Shireesha Challapalli
-
గాజులంటే మోజు
అస్మితా సూద్... మోడల్ నుంచి నటిగా మారిన అమ్మాయి. దాదాపు 40 బ్రాండ్స్‌కి మోడల్‌గా చేసిన ఈ సిమ్లా యాపిల్... కామర్స్‌లో గ్రాడ్యుయేట్ కూడా. తెరపైన హాట్‌గా కనిపించినా... నేను చాలా సాఫ్ట్ అంటోందీ క్యూట్ గాళ్. సాధించాల్సిందెంతో ఉందంటున్న ఈ ముద్దుగుమ్మ... సిటీ గురించి చెబుతున్న ముచ్చట్లు. - శిరీష చల్లపల్లి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే కథక్ నేర్చున్నాను. బయట ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేదాన్ని. ఆ టైమ్‌లోనే నాకు క్లాస్మేట్స్ నుంచి ఫ్యాకల్టీనుంచి తెగ కాంప్లిమెంట్స్ వచ్చేవి. అంతే... మా పేరెంట్స్ కూడా నన్ను ఈ ఫ్యాషన్ అండ్ మోడలింగ్‌వైపు ఎంకరేజ్ చేశారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఎన్నో యాడ్స్ చేయగలిగాను. తరువాత ‘గెట్ గార్జియస్’ అనే రియాలిటీ షోలో చేశాను. ‘ఫెమినా మిస్ ఇండియా’ అందాల పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికయ్యాను. ఆ తరువాత కొద్దికాలానికే టాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆశ్చర్యపోయాను... బ్రహ్మిగాడి కథ సినిమాతో మొదటిసారిగా నేను హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడి స్టూడియోస్ నాకు అత్తవారిళ్లుగా అనిపించాయి. నేనెవరనేది సరిగ్గా తెలియనివారు కూడా నన్నో గాజుబొమ్మలాగా ట్రీట్ చేశారు. అంత మర్యాదగా ప్రవర్తించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అలా నా మొదటి సినిమాలో నన్ను నేను స్క్రీన్‌మీద చూసుకుని సంతోషించాను. ఆ తరువాత ‘ఆడు మగాడ్రా బుజ్జి’, ‘ఆ ఐదుగురు’ సినిమాల్లో చేశాను. టాలీవుడ్ పుణ్యమా అని మలయాళం, కన్నడ రంగాల్లో సైతం మంచి సినిమాలు చేశాను. ఇంకా కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇప్పడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది. కృష్ణవంశీ, గౌతమ్ మీనన్‌ల దర్శకత్వంలో నటించాలని ఉంది. గారాబం ఎక్కువ... నేను పుట్టి పెరిగింది హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో. అమ్మ హౌస్ వైఫ్. నాన్నకు బిజినెస్ ఉంది. నాకో తమ్ముడు. ప్లస్‌టూ వరకు చదువంతా సిమ్లాలోనే సాగింది. డిగ్రీ మాత్రం ఢిల్లీలో చేశాను. చిన్నప్పటినుంచి చాలా సాఫ్ట్. అస్సలు అల్లరిచేసేదాన్ని కాదు. ఒక్క అమ్మాయినే కావడంతో పేరెంట్స్ కూడా బాగా గారాబం చేశారు. తమ్ముడికి, నాకు ఏజ్‌గ్యాప్ ఎక్కువగా ఉండటంతో కొట్టుకోవడం లాంటివేమీ ఉండేవి కాదు. చార్మినార్ బ్యాంగిల్స్... హైదరాబాద్‌కు వచ్చి నాలుగేళ్లు... ఈ పీరియడ్ తక్కువే అయినా ఎన్నో ఏళ్ల అనుబంధం ఏర్పడింది. నా మాతృభాష హిందీ అవ్వడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో భాష కాస్త ఇబ్బంది అయ్యింది. తరువాత తరువాత మేకప్‌మేన్ దగ్గరనుంచి ప్రొడక్షన్, కాస్ట్యూమ్, క్యారావాన్ వరకూ అంద రూ నాకు సపోర్ట్ చేసి తెలుగు నేర్పించారు. ఇప్పుడు బాగా మాట్లాడగలను. సిటీకి వచ్చిన కొత్తలో ఇక్కడి షాపింగ్ గురించి చాలా విన్నాను. అందుకే మొదటిసారి చార్మినార్‌కు వెళ్లాను. అక్కడ రకరకాల గాజుల సెట్స్ చూశాను. ఎంతో అందమైన రేర్ కలెక్షన్ ముత్యాల గాజులు, హ్యాండ్ మెయిడ్ బాంగిల్స్ కొన్నాను. అవి నాకు చాలా ఇష్టం. ట్రెడిషనల్‌గా తయారవ్వాల్సొస్తే... ఆ బ్యాంగిల్స్కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్. -
ఫ్యా'షైన్'
ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, సాఫ్ట్వేర్.. ఇలా రెగ్యులర్ చదువులు. ఆ తరువాత టెన్ టూ ఫైవ్ రొటీన్ జాబ్స్. ఆసక్తులతో ఏమాత్రం సంబంధం లేకుండా చేసే ఉద్యోగాలపై నగర యువత విముఖత చూపుతోంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా... యూనిక్‌నెస్ ఉంటే చాలు. ఈ రంగంలో దూసుకుపోవచ్చు. అందుకే చదువుతో పనిలేకుండా ఆసక్తి, సృజనాత్మకతతో ముడిపడిన ఫ్యాషన్ డిజైనింగ్వైపే యువత మక్కువ ప్రదర్శిస్తోంది. విద్యార్థుల అభిరుచులకు తగినట్టుగా విద్యాసంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అలాంటి కోవకు చెందిందే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. రెగ్యులర్ డిజైన్స్‌కి భిన్నంగా వేస్ట్ ప్రొడక్ట్స్‌ను వినియోగించి వండర్ఫుల్ డిజైన్స్ సృష్టిస్తున్నారు ఈ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు. - శిరీష చల్లపల్లి హైదరాబాదీస్ ఆర్ ఆల్వేస్ ఇన్నోవేటివ్. ఫ్యాషన్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న ట్రెండ్స్‌ని అప్డే ట్ చేసుకుంటున్న నగరం ఈ రంగంలో ప్రపంచస్థాయిలో పోటీ పడుతోంది. ఆ పోటీని తట్టుకోవడానికి తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలా ప్రత్యేక ఎయిమ్‌తో ప్రారంభమైందే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. డి.రవీందర్‌రెడ్డి ఈ ఫ్యాషన్ స్కూల్‌కు డెరైక్టర్. అంతకుముందు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైనింగ్ (ఐఐఎఫ్టీడీ) ఫ్రాంఛైజీగా ఉన్న ఈయన... ఫ్యాషన్ రంగంలో మరింత ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో ఐఎఫ్ఎస్ను స్థాపించారు. పురికొస, పేపర్ముక్కా... చైతన్యపురిలో ఉన్న ఈ ఫ్యాషన్ స్కూల్ విద్యార్థులు వినూతన్నమైన డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు. పురికొస, పేపర్ముక్క, షర్ట్ బటన్... కాదేదీ డిజైనింగ్ కనర్హం అంటున్నారు. పనికి రాకుండా పడి ఉన్న పాత న్యూస్‌పేపర్, షర్ట్ బటన్స్, మిగిలిపోయిన బట్టముక్కలతో ఫ్యాషన్‌కు రిక్రియేషన్ చేస్తున్నారు. క్రియేటివిటీకి చదువుతో పనిలేదు. టాలెంట్‌కు ప్రియారిటీ ఉన్న ఫ్యాషన్ రంగంలో క్రియేటివిటీతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఉన్నత చదువులు అదనపు అర్హత మాత్రమే. అందుకే ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నవారు సైతం ఈ ఎవర్ ఎండింగ్ఫీల్డ్పై అంతులేని ఉత్సాహం చూపుతున్నారు. విద్యార్థుల ఉత్సాహాన్ని బట్టి ఈ రంగంవైపు రావాలనుకునేవారికి స్కాలర్షిప్స్ కూడా అందిస్తోంది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. అంతేకాదు సృజనాత్మకత ఉండి... ఆర్థిక స్థోమత లేని యువతకు ఫీజులో రాయితీ కూడా కల్పిస్తోంది. ట్రెడిషన్ మిస్‌కాకుండా... ఫ్యాషన్రంగం కలర్‌ఫుల్ ఫీల్డ్. దీన్ని ఎంచుకునేవారు సైతం డిఫరెంట్ ఐడియాస్ ఉన్నవారే ఉంటారు. ఉన్నత చదువులు చదివినవారే కాదు... టెన్త్ చదివినా ప్రపంచానికి కొత్తదనాన్ని పరిచయం చేద్దామనుకుంటే చాలు. అదే వారి అర్హత. వేరే ఫీల్డ్‌తో పోల్చుకుంటే అవకాశాలు కూడా ఎక్కువ. అమ్మాయిలు ఎక్కువగా ఈ ఫీల్డ్‌వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే మా ఇనిస్టిట్యూట్‌లో ట్రెడిషన్ మిస్ కాకుండా చూస్తున్నాం. - మోనికా, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్ ఫ్యాకల్టీ టెన్షన్ ఫ్రీ... డిగ్రీ చేశాను. టెన్ టు ఫైవ్ జాబ్స్ చేయడం నాకు నచ్చదు. అందుకే పెళ్లయినా చిన్నప్పటినుంచే ఇష్టపడిన ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నా. ఫ్యూచర్లో జాబుకు వెళ్లి వచ్చి, ఫ్యామిలీని చూసుకోలేక టెన్షన్ పడేకన్నా... హ్యాపీగా ఇంటిదగ్గరే నా సొంత కలెక్షన్‌తో బొటిక్ పెట్టుకుని సెటిలవ్వొచ్చు. - రమ్య, ఫ్యాషన్ స్టూడెంట్ ఎవర్ ఎండింగ్... ఇదొక ఇన్నోవేటివ్ ఫీల్డ్. ఈ డిజైనింగ్ ఫీల్డ్ ఎవర్ ఎండింగ్ బిజినెస్. ఒకరి మీద ఆధారపడకుండా కేవలం మన టాలెంట్‌ని బట్టి ఎదిగే బిజినెస్. అందుకే ఎన్నో ఆప్షన్స్ ఉన్నా... ఈ డిజైనింగ్ ఫీల్డ్నే ఎంచుకున్నా. - విజిత, ఫ్యాషన్ స్టూడెంట్ -
తీపివేడుక
