Steven Spielberg
-
‘ది ఫాబెల్మ్యాన్స్’ డైరెక్టర్‌తో ఎమిలీ బ్లంట్ కొత్త మూవీ!
‘ది ఫాబెల్మ్యాన్స్’ (2022) చిత్రం తర్వాత హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తదుపరి చిత్రం గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే స్పీల్బర్గ్ తర్వాతి సినిమా గురించి అతి త్వరలోనే కొత్త కబురు వినిపించనుందని హాలీవుడ్ టాక్. హాలీవుడ్ ప్రముఖ నటి ఎమిలీ బ్లంట్ లీడ్ రోల్లో స్పీల్బర్గ్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గురించి ఎమిలీతో చర్చించారట కూడా. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట స్పీల్బర్గ్. -
ఆర్ఆర్ఆర్.. ఓ కనువిందు – స్టీవెన్ స్పీల్బర్గ్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రశంసించారు హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ది ఫేబుల్‌మ్యాన్స్’ గత ఏడాది నవంబరులో రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ఈ నెల 10న రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా స్టీవెన్ స్పీల్బర్గ్ను దర్శకుడు రాజమౌళితో ఆన్లైన్ వేదికగా ఇంటర్వ్యూ చేయించారు సంస్థ ప్రతినిధులు. ఈ ఇంటర్వ్యూలోని కొన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఇంటర్వ్యూ వేదికగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ను మెచ్చుకున్నారు స్పీల్బర్గ్. ‘‘దర్శకుడు రాజమౌళిని తొలిసారి కలుసుకున్నప్పటికి నేను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదు. ఇటీవల ఈ సినిమా చూశాను. ఐ క్యాండీ (కనువిందు)గా అనిపించింది. అద్భుతంగా ఉంది’’ అన్నారు స్పీల్బర్గ్. ఆ ప్రశంసలకు రాజమౌళి స్పందిస్తూ.. మీరు (స్టీవెన్ స్పీల్బర్గ్) సినిమా చూసినందుకు చాలా ఆనందంగా ఉందనీ, సంతోషంతో డ్యాన్స్ చేయాలనిపిస్తోందనీ అన్నారు. ‘ది ఫేబుల్‌మ్యాన్స్’ను తాను చూశానని, నచ్చిందని కూడా రాజమౌళి పేర్కొన్నారు. -
హాలీవుడ్ దిగ్గజంతో రాజమౌళి.. మైండ్ బ్లోయింగ్
సాక్షి, సినిమా: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్‌బస్టర్ పీరియడ్ డ్రామా ఆర్ఆర్ఆర్ మేనియా ప్రపంచమంతా సాగుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది ఇందులోని నాటు నాటు సాంగ్. తద్వారా అరుదైన ఘనత సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్.. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలోనూ ఏదైనా అద్భుతం సృష్టిస్తుందా? అని ఎదురు చూస్తున్నారంతా. ఈ లోపు రాజమౌళి తన ఫ్యాన్ బాయ్ ముచ్చటను తీర్చుకున్నాడు. హాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్‌మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్(76)ను కలిశాడు. ఐ జస్ట్ మెట్ గాడ్ అంటూ తన భావాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆయన. మొదటి చిత్రంలో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ ఫొటోల్లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం ఉన్నారు. జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలతో స్టీవెన్ స్పీల్బర్గ్ మన దేశంలోనూ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw — rajamouli ss (@ssrajamouli) January 14, 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల సందర్భంలోనే వీళ్ల కలయిక జరిగినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ వెటరన్ ఫిల్మ్‌మేకర్ ది ఫాబెల్స్మ్యాన్ చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్(మోషన్ పిక్చర్)కేటగిరీలో అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం రెండే గంటల్లో జక్కన్న పోస్ట్‌కి మిలియన్‌కి పైగా వ్యూస్ రావడం విశేషం. -
సంచలన దర్శకుడి ఇంట విషాదం
లాస్ ఏంజెలెస్: సంచలనాలకు మారుపేరుగా నిలిచిన హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. పర్సనల్ కంప్యూటర్ ఆవిష్కర్త స్టీవెన్ స్పీల్బర్గ్ తండ్రి ఆర్నాల్డ్ స్పిల్బర్గ్(103) మరణించారు. లాస్ ఏంజెలెస్‌లో కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం ఆయన మరణించినట్లు ప్రకటించారు. ఆర్నాల్డ్‌ది సహజ మరణమని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వారు తెలిపారు. ఆర్నాల్డ్ స్పీల్బర్గ్, చార్లెస్ ప్రాప్స్టర్ ఇరువురు 1950 చివర్లో జనరల్ ఎలక్ట్రిక్ కోసం పని చేస్తున్నప్పుడు జీఈ-225 మెయన్ఫ్రేమ్ కంప్యూటర్ని రూపొందించారు. ఆ తర్వాత దీని సాయంతో డార్ట్మౌత్ కాలేజీలోని కంప్యూటర్ శాస్త్రవేత్తలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘బేసిక్’ని అభివృద్ధి చేశారు. ఈ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ 1970-80లలో అభివృద్ధి చేసిన వ్యక్తిగత కంప్యూటర్లకు ఎంతో ఉపయోగపడింది. ఓ సారి స్టీవెన్ మాట్లాడుతూ.. ‘మా నాన్న కంప్యూటర్ ఎలా పని చేస్తుందో వివరించాడు. కానీ ఆ రోజుల్లో నాకు కంప్యూటర్ సైన్స్ భాష గ్రీకులాగా తోచేది. అస్సలు అర్థమయ్యేది కాదు’ అన్నారు. అంతేకాక ‘ప్రస్తుతం ఉన్న ప్లే స్టేషన్, సెల్‌ఫోన్, ఐప్యాడ్ లాంటి వాటిని చూస్తే.. వీటన్నింటికి వెనక నా తండ్రి లాంటి ఎందరో మేధావుల కృషి ఉంది కదా అనిపిస్తుంది. చాలా గర్వపడతాను’ అన్నారు స్టీవెన్. ఈ దర్శకుడు తన 16వ ఏట 1963లో తొలిసారిగా ‘ఫైర్‌లైట్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సమయంలో ఆర్నాల్డ్ అతడికి ఎంతో సాయం చేశారు. గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తే.. ఎలా ఉంటుందనే అంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్నాల్డ్ స్పెషల్ ఎఫెక్ట్స్ సమకూర్చారు. సినిమాల విషయంలో స్టీవెన్ తన సలహాలు కోరతాడని.. కానీ ఐడియాలు అన్ని అతడివే అన్నారు ఆర్నాల్డ్. (చదవండి: జురాసిక్.. ఫుల్ కిక్) ఉక్రేనియన్ యూదు వలసదారుల కుమారుడైన ఆర్నాల్డ్ స్పీల్బర్గ్ 1917లో సిన్సినాటిలో జన్మించాడు. మొదటి నుంచి కూడా అతడికి గాడ్జెట్స్ అంటే ఎంతో ప్రీతి. ఈ క్రమంలో 9 సంవత్సరాల వయస్సులో సొంత క్రిస్టల్ రేడియోను.. 15 ఏళ్ళ వయసులో ఒక హామ్ రేడియోను తయారు చేశారు. ఈ నైపుణ్యాలు అతడికి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బాగా పనికి వచ్చాయి. 490 వ బాంబ్ స్క్వాడ్రన్ కోసం రేడియో ఆపరేటర్, చీఫ్ కమ్యూనికేషన్ మ్యాన్‌గా పని చేశాడు ఆర్నాల్డ్. దీనిని బర్మా బ్రిడ్జ్ బస్టర్స్ అని కూడా పిలుస్తారు. ఆర్నాల్డ్ స్పీల్‌బర్గ్‌కు ముగ్గురు భార్యలు.. నలుగురు సంతానం. స్టీవెన్ స్పీల్బర్గ్(73) మొదటి సంతానం. అతనికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు.. వారు స్క్రీన్ రైటర్ అన్నే స్పీల్బర్గ్, నిర్మాత నాన్సీ స్పీల్బర్గ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్యూ స్పీల్బర్గ్. వీరంతా మొదటి భార్య లేహ్ స్పీల్బర్గ్ సంతానం. ఆమె 2017లో మరణించారు. మూడవ భార్య బెర్నిస్ కోల్నర్ స్పీల్బర్గ్ 2016లో మరణించారు. -
