్దె ద్వారా పొందే ఆదాయం రూ. 1లక్ష మించినట్లయితే ఈ అద్దె ఆదాయాన్ని తప్పనిసరిగా వెల్లడించాలి. -
అద్దె అడిగితే చంపేస్తా...
మెహిదీపట్నం: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి యజమానిని చంపేస్తానని బెదిరించాడో వ్యక్తి. బాధితుడి ఫిర్యాదు మేరకు హుమాయూన్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇన్ స్పెక్టర్ సూరపల్లి రవీందర్ కథనం ప్రకారం...శాలిబండకు చెందిన మహ్మద్ తాఫీ అస్గర్ విజయనగర్‌కాలనీ ఆంధ్రాబ్యాంకు పక్కనే ఉన్న తన అపార్ట్మెంట్లోని ఓ గదిని మహ్మద్ అలీ ఇస్లామికి ఏడాది క్రితం అద్దెకిచ్చాడు. నాలుగు నెలలుగా ఇస్లామి అద్దె చెల్లించకపోగా రూ.10 లక్షలు ఇస్తేనే గది ఖాళీ చేస్తా, లేకపోతే చంపేస్తానని ఇంటి యజమానిని బెదిరించాడు. భయాందోళనకు గురైన అస్గర్ హుమాయూన్ నగర్ పోలీసులకు ఇస్లామిపై ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు ఇస్లామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కారు అద్దె రూ.2.3 లక్షలు!
* మంత్రి ఓఎస్డీ కారుకు అద్దె చెల్లించేందుకు కార్పొరేషన్ తీర్మానం * ప్రతి నెలా బిల్లు చెల్లించేందుకు నిర్ణయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి. నారాయణ ఓఎస్డీ వాడుతున్న కారుకు అద్దె చెల్లించడానికి కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఐదు నెలలుగా బకాయి ఉన్న రూ.2,30,800 చెల్లించేందుకు మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సోమవారంజరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. వివరాల్లోకెళితే మంత్రి నారాయణ ఓఎస్డీకి ప్రొటోకాల్ విభాగం ఒక వాహనం ఏర్పాటు చేసింది. కారు అద్దెను ప్రొటోకాల్ నిధుల నుంచి జిల్లా కలెక్టర్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి ప్రొటోకాల్ కింద వాహనం ఏర్పాటు చేసినందువల్ల కారుకు సంబంధించిన అద్దె మీరే చెల్లించాలని జిల్లా కలెక్టర్ మార్చి 28వ తేదీ కార్పొరేషన్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ కారు ప్రొటోకాల్ విభాగం ఏర్పాటు చేయాల్సి ఉన్నందువల్ల అద్దె కూడా ఆ విభాగమే చెల్లించాలని అధికారులు మూడు నెలలుగా నిధులు చెల్లించలేదు. అటు అధికారులు, ఇటు పాలక వర్గం మీద ఒత్తిడి తీవ్రం కావడంతో సోమవారం నాటి స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. నవంబరు 2015 నుంచి మార్చి 2016వరకు మంత్రి ఓఎస్డీ ఉపయోగించిన ఏపీ 26 ఎఎం 3389 కారు అద్దె కింద రూ.2,30,800 చెల్లించాలని స్టాండింగ్ కమిటీ అధికారులను ఆదేశించింది. ఇకపై ప్రతి నెలా ఈ కారు అద్దె కార్పొరేషన్ భరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వివాదం నుంచి బయటపడటానికి కార్పొరేషన్ అధికారులు తాము మంత్రి ఓఎస్డీ కారుకు చెల్లిస్తున్న అద్దెను ప్రతి నెతా తమకు వెనక్కు ఇవ్వాలని ప్రొటోకాల్ విభాగానికి లేఖ రాయాలని నిర్ణయించారు. మంత్రి ఓఎస్డీ కారుకు చెల్లించిన అద్దె గోడకు కొట్టిన సున్నం మళ్లీ వెనక్కు వస్తాయా? అని కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌కు 18 సెంట్ల స్థలం రిత్విక్ లేఅవుట్లో కార్పొరేషన్ 18 సెంట్ల స్థలాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్‌కు అప్పగించేందుకు స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కంటి, దంత వైద్యశాలను నిర్మించి సదరు భవనాన్ని తిరిగి కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు. కాగా పైపుల్లేని శివారు ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో పైప్లైన్లను వేయిస్తామని మేయర్ పేర్కొన్నారు. -
