revolver
-
నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్..
వాషింగ్టన్: నిద్రలో కలలు రావడం సాహజం. ఒక్కోసారి అవి కలలా కాకుండా నిజ జీవితంలో జరిగినట్లు అనిపిస్తుంటుంది. ఒక పీడ కలల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వస్తే చాలు దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎదురై ఉంటాయి. ఇదే తరహాలోనే ఓ వ్యక్తికి విచిత్రమైన కల కని.. నిజం తుపాకితో తననే కాల్చుకున్నాడు. అమెరికాలోని ఇల్లినాయిస్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ కల ఏంటంటే... నిద్ర మత్తులో అలా జరిగిపోయింది అమెరికా ఇల్లినాయిస్లోని లేక్ బారింగ్టన్లో మార్క్ డికారా నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను నిద్రపోతుండగా ఓ కల వచ్చింది. ఆ కలలోజ... ఎవరో ఓ వ్యక్తి తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో డికారా భయాందోళనకు గురయ్యాడు. దొంగ నుంచి కాపాడుకోవాడానికి కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే నిద్ర మత్తులో ఉన్న డికారా తన దగ్గర ఉన్న 357-క్యాలిబర్ రివాల్వర్‌తో నిజంగానే కాల్చాడు. అయితే అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. దెబ్బకు అతని నిద్రంతా ఎగరిపోయింది. బుల్లెట్ కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. గాయం కారణంగా విలవిల్లాడుతూ.. గట్టి అరవడం మొదలుపెట్టాడు. మరో వైపు రివాల్వర్ పేలిన శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడం.. ఆ నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించుకున్నారు. ఆ ప్రాంతంలో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్ఆర్మ్ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ కార్డు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల కిందటే అతని ఐడెంటిఫికేషన్ డికార కార్డు రద్దయ్యింది. అయినా అతను రివాల్వర్‌ను వాడుతుండడంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం నేరాల కింద పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. చదవండి: ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి! -
తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!
చిక్కడపల్లి (హైదరాబాద్): వైమానిక దళంలో పనిచేసి రిటైరయ్యాక, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న టి.శివారెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన భార్యతో విభేదాల నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి (44) గతంలో వైమానిక దళంలో పనిచేసి, రిటైరయ్యారు. కొంతకాలం నుంచి బాగ్‌లింగంపల్లిలోని మానస ఎన్‌క్లేవ్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. భార్య రమాదేవితో విభేదాల నేపథ్యంలో 2017లోనే విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి.. శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో బాగ్‌లింగంపల్లి నివాసానికి వచ్చారు. ఆయన సోదరి మహేశ్వరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పలుమార్లు శివారెడ్డికి ఫోన్ చేశారు. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. కవాడిగూడకు చెందిన తన స్నేహితురాలు లక్ష్మీభవానికి ఫోన్ చేసి, తన సోదరుడికి ఇంటికి వెళ్లాలని కోరారు. లక్ష్మీభవాని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన తల్లితో కలసి శివారెడ్డి నివాసం వద్దకు వచ్చారు. తలుపు లోపలికి గడియ పెట్టి ఉండటంతో ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన రాలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి.. వాచ్‌మన్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని, మంచంపై పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్‌కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే శివారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెప్తున్నారు. వీటికితోడు భార్యతో గొడవలతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ -
తలకు తుపాకీ గురి పెట్టి మరీ.. బలవంతంగా పెళ్లి చేశారు
పట్నా: ఇంట్లో పండగ చేసుకోబోతున్నారు.. అందుకని బంధువులను ఆహ్వానించడం కోసం పొరుగురికి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ అతడికి అనుకోని వింత అనుభవం ఎదురయ్యింది. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిని బంధించి.. తలకు తుపాకీ గురి పెట్టి బెదిరించి.. ఏకంగా పెళ్లి చేశారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే.. బాధితుడిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ వివరాలు.. (చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..) బిహార్ నలంద జిల్లా, ధనుకి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ఛథ్ పండుగకు రమ్మని ఆహ్వానించడం కోసం నవంబర్ 11న వదిన వాళ్ల ఊరికి వెళ్లాడు. వారిని కలిసి.. పండుగకు రావాల్సిందిగా ఆహ్వానించి.. ఇంటికి తిరిగి బయలు దేరాడు. అలా వస్తుండగా.. మార్గమధ్యంలో ఆయుధాలు ధరించి ఉన్న కొందరు వ్యక్తులు నితీష్‌ను కిడ్నాప్ చేశారు. సరాసరి పెళ్లి మంటపానికి తీసుకెళ్లి.. అతడిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. ఈ క్రమంలో నితీష్ అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. అతడిని కొట్టారు. అంతటితో ఆగక తుపాకీతో నితీష్ తలకు గురిపెట్టి.. బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారు. (చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’) ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న నితీష్.. జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య -
