sir movie
-
టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీనికి తగ్గ లాజిక్స్ కూడా చెబుతున్నారు. త్వరలోనే ఈ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ.. వివాహం జరిగే అవకాశముందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఈ న్యూస్ ఆమె ఫ్యాన్స్ చెవిలో పడింది. దీంతో వాళ్లు తెగ బాధపడిపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? అసలెందుకు పెళ్లి రూమర్స్ వచ్చాయి? మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్.. మిగతా భాషల్లో ఏం సినిమాలు చేసిందనేది పక్కనబెడితే తెలుగులో మాత్రం లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే తొలి మూవీ 'భీమ్లా నాయక్', బింబిసార, సార్, విరూపాక్ష.. ఇలా వరసగా నాలుగు సినిమాలతో హిట్ కొట్టింది. దీంతో టాలీవుడ్ అదృష్ట కథానాయిక అనిపించుకుంది. తాజాగా 'డెవిల్' సినిమాతో వచ్చింది. కాకపోతే ఇదైతే హిట్ అనిపించుకోలేదు. (ఇదీ చదవండి: 'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!) ఇకపోతే ఈ ఏడాది నాలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంయుక్త మేనన్.. కొత్తగా ఒక్కటంటే ఒక్క సినిమా ఒప్పుకోలేదట. తెలుగులో మాత్రమే కాదు తమిళ, మలయాళ.. ఇలా ఏ భాషా మూవీలోనూ నటించట్లేదు. ప్రస్తుతానికైతే ఆమె నటిస్తున్నట్లు ఎక్కడా క్లారిటీ లేదు. అయితే 2024లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందని, అందుకే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని అంటున్నారు. సంయుక్త మేనన్ ప్రస్తుత వయసు 28 ఏళ్లు. మరీ ఇంత చిన్న వయసులో పెళ్లి చేసేసుకుంటుందా? ఆమె మ్యారేజ్ నిజం కాదని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది స్వయంగా సంయుక్త స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
కథలో కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
తమిళ హీరో ధనుశ్, సంయుక్తి మీనన్ నటించిన తాజా చిత్రం ‘సార్’ . ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆయన కోలీవుడ్‌లో నటించిన చిత్రాలన్ని తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లిడంచారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు ధనుష్ బాడీ లాంగ్వేజ్ సరిపోలేదని అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' సినిమా చూసినప్పుడు తన బాల్యంలోకి వెళ్లినట్లు అనిపించింది. దర్శకుడు వెంకీ అట్లూరి కొందరి జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఈ కథను రాసినట్లు ఉంది. పేద విద్యార్థులకు విద్యా అందడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ధనుష్‌ను హీరోగా వెంకీ అట్లూరి ఓ సాహసమే చేశారని చెప్పుకోవాలి. పేద విద్యార్థులకు చదువును అందించాలని హీరో పడ్డ ఇబ్బందులు చక్కగా చూపించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించిన కథలా కంటే లైవ్‌లో చూపించినట్లు మార్పు చేసి ఉంటే ఇంకా బాగుండేది. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బాడీ లాంగ్వేజ్ సరిపోలేదు. మరికొన్ని సీన్లలో బాగా నటించారు. హీరోకు గురజాడ అప్పారావు గెటప్ వేయడం గొప్ప ఆలోచన. విద్యార్థులకు సినిమా థియేటర్లో పాఠాలు చెప్పడమనే కొత్తదనాన్ని డైరెక్టర్ పరిచయం చేశారు. సుమంత్‌తో కథ చెప్పించడం బాగుంది. హీరోను ఊరి నుంచి వెళ్లమన్నప్పుడు పిల్లలందరూ ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు ఆపుతారేమోనని అనుకున్నా. అదే ఊరిలో ఉండి హీరో గెలిచినట్లు చూపిస్తే ఇంకా బాగుండేది. ' అని అన్నారు. -
ఊహించని కలెక్షన్స్ తో దుమ్మురేపుతున్న సర్ మూవీ
-
ఓటీటీలో ఒకేరోజు 15కు పైగా రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు
వినోదం కావాలంటే సినిమా ఉండాల్సిందే! వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళ్లేవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఏ మూవీకెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. థియేటర్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందనేదాని కన్నా కూడా ఏ మూవీ ఓటీటీలో వచ్చింది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది? కొత్తగా వెబ్ సిరీస్‌లు ఏమొచ్చాయి? ఏవి ట్రెండ్ అవుతున్నాయి? ఏయే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమేం బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయని ఆరా తీస్తున్నారు. అందరూ కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. అలా అని థియేటర్‌కు వెళ్లడం మానేస్తున్నారని కాదు. ఓపక్క మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్‌కు వెళ్లి దాన్ని ఆదరిస్తూనే మరోపక్క ఓటీటీలో నిరంతరం ఏదో ఒక సినిమా/సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మొత్తానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలో రేపు ఒక్కరోజే దాదాపు బోలెడన్ని సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం.. నెట్‌ఫ్లిక్స్ ► సార్/వాతి ► కాట్ అవుట్ ► కుత్తే ► ది మెజీషియన్స్ ఎలిఫెంట్ ► నాయిస్ ► స్కై హై: ది సిరీస్ ► ఇన్హిస్ షాడో ► మ్యాస్ట్రో ఇన్ బ్లూ ► డ్యాన్స్ 100 ► ఏజెంట్ ఏల్విస్ జీ5 ► రచయిత ► ఐయామ్ ఐ నెక్స్ట్ ఆహా ► సత్తిగాడి రెండు ఎకరాలు ► లాక్డ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ► గంధదగుడి సన్ నెక్స్ట్ ► వన్స్ అపాన్ ఎ టైమ్ జమాలిగూడ సోనీలివ్ ► రాకెట్ బాయ్స్ - రెండో సిరీస్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) ► ది వేల్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) హాట్‌స్టార్ ► పాప్ కౌన్ -
అఫీషియల్: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ 'సార్'
మాస్టారుగా హీరో ధనుష్ ప్రేక్షకుల మనసులు గెలిచాడు. వాత్తిగా అటు తమిళ ఆడియన్స్‌ను, సార్‌గా ఇటు తెలుగు ఆడియన్స్‌ను మరోసారి తన నటనతో కట్టిపడేశాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల పైచిలుకు కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 17 నుంచి సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్.. 'సార్ వస్తున్నాడు, అందరూ క్లాస్‌కు అటెండ్ అవ్వాల్సిందే' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌తో వెల్లడించింది. మరింకే, సార్ సినిమాకు గైర్హాజరైనవాళ్లు ఈ శుక్రవారం మీ ఇంట్లోనే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. సినిమా కథ విషయానికి వస్తే.. అందరికీ అందుబాటులో ఉండాల్సిన విద్య కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? పేద విద్యార్థులకు విద్య ఎందుకు భారమవుతోంది? దాన్ని మార్చడానికి యంగ్ టీచర్ ఎంతదాకా పోరాడాడన్నదే సినిమా. తెలుగు, తమిళ భాషల్లో గత నెల 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే థియేటర్లో రిలీజైన నెల రోజులకే సార్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తుడటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. If Dhanush was our #Vaathi, we’d be ready to give up P.T period to attend his class!📚 🏫 Vaathi is coming to Netflix on the 17th of March! 🤩 pic.twitter.com/GJbqgZ0zFY — Netflix India South (@Netflix_INSouth) March 12, 2023 -
బంపర్ ఆఫర్.. స్టూడెంట్స్‌కు ఉచితంగా సార్ మూవీ చూసే ఛాన్స్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన 15రోజులవుతున్నా ఇంకా సార్ జోష్ తగ్గలేదు. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. విద్యా వ్యవస్థపై, విద్యార్థుల హక్కులను ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలో థియేటర్ల వద్ద సార్ సందడి కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలో ఇటీవలె ఖమ్మంలోని స్కూల్ విద్యార్థులు ఈ సినిమా ఉచితంగా చూపించాలంటూ ధర్నాకు దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి ఏకంగా నిర్మాత నాగవంశీ దృష్టికి చేరింది. దీంతో పిల్లల కోసం ఫ్రీ షో కావాలనే వారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. విద్యా హక్కుపై అవగాహన కల్పించడమే సార్ ప్రధాన లక్ష్యం. మా సినిమాను స్కూలు పిల్లలకు ఉచితంగా చూపించాలనుకుంటున్నాం. మీరు చేయాల్సిందల్లా contact@sitharaents.com ఐడీకి మెయిల్ చేయడమే. మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి షో ఖరారు చేస్తుంది అంటూ నాగవంశీ పేర్కొన్నారు. The Major goal of #SIRMovie #Vaathi was to spread awareness about value of education. We are happy to show our movie free of cost to the School Kids. Please send a mail at contact@sitharaents.com & our team will reach out to you at the earliest with the show confirmation! — Naga Vamsi (@vamsi84) March 4, 2023 -
దుమ్మురేపిన సార్.. సెంచరీ కొట్టేశాడుగా!