వ్యవ‘సాయం’లో మహీంద్రా ట్రింగో
♦ అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు ♦ సొంత యంత్రాలుంటే... వారే ఫ్రాంచైజీలు ♦ దశలవారీగా దేశవ్యాప్త విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్రాక్టర్లు కొనలేని వారికి వాటిని అద్దెకివ్వటం కూడా చేయాలని వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది. ఇందుకోసం ‘ట్రింగో’ పేరిట ఓ యాప్ ద్వారా పలు సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. సాగుకు కావాల్సిన ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను అద్దెకివ్వడమే ఈ కొత్త సేవల లక్ష్యం. ఖరీదైనవి కావడంతో లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, యంత్ర పరికరాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. వ్యవసాయం ఒకవంక పెరుగుతున్నా... ట్రాక్టర్ల పరిశ్రమ గతంలో ఏడాదికి 6.30 లక్షల యూనిట్లు విక్రయించి... ఇపుడు 5 లక్షల లోపే నమోదు చేస్తోందంటే... కారణమదే. దీంతో ఫ్రాంచైజీలను ప్రోత్సహించడం ద్వారా తక్కువ అద్దెకు అత్యాధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచాలని మహీంద్రా భావిస్తోంది. ట్రింగో యాప్ లేదా ఫోన్ ద్వారా రైతులు తమ అవసరం ఏంటో చెబితే చాలు... చెప్పిన సమయానికి పొలం ముందు ఇవి ప్రత్యక్షమవుతాయి. తొలుత ఈ సేవలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. అదనపు ఆదాయం..: రెండు మూడు నెలల అవసరానికి ట్రాక్టర్లు, యంత్రాలను కొనుగోలు చేయడం వృథా అన్న భావన చాలామందికి ఉంటుంది. మరోవైపు రైతులందరికీ వీటిని కొనుగోలు చేసే స్తోమత లేదని మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. ఇటువంటి వారికి ట్రింగో పెద్ద ఉపశమనమని చెప్పారాయన. కాగా, ట్రాక్టర్లు, వీడర్లు, రైస్ ట్రాన్స్‌ప్లాంటర్, ఫెర్టిలైజర్ స్ప్రెడర్, హార్వెస్టర్, బేలర్, ష్రెడ్డర్, ముల్చర్, కేన్ థంపర్ తదితర యంత్రాలు సొంతానికి కొన్నా వీటి వినియోగం కొన్ని రోజులకే పరిమితమవుతోంది. మిగిలిన రోజులు ఓ మూలన పడి ఉంటున్నాయి. ఇటువంటి యజమానులు ఫ్రాంచైజీలుగా మారి తమవద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వవచ్చు. కంపెనీతో చేతులు కలపడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. ట్రింగో అగ్రిగేటర్ పాత్ర పోషిస్తూ రైతులను, యజమానులతో అనుసంధానిస్తుంది. సేవలకుగాను ఫ్రాంచైజీల నుంచి కమిషన్ తీసుకుంటుంది. మహీంద్రాతోపాటు ఇతర బ్రాండ్ల ట్రాక్టర్లనూ అద్దెకు ఇవ్వవచ్చు. నియంత్రణలో చార్జీలు..: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కస్టమ్ హైరింగ్ స్కీంలో మహీంద్రా సైతం భాగస్వామిగా ఉంది. రైతులకు తక్కువ ధరకే అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతోనూ తాము చర్చిస్తున్నామని సాహా తెలిపారు. గుజరాత్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. ఔత్సాహికులకు వ్యాపార అవకాశమని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇక ట్రింగో సేవల్లో యంత్రాలు, నేల రకాలు, సమయాన్నిబట్టి అద్దె ఎంత ఉండాలో మహీంద్రా నిర్ణయిస్తుంది. మహీంద్రాతో తొలి అడుగు.. భారత్‌లో ట్రాక్టర్లు, యంత్రాల అద్దె వ్యాపారం పూర్తిగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది. ఏటా రూ.15,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. మహీంద్రా అడుగు పెట్టడం ద్వారా పరిశ్రమకు కొత్తరూపు రానుంది. మరో విశేషమేమంటే ట్రాక్టర్ల అమ్మకాల పరంగా భారత్‌లో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్న మహీంద్రా... వ్యవసాయ పనిముట్ల తయారీలోనూ తనదైన ముద్రవేసింది. 