దీపావళి పండుగ అంటే ఠక్కున టపాకాయలు గుర్తుకొస్తాయి ఎవరికైనా.. దీపావళి అంటే సందడి చేసే టపాకాయలే కాదు, నోరూరించే మిఠాయిలు కూడా. టపాకాయల శబ్దాలకు భయపడే చిన్నారులకు, వాటి జోలికి వెళ్లలేని వయోధికులకు పండుగ సందడి అంతా మిఠాయిల్లోనే ఉంటుంది. బిజీ బిజీ నగర జీవితంలో ఇళ్లలో మిఠాయిలు వండుకునే వారెందరు..? ఇళ్లలో మిఠాయిల తయారీ చేపట్టినా, ఒకటి రెండు.. మహా అయితే అరడజను వెరైటీలతో సరిపెట్టేస్తారు. ఇంట్లో ఎలాంటి పని పెట్టుకోకుండానే, స్వీట్స్ టేస్ట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి నగరం నలుమూలలా లెక్కలేనన్ని స్వీట్‌షాపులు ఉన్నాయి. దాదాపు అన్ని షాపుల్లోనూ దొరికే వెరైటీలు ఒకే తీరులో ఉంటే ఎలా! ఎంతో కొంత కొత్తగా... మరింత ఆకర్షణీయంగా ఉండాలి కదా. అందుకే నగరవాసుల టేస్ట్‌కు తగ్గట్టు విభిన్నమైన మిఠాయిలను అందిస్తున్నారు నగరంలోని స్వీట్ షాప్‌ల వారు. లోపల స్వీట్ ఎంత మధురంగా ఉంటుందో... దానికి తగ్గట్టుగానే పైన ప్యాకింగ్ కూడా అంతే ఆకర్షణీయంగా చేస్తున్నారు. చూడ్డానికే కాదు... రుచి, శుచి, నాణ్యత కూడా ఉంటేనే గిరాకీ. వాటిపైనా దృష్టి పెడుతున్నారు దుకాణదారులు. అదనంగా 350 వెరైటీలు.. ఈసారి దీపావళి సందర్భంగా అదనంగా దాదాపు మరో 350 వెరైటీల స్వీట్లను అందుబాటులోకి తెచ్చాం. నగరంలో మా వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. అంచనాలకు మించి దాదాపు మూడు రెట్లు అమ్మకాలు పెరిగాయి. ఎక్కువగా స్వీట్ గిఫ్ట్ ప్యాక్‌లు అమ్ముడవుతున్నాయి. ప్యాకింగ్ కోసం మా సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తోంది. - రుషిల్, డెరైక్టర్, దాదూస్ మిఠాయి వాటిక దివాలీ థీమ్స్ బంధువులు, మిత్రులకు కానుకగా ఇచ్చేందుకు వందలాది రకాల మిఠాయిలు ఇప్పుడు నగరంలో దొరుకుతున్నాయి. దీపావళి థీమ్‌కు తగ్గట్టుగా ప్యాకింగ్‌లు, స్వీట్లు చేస్తున్నారు. ప్రమిదలు, చిచ్చుబుడ్లు, మతాబుల ఆకారాల్లో రూపొందించిన స్వీట్స్‌ను వెండిని తలపించే పళ్లాల్లో పెట్టి విభిన్నంగా ప్రజెంట్ చేస్తున్నారు. స్వచ్ఛమైన నేతి మిఠాయిలు, డ్రైఫ్రూట్ స్వీట్స్, సుగర్ ఫ్రీ స్వీట్స్ నోరూరించే రుచుల్లో సిద్ధం చేసి షాపుల్లో ఉంచారు. సౌతిండియన్, బెంగాలీ, రాజస్థానీ, గుజరాతీ, ఆగ్రా, ఢిల్లీ తదితర ప్రాంతాల స్పెషల్ వెరైటీలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. - శిరీష చల్లపల్లి -
ఫ్రాక్..కిరాక్
పెళ్లి అనేది సంప్రదాయ వేడుక. పక్కా ట్రెడిషనల్‌గా జరిగే పెళ్లిసందడిలో ఆచార వ్యవహారాలే కాదు.. కట్టూ, బొట్టూ కూడా పద్ధతి అంటారు పెద్దలు. కానీ రిసెప్షన్‌కు వచ్చేసరికి కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తారు. అందుకే పెళ్లిపందిరిలో పట్టు చీరలో మెరిసిపోయే వధూమణి.. రిసెప్షన్ వేడుకలో నయాట్రెండ్ వస్త్రాల్లో తళుకులీనుతుంది. అప్పుడున్న ట్రెండ్‌లో ది బెస్ట్ కలెక్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మరింత అందంగా కనిపిస్తుంది. కాలంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్ మారిపోతుంటాయి. ఓసారి ఫ్యాషన్ ప్రపంచం అంతా చుడీదార్ల చుట్టూ తిరిగింది. మరోసారి పల్లూ శారీస్‌ను పట్టుకుని మురిసిపోతుంది. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్లపై మనసుపడింది. ఫ్లోర్ లెన్త్ గౌన్లలో కాస్త హుందాగా.. ఇంకాస్త అందంగా కనిపిస్తామని యంగ్ మగువలు దీన్ని ఎన్నుకుంటున్నారు. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వేడుకల్లో సైతం లాంగ్ స్కర్ట్‌లో దర్శనమిస్తున్నారు. లాంగ్‌స్కర్ట్ జమానా మళ్లీ ఊపందుకోవడంతో సరికొత్త కలెక్షన్స్ మార్కెట్లోకి తెస్తున్నారు డిజైనర్లు. లైట్ వెయిట్ షిఫాన్, క్రీప్స్, జార్జెట్స్ వంటి రకాలు ఫ్యాషన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫారిన్ సొగసులు దిద్దుకున్న ఈ లాంగ్ గౌన్లకు ఇండియన్ ఫ్లేవర్ అద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అదిరిపోయే ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో లాంగ్ స్కర్ట్స్‌కు వెడ్డింగ్ శోభను తీసుకొస్తున్నారు. అందుకే ఈ కొత్త ఫ్యాషన్.. మిగతా కలెక్షన్స్‌ను దాటుకుని ముందుకొచ్చింది. - శిరీష చల్లపల్లి -
పచ్చవెచ్చగా...
భోజనప్రియుులైన ‘సిటీ’జనుల జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు నగరంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు మెుదలుకొని ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకు చాలా కేంద్రాలు ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు, పిజ్జాసెంటర్లు వంటివి డోర్ డెలివరీ సేవలనూ అందిస్తున్నాయి. ఇవి సరఫరా చేసే వంటకాల రుచుల సంగతి సరే, మరి ఆరోగ్యం మాటేమిటి అని ఆందోళన చెందేవారూ లేకపోలేదు. ఆరోగ్య స్పృహ కలిగిన ఆహార ప్రియులు ఎలాంటి ఆందోళన లేకుండా ఆరగించగలిగే వంటకాలను కోరుకున్న చోటుకు తెచ్చి అందిస్తోంది ‘గ్రీన్‌బాక్స్’. వుధుమేహం, గుండెజబ్బులు గల వారికి ప్రత్యేకమైన భోజనాన్ని సైతం అందిస్తోంది. ఆరోగ్యకరమైన భోజనాన్ని ‘సిటీ’జనుల ఇంటి ముంగిటికి తెచ్చి అందించేందుకు వూదాపూర్లో గౌరవ్ శర్మ ‘గ్రీన్‌బాక్స్’ ప్రారంభించారు. ‘గ్రీన్‌బాక్స్’ ప్రత్యేకంగా ప్యాక్చేసిన వంటకాలు చాలాసేపటి వరకు వేడివేడిగానే ఉంటాయి. నిపుణుల సలహాతో వంటకాల తయారీ డైటీషియున్లు, ఆరోగ్య నిపుణుల సలహా సూచనల మేరకు తాజా పదార్థాలతో వంటకాలను కచ్చితమైన కేలరీల కొలతలతో తయూరు చేయుడం ‘గ్రీన్‌బాక్స్’ ప్రత్యేకత. వివిధ ప్రాంతాల రుచులు, ఆహారపు అలవాట్ల మేరకు నార్తిండియున్, సౌతిండియున్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందిస్తోంది. వుసాలా ఓట్స్‌తో వుసాలా ఫ్రెంచ్ మిసైల్, బేసన్ గోబీ చిల్లీ పరోటా, బేక్డ్ బీన్స్, టోస్ట్ బ్రెడ్స్, డైట్ షేక్స్, ఎగ్‌వైట్ స్పానిష్, వైట్ శాండ్విచ్, వీట్ ఆమ్లెట్, వీట్ డిన్నర్రోల్స్, ఇడ్లీ కొబ్బరి చట్నీ, ఊతప్పం, గార్డెన్ఫ్రెష్ సలాడ్, చికెన్ టిక్కా వుసాలా, చికెన్ చెట్టినాడు వంటి వెరైటీ రుచులను అందిస్తోంది. ‘గ్రీన్‌బాక్స్’ అందించే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ధరలు సైతం రెస్టారెంట్ల ధరలతో పోల్చుకుంటే తక్కువగానే ఉండటం విశేషం. - శిరీష చల్లపల్లి -
సమ్‌థీమ్.. స్పెషల్
ట్రెడిషనల్‌కు మోడర్న మిక్స్ చేసి... అమ్మలకు... అలాగే అమ్మాయిలకు నచ్చేలా ట్రెండీ శారీస్ ఇప్పుడు సిటీలో కనిపిస్తున్నాయి. మగువలకు నిండైన అందమే కాదు... విభిన్న థీమ్‌లతో వారిని మరింత కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాయి. ట్రెడిషనల్లో మోడరన్... మోడరన్ గర్ల్స్ ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే వారి యాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటే ఈ శారీస్ చక్కని ఎంపిక. మోడరన్, యూత్‌ఫుల్ నేచర్‌ని దుస్తుల ద్వారా కూడా క్యారీ చేయగల వారికి మాత్రమే ఈ చీరలు మరింత అందాన్ని, కొత్త లుక్‌ని ఇవ్వగలవు. ఐటీ అమ్మాయిలు, కాలేజ్ గాళ్స్ ఈ తరహా చీరలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సంప్రదాయంగా రూపుదిద్దుకున్న చీరలపై స్కర్ట్స్, మిడ్డీస్ వంటి వెరైటీలను జత చేయడంతో అటు ట్రెడిషనల్ లుక్‌నీ, ఇటు మోడ్రన్ ట్రిక్స్నీ ఒకేసారి ఫాలో అయిపోయినట్టు ఫీలై పోవచ్చు అమ్మాయిలు. అమ్మ నేర్పే లాలి‘పాఠం’... అమ్మే అందరికీ ఆది గురువు. అందుకే, అమ్మ కట్టే చీరను కూడా అక్షరాలతో, అంకెలతో, పురాణగాథలతో, ఇలా పిల్లలకు వివిధ అంశాలను అలవోకగా నేర్పడానికి అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మ చెంగు పట్టుకుని ఆడుకుంటూనే ఆల్ఫాబిట్స్ని, బొమ్మలను గుర్తించి వాటిని మననం చేయించేందుకు వీలుగా ఈ చీరలను రూపొందించారు. హనుమ సంజీవనీతో వెళ్లటం, లంకా దహనం వంటి పురాణ కథల ఇతివృత్తంగా చీరలపై చిత్రాలుగా ముద్రిస్తున్నారు. అలాగే రైమ్స్ కూడా అమ్మ చెంగుపై చిత్రాలుగా మలిచేస్తున్నారు. పిల్లలకు నేర్పించవలసిన మంచి అలవాట్లు ఏ గోడ మీదో, పుస్తకంలో ఉంటే పిల్లలకు గుర్తు పెట్టుకోవటం కష్టమేమో గాని అదే అమ్మ చీర మీద చూసి తెలుసుకుంటే మరిచిపోవటం అసాధ్యమే. మ్యాజిక్ శారీ... చెంగు, కుచ్చులు, పిన్నులు... ఇలా చీర కట్టడానికి ఎన్నో తిప్పలు. రోజువారీ హడావుడిలో చీర కట్టు కోసం పావుగంట పైగా సమయం కేటాయించటం, రోజంతా రద్దీలో చీరతో పడుతూ లేస్తూ తిరగటం లాంటి చిక్కులు తలుచుకొని నేటి యువతులు చీర కట్టడాన్ని పండుగలు, పబ్బాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఈ ఇబ్బంది ఉందంటే మా దగ్గర పరిష్కారం రెడీగా ఉందంటూ ముందుకొచ్చేస్తున్నారు నవ డిజైనర్లు.