repo rate unchanged
-
ప్రారంభమైన ఆర్బీఐ పాలసీ సమీక్ష
ముంబై: గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తలు అంచనా. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. అక్టోబర్‌లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెపె్టంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలకమైన ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది. ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. -
ధరల భయం.. వడ్డీరేట్లు యథాతథం!
ముంబై: ద్రవ్య, పరపతి విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం స్పష్టం చేసింది. దీనితో వరుసగా తొమ్మిదవసారి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే బెంచ్‌మార్క్ వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ రేట్లు దాదాపు యథాపూర్వం మున్ముందూ కొనసాగనున్నాయి. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ మూడురోజుల సమావేశ నిర్ణయాలు గురువారం వెలువడ్డాయి. 0.25 శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు మొగ్గు గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో నలుగురు యథాతథ 6.5 శాతం రేటు కొనసాగించడానికి మొగ్గుచూపగా, పావు శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు ఓటువేశారు. వీరిలో ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతోపాటు అషిమా గోయల్ ఉన్నారు. ‘ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత తాత్కాలికమే కావచ్చు. అయితే అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతున్న ప్రస్తుత వాతావరణంలో ద్రవ్య విధాన కమిటీ దీనిని సహించబోదు’ అని పాలసీ ప్రకటనలో గవర్నర్ ఉద్ఘాటించారు. మారని వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలు... ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ పాలసీ సమీక్ష వరుసగా 7.2 శాతం, 4.5 శాతాలుగా యథాతథంగా కొనసాగించింది. ఒకపక్క ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేస్తూ మరోవైపు వృద్దికి ఊతం ఇచ్చే చర్యలను ఆర్బీఐ కొనసాగిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. దీనికి దేశంలో తగిన వర్షపాతం దోహదపడుతుందని అన్నారు. 2024–25లో 4 త్రైమాసికాల్లో వృద్ది రేట్లు వరుసగా 7.1%, 7.2%, 7.3%, 7.2%గా కొనసాగుతాయన్నది పాలసీ సమీక్ష అంచనా. 2025–26 తొలి త్రైమాసికంలో (2026 ఏప్రిల్–జూన్) వృద్ధి 7.2%గా ఉంటుందని కూడా ఆర్బీఐ అంచనావేసింది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 4.9%, 4.4%, 4.7%, 4.3%గా ఉంటాయని విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్పీడ్ 4.4%గా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. 2% అటు ఇటుగా 4% వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండేలా చూడాలని ఆర్బీఐకి కేంద్రం సూచిస్తోంది. పాలసీ ముఖ్యాంశాలు... → మందగమనంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకునే స్థాయిలోనే కొనసాగుతోంది. → దేశీయ ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలు పటిష్ట ధోరణిలోనే కొనసాగుతున్నాయి. → దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచీ్చ–వెళ్లే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) నిర్వహణ బాగుంది. → విదేశీ మారకద్రవ్య నిల్వలు 675 బిలియన్ డాలర్ల చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో ఉన్నాయి. → 2024–25లో ఇప్పటి వరకూ రూపాయి తీవ్ర ఒడిదుడుకులతో కాకుండా ఒక నిర్దిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. → గృహ రుణాలతో సహా నిర్దేశించిన అవసరాలకు టాప్–అప్ను వినియోగించకపోవడం ఆందోళనకరమే. అయితే ద్వైపాక్షిక ప్రాతిపదికన సమస్యను పరిష్కరించడానికి చర్యలు కొనసాగుతాయి. → చెక్ క్లియరెన్స్‌ని వేగవంతం చేయడానికి చర్యలు ఉంటాయ్. → అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్ష చేపట్టనున్నారు.అనధికార డిజిటల్ లెండింగ్పై ఉక్కుపాదం అనధికార సంస్థల ఆట కట్టించడానికి డిజిటల్ లెండింగ్ యాప్‌ల పబ్లిక్ రిపాజిటరీ ఏర్పాటు కానుంది. నియంత్రణలోని సంస్థలు (ఆర్ఈ) ఈ రిపోజిటరీలో తమ డిజిటల్ లెండింగ్ యాప్‌ల గురించిన సమాచారాన్ని నివేదించాలి. అలాగే ఎప్పటికప్పుడు సంబంధిత లావాదేవీల వివరాలను అప్డేట్ చేయాలి. అనధికార రుణ యాప్‌లను గుర్తించడంలోవినియోగదారులకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు పన్ను చెల్లింపులు యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ. లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచాలని పాలసీ నిర్ణయించింది. ఇది యూపీఐ ద్వారా పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. ఇక యూపీఐ లావాదేవీలు చేయడానికి ఒక వ్యక్తి మరో వ్యక్తిని అను మతించడానికి సంబంధించి తాజాగా ‘డెలిగేటెడ్ పేమెంట్’ సదుపాయం ఏర్పాటు చేస్తుండడం మరో కీలకాంశం. బ్యాంక్ డిపాజిట్లు పెరగాలి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంపై శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్ నెట్వర్క్ ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని కోరారు.ఫుడ్ వెయిటేజ్‌పై సమీక్ష బెంచ్‌మార్క్ వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలన్న తాజా ఆర్థికసర్వే సూచనలను గవర్నర్ దాస్ పరోక్షంగా తోసిపుచ్చారు. ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు ఆర్బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని విస్మరించబోదని స్పష్టం చేశారు. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార వెయిటేజ్ 2011–12 నుంచి 46 శాతంగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, దీనిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తీరిది... అయితే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం పూర్తి లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఆర్బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఇటీవలి ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదని కూడా సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ సూచనను తాజాగా ఆర్బీఐ పక్కనబెట్టడం గమనార్హం. ఆహార ధరల కట్టడే ధ్యేయంఆహార ద్రవ్యోల్బణం ‘మొండిగా’ అధిక స్థాయిలోనే ఉంది. ధరల స్థిరత్వం లేకుండా, అధిక వృద్ధిని కొనసాగించలేము. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ కొనసాగించాల్సిందే. నిరంతర ఆహార ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లు, లేదా రెండవ దశ ప్రభావాలను నివారించడానికి అలాగే ఇప్పటివరకు సాధించిన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఎంపీసీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్నియంత్రణా మార్పులు హర్షణీయం ఆహార ద్రవ్యోల్బణాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇక పాలసీలో ప్రతిపాదించిన కొన్ని నియంత్రణా పరమైన సంస్కరణలు హర్షణీయం. ముఖ్యంగా డిజిటల్ లెండింగ్ మార్కెట్ క్రమబద్ధీకరణ పాలసీ నిర్ణయాల్లో కీలకాంశం. యూపీఐ సేవల విస్తరణ, పారదర్శకతకు చర్యలను స్వాగతిస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్‌లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్‌గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్‌డేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్‌డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్‌లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్‌ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
రేపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వరుసగా ఎనిమిదోసారి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'శక్తికాంత దాస్' నేతృత్వంలోని 6 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ కీలక పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో రేపో రేటు ఎనిమిదోసారి కూడా 6.5 శాతం వద్ద యధాతధంగా ఉంచింది.ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వాస్తవ జీడీపీ వృద్ధిలో పెరుగుదలను ప్రకటించారు. ఇది 7 శాతం నుంచి 7.2 శాతానికి చేరింది. రేపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.రెపో రేటుఆర్బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రేపు రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.రివర్స్ రెపో రేటువాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి.#WATCH | RBI Governor Shaktikanta Das says "...The provisional estimates released by the National Statistical Office (NSO) placed India's real gross domestic product, that is GDP growth at 8.2% for the year 2023-24. During 2024-25, so far the domestic economic activity has… pic.twitter.com/PL9hSfcqpo— ANI (@ANI) June 7, 2024 -
