Silver medals
-
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
Asian Para Games: భారత్ సరికొత్త చరిత్ర.. వందో పతకం గోల్డ్! ఎవరిదంటే
Asian para games 2023: ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్ దిలీప్ మహదు గవిత్ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్ లాంఛనం పూర్తి చేశాడు. పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్.. భారత్ గర్వించదగ్గ మధుర జ్ఞాపకాల్లో తన పేరును ‘సువర్ణా’క్షరాలతో లిఖించుకున్నాడు. కాగా ఆసియా పారా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్ రెండో స్థానం ఆక్రమించింది. ప్రధాని మోదీ అభినందనలు ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ల కఠిన శ్రమ, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ.. ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదంటూ అథ్లెట్లను మోదీ అభినందించారు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? 100 MEDALS at the Asian Para Games! A moment of unparalleled joy. This success is a result of the sheer talent, hard work, and determination of our athletes. This remarkable milestone fills our hearts with immense pride. I extend my deepest appreciation and gratitude to our… pic.twitter.com/UYQD0F9veM — Narendra Modi (@narendramodi) October 28, 2023 -
భారత షూటర్ల జోరు
చాంగ్వాన్ (కొరియా): ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రైఫిల్ షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్‌కు రెండు ఒలింపిక్స్ కోటా బెర్త్‌లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్‌కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్ షూటర్ కోన్ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో అర్జున్, దివ్యాన్‡్ష, హృదయ్ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది. తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, దర్శన రాథోడ్ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. -
చైనాలో కొనసాగుతున్న భారత్ పతకాల వేట.. చరిత్ర సృష్టించిన ముఖర్జీ సిస్టర్స్
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్యాలు కైవసం చేసుకుంది. కాగా అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే భారత క్రీడాకారులు 15 మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్‌లో 9, షూటింగ్లో 3, బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం సాధించారు. ఇక సోమవారం(అక్టోబరు 2) నాటి విశేషాలు తెలుసుకుందాం! ముఖర్జీ సిస్టర్స్‌కు కాంస్యం టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్‌కు బ్రాంజ్ మెడల్ లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సోమవారం నాటి మ్యాచ్‌లో గెలుపొంది ఆసియా క్రీడల్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్‌కు తొట్టతొలి పతకం అందించారు. తద్వారా ముఖర్జీ సిస్టర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. SMASHING IN STYLE: THE MUKHERJEE SISTERS🏓 🇮🇳's Table Tennis phenomenal duo, Ahyika Mukherjee and Sutirtha Mukherjee script history at #AsianGames2022 by clinching the BRONZE MEDAL 🏓🥉 in the women's doubles event! 🙌💫 They've broken the barrier in style, getting India's… pic.twitter.com/FDVUgnD06p — SAI Media (@Media_SAI) October 2, 2023 రోలర్ స్కేటింగ్‌లో.. భారత స్కేటింగ్ రిలే టీమ్ కాంస్య పతకం సాధించింది. వుమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. సమన్వయలోపానికి తావులేకుండా సమష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు. అబ్బాయిలు సైతం.. రోలర్ స్కేటింగ్‌లో అబ్బాయిలు కూడా అదరగొట్టారు. మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ. రిలే టీమ్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్ధాంత్, విక్రమ్ కలిసి భారత్‌కు మరో పతకం అందించారు. 🥉 BACK TO BACK BRONZE GLORY 🇮🇳 What a start to the day! ☀️ 🇮🇳's Aryan Pal, Anand Kumar, Siddhant, and Vikram have rolled their way to BRONZE in the Men's Speed Skating 3000m Relay, clocking an incredible time of 4:10.128! 🤩 🛼 Let's give them a roaring applause for their… pic.twitter.com/WkLDxvKvTS — SAI Media (@Media_SAI) October 2, 2023 -
పతకాల ఖాతా తెరిచిన భారత్.. వరుసగా రెండు మెడల్స్
ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. ఆదివారం భారత ఖాతాలో రెండు పతకాలు వచ్చి చేరాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా రజిత పతకం సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్లో మెహులీ ఘోష్, రమిత, ఆషి చౌక్సే షూటర్లతో కూడిన భారత జట్టు.. 1886 స్కోర్‌తో రెండో స్ధానంలో నిలిచింది. దీంతో సిల్వర్ మెడల్ భారత్‌ను వరించింది. ఇక 1896 స్కోర్‌తో మొదటి స్ధానంలో నిలిచిన చైనా బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయింది. మరోవైపు రోయింగ్‌లో కూడా భారత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రెండో స్ధానంలో నిలిచారు. ఇక మొదటి స్ధానంలో నిలిచిన చైనా గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఉవ్వెత్తున ఎగసిన ‘ఆసియా’ ఉత్సవం.. పతకాల వేటకు రంగం సిద్దం -
భారత ఆర్చర్ల పసిడి పంట