హీరో ధనుష్‌కు కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ చేసి వదలగా ఎన్నో సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో ఇక్కడి ప్రేక్షకుల కోసం ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రమే సార్. ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజైంది. విద్య కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? అది పేద విద్యార్థులకు ఎలా భారమవుతోంది? దాన్ని మార్చడానికి యువ ఉపాధ్యాయుడు ఎలా పోరాడాడన్నదే సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టింది. కేవలం 15 రోజుల్లోనే సార్ సెంచరీ కొట్టిన విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇటీవల ధనుష్.. ఈ సినిమాలోని మాస్టారు మాస్టారు పాటను తనే స్వయంగా ఆలపించిన విషయం తెలిసిందే! తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ ఆయన పాడగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపాయి. ధనుష్ నటనలోనే కాకుండా గొంతులోనూ తెలియని మ్యాజిక్ ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. Love for #Vaathi / #SIRMovie is UNSTOPPABLE ❤️ The film has crossed a massive 1️⃣0️⃣0️⃣ crores gross worldwide 🌎 Thank you all for the phenomenal support 😇@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 @SitharaEnts @7screenstudio pic.twitter.com/GOKevvLQo4 — Sithara Entertainments (@SitharaEnts) March 4, 2023 -
దర్శకుల ప్రతిభను పెంచే నటుడు ధనుష్: వెంకీ అట్లూరి
తమిళ సినిమా: ధనుష్ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్. తమిళంలో పార్టీ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌమ్య నిర్మించారు. వెంకీ అట్లూరి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. 1990 ప్రాంతంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కించారు. విద్య కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిన పెద్ద వ్యాపారంగా మారి పేద విద్యార్థులకు ఎలా భారమవుతోంది, దాన్ని మార్చడానికి ఓ యువ ఉపాధ్యాయుడు చేసే పోరాటమే ఈ చిత్రం. ఈనెల 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్రం శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ఇంత మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం పక్క బలంగా నిలిచిందన్నారు. ఇక నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదని, ఆయన దర్శకుల ప్రతిభను పెంచే నటుడని పేర్కొన్నారు. షూటింగ్లో ఏ విషయం గురించి అయినా వెంటనే ఓకే చెప్పే నటుడని కొనియాడారు. ఆయనతో పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. వాతి చిత్రం 8 రోజుల్లో రూ. 75 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు తెలిపారు. ఇంకా భారీ మొత్తంలో వసూలు చేస్తుందని దర్శకుడు వెంకీ అట్లూరి ధీమా వ్యక్తం చేశారు. -
దూసుకుపోతున్న సార్.. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం వాత్తీ. తెలుగులో సార్ పేరుతో రిలీజైంది. కేరళ కుట్టి సంయుక్త హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్ ..తొమ్మిది రోజుల్లోనే రూ.75 కోట్ల మార్క్ దాటిందంటూ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. సార్ త్వరలోనే వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. Our beloved #Vaathi / #Sir has garnered unconditional love ❤️ & 75+ crores gross worldwide 💸 Blockbuster Classes All Over! 🌎@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @iSumanth @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @7screenstudio @adityamusic pic.twitter.com/shZXZXBTiP— Sithara Entertainments (@SitharaEnts) February 25, 2023 చదవండి: జోర్దార్గా రాకింగ్ రాకేశ్, సుజాతల హల్ది ఫోటోలు వైరల్ -