పోర్న్ స్టార్‌గా మారిన దర్శకుడి కుమార్తె..అరెస్ట్
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కుమార్తె మికేలాపై గృహహింస కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త చక్పాంకో(50) ధృవీకరించారు. మికేలాపై శనివారం కేసు నమోదైందని, 1000 డాలర్ల పూచికత్తుపై బెయిల్ కూడా వచ్చిందన్నారు. మరో 12 గంటల్లో మికేలా విడుదలకానుందని తెలియజేశారు. కాగా, 23 ఏళ్ల మికేలా పోర్న్‌స్టార్‌గా కెరీర్ ఆరంభించాలని నిర్ణయం తీసుకున్న రెండు వారాలకే అరెస్ట్ కావడం గమనార్హం. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో గృహహింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మికాలె కాబోయే భర్త చక్ పాంకో కూడా ధ్రువీకరించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. (చదవండి : పోర్న్ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె.) మికేలాను స్పీల్బర్గ్ ఆయన భార్య కేట్ కాప్షా దత్తత తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తాను పోర్న్ స్టార్‌గా మారానని ప్రకటించిన మికాలే.. అలా మారడం తనకు మానసికంగా చాలా ఉపయోగపడిందని పేర్కొంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదని వెల్లడించింది. కాబోయే భర్త చక్ పాంకో (47) సైతం పోర్న్ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు. -
జురాసిక్.. ఫుల్ కిక్
ప్రస్తుతం హాలీవుడ్లో నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో టాపిక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచినవాటిలో ‘జురాసిక్ వరల్డ్ 3’ ఒకటి. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి చిత్రం ‘జురాసిక్’ (1993)లో వెండితెరపై రాక్షస బల్లులు చేసిన వీర విహారానికి పిల్లలూ పెద్దలూ ఫిదా అయిపోయారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ఈ ‘జురాసిక్ పార్క్’ ఎంత క్రేజ్ తెచ్చుకుందంటే.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్‌ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఇప్పుడు ‘జురాసిక్ వరల్డ్ 3’పైనే అందరి దృష్టి ఉంది. కొందరు రచయితలతో కలిసి చిత్రదర్శకుడు కోలిన్ ట్రెవరో ఈ భాగానికి రాసిన స్క్రిప్ట్ అదిరిపోయే రేంజ్లో ఉందని కీలక పాత్రధారి క్రిస్ ప్రాట్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది విడుదలై, ఘనవిజయం సాధించిన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’కి దీటుగా తాజా జురాసిక్ చిత్రం ఉంటుంది. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన గత చిత్రాలకన్నా ఈ చిత్రకథ మరింత కిక్ ఇచ్చే విధంగా ఉంది. తొలి భాగంలో నటించిన స్యామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ కూడా ఈ చిత్రంలో నటిస్తారు. భారీ స్థాయిలో రాబోతున్న చిత్రం ఇది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు క్రిస్ ప్రాట్. వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
పోర్న్ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె..
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కుమార్తె మికేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోర్న్ స్టార్‌గా కెరీర్ ఎంట్రీని ఆరంభించాలని నిర్ణయించుకున్న 23 ఏళ్ల మికేలాను స్పీల్బర్గ్ ఆయన భార్య కేట్ కాప్షా దత్తత తీసుకున్నారు. మికేలా సొంతంగా పోర్న్ వీడియోలను నిర్మిస్తున్నారు. మరోవైపు తనకు ఇష్టమైన స్ర్టిప్ క్లబ్లో ఎంట్రీ కోసం స్ర్టిప్పర్ లైసెన్స్ పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. మికేలా తన స్టేజ్ నేమ్‌ను షుగర్ స్టార్‌గా ఎంచుకున్నారని ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ వెల్లడించింది. ఈ వృత్తి పట్ల వ్యామోహం ఉండటం సిగ్గుపడే విషయం ఎంతమాత్రం కాదని, తానిప్పుడే అడల్ట్ వినోద కెరీర్‌ను చేపట్టానని ఇది సానుకూల, సాధికారిక నిర్ణయమని అన్నారు. సురక్షిత, పరస్పర అంగీకారమైన పనులు చేపట్టాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తన నిర్ణయానికి తల్లితండ్రులు విస్మయం చెందలేదని చెప్పుకొచ్చారు. కాబోయే భర్త చక్ పాంకో (47) సైతం పోర్న్ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు. కాగా, చిన్నతనంలో తాను కుంగుబాటుకు గురయ్యానని లైంగిక వేధింపులకు లోనయ్యానని ది సన్తో మాట్లాడుతూ ఆమె వెల్లడించారు. -
హాలీవుడ్‌కి హలో
బాలీవుడ్ నటి షబానా ఆజ్మి బుడాపెస్ట్ ప్రయాణానికి సిద్ధమయ్యారు. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ నిర్మిస్తున్న ‘హాలో’ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో షబానా నటించనున్నారు. ‘హాలో’ అనే పాపులర్ వీడియో గేమ్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఈ విషయం గురించి షబానా మాట్లాడుతూ – ‘‘ఇదో కొత్త ప్రయాణం. చాలా ఎగై్జట్‌మెంట్‌తో పాటు కొంచెం నెర్వస్‌గానూ ఉంది. ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. దీనికోసం రెండు సినిమాలను కూడా వదులుకున్నాను. ఆ సినిమాలు వదులుకునేంత విలువైందే ఈ సిరీస్ అనుకుంటున్నాను’’ అన్నారు. అక్టోబర్‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదివరకు ‘సిటీ ఆఫ్ జాయ్, లా నూట్ బెంగాలీ’ అనే హాలీవుడ్ చిత్రాల్లో నటించారు షబానా. -
జురాసిక్ పార్క్ ఐదో సీక్వెల్ వస్తోంది!
