Star hotels
-
ఇంపైన ఆర్ట్.. ఇకెబనావో
ప్రపంచంలోని అద్భుతమైన ప్రకృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఇకెబనా కళకు హైదరాబాద్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. జపాన్‌కు చెందిన ఈ కళ ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గానూ మారుతోంది. పర్యాటక ప్రాంతాలు, స్టార్ హోటల్స్, ఉన్నత శ్రేణి కుటుంబాల గృహాలంకరణ, శుభకార్యాలు, ఈవెంట్స్ ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన ఇకెబనా అలంకరణకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలోని కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఉపాధి కోణంలోనే కాకుండా అధిక సంఖ్యలో సంపన్న వర్గాల కుటుంబాలకు చెందిన మహిళలు తమ గృహాలంకరణ కోసం ఈ కళను నేర్చుకుంటున్నారు. ఇందుకోసం దేశ, విదేశాల నుంచి ప్రత్యేకమైన పూలను దిగుమతి చేసుకుంటారు. దీంతోపాటు మన పెరట్లో లభించే పూలు, మొక్కలతో సులభమైన పద్దతుల్లో అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భాగ్యనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి, స్టార్ హోటల్స్ వంటి ప్రదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న కళ ఇకెబనా. అయితే అధిక శాతం మంది తమ ఇంటిని అలంకరించుకోవడంలోనూ ఈ కళకు పదుపు పెడుతున్నారు. దీంతో పాటు పలువురు తమ ఆర్థికి స్థితిగతులకు సాయపడుతుందని, ఈ ఆకృతులు మనస్సుకు ఎంతగానో ప్రశాంతత ఇస్తున్నాయని మరి కొందరు ఈ కళపై మక్కువ పెంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే ప్రతి వస్తువుతోనూ ఈ ఆర్ట్‌లో అలంకరించొచ్చు. ప్రత్యేకించి ఈ వస్తువులే ఉండాలన్న నిబంధనలేమీ లేవు. వృథాను అరికట్టే కళ.. వివిధ ఆకృతుల కోసం చెట్లను కొట్టేయడం, పూలను వృథా చేయడం వంటివాటికి స్వస్తిపలకాలని, ఉన్న వాటితోనే కనువిందైన ఆకృతులను తయారు చేయవచ్చంటున్నారు పలువురు ఆర్టిస్టులు. జపాన్‌కు చెందిన ఇకెబనా ఆర్ట్‌కు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్‌లో గత 35 ఏళ్లుగా ఈ కళకు మంచి ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా, ప్రస్తుతం కళాకారులకు డిమాండ్ పెరిగింది. జపాన్‌కు చెందిన ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబానా సరి్టఫికెట్ కోర్సులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశంలో సబ్ గ్రాండ్ మాస్టర్లు నలుగురు ఉండగా అందులో ఓ ప్రముఖ మాస్టర్ మన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రేఖారెడ్డి కావడం గమనార్హం.ఆకులు, పూలతో సులువుగా.. నగరంలో ఇకెబనా ఆర్ట్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది హాబీ కోసం నేర్చుకుంటున్నారు. కళ విలువ తెలుసుకుంటున్నారు. ఆకులు, పూలతో ఇంత సులువుగా తయారు చేసిన ఆకృతులతో మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా ఆస్వాదించొచ్చనేది తెలుస్తుంది. మన సంప్రదాయం ప్రకారం ప్రకృతిలోని చెట్టు, పుట్టలను పూజిస్తాం. జపానీస్ కూడా అలాగే చేస్తారని పలువురు ఆరి్టస్టులు చెబుతున్నారు.ఇంటికోసం..ఇష్టంగా.. ‘ఇండియన్ రీసెర్చ్ అసిస్టెంట్ షిప్ దొరకాలన్నా చాలా కష్టమైన టాస్క్ ఉండేది. హారీ్టకల్చర్ డిపార్ట్మెంట్లో ఈ ఆర్ట్ ఒక భాగం. ఆ క్లాస్‌కి రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశాను. ఎన్ని గంటలు పనిచేస్తే దానికి అన్ని డబ్బులు వచ్చేవి. ప్రిపరేషన్ మెటీరియల్, క్లాస్‌లో సాయం వంటివి చేస్తుండేదాన్ని.. 2019లో హైదరాబాద్ వచ్చేశాక ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. నాకు సమయం చిక్కినపుడు ఇష్టమున్న ఆర్ట్‌ని ఇంట్లోనే ఎరేంజ్ చేస్తుంటాను. ఊరెళ్లినపుడు జొన్నలతో తయారు చేస్తాను. దేనితో అయినా ఈ ఆర్ట్ తయారు చేయొచ్చు. ఇంటిని అందంగా తయారు చేయడం, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంటాను. నేను నేర్చుకున్న తొలినాళ్లలో పూలు కొనుగోలుచేసి కళాకృతిని తయారు చేసేదాన్ని.. అయితే ఇది అంత సులువు కాదు. ప్రస్తుతం ఫ్లవర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. అవసరానికి మనకు పూలు దొరుకుతున్నాయి. అలా కాకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మంచిగా డిజైన్ చేయొచ్చన్నది అలవాటైంది. మా నాన్నకి గార్డెనింగ్ ఇష్టం. ఎక్కడైనా కొంత మెటీరియల్ తెచ్చేవారు. దాన్ని నేను వినియోగించేదాన్ని’ అని చెప్పుకొచ్చారు నగరానికి చెందిన ఆరి్టస్ట్ దివ్య. 50 శాతం ఫీజు రాయితీ.. ఇకెబనా ఆర్ట్‌ని ఇంజినీరింగ్ చదివే సమయంలోనే నేర్చుకున్నాను. ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్నారు. కోర్సుపూర్తి చేసి, జపాన్ నుంచి సరి్టఫికెట్స్ తీసుకున్నాను. వారాంతాల్లో, లేదా కుదిరినప్పుడు ఇంట్లో కళాకృతులు తయారు చేయడం అలవాటుగా మారింది. ఎగ్జిబిషన్స్ జరిగినపుడు పాల్గొనడం, మా గురువుకు సహకరించడం చేశాను. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లిపోయాను. మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో రీసెర్చ్ అసిస్టెంట్ స్కాలర్ కోసం హార్టీకల్చర్ విభాగం అధికారులు నాకున్న సరి్టఫికెట్స్, ఎగ్జిబిషన్ ఫొటోలు చూసి ఇంప్రెస్ అయ్యారు. ఉద్యోగం ఇచ్చారు. నాకున్న ఇకెబనా ఆర్ట్ సరి్టఫికెట్‌తో కోర్సు ఫీజులో సుమారు 50 శాతం తగ్గించారు. ఇది పెద్ద ఊరట కల్పించింది. – దివ్య, హైదరాబాద్ఏటా ఐదురోజుల వర్క్ షాప్..ఇకెబనా ఆర్ట్‌ను ఇంట్లోనే నేర్చుకోవచ్చు. నా దగ్గర వైద్యులు, లాయర్లు, ప్రొఫెసర్లు, గృహిణులు, చాలా మంది నేర్చుకున్నారు. కళకు ఉన్న ప్రాముఖ్యత ఇటీవలె తెలుస్తోంది. చెట్లను కాపాడటం, అందుబాటులో ఉన్న వనరులతో గ్రీనరీని తయారు చేస్తాం. ప్రస్తుతం అందరూ నేర్చుకుంటారు. ఈ కళకు గుర్తింపు తెచ్చేందుకు ఏటా 5 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తాను. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వరకూ అందరూ వచ్చి నేర్చుకుంటారు. చివరల్లో మినీ ఎగ్జిబిషన్ మాదిరి ఏర్పాటు చేస్తాం. ఆకులు, పూలను గౌరవించడం నేర్చుకుంటారు. ఇదొక హాబీ, కమర్షియల్ కాదు. చెట్లను కట్ చేయకుండా ఎండిన కొమ్మలతోనూ కళను ప్రోత్సహించొచ్చు.– రేఖారెడ్డి, హైదరాబాద్ చాప్టర్స్ అధ్యక్షురాలు. -
Tirupati: అమ్మో.. బాంబ్
తిరుపతి అర్బన్: నగరంలోని స్టార్ హోటళ్లకు గుర్తుతెలియని వ్యక్తు లు గురువారం రాత్రి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా లీలామహల్ సర్కిల్, కపిలతీర్థం, అలిపిరి సమీపంలోని నాలుగు గుర్తింపు పొందిన హోటళ్లకు మెయిల్స్ ద్వారా బెదిరింపులకు దిగారు. నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చర్చసాగుతోంది. లేదంటే చంపుతామని, మీ హోటళ్లలో పలుచోట్ల బాంబులు పె ట్టామని హెచ్చరించినట్లు సమాచారం. వెంటనే హోటళ్ల యాజ మాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు హోటల్స్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బూచీ సమాచారంతో తిరుపతి నగర వాసులు ఉలిక్కి పడ్డారు. గురువారం రాత్రి ఆ హోటల్స్‌తోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు.విమానాశ్రయానికి..ఏర్పేడు: బాంబు బెదిరింపు ఈ మెయిల్‌పై తిరుపతి విమానాశ్రయ స్టార్ ఎయిర్‌లైన్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ షబీర్ గురువారం ఫిర్యాదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. బెంగళూరులోని స్టార్ ఎయిర్ హెడ్ ఆఫీస్‌తో అనుబంధించిన తిరుపతి ఎయిర్ ఫోర్ట్ అధికారిక స్టార్ ఎయిర్ ట్విట్టర్ ఖాతాకు గుర్తుతెలియని వ్యక్తి గురువారం బాంబు బెదిరింపు సందేశాన్ని పంపినట్లు చెప్పారు. విమానాలను ఎస్5–154(టీఐఆర్–ఐఎక్స్జీ) ప్రధాన అ««ధి కారుల అనుమతి పొందిన అనంతరం మధ్యాహ్నం 1.21 గంటలకు బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
దేశమంతా...‘దక్కన్ చాయ్’
సాక్షి, హైదరాబాద్: విభిన్న రుచుల చాయ్లున్నా హైదరాబాద్ చాయ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. టీ కొట్టు నుంచి స్టార్ హోటళ్ల వరకూ హైదరాబాద్ ఫ్లేవర్ చాయ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ హైదరాబాదీ చాయ్‌ను విశ్వవ్యాప్తం చేయనున్నామని, మొదట దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేయనున్నామని ప్రముఖ శ్రేయాస్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇప్పటికే సినిమా, ఈవెంట్, ఫ్యాషన్ రంగాల్లో తమదైన గుర్తింపు పొందిన శ్రేయాస్ గ్రూప్ ‘దక్కన్ చాయ్’తో మార్కెట్లోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేశారు. దేశంలో చాయ్ వ్యాపారం 11 వేల మిలియన్ డాలర్ల మార్కెట్‌కు కలిగి ఉందని, మరో పదేళ్లలో ఇది 18 వేల మిలియన్ డాలర్లకు చేరుకోనుందని తెలిపారు. ఇందులో హైదరాబాదీ చాయ్‌ను మరింత ప్రాచూర్యంలోకి తీసుకురావడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహా రాష్ట్రలో దాదాపు వెయ్యి ఔట్లెట్లను ప్రారంభించనున్నామని శ్రీనివాస్ రావు అన్నారు. ఇలా వెయ్యి మంది ఎంటర్ప్రూనర్స్తో పాటు 2 వేల మందికి హైదరాబాదీ చాయ్ తయారీ పై శిక్షణ అందించి ఉద్యోగావకాశాలను కలి్పస్తామన్నారు. ‘దక్కన్ చాయ్’ వ్యవస్థాపకులు వీరన్న మాట్లాడుతూ.. ఇప్పటికే 250 ఔట్లెట్లతో దక్కన్ చాయ్ తేనీటి విందును అందిస్తున్నాయని, శ్రేయాస్ మీడియా భాగస్వామ్యంతో ఈ సేవలు మరింత పెరగనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ కోర్సుతో యువతకు శిక్షణ అందించనున్నామని, కొత్తవాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తామే స్టాల్ వేదికగా డిజిటల్ యాడ్స్, వాల్ మార్ట్ రూపంలో అదనంగా ఆదాయం వచ్చేలా రూపకల్పన చేశామన్నారు. -
సూడో పోలీసుకు అరదండాలు