ధనుష్ 'సార్' మూవీపై రివ్యూ ఇచ్చిన సీతారామం డైరెక్టర్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి తెలుగు చిత్రం సార్. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ ఇందులో హీరోయిన్గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఇటీవలె విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే కలెక్షన్లను కూడా వసూలు చేస్తోందీ చిత్రం. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్ తెలుగులో తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు.తాజాగా సినిమా సక్సెస్‌పై సీతారామం దర్శకుడు హనురాఘవపూడి ట్వీట్ చేశారు. సార్ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఎప్పటిలాగే ధనుష్ మరోసారి తన నటనతో కట్టిపడేశారు. మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. Watched #SIRMovie and must say, I'm mind-blown! Definitely, a must watch. And as always, @dhanushkraja garu steals the show. Very honest writing and screenplay by #VenkyAtluri. Congratulations @SitharaEnts on delivering a blockbuster. And @dopyuvraj terrific 👌🏻 pic.twitter.com/9mkTqHJC6s — Hanu Raghavapudi (@hanurpudi) February 24, 2023 -
సార్: ధనుష్ అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్
హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్ ఘనవిజయం సాధించింది. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తెలుగులో సార్‌గా తమిళంలో వాతిగా ఫిబ్రవరి 17న రిలీజైన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ దాటడంతో చిత్రయూనిట్ విజయోత్సవ సభ నిర్వహించింది. తాజాగా సార్ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో మాస్టారు మాస్టారు పాట ఎంత హిట్టో తెలిసిందే కదా! తాజాగా ధనుష్ ఈ పాట తమిళ లిరిక్స్‌ను స్వయంగా రాసి ఆలపించాడు. ఈ సాంగ్ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా ఇది చూసిన అభిమానులు మీ యాక్టింగ్‌లోనే కాదు గొంతులోనూ ఏదో మ్యాజిక్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా తెలుగులో జోగి రామయ్యశాస్త్రి రాసిన ఈ పాటను ధనుష్ ఆలపించగా ఈ వీడియోను కాస్త ఆలస్యంగా రిలీజ్ చేశారు. చదవండి: కమెడియన్‌తో నటి పెళ్లి.. వైరల్‌గా మారిన ఫోటోలు -
సినిమాలపై ఆసక్తి లేదు.. కానీ విధే ఇక్కడ నిలబెట్టింది: హీరోయిన్ సంయుక్త
ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వాత్తీ. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో సార్ అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో మలయాళ నటి సంయుక్త హీరోయిన్గా నటించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. చక్కని సామాజిక పరమైన ఇతివృత్తంతో కమర్షియల్ ఫార్ములాలో రూపొందిన వాత్తీ చిత్రంలో ధనుష్ నటనతో పాటు నటి సంయుక్త నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక నటి సంయుక్త ఇప్పటికే మలయాళం, తెలుగు చిత్రాలు నటిస్తూ పేరు తెచ్చుకున్నారు. చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కేరళ రాష్ట్రంలోని చిన్న గ్రామంలో పుట్టానని చెప్పారు. సినిమాపై పెద్దగా ఆసక్తి లేకపోయినా తన చుట్టూ ఉన్నవారితో ఏదో ఒక చిత్రంలో నటించానని చెప్పుకోవాలని ఆశపడ్డానన్నారు. అలా ఒక చిత్రంలో నటించిన తర్వాత ఇక చాలు అనుకొని చదువుపై దృష్టి పెట్టానన్నారు. అలా సినిమాలకు ఏడాది దూరమయ్యానని పేర్కొన్నారు. అయితే విధి తనను మళ్లీ సినిమాల్లోకే తీసుకొచ్చి నిలబెట్టిందన్నారు. అలా నటిస్తూ సినిమాను ప్రేమించడం మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు సినిమానే జీవితంగా మారిపోయిందన్నారు. నటిగా వైవిద్యభరిత కథాపాత్రలు పోషించాలని ఆశిస్తున్నారని, వాత్తీ చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
చీరకట్టులో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్
‘‘సార్’లాంటి సినిమాలు తీయడం ఆషామాషీ కాదు.. గుండె ధైర్యం కావాలి. ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్. నారాయణమూర్తి. ‘‘సార్’ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘కె. విశ్వనాథ్‌గారిలా ‘సార్’ చిత్రంతో తనదైన ముద్రను ఆరంభించాడు వెంకీ’’ అన్నారు తనికెళ్ల భరణి. -
యాంకర్ స్రవంతి చొక్కారపుపై ఆర్. నారాయణమూర్తి సీరియస్
తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్లో డెబ్యూ ఇచ్చారు. .రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. తాజాగా హైదరాబాద్‌లో మూవీ టీం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యాంకర్ స్రవంతి చొక్కారపుపై సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సార్ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టుల గురించి మాట్లాడిన ఆయన చివర్లో హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో మళ్లీ మైక్ తీసుకొని అతని గురించి మాట్లాడుతుండగా అది గమనించని యాంకర్.. స్టేజ్‌పై మరో గెస్ట్‌ను పిలిచింది. దీంతో కోప్పడిన ఆయన ‘ఏ పిల్లా ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్’.. అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