సాక్షి సినిమా: హాలీవుడ్ చిత్రాల్లో భారతీయ సినీ ప్రేక్షకులను అధికంగా అలరించిన అతి కొద్ది చిత్రాల్లో జురాసిక్ పార్క్ నమోదు అవుతుందని ప్రత్కేకంగా చెప్పనవసరం లేదు. ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలు జురాసిక్‌పార్క్ సిరీస్. పార్క్ అనే నవల ఆధారంగా 1993లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ తెరపై ఆవిష్కరించిన వండర్ జురాసిక్‌పార్క్ చిత్రం. ప్రపంచ స్థాయిలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఇస్లా నుప్లర్ అనే ఒక కల్పన దీవిలో డైనోసర్ అనే ఒక వింత జాతికి జంతువు అరాజకాల ఇతివృత్తంగా తెరకెక్కిన ఆ చిత్రానికి ఆ తరువాత ది లాస్ట్ వరల్డ్ పేరుతో 1997లోనూ, జురాసిక్ పార్క్ 3 పేరుతో 2001లోనూ, జురాసిక్ వరల్డ్ పేరుతో2015లోనూ అదే స్టీవెన్ స్పీల్బెర్గ్ వరుసగా సీక్వెల్స్‌ను రూపొందించారు. తాజాగా జురాసిక్‌పార్క్– ఫాలెన్కింగ్డమ్ పేరుతో ఐదవ సీక్వెల్‌ను తెరకెక్కించిన చిత్రం జూన్‌న్7న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. అదే డైనోసర్ విలనిజాలను మరో కొత్త కోణంలో తెరపై దర్శకుడు ఆవిష్కరించారట. 1993 నుంచి జురాసిక్ పార్క్ సిరీస్‌లోనూ నటించిన జెఫ్ కోల్ట్ప్లమ్ ఈ జురాసిక్‌పార్క్–ఫాలెన్ కింగ్డమ్ చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. ఈ చిత్రంపై అంచనాలు భారి స్థాయిలో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం.ఆంగ్లం భాషల్లో యూనివర్శల్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది. -
‘జురాసిక్ వరల్డ్ 3’ ప్లాన్ రెడీ!
స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్లో మొన్న డిసెంబర్లో ‘ది పోస్ట్’ అని ఒక సినిమా వచ్చింది గుర్తుంది కదా? ఇప్పుడు నిన్నగాక మొన్న ‘రెడీ ప్లేయర్ వన్’ అని ఇంకో సినిమా వచ్చింది. ఇవి కాకుండా ఆయన ప్రొడక్షన్లో నిరంతరం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అంత బిజీగా ఉంటాడాయన. ఇక ‘జురాసిక్ పార్క్’తో డైనోసర్ సినిమా అంటే స్పీల్బర్గ్ అనిపించుకున్న ఆయన, ‘జురాసిక్ వరల్డ్’ సిరీస్‌కు దర్శకుడిగా కాక, నిర్మాతల్లో ఒకరుగా ఉంటూ వస్తున్నాడు. జురాసిక్ వరల్డ్ ఒకటో భాగం 2015లో వస్తే, రెండో భాగం 2018 జూన్‌లో వస్తోంది. అలాగే మూడో భాగానికి కూడా అప్పుడే ప్లాన్ రెడీ చేసేశాడు స్పీల్బర్గ్. ఆయన ఒక నిర్మాతగా నిర్మించనున్న జురాసిక్ వరల్డ్ మూడో భాగానికి కొలిన్ ట్రెవెరో దర్శకత్వం వహించనున్నాడు. జురాసిక్ వరల్డ్ మొదటి భాగానికి ఆయనే దర్శకుడు కాగా, కొన్ని అనుకోని కారణాల వల్ల రెండో భాగానికి జె.ఎ.బయోనా దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మూడో భాగానికి మళ్లీ కొలినే దర్శకుడు కావడం విశేషం. -
ఛాన్స్ అడిగినా ఇవ్వలేదు: స్పీల్బర్గ్
లండన్: జేమ్స్‌బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అలాంటి సినిమాలకు డైరెక్షన్ చేయాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కు రెండుసార్లు ఈ అవకాశం చేజారింది. బీబీసీ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 'నేను తీసిన జాస్ సినిమా పెద్ద హిట్టైన తర్వాత నిర్మాత కుబీ బ్రొకోలిని కలిశాను. జేమ్స్‌బాండ్ సినిమాకు డైరెక్షన్ చేస్తానని చెప్పాను. ఈ సినిమాను నేను తగనని వారు భావించారు. క్లోజ్ ఎన్కౌంటర్స్ సినిమా తర్వాత మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినా నాకు ఛాన్స్ దక్కలేదు. రెండుసార్లు బాండ్ సినిమా కోసం ప్రయత్నించా. ఇప్పుడు నన్ను భరించలేరు. కాబట్టి మర్చిపోవాలని బ్రొకోలిని కోరుతున్నా'నని 69 ఏళ్ల స్పీల్బర్గ్ తెలిపారు. ఒకవేళ జేమ్స్‌బాండ్ సినిమాల నుంచి డానియల్ క్రెయిగ్ తప్పుకుంటే 'లూథర్' స్టార్ ఐడ్రిస్ ఎల్బా తన ఫస్ట్ ఛాయిస్ అని చెప్పారు. -
పారితోషికం ఒక్క పైసా కూడా తీసుకోను
'కెరీర్ ప్రారంభంలో నా పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత నా వాయిస్ లో ఉన్న మాస్ ఇమేజ్ ను గుర్తించింది రాంగోపాల్ వర్మ. కథేంటో.. సినిమా ఏంటో కూడా పెద్దగా తెలీదు. కానీ హాలీవుడ్ దర్శకదిగ్గజం స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ కావడంతో డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నాను' అని టాలీవుడ్ నటుడు జగపతిబాబు అన్నారు. బేసిక్ గా తాను యానిమేషన్ మూవీలు చూడనని, అలాంటి తరహా సినిమాల కంటే రియాల్టీ ఉండే వాటినే చూస్తానని చెప్పుకొచ్చాడు. స్పీల్బర్గ్ దర్శకత్వంలో రిలయన్స్, డిస్నీ సంస్థలు నిర్మించిన ఫాంటసీ చిత్రం ‘ది బిఎఫ్జి’. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ మూవీలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పిన తాను పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నాడు. కేవలం దిగ్గజ దర్శకుడు స్పీల్బర్గ్ తో ఒక్క ఫొటో దిగితే అదే తనకు బిగ్ రెమ్యూనరేషన్ అని పేర్కొన్నాడు. తన జీవితంలో వచ్చిన బెస్ట్ డబ్బింగ్ అవకాశమని, ఆ ప్రాజెక్టులో తాను భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అయితే తన డ్రీమ్(స్పీల్బర్గ్ తో ఫొటో దిగడం) ఇంకా పూర్తి కాలేదన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో తండ్రి పాత్రలో, క్రేజ్ ఉన్న విలన్ పాత్రల్లో మెప్పిస్తోన్న జగపతి, తనకు చాలా డిమాండ్ ఉన్నా హాలీవుడ్ దర్శకుడిపై ఉన్న అభిమానంతోనే పారితోషికం తీసుకోనని చెప్పడం విశేషం. -