RBI MPC Meeting 2024: ఆరో‘సారీ’.. తగ్గించేదేలే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం ముగిసింది. సమావేశ వివరాలను గవర్నర్ వివరిస్తూ, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం, దేశంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి దిగిరావాలన్న లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో) 6.5 శాతంగా కొనసాగనుంది. ఫలితంగా బ్యాంకింగ్ రుణ రేట్లలో కూడా దాదాపు ఎటువంటి మార్పులూ జరగబోవని నిపుణులు అంచనావేస్తున్నారు. వరుసగా ఆరవసారి ‘యథాతథం’.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన ఐదు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. పాలసీలో కీలకాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24లో వృద్ధి రేటు 7.3 శాతంగా అంచనా. ► ఇదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% నుంచి 4.5 శాతానికి డౌన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా. ► నియంత్రణా పరమైన మార్గదర్శకాలను ఎంతోకాలంగా పాటించకపోవడమే పేటీఎంపై చర్యకు దారితీసినట్లు గవర్నర్ దాస్ పేర్కొన్నారు. ఈ చర్యలు వ్యవస్థకు ముప్పు కలిగించేవిగా భావించరాదని కూడా స్పష్టం చేశారు. ► డిజిటల్ రూపాయి వినియోగదారులు ఇకపై పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ లావాదేవీలను త్వరలో నిర్వహించగలుగుతారు. తక్కువ లేదా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ–రిటైల్(సీబీడీసీ–ఆర్) ఆఫ్‌లైన్ కార్యాచరణను ఆర్బీఐ త్వరలో ఆవిష్కరించనుంది. ► రుణ ఒప్పంద నిబంధనల గురించి కీలక వాస్తవ ప్రకటన (కేఎఫ్ఎస్)ను కస్టమర్లకు అందించవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారం బ్యాంకింగ్ ఇకపై రిటైల్‌తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణగ్రహీతలకు కూడా కేఎఫ్‌ఎస్‌ను అందించాల్సి ఉంటుంది. ► తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. వచ్చే పాలసీలో రేటు తగ్గొచ్చు దేశంలో హౌసింగ్ డిమాండ్ పెంచడానికి వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటు తగ్గింపు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి వడ్డీరేట్ల స్థిరత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల డిమాండ్ ప్రస్తుత పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది. దేశ ఎకానమీ స్థిరంగా ఉండడం పరిశ్రమకు కలిసివచ్చే అంశం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ వృద్ధికి బూస్ట్ రేటు యథాతథ విధానాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రగతిశీలమైంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు– ఆహార రంగానికి సంబంధించి ధరల సమస్యల వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ... వినియోగదారు ప్రయోజనాలే లక్ష్యంగా జరిగిన నిర్ణయాలు హర్షణీయం. జాగరూకతతో కూడిన విధానమిది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ 'శక్తికాంత దాస్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మొనేటరీ పాలసీ మీటింగ్‌లో ఏకగ్రీవంగా అంగీకరించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్దకే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఓ వైపు అప్పుడు పెరగటం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా గత ఏడాది నుంచి వడ్డీ రేట్లను 2.5 శాతం పెంచుతూ వచ్చిన ఆర్బీఐ.. గత నాలుగు సార్లు వడ్డీరేట్లను ఏ మాత్రం పెంచలేదు, ఇప్పుడు ఐదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ 2023 - 24లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. మూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం. #WATCH | RBI Governor Shaktikanta Das says, "...The Monetary Policy Committee decided unanimously to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the Standing Deposit Facility rate remains at 6.25% and the Marginal Standing Facility rate and the Bank Rate at 6.75%." pic.twitter.com/yQSppS7IzJ — ANI (@ANI) December 8, 2023 -
కీలక వడ్డీ రేటు యథాతథమే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. పాలసీ వివరాలను 8వ తేదీన గవర్నర్ వెల్లడిస్తారు. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఎకానమీ వృద్ధే లక్ష్యంగా ప్రస్తుత యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం)నే కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. యథాతథ రేటు కొనసాగిస్తే ఈ తరహా నిర్ణయం ఇది వరుసగా ఐదవసారి అవుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోనికి వచి్చనట్లు కనబడుతున్నప్పటికీ, దీని కట్టడికి కఠిన రేటు విధానాన్నే అవలంభించాలని ఆర్బీఐ కమిటీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో గత నాలుగు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. -
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్‌జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన
ముంబై: ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ప్రస్తుతానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (6.5 శాతం) యథాతథంగానే కొనసాగించాలని ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్‌లతో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ‘మా పని (ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం) ఇంకా ముగియలేదు. కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయి. అదే సమయంలో, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ–రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మేము సిద్ధంగా ఉండాలి. దీనికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోంది’’ అని దాస్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 2022 నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంపు ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని ఈ నెల తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. తాజాగా వెలువడిన మినిట్స్ కూడా ఇదే విషయాన్ని సూచించింది. అంచనాలకు అనుగుణంగానే... ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగానే పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఆర్బీఐ కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్సా్గ పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. జూలైలో మళ్లీ తీవ్ర రూపం దాలి్చంది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51%గా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 4.55%. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలై లో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13 శాతం పెరిగాయి. కీలక అంచనాలు ఇవీ... వృద్ధి తీరు: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ1లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6%గా అంచనా. ద్రవ్యోల్బణం ధోరణి: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2%, క్యూ3లో 5.7%, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన - వరుసగా మూడో సారి..
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు రేపో రేటు మీద కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత మూడు రోజులుగా జరుగుతున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.50 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచాలని తీర్మానించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంలోనే ఉండేలా చూసేందుకు సెంట్రల్ బ్యాంక్ కమిటీ కూడా వసతి వైఖరుల ఉపసంహరణను కొనసాగించింది. రేపో రేటు గత మూడు సార్లుగా ఎటువంటి మార్పుకు లోనుకాకుండా నిలకడగా ఉంది. అంతకు ముందు సెంట్రల్ బ్యాంక్ పాలసీ కమిటీ రెపో రేటుని 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు 250 బేసిస్ పాయింట్లను పెంచింది. మే 2023లో ద్రవ్యోల్బణం కనిష్టంగా 4.3 శాతానికి చేరింది. అయితే జూన్‌లో పెరిగిన ధరల ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరల కారణంగా జూలై అండ్ ఆగస్టులో పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! FY2023-24 CPI ద్రవ్యోల్బణం అంచనా కూరగాయల ధరల కారణంగా 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. అదే సమయంలో GDP అంచనా 6.5 శాతం వద్ద నిలిచింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు కావున కస్టమర్లు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం పెరిగే అవకాశం లేదు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం : సామాన్యులకు భారీ ఊరట?