సార్ సినిమాకు సీక్వెల్ లేదు: డైరెక్టర్
‘‘సార్’ సినిమాకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చూసిన తర్వాత విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది. మనసున్న ప్రతి మనిషి కీ ‘సార్’ సినిమా నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ‘సార్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రదర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘చదువు అనేది నిత్యావసరం. అందుకే ‘సార్’ సినిమా బ్యాక్‌డ్రాప్ 1990 అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారనిపించింది. ధనుష్‌గారికి మా నిర్మాత ‘సార్’ కథ చెప్పమనగానే హ్యాపీ ఫీలయ్యాను. కథ విన్నాక ధనుష్ గారు చప్పట్లు కొట్టి, కాల్షీట్స్ ఎప్పుడు కావాలని అడగటంతో ఇంకా హ్యాపీ ఫీలయ్యాను. ఇందులో తండ్రీకొడుకుల మధ్య మంచి సీన్ ఉంటుంది. అది త్రివిక్రమ్‌గారితో జరిపిన సంభాషణల నుంచే పుట్టింది. ‘సార్’ యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళంలోనూ మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఆలోచన లేదు. ఇక నుంచి నా ప్రతి సినిమాకీ వైవిధ్యం చూపించడంతో పా టు విభిన్న జోనర్లలో చిత్రాలు చేస్తాను’’ అన్నారు. -
ధనుష్ 'సార్' మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో వాతి పేరుతో విడుదలయ్యింది.ధనుష్‌కి జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది.రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ధనుష్‌కి టాలీవుడ్లో సాలిడ్ డెబ్యూ లభించిందని టాక్ వినిపిస్తుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సార్ డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ఐదు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
రఘువరన్ బీటెక్ టోటల్ కలెక్షన్స్.. సార్ ఫస్ట్‌డేకు వచ్చేస్తాయి!
‘‘గత ఏడాది మా బ్యానర్ నుంచి వచ్చిన ‘భీమ్లానాయక్’, ‘డీజే టిల్లు’ సినిమాలకు హౌస్‌ఫుల్ అంటూ నాకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ‘సార్’కు అంత మంచి రెస్పాన్స్ వస్తుండడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు సూర్యదేవర నాగవంశీ. ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. అదే రోజు సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ధనుష్ గారి ‘రఘువరన్ బీటెక్’ మొత్తంగా తెలుగులో ఎంత వసూలు చేసిందో ఆ స్థాయి వసూళ్లు ‘సార్’ తొలి రోజునే వచ్చేలా ఉన్నాయి. ఆయన కెరీర్లో ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టేలా ఉంది’’ అన్నారు. ‘‘ఇంటర్మీడియట్ చదివినప్పుడు, నేను చూసిన చుట్టుపక్కల ఘటనల ఆధారంగా ఈ చిత్రకథ రాశాను’’ అన్నారు వెంకీ అట్లూరి. -
ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో సూపర్ క్రేజ్
ఈ ఫోటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడీ చిన్నది తెలుగులో వరుస సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటుంది. చేసింది మూడు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ అంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. అందం, అభినయంతో కుర్రాల మనసులు దోచుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో కావరో కాదు.. ప్రస్తుతం సార్ సినిమాతో పలకరించిన సంయుక్తా మీనన్. తెలుగులో భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే తెలుగులో చక్కటి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ధనుష్ లాంటి స్టార్ హీరోతో జతకట్టి మరోసారి స్క్రీన్‌పై మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇక హీరోయిన్గా నటించిన సంయుక్తాకు కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ లభించింది. దీనికి తోడు ప్రమోషన్స్‌కు ముందే సంయుక్త సోషల్ మీడియాలో తన ఇంటి పేరు తొలగించడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సంయుక్తా చిన్నప్పటి ఫోటోలు వైరల్‌గా మారాయి. -
ధనుష్ ‘సార్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
Sir Review: ‘సార్’ మూవీ రివ్యూ