అంతా మేజిక్‌లా జరిగిపోయింది!
‘‘కథేంటో.. సినిమా ఏంటో.. ఏమీ తెలీదు. వాళ్లు ఏం చెబితే అది చేశాను. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం పెద్ద సవాల్ అనిపించింది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో రిలయన్స్, డిస్నీ సంస్థలు నిర్మించిన ఫాంటసీ చిత్రం ‘ది బిఎఫ్జి’. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. ఈ నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ జెయింట్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘కెరీర్ ప్రారంభంలో నా పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు. నా వాయిస్‌ని గుర్తించింది రాంగోపాల్ వర్మ. ‘గాయం’ తర్వాత నుంచీ నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వేరే పాత్రకు.. అందులోనూ ఇదే పాత్రకు హిందీలో అమితాబ్ బచ్చన్‌గారు, తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో వాయిస్ డిఫరెంట్‌గా ఉందని అందరూ ప్రశంసిస్తు న్నారు. నేను పెద్దగా కష్టపడిందేమీ లేదు. ఆ పాత్రకు వాయిస్ మార్చి ఎలా డబ్బింగ్ చెప్పానో నాకే తెలీదు. అంతా ఓ మేజిక్‌లా జరిగింది’’ అన్నారు. ‘‘ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించాలని నిర్ణయించిన తర్వాత తెలుగులో మాకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు జగపతిబాబు. ఇతర చిత్రాల్లో ఆయన డబ్బింగ్‌కి, ఇందులో డబ్బింగ్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతలా వాయిస్ చేంజ్ చేశారు’’ అని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి శ్రీధర్ చెప్పారు. -
కెనడీ మెచ్చిన యథార్థ గాథ
హాలీవుడ్ బయోపిక్ థ్రిల్లర్ / బ్రిడ్జి ఆఫ్ స్పైస్ (2015) ‘జాస్’, ‘ఇ.టి’, జురాసిక్ పార్క్’, ‘ఇండియానా జోన్స్’ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకి కూడా తెలిసిన హాలీవుడ్ మాస్ డెరైక్టర్ స్టీవెన్ స్పీల్బెర్గ్ 69 ఏళ్ల వయసులో కూడా కొత్తకొత్త సబ్జెక్ట్లకోసం స్క్రిప్ట్‌లు చదువుతుంటాడు. బ్రిటన్‌కు చెందిన రచయిత మాట్ చార్మెన్ అనుకోకుండా అమెరికా మాజీ ప్రెసిడెంట్ జీవిత చరిత్ర ‘యాన్ అన్ ఫినిష్డ్ లైఫ్’ అనే పుస్తకం చదివాడు. అందులో అమెరికాలో సంచలనం రేపిన ఓ లాయర్ జేమ్స్ డొనవన్ గురించి కెనెడీ స్వయంగా ప్రస్తావించాడు. 1964 నుంచి 2012 వరకు అతని గురించి పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. రెండు శత్రుదేశాల మధ్య గూఢచారుల మార్పిడికి ముందుకొచ్చి నిలబడ్డ లాయర్ జేమ్స్ డొనొవన్. అసలేం జరిగింది? 1957 ... ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు - అమెరికా, రష్యా మధ్య శత్రుత్వం. ఏ నిమిషాన మూడో ప్రపంచయుద్ధం ఈ రెండు దేశాల కారణంగా తలెత్తుతుందో ఏమోనని భయం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కారణాలు ఏమైనా కానీ - రష్యా మీద, కమ్యూనిజం మీద అమెరికాలో తీవ్ర వ్యతిరేక భావాలు నెలకొని ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఓ సోవియట్ గూఢచారి రుడాల్ఫ్ ఎబెల్, అమెరికన్ గూఢచార వ్యవస్థ సిఐఏకి దొరికాడు. ఆ గూఢచారికి ఉరిశిక్ష విధించాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. బయటి సమాజం దాన్ని సమర్థించింది. ఆ పరిస్థితుల్లో లాయర్ డొనొలిన్ - ఆ రష్యా గూఢచారి మరణశిక్ష రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానంలో పోరాడాడు. అతణ్ణి జైల్లో ఉంచితే, అవసరమైనప్పుడు ఉపయోగపడతాడని డొనొవిన్ ఆలోచన. 1962లో ఓ యుద్ధ విమానంతో అమెరికన్ పెలైట్ ఫ్రాన్సిస్ గారీ పవర్స్ రష్యన్లకి దొరికాడు.తమ దేశపు పైలట్‌ని విడుదల చేస్తే, బందీగా ఉన్న రుడాల్ఫ్ ఎబెల్‌ని రష్యాకి అప్పగిస్తామని సిఐఏ తరఫున లాయర్ డొనొలిన్ బేరసారాలు జరిపించాడు. అలా ఇద్దరు గూఢచారుల మార్పిడి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో తన అనుభవాలను పేర్కొంటూ - డొనొమిన్ 1964లో ‘స్ట్రేంజర్స్ ఆన్ ఎ బ్రిడ్జి : ది కేస్ ఆఫ్ కల్నల్ ఎబెల్ అండ్ ఫ్రాన్సిస్ గారీ పవర్స్’ అనే పుస్తకం రాశాడు. అలాగే ఈ ఉదంతం గురించి ‘ఆపరేషన్ గోల్డ్’, ‘ఎ హౌస్ ఆన్ ది హైట్స్’ అనే పుస్తకాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. స్క్రీన్‌ప్లే రచయిత మాట్ చార్మెన్ కెనడీ రాసిన విషయాల ఆధారంగా ఈ సంఘటనపై మరింత లోతుగా పరిశోధించాడు. లాయర్ జేమ్స్ డొనొవన్ కుమారుణ్ణి కలిశాడు. ఆసక్తికరమైన సమాచారం సేకరించి, సినిమాకి అనుగుణంగా స్క్రిప్ట్ రాశాడు మాట్. అయితే చాలా స్టూడియోలు ఈ స్క్రిప్ట్‌ని తిరస్కరించాయి. చివరికి స్టీవెన్ స్పీల్బర్గ్ దృష్టిలో ఈ స్క్రిప్ట్ పడింది. తన సొంత నిర్మాణ సంస్థ డ్రీమ్‌వర్క్స్ స్టూడియో నిర్మాణంలో ఈ కథని తెరకి ఎక్కించాడు స్పీల్బర్గ్. కథ విషయానికొస్తే - 1957 - న్యూయార్క్ బ్రూక్లిన్‌లో రుడాల్ఫ్ అబెల్ తనకొచ్చిన రహస్య సమాచారాన్ని చదువుతుండగా ఎఫ్బిఐ ఏజెంట్లు అతడ్ని అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో పలు కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించి, అతణ్ణి సోవియెట్ గూఢచారిగా నిర్ధారించారు. సోవియట్ రష్యాకి సంబంధించిన విషయాలు చెప్పి, అప్రూవర్‌గా మారితే శిక్ష తగ్గించే అవకాశం ఉంటుందని ఎఫ్బిఐ హితబోధ చేసింది. కానీ ఎబెల్ అంగీకరించలేదు. విచారణ ప్రారంభమైంది. లాయర్ జేమ్స్ డొనొవన్ ఎబెల్ తరఫున వాదించసాగాడు. డొనొవన్ కుటుంబ సభ్యులు, మిత్రులు, చివరికి జడ్జితో సహా ఈ కేసుని వదిలేయలేమని డొనొవన్కి చెప్పాడు. తనకేమాత్రం సంబంధం లేని ఈ లాయర్ తనని సమర్థిస్తూ వాదించడం ఎబెల్‌ని ఆకట్టుకుంది. ఎబెల్కి ఉరిశిక్ష విధించబోతుంటే, డొనొవన్ అడ్డుపడ్డాడు. అమెరికా విదేశాంగ విధానం ప్రకారం - విదేశీయులకి ఉరిశిక్ష విధించకూడదని, పైగా అలా చేస్తే సోవియట్ రష్యా ఈ అంశాన్ని ఓ అస్త్రంగా వాడుకుంటుందని డొనొవన్ తీవ్రంగా వాదించాడు. ఆ ఉరిశిక్ష 30 సంవత్సరాల కారాగార శిక్షగా మారింది. ఓ రష్యన్ గూఢచారిని వెనకేసుకొచ్చినందుకు లాయర్ డొనొలిన్ ఇంటి మీద దాడులు జరిగాయి. కొన్నేళ్ల తర్వాత అమెరికా గూఢచార విమానం పెలైట్ ఫ్రాన్సిస్ గారీ పవర్స్ - రష్యన్ గూఢచార సంస్థ కెజిబికి బందీగా దొరికాడు. రష్యా ప్రభుత్వం బేరసారాలు ప్రారంభించింది. ఎబెల్‌ని అప్పగిస్తే, ఫ్రాన్సిస్ని తిరిగి ఇస్తారు. అయితే ఎబెల్‌ని తమ గూఢచారిగా అంగీకరించలేదు రష్యా. అందుకే గూఢచారుల మార్పిడి తూర్పు జర్మనీలో జరగాలని ప్లాన్ చేశాడు. డొనొవన్ ఎలా ఈ గూఢచారుల్ని మార్పిడి చేశాడనేది మిగిలిన సినిమా. టామ్ హాంక్స్ డొనొవన్గా నటించగా, ఎబెల్గా మార్క్ రెలాన్స్గా నటించాడు. - తోట ప్రసాద్ ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు సెయింట్ జేమ్స్ ప్లేస్. అయితే ‘బ్రిడ్జి ఆఫ్ స్పైస్’గా తర్వాత మార్చారు.ఈ టైటిల్‌పై ఇప్పుడు పెద్ద వివాదం నెలకొంది. ఈ చారిత్రక సంఘటన ఆధారం చేసుకుని - బ్రిటన్‌కి చెందిన జర్నలిస్ట్, రచయిత గిల్స్ వెటైల్ 2010లో ‘బిడ్జి ఆఫ్ స్పైస్’ అనే పుస్తకం రాశాడు. తన పుస్తకం పేరు సినిమా టైటిల్‌గా వాడుకున్నందుకు స్పీల్బర్గ్ మీద, డ్రీమ్‌వర్క్స్, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ స్టూడియోలపై కేసు వేశాడు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 40 మిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 166 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. మార్క్ రెలాన్స్ ఉత్తమ సహాయ నటుడిగా ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నాడు. {ఫాన్సిస్ గారీ పవర్స్ కుమారుడు కోల్డ్‌వార్ మ్యూజియం ఏర్పాటు చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన చారిత్రక ఆధారాలు, సాంకేతిక సహకారం అందించడంలో గారీ కుమారుడి పాత్ర ఉంది. 1960 నాటి నేపథ్యాన్ని గుర్తుచేసేలా బ్రూక్లిన్ సమీపంలో సెట్స్ వేశారు.బెర్లిన్‌లో ఏ బ్రిడ్జి మీద అయితే గూఢచారుల మార్పిడి జరిగిందో, అదే ప్రదేశంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ జరిగినన్నాళ్లూ బెర్లిన్, పాట్రోడామ్ మధ్య ఉన్న ఆ బ్రిడ్జి మీద ట్రాఫిక్ నిషేధించారు. జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మార్కెల్ షూటింగ్ స్పాట్‌కి వచ్చి, ఆ సన్నివేశాలు తిలకించారు. -
స్పీల్బర్గ్ సినిమాకు జగపతిబాబు డబ్బింగ్
నెగెటివ్ పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు, తన కెరీర్లో మరో టర్న్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్న జగ్గుభాయ్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారుతున్నాడు. హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వంచరస్ ఫాంటసీ ఫిలిం 'ద బిఎఫ్జి' సినిమా తెలుగు, తమిళ వర్షన్లకు గాత్రదానం చేస్తున్నాడు. 24 నాలుగు అడుగుల ఎత్తుండే ఓ భారీ మనిషితో స్నేహంగా ఉండే పదేళ్ల చిన్నారి కథ 'ద బిఎఫ్జి'. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోనాల్డ్ డాల్హ్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ద బిఎఫ్జి' జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన భారీ మనిషికి జగపతిబాబు డబ్బింగ్ చెపుతుండటంతో దక్షిణాదిలో కూడా 'ద బిఎఫ్జి'కి మంచి క్రేజ్ ఏర్పడుతోంది. -
ఎదురుదెబ్బలను దాటుకుని..