2015-16లో సుమారు 5 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయితే దీన్లో 41 శాతం వాటా మహీంద్రాకు ఉంది. 85-90 శాతం మంది వాయిదా పద్ధతిలో ట్రాక్టర్లను, యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. తమ కస్టమర్లలో ప్రస్తుతం 35-40 శాతం మందికి మహీంద్రా ఫైనాన్స్ రుణం సమకూరుస్తోందని కంపెనీ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.సాహా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. -
నిగ్గుతేల్చండి..
బీపీపీలో అక్రమాలపై హెచ్ఎండీఏ కమిషనర్ ఆగ్రహం అద్దె బకాయిల వ్యవహారంపై విచారణకు ఆదేశం సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరంలోని హెచ్ఎండీఏ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ అద్దె చెల్లించ ని వ్యాపారులకు సహకరించిన అధికారుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఆదేశించారు. హెచ్ఎండీఏ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని అడ్డుకొన్న అక్రమార్కులపై లోతైన విచారణ జరిపి బాధ్యులను నిగ్గుతేల్చాలని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) అధికారులను ఆదేశించారు. సాగర తీరంలో లీజ్ ప్రాతిపదిక స్థలాలు చేజిక్కించుకొని అద్దెలు చెల్లించకుండా పలువురు వ్యాపారులు దర్జాగా ధనార్జన చేస్తున్న వైనాన్ని... భారీ మొత్తంలో పేరుకుపోయిన అద్దె బకాయిలు, రాత్రికి రాత్రే దుకాణాలు ఖాళీ చేసి సామగ్రిని తరలిస్తోన్న వ్యాపారుల తీరును బట్టబయలు చేస్తూ ‘చక్కబెట్టేస్తున్నారు..!’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సోమవారం బీపీపీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి అద్దె బకాయీల్లో అక్రమాలపై ఆరా తీశారు. ‘ లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక నెల అద్దె మొత్తాన్ని డిపాజిట్‌గా కట్టించుకొని, 4 నెలల అద్దెకు బ్యాంకు గ్యారెంటీ తీసుకొంటున్నాం. సకాలంలో అద్దె చెల్లించనప్పుడు వెంటనే నోటీసులిచ్చి ఖాళీ చేయించాలి. అయితే... వ్యాపారులతో కుమ్మక్కై వారికి సహకరించడం వల్లే అద్దె బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. దీనికి బాధ్యులు ఎవరు..?’ అంటూ కమిషనర్ నిలదీశారు. డాక్టర్ కార్స్, మల్లిగ సంస్థలు కోర్టును ఆశ్రయించినప్పు హెచ్ఎండీఏ వైపు నుంచి ఎందుకు కోర్టులో ఫైట్ చేయలేదని ప్రశ్నించారు. ‘పార్టీజోన్ తాలూకు కోటి రూపాయల బకాయి ఉంది. అలాగే ఎన్టీఆర్ గార్డెన్లో డౌన్ టౌన్ లీజ్‌కు తీసుకొన్న వ్యక్తి సుమారు రూ.70 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అతను ఖాళీ చేశాక దీన్ని రెండేళ్ల నుంచి ఎందుకు ఖాళీగా ఉంచారు.? సుమారు కోటి రూపాయలు నష్టం వాటిల్లింది. దీనికి ఎవరు బాధ్యులు..’ అంటూ అధికారులను నిలదీశారు. దీనిపై లోతుగా విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించని వ్యాపారులపై కొరడా ఝలిపించాలని కమిషనర్ సూచించారు. అద్దె చెల్లించకుండా ఖాళీ చేసి వెళ్లిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించి ఆ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేయాలని బీపీపీ అధికారులను ఆదేశించారు. వెంటనే చర్యలు చేపట్టి ఎన్టీఆర్ గార్డెన్ డౌన్‌టౌన్‌కు, పార్కింగ్ లాట్స్ తదితరాలకు టెండర్లు నిర్వహించాలని సూచించారు. -