టైటిల్: సార్(తమిళ్లో ‘వాతి’) నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, హైపర్ ఆది తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఫిబ్రవరి 17, 2023 తమిళ స్టార్ ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన కోలీవుడ్‌లో నటించిన చిత్రాలన్ని తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ సారి నేరుగా తెలుగులోనే ‘సార్’(తమిళ్లో ‘వాతి’) సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1998-2000 కాలంలో సాగుతుంది. త్రిపాఠీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ త్రిపాఠి(సముద్రఖని)కి విద్య అనేది ఒక వ్యాపారంగా భావిస్తాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తూ ప్రభుత్వ కాలేజీలు మూత పడేలా చేస్తాడు. అధిక ఫీజుల వసూళ్లు చేస్తున్నరంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఫ్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్ర కోసం ప్రభుత్వం ఓ జీవోని తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో త్రిపాఠీ ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను దత్తత తీసుకొని.. త్రిపాఠి విద్యా సంస్థల ఫ్యాకల్టీతో ఉచితంగా విద్యను అందిస్తామని చెబుతాడు. దానికి ప్రభుత్వం కూడా సై అంటుంది. దీంతో త్రిపాఠి తమ విద్యా సంస్థలో పనిచేసే జూనియర్ లెక్చర్లను ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తాడు. వారిలో ఒకరే బాలా గంగాధర్ తిలక్ అలియాస్ బాలు(ధనుష్). అతను కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్తాడు. దత్తత పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేయాలనేది త్రిపాఠి టార్గెట్ అయితే.. కాలేజీలో చదివే విద్యార్థులందరిని పాస్ చేయించి ప్రమోషన్ సాధించాలనేది బాలు లక్ష్యం. అతని లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో బాలుకు ఎదురైన సమస్యలు ఏంటి? త్రిపాఠి కుట్రను బాలు ఎలా తిప్పి కొట్టాడు? సిరిపురం ప్రెసిడెంట్(సాయి కుమార్) బాలు సార్‌ని ఊరి నుంచి బహిష్కరించినా.. పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాడు? తను చదువు చెప్పిన 45 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షల్లో రాణించారా? లేదా? పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుని అందించాలని కృషి చేస్తున్న బాలు సార్‌కి బయాలజీ లెక్చర్ మీనాక్షి(సంయుక్త మీనన్) ఎలాంటి సహాయం చేసింది? బాలు కారణంగా సిరిపురం యువతలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది..పంచండి. అంతేకానీ ఫైవ్‌స్టార్ హోటల్లో డిష్‌లా అమ్మకండి’.. ఇంటర్వెల్ ముందు విలన్‌తో హీరో చెప్పే మాట ఇది. ఈ ఒక్క డైలాగ్ చాలు ‘సార్’ సినిమా ఓ మంచి సందేశాత్మక చిత్రం అని చెప్పడానికి. దేశంలో ఎడ్యుకేషన్ మాఫీయా సాగిస్తున్న అరాచకాలు ఏంటి? ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుని వ్యాపారంగా మార్చడం వల్ల మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న అవస్థలు ఎంటి? అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఎక్కడా అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ నేరుగా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా ప్రారంభమే ఆసక్తిగా ఉంటుంది. ఐఏఎస్ అధికారి ఏఎస్ మూర్తి (సుమంత్)ను వెతుక్కుంటూ కొంతమంది విద్యార్థులు రావడం..ఆయన బాలు సార్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సినిమా అంతా బాలు క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచడం కోసం బాలు చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు.. మీనాక్షి మేడంతో ప్రేమాయణం..మధ్యలో కెమిస్ట్రీ లెక్చరర్ కార్తిక్(హైపర్ ఆది) వేసే పంచ్ జోకులతో సోసోగా ఫస్టాఫ్ సాగుతుంది. చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు బాలు సార్ చేసేప్రయత్నం.. ఆ ప్రయత్నం ఫలించకుండా చేసేందుకు త్రిపాఠి చేసే కుట్రలు సెకండాఫ్‌లో చూపించాడు. అయితే కథనం మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం, ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ఎలా ఉండబోతుంది? క్లైమాక్స్ ఏంటి? అనేది సగటు ప్రేక్షకుడు ఈజీగా ఊహించగలడు. కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. నేపథ్య సంగీతంలో ఉన్నంత బలం.. కంటెంట్‌లో ఉండదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ఉన్నంత ఎమోషన్.. సన్నివేశంలో కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. 