సింగిల్ పిన్నుతో కూడా పనిలేకుండా ధరించేలా రెడీమేడ్ చీరలు రూపొందిస్తున్నారు. దీనికి మ్యాచింగ్ పెట్టికోట్, బ్లౌజ్‌లు వెతుక్కోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఈ మ్యాజిక్ శారీ మొత్తం ప్రిస్టిచ్డ్ సెటప్‌తో వస్తుంది. దీనిని స్కర్ట్లాగా తొడుక్కుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా ఫారినర్స్, యంగ్‌స్టర్స్, చీర కట్టు గురించి బొత్తిగా తెలియని మనవాళ్లని కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ చీరకట్టుకి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, కట్టుకున్న వారు మరింత నాజూకుగా కనిపిస్తారట. అంతకన్నా ఆ‘కట్టుకునే’ విషయం ఏముంటుంది? - శిరీష చల్లపల్లి -
ఆరామ్ షహర్
ఆమె బ్యాట్ పట్టింది హైదరాబాద్‌లో.. బౌండరీ బాదిందీ సిటీలోనే.. తన ఆటతీరుతో ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయ్యింది. క్రీడాకారిణిగా ప్రపంచమంతా చుట్టొచ్చినా.. హైదరాబాద్‌ను మించిన ఆరామ్ షహర్ మరొకటి లేదంటోంది మిథాలీరాజ్. చిన్నప్పటి నుంచి తోడుగా ఉంటూ తన ఆటకు మెరుగులద్దిన సిటీతో ముడివేసుకున్న అనుభూతులను ఐ లవ్ హైదరాబాద్ అంటూ ‘సిటీప్లస్’తో షేర్ చేసుకుంది. - మిథాలీరాజ్ నేను పుట్టింది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అయినా పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎక్స్ సర్వీస్ మ్యాన్. స్కూలింగ్ అంతా సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్లో సాగింది. కస్తూర్బా కాలేజ్‌లో ఇంటర్, ఉస్మానియా డిగ్రీ కాలేజ్‌లో బీఏ చేశాను. గత జన్మ గుర్తులా.. క్రికెట్ కమిట్మెంట్స్ ఉండటం వల్ల స్కూల్, కాలేజ్‌కు వెళ్లింది చాలా తక్కువ. చిన్నప్పుడు సికింద్రాబాద్‌లో ఉండేవాళ్లం. మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో స్కూల్ ఉండేది. హాయిగా నడచుకుంటూ వెళ్లిపోయేదాన్ని. దారంతా మట్టి రోడ్డే. టీస్టాల్స్, పూల దుకాణాలు, టిఫిన్ బండ్లు, సైకిల్ రిక్షాలతో కళకళలాడుతూ ఉండేది. ఎర్లీ మార్నింగ్ స్కూల్లో క్రికెట్ కోచింగ్.. అది అయిపోయాక ఇంటికి వెళ్తూ టీ స్టాల్ టీ తాగి, అక్కడే పేపర్ చదివి ఇంటికి వెళ్లేదాన్ని. ఇప్పుడు ఆ ప్లేస్ షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌తో నిండిపోయింది. చిన్నప్పుడు నేను చూసిన ఆ ప్రాంతం ఇప్పుడు గత జన్మ గుర్తులా అనిపిస్తుంది. గ్రౌండ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ నాకు క్రికెట్ గ్రౌండే బెస్ట్ ఫ్రెండ్. ఇంట్లో కన్నా గ్రౌండ్‌లోనే ఎక్కువుంటా. స్కూల్ నుంచి గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, మక్కామజీద్ ఎక్స్కర్షన్ వెళ్లాను. భలే సరదాగా అనిపించింది. నాకు స్నేహితులు తక్కువ. స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నది ఒకే ఒక ఫ్రెండ్. గ్రౌండ్ లైఫ్ తీరింది.. కొన్నాళ్లు బేగంపేటలో క్రికెట్ ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉన్న ప్లేస్‌లో పెద్ద గ్రౌండ్ ఉండేది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, రాళ్లు ఉండేవి. నేనీ స్థాయికి రావడానికి హెల్ప్ చేసిన గ్రౌండ్.. కాంక్రీట్ గుట్టలా మారడం వెలితిగా అనిపిస్తుంటుంది. సెవెన్త్క్లాస్లో ఉన్నప్పుడు పరేడ్ గ్రౌండ్స్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాల్ వచ్చి నుదిటికి తగిలింది. ఐబ్రో పైన ఐదు కుట్లుపడ్డాయి. అప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకుంటున్నా. కృష్ణాష్టమికి ఇంటికే.. క్రికెట్లోకి రాకపోయి ఉంటే క్లాసికల్ డ్యాన్సర్ అయ్యేదాన్ని. ఎనిమిదేళ్లు భరత నాట్యం నేర్చుకున్నాను. జూబ్లీహిల్స్‌లోని లిటిల్ ఇటలీ రెస్టారెంట్ అంటే ఇష్టం. అది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మా అమ్మతో వెళ్తూ ఉంటా. వెళ్లిన ప్రతిసారీ ఓ కొత్త ఐటమ్‌ని టేస్ట్ చేస్తా. ఇక్కడ తినగానే రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఎనోనిమ్ బోటిక్‌లో షాపింగ్ చేస్తాం. మా ఇంట్లో కృష్ణాష్టమి ఘనంగా చేస్తాం. ఆ రోజు మా అమ్మ పదిహేనురకాల పిండివంటలు చేస్తుంది. ఎంత బిజీగా ఉన్నా ఆ రోజు ఇంట్లో ఉండడానికే ఇష్టపడ్తాను. సంప్రదాయ ప్రతీక క్రికెట్ ఆడటానికి ఎన్నో దేశాలు వెళ్లాను. ఇండియాలో ఎన్నో నగరాలు తిరిగాను. వాటి కన్నా హైదరాబాదే ఎక్కువగా నచ్చుతుంది. చరిత్రకు, సంప్రదాయానికి ఐకాన్‌గా ఉంటుంది. కొతవాళ్లు ఇక్కడ స్థిరపడటానికి సిటీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఇక క్రికెట్ పరంగా నా జర్నీ ఇంత సక్సెస్ కావడానికి కారణం హైదరాబాదే. - శిరీష చల్లపల్లి -
జష్న్ - ఎ - నిఖా
జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయే వేడుక పెళ్లి. ఈ పండుగను ఘనంగా నిర్వహించడానికి ఇంటిల్లిపాదీ శ్రమిస్తుంది. సంబంధాలు చూడటం మొదలు.. అప్పగింతలు అయ్యే వరకు ప్రతి ఘట్టం ఎంత అపురూపమైనదో.. అంత సున్నితమైనది కూడా. మ్యాట్రిమోనియల్ సర్వీస్ నుంచి.. ఇన్విటేషన్ కార్డ్ డిజైనర్స్.. ఫొటో, వీడియోగ్రాఫర్స్, టూర్ ఆపరేటర్స్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఇలా పెళ్లి తంతులో ప్రధానమైన వాటన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చింది ‘జష్న్-ఎ-నిఖా’ ఎక్స్పో. ప్రత్యేకంగా ముస్లింల కోసం నాంపల్లిలోని సిటీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలోని వెరైటీలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి ఆసక్తిగా తిలకించారు. అత్తరు గుబాళింపు.. కళ్లు చెదిరే డ్రెస్సింగ్.. నవ వధువును మెరిపించే ఆభరణాలు... ఇవన్నీ నిఖాలో కనిపిస్తాయి. ముస్లింల కోసమే పత్య్రేకంగా వెడ్డింగ్ కలెక్షన్ ఎక్స్పో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ఎక్స్పోలోని 70 స్టాల్స్‌లో జ్యువెలరీ, కాస్మొటిక్స్, డిజైనింగ్ వేర్ వంటివెన్నో ఉన్నారుు. - శిరీష చల్లపల్లి -
ఉంగరం... సింగారం
ఫ్యాషన్‌కే ష్యాషన్‌గా ఉండాలనిపిస్తే... ఇదిగో ఇలాంటి పోకడలు పోతుంది! చేతికున్న అయిదు వేళ్లల్లో దేని స్థానం దానికే! అన్నిటికన్నా హొయలు పోయేది ఉంగరం వేలే! పేరులోనే ఉందికదా అందం.. కెంపు, పచ్చ, వజ్రం అన్నీ దాన్ని ధరించడానికే మోజు పడ్తుంటాయి... ఆ సోకులు చూసి ఈర్ష్యపడేనేమో... మిగిలిన వేళ్లూ ఉంగరాలు సింగారించుకోవడం మొదలెట్టాయి ఇలా! అయితే బంగారానికే ఫిక్స్ అయిపోకుండా మెటల్, ప్లాస్టిక్, స్టోన్, వుడ్, బోన్, గ్లాస్ జెమ్స్టోన్లాంటివాటికీ ప్రిఫరెన్స్ పెరిగింది. ఈ క్రేజీని క్యాష్‌చేసుకోవడంలో మార్కెట్టూ ముందుంది. అందుకే బర్త్స్టోన్స్ రింగ్స్, చాంపియన్షిప్రింగ్, కాక్టెయిల్ రింగ్, డాక్టోరల్రింగ పజిల్రింగ్, థంబ్ రింగ్‌లతో లేడీస్‌ని లేటెస్ట్ ట్రెండ్‌వైపు నడిపిస్తున్నాయి! ఇంకా చిత్రమేంటంటే.. రెండు వేళ్లకు ఒకేసారి ధరించేలా డబుల్ ఫింగర్ రింగ్ గింగుర్లుకొడుతోంది. అవిభక్త కవలలను పోలినట్టుండే ఈ ఉంగరం వేళ్లకు వన్నెతెస్తోంది. ఇవీ ఉంగరాల ఊసులు! - శిరీష చల్లపల్లి -
హృదయ నగరం