ప్రతి వ్యక్తి జీవితంలో గెలుపు, ఓటములు తప్పనిసరి. అయితే కొందరిని ఓటమి ఎక్కువ కాలం పీడిస్తుంది. ఈ సమయంలో అలాంటివారిని చూసి ఇతరులు ఇక వారి పనైపోయిందనుకుంటారు. కానీ అలాంటి సమయంలోనే కొందరు ఓర్పుగా మరిన్ని ప్రయత్నాలు చేసి విజయాల బాట పడతారు. ఇలాంటివారు చరిత్రలో చాలా మంది కనిపిస్తారు. జీవితంలో ఆటుపోట్లు చవిచూసినప్పటికీ తిరిగి విజయాన్ని అందుకున్నవారి గురించి తెలుసుకుందాం.. వాల్ట్ డిస్నీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్కు అయిన డిస్నీల్యాండ్, సినీ నిర్మాణ సంస్థ డిస్నీ సహా అనేక కంపెనీలను స్థాపించింది వాల్ట్ డిస్నీ. ఈయన కూడా ప్రారంభంలో అనేక అపజయాలను ఎదుర్కొన్నాడు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓ న్యూస్ పేపర్లో కార్టూనిస్టుగా పనిచేస్తుండేవాడు. అయితే కార్టూన్ల విషయంలో సరిగ్గా పనిచేయడం లేదని, సృజనాత్మకత లోపించిందని ఎడిటర్ డిస్నీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరుసటి ఏడాది డిస్నీ ఆ ఉద్యోగం మానేసి ఓ సంస్థను స్థాపించాడు. సరైన ఆదాయం లేదని దాన్ని కూడా వదిలేసి మరో సంస్థలో చేరాడు. తర్వాత ఓ సొంత స్టూడియో స్థాపించాడు. అది కొంతకాలం విజయవంతంగా సాగినా చివరకు దివాళా తీసింది. ఇలా ఏ వ్యాపారం సరిగ్గా సాగకపోయేసరికి ఓ హాలీవుడ్ స్టూడియో స్థాపించాడు. ఇక్కడే ఓస్వాల్డ్ అనే లక్కీ ర్యాబిట్ క్యారెక్టర్‌ను సృష్టించాడు. ఈ సందర్భంగా తన నిర్మాతలు ఆ పాత్రను దొంగిలించి, డిస్నీతో పనిచేసే సిబ్బందిని సైతం లాగేసుకున్నాడు. అయినప్పటికీ తన దగ్గర మిగిలిన కొద్దిమంది సిబ్బందితోనే పనిచేసి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మిక్కీమౌస్ క్యారెక్టర్‌ను సృష్టించాడు. అది విజయవంతమవడంతో అప్పటినుంచి డిస్నీల్యాండ్ నిర్మాణం, ఇతర సంస్థల స్థాపన నిరాటంకంగా కొనసాగింది. మొదట ఏ వ్యాపారమూ కలిసి రాకున్నా చివరకు అంతర్జాతీయ స్థాయి డిస్నీల్యాండ్‌ను నిర్మించి చరిత్రలో నిలిచాడు వాల్ట్ డిస్నీ. క్రిస్ గార్డెనర్.. అమెరికాలో పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతున్న క్రిస్ గార్డెనర్ బాల్యం నుంచి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి మరో వివాహం చేసుకుంది. అయితే సవతి తండ్రి క్రిస్ తల్లిని, క్రిస్‌ను, అతడి సోదరులను హింసించేవాడు. పైగా క్రిస్ తల్లిపై సవతి తండ్రి అనేక ఆరోపణలు చేయడంతో ఆమె పలుమార్లు అక్రమంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటు తల్లి జైలు పాలవడం, పెంపుడు తండ్రి పట్టించుకోకపోవడంతో క్రిస్, అతడి తోబుట్టువుల ఆలనాపాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. దీంతో క్రిస్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు వేరే వారి ఇంట్లో ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత పెద్దయ్యాక వైవాహిక జీవితం కూడా ఆటుపోట్లకు గురైంది. అతడు మెడికల్ రంగంలో సేల్స్‌మెన్‌గా పనిచేయడంతో విబేధాలొచ్చి భార్య నుంచి విడిపోవాల్సి వచ్చింది. చివరకు ఏ దిక్కూ లేకుండా పోయిన క్రిస్ చిన్నచిన్న హొటళ్లు, పార్కులు, ఎయిర్‌పోర్టులు, పబ్లిక్ టాయ్లెట్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. తర్వాత పొద్దంతా ఓ బ్రోకరేజ్ సంస్థలో పనిచేస్తుండేవాడు. రాత్రిపూట ఓ ఇంటి చూరు కింద నిద్రపోయేందుకు పెద్ద క్యూలో నిలబడేవాడు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న క్రిస్ 1892లో డీన్ రైటర్ అనే బ్రోకరేజ్ సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరాడు. అనంతరం 1987లో గార్డెనర్ రిచ్ అండ్ కో అనే సంస్థను స్థాపించాడు. 2006లో తనకు ఆ సంస్థలో ఉన్న వాటాలో కొద్దిశాతం అమ్మడం ద్వారా క్రిస్ వందల కోట్ల రూపాయలు ఆర్జించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, చికాగోల్లో కార్యాలయాలున్నాయి. ఆయన జీవిత కథతో హాలీవుడ్లో సినిమా కూడా రూపొందింది. స్టీవెన్ స్పీల్బర్గ్.. జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ వంటి ప్రపంచవ్యాప్తంగా హిట్టైన సినిమాల్ని రూపొందించిన దర్శకడు స్టీవెన్ స్పీల్బర్గ్. సినిమా చరిత్రలోనే అద్భుతమైన సినిమాల్ని రూపొందించిన స్పీల్బర్గ్ విద్యార్థి దశలో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో సినిమాకు సంబంధించిన ఓ కోర్సు చేయాలనుకున్నాడు. కానీ అతడికి అన్నింట్లోనూ సీ గ్రేడ్ మార్కులే ఉండడంతో యూనివర్సిటీలో సీటు లభించలేదు. ఇలా మొత్తం మూడుసార్లు యూనివర్సిటీ స్పీల్బర్గ్ అప్లికేషన్‌ను తిరస్కరించింది. తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చేరాల్సి వచ్చింది. స్టూడెంట్‌గా ఉండగానే ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ హాలీవుడ్ స్టూడియోతో పనిచేసే అవకాశం వచ్చింది. అనంతరం షార్ట్‌ఫిల్ములు రూపొందించి తన సత్తా చాటాడు. దీంతో హాలీవుడ్ స్టూడియోస్ స్పీల్‌బర్గ్‌తో