'అవసరానికి కులం ఉండదు' , ‘అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్క రోజే ఏడుస్తారు..కానీ వాళ్ల అమ్మ నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు’, ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది’ లాంటి డైలాగ్స్.. ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. బాలు పాత్రలో ధనుష్ పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొత్తం బాలు పాత్ర చుట్టే తిరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ధనుష్ వన్ మ్యాన్ షో నడిపాడని అనొచ్చు. ఫైట్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. మీనాక్షిగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. త్రిపాఠి విద్యా సంస్థల చైర్మన్‌గా సముద్ర ఖని తనదైన నటనతో మెప్పించాడు. సిరిపురం ప్రెసిడెంట్‌గా సాయి కుమార్ ఉన్నంతలో చక్కగా నటించాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఏఎస్ మూర్తిగా సుమంత్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. .ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ‘మాస్టారు మాస్టారు’పాట ఆకట్టుకుంటుంది. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం కోలీవుడ్ స్టార్స్ క్యూ
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ హీరో-టాలీవుడ్ డైరెక్టర్ కాంబోలో ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘ప్రిన్స్’ మొదటిది. తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో... తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ - వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కోలీవుడ్ లో 300 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కోలీవుడ్ బాక్సాపీస్ దగ్గర సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నఈ డైరెక్టర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ‘వాతి’ అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో సార్ పేరుతో ఈ నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్ కోలీవుడ్‌లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ధనుష్.. వెంకీ అట్లూరి తోనే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. -
కళ్లు తిప్పుకోలేని అందం..అప్సరసలా మెరిసిపోయిన సంయక్త మీనన్ (ఫొటోలు)
-
సార్ మీ అందరి కథ – ధనుష్
‘‘సార్’ సినిమా అన్నివర్గాల వారికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ల కథతో కనెక్ట్ అవుతారు. ‘సార్’ మీ అందరి కథ.. మీకు నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారంవిడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘2002లో నా తొలి చిత్రం విడుదలయినప్పుడు నెర్వస్‌గా ఉన్నా.. ఇప్పుడు 2023లో నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశాను.. ప్రతి సినిమాని నా మొదట దిగానే భావిస్తా. ‘సార్’ ఒక సింపుల్ ఫిల్మ్.. కానీ, గ్రాండ్ ఎమోషన్స్, మెసేజ్ ఉంటుంది. నా తర్వాతి తెలుగు సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘ఒక మనిషి జీవన శైలిని మార్చేది చదువు మాత్రమే. అంత గొప్ప ఆయుధాన్ని డబ్బులేని వాళ్లకి దూరం చేయడం ఎంత వరకు న్యాయం? అనే ప్రశ్నే ‘సార్’ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఒకప్పటి తరంలో శివాజీ గణేశన్‌గారు, కమల్ హాసన్‌గారు, తెలుగులో ఎన్టీఆర్‌గారు, నాగేశ్వరరావుగారు.. ఇలా తొలి తరం నటుల్లో ఎంత గొప్పవారుఉన్నారో తర్వాతి తరం గొప్ప నటుల్లో ధనుష్‌కి నేను టాప్ ప్లేస్ ఇస్తాను.. ఎందుకంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు భయం లేదు. పని చేయడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అలా పనిచేసుకుంటూ పోయే ధనుష్‌ని ఎవరూ ఆపలేరు’’ అన్నారు. ‘‘మా సార్’ చిత్రం ప్రీమియర్స్ ఒక రోజు ముందే వేస్తున్నామంటే సినిమాపై మాకు ఎంత నమ్మకం ఉందో జనాలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చాలా మంచి సినిమా ఇది.. ఎవరూ నిరుత్సాహపడరు’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘నా ‘తొలి ప్రేమ’ సినిమా తర్వాత ఇంత నమ్మకంగా చెబుతున్నా. ‘సార్’ ప్రీమియర్స్ అయిన తర్వాత వచ్చే మౌత్ టాక్‌తో 17న అందరూ సినిమాకి వస్తారు’’ అన్నారు వెంకీ అట్లూరి. ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కెమెరామేన్ జె.యువరాజ్, నటుడు సాయికుమార్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.