సాక్షి, హైదరాబాద్: స్టార్ హోటళ్లకు వచ్చే విటులనే టార్గెట్‌గా చేసుకుని దాదాపు ఏడేళ్లుగా బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న సూడో పోలీసు సన్నీ జాదవ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని 2017లో ఇదే తరహా నేరంపై మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాల్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నిందితుడి నుంచి రూ.4 లక్షల నగదు, ద్విచక్ర వాహనం తదితరాలు స్వా«దీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పార్శిగుట్టకు చెందిన సన్ని సోమాజీగూడలోని ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆన్లైన్ గాంబ్లింగ్‌తో పాటు గుర్రపు పందాలకు అలవాటుపడిన ఇతడికి నెలనెలా వచ్చే జీతం సరిపోలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం పోలీసు అవతారం ఎత్తాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఓ ఎస్సై గుర్తింపు కార్డులో మార్పుచేర్పులు చేసి తన ఫొటో, పేరు పొందుపరిచాడు. దీన్ని తన ఫోన్లో సేవ్ చేసుకున్న ఇతగాడు అసలు కథ మొదలెట్టాడు. ఆన్‌లైన్‌తో పాటు వివిధ డేటింగ్ యాప్స్ ద్వారా యువతులను బుక్ చేసుకునే అలవాటు ఉన్న ఇతగాడు వారిని కలవడానికి, సన్నిహితంగా గడపడానికి కొన్ని స్టార్ హోటల్స్‌లోని రూమ్స్‌కు వెళ్లేవాడు. ఇలా ఇతడికి ఏఏ హోటల్లో ఏఏ రూమ్స్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతాయనే విషయం తెలిసింది. దీంతో ఆయా గదులకు వెళ్లి వచి్చన తర్వాత లేదా సమీపంలో కాపు కాయడం ద్వారా వాటిలోకి ఎవరు వెళ్లి వస్తున్నారో గుర్తించే వాడు. వాళ్లను అడ్డగించి పోలీసునంటూ బెదిరించే వాడు. ఆపై హోటల్ టెర్రస్ లేదా సమీపంలోని ప్రాంతానికి తీసుకువెళ్లి అరెస్టు చేస్తానంటూ భయపెట్టేవాడు. ఆ గదిలో తాను ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలో తతంగం మొత్తం రికార్డు అయిందని, దాన్ని కుటుంబీకులకు పంపుతానని తీవ్రంగా భయపెట్టేవాడు. ఇలా వారి నుంచి అందినకాడికి అందుకుని పంపేవాడు. 2017లో మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై వచ్చి తన పంథా కొనసాగించాడు. ఇతడి బారినపడిన వాళ్లు కూడా తాము కూడా తప్పు చేశామని, బయటపడితే పరువుపోతుందని మిన్నకుండిపోయే వారు. దీంతో ఇతడిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌లో ఉన్న ఓ స్టార్ హోటల్లో ఓ వ్యక్తిని సన్ని పట్టుకున్నాడు. అతడిని తన స్టైల్లో బెదిరించి రూ.5 లక్షలతో పాటు 2 తులాల బంగారం గొలుసు తీసుకుని విడిచిపెట్టాడు. ఆపై మరోసారి అతడికి ఫోన్ చేసి భయపెట్టిన సన్ని మరో రూ.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. అయినప్పటికి వదలకుండా బెదిరింపులకు పాల్పడటంతో ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఎస్సైలు శ్రీనివాసులు దాసు, పి.గగన్‌దీప్, బి.అశోక్ రెడ్డి వలపన్ని సన్నిని అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
SRH Vs RCB: ఐపీఎల్ ఫీవర్... హోటల్ రెంట్లు డబుల్!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్‌తో హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్ల గదుల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని స్టార్ హోటళ్లు బుక్ అయిపోయాయి. దీనికితోడు రేట్లు కూడా సాధారణం కంటే రెట్టింపు అంతకంటే ఎక్కువయ్యాయి. హోటల్ గదులు బుక్ చేసుకోవడానికి ఉపకరించే ప్రముఖ వెబ్సైట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య ఫేవరేట్ మ్యాచ్ జరుగనుండటంతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యధిక స్కోర్లతో హాట్ ఫేవరేట్లుగా... ప్రసుత్తం ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్–ఆర్సీబీ జట్లు హాట్ ఫేవరెట్స్‌గా మారిపోయాయి. ఈ రెండింటి మధ్య ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కేంద్రంగా ఓ మ్యాచ్ జరిగింది. అందులో ఎస్ఆర్హెచ్ 287, ఆర్సీబీ 262 పరుగులు చేసి రికార్డు సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇవి అత్యధిక స్కోర్లు కావడంతో ఈ రెండు జట్ల పైనా ఐపీఎల్ ప్రియులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలోనూ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. వీరి కోసం రెండు స్టార్ హోటళ్లలో చాలా భాగం నిర్వాహకులు బుక్ చేశారు. దీంతో పాటు ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి అనేక మంది క్రికెట్ అభిమానులు వస్తున్నారు. వీళ్లు సైతం ఆన్లైన్లో, ప్రముఖ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లోని అనేక స్టార్ హోటళ్లలో శుక్రవారం వరకు గదులు ఖాళీ లేవని ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. సరాసరిని మించిన బుకింగ్... హోటళ్లల్లో గదులు బుక్ కావడం, అందులో అతిథులు బస చేయడాన్ని ఆక్యుపెన్సీగా పిలుస్తారు. స్టాటిస్టా సంస్థ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లల్లో ఆక్యుపెన్సీ రేటు సరాసరి గరిష్టంగా 50 నుంచి 60 శాతం మాత్రమే ఉంటోంది. 2021–22 ఆరి్థక సంవత్సరంలో ఇది 51 శాతంగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో 73 శాతంగా నమోదైంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌తో పాటు పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో ప్రస్తుతం అనేక స్టార్ హోటళ్లు ‘నో రూమ్’గా మారిపోయాయి. ఉన్న వాటిలోనూ అద్దెలు సాధారణ సమయం కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ వెబ్సైట్లు, యాప్స్ సూచిస్తున్నాయి. గురువారం రాత్రి క్రికెట్ మ్యాచ్ ఉండటంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో కంటే వీకెండ్స్‌లో హోటల్ రూముల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూసినా శని–ఆదివారాల్లో ఆయా హోటళ్ల అద్దెల కంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఎక్కువగా ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న షెరిటన్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ అద్దె మంగళ–బుధవారాల్లో రూ.1.28 లక్షలుగా ఉండగా... శుక్రవారం నుంచి ఇది రూ.64 వేల నుంచి రూ.67 వేల వరకు మాత్రమే ఉన్నట్లు ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. ఇదే హోటల్లో సాధారణ గది అద్దె మంగళ–బుధవారాల్లో రూ.21,500గా, శని–ఆదివారాల్లో రూ.11,250గా ఉంది. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్లో మంగళ–బుధవారాలకు అద్దె రూ.32 వేలుగా చూపిస్తోంది. శని–ఆదివారాలకు ఈ మొత్తం రూ.9,800గా ఉంది. వెస్టిన్ హోటల్లో మంగళ–బుధవారాలకు రూ.22,500గా, శని–ఆదివారాలకు రూ.10 వేలుగా కనిపిస్తోంది. సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లో గది అద్దె మంగళ–బుధవారాలకు రూ.11,587గా, శని–ఆదివారాలకు రూ.5,071గా ఉంది. గురు–శుక్రవారాల్లో ఆయా హోటళ్లలో నో రూమ్ అని కనిపిస్తోంది. (అద్దె మొదటి రోజు చెక్ ఇన్ సమయం నుంచి రెండో రోజు చెక్ ఔట్ సమయం వరకు... పన్నులు దీనికి అదనం) -
విశాఖలో దక్షిణ భారత హోటల్ యజమానుల సదస్సు
-
రాష్ట్రంలో టెక్ మహీంద్రా స్టార్ హోటల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు మహీంద్రా హాలిడేస్ చైర్మన్, టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీసీ గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురువారం సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. స్టార్ హోటల్స్ ఏర్పాటు గురించి సీఎం జగన్‌కు ఆయన వివరించారు. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్ వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని.. వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు వెల్లడించారు. మహీంద్రా గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్రా సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్రా విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. -
ఆతిథ్య ఆంధ్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యాటకులకు ఆతిథ్య మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లకు పెట్టింది పేరైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్‌లతో పాటు దేశీయ సంస్థలైన గారిసన్, మేఫెయిర్ హోటళ్ల రాకతో సరికొత్త అనుభూతిని పంచనుంది. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో అతిథ్య రంగం విస్తరించనుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర పర్యాటకానికి సంబంధించి మొత్తం రూ.19,345 కోట్ల పెట్టుబడులతో 117 ఎంవోలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 51 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 45 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)కి వచ్చాయి. ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆతిథ్య రంగానికి చెందినవేనని అధి కా రులు తెలిపారు. 20 వరకు అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లు రాష్ట్రంలో రానున్నాయి. వీటి ద్వారా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో రూ.4949.41 కోట్ల పెట్టుబడులకు త్వరలో అన్ని అనుమతు లిచ్చి, పని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఒబెరాయ్ రూ.1,350 కోట్ల పెట్టుబడి రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్ప టికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు)లో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండు వారాల్లోగా గండికోటలో కూడా హోటల్ నిర్మా ణానికి ఒప్పందాలు చేసుకుని జూలై చివరికి పను లు ప్రారంభించనుంది. అనంతరం రాజమండ్రి (పిచ్చుకలంక), హార్సిలీహిల్స్ ప్రాంతాల్లోనూ రిసార్ట్లు, కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయ నుంది. ఒబెరాయ్ సంస్థల ద్వారానే 10,900 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హయత్, తాజ్ గ్రూప్ ఐదు నక్షత్రాల హోటళ్లు తాజ్ సంస్థ విశాఖలో రూ.1050 కోట్లతో 60 ఎకరాల్లో లగ్జరీ రిసార్టులు నిర్మించనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ పరిశీలనలో ఉంది. తాజ్ నిర్మించే టెక్నాలజీ స్పేస్‌లో రెస్టారెంట్లు, షాపు లు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒ లింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ రానున్నాయి. హయత్ సంస్థ విశాఖ శిల్పారా మంలో రూ.200 కోట్లతో 3 ఎకరాల్లో, తిరుపతి శిల్పారామంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటి ద్వారా 5,100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే విజయవాడలో రూ.92.61 కోట్లతో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మించింది. ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనర సింహస్వామి ఆలయం వద్ద రూ.100 కోట్లతో స్పిరుచ్యువల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ♦ ఏసీఈ అర్బన్ సంస్థ రూ.414 కోట్లతో 2,847 ఎకరాల్లో కాకినాడలో ఐదు నక్షత్రాల హోటల్‌తో పాటు కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి ♦ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ పేరూరులో రూ.218 కోట్లతో 5 ఎకరాల్లో, కడప శిల్పారామంలో 78.73 కోట్లతో రెండెకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లు..ఎకో–ఐఎస్ఎల్ఈ రిసార్ట్స్ సంస్థ అనంతగిరి (అరకు)లో రూ.243 కోట్లతో 43.1 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ ♦ గార్రిసన్ సంస్థ యండాడ (విశాఖ)లో రూ.122 కోట్లతో 3.87 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ – హోటల్ ♦ మైఫెయిర్ గ్రూప్ అన్నవరం (విశాఖ)లో రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో రిసార్టులు ♦ వైష్ణోవి వెర్సటైల్ వెంచర్స్ పేరూరులో రూ.125 కోట్లతో ఐదు నక్షత్రాల హోటల్ ♦ హిగ్గాని ఎంటర్ప్రైజెస్ విశాఖలో రూ.120 కోట్లతో టన్నెల్ అక్వేరియం – హోటల్ ♦ విశాఖ తెన్నేటి బీచ్‌లో ఎంవీ మా షిప్‌ను రూ.30 కోట్లతో షోర్ రిసార్టుగా తీర్చిదిద్ద ను న్నారు. శ్రీశైలంలో రూ.100 కోట్లతో రెండెకరాల్లో 3 నక్షత్రాల హోటల్, రూ.35.3 కోట్లతో రాయ చోటిలో రూ.45.5 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు రానున్నాయి. వీటికి డీపీఆర్‌లు సిద్ధంగా ఉండగా పీపీపీ గైడ్‌లైన్స్, అగ్రిమెంట్ పనులు వే గంగా పూర్తి చేసేలా కార్యచరణ రూపొందిస్తు న్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్న బాబు తెలిపారు. కాగా, ప్రభుత్వంతో ఆయా సంస్థలు కుదుర్చు కున్న ప్రతి ఒప్పందం అమలయ్యేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. -
విశ్వనగరి విశాఖ.. 2023లో వైజాగ్‌లో జరిగే ప్రధాన ఈవెంట్స్ ఇవే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్)గా విశాఖపట్నాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వరుస అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న (మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ) నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు విశాఖను వేదిక చేయనుండటమే దీనికి నిదర్శనం. ప్రపంచంలోనే ఆర్థికంగా మొదటి 20 స్థానాల్లో ఉన్న దేశాల(జీ–20)కు ఈ ఏడాది భారత్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడంతో విశాఖ వేదికగా మూడు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. వరుస సదస్సులు.. వేడుకలతో.. ఫిబ్రవరి 3, 4 తేదీలతో పాటు ఏప్రిల్ 24న విశాఖ కేంద్రంగా ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ, విద్య, వైద్యం వంటి అంశాలపై నిర్వహించే సదస్సులకు పలు దేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు విశాఖ రానున్నారు. విశాఖ బ్రాండ్ ఉట్టిపడేలా వారికి అతిథి మర్యాదలు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్) 2023 పేరుతో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని విజయవంతం చేసేవిధంగా ప్రత్యేక లోగోను రూపొందించి పలు దేశాల్లో రోడ్ షోలను నిర్వహించబోతోంది. హై ఎండ్ టెక్నాలజీకి విశాఖను వేదికగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా జనవరి 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతోను, ఫిబ్రవరి 16,17 తేదీల్లో గ్లోబల్ టెక్ సమ్మిట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ రెండు కార్యక్రమాలకు వివిధ బహుళజాతి ఐటీ కంపెనీల ప్రతినిధులు విశాఖకు తరలిరానున్నారు. ఈ సందర్భంగా విశాఖలో ఐటీ రంగానికి ఉన్న మౌలిక వసతులు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు వంటి వాటిని ప్రత్యక్షంగా వారికి వివరించనున్నారు. అలాగే ప్రవాసాంధ్ర వైద్యులు రాష్ట్రంలోని వైద్య రంగంలో గల అవకాశాలపై జనవరి 6 నుంచి 8 వరకు మూడు రోజులు పాటు విశాఖ వేదికగా సదస్సులు నిర్వహించనున్నారు. వీటితోపాటు పర్యాటకం, మారిటైమ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా విశాఖ వేదికగా సదస్సులు నిర్వహించడానికి ఆయా విభాగాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత విశాఖ ప్రగతిని మార్చే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన జరగనుంది. ఇలా వరుస సదస్సులు, వేడుకులతో విశాఖ నగరం దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా నిలుస్తోంది. స్టార్ హోటల్స్ ఫుల్ వరుసగా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు విశాఖలో జరగనుండటంతో ఈ కార్యక్రమాలకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు ముందస్తుగా స్టార్ హోటల్స్ గదులను బుక్ చేసుకుంటున్నారు. విశాఖలో ఫైవ్ స్టార్, ఫోర్ స్టార్ హోటల్స్ అన్నిటిలో 700కు పైగా గదులు ఉండగా.. వచ్చే ఏడాది ఈవెంట్స్ రోజులకు సంబంధించి అప్పుడే చాలా గదులను బుక్ అయినట్లు హోటల్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో స్టార్ హోటల్స్‌లో ఆక్యుపెన్సీ రేషియో 60 నుంచి 70 శాతంగా ఉంటుండగా, వచ్చే ఏడాది ఈ సమావేశాల తేదీల్లో అప్పుడే పలు హోటల్స్‌లో గదులు 100 శాతం బుక్ అయినట్లు తెలిపారు. క్యాపిటల్ రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖ వేదికగా పలు కార్యక్రమాలు జరుగుతుండటంతో హోటల్, ట్రావెల్స్‌కు డిమాండ్ పెరిగినట్లు ఆయా రంగాల ప్రతినిధులు తెలిపారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ను ప్రచారం చేస్తున్నాం విశాఖకు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. విశాఖను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసే విధంగా బీచ్ ఐటీ కాన్సెప్ట్‌పై అత్యధికంగా దృష్టి పెట్టాం. వచ్చే ఏడాది నుంచి విశాఖ రాజధానిగా ప్రభుత్వ కార్యకలపాలను ఇక్కడ నుంచే కొనసాగిస్తుంది. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి హై ఎండ్ ఐటీ హబ్‌గా వైజాగ్ టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ హై ఎండ్ టెక్నాలజీ కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా నాల్గవ తరం టెక్నాలజీ ఇండస్ట్రీ–4లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా జనవరి 20, 21 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో ఐటీ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాం. – శ్రీధర్ కోసరాజు, ప్రెసిడెంట్, ఐటాప్ హోటల్ గదులకు డిమాండ్ పెరిగింది మార్చి, ఏప్రిల్‌లో జరిగే సదస్సుల నిమిత్తం ఇప్పటి నుంచే బుకింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, జీ–20 సమావేశాల తేదీల్లో స్టార్ హోటల్స్ గదులకు డిమాండ్ అధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని హోటల్స్‌లో గదులు 100 శాతం బుక్ అయ్యాయి. కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో గదులు నిండటం ఇదే తొలిసారి. – పవన్ కార్తీక్ ఎంవీ, వైస్ ప్రెసిడెంట్, హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ -
అతి(ర)థులోస్తున్నారు! స్టార్ హోటళ్లలో నో రూమ్స్ బోర్డ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి స్టార్ హోటళ్లన్నీ నో రూమ్స్ బోర్డ్‌లు పెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకానున్నారు. వీరంతా రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. దీంతో నగరంలోని స్టార్ హోటల్స్ అన్నీ ముందస్తు బుకింగ్స్ అయిపోయాయి. అన్ని స్టార్ హోటళ్లలో బుకింగులు.. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల కోసం నగరంలోని హెచ్ఐసీసీ, నోవాటెల్ వంటి 48–50 స్టార్ హోటల్స్ బుకింగ్ చేసినట్లు తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ నాగరాజు తెలిపారు. స్థానిక, ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలు, చిన్న లీడర్ల కోసం ఓయో గదులు, గెస్ట్ హౌస్‌లను బుకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒకటే గదులు ఇద్దరు ముగ్గురు వసతికి వీలుంటుందనే ఉద్దేశంతో వీటిని బుకింగ్ చేసినట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకూ ఎగ్జిక్యూటివ్, సుపీరియర్, డీలక్స్, ప్రీమియర్ గదులన్నీ బుకింగ్ చేసేశారని ఆ స్టార్ హోటల్ ప్రతినిధి తెలిపారు. ప్రతినిధుల కోసం వంటకాలు, ఇతరత్రా ప్రత్యేక ఏర్పాట్ల కోసం ప్రణాళికలు చేసినట్లు సమాచారం. పోలీసుల సమీక్ష... జులై 2, 3 తేదీల్లో గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అలాగే బీజేపీలోని కీలక నేతలు నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు. దీంతో హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ యాజమాన్యంతో సోమవారం సైబరాబాద్ పోలీసులు సమావేశం నిర్వహించనున్నారు. ఆయా హోటల్స్‌లోని బుకింగ్స్ వివరాలు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హెచ్ఐసీసీ, నోవాటెల్‌తో పాటు కేంద్ర మంత్రులు బస చేయనున్న ఆయా హోటల్స్ భద్రతా ఏర్పాట్లపై పోలీసులు బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. (చదవండి: ప్రధాని బస ఎక్కడా?) -
నిబంధనలు గాల్లో.. ప్రాణాలు ‘పూల్’లో..