వెరైటీ డ్రెస్సింగ్.. డిఫరెంట్ లుక్స్.. కిక్కిచ్చే డైలాగ్స్.. వెరసి సంపూ! ఉరఫ్ సంపూర్ణేష్ బాబు!! పొట్టి చిత్రాల ప్రపంచంలో రికార్డు లైక్స్ సంపాదించిన ఈ బుల్లోడు.. వెండితెరపై ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చిన్నతనంలో సిటీకి చుట్టపుచూపుగా వచ్చిన నాడే ఈ భాగ్యనగరంపై మనసు పారేసుకున్నాడు. అడుగడుగునా థియేటర్స్ ఉన్న ఒకప్పటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే మనోడికి ప్రాణం. ఇప్పుడన్ని థియేటర్లు లేకపోయినా.. తన హృదయం ఎప్పుడూ ఐ లవ్ హైదరాబాద్ అంటుందని చెబుతాడు. - శిరీష చల్లపల్లి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నాపై వాటి ప్రభావమే ఎక్కువగా ఉండేది. మా ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మా బంధువులు ఉండేవారు. దీంతో మా ఫ్యామిలీ సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలే సినిమాలు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్లం. అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సూపర్‌గా ఉండేది. ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ థియేటర్లన్నీ మాల్స్‌లా మారిపోతున్నాయి. అప్పటి క్రాస్ రోడ్స్ మళ్లీ తీసుకురాలేం. కానీ, అక్కడి బావర్చి బిర్యాని టేస్ట్ మాత్రం ఇప్పటికీ మారలేదు. పెద్దమ్మ తల్లో.. సాయంత్రం వేళలో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి. కాస్త చీకటి పడ్డాక బిర్లా టెంపుల్‌కు వెళ్లి.. పై నుంచి లైట్ల వెలుతురులో మిరుమిట్లు గొలిపే సిటీని చూస్తే భలేగా ఉంటుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడికి తరచూ వెళ్తుంటాను. నా వరకైతే పెద్దమ్మతల్లి పవర్ఫుల్ దేవత. ఇలా కోరుకోగానే.. అలా తీర్చేస్తుంది. గోల్కొండ చూడ పోత.. గోల్కొండ వెళ్తే ఫుల్ రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. కోట విశేషాలు గైడ్లు చెబుతుంటే.. ఐస్‌క్రీమ్ తింటూ అవి వింటుంటే ఆ మజాయే వేరు. ఇక రంజాన్ నెలలో చార్మినార్ అందాలు చూడాల్సిందే. అక్కడ షాపింగ్ సరదాగా ఉంటుంది. మక్కామసీద్ ముందుండే పావురాలు..ఎంతో హాయినిస్తాయి. టేస్టీ సిటీ సిటీలో ఒక్కో చోట ఒక్కో రుచి ఫేమస్. పూర్ణ టిఫిన్ సెంటర్లో దోశ అదుర్స్. ఉలవచారు రెస్టారెంట్లో చేపల పులుసు, బిర్యానీ అంటే చాలా ఇష్టం. అమీర్‌పేట చందనాబ్రదర్స్ బయట స్వీట్‌కార్న్, ఐస్‌క్రీమ్ అండ్ సోన్‌పాపిడి ఎంతో రుచిగా ఉంటాయి. అవి చూడగానే చిన్నపిల్లాణ్ని అయిపోతాను. బేగంపేట లైఫ్‌స్టైల్ పక్కన ఉన్న ఫ్రాంకీ రెస్టారెంట్లో పనీర్ టిక్కా భలే ఇష్టం. సిటీవాసులు ఎంజాయ్మెంట్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఇక్కడే ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. నేను ఓషన్ పార్క్ వెళ్లానంటే ఓ పట్టాన బయటకు రాను. కల్చర్ నేర్పింది.. హైదరాబాదీతో మాట్లాడుతుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. హైదరాబాదీలు మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. ఇక్కడి జనాలు సిటీ కల్చర్‌లో పుట్టి పెరిగినా.. కొత్తగా వచ్చిన వారితో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను సిటీ కల్చర్ వాళ్ల నుంచే నేర్చుకున్నాను. -
అంతఃపుర కాంతులు
న్యూ ట్రెండ్స్ ఎన్ని వచ్చిన నగల విషయుంలో మాత్రం ఆడవాళ్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. చారిత్రక వారసత్వాన్ని, సంప్రదాయూన్ని.. ప్రతిబింబించే ఆభరణాలు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయుంటున్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న ఫ్యాషన్ ప్రపంచం కూడా అలనాటి మేటి డిజైనింగ్స్‌ను వుళ్లీ తెరపైకి తెస్తోంది. అదే ట్రెండ్‌లో కొత్తగా వూర్కెట్లో హల్చల్ చేస్తున్నారుు ఆవ్రుపాలి డిజైన్స. క్రీస్తుపూర్వం 500 నాటి అంతఃపుర కాంత ఆమ్రపాలి వేసుకున్న నగల డిజైనింగ్స్ స్ఫూర్తితో తయూరైన నయూ ఆభరణాలపై సిటీ వుహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ నగలకు డివూండ్ పెరుగుతోంది. డిజైనింగ్‌లోని ప్రాచీన శైలి, వాటిలో పొదిగిన నాణ్యమైన రత్నాలు.. అతిగా మెరుగుపెట్టని బంగారం, వెండి, సానపట్టని వజ్రాలు, పచ్చలు, నీలాలు, కెంపులు వంటి రత్నాలతో తయారు చేసిన ఈ ఆభరణాలను చూస్తే, తాతల నాటి భోషాణం నుంచి అప్పుడే బయటకు తీసినట్లుంటాయి. ప్రాచీన డిజైన్లలో పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లోనే స్వర్ణకారుల చేతి పనితనంతో రూపొందిన ఈ ఆభరణాల ధరలు కాస్త ఎక్కువే అయినా, వాటి రూపకల్పనలోని పనితనంతో పోలిస్తే సమంజసంగానే అనిపిస్తాయి. రాణివాసపు నగలు రంగు రంగుల రత్నాల అమరిక, ఆభరణాల నగిషీ పనితనం చూస్తే ఇవి రాణివాసపు నగలను తలపిస్తాయి. స్టైల్‌తో పాటు సంప్రదాయం ఉటి ్టపడేలా ఉండటంతో అతివలు వీటిపట్ల మక్కువ కనబరు స్తున్నారని అంటున్నారు ‘ఆమ్రపాలి’ జ్యూవెల్స్ నిర్వాహకులు రాజీవ్ అరోరా, రాజేశ్ అజ్మీరియా. - శిరీష చల్లపల్లి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
ప్యారా.. తిరంగా!
ఇండిపెండెన్స్ డే ఫీవర్.. సిటీని ఊపేస్తోంది. రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు.. ఫ్యాషన్, ట్రెడిషన్.. ఎక్కడ చూసినా యువ‘తిరంగా’లు ఎగసిపడుతున్నాయి. యువతని ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ వెబ్సైట్లు సహా వ్యాపార సంస్థలన్నీ మువ్వన్నెల ముస్తాబుతో కనువిందు చేస్తున్నాయి. పంద్రాగస్టున కళ్లు చెదిరేలా మువ్వన్నెలతో కనిపించి దేశభక్తిని చాటుకొనేందుకు యువత సన్నద్ధమవుతోంది. వస్త్రధారణలో, అలంకరణలో.. ఆఖరుకు ఆహారంలోనూ అణువణువునా దేశభక్తి ప్రతిఫలించేలా వ్యాపార సంస్థలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తమ సృజనాత్మకతకు పదునుపెట్టుకుని ముందుకొచ్చాయి. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్సైట్లు యువతను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉంటున్నాయి. ఈ-ప్రపంచం.. త్రివర్ణభరితం వోయ్లా డాట్ కామ్, షాప్‌క్లూస్ డాట్ కామ్, స్నాప్‌డీల్ డాట్ కామ్ వంటి పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు కొద్దిరోజులుగా త్రివర్ణభరితంగా మారాయి. ఆన్లైన్ స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో ‘తిరంగా’ జుయెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోని రంగు రాళ్లు, పూసలు వంటి వాటితో ఈ ఆభరణాలను రూపొందించాయి. అలాగే కాటన్‌తో తయారు చేసిన జాతీయ పతాకం సహా దేశభక్తిని ప్రతిబింబించేలా రూపొందించిన ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తున్నాయి. మువ్వన్నెల ఫ్యాషన్ సందడి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్యాషన్ బ్రాండ్స్ సరికొత్తగా రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్‌తో ముందుకొస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా కనిపించే కుర్తాలు, మూడురంగుల స్టోల్స్, సల్వార్ కమీజ్‌లు, టీ-షర్టులు అందిస్తున్నాయి. అన్ని వర్గాల వారికీ, అన్ని వయసుల వారికీ అందుబాటులో పలు ఫ్యాషన్ వస్తువులను ముందుకు తెస్తున్నాయి. యువతులైతే జెండా డిజైన్‌లో నెయిల్ ఆర్ట్, కనురెప్పల మేకప్, మువ్వన్నెల కేశాలంకరణ వంటివి చేయించుకుంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇవే కాకుండా హ్యాండ్‌బ్యాగ్స్, గాజులు, గొలుసులు వంటి యాక్సెసరీస్ సైతం ‘తిరంగా’ డిజైన్లలోనే ఎంపిక చేసుకుంటున్నారు. మూడు రంగుల్లో ముచ్చటైన రుచులు రెస్టారెంట్లు సైతం మూడు రంగుల వంటకాలను ముచ్చటైన రుచుల్లో అందిస్తున్నాయి. చీజ్ కేక్స్, చాక్లెట్ బ్రౌనీస్, హరా కబాబ్స్, ఆచారి పనీర్ టిక్కా వంటి ప్రత్యేక వంటకాలతో దేశభక్తిని చాటకుంటూనే, భోజనప్రియులనూ అలరిస్తున్నాయి. - శిరీష చల్లపల్లి -
రాత్ కీ బండీ..