అవినీతి తుపా‘కీ’ ఎక్కడ
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి: అవినీతి తుపాకీ లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చిన బాధ్యులను గుర్తించేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే నిఘా వర్గాలు 15 పేజీల నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్టు తెలిసింది. పాత్రధారులు ఎవరు, ఏ రీతిన వారు అవకతవకలకు పాల్పడ్డారనే దానిపై ప్రాథమిక సమాచారం నివేదించారు. ఏసీబీ కూడా లోతైన విచారణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు విజయవాడ ఏసీబీ డీజీ రామాంజనేయులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ విచారణను పర్యవేక్షించనున్నారు. శరత్‌బాబు అనే డీఎస్పీ విచారణాధికారిగా నియమితులయ్యారు. ఇద్దరు ఇనస్పెక్టర్లు, నలుగురు సబ్ ఇనస్పెక్టర్లు ఈ బృందంలో ఉంటారు. సీరియస్‌గా పరిగణన డీజీ స్థాయిలో ఈ వ్యవహారాన్ని ప్రాధాన్య అంశంగా భావించి పారదర్శకంగా విచారణ జరపనున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలుండాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. వేలం నిర్వహించకుండా కాగితాల్లో జరిపినట్లు చూపించారనే విషయం ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వివిధ రకాల 582 తుపాకులకు వేలం పెట్టే ముందు నిబంధనల ప్రకారం ఎక్కడో ఒకచోట బహిరంగంగా ప్రదర్శించాలి. ఈ ప్రక్రియ ఎక్కడా నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే పలువురి సొంతమైన తుపాకులను తిరిగి స్వాధీనం చేసుకుని ఆర్మ్డ్ రిజర్వులో భద్రపరిచారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ధ్రువీకరించారు. వేలం నిర్వహించినట్టు చెబుతున్న ప్రక్రియతో పాటు తుపాకీ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న తమకు తెలియకుండా తుపాకులను వేలం వేసేశారని వచ్చిన ఫిర్యాదులపై కూడా ఏసీబీ దృష్టి కేంద్రీకరించనుంది. మొత్తం 582 తుపాకుల్లో విలువైన వాటిని బినామీ పేర్లతో రూ.20 వేలు, రూ.30 వేలకు సొంతం చేసుకున్న పోలీసు అధికారుల చిట్టాను నిఘా వర్గాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించినట్టు భోగట్టా. -
World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే!
ఫొటోలో ఒక పెద్దమనిషి అరచేతిలో ఇమిడిపోయిన బుల్లి రివాల్వర్ చూశారు కదూ! ఇది పిల్లలు ఆడుకునే టాయ్ రివాల్వర్ కాదు, ట్రిగ్గర్ నొక్కితే తూటాలను వెదజల్లే సిసలైన రివాల్వర్. దీని పనితనం పిట్ట కొంచెం కూత ఘనం అనే స్థాయిలో ఉంటుంది. చూడటానికి మోర్టార్ తూటా సైజులో ఉండే ఈ రివాల్వర్‌లో కూడా సాధారణ రివాల్వర్ మాదిరిగానే ఆరు తూటాలు పడతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఈ మినీ గన్ను రూపొందించి, ఇటీవల గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ రివాల్వర్ పొడవు 5.5 సెం.మీ., ఎత్తు 3.5 సెం.మీ. దీని బరువు 19.8 గ్రాములు. దీని ఖరీదు మాత్రం సాధారణ రివాల్వర్ల కంటే చాలా ఎక్కువే. ఎంతంటే, 6,300 స్విస్ ఫ్రాంకులు (రూ.5.14 లక్షలు). దీనిని కొంటే, దీనితో పాటు ఒక లెదర్ కేసు, 24 తూటాలు ఉచితంగా దొరుకుతాయి. అయితే, దీనిని దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు నిషేధించాయి. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: సర్వీస్ రివాల్వర్‌తో సబ్ ఇన్స్పెక్టర్ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. స్టేషన్ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు 2017లో ఎస్సైగా రాహూల్ సింగ్ (31) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్ ఆవరణలోనే తన సర్వీస్ రివాల్వర్‌ను తీసుకుని రాహుల్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్‌కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆరోపించింది. స్టేషన్ అధికారి (సీఐ) ఒత్తిడితో తన భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది. చదవండి: కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