సాక్షి, విశాఖపట్నం: స్విమ్మింగ్ పూల్.. ఎక్కడ కనిపించినా ఈత కొట్టాలన్న ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హోటల్స్, రిసార్టుల్లో బస చేసే ముందు అందరూ అడిగేది ఒక్కటే.. మీ దగ్గర స్విమ్మింగ్‌పూల్ ఉందా అని. అంతలా ఆకర్షిస్తున్న స్విమ్మింగ్‌పూల్‌కి అనుగుణంగా లైఫ్‌గార్డులు ఉన్నారా..? నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా సరదా స్విమ్మింగ్ ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. గురువారం నగరంలోని ఓ ప్రైవేట్ రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో ప్రమాదవశాత్తూ తొమ్మిదేళ్ల చిన్నారి జారిపడి మృత్యువాత పడింది. ఈ ఘటన నగరంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో నగరంలోని రిసార్టులు, హోటల్స్‌లో గల స్విమ్మింగ్‌పూల్స్ వద్ద లైఫ్‌గార్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) తాజాగా నోటీసులు జారీ చేసింది. కనిపించని లైఫ్‌గార్డులు నగరంలో ప్రైవేట్ హోటల్స్, రిసార్టుల్లో సుమారు 30కి పైగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించకపోవడం గమనార్హం. ప్రతి స్విమ్మింగ్ పూల్ వద్ద కచ్చితంగా పూల్ సామర్థ్యం బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. కానీ ఏ ఒక్క ఈత కొలను వద్ద ఒక్క లైఫ్గార్డుని కూడా ఆయా యాజమాన్యాలు నియమించలేదు. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే హోటల్, రిసార్టుల్లో పని చేసే సిబ్బందిని వినియోగించుకుంటున్నారే తప్ప.. నిబంధనలను మాత్రం పాటించడం లేదు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరూ నిబంధనలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. సామర్థ్యాన్ని బట్టి.. లైఫ్‌గార్డులు హోటల్స్, రిసార్టుల్లో బస చేస్తున్న వారి సామర్థ్యాన్ని బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. స్విమ్మింగ్‌పూల్స్ వద్ద స్విమ్మింగ్ ఫ్లోటింగ్ ట్యూబ్స్, స్టిక్స్ అందుబాటులో ఉంచాలి. పిల్లలు ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ సేవర్స్ కచ్చితంగా ఉంటేనే ఈత కొట్టేందుకు అనుమతులు ఇవ్వాలి. లేదంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్ ప్రవేశాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాలి. పూల్ సైజ్, స్విమ్మర్స్ ఎంత మంది వినియోగించుకుంటున్నారనే విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ఒకటి నుంచి నలుగురు లైఫ్‌గార్డుల్ని నియమించాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్క దాంట్లోనూ లైఫ్ సేవర్స్ లేకపోవడం శోచనీయం. నిబంధనలపై శాప్ నోటీసులు ప్రతి పూల్‌లో గార్డులను ఏర్పాటు చేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి స్విమ్మింగ్‌పూల్ నిర్వాహకులకు నోటీసులు అందిస్తోంది. పూల్ సామర్థ్యానికి అనుగుణంగా లైఫ్‌గార్డుల్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. ఇందు కోసం రాష్ట్రీయ లైఫ్ సేవింగ్స్ సొసైటీ(ఏపీఆర్ఎల్ఎస్ఎస్) అందించే స్విమ్మర్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం తగదు ప్రైవేట్ స్విమ్మింగ్‌పూల్స్‌లో చాలా వరకూ నిబంధనలు పాటించడం లేదు. పీఆర్ఎల్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లైఫ్‌గార్డులకు శిక్షణ అందిస్తున్నాం. శాప్ ఆధ్వర్యంలో వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తున్నాం. పూల్స్ వద్ద లైఫ్‌గార్డులు ఉంటే.. విషాద ఘటనలు ఇకపై ఏ ఈత కొలను వద్ద కూడా చోటుచేసుకోవు. – బలరాం, రాష్ట్రీయ లైఫ్ సేవింగ్స్ సొసైటీ ఏపీ అధ్యక్షుడు -
జాడలేని దొంగ: స్టార్ హోటల్లే టార్గెట్.. రూ.19 కోట్ల చోరీ
సాక్షి, హైదరాబాద్: 48 ఏళ్ల వయస్సు... 29 ఏళ్ళ నేర జీవితం... 17 ఏళ్ళుగా స్టార్‌హోటల్సే టార్గెట్... 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 36 చోరీలు... దాదాపు రూ.19 కోట్ల సొత్తు అపహరణ... వివిధ రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్... ఇంతటి ఘరానా నేరచరిత్ర కలిసిన గజదొంగ జయేష్ రావ్జీ సెజ్పాల్ కోసం రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతడిని ఆఖరుసారిగా 2018 మార్చ్‌లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడి కదలికలపై సమాచారం ఉండే అందించాల్సిందిగా కోరారు. సెజ్పాల్ గత నెల్లో జైపూర్, ఉదయ్‌పూర్‌ల్లో రెండు నేరాలు చేశాడు. ►గుజరాత్‌కు చెందిన జయేష్ రావ్జీ సెజ్పాల్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఆపై గుజరాత్‌తో పాటు ముంబైలో ఉన్న కొన్ని హోటల్స్/ఫుడ్ పాయింట్స్‌లో క్యాటరింగ్ వర్కర్‌గా పని చేశాడు. ►ఈ రకంగా వచ్చే ఆదాయంతో బతుకీడ్చటం కష్టంగా మారడంతో 1991లో తొలిసారిగా ముంబైలోని డొంగ్రీ ఠాణా పరిధిలో చోరీ చేశాడు. అప్పట్లో బాగా క్రేజ్ ఉన్న వీసీపీని ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కి ఆథర్ రోడ్ జైలుకు వెళ్ళాడు. ►అక్కడే ఇతడికి రమేష్ ఛాగ్ అనే మరో నేరగాడి సలహాతో స్టార్ హోటళ్ళను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేయాలని పథకం వేశాడు. ఓ నగరాన్ని టార్గెట్‌గా చేసుకునే జయేష్ ట్రావెల్స్ బస్సుల్లో అక్కడకు చేరుకుంటాడు. ►బోగస్ గుర్తింపుకార్డులు దాఖలు చేయడం ద్వారా మధ్య తరహా లాడ్జిల్లో బస చేస్తాడు. ఆపై ఆటోలో ఏదో ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్తాడు. కొత్తగా పెళ్ళైన జంట లేదా వివాహ వేడుకలకు హాజరైన జంటల్ని గుర్తిస్తాడు. ►వీరి వద్దే భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలు ఉంటాయనే ఉద్దేశంతో వీరిని ఎంచుకుంటున్నాడు. ఒకటికి రెండుసార్లు వారిని ఫాలో అవుతూ ఏ గదిలో బస చేశారో, ఏఏ సమయాల్లో బయటకు వెళ్ళి వస్తున్నారో గుర్తిస్తాడు. ►నీట్‌గా తయారయ్యే, పక్కా వాక్చాతుర్యం కలిగి ఉన్న జయేష్ ఆ హోటల్ సిబ్బందిని మచ్చిక చేసుకునో, బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ ద్వారానో ఆ గదిలో బస చేస్తున్న తన ‘టార్గెట్’ పేరు, వివరాలు తెలుసుకుంటాడు. ►ఆపై హోటల్ లాబీల్లో ఆ జంటలో ఒకరిని (రూమ్ ఎవరి పేరుతో బుక్కై ఉంటే వారిని) పేరుతో పలకరిస్తూ వారితో మాట కలుపుతాడు. ఇలా ఒకటిరెండుసార్లు తన టార్గెట్‌తో మాట్లాడుతూ హోటల్ సిబ్బంది కంటపడతాడు. ►దీంతో వారు జయేష్ సదరు జంటకు బంధువో, స్నేహితుడో అయింటాడని భావిస్తారు. వీరికి ఈ భావన వచ్చిందనే నమ్మకం కలిగిన తర్వాత తన టార్గెట్ బయటకు వెళ్ళే వరకు ఎదురు చూస్తాడు. ►ఆపై వారి గది ఉన్న ఫ్లోర్‌కు చేరుకుని రిసెప్షన్‌ను సంప్రదించి యాక్సిస్ కార్డు మర్చిపోయానంటూ చెప్పి హోటల్ సిబ్బందిని నమ్మిస్తాడు. వారి నుంచి మరో యాక్సిస్ కార్డు తీసుకుని టార్గెట్ చేసిన వారు బస చేసిన గదిలోకి ప్రవేశిస్తాడు. ►చేతికి చిక్కిన బంగారం, వజ్రాల ఆభరణాలను తస్కరించి హోటల్ నుంచి ఆటోలో బయలుదేరి తాను బస చేసిన లాడ్జికి వెళ్తాడు. అక్కడ నుంచి సొత్తుతో సహా ముంబైకి పారిపోయి చోరీ సొత్తు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. ►ఈ పంథాలో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం సహా 18 నగరాల్లో నేరాలు చేశాడు. జయేష్ 2014లో తొలిసారిగా సిటీకి వచ్చి జూన్ 6న మెర్క్యూరీ హోటల్లో పంజా విసిరి రూ.10 లక్షల సొత్తుకు పోయాడు. ►2016 డిసెంబర్ 16న అమీర్‌పేట మ్యారీగోల్డ్ హోటల్లోని రూ.4 లక్షల బంగారం ఎత్తుకుపోయాడు. 2018 మార్చ్ 6న బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో రూ.30 లక్షల బంగారం చోరీ చేసి నగర పోలీసులకు చిక్కాడు. ►బెయిల్‌పై వెళ్లిన జయేష్ గత నెల 20న ఉదయ్‌పూర్‌లోని హోటల్లో రూ.కోటి బంగారం, ఆఖరి వారంలో జైపూర్‌లోని హోటల్ నుంచి రూ.2 కోట్ల బంగారం, నగదు తస్కరించాడు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా ఇతడిని గుర్తించిన రాజస్థాన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ►‘ఆరు రాష్ట్రాలకు వాంటెడ్‌గా ఉండగా మనం చాకచక్యంగా పట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరిచయస్తులైన రాజస్థాన్ పోలీసులు జయేష్ ఆచూకీ కోసం ఆరా తీశారు. మన దగ్గరి వివరాలు చెప్తున్నాం. దీనిపై ఎలాంటి అధికారిక లేఖలు లేవు. మనమిచి్చన సమాచారంతో అతడికి సూరత్‌లో పట్టుకున్నట్లు తెలుస్తోంది’ అని నగర అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
కరోనా ప్రభావంతో వేడుకలకు దూరం
-
క్లిక్ కొట్టు.. పుడ్ పట్టు
కిచెన్లు బోసిపోతున్నాయి. అయినా విభిన్న రకాల ఘుమ ఘుమలు వెదజల్లుతున్నాయి. జిహ్వకు నచ్చిన రుచులు క్షణాల్లో ముంగిట వాలుతున్నాయి. దీంతో పొయ్యిలకు పని లేకుండా పోతుంది. నగర జీవనంలో ఇది ప్రస్ఫుటిస్తుంది. ఉరుకుల పరుగుల జీవనానికి .. ఆన్లైన్ ఫుడ్ యాప్‌లు తోడవడంతో గృహిణులకు వంట భారం తప్పింది. మూడు పూటలా బయట ఫుడ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. నగర వాసుల అభిరుచులను పసిగట్టిన వివిధ యాప్‌లు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులు కూడా బయటఫుడ్కే మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లు పోతే ఇళ్లల్లో కిచెన్ కనిపించకుండాపోతుందేమో..! సాక్షి, విశాఖపట్నం: ఉరుకుల పరుగుల జీవితాల్లో కనీసం వంట చేసి తినడానికి కూడా జనానికి సమయం.. ఓపిక దొరకడం లేదు. ఎవరికి వారు బిజీబీజీగా గడుపుతున్నారు. ముప్పొద్దులా వండి కాస్త రుచిగా తినేందుకు సైతం వారికి సమయం ఉండటం లేదు. ఉదయం హడావుడిగా లేవడం.. రెడీ అయ్యేందుకే సమయం సరిపోకపోవడం.., మధ్యాహ్నం ఇంటికి రాలేకపోవడం రాత్రి ఆలస్యంగా రావడం మొదలైన కారణాలు కడుపు నిండా కాస్త తిండి తినేందుకు కూడా తీరిక ఉండటం లేదు. ఫలితంగా ఇటీవల అధిక శాతం ప్రజలు బయటే కొని తింటున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం కూడా ఇంటి ఫుడ్ దూరమవడానికి కారణమవుతోంది. చిన్న కుటుంబాలు పెరిగిపోవడం పల్లెల నుంచి జనం నగరాలకు అధికంగా వలసలు రావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం పిల్లల కార్పొరేట్ చదువులు వంటి కారణాలతో ప్రతీ ఒక్కరూ బిజీగా మారుతున్నారు. ఫలితంగా జిల్లాలో హోటళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ప్రధానంగా రోడ్డు సైడ్ హోటళ్లు, మొబైల్ క్యాంటీన్లు రెస్టారెంట్లు, దాబాలు, ఫుడ్ డెలివరీ యాప్‌లు అధికమవుతున్నాయి. రద్దీగా హోటళ్లు... ముఖ్యంగా ఎన్ఎడీ జంక్షన్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, వీఐపీరోడ్, అక్కయ్యపాలెం, అశీల్‌మెట్ట, సిరిపురం, బీచ్‌రోడ్డు, సీతమ్మధార, మద్దిలపాలెం మొదలైన కేంద్రాల్లో హోటళ్ల వ్యాపారం జోరందుకుంటోంది. ఇంట్లో వంట చేయకుండా హోటళ్ల నుంచే ఆహారం కొనుగోలు చేసుకొని భోజనం కానిచ్చేందుకు నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు పెరగుతున్నాయి. ఉద యం వేళల్లో టిఫిన్ సెంటర్లు, మొబైల్ క్యాంటీ న్లు, హోటళ్ల వద్ద అల్పాహారం కోసం రద్దీ కనిపిస్తోంది. ఇంట్లో నలుగురు ఉంటే హోటళ్లో టిఫిన్ కొనాలంటే కనీసం రూ.150 అవుతుంది. అదే ఇంట్లో టిఫిన్ తయారు చేసుకుంటే రూ.50 సరి పోతుంది. కానీ ఖర్చుకు జనం వెనుకాడటం లే దు. కేవలం మధ్యాహ్న భోజనం మాత్రం వండుకుని ఆఫీస్‌కి వెళ్తున్నారు. ఒక్కోసారి అన్నం మా త్రం వండుకుని మార్గమధ్యంలోని కర్రీ పాయింట్లో కూరలు, సాంబార్ కొని తింటున్నారు. యువతకు ఉపాధి.. ఫుడ్ డెలివరీ సంస్థలు రావడంతో స్థానికంగా ఉన్న యు వతకు ఉపాధి లభిస్తోంది. ఆహారం డెలివరీ చేసే సంఖ్యను బట్టి ఒక్కో వ్యక్తి నెలకు రూ.15వేల నుంచి రూ.20వేలు సంపాదిస్తున్నారు. ఉన్న ఊర్లో రూ.20 వేల దాకా సంపాదిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటున్నారు. ఒక్క నగరంలోనే ఫుడ్ డెలివరీ సంస్థల్లో పని..