షార్జా: ఆసియా కప్ స్టేజ్–3 ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్లు అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఇందులో ఐదుస్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. కాంపౌండ్ విభాగంలో భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత అమ్మాయిలు క్లీన్‌స్వీప్ చేశారు. ప్రగతి స్వర్ణం నెగ్గగా... అదితి స్వామి రజతం, పర్ణీత్ కౌర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రియాంశ్ స్వర్ణం, ఓజస్ రజతం నెగ్గారు. కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు పసిడి పతకాలు దక్కించుకున్నాయి. ఆకాశ్, మృణాల్ చౌహాన్, పార్థ్ సాలుంకేలతో కూడిన భారత రికర్వ్ పురుషుల జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో త్రిషా పూనియా, పార్థ్ సాలుంకేలతో కూడిన టీమిండియా రజతం నెగ్గింది. -
Asian Continental Chess: మెరిసిన హర్ష, ప్రియాంక
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో 22 ఏళ్ల హర్ష 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... మహిళల విభాగంలో ప్రియాంక 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే చెస్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ విభాగంలో భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 7 పాయింట్లతో... మహిళల విభాగంలో భారత్‌కే చెందిన పీవీ నందిథా 7.5 పాయింట్లతో చాంపియన్స్‌గా అవతరించారు. ఓపెన్ విభాగంలో టాప్–4 ప్లేయర్లు, మహిళల విభాగంలో టాప్–2 క్రీడాకారిణులు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. గురువారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్‌కే చెందిన కార్తీక్ వెంకటరామన్‌తో తలపడిన 22 ఏళ్ల హర్ష భరతకోటి 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్షతోపాటు ఆధిబన్, నారాయణన్, వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), సేతురామన్, కార్తీక్ వెంకటరామన్ 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష రెండో ర్యాంక్‌లో, ఆధిబన్ మూడో ర్యాంక్‌లో, నారాయణన్ నాలుగో ర్యాంక్‌లో, వొఖిదోవ్ ఐదో ర్యాంక్‌లో, సేతురామన్ ఆరో ర్యాంక్‌లో, కార్తీక్ ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఈ టోర్నీలో హర్ష అజేయంగా నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచిన అతను మిగతా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో విజయవాడకు చెందిన 20 ఏళ్ల ప్రియాంక చివరిదైన తొమ్మిదో రౌండ్లో 47 ఎత్తుల్లో భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ను ఓడించింది. ప్రియాంకతోపాటు దివ్య దేశ్‌ముఖ్ (భారత్), వో థి కిమ్ ఫుంగ్ (వియత్నాం) 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రియాంకకు రజతం, దివ్య దేశ్‌ముఖ్‌కు కాంస్యం లభించాయి. ఈ టోర్నీలో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓటమి చవిచూసింది. -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో రజతం... మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన స్నేహిత్‌తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్‌ను నిర్వహించారు. -
Commonwealth Games 2022: భారత్ పతకాల మోత
కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 11 పతకాలతో అదరగొట్టారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉండటం విశేషం. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, మహిళల టి20 క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల రేసులో నిలిచారు. బర్మింగ్‌హామ్: ఊహించినట్టే భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు), పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో రవి దహియా 10–0తో వెల్సన్ (నైజీరియా)పై, నవీన్ 9–0తో షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలుపొందారు. మహిళల 53 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. వినేశ్ ఆడిన మూడు బౌట్లలోనూ గెలిచి విజేతగా నిలిచింది. వినేశ్ తొలి రౌండ్లో సమంతా స్టీవర్ట్ (కెనడా)పై, రెండో రౌండ్లో మెర్సీ (నైజీరియా)పై, మూడో రౌండ్లో చమోదయ కేశని (శ్రీలంక)పై గెలిచింది. కాంస్య పతక బౌట్లలో పూజా సిహాగ్ 11–0తో నయోమి బ్రున్ (ఆస్ట్రేలియా)పై, పూజా గెహ్లోత్ 12–2తో క్రిస్టెల్లీ (స్కాట్లాండ్)పై, దీపక్ 10–2తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై నెగ్గారు. హాకీలో మూడోసారి... పురుషుల హాకీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 3–2తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ (2010, 2014) చేరి రన్నరప్‌గా నిలిచింది. 2018లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. అవినాష్, ప్రియాంక అద్భుతం అథ్లెటిక్స్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్‌కిది తొమ్మిదోసారి కావడం విశేషం. తాజా ప్రదర్శనతో అవినాష్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఘనత వహించాడు. మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ క్రీడల చరిత్రలో రేస్ వాకింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. లాన్ బౌల్స్‌లో రజతం లాన్ బౌల్స్ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్’ ఈవెంట్లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. -
World Athletics Championships: ‘టాప్’ లేపిన అమెరికా