ముంబై: గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల అత్యున్నత స్థాయి ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. 3 రోజుల ఈ సమావేశ నిర్ణయాలు గురువారం (ఆగస్టు 10వ తేదీ) వెలువడతాయి. ద్రవ్యోల్బణంపై అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో యథాతథ రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి కమిటీ మెజారిటీ మొగ్గుచూపవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇదే జరిగితే రేటు యథాతథ స్థితి కొనసాగింపు ఇది వరుసగా మూడవసారి (ఏప్రిల్, జూన్ తర్వాత) అవుతుంది. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో గత ఏడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి (ఫిబ్రవరికి) చేరింది. అటు తర్వాత రేటు మార్పు నిర్ణయం తీసుకోలేదు. -
ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్? వచ్చే ఏడాది వరకు తప్పదంట
సొంతింటి కలల్ని నిజం చేసుకోవాలనుకునేవారికి, లేదంటే ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ ( equated monthly interest) చెల్లించే వారికి ఆర్బీఐ భారీ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రుణ గ్రస్తులు హోంలోన్లపై కడుతున్న ఈఎంఐలు వచ్చే ఏడాది మార్చి వరకు తగ్గవని సమాచారం. అప్పటి వరకు రెపోరేటు (ప్రస్తుతం 6.50 శాతం) అలాగే కొనసాగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల, ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఎకనమిస్ట్ సర్వే నిర్వహించింది. స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎక్కువ వడ్డీ రేట్లు మార్చి 2024వరకు కొనసాగనున్నాయని సర్వేలో ఆర్ధిక వేత్తలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగు నెలల తగ్గుదల ధోరణి కనిపించినప్పటికీ పెరిగిన ఆహార ధరల కారణంగా ద్రవ్యోల్బణం గత నెలలో 4.81 శాతానికి పెరిగింది. కొనసాగనున్న రెపోరేటు జూన్ సర్వేలో,ఆర్బీఐ మార్చి 2024 చివరి నాటికి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. మొదటి రేటు తగ్గింపు 2024 రెండవ త్రైమాసికం వరకు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల కొనుగోలుదారులకు ఇబ్బందే హోం లోన్ ఈఎంఐ చెల్లిస్తుంటే 2024 వరకు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్బీఐ ప్రస్తుత రెపో రేటును కొనసాగిస్తున్నంత కాలం, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు, ఫలితంగా రుణగ్రహీతలకు ఎంఎంఐల భారం తగ్గదు. రెపో రేట్ల తగ్గింపు ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉండవు. కాబట్టే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయని భావిస్తున్నా’ అని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ సుమన్ చౌధరి అన్నారు. -
వచ్చే పాలసీలోనూ రేటు యథాతథమే!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెలలో (ఆగస్టు 8 నుంచి 10 మధ్య) జరిగే ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో కూడా రెపో రేటుకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు. పలు విభాగాలకు సంబంధించి గణాంకాలు... ముఖ్యంగా అదుపులోనే ఉన్న ద్రవ్యోల్బణం తన అంచనాలకు కారణమని ఇండస్ట్రీ వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో గత ఏడాది మే నుంచి రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ 2.5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో గడచిన రెండు ద్వైమాసికాల్లో ఈ రేటును ఆర్బీఐ కమిటీ యథాతథంగా కొనసాగిస్తోంది. సీఐఐ సమావేశంలో ఖరా ఏమన్నారంటే... ► కార్పొరేట్ రంగ ప్రైవేట్ మూలధన వ్యయం (క్యాపెక్స్) రిటైల్ డిమాండ్‌లో పటిష్టతపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వినియోగం పెరుగుతోంది. దీనితో కార్పొరేట్ రంగం క్యాపెక్స్ గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఈ విషయంలో సానుకూల సంకేతాలనే మేము చూస్తున్నాం. ► అందరికీ ఆర్థిక సేవలు అందడం... సామాజిక–ఆర్థిక సాధికారతకు కీలకమైన పునాది. ఇది ప్రజల సమగ్రాభివృద్ధికి తగిన మార్గం. అందరినీ ఆర్థిక రంగంలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తోంది. ► 2014లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనసహా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, యూపీఐ వంటి సామాజిక భద్రతా పథకాలు ప్రజలను ఆర్థిక వ్యవస్థతో మమేకం చేస్తున్నాయి. ► ఆర్థిక సేవల పరిశ్రమలో మరో ముఖ్యమైన పురోగతి... ఫిన్‌టెక్‌ల పెరుగుదల. ఆయా సంస్థలు విస్తృత శ్రేణిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఈ విషయంలో కొత్త సానుకూల నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, బ్లాక్ చైన్, డేటా–అనలిటిక్స్ వంటి వినూత్న సాంకేతికతలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. -
వడ్డీ రేట్ లో మార్పు లేదు అన్న రబీఐ
-
రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈ మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ(గురువారం) ప్రకటించారు. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా.. మునుపటి మాదిరిగానే అదే 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారాయన. ద్రవ్యోల్బణం తగ్గిన్నందువల్ల రెపో రేటుని పెంచలేదని, వడ్డీ రేట్లలో(గృహ, వాహన రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అంశం) కూడా ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్బీఐ రెపో రేటుని స్థిరంగా ఉంచడం ఇది వరుసగా రెండవ సారి కావడం గమనార్హం. ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, సీఆర్ఆర్ రేటు 4.50 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. గత ఏప్రిల్ సమావేశంలో రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే. Monetary Policy Statement by Shri Shaktikanta Das, RBI Governor - June 08, 2023 https://t.co/R9mQDcr70D — ReserveBankOfIndia (@RBI) June 8, 2023 -
ఎకానమీకి ‘యుద్ధం’ సెగ!