చేసే వారి సంఖ్య 500 దాకా చేరుకుందని సమాచారం. కేవలం ఇంటర్, డిగ్రీ చదివి ఉండి, సొంతంగా బైక్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు హోటళ్లు సైతం ఫుడ్ డెలివరీ సంస్థలకు డిస్కౌంట్లు ఇస్తుండటం, ఫుడ్ డెలివరీ చేసినందుకు కమీషన్లు ఉండటంతో ఈ సరికొత్త వ్యాపారం లాభసాటిగా ఉంటోందని యువత అభిప్రాయపడుతోంది. ఆన్లైన్ ఆర్డర్ల జోరు.. ఏడాది కిందట నుంచి నగరంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఉబెర్‌ఈట్స్, ఫుడ్‌పాండా.. ఇలా.. పలు ఆన్లైన్ సంస్థలు వచ్చాక ప్రజలు వాటి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. మొదట్లో పిజ్జాలు, బర్గర్లు మాత్రమే ఆర్డర్ ద్వారా ఇంటికి తెచ్చుకునేవారు. ఇప్పుడు వాటి స్థానంలో టిఫిన్లు, భోజనం, బిర్యానీలు కూడా చేరాయి. స్మార్ట్‌ఫోన్‌లో సదరు సంస్థల యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని, అందులో నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే అతి తక్కువ సమయంలో కోరుకున్న ఆహారం ఇంటి ముందు..ప్రత్యక్షమవుతోంది. ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే వంటి సంస్థలు పలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ప్రకటించడం ఈ వ్యాపారానికి మరింత ఊతమిస్తోంది. రెండు కొంటే ఒకటి ఉచితమన్నట్లు ఈ వ్యాపారం ఉండటంతో జనం ఆసక్తి చూపుతున్నారు. రాత్రి వేళా టిఫిన్లకే మొగ్గు రాత్రి వేళ అన్నం బదులు టిఫిన్ తినడం ఇటీవల అధికమైంది. దీంతో వివిధ మోడళ్లలో రోడ్ల వెంబడి వెలసిన దుకాణాల్లో తిని ఇంటికి వెళ్తున్నారు. మరికొందరు తీరిగ్గా రెస్టారెంట్లకు వెళ్లి మాంసాహారం, ఇతర వెరైటీ వంటకాలు ఆరగించి వెళ్తున్నారు. దీంతో ఇంట్లో వండుకోవడం, అనంతరం పాత్రలు కడగడం వంటి శ్రమ తగ్గుతోందని అధిక శాతం భావిస్తున్నారు. బయట ఫుడ్‌కే జై.. మేము ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారంలో బిజీబిజీగా ఉంటున్నాం. ఒక్కోసారి మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనానికి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కువసార్లు బయట నుంచే టిఫిన్లు, భోజనాలు తెచ్చుకుంటున్నాం. ఫుడ్ డెలివరీ సంస్థలతో హోటళ్లకు వెళ్లి తెచ్చుకునే కష్టం కూడా తప్పింది. – జి.వేణుగోపాలరావు, వ్యాపారి, పెదవాల్తేరు అలసట దూరం భార్యా భర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కాలం వెళ్లదీయలేని రోజులివి. ఈ నేపథ్యంలో.. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. వారమంతా ఇంటి పని, ఆఫీస్.. ఇలా బిజీ బిజీగా గడుపుతాం. వారాంతంలోనూ పనిలో పడితే.. శారీరక అలసట ఎక్కువవుతోంది. అందుకే వీకెండ్లో హోటళ్లకు వెళ్లడం, లేదంటే.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ.. రిలాక్స్ అవుతుంటాం. – సీహెచ్ హిమబిందు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నందగిరినగర్ ఇష్టమైనవన్నీ ఇంటికే ఇంట్లో నచ్చిన వంటలు చేసుకొని తినాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. హోటల్‌కి వెళ్లి తినాలన్నా.. అక్కడ ఫుడ్ వచ్చేవరకూ వెయిట్ చెయ్యాలి. అదే.. ఆన్లైన్లో ఆర్డర్ చేసి.. ఇంటిలో ఇతర పనులు పూర్తి చేసుకొనే సరికి ఇష్టమైన ఫుడ్ ఇంటికే వచ్చేస్తోంది. మనకు నచ్చినట్లుగా మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. – శారద, గృహిణి -
ఫైవ్ స్టార్ హోటల్‌పై ఉగ్రదాడి : భీకర కాల్పులు
పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంతం గ్వాదర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ముగ్గురు లేదా నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల్ కాంటినెంటల్ (పీసీ) హోటల్లో చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. వీరి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని ప్రాధమిక సమాచారం. హోటల్ నుంచి భారీగా బాంబు పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడి వుంటుందని అనుమానిస్తున్నారు. ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికి పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఫైవ్ స్టార్ హోటల్ మీద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే ఏటీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భారీ ఎత్తున భద్రతా దళాలను హోటల్ బయట మోహరించాయి. టెర్రరిస్టులు రాకెట్ లాంచర్లు పట్టుకుని ఉన్నారని, ఆత్మాహుతి కోసం జాకెట్స్ కూడా ధరించారని సమాచారం. హోటల్లోని అందరు అతిథులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేసినట్టు బలోచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జహూర్ బిలాడీ చెప్పిట్టు దునియా న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. అలాగే విదేశీ అతిధులు కూడా ఎవరూ లేరని తెలిపింది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు మంత్రి జహూర్ బిలాడీ తెలిపారు. కాగా దాదాపు 12 ఉగ్రవాసద సంస్థల నిషేధిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే టెర్రర్ దాడి జరిగింది. మమసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న 12 సంస్థలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. అందులో జైషే మహ్మద్ కూడా ఉంది. -
షాపింగ్ మాలే ఆఫీసు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాల్స్, స్టార్ హోటల్స్.. ఇపుడివి తినడానికో లేదా షాపింగ్ చేయడానికో మాత్రమే కాదు!! ఆఫీసులుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు... ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉండటాన్ని కంపెనీలు సైతం స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. దశాబ్ద కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయనేది ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా అభిప్రాయం. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడి తగ్గుతుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటికొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో మధ్య తరహా, చిన్న, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలు కూడా కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్.. త్వరలోనే హైటెక్ సిటీ, పంజగుట్ట, మలక్‌పేట్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైదరాబాద్ మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్ స్పేస్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కో–వర్కింగ్ కంపెనీ సంబంధిత సంస్థతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన ‘ఆఫిస్’ సంస్థకు హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో 167 సీట్లు, కోల్‌కతాకు చెందిన అపీజే గ్రూప్‌కు పార్క్ హోటల్లో 475 సీట్ల కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. ఆఫిస్‌కు గుర్గావ్లోని ఆంబియెన్స్ మాల్లో 592 సీట్లు, హీరా పన్నా మాల్లో 241 సీట్లు, పుణెలోని క్యూక్లియస్ మాల్లో 400 సీట్లు, రఘులీలా మాల్లో 1,000 సీట్లు కో–వర్కింగ్ స్పేస్ రూపంలో ఉన్నాయి. ముంబైకి చెందిన రీగస్కు ఢిల్లీలోని వసంత్ స్క్వేర్ మాల్, బెంగళూరులోని లగ్జరీ యూబీ సిటీ, చెన్నైలోని సిటీ సెంటర్లో కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. 20 లక్షల చ.అ.కు కో–వర్కింగ్ స్పేస్.. 2010లో ప్రపంచవ్యాప్తంగా 600 సెంటర్లలో 21 వేల కో–వర్కింగ్ సీట్లుండగా.. ఇప్పుడవి 18,900 సెంటర్లలో 17 లక్షల సీట్లకు పెరిగాయి. మన దేశంలో ఏటా 4.1 కోట్ల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతుండగా.. ఇందులో 20 లక్షల చ.అ. స్థలం కో–వర్కింగ్ స్పేస్ ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలియజేసింది. 43 శాతం లావాదేవీలతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా... తర్వాత ఎన్సీఆర్లో 16 శాతం, హైదరాబాద్ 15 శాతం, పుణె 12 శాతం, ముంబై 10 శాతం, అహ్మదాబాద్ 3 శాతం, చెన్నై 2 శాతం ఆక్రమించినట్లు సంస్థ తెలిపింది. ఏటా 30–40 శాతం వృద్ధి నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో రీగస్, వీవర్క్, కోవర్క్స్, ఐకివా, వర్క్ ఏ ఫీలా, టేబుల్ స్పేస్, ఆఫిస్, అపీజే, స్మార్ట్‌వర్క్స్ వంటి సుమారు 200 కో–వర్కింగ్ కంపెనీలు 400 సెంటర్లలో సేవలందిస్తున్నాయి. మౌలిక వసతుల వ్యయం తగ్గుతుంది.. ఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్ స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతోంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్‌కు ప్రధాన కారణమని ఆఫీస్ ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ రమణి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో అద్దెలు 25% వరకు తక్కువ. అంతేకాకుండా సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15% స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లుంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఒకే చోట పలు కంపెనీల పనిచేస్తుండటంతో కంపెనీల డేటా భధ్రత ప్రధాన సమస్యని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గంట, రోజు, నెల వారీగా చార్జీలు.. ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులుండటాన్ని కో–వర్కింగ్ స్పేస్‌గా పిలుస్తారు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్ల వంటి సౌకర్యాలుంటాయి. కొరియర్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, వైఫై, ప్రొజెక్టర్ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. కో–వర్కింగ్ ఆఫీసుల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. హైదరాబాద్‌లో నెలకు ఒక సీటుకు రూ.5–10 వేలు, పుణెలో రూ.4–10 వేలు, గుర్గావ్లో రూ.7–17 వేలు, ముంబైలో రూ.9–30 వేలు, బెంగళూరులో రూ.4–15 వేలు, చెన్నైలో రూ.7–15 వేలుగా ఉన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లిహిల్స్‌లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి. -