యుజీన్ (అమెరికా): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది. 1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది. పోటీల చివరిరోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్లో అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్)... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో టోబీ అముసాన్ (నైజీరియా) కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ రికార్డులు సృష్టించినందుకు డుప్లాంటిస్, టోబీ అముసాన్లకు లక్ష డాలర్ల చొప్పున (రూ. 79 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆఖరి రోజు ఎనిమిది విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో తలీతా డిగ్స్, అబీ స్టెనర్, బ్రిటన్ విల్సన్, సిడ్నీ మెక్లాఫ్లిన్లతో కూడిన అమెరికా జట్టు 3ని:17.79 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలోనూ అమెరికాకే స్వర్ణం లభించింది. పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్లో డుప్లాంటిస్ 6.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 6.20 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్లో టోబీ అముసాన్ 12.12 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఫైనల్ రేసును టోబీ 12.06 సెకన్లలోనే ముగించి మరోసారి ప్రపంచ రికార్డు సాధించి, బంగారు పతకం గెలిచినా... రేసు జరిగిన సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రికార్డును గుర్తించలేదు. స్వర్ణంతో ఫెలిక్స్ రిటైర్... అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ తన కెరీర్‌ను స్వర్ణ పతకంతో ముగించింది. 36 ఏళ్ల అలీసన్ ఫెలిక్స్ 4్ఠ400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం నెగ్గిన అమెరికా రిలే జట్టులో పోటీపడలేదు. అయితే ఆమె హీట్స్‌లో బరిలోకి దిగడంతో ఫెలిక్స్‌కు కూడా పసిడి పతకాన్ని ఇచ్చారు. అంతకుముందు ఆమె 4్ఠ400 మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా పది ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఫెలిక్స్ మొత్తం 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది. -
రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం
Asian Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ మహిళల విభాగంలో శుక్రవారం భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ అన్షు మలిక్ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... మనీషా (62 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సుగుమి సకురాయ్ (జపాన్)తో జరిగిన ఫైనల్లో అన్షు 0–4తో ఓడిపోయింది. అంతకుముందు అన్షు వరుసగా మూడు బౌట్లలో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించడం) పద్ధతిలో షోఖిడా (ఉజ్బెకిస్తాన్)పై... డానియెలా స్యు చింగ్ లిమ్ (సింగపూర్)పై, బొలోర్‌తుయా (మంగోలియా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐదుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో 65 కేజీల విభాగంలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. భారత రెజ్లర్ రాధిక మూడు బౌట్లలో గెలిచి, ఒక బౌట్లో ఓడిపోయి రెండో స్థానంతో రజతం నెగ్గింది. 62 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మనీషా 4–2తో హన్బిట్ లీ (కొరియా)పై గెలిచింది. చదవండి: Rishabh Pant: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత షట్లర్ల హవా.. మరో 3 పతకాలు ఖాయం
టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు పతకాల పంట పండే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే.. మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలు సొంతమవుతాయి. లేదంటే కనీసం మూడు రజత పతకాలు మాత్రం ఖాయం. పురుషుల బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్, సుహాస్ యతిరాజ్, కృష్ణ నాగర్ పురుషుల సింగిల్స్‌లో తమ విభాగాల్లో ఫైనల్ చేరుకున్నారు. వీరు ముగ్గురు స్వర్ణం కోసం పోటీపడతారు. మనోజ్ సర్కార్, తరుణ్ ధిల్లాన్ సెమీస్‌లో ఓటమి పాలవ్వడంతో కాంస్యం కోసం పోరాడనున్నారు. అలాగే, మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో భగత్, పలక్ జోడీ కూడా సెమీస్‌లోనే వెనుదిరిగింది. దీంతో ఈ జోడీ కూడా కాంస్య పతక పోరులో నిలిచింది. కాగా, ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్ సెమీస్‌లో అత్యంత సునాయాస విజయం అందుకున్నాడు. ఎస్ఎల్ 3 సెమీస్‌లో జపాన్ ఆటగాడు డైసుక్ ఫుజిహారాను 21-11, 21-16 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేశాడు. అతడు స్వర్ణ పతక పోరులో గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియెల్ బెథెల్‌తో పోటీపడనున్నాడు. ఎస్ఎల్ 4 విభాగంలో సుహాస్.. ఇండోనేసియా షట్లర్ సెతియవన్ను 21-9, 21-15 తేడాతో ఓడించాడు. సుహాస్ ఫైనల్లో టాప్‌సీడ్ లూకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో తలపడనున్నాడు. ఇక, ఎస్‌హెచ్ 6 విభాగంలో కృష్ణ నాగర్.. సెమీస్‌లో బ్రిటన్ ఆటగాడు క్రిస్టీన్ కూంబ్స్‌ను 21-10, 21-11 తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరాడు. స్వర్ణం కోసం పోరులో కృష్ణ.. హాంకాంగ్ షట్లర్ చు మన్ కైతో పోటీపడతాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 15 పతకాలు సాధించింది. వీటిలో మూడు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యోకి బయల్దేరేముందు భారత పారాలింపిక్స్ ప్రతినిధులు కనీసం 15 పతకాలు సాధిస్తామని ఛాలెంజ్ చేసి మరీ విమానం ఎక్కారు. అన్న మాట ప్రకారమే భారత్ ఇప్పటికే 15 పతకాలు సాధించింది. ఈ సంఖ్య 25 దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఈ స్థాయిలో పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2016 రియో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన 4(2 స్వర్ణం, రజతం, కాంస్యం) పతకాలే ఇప్పటిదాకా అత్యుత్తమం. చదవండి: క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
అసాధారణం... దేవేంద్ర ప్రస్థానం
దేవేంద్ర ఝఝారియా గెలుపు ప్రస్థానమిది. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. ‘మా నాన్న చేసిన త్యాగాలు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. కొద్ది రోజుల క్రితం ఒలింపిక్స్ కోసం నా శిక్షణ సాగుతున్న సమయంలోనే క్యాన్సర్‌తో ఆయన మరణించారు. ఈ పతకం నాన్నకు అంకితం.’ – దేవేంద్ర -
World Junior Wrestling: ఒక రజతం, రెండు కాంస్యాలు..