ముంబై: భారత్ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. ఇక పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అప్పర్ బ్యాండ్ దిశలో ద్రవ్యోల్బణం అంచనా పెరగడం కొంత ఆందోళనకరమైన అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ వృద్ధికి ఊతం ఇవ్వడం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని సమీక్షా సమావేశం నిర్ణయించింది. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. వృద్ధికి–ఎకానమీ సమతౌల్యతకు అనుగుణమైన (అకామిడేటివ్) పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని సమీక్షా సమావేశం పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు పరిశీలిస్తే... ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మార్జినల్ స్టాడింగ్ ఫెసిలిటీ రేటును (ఎంఎస్ఎఫ్) కూడా యథాపూర్వ 4.25 శాతం వద్ద కొనసాగనుంది. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బును అందించి వసూలు చేసే వడ్డీరేటు ఇది. స్వల్పకాలిక (ఓవర్‌నైట్) నిధుల అవసరాలకు బ్యాంకింగ్ ఈ విండోను వినియోగించుకుంటుంది. ► లిక్విడిటీ సమస్యల నివారణకు బ్యాంక్ రేటు కూడా యథాతథంగా 4.25%గా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెపో రేటు అనేది బాం డ్ల కొనుగోలు ప్రక్రియ ద్వారా వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు. అయితే బ్యాంక్ రేటు అనేది వాణిజ్య బ్యాం కులు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఆర్బీఐ నుండి రుణం పొంది, అందుకు చెల్లించే వడ్డీరేటు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనావేసింది. ఈ ప్రాతిపదికన వృద్ధి అంచనాలను కుదించింది. ► గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ రికవరీకి రబీ ఉత్పత్తి దోహదపడుతుంది. ► కాంటాక్ట్–ఇంటెన్సివ్ సేవలు పుంజుకునే అవ కాశాలు కనిపిస్తున్నాయి. హోటల్లు, రెస్టారెంట్లు, టూరిజం–ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్/హెరిటేజ్ సౌకర్యాలు, విమానయాన అనుబంధ సేవలు ఈ విభాగం కిందకు వస్తాయి. ► ప్రభుత్వ పెట్టుబడుల ప్రణాళిక, బ్యాంకింగ్ రుణ వృద్ధి, వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డంతో దేశంలో పెట్టుబడుల క్రియాశీలత పుంజుకుంటుంది. ► ఆర్బీఐ నియంత్రణలోని ఫైనాన్షియల్ మార్కెట్ల ప్రారంభ సమయం ఏప్రిల్ 18 నుండి ఉదయం 9. ఈ మేరకు మహమ్మారి ముందస్తు సమయాన్ని పునరుద్ధరించడం జరిగింది. ► హేతుబద్ధీకరించబడిన గృహ రుణ నిబంధన లు 2023 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు. ► వాతావరణానికి సంబంధించి సమస్యలు, నివారణకు తగిన నిధుల కల్పనపై త్వరలో ఒక చర్చా పత్రం విడుదల ► ఆర్బీఐ నియంత్రిత సంస్థల్లో వినియోగదారుల సేవల ప్రమాణాల సమీక్ష కోసం కమిటీ. ఇక కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్స్... యూపీఐ వినియోగం ద్వారా కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌలభ్యతను అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్‌లకు విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మోసాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ, ఏటీఎంల ద్వారా కార్డ్–లెస్ నగదు ఉపసంహరణకు దేశంలోని కొన్ని బ్యాంకులకు అనుమతి ఉంది. అదనపు లిక్విడిటీకి ‘ఎస్డీఎఫ్’ మందు వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఉపసంహరణ ప్రక్రియకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. రానున్న కొన్ని సంవత్సరాల్లో క్రమంగా మహమ్మారి ముందస్తు సాధారణ స్థాయిలకు ద్రవ్యతను తీసుకువెళ్లాలన్న లక్ష్య సాధనకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) ఇన్స్ట్రమెంట్ను ప్రవేశపెట్టింది. తద్వారా లిక్విడిటీ అడ్జెస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్)ను ప్రస్తుత 0.9 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ రేటు 3.75 శాతంగా ఉంటుంది. గృహ విక్రయాలకు ఊతం గృహ విక్రయాలు పెరగడానికి పాలసీ దోహదపడుతుంది. కోవి డ్–19 అనంతరం కీలక సమస్యల్లో ఉన్న పలు రంగాల పురోగతికి, ఆర్థికాభివృద్ధికి విధాన నిర్ణయాలు బలం చేకూర్చుతాయి. అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకునేందుకు చర్యలతోపాటు వ్యవస్థలో ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తీసుకున్న చర్యలు హర్షణీయం. – హర్ష వర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ ఆచరణాత్మక విధానం ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణంలో ఆచరణాత్మక విధాన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సరిగ్గా మదింపు చేసింది. వృద్ధికి విఘాతం కలగని రీతిలో లిక్విడిటీ సర్దుబాటు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రుణ సమీకరణ విధానానికి మద్దతుగా పలు చర్యలు ఉన్నాయి. దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధికి దోహదపడే విధానమిది. –దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ చదవండి: చదవండి: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు లైన్ క్లియర్, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు! -
ఆ పుష్ఫం ముందు క్రిప్టో కరెన్సీ దిగదుడుపే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు చేశారు. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణకు కీలకమైన రివర్స్ రెపో (బ్యాంకులు తమ వద్ద ఉండే అదనపు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం)ను కూడా యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ కమిటీ విధాన నిర్ణయం తీసుకుంది. 2020 ఆగస్టు నుంచి యథాతథమే..: కరోనా సవాళ్లు ఎదుర్కొనడం, వృద్ధి లక్ష్యంగా 2020 మార్చి తర్వాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు (1.15 శాతం) తగ్గించింది. 2020 ఆగస్టు నాటికి ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది. వడ్డీ రేట్ల పెంపులో సుదీర్ఘ విరామం, నిరంతర సరళతర విధాన వైఖరిని మీడియా సమావేశంలో గవర్నర్ శక్తికాంతదాస్ సమర్థించుకుంటూ, ప్రస్తుత కాలంలో ‘ద్రవ్య– ఆర్థిక విధానాలు ఒకదానికొకటి లేదా ఒకదానితో ఒకటి కలిసి వెళ్లాలి’’ అని వ్యాఖ్యానించారు. రెండు విధానాల్లో ‘అదా–ఇదా’ అనే ప్రశ్నే ప్రస్తుతం తలెత్తబోదని గవర్నర్ అన్నారు. సరళతరానికి ఐదుగురు ఓటు కాగా, పాలసీకి సంబంధించి అనుసరిస్తూ వస్తున్న ‘సరళతర’ వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు. పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వేగవంతమైన వృద్ధి ఇక భారత్ ఎకానమీ వృద్ధి తీరు ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే విభిన్నంగా ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎకానమీ కొనసాగుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.8 శాతానికి తగ్గించడానికి కారణం. 2021–22లో ఎకానమీ వృద్ధి 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సంబంధించి ఈ అంచనా 9 శాతంగా ఉంది. ఈ అంచనాలకన్నా కొంత అధికంగానే ఆర్బీఐ అంచనాలు 9.2 శాతం వద్ద కొనసాగుతుండడం గమనార్హం. మరికొన్ని కీలక నిర్ణయాలు... ► కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్–ట్యాప్ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది. ► దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. రూ. లక్ష వరకు ఈ–రూపీ పరిమితి ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ. 1 లక్షకు పెంచుతూ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు లబ్దిదారుడు బ్యాంక్ అకౌంట్, ఇంటర్నెట్ లేకుండా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా కూడా రూ. 1 లక్ష వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అందించడానికి వీలుగా మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు ఈ–రూపీ వోచర్‌ను లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించవచడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సమర్థ పంపిణీకి ప్రస్తుతం ఈ–రూపీ కీలకంగా ఉంది. కేవైసీ, కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటితో సంబంధం లేకుండా వోచర్‌ను రిడీమ్ చేయడంలో లబ్దిదారులకు సహాయపడే వన్–టైమ్ (ఇప్పటివరకూ... ఇకపై పూర్తిగా రీడీమ్ అయ్యే వరకూ) కాంటాక్ట్‌లెస్, నగదు రహిత వోచర్ ఆధారిత చెల్లింపు విధానమే– ఈ–రూపీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన ఈ–రూపీ నగదు రహిత డిజిటల్ ఓచర్‌ను ‘వ్యక్తిగత వినియోగం, సింగిల్ టైమ్ రెడెమ్షన్ సౌలభ్యంతో’ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లెండింగ్పై మార్గదర్శకాలు డిజిటల్ రుణ విధానాలపై త్వరలో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీచేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ తన సిఫారసులను ఇప్పటికే సమర్పించినట్లు డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం జరిగిందని, దీని అధారంగా మార్గదర్శకాలు రూపొందుతున్నాయని తెలిపారు. రిటైల్ పేమెంట్ వ్యవస్థకు కొత్త నేతృత్వ సంస్థ ఖరారుకు ఇంకా సమయం పడుతుందని సూచించారు. క్రిప్టో... తులిప్ కన్నా దిగదుడుపే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విషయంలో ఆర్బీఐ కమిటీ తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ... తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. డిజిటల్ కరెన్సీపై తొందరలేదు.. ఆర్బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు. లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు... ఆచితూచి, లక్ష్యసాధనకు ఉద్దేశించి పరపతి విధాన నిర్ణయాలను ఆర్బీఐ విధాన పరపతి కమిటీ తీసుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలో ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన, వృద్ధే లక్ష్యంగా సరళతర విధానం కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) ద్రవ్యోల్బణం ఆమోదనీయ బ్యాండ్‌లోనే పైకి వెళ్లొచ్చు. అయితే 2022–23 ద్వితీయ ఆరు నెలల కాలంలో 4.5% శ్రేణికి దిగొస్తుందని కమిటీ విశ్వసిస్తోంది. దీనికితోడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి సవాళ్లు వంటి అంశాల నేపథ్యంలో విస్తృత ప్రాతిపదికన రికవరీ జరగడానికి ఎకానమీకి పాలసీ మద్దతు అవసరమని కమిటీ భావించింది. సరళతర విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం వల్ల రివర్స్ రెపోను కూడా యథాతథంగా కొనసాగించాలని కమిటీ అభిప్రాయపడింది. వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయ ప్రణాళికలు, ఎగుమతులు ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల, డిమాండ్ పటిష్టతకు దారితీస్తాయని, ఈ వాతావరణం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నాం. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ ఎకానమీకి భరోసా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ఎకానమీ వృద్ధికి పాలసీ నిర్ణయాలు భరోసాను ఇస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతానికి పాలసీ తగిన మద్దతునిచ్చింది. ప్రభుత్వ బాండ్లలో తగిన సమతౌల్యతను కొనసాగించడానికి సంకేతాలను ఇచ్చింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అంచనాలకు అనుగుణంగా... పాలసీ నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. వృద్ధిని మరింత పటిష్టం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎకానమీలోని పలు రంగాల బలహీనత నేపథ్యంలో ‘సరళతర’ విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించడం హర్షణీయం. – అతుల్ కుమార్ గోయెల్, ఐబీఏ చైర్మన్ డిమాండ్‌కు దోహదం సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం వ్యవస్థలో డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధి అన్ని రంగాల్లో విస్తృత ప్రాతిపదికన జరగాలని పరిశ్రమ కోరుతోంది. ఈ దిశలోనే ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వంతో సన్నిహిత సహకారంతో వృద్ధి పురోగతికి మరిన్ని చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నాం. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షణీయం సరళ విధానం కొనసాగించాన్న నిర్ణయం హర్షణీయం. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడం రియల్టీకి సానుకూలాంశం. బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉన్న అదనపు లిక్విడిటీ అన్ని రంగాలకూ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఉపాధి కల్పన, ఎకానమీ పురోగతికి దారితీస్తుంది. – హర్షవర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
RBI: వడ్డీరేట్లపై ఆర్బీఐ ప్రకటన
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి సర్దుబాటు నిర్ణయం వైపే మొగ్గు చూపింది. వరుసగా 9వసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది ఆర్బీఐ. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. అలాగే ఎంఎస్ఎఫ్(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ), బ్యాంక్ రేట్లను 4.25 శాతానికే పరిమితం చేసినట్లు తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్‌పై ఇటీవలి ఎక్సైజ్ సుంకం & రాష్ట్ర వ్యాట్ తగ్గింపులు.. కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగ డిమాండ్‌కు మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం డిమాండ్‌కు మద్దతునిస్తూ ఆగస్టు నుంచి ప్రభుత్వ వినియోగం కూడా పుంజుకుంది. ► 2021-22లో వాస్తవ GDP వృద్ధి అంచనా 9.5% వద్ద ఉంచబడింది, Q3లో 6.6% & Q4లో 6% ఉంటుంది. వాస్తవ GDP వృద్ధి 2022-23 Q1కి 17.2% మరియు 2022-23 Q2కి 7.8%గా అంచనా వేయబడింది. ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. ఇది డిమాండ్ బలపడుతున్నప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణానికి వేగంగా ప్రసారం చేయబడుతుంది ► ధరల ఒత్తిడి తక్షణ కాలంలో కొనసాగవచ్చు. రబీ పంటలకు ప్రకాశవంతమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల ధరలు శీతాకాలపు రాకతో కాలానుగుణ దిద్దుబాటును చూడగలవని అంచనా. ► 2021-22లో CPI ద్రవ్యోల్బణం 5.3%గా అంచనా వేయబడింది. ఇది క్యూ3లో 5.1%, మరియు క్యూ4లో 5.7% రిస్క్ విస్తృతంగా సమతుల్యతతో ఉంటుంది ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. చదవండి: మార్కెట్ నుంచి మాయమవుతున్న రూ.2000 నోట్లు ! కారణాలు ఇవే -
ఎనిమిదోసారీ యథాతథమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) అంచనాలకు అనుగుణంగా రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే– రెపో. ప్రస్తుతం 4 శాతంగా ఇది కొనసాగుతోంది. వృద్ధే లక్ష్యంగా వరుసగా ఎనిమిది ద్వైమాసికాల నుంచి ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. 2019లో రెపో రేటును ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పా యింట్లు తగ్గించింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజు ల సమావేశం అనంతరం శుక్రవారం ఎకానమీకి సంబంధించి నిర్ణయాల ప్రకటన వెలువడింది. కట్టడిలోకి ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. వృద్ధి రేటుపై ధీమా... ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శాతం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. ఎకానమీ సంపూర్ణ ప్రయోజనాలు కీలకం తాజా పాలసీ సమీక్ష నేపథ్యంలో పొదుపు పథకాలు, బ్యాంకుల డిపాజిట్లపై ఆధారపడి జీవించే వారికి కొత్తగా వచ్చే ఆర్థిక ప్రయోజనం ఏదీ ఉండదు. వారికి యథాతథంగా సాధారణ వడ్డీరేట్లు మాత్రమే అందుతాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేకపోతే మాత్రం వారు ప్రతికూల రిటర్న్స్ అందుకునే పరిస్థితి ఉంటుంది. ‘‘కుప్పకూలిపోతున్న లేదా క్షీణిస్తున్న మొత్తం ఆర్థిక వ్యవస్థకు మీరు మద్దతు ఇవ్వలేకపోతే, సీనియర్ సిటిజన్లతో సహా అందరికీ ఇతర ప్రధాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది’’ అని ఇదే విషయంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రబి శంకర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే పొదుపు పథకాలు ఇంకా నెగటివ్ రిటర్న్స్ ఏమీ ఇవ్వడం లేదని కూడా ఆయన విశ్లేíÙంచారు. ఈ సందర్భంగా ఆయన స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో ఏడాది డిపాజిట్ పథకాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ డిపాజిట్ రేటు మార్గదర్శకాల ద్వారా వచి్చన వాస్తవ రేటు కంటే కనీసం 170–180 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉందన్నారు. పెట్రో పన్నులపై ఆందోళన పెట్రో ఉత్పత్తులపై పన్నుల తీవ్రత పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. బహిరంగంగా రెండవసారి ఈ అంశంపై మాట్లాడిన గవర్నర్, పప్పులు, వంటనూనెల వంటి నిత్యావసరాల సరఫరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రాలకు చేయూత మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాలకు గురయిన రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ద్వారా పెంచిన రుణ పరిమితులను అన్ని విధాలా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి ఈ సమస్యతో పాటు అధిక రుణాల ఫలితంగా, రాష్ట్రాలు తమ బాండ్ హోల్డర్లకు అధిక వడ్డీని చెల్లిస్తున్నాయి – ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ రేటు దాదాపు 7 శాతానికి చేరువైంది. ఈ సమయంలో పలు రాష్ట్రాలు డబ్ల్యూఎంఏ విండోను వినియోగించుకున్నాయి. జూలై నాటికి ఈ సౌలభ్యం ద్వారా నిధుల రుణ పరిమాణం 35 శాతం పెరిగి రూ .92,000 కోట్లకు చేరింది. ఉద్దీపనలను వెనక్కు... సంకేతాలు కోవిడ్–19 నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపనలకు క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాలసీ సమీక్ష సూచించింది. ప్రస్తుతం వ్యవస్థలో రూ .9 లక్షల కోట్లకు పైగా ఉన్న అదనపు ద్రవ్యతను ‘క్రమంగా‘ సర్దుబాట్లు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ సుముఖంగా ఉందని గవర్నర్ సూచించారు. మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను (బాండ్లు) కొనుగోలుకు సంబంధించిన జీఎస్ఏపీ (గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ ప్రొగ్రామ్)ను నిలుపుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత లేకుండా చూడ్డామే దీని ఉద్దేశ్యమని సూచించారు. గడచిన రెండు త్రైమాసికాల్లో జీఎస్ఏపీ కింద ఆర్బీఐ రూ.2.2 లక్షల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. కాగా, ఇదే సమయంలో ఎకానమీ రికవరీకి తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో ఎప్పడూ కొనసాగేలా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బడా టెక్ ‘ఫైనాన్షియల్స్’పై కన్ను గూగుల్, అమెజాన్ ద్వారా డిపాజిట్ల ఆమోదం నిర్దేశిత చట్టాలు, నిబంధనల ప్రకారం ఉందో లేదో ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆర్థిక రంగంలో బడా టెక్ సంస్థల కార్యకలాపాలపై ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే (ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్) , అమెజాన్ రెండూ తమ మొబైల్ ఫోన్ యాప్‌ల ద్వారా దేశంలో డిపాజిట్లను స్వీకరించడానికి రుణదాతలతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 5 లక్షలకు ఐఎంపీఎస్.. ఐఎంపీఎస్ (ఇమీడియట్ పేమెంట్ సర్వీస్) ద్వారా ప్రస్తుత లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా, దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం జరిగింది. డిజిటల్ లావాదేవీల పెంపు ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. ఐఎంపీఎస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తోంది. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు... ► బ్యాంకులు తమ మిగులు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసినప్పుడు లభించే రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్ కూడా 4.25 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది. ► ద్రవ్య లభ్యత, సర్దుబాటు లక్ష్యాలుగా అక్టోబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 3 మధ్య పక్షం రోజుల ప్రాతిపదికన ఐదు 14 రోజుల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) వేలాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ► ఏటీఎంల్లో డబ్బు అందుబాటులో లేని సంద ర్భంల్లో ఆయా బ్యాంకులపై జరిమానా విధింపునకు ఉద్దేశించిన పథకాన్ని ఆర్బీఐ సమీక్షిస్తోంది. బ్యాంకర్ల నుంచి అందిన సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఈ జరిమానా విధానాన్ని ప్రకటిస్తే, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ► ఫైనాన్షియల్ మోసాల నివారణే లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పన జరగనుంది. ► బ్యాంకుల తరహాలోనే బడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎప్సీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ► దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గ్లోబల్‌బాండ్ ఇండిసీస్‌లో చేరే విషయంలో భారత్ ముందడులు వేస్తోంది. ఆర్బీఐ, కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఇండెక్స్ ప్రొవైడర్లతో చర్చిస్తున్నాయి. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది. ఆఫ్‌లైన్‌లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం రిటైల్ డిజిటల్ పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకోవడం ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రధాన లక్ష్యం. చెల్లింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా అంగీకృత మౌలిక వ్యవస్థ బలోపేతానికి జియో ట్యాగింగ్ ఫ్రేమ్‌వర్క్ విడుదల కానుంది. వృద్ధి సంకేతాలు పటిష్టమవుతున్నాయ్ వృద్ధి కిరణాలు విస్తరిస్తుండడం, ఇందుకు సంకేతాలు పటిష్టమవుతుండడాన్ని ఆర్బీఐ గమనిస్తోంది. రైల్వే రవాణా, పోర్ట్ కార్యకలాపాలు, సిమెంట్ ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, ఈ– వే బిల్లుల మెరుగుదల, జీఎస్టీ, టోల్ భారీ వసూళ్ల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. దీర్ఘకాలం వృద్ధి పటిష్ట ధోరణి కొనసాగడానికి సరళతర ఆర్థిక విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ పాలసీ కమిటీ నిర్ణయించింది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఐఎంపీఎస్ చెల్లింపులు.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ
RBI Monetary Policy Updates: డిజిటల్ చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) చెల్లింపుల పరిమితిని 2 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేసింది. ఈ మేరకు రెండురోజులపాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, శుక్రవారం మీడియాకు వెల్లడించారు. యూపీఐలాగే ఐఎంపీఎస్ కూడా ఇన్స్టంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీస్. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎం, ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో ఉపయోగించుకోవచ్చు. 2014 జనవరిలో ఐఎంపీఎస్ చెల్లింపు పరిమితిని 2 లక్షలుగా నిర్ణయించింది ఆర్బీఐ. ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో మాత్రం ఇది 5 వేలుగానే కొనసాగుతోంది. ఈరోజుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రామాణికంగా మారిన తరుణంలో.. ఊరటనిస్తూ ఐదు లక్షలకు ఆర్బీఐ పెంచడం విశేషం. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాల్ని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వరుసగా ఎనిమిదోసారి తర్వాత కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారాయన. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి, ఎస్ఎఫ్ కూడా 4.25 శాతానికే పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. ఇక యూజర్లకు ఊరటనిస్తూ ఐఎంపీఎస్ ట్రాన్జాక్షన్ లిమిట్‌ను 2 లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచే ప్రతిపాదనను Immediate Payment Service (IMPS) యాప్స్ ముందు ఉంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో పాటు ఎన్బీఎఫ్సీల్లో పెద్ద కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటునకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆఫ్‌లైన్‌పేమెంట్ మెకానిజంను త్వరలో తీసుకురాబోతున్నట్లు, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ, ఆర్బీఐ మరోసారి సర్దుబాటు వైపే మొగ్గుచూపింది. ఇక కరోనాతో ప్రభావితమైన భారత ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడానికి ఆర్బీఐ రెపోరేటును 2020 మేలో 4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎంపీసీలోని కీలకాంశాలు ►చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ►ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ►పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. ►పండగ సీజన్లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తోంది. ►కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు. ►జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు. ► క్యాపిటల్ గూడ్స్‌కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది. ►ఈ ఆర్థిక సంవత్సర రిటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి సవరణ. ►జులై-సెప్టెంబరులో అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ►అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని సైతం 5.3 శాతం నుంచి 4.5 శాతానికి కుదించారు. ►రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నేపథ్యంలో వచ్చే నెల ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండనుంది. ►పేమెంట్ యాక్సెప్టెన్సీ కోసం పీవోఎస్ point of sale (PoS), క్యూఆర్ కోడ్ల తరహాలోనే జియో ట్యాగింగ్ టెక్నాలజీ తీసుకురావాలనే ఆలోచన ►2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది ఆర్బీఐ. చదవండి: మరింత సులభతరం కానున్న లావాదేవీలు -
గృహ రుణాలలో 26 శాతం వృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో గృహ రుణాలలో 26 శాతం వృద్ధి నమోదయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పెంచకపోవటంతో బ్యాంక్‌లు 7 శాతం కంటే తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. 46 శాతం మంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ముందుకొచ్చారని మ్యాజిక్ బ్రిక్స్ తెలిపింది. ఆస్తి మీద రుణం తీసుకునే అంశాలలోనూ 20 శాతం పెరుగుదల నమోదు కావటం గమనార్హం. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ రేట్లు, ఆయా నగరాలలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కారణంగా ఇళ్లను కొనేవారి సంఖ్య పెరిగింది. దాదాపు 50 శాతం మంది 15 ఏళ్ల కంటే తక్కువ రుణ వ్యవధిని ఎంచుకుంటున్నారు. అంటే వీలైనంత త్వరగా గృహ రుణాలను కట్టేయాలని కొనుగోలుదారులు భావిస్తున్నారన్నమాట. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సాధారణంగా గృహ రుణం చెల్లింపుల కోసం 25–30 ఏళ్ల దాకా గడువును ఇస్తున్నాయి. అయినప్పటికీ రుణాన్ని త్వరగా తీర్చేయాలన్న ఆలోచనతో ఇళ్ల కొనుగోలుదారులు ఉన్నారు. -
ధరల భయం.. వడ్డీ రేట్లు యథాతథం!