జూబ్లీహిల్స్: గన్‌తో ఎంపీ బంధువు హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగర వీధుల్లో గన్‌తో హల్చల్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో తమ దగ్గరున్న గన్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సూరపనేని చైతన్య రామ్, బోడె వెంకట్ అనే ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నించి తుపాకీతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. (మాజీ క్రికెటర్ హత్య.. కొడుకే హంతకుడు) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలనీలో మద్యం సేవించిన నిందితులు ఎంపీ స్టిక్కరింగ్ గల స్కార్పియో వాహనంలో కూకట్‌పల్లికి బయల్దేరారు. మార్గమధ్యలో మస్తాన్ నగర్లో పలు ద్విచక్రవాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లారు. అడ్డగించిన వారిని తుపాకీతో బెదిరింపులకు దిగారు. పలు చోట్ల స్థానికులతో వాగ్వాదానికి దిగి గన్‌తో బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఉపయోగించిన గన్ నకిలీదని, సినిమా షూటింగ్లలో ఉపయోగించేదని పోలీసులు తేల్చారు. అనధికారిక సమాచారం ప్రకారం నిందితుల్లో ఒకరైన చైతన్య రామ్ ఓ ఎంపీ, ఎమ్మెల్యేకు సమీప బంధువని తెలుస్తోంది. అయితే ఆ ఎంపీ, ఎమ్మెల్యే వివరాలు ఇంకా బయటకి రాలేదు. (అమ్మ కన్నా నానమ్మే ఎక్కువైందని..) -
మహిళలకు స్పెషల్ రివాల్వర్: విశేష ఆదరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ప్రతీ క్షణమూ ఏదో ఒక మూల మహిళలు, బాలికలపై అత్యాచారాల ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. నెలల పసిపాపనుంచి పండు ముదుసలి వరకూ మృగాళ్ల అకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం పెప్పర్ స్ప్రేలు, పాకెట్ నైఫ్లకు తోడుగా తేలికైన రివాల్వర్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఏడేళ్ల క్రితం దేశాన్ని కదిలించిన ఢిల్లీ నిర్భయ ఉదంతం తరువాత మళ్లీ అలాంటి దారుణాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్‌పోలో ‘నిర్భీక్’ అనే తుపాకిని ప్రదర్శించింది. నిర్భీక్ రివాల్వర్ ప్రధానంగా మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి చెప్పినట్టు తెలిపింది. బలమైన, ఆత్మరక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ఫ్యాక్టరీ బోర్డు ప్రతినిధి తెలిపారు. అంతేకాదు చాలా సులువుగా దీన్ని మహిళల తమ పర్సుల్లో తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. మొదటి ఐదేళ్ళలో ఉత్తరప్రదేశ్, హర్యానాలలో 2,500 రివాల్వర్లను విక్రయించినట్టు వెల్లడించింది. దీని ధర కొంచెం ఖరీదైనప్పటికీ భారీ విక్రయాలను నమోదు చేయడం విశేషం. సాధారణ రివాల్వర్ ధర రూ. ఒక లక్ష రూపాయలతో పోలిస్తే నిర్భీక్ రూ.1.20 లక్షలకు అందుబాటులోకి తెచ్చింది. 2014లో 750 గ్రాములతో లాంచ్ చేసిన దీని బరువులో మరిన్ని మార్పులు చేసి ప్రస్తుతం 500 గ్రాములకు తీసుకొచ్చింది. అయితే తాజాగా జీఎస్టీ పెరగడంతో రూ. 1.40 లక్షల ధరతో నిర్బీక్ను తాజాగా విడుదల చేశారు. నిర్భీక్ 10 మీటర్ల లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలదని కంపెనీ చెబుతోంది. టైటానియం అల్లాయ్ మెటల్‌తో తయారు చేసిన ఈ నిర్భీక్ తుపాకీ తుప్పు పట్టదు, మెయింటెనెన్స్ కూడా చాలా సులభం. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. రివాల్వర్‌తో బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులో కాల్పుల కలకలం రేగింది. భూతగాద విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగటంతో ఓ వర్గం వారు రివాల్వర్‌తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమాజిగూడాకు చెందిన మహమ్మద్ అల్తాఫ్ బహుదుర్గూడాలోని దండమెండి బయోటెక్‌కు చెందిన 110ఎకరాల స్థలం వద్ద సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం సయ్యద్ రఫీ ఇషాక్.. సమీర్ హసీమ్, నుస్రత్ పటేల్, అసీఫ్ మోఈజ్, జంగయ్య రాజు అనే వ్యక్తులతో కలిసి 110 ఎకరాల భూమిలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా రివాల్వర్‌తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో సూపర్ వైజర్ అల్తాఫ్ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సయ్యద్ రఫీ ఇషాక్‌పై గతంలోనూ పలుకేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
బెజవాడలో రివాల్వర్ కలకలం
సాక్షి, విజయవాడ : బెజవాడలో రివాల్వర్ కలకలం రేపింది. సోమవారం రమేష్ అనే వ్యక్తి దగ్గర రివాల్వర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ఓ కాంట్రాక్టర్ వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతని వద్దకు రివాల్వర్ ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
భూమి నుంచివెళ్లకపోతే కాల్చేస్తా