నటీమణులతో హైటెక్ వ్యభిచారం
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): రాజధానిలోని స్టార్ హోటళ్లు అడ్డాగా నటీమణులను ట్రాప్ చేసి వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నడిపించే జనార్దన్‌రావు అలియాస్ జానీ నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. విటుడిగా వచ్చిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్‌ను సైతం పట్టుకొని, భోజ్‌పురి నటిని రెస్క్యూ చేశారు. గతేడాది డిసెంబర్‌లోనూ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లో రెండు స్టార్ హోటళ్లపై ఏక కాలంలో దాడులు చేసింది. ఇద్దరు పాత్రధారుల్ని అరెస్టు చేసి తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇద్దరు నటీమణుల్ని రెస్క్యూ చేసింది. ఈ కేసులోనూ జానీ వాంటెడ్‌గా ఉన్నాడు. సినీ అవకాశాల పేరుతో వర్ధమాన తారలను ట్రాప్ చేసే జానీ... వారి ఫొటోలను వాట్సప్‌లో విటులకు షేర్ చేసి, స్టార్ హోటళ్లలో దందా నడిపించేవాడు. అవకాశాల పేరుతో ట్రాప్... ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జానీ సిటీలోని పద్మారావునగర్‌లో స్థిరపడ్డాడు. 2010 నుంచి స్టార్ హోటల్స్ అడ్డాగా నటీమణులతో వ్యభిచార దందా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కాడు. ఇతడిపై బంజారాహిల్స్, పంజగుట్ట, చందానగర్ తదితర ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. మరికొన్ని కేసుల్లోనూ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన డి.వెంకట్రావు, మోనిష్‌లను సహాయకుడిగా ఏర్పాటు చేసుకొని స్టార్ హోటల్స్ కేంద్రంగా వ్యభిచార దందాలు నిర్వహించాడు. డిసెంబర్లో మిగిలిన ఇద్దరూ దొరికినా జానీ మాత్రం చిక్కలేదు. తెలుగు, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ సినీ రంగానికి చెందిన వర్ధమాన హీరోయిన్లతో పాటు కొందరు టీవీ ఆర్టిస్టులనూ ముంబై, కోల్‌కతాల నుంచి రప్పిస్తుంటాడు. సినిమాల్లో అవకాశాల పేరుతో ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత వారిని వ్యభిచార ఊబిలోకి దింపి తన సహాయకులతో కథ నడిపిస్తుంటాడు. వాట్సాప్ ద్వారా దందాలు... జానీతో పాటు అతడి అనుచులు సైతం ఎవరికి వారుగా ‘కస్టమర్ల’తో కూడిన 40–50 వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా సినీ, టీవీ నటిని ఉచ్చులోకి దింపిన వెంటనే వారి ఫొటోలను వాట్సప్‌లో కస్టమర్లకు షేర్ చేస్తుంటారు. వారు చూపించిన ఆసక్తి మేరకు ఆయా బాధితురాళ్లను విమానాల్లో తరలిస్తుంటారు. అప్పటికే స్టార్ హోటళ్లలో రూమ్స్ సిద్ధం చేసే ఈ నిర్వాహకుడు, వాటి లాబీల్లో ఎదురు చూస్తుంటాడు. కస్టమర్ వచ్చిన తర్వాత లాబీల్లోనే నగదు లావాదేవీలు పూర్తి చేస్తారు. అప్పటికే బాధితురాళ్లను ఆయా గదుల్లో సిద్ధంగా ఉంచుతారు. డబ్బు తీసుకున్న వెంటనే కస్టమర్లకు వారు వెళ్లాల్సిన హోటల్లో ఫ్లోర్, గది నెంబర్ చెప్పి యాక్సెస్ కార్డిచ్చి పంపిస్తుంటారు. స్టార్ హోటల్స్‌లోకి పోలీసులు సహా ఎవరూ తేలిగ్గా ప్రవేశించే అవకాశం లేకపోవడంతో వాటినే అడ్డాలుగా చేసుకున్నారు. వీరి వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తుంటారు. సాధారణంగా వీకెండ్స్‌లోనే వీరి దందాలు జోరుగా సాగుతుంటాయి. ఉలిక్కిపడ్డ ఆర్మీ... శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్లో జానీతో పాటు భోజ్‌పురి నటి, విటుడు ఉన్నారని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో పట్టుబడిన విటుడు ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న అమిత్ మహేంద్ర శర్మగా తేలింది. వీరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. హర్యానాలోని గుర్గావ్కు చెందిన శర్మ ప్రస్తుతం అసోం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శిక్షణ నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌కు వచ్చారు. ఈయన వ్యభిచార కేసులో చిక్కారని తెలియడంతో ఆర్మీతో పాటు కేంద్ర నిఘా వర్గాలూ ఉలిక్కిపడ్డాయి. ఈ వ్యవహారం వెనుక ‘హనీట్రాప్’ ఉందా? అనే కోణంలో ఆరా తీశారు. ఉగ్రవాద సంస్థలు సైనిక రహస్యాలను కాజేయడానికి యువతుల్ని ఎరగా వేస్తుంటాయి. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి ఉదంతాలు రెండు వెలుగు చూశాయి. 2009లో బిహార్ పోలీసులు సుధాంశు సుధాకర్ అలియాస్ గోరఖ్ అలియాస్ చోటూను పట్టుకున్నారు. ఇతడు సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తూ హనీట్రాప్‌లో పడ్డాడు. అలాగే 2014లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సుబేదార్ పతన్కుమార్ పోద్దార్‌ను అరెస్టు చేశారు. ఇతడు కూడా అనుష్క శర్మ అనే మహిళ ట్రాప్‌లో పడి సైనిక రహస్యాలు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఉదంతాల నేపథ్యంలో తాజాగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ శర్మ చిక్కిన వెంటనే ఆర్మీతో పాటు కేంద్ర నిఘా వర్గాలు అప్రతమత్తమయ్యాయి. హుటాహుటిన బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి శర్మను విచారించాయి. అతడి కాల్ డిటేల్స్‌తో పాటు వాట్సప్ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. అయితే ఇందులో అలాంటి కోణం లేదని, ముంబైకి చెందిన ఇతడి స్నేహితుడు సంతోష్ ద్వారా జనార్దన్ అనుచరుడు శ్రీరామ్ పరిచయమైనట్లు, అతడి ద్వారా జనార్దన్ నంబర్ తీసుకున్నట్లు తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. శర్మపై కోర్టు మార్షల్ నిర్వహించడానికి ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. -
చోరీ సొత్తు కారు చౌక
స్టార్ హోటళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన జయేష్ రావ్జీ దొంగ సొత్తును ముంబైలో విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. నగరంలోని పార్క్ హయత్ హోటల్ నుంచి చోరీ చేసిన సొత్తులో రూ.10 లక్షల విలువైన వజ్రాభరణాన్ని కేవలం రూ.1.8 లక్షలకే ముంబైలోని హిరేన్ అనే వ్యాపారికి అమ్మినట్లు పోలీసుల విచారణలో జయేష్ వెల్లడించాడు. ఇతడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ముంబైకి తరలించి హిరేన్ నుంచి సొత్తు రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే 2014లో అబిడ్స్‌లోని మెర్క్యూరీ హోటల్, 2016లో ఎస్సార్ నగర్‌లోని మ్యారీగోల్డ్ హోటళ్లలో జరిగిన చోరీ కేసుల్లోనూ జయేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. బంజారాహిల్స్: బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పార్క్ హయత్ హోటల్ నుంచి రూ.40 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయిన ‘స్టార్ చోర్’ జయేష్ రావ్జీ సెజ్పాల్ను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.30 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. పోలీసుల విచారణ లో మిగిలిన రూ.10 లక్షల విలువైన వజ్రాల ఆభరణాన్ని ముంబైలో తాకట్టు పెట్టినట్లు అంగీకరించాడు. మంగళవారం అరెస్టు చేసిన నిందితుడిని బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం జయేష్‌ను తమ కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 10 రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2003 నుంచి స్టార్ హోటళ్లను టార్గెట్‌గా చేస్తూ ముంబైతో పాటు 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 32 చోరీలు చేసిన జయేష్ ఆ సొత్తు మొత్తాన్ని ముంబైలోని బోరేవాలి ప్రాంతానికి చెందిన హిరేన్ ఎం.షాకు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. పార్క్ హయత్ నుంచి చోరీ చేసిన సొత్తులో రూ.10 లక్షల విలువైన వజ్రాభరణాన్ని కేవలం రూ.1.8 లక్షలకే హిరేన్‌కు అమ్మినట్లు తెలిపాడు. ఇతగాడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ముంబైకి తరలించి హిరేన్ నుంచి సొత్తు రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. పార్క్ హయత్‌తో పాటు 2014లో అబిడ్స్‌లోని మెర్యూ్కరీ హోటల్, 2016లో ఎస్సార్ నగర్‌లోని మ్యారీగోల్డ్ హోటళ్లలో జరిగిన చోరీ కేసుల్లోనూ జయేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి హిరేన్ నుంచి సొత్తును రికవరీ చేయాలని నిర్ణయించారు. భారీ స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న జయేష్ నుంచి చోరీ సొత్తు ఖరీదు చేస్తున్న హిరేన్ పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. మరోవైపు జయేష్ అరెస్టు విషయం తెలుసుకున్న కోల్‌కతా పోలీసులు అక్కడి కేసులో పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2004–05లో ‘స్టార్ నేరం’లోనే ఇతగాడు చెన్నై పోలీసులకు చిక్కాడు. అప్పట్లో అక్కడి పోలీసులు ఇతడిపై టీపీడీఏ (తమిళనాడు ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్) ప్రయోగించి 14 నెలలు జైల్లో ఉంచారు. జయేష్‌ను బంజారాహిల్స్ పోలీసులు ముంబై సమీపంలోని థానేలోని ఓ లాడ్జిలో బస చేసి ఉండగా పట్టుకున్నారు. తన వద్ద ఉన్న సొమ్ముతో జల్సా చేస్తున్న ఇతగాడు ప్రస్తుతం నడుస్తున్న టీ–20 ట్రై సిరీస్ నేపథ్యంలో బెట్టింగ్స్ కాయడంతో బిజీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు ప్రశ్నించినప్పుడు... ‘భారీ మొత్తం బెట్టింగ్స్ కాస్తాను సార్. అది గేమ్ ఆఫ్ లక్... ఒక్కోసారి డబ్బులు వస్తాయి. అనేకసార్లు పోతాయి. మొత్తమ్మీద బెట్టింగ్స్‌లో నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ’ అంటూ చెప్పినట్లు తెలిసింది. -