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు కూడా పురుషులకు ధీటుగా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా సంజూ (62 కేజీలు), భటేరి (72 కేజీలు) పసిడి పోరుకు అర్హత సంపాదించారు. దీంతో వీరిద్దరికి కనీసం రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం ఫైనల్లో ఓడిన బిపాష (76 కేజీలు) రజతంతోనే సరిపెట్టుకుంది. సిమ్రన్ (50 కేజీలు), సితో (55 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. (అప్పుడు ఎందుకు నవ్వలేదు: రవి దహియాను ప్రశ్నించిన ప్రధాని మోదీ) మహిళల 76 కేజీల టైటిల్ బౌట్లో బిపాష 0–10 స్కోరు (టెక్నికల్ సుపిరియారిటీ)తో ప్రత్యర్థి కైలీ రెనీ వెల్కెర్ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. 65 కేజీల కేటగిరీ సెమీ ఫైనల్లో భటేరి 3–2తో అమినా రొక్సానా (రొమేనియా)ను ఓడించింది. ఫైనల్లో ఆమె మాల్డొవాకు చెందిన ఇరినా రింగాసితో తలపడనుంది. 62 కేజీల సెమీస్‌లో సంజూ దేవి 8–5తో బిర్గుల్ సొల్తనొవా (అజర్బైజాన్)పై గెలిచింది. తుది పోరులో ఆమె... ఎలీనా కసబియెవా (రష్యా)తో పోటీపడనుంది. 50 కేజీల కాంస్య పతక పోరులో సిమ్రన్ 7–3తో నటాలియా వరకిన (బెలారస్)పై, 55 కేజీల విభాగంలో సితో 11–0తో మెల్డా డెర్నెక్సి (టర్కీ)పై గెలుపొందారు. 59 కేజీల కేటగిరీలో కుసుమ్కు నిరాశ ఎదురైంది. కాంస్యం కోసం తలపడిన ఆమె 1–3తో జాలా అలియెవా (అజర్బైజాన్) చేతిలో ఓడింది. 72 కేజీల సెమీ స్లో సనేహ్ 0–11తో కెన్నెడీ అలెక్సిస్ (అమెరికా) చేతిలో ఓడింది. ఆమె కాంస్యం కోసం పోటీ పడనుంది. భారత పురుష రెజ్లర్లు రజతం సహా 6 పతకాలు సాధించగా... మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఒక రజతం, రెండు కాంస్య పతకాలు గెలిచారు. -
సూపర్ సంజీత్...
దుబాయ్: ప్రత్యర్థి రికార్డు ఘనంగా ఉన్నా... అవేమీ పట్టించుకోకుండా తన పంచ్ పవర్‌తో భారత హెవీవెయిట్ బాక్సర్ సంజీత్ సత్తా చాటుకున్నాడు. ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పురుషుల 91 కేజీల విభాగంలో సంజీత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 91 కేజీల ఫైనల్లో సంజీత్ 4–1తో 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, మూడుసార్లు ఆసియా చాంపియన్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించాడు. ► మరోవైపు 52 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్... 64 కేజీల విభాగంలో శివ థాపాలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తీవ్రంగా పోరాడినా చివరకు రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 2–3తో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ షఖోబిదిన్ జోయ్‌రోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... శివ థాపా 2–3తో బాతర్సుఖ్ చిన్‌జోరిగ్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. ► 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ జోయ్‌రోవ్ చేతిలో ఓడిన అమిత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చాడు. ఇద్దరూ ఎక్కడా జోరు తగ్గించుకోకుండా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. అమిత్ ఆటతీరు చూశాక విజయం అతడినే వరిస్తుందనిపించినా... బౌట్ జడ్జిలు మాత్రం జోయ్‌రోవ్ ఆధిపత్యం చలాయించాడని భావించారు. తుది ఫలితంపై భారత బృందం జ్యూరీకి అప్పీల్ చేసింది. అయితే భారత అప్పీల్‌ను జ్యూరీ తోసిపుచ్చింది. దాంతో జోయ్రోవ్కే స్వర్ణం ఖాయమైంది. ► ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్‌కు 15 పతకాలు వచ్చాయి. పురుషుల విభాగంలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు... మహిళల విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2019లో భారత్ అత్యధికంగా 13 పతకాలు సాధించింది. అమిత్, శివ థాపా -
నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు
బ్యాంకాక్: ఈ ఏడాది మరో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. శనివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. 37 దేశాల నుంచి పలువురు మేటి బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. భారత్‌కే చెందిన దీపక్ సింగ్ (48 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకంతో అదరగొట్టాడు. సెమీఫైనల్లో ఓడిన మంజు రాణి (48 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), భాగ్యబతి కచారి (75 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిన్లాండ్లో జరిగిన ‘గీ–బీ’ టోర్నీలో, పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్ స్టామ్ టోర్నీలో రజత పతకాలు నెగ్గిన హుసాముద్దీన్ మూడోసారీ రజతంతో సరిపెట్టుకున్నాడు. చట్‌చాయ్ డెచా బుత్‌దీ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో హుసాముద్దీన్ 0–5తో ఓడిపోయాడు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ సింగ్ 0–5తో మిర్జాఖెమెదోవ్ నోదిర్‌జోన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... బ్రిజేశ్ యాదవ్ 1–4తో అనావత్ థోంగ్‌క్రాటోక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 0–5తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 75 కేజీల ఫైనల్లో ఆశిష్ 5–0తో కిమ్ జిన్జే (కొరియా)పై నెగ్గి పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. తొమ్మిది స్వర్ణాలపై గురి... ఇండోనేసియాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మోనిక (48 కేజీలు)... పురుషుల విభాగంలో గౌరవ్ బిధురి (56 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు), అంకుశ్ (64 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) నేడు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. -
మహిళల జట్టుకూ రజతమే
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): బరిలోకి దిగిన తొలిసారే స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. యూత్ ఒలింపిక్స్‌లో భాగంగా మొదటిసారి నిర్వహించిన ఫైవ్–ఎ–సైడ్ హాకీ పోటీల్లో భారత పురుషుల జట్టు మాదిరిగానే భారత మహిళల జట్టు కూడా రజతంతో సంతృప్తి పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఆతిథ్య అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. ముంతాజ్ ఖాన్ చేసిన గోల్‌తో భారత్ తొలి నిమిషంలోనే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న అర్జెంటీనా ఏడో నిమిషంలో గియానెల్లా గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసింది. తొమ్మిదో నిమిషంలో సోఫియా రమాల్లో... 12వ నిమిషంలో బ్రిసా బ్రుగెస్సర్ ఒక్కో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్లో టీమిండియా 2–4తో మలేసియా చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. మూడు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 7 రజతాలతో కలిపి మొత్తం 10 పతకాలతో పదో స్థానంలో ఉంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఆకాశ్, హిమాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ఆకాశ్ 6–5తో లీ బెంజిమిన్ (కెనడా)పై, హిమాని 7–1తో జిల్ వాల్టర్ (సమోవా)పై గెలుపొందారు. -
చివర్లో తడబడి... రజతాలతో సరి...
కాంపౌండ్ టీమ్ ఆర్చరీలో భారత పురుషుల జట్టు తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరోవైపు భారత మహిళల జట్టు కూడా ‘పసిడి’ పోరులో ఒత్తిడికిలోనై రజత పతకంతోనే సరిపెట్టుకుంది. 2014 ఏషియాడ్ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం నెగ్గిన భారత జట్టు ఈసారి కొరియా చేతిలోనే ఓడిపోయి రజతంతో సంతృప్తి పడింది. అభిషేక్ వర్మ, అమన్ సైని, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఫైనల్లో అదృష్టం కలిసి రాలేదు. నిర్ణీత 24 షాట్ల తర్వాత భారత్, కొరియా 229–229 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు రెండు జట్లకు మూడేసి షాట్లతో కూడిన ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఇందులోనూ రెండు జట్లు 29 పాయింట్ల చొప్పున సాధించాయి. అయితే కొరియా ఆర్చర్లు కొట్టిన రెండు షాట్లు 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో వారికి స్వర్ణం ఖాయమైంది. భారత్ ఖాతాలో రజతం చేరింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 228–231తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. 18 షాట్ల తర్వాత రెండు జట్లు 173–173తో సమంగా ఉన్నాయి. అయితే చివరి ఆరు షాట్ల సిరీస్‌లో భారత్ 55 పాయింట్లు సాధించగా... కొరియా 58 పాయింట్లు స్కోరు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. జ్యోతి సురేఖకు ఇది రెండో ఆసియా క్రీడల పతకం. 2014 ఏషియాడ్‌లో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్యం గెలిచింది. -
ద్యుతీ... రజత ఖ్యాతి