సినిమాలు రూపొందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఓ విద్యార్థిగానే తిరస్కరణకు గురైన అతడు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే చిత్రాలను రూపొందిస్తున్నాడు. బ్రియాన్ ఆక్టన్.. యాహూ, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థల్లో దశాబ్ద కాలంపైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం బ్రియాన్ ఆక్టన్ సొంతం. అయితే 2009లో ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో అతడికి మరెక్కడా ఉద్యోగం లభించలేదు. చివరకు అప్పుడే ప్రారంభమైన ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలు కూడా బ్రియాన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. చివరకు అతడ్ని తీసుకునేందుకు ఏ కంపెనీ ఆసక్తి చూపకపోవడంతో తన మాజీ సహోద్యోగులైన ఆలమ్, జాన్కోమ్, బ్లిట్లతో కలిసి క్లౌడ్ మెసేజింగ్ సంస్థను స్థాపించాడు. అలా అన్నిచోట్లా తిరస్కరణకు గురవ్వడం వల్ల స్థాపనకు దారితీసిన ఆ కంపెనీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. అదే వాట్సాప్. చివరకు బ్రియాన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా తిరస్కరించిన ఫేస్బుక్ సంస్థే కొంతకాలం తర్వాత బ్రియాన్ ఆధ్వర్యంలో స్థాపించిన వాట్సాప్‌ను 2014లో కొనుగోలు చేసింది. ఉద్యోగం కూడా ఇవ్వని సంస్థే అతడు స్థాపించిన సంస్థను కొనుగోలు చేసేలా చేయగలగడం విశేషం. -
స్పీల్బెర్గ్ దర్శకత్వంలో ఐదోసారి...
హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ హిట్ మూవీల లిస్ట్‌లో ‘ఇండియానా జోన్స్’ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రపంచానికి అందకుండా చారిత్రక శిథిలాల్లో మిగిలిపోయిన అద్భుతమైన వస్తువుల కోసం అన్వేషించే ఓ పురావస్తు శాఖ అధ్యాపకుని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటికీ నాలుగు భాగాలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర కనకర్షం కురిపించాయి. హాలీవుడ్ సూపర్‌స్టార్ హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించారు. ఇప్పుడు అయిదో భాగాన్ని కూడా నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ వరల్డ్ సన్నాహాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ భాగాన్ని కూడా స్టీవెన్ స్పీల్బెర్గ్ తెరకెక్కించనున్నారు. 2019లో ఈ అయిదో భాగాన్ని విడుదల చేయనున్నట్లు డిస్నీ సంస్థ ప్రకటించింది. -
లైవ్ ఆర్కెస్ట్రాతో...జురాసిక్ పార్క్
డైనోసార్ల నేపథ్యంలో జరిగే ‘జురాసిక్ పార్క్’ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ 1993లో తీసిన ఈ చిత్రం 23 ఏళ్ళ తరువాత మళ్ళీ సరికొత్తగా జనం ముందుకు రానుంది. లైవ్ ఆర్కెస్ట్రాతో ఈ సినిమాను ప్రదర్శించ నున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడైన 83 ఏళ్ళ జాన్ విలియమ్స్ కూర్చిన ఈ చిత్ర సంగీతాన్ని ఆర్కెస్ట్రా అప్పటికప్పుడు వాయిస్తుండగా, తెరపై సినిమాను ప్రదర్శించా లని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ వినూత్న ప్రదర్శన జరపనున్నారు. అమెరికా బాక్సాఫీస్ చరిత్రలోని టాప్ 20 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో 8 చిత్రాలకు సంగీతం జాన్ విలియమ్స్‌దే. ఆయన సంగీతం అందించిన ‘హోమ్ ఎలోన్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’, ‘ఇ.టి’ చిత్రాల లాగే ఇప్పుడీ ‘జురాసిక్ పార్క్’ చిత్రానికి కూడా ‘ఫిల్మ్ కాన్సర్ట్స్ లైవ్’ ద్వారా ఈ లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన ఘనత దక్కనుంది. జాన్ విలియమ్స్‌కు 1974 నుంచి స్టీవెన్ స్పీల్‌బెర్గ్‌తో మంచి అనుబంధం ఉంది. స్పీల్బెర్గ్ చిత్రాల్లో అత్యధిక శాతానికి సంగీతం అందించింది ఆయనే. అయితే, జాన్ విలియమ్స్ సంగీతం కూర్చిన చిత్రాల్లో ‘జురాసిక్ పార్క్’కు విశిష్టమైన గుర్తింపుంది. డైనోసార్లను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా తెరపై సృష్టించినప్పటికీ, అవి సజీవంగా నిలిచి, ఊపిరి పీల్చుకుంటున్న అనుభూతికి సంగీతమే ప్రధాన కారణమని నిపుణులు అంటారు. వచ్చే నవంబర్‌లో జరిగే ‘జురాసిక్ పార్క్ ఇన్ కాన్సర్ట్’ కార్యక్రమంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల పెద్ద తెరలపై పూర్తి హైడెఫినిషన్ క్వాలిటీలో ప్రదర్శించనున్నారు. ఆ పక్కనే తెర మీది దృశ్యానికి తగ్గట్లు పూర్తిస్థాయి సింఫనీ ఆర్కెస్ట్రా వాయిస్తారు. ఫలితంగా, తెర మీది చూస్తున్న దృశ్యం కళ్ళెదుట జరుగుతున్నట్లే అనిపిస్తుంది. విశేషం ఏమిటంటే, ‘జురాసిక్ పార్క్’ సంగీతకర్త జాన్ విలియమ్స్ తాజా ఆస్కార్ అవార్డుల రేసులో కూడా ఉన్నారు. ‘స్టార్ వార్స్ - ది ఫోర్స్ ఎవేకెన్స్’ చిత్రానికి అందించిన సంగీతానికి గాను ఆయనకు ఈ నామినేషన్ దక్కింది. ఇప్పటికే పలుసార్లు ఆస్కార్ అందుకున్న ఆయనకు ఈసారీ వస్తుందా అన్నది వేచి చూడాలి. -
హైబ్రిడ్ రాకాసి బల్లి వచ్చేస్తోంది!