స్టార్ హోటళ్లకు 500 ఎకరాలు
అమరావతిపై సమీక్షలో సీఎం సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి వీలుగా 500 ఎకరాల్ని సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబునాయుడు సీఆర్డీఏ అధికారుల్ని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో వాటిని నిర్మించేందుకు వీలుగా భూములను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారాలపై బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఆర్డీఏ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇస్తాంబుల్ తరహాలో రాజధాని అమరావతిలో ఆతిథ్యరంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించగా.. రాడిసన్, తాజ్, జీఆర్టీ, పార్క్, నోవాటెల్ వంటి ఎనిమిది ప్రముఖ సంస్థలు అమరావతిలో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చాయని సీఆర్డీఏ అధికారులు ఆయనకు వివరించారు. హైపర్‌లూప్ రవాణాపై అధ్యయనం అమరావతిలో మెట్రోరైలు స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత వేగంతో కూడిన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ‘హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ’పై అధ్యయనం జరపాలని సీఎం ఆదేశించారు. హైపర్‌లూప్ వ్యవస్థ ఏర్పాటైతే విశాఖ నుంచి అమరావతికి 23 నిమిషాల్లో, అమరావతి నుంచి తిరుపతికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. ప్రీ స్కూళ్లుగా అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్ని ప్రీ స్కూళ్లుగా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ స్కూళ్లలో తెలుగుభాషకు ప్రాధాన్యం తగ్గించకుండానే ఆంగ్లంలో బోధిస్తారని చెప్పారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ‘అంగన్వాడీ కేంద్రాలు–ప్రీ ప్రైమరీ స్కూళ్లు’ అంశంపై తల్లిదండ్రులు, అంగన్వాడీ ఉపాధ్యాయులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని 3,128 అంగన్వాడీ కేంద్రాల్ని ఏకీకృతం చేసి 1,026 ప్రీ స్కూలు కేంద్రాలుగా మార్చుతున్నట్టు చెప్పారు. ఒక్కోప్రీ స్కూలు కేంద్రానికి రూ.2.40 లక్షలు చొప్పున వ్యయం చేయనున్నట్టు తెలిపారు. ప్రీ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయని, మూడేళ్ల వయసున్న చిన్నారులు నర్సరీ, నాలుగేళ్ల వయస్సున్నవారు ఎల్కేజీ, నాలుగు నుంచి ఐదేళ్ల వయస్సుంటే యూకేజీ చదివేందుకు వీలుందన్నారు. -
స్టార్.. స్టార్... దగా స్టార్
విజయవాడ నడిబొడ్డున ముఖ్యనేత భూదందా ⇒ రూ.200 కోట్ల విలువైన ట్రాన్స్‌కో భూమికి ఎసరు ⇒ 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవాలని ఆదేశం ⇒ సర్వే ప్రారంభించిన పర్యాటక శాఖ అధికారులు ⇒ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ అభ్యంతరాలు బేఖాతరు ⇒ స్టార్ హోటల్ నిర్మాణం పేరిట బినామీ సంస్థకు ధారాదత్తం! ⇒ కొంతకాలం తర్వాత చినబాబుకు అప్పగించేలా ఒప్పందం విజయవాడ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ఐదెకరాల ప్రభుత్వ భూమి. అందులో ఒక బ్రహ్మాండమైన ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించే బాధ్యత ఓ ప్రముఖ హోటల్ నిర్వహణ సంస్థది. వాళ్లు ఆ హోటల్ నిర్మించి, కొంతకాలం పాటు లాభాల బాటలో నడిపించిన తర్వాత చినబాబుకు కట్టబెడతారు. ఇదీ చినబాబు వేసిన అదిరిపోయే స్కెచ్. అంటే కాణీ ఖర్చు లేకుండా రాజధాని నగరంలో చినబాబు ఖాతాలో ఖరీదైన హోటల్ పడబోతోందన్నమాట. ఈ భూమి ప్రస్తుతం విద్యుత్ శాఖ అధీనంలో ఉంది. చినబాబు స్కెచ్ వేయగానే భూమిని స్వాధీనం చేసుకుని, ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు పర్యాటక శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చినబాబు, ప్రభుత్వ పెద్దలు ఏపీ ట్రాన్స్‌కో– ఏపీఎస్పీడీసీఎల్కు చెందిన రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. లీజు పేరిట 99 ఏళ్లకు దక్కిం చుకునేందుకు పన్నాగం పన్నారు. అందు కోసం అన్ని నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటక శాఖ ద్వారా రంగంలోకి దిగారు. ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం ఉద్యోగుల అభ్యం తరాలను కూడా వారు లెక్కచేయడం లేదు. మరోవైపు తాము ఈ భూదందాలో కేవలం పావులమేనని, అసలు బాగోతం అంతా ప్రభుత్వ ముఖ్యనేతదేనని పర్యాటక శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. లోపాయికారీ ఒప్పందం రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చేందుకు స్టార్ హోటళ్లు నిర్మించే ముసుగులో ఆ 4.80 ఎకరాలను దక్కించుకోవాలని ముఖ్యనేత వ్యూహం పన్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లు నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం... సదరు సంస్థకు 99 ఏళ్ల లీజు పేరిట ఆ 4.80 ఎకరాలను కట్టబెడతారు. ఆ సంస్థ చినబాబుకు బినామీగా ఉంటూ స్టార్ హోటల్‌ను నిర్మించాలి. దాన్ని కొంతకాలం నిర్వహించిన అనంతరం పూర్తిగా చినబాబుకే అప్పగించాలి. ట్రాన్స్‌కోకు సమాచారం లేదు స్టార్ హోటల్ నిర్మాణానికి వీలుగా 4.80 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలవాలని పర్యాటక శాఖను ముఖ్యనేత కార్యాలయం ఆదేశించింది. ట్రాన్స్‌కో, ఏపీ ఎస్పీడీసీఎల్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భూమి అప్పగించకుండా తాము టెండర్లు ఎలా పిలుస్తామని పర్యాటక శాఖ అధికారి ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అదంతా తాము చూసుకుంటామని, టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు మొదలుపెట్టాలని ముఖ్యనేత స్పష్టం చేసినట్లు సమాచారం. ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడుకోండి ముఖ్యనేత ఆదేశాలతో పర్యాటక శాఖ రంగంలోకి దిగింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోని భూమిని శుక్రవారం సర్వే చేసింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. తమ సంస్థకు చెందిన భూమిని పర్యాటక శాఖ సర్వే చేయడమేమిటని ప్రశ్నించారు. ఆ భూమిని పర్యాటక శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తాము సర్వే చేస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు ఏదైనా ఉంటే సచివాలయంలో పెద్దలతో మాట్లాడుకోవా లని, తమ సర్వేను అడ్డగించవద్దని తేల్చిచెప్పారు. స్టార్ హోటల్‌పై చినబాబు మక్కువ విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదలలో విద్యుత్తు సౌధ భవన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో దాదాపు 4.80 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 1952 నుంచి అప్పటి రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు అధీనంలో ఈ భూమి ఉంటూ వచ్చింది. ఏపీఎస్ఈబీని విభజించిన తరువాత ఈ భూమిని ఏపీ ట్రాన్స్‌కో, సదరన్ డిస్కంలకు ఉమ్మడిగా కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్ ధర రూ.40 కోట్లకు పైమాటే. ఆ లెక్కన మొత్తం భూమి మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లు. ఖాళీగా ఉన్న ఈ విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న చినబాబు ఆ భూమిలో ఓ స్టార్ హోటల్ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ముఖ్యనేత ఓ కార్పొరేట్ సంస్థ ముసుగులో చినబాబు స్టార్ హోటల్‌కు అడ్డంకుల్లేకుండా ఎత్తుగడ వేశారు. ప్రైవేట్‌కు అప్పగిస్తే ట్రాన్స్‌కోకు తీవ్ర నష్టం రాష్ట్ర విభజన అనంతరం మౌలిక వసతులు లేక ట్రాన్స్‌కో, ఏపీఎస్సీడీసీఎల్ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల శిక్షణ కేంద్రం, ఆర్అండ్డీ కేంద్రం కూడా లేవు. విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో ఎస్పీడీసీఎల్ భవనం ఉంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోనే ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్లకు భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ, తమ సంస్థలకు చెందిన భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం ఏమిటని ట్రాన్స్‌కో, ఎస్పీ డీసీఎల్ అధికారులు, ఉద్యోగులు నిలదీస్తున్నారు. ట్రాన్స్‌కోకు నష్టాన్ని కలిగించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ట్రాన్స్‌కో ఇంజనీర్ల అసోషియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సంఘ ప్రతినిధి కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం ‘‘ఈ భూమి ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ ఉమ్మడి ఆస్తి. ఎస్పీడీసీఎల్కు సొంత భవనం లేదు. భవిష్యత్తులో ట్రాన్స్‌కో అవసరాలు పెరుగుతాయి. అప్పుడు మేము ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లాలా? ట్రాన్స్‌కో చెందిన విలువైన ఆస్తిని ప్రైవేటుకు కట్టబెడతారా? ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’’ – ఉదయ్‌కుమార్, ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం అదనపు కార్యదర్శి -
అమరావతిలో స్టార్ హోటళ్లు