న్యూఢిల్లీ: అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి వృద్ధికి మద్దతు పలికింది. ద్రవ్యోల్బణం సమీప కాలంలో ఎగువ స్థాయిల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తూ.. అదే సమయంలో కీలకమైన రెపో రేటు (4 శాతం), రివర్స్ రెపో రేటు (3.35 శాతం)ను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న అంచనాల్లోనూ మార్పులు చేయలేదు. వృద్ధికి మద్దతుగా సర్దుబాటు ధోరణినే కొనసాగించడం శుక్రవారం ముగిసిన మూడో ద్వైమాసిక (2021–22లో) ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలుగా చెప్పుకోవాలి. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు, వృద్ధి స్థిరపడే వరకు సర్దుబాటు విధానం కొనసాగింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఐదుగురు ఆమోదం తెలిపినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. గతంలో ఏకగ్రీవ ఆమోదం రాగా.. ఈ విడత ఒక్కరు దీంతో విభేదించడం గమనార్హం. సమీప కాలంలో రేట్లను పెంచే అవకాశం లేదని దీంతో తెలుస్తోంది. ఆర్బీఐ కీలక రేట్లను యథావిధిగా కొనసాగించడం వరుసగా ఇది ఏడో విడత. చివరిగా 2020 మే నెలలో రేట్లను సవరించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని అప్పుడు కీలక రేట్లను అత్యంత కనిష్టాలకు తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరి నుంచి 2020 మే నాటికి మొత్తం మీద 2.5 శాతం మేర రేట్లను తగ్గించింది. సదా సన్నద్ధంగానే ఉంటాం.. కరోనా మరో విడత విరుచుకుపడే ప్రమాదంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అప్రమత్తత ప్రకటించారు. ‘‘ఆయుధాలను విడిచి పెట్టకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో విడత పట్ల అప్రమత్తంగా ఉంటాం’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైందంటూ.. ఈ కీలక సమయంలో ద్రవ్యపరమైన, విధానపరమైన, రంగాల వారీ మద్దతు కొనసాగాల్సిన అవసరాన్ని దాస్ ప్రస్తావించారు. కరోనా రెండో దశ నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలైందంటూ.. పెట్టుబడులు, డిమాండ్ కోలుకోవడాన్ని కీలక గణాంకాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ ఎంపీసీ 2021–22 సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 9.5 శాతంగానే కొనసాగించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 21.4 శాతం, జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 7.3 శాతం, ఆ తర్వాతి త్రైమాసికంలో 6.3 శాతం, చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) 6.1 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధి నమోదవుతుందన్న అభిప్రాయాన్ని తెలియజేసింది. వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడం ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి, అటు గృహ కొనుగోలు దారులకు మేలు చేసినట్టు దాస్ పేర్కొన్నారు. ఎంపీసీ ఇతర నిర్ణయాలు ► కరోనా కారణంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్ రంగానికి ఊరట లభించింది. రుణ పునరుద్ధరణ పథకానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ నిర్దేశించిన పలు నిబంధనల అమలుకు గడువును మరో ఆరు నెలలు అంటే 2022 అక్టోబర్ 1 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ► సెకండరీ మార్కెట్లో రూ.50,000 కోట్లతో ప్ర భుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్ఏపీ 2.0) ఆగస్ట్ నెలలో రెండు విడతలుగా చేపట్టనున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ లిక్విడిటీ ఉండేలా చూడడమే దీని ఉద్దేశంగా పేర్కొన్నారు. ► ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నందున.. ఆన్ ట్యాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ (టీఎల్టీఆర్వో) పథకాన్ని మూడు నెలల పాటు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. ► వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) ఆక్షన్లను రూ.2.5 లక్షల కోట్లతో ఆగస్ట్ 13న, రూ.3 లక్షల కోట్లతో ఆగస్ట్ 27న, రూ.3.5 లక్ష ల కోట్లతో సెప్టెంబర్ 9న, రూ.4 లక్షల కోట్లతో సెప్టెంబర్ 24న చేపట్టనుంది. తద్వారా వ్యవస్థలో లిక్విడిటీని సర్దుబాటు చేయనుంది. గరిష్టాల్లోనే ద్రవ్యోల్బణం సరఫరా వైపు ఉన్న సమస్యలు, చమురు ధరలు అధిక స్థాయిలో ఉండడం, ముడి సరుకుల వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జూన్ ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. డిజిటల్ రూపీ డిజిటల్ రూపాయిని త్వరలో చూసే అవకాశా లున్నాయి. డిజిటల్ కరెన్సీల నిర్వహణ నమూనాను ఈ ఏడాది చివరి నాటికి ప్రకటించే అవకాశాలున్నట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ తెలిపారు. పరిధి, టెక్నాలజీ, పంపిణీ విధానం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకు ని ఫియట్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే సాధ్యా సాధ్యాలను ఆర్బీఐ అంతర్గతంగా మదింపు వేస్తున్నట్టు చెప్పారు. -
2022 జూన్ నుంచి రేట్ల పెంపు!
న్యూఢిల్లీ: వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత పెరుగుదల ధోరణి వ్యవస్థీకృతం (తీవ్రతను అడ్డుకోలేని వాస్తవ స్థితి) కాదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత సరఫరాల పరమైనదని, తాత్కాలికమైన ఈ సమస్య అదుపులోనికి (2–6 శ్రేణిలోకి) దిగివస్తుందని ఈ నివేదిక సూచించింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది మేనెల వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని, 2022 జూన్ నుంచీ రేట్లు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష వివరాలు శుక్రవారం వెల్లడవనున్న నేపథ్యంలో యూబీఎస్ ఈ విశ్లేషణ చేయడం గమనార్హం. నివేదికలో తన్వీ గుప్తా జైన్ పేర్కొన్న మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.5 శాతంగా కొనసాగుతుంది. 2022–23లో 4.5 శాతంగా కొనసాగవచ్చు. దిగువస్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించడం లేదు. వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, గృహ పొదుపులు పెరిగాయి. మహమ్మారి ప్రేరిత అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వృద్ధికి, ఆదాయానికి, ఉపాధి కల్పనకు దోహపపడుతుంది. భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2021–22 ఆర్థిక సంవత్సరానికి 1.5 శాతం తగ్గించి 10 శాతంగా యూబీఎస్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్యం తగ్గడం, పట్టణ నిరుద్యోగిత 12 నెలల గరిష్టం 17.4 శాతానికి పెరగడం ప్రతికూల అంశాలుగా యూబీఎస్ పేర్కొంది. అయితే క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది. -
ఆర్బీఐ వడ్డీరేట్ల ఊరట..!