ఆ బండి దగ్గరకు వెళ్లాక వేడి వేడి టిఫిన్ల పరిమళాలు ఎటువంటి కాలుష్యానికి లోనవకుండా నా ముక్కుపుటాలను చేరారుు. విచిత్రమేమిటంటే... అప్పటికే ఆ బండి దగ్గర నాలాంటి లేట్‌నైట్ జీవులు అనుకుంటా... బోలెడంత మంది గుమికూడారు. సిటీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకానే కాదు... 24 గంటలూ పనిచేసే కంపెనీలు అనేకం వచ్చేశారుు. థ్యాంక్స్ టు ఐటీ రెవల్యూషన్. హైదరాబాద్‌కి రాత్రి జీవితాన్నిచ్చినందుకు. రామ్ బండి ని పరిచయం చేసినందుకు. కాల్ సెంటర్స్, బీపీవో... తదితర ఉద్యోగాలు చేసేవారు తెలతెల వారుతుండగా విధులకు వీడ్కోలు పలుకుతూ ఇంటి దారి పడతారు. వెళుతున్నపుడు వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారి కోసం తెల్లవారుఝామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల దాకా మాత్రమే పనిచేసే రామ్కీ బండి ఓ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ జాయింట్. రాత్రి విధులు అలవాటే కాబట్టి... తెల్లవారుఝామున 5 గంటల ప్రాంతంలో ఫుడ్ కోసం నాంపల్లిలోని, మొజంజాహీ మార్కెట్ సమీపంలో, కరాచీ బేకరీ ఎదురుగా ఉన్న రామ్ కీ బండి దగ్గర ఆగాం. విపరీతమైన రద్దీతో ఉండే ఏరియా ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉందంటే... ఆ బండి దగ్గరకు వెళ్లాక వేడి వేడి టిఫిన్ల పరిమళాలు ఎటువంటి కాలుష్యానికి లోనవకుండా నా ముక్కుపుటాలను చేరారుు. విచిత్రమేమిటంటే... అప్పటికే ఆ బండి దగ్గర నాలాంటి లేట్‌నైట్ జీవులు అనుకుంటా... బోలెడంత మంది గుమికూడారు. సిటీలో పాపులర్ రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ ఉన్నా... రామ్కీ బండికి అంత పేరెందుకు వచ్చిందో... అక్కడ దోసె రుచి చూశాక నాకూ తెలిసింది. అక్కడి గుంపులో కొందరేమో పెద్ద గొంతుతో మసాలా దోసె, ఇడ్లీ అంటూ ఆర్డర్లు ఇస్తుంటే మరికొందరు నుంచునే తింటూ ముచ్చట్లతో పాటు ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు. చీజ్ దోసెలు, ఇడ్లీలు, ఉప్మా కమ్ దోసె... వంటివి అక్కడ బాగా ఫేమస్ అని నాకు వాటి డిమాండ్ చూశాక అర్థమైంది. చుట్టూ ఉన్న పరిసరాలు అంత గొప్పగా లేకపోయినా... చీజ్ దోసెను నాకు శుభ్రమైన ప్లేట్లలో సర్వ్ చేస్తూ... ‘క్వాలిటీ, టేస్ట్... ఈ రెండింటికే ప్రాధాన్యమిస్తూ బండి నడిపిస్తున్నా’ అన్నాడు రామ్. మా ఫ్రెండ్సందరం అక్కడున్న అరడజను రకాల దోసెలు తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నారుు. వాటిలో కలుపుతున్న ముడిసరుకు నాణ్యమైంది. చట్నీలు కూడా దోసెలకు చాలా చక్కగా నప్పాయి. ఇకపై మొజంజాహీ మార్కెట్ వైపు వెళితే... రామ్కీ బండి దగ్గర నా బైక్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది. - శిరీష చల్లపల్లి -
మీ డిజైన్.. మీ నగలు
ఎప్పుడు చూసినా అవే పాత నగలు.. పాత డిజైన్లు.. కొత్త మోడల్స్ రావా అని విసుగెత్తుతున్న నారీలోకానికి నయా ట్రెండ్ గ్రాండ్‌గా వెల్కం చెబుతోంది. మార్కెట్లో ఉన్న యాక్సరీస్పై మీకు ఆసక్తి తగ్గిందా..? డోన్ట్ వర్రీ.. మీ మనసుకు నచ్చే.. మీ త నువుకు నప్పే.. నగ లు మీరే డిసైడ్ చేసుకునే చాన్స్ వచ్చేసింది. మీకు ఎలాంటి మోడల్ కావాలో ఓ కాగితం మీద గీసిస్తే చాలు.. అచ్చం అలాంటి నగే మీ సొంతం అవుతుంది. ట్రెడిషన్ మార్కుకు కొత్త నిర్వచనం చెబుతున్న కాంటెంపరరీ జువెలరీ సిటీలో హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లకు మాత్రమే ఉపయోగించే ఈ రకం జువెలరీ ఇప్పుడు సిటీ వనితలకు చేరువయ్యాయి. కేవలం సెలబ్రిటీలకు, కాస్ట్యూమ్ డిజైనర్లకు మాత్రమే పరిమితమైన.. కాంటెంపరరీ యాక్సరీస్ ఇప్పుడు కామన్ పీపుల్ ఆలోచనలతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఏ డ్రెస్సింగ్కైనా సెట్ అయ్యేవిధంగా మీ కలల నగలు మీ కళ్ల ముందుకొచ్చేస్తున్నాయి. మీ సృజన నుంచి పుట్టిన ఈ జువెలరీ మీ మనసుకు నచ్చడమే కాదు యూనిక్ కలెక్షన్గా నిలుస్తున్నాయి. ఇషారియా.. మాయ కాంటెంపరరీ డిజైనింగ్స్‌తో ఇషారియా జువెలర్స్ యువతుల మనసును దోచుకుంటోంది. కస్టమర్లు కోరుకున్న విధంగా డిజైనింగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఇషారియా డిజైనర్లు గౌరి, రాధిక టాండన్‌లు. ఎలాంటి యాక్సరీస్ కావాలో ఓ పేపర్ మీద గీసిస్తే చాలు.. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసిన డిజైన్స్ మీ ముందుంచుతారు. క్రిస్టల్స్, మిర్రర్స్, బ్రాస్, 18 క్యారెట్ గోల్డ్ ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు. మిర్రర్ వర్క్ టెక్నిక్స్, లేపిజ్, ఒనిక్స్, ముత్యం, జాస్పర్, ఎనామిల్, కోరల్ మరెన్నో రకాల రత్నాలు పొదిగి ఈ నగలకు మరిన్ని వన్నెలద్దుతున్నారు. కాంటెంపరరీ జువెలరీగా పేరొందిన ఈ ట్రెండ్ ఇండో వెస్ట్రన్‌లో టాప్ మోడల్‌గా నిలుస్తున్నాయి. క్లౌడియా కలెక్షన్.. కాంటెంపరరీ నెక్లెస్‌ల ప్రిపరేషన్లో జర్మన్ బేస్డ్ డిజైనర్ క్లౌడియా సత్తాచాటుకుంటున్నారు. సెలబ్రిటీలు, ఫేజ్ త్రీ పీపుల్ కోసం ప్రత్యేకంగా జువెలరీ డిజైన్ చేయడం ఈమె ప్రత్యేకత. బంజారాహిల్స్‌లోని గుడ్ ఎర్త్ వారికి మాత్రమే ఈ డిజైన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఈ కంప్లీట్ హ్యాండ్ మేడ్ నెక్ జువెలరీ తయారీలో 22 క్యారెట్ గోల్డ్, థ్రెడ్, సిల్వర్, సెమీ ప్రీసియస్ స్టోన్స్, పికాక్, పింక్, సిల్వర్ పెరల్స్ పొదిగి.. మెడలో ఒదిగిపోయేలా తయారు చేస్తున్నారు. - శిరీష చల్లపల్లి -
తియ్యటి వేడుక
నగరం రక్షాబంధన్ కళతో వెలుగుతోంది. శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే ఈ వేడుకను ఘనంగా, సంబరంగా జరుపుకోవడానికి నగరవాసులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ వేడుకను తీపి చేసేందుకు రకరకాల స్వీట్లు, చాక్లెట్లు రారమ్మని పిలుస్తున్నాయి. ఇవి అందమైన బాక్స్‌లలో, గిఫ్ట్ ప్యాక్‌లలో ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను థీమ్ స్వీట్లతో జరుపుకునేందుకు ఆహ్వానిస్తున్నాయి. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పార్లర్లు ప్రత్యేకంగా రాఖీ థీమ్‌తో డిన్నర్స్ నిర్వహిస్తున్నాయి. నోరూరించే ప్రత్యేక, సంప్రదాయమైన ఐటమ్స్‌ను మెనూల్లో చేరుస్తున్నాయి. ఇందులో అగ్రస్థానం స్వీట్లకే ఇస్తున్నాయి. కంటికి ఇంపుగా నోట్లో కరిగిపోయేలా తయారవుతున్న ఈ స్వీట్లను చూసి నగరవాసులు మనసు పారేసుకుంటున్నారు. రాఖీ అనుబంధాన్ని తెలిపే థీమ్స్, అన్నా చెల్లెళ్ల భావోద్వేగాలనుప్రతిఫలించే కస్టమైజ్డ్ గిఫ్ట్‌లు కూడా మార్కెట్లో ఉన్నాయి. గ్రీటింగ్ కొటేషన్స్, ప్రత్యేకమైన బెడ్‌ల్యాంప్‌లు, ఫొటోథీమ్స్ స్పెషల్ అట్రాక్షన్. రాఖీ థాలీ: వెరైటీ లుక్‌లో ఉండే బాక్స్‌లో నాలుగైదు రకాల బెంగాలీ స్వీట్లు, రాఖీ, కుంకుమ ఉంటాయి. దీనికి ఎంతగా డిమాండ్ ఉందంటే రోజుకు 500-600 థాలీలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చాకో-రాఖీ బొకే: రకరకాల హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్, రాఖీ, అక్షింతలు, వీటిమధ్య తీపిగుర్తుగా ఉండే ఫొటోగ్రాఫ్స్‌ను అందంగా అమర్చిందే చాకో-రాఖీ బొకే. కస్టమ్ మేడ్-థాలీ: దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. కస్టమర్ల టేస్ట్‌కు అనుగుణంగా దీన్ని రూపొందిస్తారు. వారు ఇష్టపడే 11 రకాల సంప్రదాయ మిఠాయిలను అందమైన డిజైనర్ సిల్వర్ ప్లేట్లో రాఖీని జతచేసి అందిస్తారు. ట్రెడిషనల్ ఫెస్టివ్ థాలీ: పేరుకు తగినట్లే ఇది సంప్రదాయాన్ని ఒలకబోస్తుంది. ఇందులో ఆర్గానిక్ స్వీట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ షేప్‌లో మిఠాయిలను చేయడం దీని ప్రత్యేకత. వీటితో పాటు డిజైనర్ రాఖీ, చాక్లెట్స్, పసుపు కుంకుమను ఈ థాలీలో అందిస్తారు. డెలిషియస్ నట్ థాలీ: చూడగానే ఎంతగానో ఆకట్టుకునే ప్రత్యేకమైన థాలీ. రకరకాల నట్స్‌తో ముస్తాబు చేసేదే డెలిషియస్ నట్ థాలీ. బాదం, కాజు, కిస్మిస్, ఆల్మండ్, వాల్‌నట్స్‌తో పాటు బుల్లిబుల్లి చాక్లెట్స్‌ను అందమైన రాఖీని, ముద్దొచ్చే టెడ్డీ డాల్‌ను జోడిస్తారు. - శిరీష చల్లపల్లి ఫొటోలు: రాజేష్ రెడ్డి -
ఫన్ అండ్ ఫీయర్
లేడీస్ ఎంపోరియం... హైదరాబాద్‌లో గల్లీకి ఒకటి కనిపిస్తుంది. కానీ... ఇప్పుడు జెంట్స్కూ అదే స్థాయిలో స్టోర్స్ పెరిగిపోతున్నారుు. ప్రత్యేకించి మెడలో చైన్లు... చెవులకు లోలాకులు... చేతి వేళ్లకు వింతగొలిపే రింగులు... మణికట్టుకు ఆభరణాలను తలపించే వెరైటీలతో నగరంలో షోరూమ్‌లు వెలుస్తున్నాయి. ఫ్యాషన్, ఫంకీ, ఫన్ అండ్ ఫియర్.. ఇలా అన్నిరకాల మగవాళ్ల యాక్సెసరీస్‌తో ఆకట్టుకొంటున్నారుు. వీటితోపాటు పార్టీలో ట్రెండ్ సెట్ చేయూలనుకొనేవారికీ ఎన్నో ఐటమ్స్ వచ్చేశారుు. సినిమాల్లో కొరియోగ్రాఫర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, డ్యాన్సర్లు ఉపయోగించే విభిన్నమైన ఐటమ్స్‌కు యుువత ఎట్రాక్ట్ అవుతోంది. శ్రీనగర్‌కాలనీలోని ‘ఎఫ్ స్టోర్’ ఇలాంటిదే. ఇయర్ అండ్ పీయర్సింగ్ స్టడ్స్, ఫంకీ థంబ్ రింగ్స్, గాగుల్స్, డాగ్ ట్యాగ్స్, డిఫరెంట్ వాలెట్స్, కౌబాయ్ హ్యాట్స్, స్కార్ఫ్స్, స్టోల్స్, రిస్ట్ బ్యాండ్స్, డెవిల్ వూస్క్లు, ఘోస్ట్ కాస్ట్యూమ్స్, హరర్ పారుుంటెడ్ నెరుుల్స్, వాంపైర్ టీత్సెట్, థీమ్డ్ వాచెస్... ఇలా ప్రతిదీ ఇక్కడ విభిన్నంగా, వినూత్నంగా కనిపిస్తారుు. - శిరీష, చల్లపల్లి -
బారిష్ మే భరోసా
చినుకు పడితే సిటీలో కామన్‌మెన్ వణికిపోతున్నారు. వానజల్లు గిల్లితే జలుబు చేస్తుందనో.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతాననో కాదు.. ఎక్కడ తన స్మార్ట్ ఫోన్ తడిసిపోతుందోనని. వేలకు వేలు పోసి కొన్న స్మార్ట్ గాడ్జెట్స్‌కు నీటి ముల్లు గుచ్చుకుంటుందోనని హడలిపోతుంటారు. ఇలాంటి వారి కోసమే సరికొత్త స్మార్ట్ గాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. వాటర్‌ప్రూఫ్ కవచంతో బీ స్మార్టే కాదు.. బీ స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. అవి సొంతం చేసుకుంటే చాలుగాలివానలో.. వాన నీటిలో.. మీ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. - శిరీష చల్లపల్లి స్మార్ట టెక్నాలజీ కాలాన్ని శాసిస్తోంది. ఏ క్లాస్ నుంచి సీ క్లాస్ పీపుల్ వరకు అందరూ స్మార్ట్‌గా బతికేయాలని ఆరాటపడుతున్న రోజులివి. అందుకే మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ స్మార్ట్ గాడ్జెట్స్ వచ్చినా.. నిమిషాల్లో వారి చేతుల్లో కనిపిస్తున్నాయి. క్రెడిట్ కార్డులు గీకి మరీ వేలకు వేల విలువ చేసే స్మార్ట్ గూడ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అవి తీసుకున్న నాటి నుంచి.. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వాన వచ్చినా, అలా జారి ఇలా నీటిలో పడినా.. స్మార్ట్ గాడ్జెట్స్ కాస్తా టర్న్ ఆఫ్ కావడం మామూలే. వాటి సర్వీసింగ్‌కు మళ్లీ వేలు వెచ్చించడం తలకు మించిన భారంగా మారుతోంది. ఇలాంటి చికాకులకు పుల్ స్టాప్ పెడుతూ బడా కంపెనీలు వాటర్ ప్రూఫ్ గాడ్జెట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. సోనీకా తోఫా.. రకరకాల స్మార్ట్ ఫోన్లతో ఇప్పటికే జనాల మనసులు గెలిచిన సోనీ.. ఎక్స్‌పీరియా జెడ్ సిరీస్ పేరుతో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫీచర్లతో అదరగొట్టే ఈ ఫోన్ ఐదు మీటర్ల లోతు నీళ్లలో అరగంట ఉంచినా చెక్కుచెదరదు. 12.7 సెంటీమీటర్ స్క్రీన్‌తో.. 20.7 మెగా పిక్సల్ కెమెరాతో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. బ్లాక్, వైట్, పర్పుల్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపిల్, సామ్సంగ్ కంపెనీల వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లో మంచి బిజినెస్ చేస్తున్నాయి. వానకారు కెమెరా ఇప్పటికే వాటర్ ప్రూఫ్ కెమెరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్మార్ట్ టెక్నాలజీతో సోనీ హెడీఆర్ ఏఎస్ 30 మోడల్ సరికొత్తగా క్లిక్ కొడుతోంది. ఈ హైస్పీడ్ కెమెరా.. ఆరు మీటర్ల లోతు నీళ్లలోనూ అరగంట పాటు హెడీ క్వాలిటీతో ఫొటోలు తీస్తుంది. శాంసంగ్ కూడా వాటర్ ప్రూఫ్ స్మార్ట్ కెమెరాలు రిలీజ్ చేసింది. వానా‘కాలం’ ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటున్నాయి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌లు. శాంసంగ్, సోనీ వంటి బడా కంపెనీలు కాలాన్ని స్మార్ట్‌గానే కాదు.. సేఫ్టీగా కూడా మార్చేస్తున్నాయి. వాన హోరులో.. వరద జోరులో కూడా క్షణం తీరిక లేకుండా ఇవి టిక్ టిక్ అని అంటూనే ఉంటాయి. వీటి ధర రూ.15 వేల వరకు పలుకుతోంది. జలకాలాటలలో.. గలగల పాటలు స్నానాల గదిలో కూని రాగాలు తీయడం కాదు.. జలకాలాడుతూ వాక్‌మెన్‌లో పాటలు వినేయొచ్చు. వాటర్ ప్రూఫ్ వాక్‌మెన్ వచ్చేశాయి. ఇంకేముంది ఇయర్ ఫోన్స్ తగిలించుకుని టబ్ బాత్ చేస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ వాక్‌మెన్ ఉంటే మోట బావిలో కూడా పాటలు వింటూ ఓ గంట పాటు ఈత కొట్టొచ్చు. ఎనీ ప్లేస్.. వర్క్స్ నైస్ మామూలుగా అయితే ల్యాప్‌టాప్‌లు పనిచేయాలంటే కండిషనల్ వెదర్ ఉండాల్సిందే. ఈ వాటర్ ప్రూఫ్ ల్యాప్‌టాప్‌లు నీళ్లలో కూడా ఎక్స్‌లెంట్‌గా పని చేస్తాయి. టఫ్‌బుక్ సీఎఫ్ 19 ల్యాప్‌టాప్ టెక్నాలజీ నీటి దూకుడును తట్టుకుని మరీ పని చేస్తోంది. ఇవే కాదు స్మార్ట్ గాడ్జెట్స్‌లో రాజ్యమేలుతున్న యునిక్ గాడ్జెట్స్ కూడా వాటర్ ప్రూఫ్ వేసుకుంటున్నాయి. స్పీకర్లు, స్మార్ట్ బాండ్, చార్జర్లు.. ఇలా రకరకాల స్మార్ట్ గాడ్జెట్స్ మరింత మన్నికగా పని చేస్తున్నాయి. -
స్కిల్ ఉండాలి గురూ
మీ.. ప్రదీప్ పక్కా లోకల్ కుర్రోడు. పుట్టింది.. పెరిగిందీ ఇక్కడే. ఉదయం పూర్ణా టిఫిన్ సెంటర్లో ఉపహారం.. రాత్రి గోషామహల్లో దోశ తినడం మనోడి టేస్ట్. రద్దీగా ఉండే పాతబస్తీ అంటే మరీ ఇష్టం. ఊర్లెన్ని తిరిగినా.. సిటీకొస్తేనే ఊపిరాడుతుంది. ఇప్పుడు బుల్లితెరపై యాంకరింగ్‌తో రచ్చ చేస్తూ ఇంట గెలిచిన ప్రదీప్, స్కిల్స్ ఉంటే సక్సెస్ వస్తుందని చెబుతున్నాడు. నాన్న రియల్ ఎస్టేట్. అమ్మ గృహిణి. వాళ్లకు అక్క, నేను ఇద్దరం. నా ఫ్రెండ్స్ ఇక్కడి వాళ్లే. ఇప్పటికీ వాళ్లతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాను. హైటెక్ సిటీ ఉన్న ఏరియా అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్నట్టు కాదు.., 20 ఏళ్ల కిందట కాలుష్యం సోకని స్వచ్ఛమైన ప్రాంతం అది. ఇప్పుడు అటుగా వెళ్తుంటేనే బాధనిపిస్తుంది. చిన్నతనంలో మా ఫేవరేట్ స్పాట్ దుర్గం చెరువు. వారంలో మూడుసార్లు వెళ్లే వాళ్లం. అప్పుడెటూ చూసినా పచ్చదనం.. ఇప్పుడెటు చూసినా కాంక్రీట్ వనం. మిస్సింగ్ స్టోరీ అప్పుడు నాకు నాలుగైదేళ్లు అనుకుంటా. కూరగాయల బండి దగ్గర మా అమ్మ బేరమాడుతోంది. నేను బండి కింద బుట్టలోకి దూరిపోయా. కట్ చేస్తే.. కూరగాయలమ్మి బండిని తోసుకుంటూ వెళ్లి పోయింది. నేను ఏడ్చే దాకా ఆమె నన్ను చూడలేదు. అడ్రస్ చెబుదామంటే మాటలు సరిగ్గా రావు. ఆమె నన్ను పోలీస్ స్టేషన్లో అప్పగించింది. నేను తప్పిపోయాననుకుని అమ్మానాన్నలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అలా నా మిస్సింగ్ స్టోరీ సుఖాంతమైంది. మొదట్నుంచీ లాస్ట్ బెంచే ఆరో తరగతి వరకు నా సీటు లాస్ట్ బెంచే. చదువులోనూ లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకే. ఏడో తరగతిలో మా మాస్టార్ ఓ క్లాస్ పీకారు. అంతే మ్యాథ్స్ అంటే భయంతో స్కూల్‌కు డుమ్మా కొట్టాలనుకునే నేను.. లెక్కల కోసమే క్లాస్‌కు వెళ్లేది. చదువులో ముందుకొచ్చినా.. లాస్ట్ బెంచీని వదల్లేదు. కాలేజ్ డేస్‌లో సినిమాలే సినిమాలు. సినిమాల్లో హీరో రోల్ చూసి అలా అవ్వాలనుకునే వాణ్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో తమ్ముడు సినిమా తొమ్మిది సార్లు చూశా. ఆ సినిమా చూసి ఏ లక్ష్యం పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యాను. కమిట్మెంట్ ఉండాలి.. ఇంజనీరింగ్ అయిపోగానే విదేశాలకు పంపి మాస్టర్స్ చేయించాలనుకున్నారు మా పేరెంట్స్. నాకేమో వెళ్లాలని లేదు. మొదట పోస్టర్స్, పాంప్లెట్స్ అంటించే ఉద్యోగం చేశాను. ఈ ఉద్యోగమేంటని అడిగితే.. పనిలో కమిట్మెంట్ ఉండాలి.. స్కిల్స్ ఉండాలి. సక్సెస్ ఆటోమేటిగ్గా వస్తుందన్నాను. రెండో రోజే రూ.20 వేల జీతంతో ఓ జాబ్ ఆఫర్ వచ్చింది. తర్వాత ఆర్జేగా చాన్స్ వచ్చింది. సుమ, ఝాన్సీ నాకు స్ఫూర్తి. యాంకరింగ్‌లో నిలబడగలిగానంటే నా జీల్‌తో పాటు పేరెంట్స్ సపోర్ట్ చేశారు. హైదరాబాద్ అద్దం లాంటిది ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షూటింగ్లో భాగంగా 150 ప్రదేశాలు తిరిగాను. విదేశాలకూ వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ హైదరాబాద్ చేరుకుంటేనే హాయిగా ఉంటుంది. నాకు జీవితమంటే ఏంటో నేర్పించింది ఈ నగరమే. హైదరాబాద్ అద్దం లాంటిది. మనం ఏమిస్తే తిరిగి అది మనకిస్తుంది. మనం ప్రేమిస్తే, ప్రేమించే వ్యక్తులు ఎదురవుతారు. కోపంగా ఉంటే అవతలి వ్యక్తి కూడా మనపై కోపం ప్రదర్శిస్తాడు. పూర్ణ టిఫిన్ సెంటర్... కృష్ణానగర్‌లోని పూర్ణ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చాలా ఇష్టం. ఇప్పుడు తెప్పించుకోవడం కూడా అక్కడినుంచే. పానీపూరి ఎక్కడ కనిపించినా ఓ పట్టు పట్టేస్తాను. లేట్‌నైట్‌లో ఓల్డ్ సిటీ గోషామహల్లో బండి మీద దోశ తినడం ఇంకా ఇష్టం. ఓల్డ్ సిటీ ఎంత రద్దీగా ఉంటుందో అంతే లైవ్లీగా ఉంటుంది. - శిరీష చల్లపల్లి -