మహేశ్వరం రంగారెడ్డి : మర్యాదగా భూమి కబ్జా విడిచి వెళ్లకపోతే గన్‌తో కాల్చేస్తానని రైతులను ఓ వ్యాపారి రివాల్వర్‌తో బెదిరించాడు. దీంతో రైతులు తిరగబడి ఆ వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం మోహబ్బత్‌నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో సుమారు 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోహబ్బత్‌నగర్ గ్రామానికి చెందిన వరాత్యవత్ రాజునాయక్, గోల్కొండ అంజయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని 1975లో పట్టాదారు రాంబాయమ్మ, యాదగిరమ్మలు ఇనాంగా రైతులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారస్తులు అలోబి రామ్‌కుమార్ తివారీ, అలోబి శంకర్ తివారీ, అలోబి శివకుమార్ తివారీ, సంతోష్ తివారీ, మాజీ పట్వారీ వంగ వెంకట్‌రెడ్డిలు కలిసి శుక్రవారం ఆ భూమి వద్దకు వెళ్లి ఈ భూమి తమదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే మర్యాద ఉండదని రైతులను హెచ్చరించారు. రైతులు వ్యాపారుల మాటలకు బెదరకపోవడంతో రామ్‌కుమార్ తీవారీ వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసి కాల్చేస్తానని రైతులు శ్రీశైలం, అంజయ్యలను బెదిరించాడు. భయపడిపోయిన ఇతర రైతులు రామ్‌కుమార్ చేతిపై కొట్టడంతో రివాల్వర్ కింద పడిపోయింది. రైతులు వ్యాపారస్తులను చితకబాది, వారి వాహనాలను ధ్వంసం చేశారు. రివాల్వర్‌ను రైతులు తీసుకుని మహేశ్వరం పోలీసులకు అప్పగించారు. మహేశ్వరం సీఐ సునీల్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఇరువురిని విచారించారు. అక్కడ రివ్వాలర్‌తో కాల్పులు జరపలేదని ఏసీపీ తెలిపారు. ఈ భూమిపై కేసు కోర్టులో ఉందని, ఇరువురు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారని, ఇరువురి నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రివాల్వర్ ఎక్కుపెట్టలేదు మోహబ్బత్‌నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో ఉన్న 57 ఎకరాలు మా పట్టా భూమి. అప్పట్లో రాంబాయమ్మ, యాదగిరమ్మల నుంచి కొనుగోలు చేశాం. కొంత మంది రైతులు అక్రమంగా చొరబడి కబ్జా చేయడానికి యత్నిస్తుండగా వారిని అడ్డుకోబోయాం. మా పట్టా భూమి నుంచి వెంటనే ఖాళీ చేయాలని కోరాం. రైతులు వాగ్వాదానికి దిగి కర్రలతో దాడిచేసి గాయపరిచారు. నా లైసెన్స్ రివాల్వర్‌ను బ్యాగులో పెట్టుకున్నాను. ఎవరిపైనా కాల్చడానికి యత్నించలేదు. నా డబ్బులు, రివాల్వర్ లాక్కున్నారు. గన్ ఎక్కుపెట్టానని అసత్య ప్రచారం చేస్తున్నారు. మాపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – రామ్‌కుమార్ తివారి పొలం విడిచి వెళ్లిపోవాలని రివాల్వర్‌తో బెదిరించారు.. తమ భూమి వద్దకు వచ్చి కబ్జా విడిచి వెళ్లిపోవాలని రామ్‌కుమార్ తివారీ, అతని సోదరులు రివాల్వర్‌తో బెదిరించారు. తమతో పెట్టుకుంటే ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. రామ్‌కుమార్ వద్ద ఉన్న రివాల్వర్ నాపై ఎక్కుపెట్టాడు. వెంటనే మా కుటుంబ సభ్యులు, ఇతర రైతులు దాడిచేసి రివాల్వర్‌ను లాక్కొన్నారు. తివారీలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా భూమిలోకి వచ్చి వెళ్లిపొమన్నడానికి వారు ఎవరు. భూమి మాదేనని న్యాయస్థానం మాకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. – గోల్కొండ శ్రీశైలం, రైతు, మోహబ్బత్‌నగర్ -
దొరికింది.. ఎత్తుకెళ్లాడు
రాంగోపాల్‌పేట్: కారులో ఉంచిన లైసెన్స్డ్ రివాల్వర్‌ను దొంగిలించిన బాలుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ రాధాకిషన్‌రావు వివరాలు వెల్లడించారు. మొఘల్‌పుర సుల్తాన్‌షాహికి చెందిన 4 టీవీ రిపోర్టర్ మహ్మద్ నమాన్ ఒమర్ 2016లో లైసెన్సుడ్ రివాల్వర్ తీసుకున్నాడు. గత డిసెంబర్ 24న అతను తన స్నేహితుడితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి తిరిగి వస్తూ భోజనం చేసేందుకు మాసబ్‌ట్యాంక్‌లోని ఓ హోటల్ వద్ద కారు ఆపాడు. అందులో లైసెన్సు డు రివాల్వర్‌ను ఉంచాడు. మెహిదీపట్నం సంతో ష్నగర్కు చెందిన బాలుడు (16) కారులో విలువైన వస్తువుల కోసం గాలించగా అందులో రివాల్వర్ కనిపించ డంతో ఎత్తుకెళ్లాడు. భోజనం ముగించుకుని వచ్చిన ఒమర్ కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారులో రివాల్వర్ కనిపించకపోవడంతో చోరీకి గురయినట్లు గుర్తించాడు. మరుసటి రోజు ఉదయం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కారు నిలిపిన స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తుతెలియని బాలుడు దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీ ప్రాంతంలోని అతడికి ఇంటికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనున్న రివాల్వర్‌తో పాటు 6 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బాలుడిని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. అనంతరం జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో సైఫాబాద్ డీఐ నరహరి, టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు తిమ్మప్ప, వినోద్, కాంతారెడ్డి పాల్గొన్నారు. లైసెన్స్దారుడిపై కేసు రివాల్వర్ తీసుకున్న ఒమర్‌పై కూడా కేసు నమోదు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. రివాల్వర్ తీసుకున్న వ్యక్తులు బయటికి వెళితే దానిని తమ కస్టడీలోనే ఉంచుకోవాలని అలా కాకుండా నిర్లక్ష్యంగా కారులో ఉంచి దానికి కనీసం తాళం కూడా వేయకుండా వెళ్లాడన్నారు. ఆర్మ్స్యాక్ట్ ప్రకారం అతనిపై చర్యలు తీసుకుని లైసెన్సును రద్దు చేయనున్నట్లు తెలిపారు. గన్ లైసెన్సు పొందిన వ్యక్తులు పోలీసులు సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని ఆయన పేర్కొన్నారు. -
ఒకే తరహాలో ముగ్గురి హత్య..