సాక్షి, అమరావతి: అమరావతిలో ఆరు స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలను ఎంపిక చేసింది. రాజధాని ప్రాంతంలో 4 త్రీస్టార్, ఒక్కో ఫోర్స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్ వి.రామ్మోహనరావు, ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్ వై.నాగిరెడ్డితో పాటు కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీ, ఐటీసీ, నోవాటెల్, గేట్‌వే, ఫార్చూన్ మురళీ పార్క్, మంజీరా, స్వాగత్, కృష్ణ రెసిడెన్సీ, రివర్‌బే, స్టార్ వుడ్ హోటల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అమరావతితోపాటు పలు నగరాల్లో స్టార్ హోటళ్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో స్టార్ హోటల్స్ ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు, నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లతో పాటు బీచ్ రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, ఐమాక్స్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుతో పాటు వాటికి ఎక్కడెక్కడ ఆదరణ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ గుర్తించింది. అలాగే ఇందుకు అవసరమైన భూమి, పెట్టుబడి సంస్థలను కూడా సర్కార్ గుర్తించింది. రాజధాని అమరావతిలో మూడు నక్షత్రాల హోటళ్లు మూడు, నాలుగు నక్షత్రాల హోటల్ ఒకటి, ఐదు నక్షత్రాల హోటల్ ఒకటి ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గానూ భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పదెకరాల లోపు, ఆ పైబడిన భూములను 33 ఏళ్లపాటు లీజుకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. లీజును మార్కెట్ విలువలో రెండు శాతంగా నిర్ధారించారు. కాగా, నిర్ధారించిన ప్రాజెక్టులకు పెట్టుబడిదారులు, వారి ప్రొఫైల్ ఆధారంగా నేరుగా భూమిని విక్రయించే అవకాశం కూడా ఉంది. -
రాష్ర్ట ఆదాయానికి స్టార్ హోటల్స్ గండి
సాక్షి, సిటీబ్యూరో: హోటల్లో ఆహారం తిన్నందుకు కస్టమర్ నుంచి వసూలు చేస్తున్న సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) ప్రభుత్వానికి చేర డం లేదు. ఇలా పన్ను కట్టని ప్రముఖ రెస్టారెంట్లు నగరంలో చాలానే ఉన్నాయి. ఇవి చెల్లించాల్సిన పన్ను బకాయిల మొత్తం రూ.100 కోట్లకు పైనే. మరికొన్ని సంస్థలైతే కనీసం ఈ విభాగం వద్ద రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. ఈ అంశాలను సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం తీవ్రంగా పరిగణించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇలాంటి హోటళ్లపై సేవల పన్ను (ఎస్టీ) విభాగం చర్యలకు సిద్ధమైంది. ఆయా సంస్థల జాబితా సిద్ధం చేసిన అధికారులు దాడులకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల్లో ‘అర్హులైన’ వారిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. కమర్షియల్ సేవలన్నీ ‘ఎస్టీ’ పరిధిలోకి.. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్స్ ఇచ్చే బిల్లులో వస్తువు విలువకు అదనంగా ‘సర్వీసు ట్యాక్స్’ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. కానీ చాలా సంస్థలు అందుకు దూరంగా ఉంటున్నాయి. రెస్టారెంట్స్‌కు 5.6 శాతం పన్ను సాధారణంగా వాణిజ్య సేవలు చేసేవారు విక్రయించే వస్తు విలువకు అదనంగా 14 శాతం (సెస్‌తో 15 శాతం) సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు. అయితే రెస్టారెంట్స్‌లో ఆహారం, పానీయాలు సరఫరా చేస్తుండడం, వాటి రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటికి సర్వీస్ ట్యాక్స్ 5.6 శాతంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు జంట నగరాల్లోని 1500 రెస్టారెంట్లు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగంలో రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు వార్షిక రిటర్న్స్ దాఖలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని రెస్టారెంట్ల ఆర్థిక లెక్కలు పక్కాగా లేవని, వినియోగదారుడి నుంచి వసూలు చేసిన సర్వీస్ ట్యాక్స్ మొత్తాన్ని ఎస్టీ విభాగానికి విభాగానికి చెల్లించట్లేదని అధికారులు గుర్తించారు. మరికొన్ని రెస్టారెంట్లు కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని తేల్చారు. ‘ఏసీ’ ఉంటే ‘ఎస్టీ’ వర్తింపు సిటీలో ఉన్న ప్రతి రెస్టారెంట్ ఎస్టీ పరిధిలోకి రాదు. కేవలం ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) సదుపాయం ఉన్నవే సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఏసీ రెస్టారెంట్‌లోని నాన్–ఏసీ భాగంలో కూర్చుని ఆహారం స్వీకరించినవారి నుంచి సైతం సర్వీసు ట్యాక్స్ వసూలు చేయవచ్చు. నగరంలో ఉన్న ఆయా రెస్టారెంట్లు ఏటా సరైన రిటర్న్స్ దాఖలు చేయట్లేదని, లెక్కల్లో చెప్పిన మొత్తాన్ని సర్వీసు ట్యాక్స్‌గా చెల్లించట్లేదని సేవల పన్ను విభాగం అనుమానించింది. ఆయా యాజమాన్యాలకు చెందిన ఆదాయ పన్ను రిటర్న్్సతో పాటు బ్యాంక్ లావాదేవీలను సేకరించి విశ్లేషించింది. తీవ్రస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో ఎస్టీ విభాగం ‘వాంటెడ్’ జాబితాలను రూపొందించింది. ‘పరిమితి’ దాటితే జైలుకే... వీటిలో ఇప్పటికే బంజారాహిల్స్, పంజగుట్టల్లో ఉన్న రెండు ప్రముఖ రెస్టారెంట్స్‌పై సర్వీస్ ట్యాక్స్ అధికారులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడలో ఉన్న మరో మూడు ప్రముఖ రెస్టారెంట్స్ లావాదేవీలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. భారీ బకాయిదారులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో వీరి జాబితాను సిద్ధం చేసిన విభాగం అధికారులు ఆయా సంస్థలు, వ్యక్తులకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్–బెయిలబుల్ వారెంట్ తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అధికారం కూడా సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలో సమన్లకు స్పందించని వారిపై వరుస దాడలు చేయడంతో పాటు అరెస్టులు చేయాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి రెస్టారెంట్స్‌పై సర్వీస్ ట్యాక్స్ విభాగం వరుస దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
స్టార్ హోటళ్లో ఏదీ సెక్యూరిటీ
సెక్యూరిటీ సిబ్బందికి తర్ఫీదునివ్వాలని సూచన సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ స్థాయిలోనే స్టార్ హోటల్స్ వెలిశాయి. ఆయితే ఆయా హోటళ్లు తీసుకుంటున్న భద్రతా చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో అటువైపుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి సారించారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో సేవలందిస్తున్న దాదాపు 100కు పైగా బడా హోటళ్ల మేనేజర్లతో ఇటీవల మాదాపూర్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. గతంలో టైస్టులు లక్ష్యంగా చేసుకున్న ముంబైలోని తాజ్ హోటళ్ల ప్రస్తావన చెబుతూనే...ఇక్కడి హోటళ్ల యజమానులు భద్రతకు తగిన ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నియమించుకోవాలన్నారు. ఈ సెక్యూరిటీ గార్డులు ఏ ఘటన సంభవిస్తే ఎలా స్పందించాలనే దానిపై తగిన తర్ఫీదునిచ్చేందుకు తమ పోలీసు విభాగం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. హోటల్‌కు వచ్చే విజిటర్స్ జాబితా తప్పకుండా మెయిన్‌టెయిన్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలతో హోటల్ సిబ్బంది జాబితాను దగ్గర ఉంచుకోవాలన్నారు. గన్‌లెసైన్స్‌కు స్పందన కరువు... ఐటీ కంపెనీ నిర్వాహకులతో పాటు స్టార్ హోటల్స్ కూడా కాపలా సిబ్బందిని ఉత్తచేతులతోనే ఉంచుతున్నారు. సిబ్బందికి ఆయుధాలిస్తే, నిర్వహణ, బాధ్యత తమమీద ఎక్కడ పడుతుందేమోనని సంస్థలు వెనకడుగు వేస్తుండటమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యంలో తొలిసారిగా సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్వేర్ సంస్థలతో పాటు హోటళ్ల భద్రత గురించి కూడా చర్చ మొదలైంది. అదే ఏడాది బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి ఘటన తర్వాత కాపలా సిబ్బందికి ఆయుధాలివ్వాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. ఐటీసంస్థలు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, పరిశ్రమలే, హోటళ్ల వద్ద ఉండే కాపలాసిబ్బందికి ఆయధాలిచ్చేందుకు సిద్ధమని అప్పట్లోనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఆయుధాలకు లెసైన్సులు ఇస్తామన్నా స్పందించరే సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు భద్రతా సిబ్బంది దరఖాస్తు చేసుకుంటే ఆయుధ లెసైన్సులు జారీ చేస్తామని ప్రకటించారు. అయితే దీనికి ఆశించినంత స్పందన లేకపోవడంతో సీవీ ఆనంద్ నిర్ఘాంతపోయారు. అందుకే విడతల వారీగా ఆయా సంస్థలతో సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఐటీ కారిడార్‌లో భద్రతతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్యలు తీసుకుంటున్నా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లో సభ్యత్వం తీసుకోవాలని సీవీ ఆనంద్ కోరారు. నిర్వాహకుల భయాలకు కారణాలు ప్రస్తుతం స్టార్ హోటళ్ల నిర్వహణ అంతా ప్రైవేటే వ్యక్తుల చేతుల్లోనే ఉంది. వీరికి ఆయుధాలిస్తే కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయన్న భయం నిర్వాహకుల్లో ఉంది.ఆయుధాలు ఉంటే వాటి నిర్వహణపై ఎప్పటికప్పుడు స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇస్తుండాలి. ఆయుధం ఉంటే దుర్వినియోగం అవుతుందన్న భయం నిరంతరం ఉంటుంది. నిజంగానే దుర్వినియోగమైతే మొదటికే మోసం వస్తుందన్నది ప్రధాన ఆందోళన. -
తాగి బిల్లు ఎగ్గొట్టడం హాబీ !
హైదరాబాద్: చదివింది ఎంబీఏ... మొన్నటి వరకూ ఓ సాఫ్ట్ వేర్ సంస్థను నిర్వహించాడు. అయితే అదేం బుద్దో కాని స్టార్ హోటల్లోకి వెళ్లి పీకలదాకా మద్యం తాగి బిల్లు ఎగ్గొట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇదే విధంగా గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో మద్యం తాగి, రూ.4,700 బిల్లు చేశాడు. చెల్లించేందుకు జేబులో డబ్బులేకపోవడంతో బిల్లు ఎగ్గొట్టేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నివసించే సరోజ్ గుంట(38)కి స్టార్‌హోటళ్లలో మద్యం తాగడం మహాఇష్టం. ఎంబీఏ చదివిన సరోజ్ ఓ సాఫ్ట్ వేర్ సంస్థను పెట్టి దివాళా తీశాడు. అప్పటి నుంచి స్టార్ హోటళ్లకు వెళ్లడం.. బిల్లు ఎగ్గొట్టి పోలీసులకు చిక్కడం పరిపాటిగా మారింది. పోలీస్ స్టేషన్‌కు రాగానే విషయం తెలుసుకొని తండ్రి లేదా తమ్ముడు వచ్చి హోటల్ బిల్లు చెల్లించి స్టేషన్ నుంచి విడిపించుకెళ్లడం కూడా రివాజుగా మారింది. ఒక్క పార్క్ హయత్ హోటలే కాదు సోమాజిగూడలోని దిపార్క్, తాజ్‌బంజారా, తాజ్‌కృష్ణా, గ్రాండ్ కాకతీయ తదితర స్టార్ హోటళ్లు సరోజ్ బాధిత జాబితాలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.