ప్లేట్స్ అండ్ ఫిల్లోస్.. వడ్డించిన హిస్టరీ
‘ఆ రాణి ప్రేమ పురాణం. ఆ ముట్టడికైన ఖర్చులు .. ఇవి కాదోయ్ చరిత్ర సారం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ అసలు ఏ చరిత్రా పట్టని నేటి తరానికి ప్రేమాయణాలైనా చెప్పాల్సిందే. అందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుందీ గృహోపకరణాల షోరూమ్. అక్కడ దొరికే ఒక్కో వస్తువు ఒక్కో చరిత్రను చెబుతుంది. ఇవన్నీ డిజైనర్ పీస్‌లు. ఇక్కడ దొరికిన ప్రొడక్ట్‌ను పోలింది మరెక్కడా దొరకదు. ఆ యూనిక్‌నెస్ మీ సొంతం కావాలంటే బంజారాహిల్స్‌లోని ‘గుడ్ ఎర్త్’కు వెళ్లాల్సిందే! దేశ చరిత్ర... కర్ణాటకలోని బీదర్‌లో వందల ఏళ్ల నాటి శిల మీద ఒక ఆకృతి ఉంటుంది. దాని స్ఫూర్తితో రూపొందిన బిద్రీ కలెక్షన్‌ను కృష్ణ మెహతా డిజైన్ చేశారు. ఇక కాశ్మీర్‌లోని ప్రసిద్ధ గార్డెన్ నిశాత్బాగ్ను స్ఫురింపజేస్తూ మరో సెట్ అబ్బుర పరుస్తుంది. ఒంటెలను మేపేవారి కోసం ఎడారిలో నీడనిచ్చే ‘పల్మనేరియా’ చెట్టు మరో కలెక్షన్లో కనిపిస్తుంది. హోమ్‌నీడ్స్ ఒక్క క్రాకరీనే కాదు, కర్టైన్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, సోఫా కుషన్స్.. అన్ని రకాల హోమ్‌నీడ్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఇక్కడ లభించే పిల్లో కవర్స్‌పై ఉండే చార్మినార్ చరిత్ర, నిజాం విశేషాలు, తాజ్‌మహల్ వింతలు.. మిమ్మల్ని హాయిగా నిద్రపుచ్చుతాయి. ‘రత్నాకార’ పేరుతో శ్రీలంక, భారత్‌కు మధ్య సముద్రం అడుగున రత్నాలు లభించే దారిని సూచించే మ్యాప్ మరో పిల్లోపై కొలువుదీరింది. ఆశా మదన్ వీటిని డిజైన్ చేశారు. బారాదరి... ఆఖరి కులీ కుతుబ్ షా అబ్దుల్ పాదుషా. ఆయన ఆస్థానంలో నృత్యం చేసే కళాకారిణి ప్రేమావతిని ఆయన విపరీతంగా అభిమానించేవాడు. ఆమె మరణం తరువాత 1662లో గుర్తుగా ‘బారాదరి’ (12 దారుల కోట)ను కట్టించాడు. ఈ కథ మొత్తం ఒక క్రాకరీ సెట్ వివరిస్తుంది. ఒక ప్లేట్‌పైన నిజాం రాజు బొమ్మ ఉంటుంది అలా మొదలై 12 ప్లేట్లు మొత్తం కథను చెప్పేస్తాయి. ఈ బారాదరి సెట్‌ను పవిత్రా రాజారాం డిజైన్ చేశారు. ఒక్క హైదరాబాద్ చరిత్ర మాత్రమే కాదు.. కాశ్మీర్, కర్ణాటక ప్రాంతాల్లోని సాంస్కృతిక కట్టడాల చరిత్రలను చెప్పే సెట్స్ ఉన్నాయిక్కడ. - శిరీష చల్లపల్లి -
బ్రైడల్ షోకేస్
ప్రతి అమ్మాయికి పెళ్లి ఓ మధురమైన ఘట్టం. అతివల ప్రియమైన వేడుకలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రయోగం మొదలుపెట్టింది జూబ్లీహిల్స్‌లోని ‘మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ’. బ్రైడల్ మేకప్‌లోని ట్రెండ్స్‌ను హైదరాబాదీలకు పరిచయం చేసింది. ముంబైకి చెందిన సెలబ్రిటీ మేకప్‌మ్యాన్ చిరాగ్ బాంబోట్ మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ విద్యార్థులకు నాలుగు రకాల మేకప్‌లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సెలీనాజైట్లీ, సుష్మితాసేన్, కత్రినాకైఫ్, సన్నీలియోన్, కంగనా రనౌత్, అనుష్క వంటి ప్రముఖ తారలకు మేకప్‌మ్యాన్‌గా వ్యవహరిస్తున్నారు చిరాగ్ బాంబోట్. ఎంగేజ్మెంట్కు ఫ్రెష్ అండ్ ఫ్లోరల్, సంగీత్‌కు వాటర్‌ప్రూఫ్, వెడ్డింగ్‌కు దివా లుక్, రిసెప్షన్‌కు బ్రైడల్ కోచర్ లుక్... ఇలా ఒక్కో ప్రత్యేకమైన మేకప్‌లను చేసి చూపించారాయన. - శిరీష చల్లపల్లి -
నాన్న మెచ్చిన దారిలో..
‘ నాన్ననే నవ్ముకం దూరమై నెలలు గడుస్తున్నాయి. ఇన్నాళ్లూ అపనవ్ముకంతో కాలం గడిపిన మేవుు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. నాన్న ఆశ యూలు నిలబెట్టే ప్రయుత్నంలో ఉన్నాం’ అని చెబుతున్నారు రియుల్ స్టార్ శ్రీహరి తనయుులు శశాంక్, మేఘాంశ్. నాన్న మెచ్చిన దారిలో వెళ్తున్నావుంటున్న వీరిని ‘సిటీప్లస్’ పలకరించింది. మేఘాంశ్: నాన్న అన్ని సౌకర్యాలతో ఇంట్లోనే పెద్ద జిమ్ ఏర్పాటు చేశారు. నేను, అన్న ప్రతి రోజూ గం టల తరబడి ఎక్సర్సైజ్లు చేసేవాళ్లం. ఫిట్నెస్ కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో నాన్న చెప్పేవారు. అన్న నాన్నతో కలసి పోటాపోటీగా ఎక్సర్సైజ్ చేసేవాడు. నాన్న పోయాక అన్న ఇప్పుడు జిమ్‌ను మళ్లీ ప్రారంభించాడు. నాన్న జ్ఞాపకాలతో జిమ్‌లో గడుపుతున్నాం. శశాంక్: మేమంటే నాన్నకు చాలా ఇష్టం. మాకు కూడా నాన్నంటే ఎంతో ఇష్టం. మమ్మల్ని స్నేహితుల్లానే చూసేవారు. నన్ను డెరైక్టర్ చేయాలని, తమ్ముడిని హీరో చేయాలని నాన్నకు కోరికగా ఉండేది. అమ్మ మాత్రం నన్ను డాక్టర్‌గా, తమ్ముడిని లాయర్‌గా చూడాలనుకునేది. నాన్న పోయాక అమ్మ ఆలోచనలూ మారాయి. నాన్న కోరిక మేరకే మమ్మల్ని డెరైక్టర్‌గా, హీరోగా చేయాలనుకుంటోంది. - శిరీష చల్లపల్లి -
ఆర్ట్ ఫర్ హోమ్
అందమైన ఇంటికి మరిన్ని అందాలు అద్దాలని ఎవరికి మాత్రం ఉండదు. తమ కలల లోగిలిని కళల నెలవుగా మార్చుకోవాలని కోరుకునేవారు ఎందరో. ఇంటీరియర్స్‌కు భారీ మొత్తం వెచ్చించలేని వారికి టైట కళాకృతులు వరంగా మారాయి. తక్కువ బడ్జెట్లో గృహాన్ని కళల సీమగా మార్చేస్తున్నాయి. అందంగా తీర్చిదిద్దిన కుండలు.. మట్టితో మలచిన శిల్పాలు, బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులు టైట కళావైభవాన్ని నగరం ముందుంచుతున్నాయి. ధ్యానంలో ఉన్న బుద్ధ ప్రతిమ ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుంది. సూర్య భగవానుడి రూపం, కూర్మం, మీనం ప్రతిమలు వాస్తు సెట్ చేస్తాయనే నమ్మకం కొందరిది. ఉత్తరప్రదేశ్ నుంచి తరలివచ్చిన ఈ కళాకృతులు ప్రస్తుతం హైదరాబాదీల ఇళ్లలో కొలువుదీరుతున్నారుు. డిఫరెంట్ హ్యాంగింగ్స్, ఫొటో ఫ్రేమ్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఇలా చేస్తారు ఈ కళాకృతుల తయారీకి కావాల్సిన మట్టిని నదులు, కాల్వల గట్ల నుంచి సేకరిస్తారు. దీనికి తగిన మోతాదులో నీరు, ఇసుక, గుర్రం లద్దె కలిపి బాగా మిక్స్ చేస్తారు. ఆ ముద్దను కుమ్మరి చక్రంపై ఉంచి కుండలను తయారు చేస్తారు. వివిధ ఆకారాల్లో ఉన్న కుండలైతే, తొలుత రెండు, మూడు భాగాలుగా చేసి వాటిని కలిపి అనుకున్న రీతిలోకి మలుస్తారు. తర్వాత వాటికి రంగులద్ది వన్నె తీసుకొస్తారు. ఇతర ప్రతిమలను, గృహోపకరణాలను అచ్చులలో వేసి రూపొందిస్తారు. సృజనాత్మకత, ఏకాగ్రత లేకపోతే ఈ బొమ్మలను అందంగా తీర్చిదిద్దలేం. - శ్రీనివాస్, విక్రేత, సుచిత్ర క్రాస్ రోడ్స్ విరివిగా అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైట కళాకృతుల అమ్మకాలు నగరంలో చాలా ప్రాంతాల్లో సాగుతున్నాయి. వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు వివిధ ధరల్లో దొరుకుతున్నాయి. కేవలం గృహాలంకరణ వస్తువులే కాదు.. టైట ఫ్యాన్సీ ఐటమ్స్‌కు కూడా ఫుల్ క్రేజ్ ఉంది. గాజులు, లోలాకులు, నగలు ఇలా ఎన్నో వెరైటీలు మగువల మనసును దోచేస్తున్నాయి. - శిరీష చల్లపల్లి -
హలీం అంటే ఏంటో ఇక్కడే తెలిసింది