అంచనాలు నిలబెట్టుకుంటూ పతకంతో మెరిసిన టీనేజర్ ఒకరు... ఆటకే పనికిరావంటూ ఒకనాడు ఎదురైన చేదు జ్ఞాపకాలను ట్రాక్ కింద సమాధి చేస్తూ విజయంతో మరొకరు... సొంతూళ్లో ప్రకృతి వైపరీత్యానికి అల్లాడుతున్న సన్నిహితులకు గెలుపుతో ఊరటనందించే ప్రయత్నం చేసిన వారొకరు... ఆసియా క్రీడల్లో ముగ్గురు భిన్న నేపథ్యాల అథ్లెట్లు అందించిన రజత పతకాలతో ఆదివారం భారత్ మురిస్తే... ‘గీత’ దాటినందుకు మరో అథ్లెట్ చేతికి వచ్చిన కాంస్యం దూరమై విజయం కాస్తా విషాదంగా మారిపోవడం మరో కీలక పరిణామం. ఈక్వెస్ట్రియన్‌లో వచ్చిన రెండు వెండి పతకాలు, ‘బ్రిడ్జ్’ అందించిన రెండు కాంస్యాలు కలిపి ఈవెంట్ ఎనిమిదో రోజు మొత్తం ఏడు పతకాలు మన ఖాతాలో చేరాయి. జకార్తా: అథ్లెటిక్స్‌లో ప్రతిష్టాత్మక ఈవెంట్ 100 మీటర్ల పరుగు (మహిళల)లో భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్ రజత పతకంతో సత్తా చాటింది. 11.32 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఒడియాంగ్ ఎడిడియాంగ్ (బహ్రెయిన్) 11.30 సెకన్లలో పరుగు పూర్తి చేసి స్వర్ణం గెలుచుకోగా... వీ యోంగ్లీ (చైనా–11.33 సెకన్లు) కాంస్యం సాధించింది. ఎనిమిది మంది హోరాహోరీగా తలపడ్డ ఈ రేస్‌లో ఫలితాన్ని ‘ఫొటో ఫినిష్’ ద్వారా తేల్చారు. తాను పాల్గొంటున్న తొలి ఆసియా క్రీడల్లోనే ద్యుతీ రజతం సాధించడం విశేషం. మహిళల 100 మీటర్ల ఈవెంట్లో భారత అథ్లెట్ ఒకరు ఆఖరిసారిగా 1998 ఆసియా క్రీడల్లో పతకం సాధించారు. నాడు రచిత మిస్త్రీకి కాంస్యం దక్కింది. 1951లో రోషన్ మిస్త్రీ... 1982, 1986 ఆసియా క్రీడల్లో పీటీ ఉష రజత పతకాలు సాధించాక ... మళ్లీ ఇప్పుడు భారత అథ్లెట్‌కు 100 మీటర్ల విభాగంలో రజతం దక్కింది. హిమ దాస్ మళ్లీ రికార్డు... వరుసగా రెండో రోజు జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 18 ఏళ్ల హిమ దాస్ 400 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. హిమ 50.79 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. సల్వా నాసర్ (బహ్రెయిన్–50.09 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మిఖినా ఎలీనా (కజకిస్తాన్–52.63 సె.)కి కాంస్యం దక్కింది. శనివారమే ఆమె క్వాలిఫయింగ్ రౌండ్లో 51.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు తానే దానిని బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ నిర్మలా (52.96 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. 2006 దోహా క్రీడల్లో మన్జీత్ కౌర్ రజతం గెలిచిన తర్వాత 400 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. పురుషుల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ మొహమ్మద్ అనస్ యహియా రజతం సాధించాడు. 45.69 సెకన్ల టైమింగ్ నెలకొల్పి అనస్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోరులో హసన్ (ఖతర్–44.89 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, అలీ (బహ్రెయిన్–45.70 సె.)కు కాంస్యం లభించింది. ‘నేను మరింత వేగంగా పరుగెత్తాల్సింది. అయితే ప్రస్తుతానికి రజతంతో సంతృప్తిగా ఉన్నా. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ బరిలోకి దిగాను. అనుకున్నది దక్కింది. నా కేరళలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు నా విజయం అంకితం’ అని అనస్ వ్యాఖ్యానించాడు. కొత్తగా రెక్కలు తొడిగి... సాక్షి క్రీడా విభాగం సరిగ్గా నాలుగేళ్ల క్రితం ద్యుతీ చంద్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవుతోంది. అప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆమె ఎలాగైనా పతకం గెలవాలని పట్టుదలగా శ్రమిస్తోంది. అయితే అనూహ్యంగా అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ప్రకటనతో ఆమె ట్రాక్‌పై కుప్పకూలిపోయింది. ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పించారు. ఎలాంటి డ్రగ్స్ ఆరోపణలు లేకున్నా... ఈ తరహాలో వేటు పడటం 18 ఏళ్ల అమ్మాయిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలతో పాటు ఒక రకమైన వ్యంగ్య వ్యాఖ్యలతో ఆమె మనసు వికలమైంది. ట్రాక్‌పై ప్రాక్టీస్‌కంటే కూడా ముందు తాను ఆడపిల్లనేనని రుజువు చేసుకోవాల్సిన అగత్యం ద్యుతీకి ఎదురైంది. అయితే ఆమె వెనక్కి తగ్గకుండా పోరాడాలని నిర్ణయించుకుంది. తాను ఎంచుకున్న ఆటలో లక్ష్యం చేరాలంటే అన్ని అడ్డంకులు అధిగమించేందుకు సిద్ధమైంది. చివరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ద్యుతీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ను రుజువు చేయడంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విఫలమైందని, సరైన ఆధారాలు కూడా లేవంటూ ద్యుతీ మళ్లీ బరిలోకి దిగేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో ద్యుతీ మళ్లీ కొత్తగా ట్రాక్‌పైకి అడుగు పెట్టి తన పరుగుకు పదును