సింహం సింగిల్‌గా వస్తుంది
సమ్‌థింగ్ స్పెషల్ ప్లాట్లలో సాధారణంగా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని ఉంటాయి. అంతే కానీ, సింగిల్ రూమ్‌లో బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ వగైరాలు ఉండే ఫ్లాట్లు ఎక్కడా కనిపించవు. కానీ లండన్‌లో అలాంటి ఫ్లాట్ ఒకటి ఉంది. దానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. దాన్ని కొనేందుకు లేదా అందులో అద్దెకు ఉండేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. లండన్‌లోని సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ పైన ఉంది ఆ సింగిల్ రూం ఫ్లాట్. దాన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నా, లేక ఏకంగా ఫ్లాట్‌నే కొనుగోలు చేయాలనుకుంటున్నా బ్యాగ్ నిండా డబ్బులతో సిద్ధమయిపోవాల్సిందే. ఆ సింగిల్ రూం ధరెంతో తెలుసా? కొనుగోలుకైతే 110వేల పౌండ్లు.. అంటే సుమారు కోటి తొమ్మిది లక్షలు. అద్దెకైతే నెలకు దాదాపు యాభైవేలు. మరీ అంత ఎక్కువ ధరా అనుకునేవారు ఓ సారి ఆ రూం విశేషాలు తెలుసుకుంటే అదేం ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఆ సింగిల్ రూం ఫ్లాట్ మొత్తం కలిపి 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అందులోనే కిచెన్, బెడ్రూం, బాత్రూం ఉంటాయి. బాత్రూం బాక్స్లా ఉంటుంది కానీ అందులో టాయిలెట్, సింక్, షవర్ అన్నీ ఉన్నాయి. కిచెన్‌లోనూ సింక్ ఉంది. అలాగే స్పేస్ వృథా కాకుండా ఉండేందుకు ఫోల్డెడ్ టేబుల్ కూడా ఉంది. అసలు ఆ ఫ్లాట్‌కు అంత డిమాండ్ రావడానికి కారణం అది ఆస్పత్రికి, కాలేజీకి దగ్గరగా ఉండటమే. దానిని సోషల్ మీడియాలో సేల్కు పెట్టినప్పటి నుంచి దాని విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదంతా వింటుంటే సింహం సింగిల్‌గా వస్తుంది అనే సినిమా డైలాగ్ గుర్తుకు రావడంలో వింతేముంది? -
ప్రైవేటు విద్యాసంస్థలపై ‘అద్దె’ భారం
- 10 శాతం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్న బీఎంసీ - గడిచిన రెండేళ్ల నుంచే అమల్లోకి అని వెల్లడి - తాజా నిర్ణయంతో పాఠశాలలు మూత పడే అవకాశం! సాక్షి, ముంబై: బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల భవనాలను అద్దెకు తీసుకుని నడుపుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్థిక భారం పడనుంది. ఆ భవనాల అద్దెను పది శాతం పెంచుతున్నట్లు బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు గడిచిన రెండేళ్ల నుంచి వర్తిస్తుందని చెప్పి మరో పిడుగు వేసింది. ఈ మేరకు రెండేళ్లకు ఒక్కో విద్యా సంస్థ రూ. మూడు లక్షల నుంచి రూ. నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మరాఠీ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక అంతంత మాత్రంగా నడుస్తున్న స్కూళ్లపై భారం మోపేందుకు బీఎంసీ సిద్ధపడటంతో చాలా పాఠశాలలు మూత పడే అవకాశం కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి (నైట్ స్కూల్స్) నడిచే ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ముంబైలో ఉన్న సుమారు 289 పాఠశాలల్లో 70 శాతం బీఎంసీ ఆధ్వరంలో నడుస్తుండగా, మిగతా 30 శాతం పాఠశాలల భవనాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇందుకు 2013 నుంచి ప్రతి తరగతి గదికి రూ. వెయ్యి చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లించడానికే విద్యా సంస్థలు నానాతంటాలు పడుతుంటే ఈ పెంపు మరింత భారం కానుంది. ప్రభుత్వం ఇదివరకే వేతనేతర పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేయడం కూడా నిలిపివేయడంతో.. తాజా నిర్ణయం మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది. అద్దె పెంపును రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బీఎంసీ స్థలాల్లో అనేక స్వయం సేవా సంస్థలు తమ కార్యకలాపాలు, తరగతులు జరుగుతున్నాయి. ఇందుకు బీఎం సీ నుంచి ఆర్థిక మద్దతు, రాయితీ లభిస్తోంది. -
అద్దె చెల్లిస్తే ఇల్లు సొంతం!
కొత్త విధానానికి ప్రభుత్వ యోచన గ్రేటర్‌లోని పేద ప్రజలకు దశలవారీగా రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం.. మధ్య తరగతి వారికి కూడా సొంతిల్లు కల్పించాలనే యోచనలో ఉంది. అందుకు తగిన విధివిధానాలు రూపొందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. నగర ంలో ఇళ్లు లేని వారిలో నిరుపేదలతో పాటు లక్షల సంఖ్యలో దిగువ, మధ్యతరగతి వారున్నారు. వీరు నెలకు రూ. 3 వేల నుంచి రూ. ఏడెనిమిది వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని వీరు కడుతున్న అద్దె కంటే 20 శాతం అదనంగా నెలానెలా (అద్దెలాగే) ప్రభుత్వానికి చెల్లించే ఏర్పాటు చేస్తారు. తద్వారా నిర్ణయించిన ధర మేరకు అలా పది, పదిహేనేళ్లు అద్దె చెల్లిస్తే ఇళ్లు వారి సొంతమవుతాయి. ఈ దిశగా ఎంతమందికి ఎలాంటి ఇళ్లు అవసరమవుతాయనే దిశగా అధికారులు యోచిస్తున్నారు. ప్రభుత్వం పేదల కోసం ఐడీహెచ్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లకు సగ టున రూ. 8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఆ మోడల్లో నిర్మించే ఇళ్లలో మధ్య తరగతివారు ఉండేందుకు కూడా మొగ్గుచూపుతారనే అంచనాలున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ పద్ధతిలో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని వృత్తుల్లోని వారు నిర్ణయించిన కనీస ధరను ఏకమొత్తంగా చెల్లిస్తే.. మిగతా ఖర్చు ప్రభుత్వమే భరించి వారికి సొంత ఇళ్లను సమకూర్చాలనే యోచనలో కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీ కార్మికులకు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు..? వీటితోపాటు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా నగరంలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. కాగా, వాటిలో దాదాపు 20 వేల ఇళ్లు లబ్ధిదారులు లేక ఖాళీగా ఉన్నాయి. వీటిని తమ కార్మికులు, చిరుద్యోగులకు అందజేయాలనే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది. ఈమేరకు త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను కూడా వేలం పద్ధతిలో విక్రయించాలనే యోచనలో ఉన్నారు. నగరంలో సొంత ఇల్లు లేని వారు ఉండరాదనే ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేసేందుకు ఇలా వివిధ పద్ధతులను అధికారులు పరిశీలిస్తున్నారు.