- స్వాతి హైదరాబాద్: చిన్నప్పుడు సిగ్గులమొగ్గ.. కెమెరా ముందుకు రాగానే చిలిపిముగ్ధ అయింది. యాక్షన్ అనగానే మాటలతో మంత్రం వేసింది. బుల్లితెరపై రంగులు పూయించింది. వెండితెరపై కొంటె చూపుతో ఏదో మాయజేసింది. హైదరాబాద్‌తో దోస్తీ చేస్తూనే ఎన్నో మజిలీలు దాటి అందరికీ దగ్గరయ్యింది స్వాతి. ఇంటర్ నుంచి సిటీలైఫ్ ఎంజాయ్ చేస్తున్న స్వాతి.. ఆ విశేషాలు ‘సిటీప్లస్’తో ఇలా పంచుకుంది. హాయ్.. దిసీజ్ యువర్స్ స్వాతి. నేను పుట్టింది రష్యాలో. ముంబై, వైజాగ్‌లో పెరిగి ఇదిగో.. ఇప్పుడు హైదరాబాద్‌లో సెటిలయ్యాను. నేను ఎంత అల్లరి దాన్నైనా.. నా చిన్నతనం అంతా ఓ డిఫరెంట్ వాతావరణంలో సాగింది. నాన్న నేవీలో పనిచేసేవారు. అక్కడి క్వార్టర్స్‌లో అన్నీ పద్ధతిగా జరిగేవి. దీంతో నేనూ పద్ధతిగానే పెరిగాను. చిక్కడపల్లి ది బెస్ట్ హైదరాబాద్‌తో నా ఫస్ట్ క్రష్ ఇంటర్‌లోనే. నేను ఇంటర్‌కు వచ్చే సరికి అమ్మావాళ్లు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండేవాళ్లం. నారాయణగూడలోని రత్న కాలేజీలో చేరాను. అప్పటిదాకా కాస్త బిడియంగా పెరిగిన నేను.. ఇక్కడ చాలా విషయాల్లో కన్ఫ్యూజ్ అయ్యాను. సిటీబస్సు స్టాప్‌లో ఆగేది కాదు. రన్నింగ్‌లో ఎక్కడం, దిగడం తెలియక.. తికమకపడిపోయేదాన్ని. కాలేజ్ జర్నీలో మధ్యలో చిక్కడపల్లి తగిలేది. అక్కడే మా స్నేహితురాలి ఇల్లు కూడా ఉండేది. ఆ ఏరియా అంటే నాకిప్పటికీ ఎంతో ఇష్టం. అక్కడ ఎప్పుడూ పండుగ వాతావరణం ఉంటుంది. వినాయకచవితి, దసరా, దీపావళి ఇలా రకరకాల పండుగలకు ఆ ప్రాంతాన్ని రకరకాలుగా అలంకరిస్తారు. చుడీ, సుల్తాన్ బజార్లలో.. ఇంటర్ అయిపోయిన తర్వాత వేసవిలో సరదాగా యాంకరింగ్ మొదలుపెట్టాను. మా ఆంటీ లక్ష్మీ మేకపాటి ద్వారా టీవీలో యాంకరింగ్ చాన్స్ వచ్చింది. కలర్స్ ప్రోగ్రామ్‌తో మీ అందరికీ దగ్గరయ్యా. తర్వాత సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నా అమ్మే నాకు బెస్ట్ ఫ్రెండ్. షాపింగ్‌కు వెళ్లాలన్నా అమ్మతోనే వెళ్లేదాన్ని. చార్మినార్ ద గ్గర చుడీ బజార్, కోఠి దగ్గర సుల్తాన్ బజార్లో షాపింగ్ తెగ చేసేవాళ్లం. షాపింగ్ పూర్తి చేసుకుని రాత్రి 11 గంటలకు ఇంటికొస్తూ.., మొజాంజాహి మార్కెట్లోని ఫేమస్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఐస్‌క్రీమ్ లాగించేవాళ్లం. సీతాఫలం ఫ్లేవర్ అంటే నాకు ఇష్టం. హైదరాబాద్ వచ్చాకే హలీం అంటే ఏంటో తెలిసింది. ప్యారడైజ్ బిర్యానీ టేస్టే వేరు. సంగీత్ పక్కషాపులో బర్గర్.. సికింద్రాబాద్ సంగీత్ థియేటర్లో ఇంగ్లిష్ పిక్చర్స్ బాగా నడిచేవి. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లేదాన్ని. థియేటర్ పక్కనే ఉన్న బేకరీలో రూ.20 పెడితే టేస్టీ బర్గర్ వచ్చేది. బంజారాహిల్స్‌లో మహారాజా చాట్‌లో.. సమోసా చాట్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. స్వీట్లెస్ చాట్ మరింత బాగుంటుంది. యూసుఫ్‌గూడలో డిగ్రీ ఎప్పుడైతే యాంకరింగ్ మొదలుపెట్టానో బయట ఫ్రీగా తిరగడం మిస్సయ్యాను. యూసుఫ్‌గూడ సెయింట్ మేరి కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత.. ఫ్రెండ్స్ టీజ్ చేసేవారు. షూటింగ్ షెడ్యూల్స్‌తో క్లాసులు మిస్సయ్యేదాన్ని. బేసికల్‌గా నాకు చదువంటే ఇష్టం. ఈ గ్లామర్ ఫీల్డ్‌కు రాకపోయుంటే 9 టు 5 జాబ్ ఏదైనా చేసుకునేదాన్ని. కోఠీలో సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు మొదట్నుంచీ నేను గుడ్ స్టూడెంట్‌నే.. నవలలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు బాగా చదువుతుంటాను. ఫిక్షన్, రొమాంటిక్ నావెల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కోఠి ఉమెన్స్ కాలేజ్ లైన్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు దొరికేవి. అక్కడికి నాన్నతో వెళ్లి నాకు కావాల్సిన బుక్స్ తెచ్చుకునేదాన్ని. అక్కడికి వెళ్లామంటే గోకుల్ చాట్‌లో మిర్చి తినందే వచ్చేవాళ్లం కాదు. - శిరీష చల్లపల్లి -
చాకో ... అంటే కోటి
చవులూరించే చాక్లెట్లను నోట్లో వేసుకుంటే చప్పున కరిగిపోతాయి. ఒక్కసారి రుచి మరిగితే చిన్నారులు మొదలుకొని వయసు మళ్లిన వారు సైతం చాక్లెట్ల రుచికి దాసోహం కావలసిందే. చాక్లెట్లలో ప్రధానంగా ఉపయోగించే కోకోతోనే వాటికి ఆ రుచి వస్తుంది. చిన్నపిల్లలకు ఇచ్చేందుకు చాక్లెట్‌ను మించిన తాయిలం లేదు. సంతోషాన్ని పంచుకునే సందర్భాల్లో పెద్దలు కూడా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. రకరకాల బ్రాండ్లతో, రకరకాల పేర్లతో ఇప్పటికే లెక్కలేనన్ని అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రొటీన్‌కు భిన్నమైన చాక్లెట్లు వస్తున్నాయి. ఈవెంట్‌కు తగ్గ డిజైన్లలో నోరూరిస్తున్నాయి. - శిరీష చల్లపల్లి చాక్లెట్ కళాఖండాలు... పెళ్లి సందడిలో చాక్లెట్ భాగస్వామిగా మారుతోంది. విలక్షణమైన విజిటింగ్ కార్డులు చాక్లెట్పైనే కొలువుదీరుతున్నాయి. అందరూ చాక్లెట్లపై తెల్లని కేరమెల్తో అక్షరాలు మాత్రమే కాదు, ఫొటోలనూ ముద్రించి సెలబ్రేషన్స్‌కు చాకో హంగులు అద్దుతున్నారు. బర్త్ డే బాయ్స్‌కు వెరైటీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆ చిన్నారుల ఫొటోలతో లాలిపాప్స్ ప్రిపేర్ చేయించుకోవచ్చు. రాఖీ పండుగ కోసం ఆన్నాచెల్లెల్ల ఫొటోలతో రాఖీ చాకోలు ఆర్డరిస్తే క్షణాల్లో ముందుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మనదైన వేడుకల్లో మనసైన బహుమతి చాక్లెట్ రూపంలో దొరుకుతున్నాయి. హ్యాండ్‌మేడ్ చాక్లెట్లు, షుగర్‌ఫ్రీ చాక్లెట్లు, వైన్, రమ్ వంటి లిక్కర్స్ ఉపయోగించి తయారు చేసే లిక్కర్ చాక్లెట్ల వంటి వినూత్న రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పలు వేడుకల్లో చాక్లెట్ ఫౌంటేన్లు అతిథులకు పసందైన రుచులు అందిస్తున్నాయి. వెరైటీ కోరుకుంటున్నారు ప్రస్తుతం నగరవాసులు ప్రతిదాంట్లో కొత్తదనం కోరుకుంటున్నారు. ఇంట్లో జరిగే చిన్నాపెద్దా ఫంక్షన్లకు చాక్లెట్ హంగులు దిద్దుతున్నారు. తయారీలో స్వచ్ఛత ఉన్న వాటికి ఎక్కువగా ఆదరిస్తున్నారు. వెరైటీ చాక్లెట్లకు డిమాండ్ చాలా ఉంది. అందుకే మా చాక్లెట్ హట్ సంస్థ డిఫరెంట్ డిజైన్లతో చాక్లెట్లను ప్రిపేర్ చేస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా ఆయనకు కానుకగా ఇచ్చిన గులాబీ రంగు చాక్లెట్ బొకే మా తయారీనే. - కె.లక్ష్మి, చాక్లెట్ హట్ నిర్వాహకురాలు -
వెరైటీ మేళా
జ్యువెలరీ నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ వరకు.. యాక్సెసరీస్ నుంచి కిడ్స్‌వేర్ వరకు.. అన్నీ ఒకేచోట కొలువుదీరారుు. వూదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం పేజ్ త్రీప్రవుుఖురాలు పింకిరెడ్డి ప్రారంభించిన ‘దీప్‌మేళా’లో ఫ్యాషన్ ప్రియుులకు కావల్సిన విభిన్న వస్త్రాభరణాలు, గృహాలంకరణ వస్తువులు అందుబాటులో ఉన్నారుు. కోల్‌కతా, మధ్యప్రదేశ్, ముంబై, బెంగళూర్, చెన్నై తదితర నగరాల నుంచే కాక చైనా, పాకిస్థాన్, ఇటలీ దేశాల ఉత్పత్తులు కూడా ఉన్నారుు. ప్రత్యేకించి డిజైనర్ టాప్స్, డ్రెస్సులు, చీరలు, గిఫ్ట్ ఆర్టికల్స్, స్కూల్ పిల్లలు తయారు చేసిన పేపర్ బ్యాగ్స్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆదివారం వరకు జరగనున్న ఈ మేళాలో ఫుడ్స్, ఐస్‌క్రీమ్స్, ఫాస్ట్‌ఫుడ్ వెరైటీస్ నోరూరిస్తున్నారుు. పాప్ గాయని స్మిత, సిటీ ప్రముఖురాలు అంజుపోద్దార్, అర్పిత తదితరులు మేళాను సందర్శించారు. - శిరీష చల్లపల్లి ఫొటోలు: రాజేష్‌రెడ్డి సింఫనీ ఆఫ్ లైఫ్ ‘సమస్త మేఘాలతో అనేక రంగుల్లో ఆకాశం వర్షించిన ఆనందమూ-విషాదమూ శ్రమజీవి జీవితం’ అనే రవీంద్రనాథ్ టాగోర్ కవితా పాదానికి కమనీయ దృశ్యరూపం ఈ చిత్రం. టి.ఎ.అబ్రహాం 1955లో బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ పది నిమిషాల డాక్యుమెంటరీ దేశంలోని వివిధ ప్రాంతాలకు.. వివిధ వృత్తులకు చెందిన స్త్రీ-పురుషుల శ్రమజీవనాన్ని దృశ్య కావ్యంగా మలచింది. ప్రముఖ మ్యుజీషియన్ విష్ణుదాస్ షిరాలి సంగీతం సమకూర్చారు. కేన్స్ పోటీ విభాగంలో సింఫనీ ఆఫ్ లైఫ్ ప్రదర్శితమైంది. 1920ల్లో మూకీ సినిమాల్లో నటించిన విఖ్యాత హిందీ దర్శకుడు శాంతారామ్ ఫిలిమ్స్ డివిజన్ చీఫ్ ప్రొడ్యూసర్ హోదాలో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం! చార్: ది నో మ్యాన్స్ ఐలాండ్ సౌరవ్ సారంగి దర్శకత్వంలో ఫిలిమ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఇండియా-ఇటలీ దేశాలు 2012లో సంయుక్తంగా ఈ చిత్రం రూపొందించాయి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పేదల జీవితానికి చిత్రం అద్దం పడుతుంది. 14 ఏళ్ల రూబెల్ గంగా నదిని దాటి భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఒకసారి నదిలో వరద తగ్గిన తరువాత ‘చార్’ అనే ద్వీపం ఏర్పడుతుంది. ‘చార్ ఎవరికీ చెందని స్థలం’ కాబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాపలా కాస్తుంది. చార్లో చిక్కుకుపోయిన రూబెల్ కుటుంబం.. వర్షంలో ఇండియాకు తప్పించుకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. ప్రకృతి వైవిధ్యాన్ని సారంగి వేర్వేరు కెమెరాలతో స్వయంగా చిత్రీకరించారు. ఈ చిత్రానికి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలు లభించాయి! - పున్నా కృష్ణమూర్తి