పెట్టింది. హైదరాబాద్‌లోనే... పేరుకు ఒడిషాకు చెందిన అమ్మాయే అయినా ద్యుతీ ప్రాక్టీస్ మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ట్రాక్‌లో ఆమె సాధన చేసింది. ద్యుతీని తీర్చి దిద్దడంలో తెలంగాణకు చెందిన భారత కోచ్ నాగపురి రమేశ్‌దే ప్రధాన పాత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా, కొన్ని సార్లు ప్రతికూల ఫలితాలు వచ్చినా పట్టువదలకుండా ఆయన ద్యుతీకి లక్ష్యాలు విధించి ప్రాక్టీస్ చేయించారు. ఒక మెగా ఈవెంట్లో ఆమె వల్ల పతకం సాధించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు అనేక సార్లు వచ్చినా... రమేశ్ మాత్రం ఆశలు కోల్పోలేదు. చివరకు ఇప్పుడు ఆసియా క్రీడల్లో రజతంతో వీరిద్దరి శ్రమకు గుర్తింపు లభించింది. జిమ్, ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్‌కు సంబంధించిన అన్ని అదనపు సౌకర్యాలు తన అకాడమీలోనే కల్పించి ద్యుతీని ప్రోత్సహిస్తూ భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా అండగా నిలవడం విశేషం. ‘ద్యుతీచంద్ రజతం నెగ్గడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. లక్ష్మణన్ విషాదం... మరో భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్‌ను దురదృష్టం వెంటాడింది. 10 వేల మీటర్ల పరుగును 29 నిమిషాల 44.91 సెకన్లలో పూర్తి చేసిన లక్ష్మణన్‌కు ముందుగా కాంస్య పతకం ఖరారైంది. అయితే అంతలోనే అతడిని డిస్‌క్వాలిఫైగా తేల్చడంతో ఆనందం ఆవిరైంది. పరుగులో ప్రత్యర్థిని దాటే ప్రయత్నంలో అతను ట్రాక్ వదిలి ఎడమ వైపు బయటకు వెళ్లినట్లు తేలింది. జ్యూరీ నిర్ణయాన్ని భారత జట్టు సవాల్ చేసింది. అతను గీత దాటినా సహచర ఆటగాడిని ఇబ్బంది పెట్టలేదని, దాని వల్ల అదనపు ప్రయోజనం ఏమీ పొందలేదని కూడా వాదించింది. అయితే ఈ అప్పీల్‌ను జ్యూరీ తిరస్కరించడంతో లక్ష్మణన్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్ 7.95 మీటర్ల దూరం గెంతి ఆరో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరున్ అయ్యసామి, సంతోష్ కుమార్... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జౌనా ముర్ము, అను రాఘవన్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అథ్లెటిక్స్‌కు సంబంధించి ఆసియా క్రీడలు ఎంతో కఠినమైనవి. ఇక్కడ ఎన్నో ఏళ్ల తర్వాత పతకం దక్కడం సంతోషంగా ఉంది. ఆమె ఆరంభంపై ఎంతో శ్రమించాం. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేకంగా స్పీడ్ రబ్బర్లను తెప్పించి సాధన చేయించాం. గోపీచంద్‌తో పాటు ఎన్నో రకాలుగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. –నాగపురి రమేశ్, ద్యుతీ కోచ్ 2014లో నా గురించి జనం నానా రకాల మాటలు అన్నారు. ఇప్పుడు దేశం తరఫున పతకం సాధించడం గొప్ప ఘనతగా భావిస్తున్నా. రేసులో మొదటి 40 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తాలని కోచ్ ముందే చెప్పారు. నేను కళ్లు మూసుకొనే పరుగెత్తాను. కళ్లు తెరిచే సరికి రేసు పూర్తయింది. గెలిచానో కూడా తెలీదు. డిస్ప్లే బోర్డుపై పేరు కనిపించిన తర్వాతే జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకున్నాను. నా కెరీర్లో ఇదే పెద్ద పతకం. –ద్యుతీచంద్ ద్యుతీచంద్ హిమ దాస్, అనస్ -
పసిడితో ముగించారు
సిడ్నీ: ఈ నెలారంభంలో సీనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు ఓవరాల్ టీమ్ టైటిల్ నెగ్గగా... అదే జోరును జూనియర్ ప్రపంచకప్‌లోనూ కొనసాగించారు. సిడ్నీలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్ తొమ్మిది స్వర్ణాలతో రెండో ర్యాంక్‌లో నిలిచింది. చివరి రోజు భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల ముస్కాన్ గురికి భారత్ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం చేరింది. ఫైనల్లో ముస్కాన్ 35 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ (18 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముస్కాన్, మను భాకర్, దేవాన్షి రాణా బృందానికి పసిడి పతకం లభించగా... అరుణిమా, మహిమా, తనూ రావల్ జట్టుకు రజతం దక్కింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, ఆయూష్ రుద్రరాజు, గుర్నీలాల్ జట్టు 348 పాయింట్లు సాధించి రజతం గెల్చుకుంది. ఓవరాల్‌గా భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలు గెలిచింది. చైనా తొమ్మిది స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 25 పతకాలు సొంతం చేసుకుంది. -
వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట
ఏలూరు రూరల్ : రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు సత్తా చాటారు. ఈ నెల 20, 21 తేదీల్లో అనంతపురంలో నిర్వహించిన పోటీల్లో వీరు ప్రతిభ చూపారు. ఏలూరు ఈదర సుబ్బమ్మదేవి పాఠశాలకు చెందిన ఎన్.సత్యవతి 44 కే జీలు, కె.శివకుమారి 48 కేజీలు, ఎం.దీపనయోమి 53 కేజీల విభాగంలో బంగారు పతకాలు సాధించారు. మరో క్రీడాకారిణి డి.అశ్విని 58 కేజీల విభాగంలో వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. బంగారు పతకాలు సాధించిన ముగ్గురు లిఫ్టర్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయా పాఠశాలల హెచ్ఎంలు వి.దుర్గరమ, కె.మాధవీలత, వ్యాయామ ఉపాధ్యాయుడు పి.గోపాల్ అభినందించారు. విద్యార్థినులను వీరు అభినందించారు. -
కరాటేలో పతకాల పంట
ఏలూరు సిటీ : నగరంలోని ది ఇండో ఇంగ్లిష్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈబీవీ ప్రసాద్ మంగళవారం ఆ వివరాలు తెలిపారు. ఈ నెల 7న వరంగల్‌లో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు పతకాలు కైవసం చేసుకున్నారని తెలిపారు. హర్షిత్, ప్రణీత్, నరేష్ అత్యధిక పతకాలు సాధించినట్టు పాఠశాల కరాటే మాస్టర్ రెన్షీ ఎహెజ్కేల్ తెలిపారు. విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏవీఎన్ రాజు, సుభద్ర దేవీ, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి ప్రసాద్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చైర్మన్ మంతెన లక్ష్మీరాజు అభినందించారు. -
హరికృష్ణకు రజతం
సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: చైనా వేదిక తెలుగు చెస్ క్రీడాకారులకు బాగా కలిసొచ్చినట్టుంది. నాలుగు రోజుల క్రితం చైనాలోని చెంగ్డూలో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో తెలుగు అమ్మాయిలు హారిక, హంపి స్వర్ణ, రజత పతకాలు నెగ్గగా... తాజాగా చైనాలోనే జరిగిన డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మెరిశాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. మహిళల ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నెపోమ్నియాచి (రష్యా) ఆరు పాయింట్లతో విజేతగా నిలిచాడు. హరికృష్ణ, యు వాంగ్ (చైనా) ఐదు పాయింట్లతో సమఉజ్జీగా నిలి చినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హరికృష్ణకు రెండో స్థానం దక్కింది. -
జాతీయ స్కూల్ చెస్‌లో తెలుగు తేజాల ప్రతిభ
వైష్ణవి, కార్తీక్‌లకు స్వర్ణాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు మెరిశారు. రెండేసి చొప్పున స్వర్ణ, రజత పతకాలు సాధించారు. తెలంగాణ కుర్రాడు కార్తీక్ కుమార్ బాలుర అండర్-11 విభాగంలో పసిడి పతకం గెలువగా, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చిన్నం వైష్ణవి అండర్-9 బాలికల ఈవెంట్లో బంగారు పతకం నెగ్గింది. ఢిల్లీలోని చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు సోమవారం ముగిశాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ కుమార్ చక్కని ప్రదర్శన కనబరిచాడు. అమ్మాయిల్లో గుంటూరు బాలిక వైష్ణవి కూడా నిలకడైన విజయాలు సాధించింది. విజయవాడకు చెందిన అక్షిత్ కుమార్ బాలుర అండర్-11 విభాగంలో, చైతన్య సాయి బాలుర అండర్-9 విభాగంలో రజత పతకాలు చేజిక్కించుకున్నారు. -
జాఫ్రిన్‌కు రెండు రజతాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బధిర క్రీడాకారిణి షేక్ జాఫ్రిన్ జర్మనీలో జరిగిన బధిర యూత్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటింది. సింగిల్స్, డబుల్స్ రెండు విభాగాల్లోనూ రజత పతకాలు సాధించింది. జర్మనీలోని హంబర్గ్‌లో ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 9 దేశాలకు చెందిన బధిర క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో జాఫ్రిన్ సింగిల్స్, డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం రాణించిన జాఫ్రిన్ తుదిమెట్టుపై చతికిలబడింది. సింగిల్స్ టైటిల్ పోరులో ఆమె 1-6, 2-6తో రష్యా అమ్మాయి స్మిర్నొవా పొలినా చేతిలో ఓడింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో జాఫ్రిన్ 6-1, 6-1తో గ్రిన్ అనన్స్తాసియా(రష్యా)పై అలవోక విజయం సాధించి ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. డబుల్స్ ఫైనల్లో షేక్ జాఫ్రిన్-పారుల్ గుప్తా జోడి 1-6, 6-4 (2/10)తో స్మిర్నొవా పొలినా- గ్రిన్ అనన్స్తాసియా (రష్యా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో జాఫ్రిన్-పారుల్ గుప్తా జంట 7-6, 6-4తో జెనోసికోవా-జురయ్ జెనోసిక్ (స్లోవేకియా) ద్వయంపై గెలుపొందింది.