ముంబై: దేశంలో కరోనా ప్రభావం కనిష్ట స్థాయికి చేరే వరకూ తగిన సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భరోసా ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ భారత్ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021ఏప్రిల్–2022 మార్చి) వృద్ధి రేటు 9.5 శాతంగానే ఉంటుందని అంచనావేసింది. ఈ విషయంలో గత అంచనా 10.5 శాతానికి ఒకశాతం మేర కోత పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఎకానమీ వృద్ధికి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించక తప్పదని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరవ ద్వైమాసిక సమావేశంలోనూ యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీనితోపాటు అవసరమైతే మరింత తగ్గించే అవకాశం ఉందనీ సంకేతాలు ఇచ్చింది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. ఇక బ్యాంకులు తమ అదనపు నిధుల డిపాజిట్‌పై ఇచ్చే వడ్డీ–రివర్స్ రెపో రేటును కూడా యథాతథంగా 3.35గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం గవర్నర్ శక్తికాంత్‌దాస్ మీడియాతో మాట్లాడారు. సంబంధిత వివరాలు, నిర్ణయాలను క్లుప్లంగా పరిశీలిస్తే.. కట్టడిలో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం సరళతర ద్రవ్య విధానం కొనసాగింపునకు దోహదపడుతుందని ఆర్బీఐ విశ్లేషించింది. కేంద్రం నిర్దేశాలకు (2 నుంచి 6 శాతం మధ్య) అనుగుణంగా 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని అంచనావేసింది. అయితే ఇది గత అంచనాలకన్నా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎక్కువ కావడం గమనార్హం. బ్యాంకింగ్‌కు నిధుల భరోసా 2021–22 ఆర్థిక సంవత్సరంలో తీవ్రంగా నష్టపోయిన రంగాలకు రుణ సహాయాన్ని అందించడానికి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్ఐడీబీఐ– సిడ్బీ)సహా ఫైనాన్షియల్ సంస్థలకు తాజా మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా 2022 మార్చి 31 వరకూ రూ.15,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ విండో (ద్రవ్య లభ్యత సౌలభ్యం)ను ప్రకటించింది. ఈ విండో కింద బ్యాంకులు మూడేళ్ల కాలానికి రెపో రేటుకు రుణాలను తీసుకోవచ్చు. తద్వారా హోటల్స్, రెస్టారెంట్లు, పర్యాటకం వంటి కోవిడ్ బాధిత రంగాల పునరుద్ధరణకు బ్యాంకులు రుణ సహాయం అందించవచ్చు. దీనికితోడు లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతను ఇవ్వడానికి సిడ్బీకి రూ.16,000 కోట్ల అదనపు నిధిని కేటాయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రంగాలకు రుణ సహాయ పరిమితిని రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. రుణ రేట్ల కట్టడికి... బాండ్ల కొనుగోలు సరళ విధానంలో రుణ రేట్లను కట్టడిలో ఉంచడానికి రెండవ త్రైమాసికంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ కార్యక్రమం (జీ–ఎస్ఏపీ–2.0) కింద అదనంగా రూ.1.2 లక్షల కోట్ల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్–మే మధ్య జీ–ఎస్ఏపీ–1.0 కింద రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచీ నిరంతరం... ఎన్ఏసీహెచ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) వ్యవస్థ 2021 ఆగస్టు 1వ తేదీ నుంచి నిరంతరం అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ పనిదినాల్లో మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటోంది. చెల్లింపులకు సంబంధించి మధ్యవర్తిత్వ సంస్థగా ఎన్ఏసీహెచ్ నుంచి అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయి. డివిడెండ్, వడ్డీ, వేతనం, పెన్షన్ వంటి బదలాయింపులకు అలాగే విద్యుత్, గ్యాస్ టెలిఫోన్, వాటర్ నెలవారీ రుణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా ప్రీమియం చెల్లింపులకు ఎన్ఏసీహెచ్ వ్యవస్థ కీలక సేవలు అందిస్తోంది. క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు ఉన్నాయ్... బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ వైఖరిలో మార్పు లేదు. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఇలాంటి ఇన్స్ట్రమెంట్లపై ‘‘తీవ్ర ఆందోళనలు’’ ఉన్నాయి. ఇప్పటికే దీనిపై విడుదల చేసిన ఆర్బీఐ సర్క్యులర్ ఆయా అంశాలకు సంబంధించి పూర్తి స్పష్టతను ఇచ్చింది. 2018లో తొలుత ఇందుకు సంబంధించి జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సవరిత నోటిఫికేషన్‌ను తాజాగా ఆర్థిక సంస్థలకు జారీ చేయడం జరిగింది. అందువల్ల క్రిప్టోకరెన్సీ అంశాల విషయంలో 2018 నాటి సర్క్యులేషన్‌ను ఉదహరించవద్దని తాజా నోటిఫికేషన్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ వ్యవస్థలకు ఆర్బీఐ సూచిస్తోంది. -
ఆర్బీఐ పాలసీ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2021–22 తొలి ద్వైమాసిక మూడురోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్–19 కేసులు పెరుగుతుండటం, 2–6 శాతం మధ్య ద్రవ్యోల్బణ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటూ కేంద్రం నిర్దేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం కీలక నిర్ణయాలు బుధవారం వెల్లడవుతాయి. తాజా పాలసీ సమీక్షలోనూ కీలక వడ్డీ రేటు రెపో యథాతథ స్థితి కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే రెపో యథాతథ స్థితి వరుసగా ఐదవసారి అవుతుంది. రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఎకానమీ రికవరీలో అసమానతలు ఉన్నాయని, కనిష్ట స్థాయి నుంచి కోలుకునే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని ఎడెల్వీజ్ రీసెర్చ్ తెలిపింది. తాజాగా కోవిడ్ కేసులు విజృంభిస్తుండటం మరో కొత్త సవాలుగా మారిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇటు వృద్ధికి, అటు ద్రవ్యోల్బణ కట్టడికి ఎప్పటికప్పుడు విధానపరమైన చర్యల తోడ్పాటు అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని వివరించింది. ఒకవైపు కోవిడ్–19 కేసులు, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ పరిస్థితి సంక్లిష్టంగా మారిందని హౌసింగ్‌డాట్‌కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాలా చెప్పారు. దీనితో తాజా ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును మార్చకపోవచ్చని పేర్కొన్నారు. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. 18 పైసలు తగ్గిన రూపాయి ముంబై: ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 18 పైసలు కరిగిపోయి 73.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 73.28 – 73.45 రేంజ్లో కదలాడింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి తోడ్పడే సంస్కరణలేవీ లేకపోవడం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో రూపాయి రానున్న రోజుల్లో బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మర్ తెలిపారు.