సాక్షి, బనశంకరి: సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, మానవ హక్కుల పోరాటయోధుడు గోవింద్పన్సారే హత్యకు వినియోగించిన రివాల్వర్‌నే గౌరీలంకేశ్ హత్యకు వినియోగించినట్లు ల్యాబొరేటరీ పరిశోధనల్లో రుజువైంది. కలుబురిగి, పన్సారే హత్యకు స్వదేశంలో తయారైన 7.65 ఎంఎం.రివాల్వర్ ద్వారా కాల్పులు జరిపి హత్యకు పాల్పడ్డారు. బెంగళూరు రాజరాజేశ్వరినగరలో తన ఇంటి వద్ద గౌరీని కూడా అదే రివాల్వర్‌కు బలయ్యారు. ముగ్గురు ఒకే తరహాలో హత్యకు గురికావడంతో హంతకులు ఒకే సంస్థకు చెందిన వారు కావొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న రాజరాజేశ్వరి నగరలో గౌరి హత్యకు గురయ్యారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బుల్లెట్లను హైదరాబాద్, బెంగళూరుల్లోని ల్యాబ్‌కు పంపించారు. నివేదికలో గతంలో సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, గోవింద్పన్సారేపై కాల్పులు జరిపిన రివాల్వర్తోనే గౌరిపై కూడా కాల్పులు జరిపినట్లు పరిశోధనలో తేలింది. -
ఆత్మహత్య కోసం రివాల్వర్ చోరీ
యలహంక (బెంగళూరు): ఓ వైపు వృద్ధాప్యం, మరో వైపు కుంగదీస్తున్న అనారోగ్యం అతన్ని చోరీల బాట పట్టించింది. వైద్య ఖర్చుల కోసం నగదు, ఒకవేళ రోగం నయం కాకపోతే ఆత్మహత్య చేసుకునేందుకు రివాల్వర్‌ను తస్కరించాడు. అయితే తప్పు తెలుసుకున్న ఆయన పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో బుధవారం వెలుగు చూసింది. వివరాలు..కేరళకు చెందిన రాయర్ (63) పొట్టకూటి కోసం బెంగళూరు చేరుకున్నాడు. యలహంకలోని అగ్రగామి ప్రైవేటు స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటిలో పనిమనిషిగా చేరాడు. ఇటీవల కడుపు నొప్పిరావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో యజమాని ఇంట్లో నాలుగు రోజుల క్రితం రూ.1.5లక్షల నగదు, ఒక రివాల్వర్ తస్కరించాడు. ఈ విషయం యజమానికూడా గుర్తించలేకపోయాడు. అయితే సదరు వృద్ధుడు ఏమనుకున్నాడో ఏమోకాని..బుధవారం యలహంక పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు. తాను తన యజమాని ఇంట్లో చోరీ చేశానని చెప్పి రివాల్వర్ పోలీసులకు అప్పగించి లొంగిపోయాడు. రూ.1.50లక్షల నగదు వైద్యం కోసం ఖర్చు అయినట్లు వివరించాడు. రివాల్వర్ ఎందుకు చోరీ చేశావని పోలీసులు ప్రశ్నించగా...అనారోగ్యం నుంచి తాను కోలుకోలేని పక్షంలో ఆత్మహత్య చేసుకునేందుకు అని పేర్కొనడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
స్నేహితుల ముందు గొప్పల కోసం..
-
గన్@ బర్త్‌డే
ఏడాదిలో ఫలక్‌నుమాలో రెండో ఘటన చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది బరాత్‌లో గుర్రంపై పెళ్లి కొడుకు జరిపిన కాల్పుల ఘటన మరువకముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. జన్మదిన వేడుకల్లో ఓ యువకుడు రివాల్వర్‌తో 12 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జహనుమా కాలనీకి చెందిన ప్రోగ్రెస్ పాఠశాల యజమాని మీర్జా మహ్మద్ అలీ బేగ్ కుమారుడు మీర్జా ఇబ్రహీం అలీ బేగ్(22) డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 5న అతను తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల సమక్షంలో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా స్నేహితుల ముందు గొప్పలు చాటుకోవాలనే ఉద్దేశంతో రివాల్వర్‌తో గాల్లోకి 12 రౌండ్లు కాల్పులు జరపడమేగాక వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. గత పది రోజులుగా ఈ వీడియో వైరల్‌గా మారి సోమవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ పులి యాదగిరి వీడియోను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదనపు డీసీపీ కె.బాబురావు, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్‌లకు సమాచారం అందించాడు దీంతో వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. ఆరŠమ్స్ యాక్ట్ 26,27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇబ్రహీం తండ్రి మహ్మద్ అలీ బేగ్, సోదరుడు ముస్తఫా అలీ బేగ్‌ల పేరున లైసెన్స్డ్ రివాల్వర్, ఫిస్టోల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతి ఆత్మహత్యాయత్నం
కర్నూలు: రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వద్ద గన్‌మన్‌గా పని చేస్తున్న ఐసయ్య కూతురు సుచరిత (26) తండ్రి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేసిం ది. ఐసయ్య మాజీ సైనికుడు. కర్నూ లులోని బాలాజీ నగర్లో నివాసం ఉంటూ టీజీ వెంకటేష్ గన్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇతని పెద్ద కూతురు సుచరిత ఎమ్మెసీ బీఈడీ వరకు చదు వుకుంది. ఇటీవల పంచాయతీ కార్య దర్శిపరీక్ష రాసింది. ఇందులో మార్కు లు తక్కువగా వస్తాయని బెంగ పెట్టు కుంది. దీంతో శుక్రవారం మధ్యా హ్నం తండ్రి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుంది. తండ్రి ఐసయ్య వెంటనే కూతురును ప్రభుత్వ ఆస్పత్రికి తర లించి, ప్రాథమిక చికిత్స చేయిం చారు. మెరుగైన వైద్యం కోసం గౌరి గోపాల్ ఆస్పత్రికి తరలించగా.. ఆమె తలకు శస్త్ర చికిత్స చేశారు. కొంత కాలంగా తన కూతురు తలనొప్పితో బాధపడుతుండేదని, ఆ బాధ భరించ లేకనే కాల్చుకొని ఉండొచ్చని తండ్రి ఐసయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రివాల్వర్ అప్పగించిన టీడీపీ నేత
-
రివాల్వర్ అప్పగించిన టీడీపీ నేత
గుడివాడ: స్థానిక ఆఫీసర్స్ క్లబ్ సమీపంలో రివాల్వర్‌తో హల్ చేసిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు ఎట్టకేలకు తన రివాల్వర్‌ను పోలీసులకు అప్పగించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన రివాల్వర్‌ను సరెండర్ చేశారు. రివాల్వర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినట్లు రావి వెంకటేశ్వరరావు చెబుతుండగా, రెన్యువల్ అయినట్లుగా డీఎస్పీ కార్యాలయం, వన్ టౌన్ పీఎస్‌కు సమాచారం అందలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నిన్న మధ్యాహ్నం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌కు వచ్చిన రావి వెంకటేశ్వరరావు క్లబ్ బయట అటుఇటు తిరుగుతూ.. తన వద్దనున్న రివాల్వర్‌ను బయటకు తీసి చూపారు. అంతేకాకాకుండా ఆ వెంటనే రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పేలుడు శబ్దానికి పరిసర ప్రాంతాలవారు ఏం జరుగుతుందోనన్న భయంతో పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను నిర్ధారించారు. అయితే అధికార పార్టీ నేత కావడంతో.. షరా మామూలుగానే ఈ ఘటనను దాచిపెట్టేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనిపై గుడివాడ వన్‌టౌన్ సీఐ దుర్గారావును ‘సాక్షి’ వివరణ కోరగా తమకు న్యూస్చానళ్లలో చూస్తే తెలిసిందని, ఫిర్యాదులేవీ రాలేదని చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని, రావి వెంకటేశ్వరరావు వద్ద ఉన్న రివాల్వర్‌ను పరిశీలించి సంఘటన జరిగి ఉంటే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆయుధాల చట్టం ఏం చెబుతోందంటే... వ్యక్తిగత లైసెన్స్ ఆయుధం ఉన్నవారు ప్రాణరక్షణకు మినహా మిగిలిన సమయాల్లో తన వద్దనున్న రివాల్వర్‌ను వాడకూడదు. సెక్షన్–6 సీఈ ప్రకారం ఆయుధాన్ని అవసరం లేకుండా వాడితే సంబంధిత వ్యక్తిపై కేసులు నమోదు చేయాలి. -
మాజీ ఎంపీ రివాల్వర్ చోరీ
హైదరాబాద్: కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ ఎంపీ కేపీ.రెడ్డయ్య యాదవ్ రివాల్వర్‌ను దుండగులు చోరీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనగర్‌కాలనీ సమీపంలో ఉన్న శాలివాహన నగర్లో నివసించే కేపి.రెడ్డయ్య యాదవ్ గత నెల 5వ తేదీన ఫిలింనగర్లో జరిగిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కుమారుడి పెళ్ళికి వెళ్లారు. ఆ కార్యక్రమానికి హాజరై రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈ నెల 2వ తేదీన డిశ్చార్జి అయ్యారు. అదే రోజు రివాల్వర్ కోసం గాలించగా కనిపించలేదు. ప్రమాదం జరిగిన రోజున అక్కడే పడిపోయి ఉంటుందా.? లేదా చోరీకి గురైందా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో తన రివాల్వర్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
పేట్ బషీరాబాద్ ప్రాంతంలో ఘటన హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. పేట్‌బషీరాబాద్ బాపూనగర్‌కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాజ్‌పేరుు నగర్‌కు చెందిన తేజ గత 3 నెలల నుంచి ఓ స్థల వివాదంలో నాగేందర్ రెడ్డితో వాగ్యుద్ధానికి దిగసాగాడు. ఈ క్రమంలోనే తేజ బుధవారం రాత్రి 10.45 గంటలకు బాపూనగర్‌లోని నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి, రివాల్వర్‌ను ఆయన తలపై గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో నాగేందర్‌రెడ్డికి వెన్నులో బుల్లెట్ దిగింది. రెండో బుల్లెట్ మిస్‌ఫైర్ అరుుంది. నాగేందర్‌రెడ్డి అరవడంతో స్థానికులు తేజను పట్టుకొని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నాగేందర్‌రెడ్డి అపస్మారక స్థితికి చేరడంతో దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు తేజను అదుపులోకి తీసుకుని కాల్పుల ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. -
‘చంద్రబాబు వియ్యంకుడిలా రివాల్వర్ వాడను’
జగ్గంపేట: తనపై, అనుచరులపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రిలో సమావేశం పెట్టుకుంటే అడ్డంకులు సృష్టించారన్నారు. సమావేశానికి మండపం ఇచ్చినందుకు తన వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారన్నారు. తన వియ్యంకుడిని నిన్న రివాల్వర్‌ను అప్పగించమని పోలీసులు కోరారని, అయితే ఆయన రివాల్వర్‌కు, తనకు సంబంధమేమిటని ముద్రగడ ప్రశ్నించారు. ‘రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ. నేనేమీ ఆయనలా రివాల్వర్ వాడను’ అన్నారు. ఆయన భార్య రివాల్వర్‌ను కూడా బాలకృష్ణ వాడారన్నారు. తాను ఆస్పత్రి అనే జైలులో 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవహక్కులు లేవని ముద్రగడ వ్యాఖ్యానించారు. -
వాడే వీడా?
పట్టుకోండి చూద్దాం చరిత్ర అధ్యాపకుడిగా రిటైరయ్యాడు పరంధామయ్య. చరిత్ర అధ్యాపకుడు అయినప్పటికీ మొదటి నుంచి ఆయన ఆసక్తి మొక్కల మీదే. ప్రతి మొక్కలోనూ ఔషధగుణం ఉంటుందని చెప్పే పరంధామయ్య... ఆ గుణాలను పదిమందికీ తెలియజేయడానికి మొక్కలపై రకరకాల పరిశోధనలు చేసేవాడు. తమకు అందుబాటులో ఉన్న మొక్కల ఔషధ విలువను ప్రజలకు చేరువచేస్తే... వైద్యం పేరుతో చేసే లక్షల ఖర్చు తగ్గుతుందని చెప్పేవాడు. ఆయన చెప్పింది కొందరికి ‘చాలా నిజం’ అనిపించేది. కొందరికి మాత్రం చాదస్తం అనిపించేది. రిటైరైన తరువాత బోలెడు తీరిక దొరకడంతో పరంధామయ్య ఊరూరు తిరుగుతూ మొక్కలపై పరిశోధనలు చేసేవాడు. ఈ క్రమంలో ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది పరిచయం అయ్యారు. వాళ్లలో కొందరు తరచుగా పరంధామయ్య ఇంటికి వచ్చేవారు. కొన్ని రోజుల పాటు ఉండి తిరిగి వెళ్లేవారు. వనాల్లో తిరిగే అలవాటు ఉన్న పరంధామయ్య దగ్గర ఎప్పుడూ ఒక మినీ టేప్ రికార్డర్ ఉండేది. దీనిలో పక్షుల కూతలు, జంతువుల అరుపులను రికార్డ్ చేయడం ఆయనకు సరదాగా ఉండేది. కొందరు పరంధామయ్య దగ్గర డబ్బు గుంజడానికి మొక్కల మీద ఆసక్తి ఉన్నట్లు నటించేవాళ్లు. వారు ఏ ఉద్దేశంతో ఇంటికి వచ్చినా ఆతిథ్య మర్యాదలు మాత్రం ఘనంగా చేసేవాడు. ‘‘ఈయనకు పెళ్లి కాలేదు. వారసులంటూ ఎవరూ లేరు. ఉన్న ఆస్తిని హాయిగా అనుభవించకుండా ఈ మొక్కల పిచ్చి ఏమిటో!’’ అని పరంధామయ్య గురించి చాటుమాటుగా అనేకునేవారు జనాలు. ‘‘ఎవరెవరో మీ ఇంటికి వస్తున్నారు. అందులో దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని సన్నిహితులెవరైనా సలహా ఇస్తే... ‘‘వాళ్లు పరాయిగ్రహం నుంచి వచ్చారా ఏమిటి?’’ అనేవాడు తప్ప ఎవరినీ అనుమానించేవాడు కాదు పరంధామయ్య. రెండు మూడు వారాల పాటు పరంధామయ్య ఊళ్లో కనిపించలేదు. ‘ఎటు వెళ్లాడు?’ అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే...పరిశోధన పేరుతో పరంధామయ్య ఊళ్లు తిరిగే విషయం అందరికీ తెలుసు కాబట్టి. ఒకరోజు... ‘పరంధామయ్య ఆత్మహత్య చేసుకున్నాడట’ అంటూ జనాలు పరంధామయ్య విశాలమైన ఇంటివైపు పరుగులు తీస్తున్నారు. ఆయన ఆత్మహత్యపై భిన్నమైన కథనాలు వినిపించాయి. ‘పరిశోధనలో పడి ఆయనకు మతి చలించింది. అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడు’ అనుకున్నారు ఎక్కువ మంది. పోలీసులు సంఘటనస్థలికి చేరుకున్నారు. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు పరంధామయ్య. కుడివైపు కణతకు బుల్లెట్ గాయం. ఎదురుగా ఉన్న బల్లపై మినీ టేప్ రికార్డర్. ‘నా చావుకు నేనే కారణం’ అనే మాట తరువాత...రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది. ‘‘పరంధామయ్యది ఆత్మహత్య కాదు... హత్య’’ అని తేల్చేశాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ఒక నెల క్రితం... పరంధామయ్య ఇంటికి ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు. అతడు చూడడానికి అచ్చం రౌడీలా ఉన్నాడు అని ఊరివాళ్లు చెప్పారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి నిజం కక్కించాడు ఇన్స్పెక్టర్ నరసింహ. చంపింది తానే అని ఒప్పుకున్నాడు ఆ రౌడీ. ఇప్పుడు చెప్పండి. టేప్ రికార్డర్లో ‘నా చావుకు నేనే కారణం’ అని పరంధామయ్య గొంతు, ఆ తరువాత రివాల్వర్ పేల్చిన శబ్దం వినిపించినా ‘ఇది ఆత్మహత్య కాదు హత్య’ అని ఇన్స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు? రెండు ఆధారాలు: 1.‘నా చావుకు నేనే కారణం’ (రివాల్వర్ శబ్దం కూడా) అని వినిపించిన తరువాత...టేప్ ఆపేశారు. పరంధామయ్య తనను తాను కాల్చుకొని ఉంటే ఇలా చేయడం కుదరదు. 2. ఒక పక్క పడి ఉన్న రివాల్వర్‌పై ఎవరి వేలి ముద్రలు కనిపించలేదు. పరంధామయ్య ఆత్మహత్య చేసుకొని ఉంటే కచ్చితంగా ఆయన వేలిముద్రలు కనిపించేవి కదా! -
ఎమ్మెల్యే ఆది అనుచరుల వీరంగం
కడప అర్బన్: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు మంగళవారం రాత్రి కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణలో ఓ వ్యక్తిని రివాల్వర్‌తో బెదిరించి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా బాధితుడిని భయబ్రాంతులకు గురిచేసి హత్యాయత్నం కూడా చేశారు. ఈ సంఘటనపై బాధితుడు రేకం నారాయణ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాను ఓ వ్యక్తికి రూ.14 లక్షలు అప్పుగా ఉన్న విషయం వాస్తవమేనని, తన అవసరానికి తీసుకుని నెలనెలా వడ్డీ చెల్లిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. తాను రామాపురం మండలం కొత్తపల్లెకి చెందిన వాడినని, కొన్నేళ్లుగా కడపలోని చెమ్ముమియాపేటలో ఉంటున్నానని తెలిపారు. మంగళవారం తాను రామాపురంలోని శ్రీమన్నానారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యాసంస్థల వద్ద ఉంటే కొందరు వచ్చి తనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కడపకు తీసుకు వచ్చారని తెలిపారు. దారి పొడవునా ఇష్టమొచ్చినట్లు కొట్టారని, రివాల్వర్‌ను మెడపై పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనంలో తనను తీసుకొచ్చిన తర్వాత నగరంలోని హరిత హోటల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వద్దకు తీసుకొచ్చి వదిలేశారని తెలిపారు. హరితలో ఎమ్మెల్యే ఆది అనుచరుల హల్చల్ కడపలోని హరిత హోటల్ ఆవరణంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు బహిరంగంగా రేకం నారాయణను ఇష్టమొచ్చినట్లు తిడుతూ కొట్టే ప్రయత్నం చేసినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నారాయణను ఎవరో బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారని బంధువులు రామాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కడపకు తీసుకొచ్చారని తెలుసుకుని సంఘటనా స్థలానికి రామాపురం ఎస్ఐ జీవన్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏం చేస్తారోనని రేకం నారాయణ, అతని బంధువులు భయంభయంగా బిక్కుబిక్కుమంటూ హరిత హోటల్ ఆవరణంలో గడిపారు. దాదాపు గంటపాటు వారి మధ్య తర్జనభర్జనలు జరిగాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. వారిని చూసిన ఎమ్మెల్యే, అతని అనుచరులు హడావుడిగా హోటల్ లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఎస్ఐ జీవన్‌రెడ్డి రేకం నారాయణను తన వెంట ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న హరిత హోటల్ ఆవరణంలోనే జరగడం గమనార్హం. కాగా ఈ ఘటనపై కాల్‌మనీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని పోలీసులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.