అదో రాకాసి బల్లి. దానికి ప్రత్యేకంగా తిక్క రేగాల్సిన అవసరం లేదు. ఫుల్ టైమ్ తిక్క ఆన్‌లోనే ఉంటుంది. అందుకే, కంటికి కనిపించిన మనిషిని కసకసా కొరికి తినేస్తుంది. ఇది చదువుతోంటే ‘జురాసిక్ పార్క్’ గుర్తొస్తోంది కదూ. పిల్లలూ, పెద్దలూ ఆ రాకాసి బల్లిని కళ్లు పెద్దవి చేసుకొని మరీ చూశారు. ఇప్పుడు అంతకు రెట్టింపు రాకాసి రాబోతోంది. ఇది హైబ్రిడ్ డైనోసార్. ‘జురాసిక్ పార్క్’ చిత్రానికి నాలుగో భాగంగా రూపొందిన ‘జురాసిక్ వరల్డ్’లో ఈ హైబ్రిడ్ రాకాసి బల్లి చేసే విధ్వంసం చూడ్డానికి రెండు కళ్లూ చాలవట. మునుపటి భాగాల్లో కన్నా ఇందులోని బల్లి వెన్నులో వణుకు పుట్టించేలా ఉండాలని చిత్రబృందం అనుకున్నారట. దాంతో 50 అడుగుల పొడవు, 18 అడుగుల ఎత్తు ఉన్న రాకాసి బల్లిని తయారు చేశారు. జురాసిక్ వరల్డ్ పార్క్‌లోకి సందర్శకుల ప్రవేశం తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ‘జురాసిక్ పార్క్’ దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ నిర్మాతగా, కొలిన్ ట్రెవ్రో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ జూన్ 12న. -
ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే!
డైనోసార్ విధ్వంసాలు (‘జురాసిక్ పార్క్’)... ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు (‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో ఈథెన్ హంట్ గుర్తున్నాడుగా)... జేమ్స్ బాండ్ సినిమాల్లోని యాక్షన్ ఘట్టాలు.... రోబోల మధ్య యుద్ధం (‘టెర్మినేటర్’)... గగన వీధుల్లో మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాలు.... హాలీవుడ్ సినిమాను తలుచుకోగానే సగటు ప్రేక్షకుల మనోఫలకాల్లో కదలాడే సన్నివేశాలు ఇవన్నీ. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని హాలీవుడ్లో ఈ ఏడాది వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళూ ఆ సినిమాల మీదే. ఈ చిత్రాల మీద ఎన్నెన్నో ఆశలు, అంచనాలు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి...! రానున్న కొద్ది నెలల్లో రానున్న అలాంటి అయిదు సినిమాల గురించి...! జురాసిక్ వరల్డ్ ‘జురాసిక్ పార్క్’... హాలీవుడ్ సినీ చరిత్రలో ఓ సంచలనం. స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత మరో రెండు భాగాలు వచ్చాయి. వీటికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు స్పీల్బర్గ్ నిర్మాణ సారథ్యంలో ‘జురాసిక్ వరల్డ్’ సినిమా రానుంది. చిత్ర కథ ప్రకారం... 22 ఏళ్ల తర్వాత జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ ఓపెన్ చేస్తారు. శాస్త్రవేత్తల సృష్టితో తయారైన ఓ డైనోసార్ ఆ పార్క్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందన్న దానికి తెరరూపం ఇచ్చారు. ఈ చిత్రం ‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్ అని దర్శకుడు కొలిన్ ట్రెవెర్రో చెప్పారు. ఇందులో మరో విశేషం ఏంటంటే మన హిందీ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జురాసిక్ పార్క్ సీఈవోగా కీలక పాత్రను పోషిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్ టామ్ క్రూజ్ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన నాలుగు భాగాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా నాలుగో భాగం ‘ఘోస్ట్ ప్రొటోకాల్’ కనకవర్షం కురిపించింది. త్వరలో ఐదో భాగం రాబోతోంది. ‘రోగ్ నేషన్’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని టామ్‌క్రూజ్, జె.జె. అబ్రమ్స్, బ్రియాన్ బర్క్ కలిసి నిర్మిస్తున్నారు. క్రిస్టొఫర్ మెక్‌క్వారీ దర్శకుడు. రెబెకా ఫెర్గూసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఎప్పటి లాగే ఈ చిత్రం కోసం ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో టామ్ క్రూజ్ నటించారు. విమానం మీద చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రం రానున్న జూలై 31న విడుదల కానుంది. స్పెక్టర్ ‘‘మై నేమ్ ఈజ్ బాండ్... జేమ్స్ బాండ్’’...అనగానే ప్రతినాయకులతో బాండ్ చేసే పోరాటాలు, గాళ్స్‌తో రొమాన్స్ గుర్తొస్తాయి. బాండ్ ఎవరైనా ఈ బ్రాండ్ డైలాగ్, ఆ సినిమాలకున్న బ్రాండ్ ఎప్పటికీ మారదు. అంత కొత్తగా తీస్తారు. ఇప్పటిదాకా 23 బాండ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా 24వ సినిమా ‘స్పెక్టర్’ రానుంది. డేనియల్ క్రెగ్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రంలో మోనికా బెలూసీ, లీ సీడక్స్ బాండ్ గాళ్స్గా నటిస్తున్నారు. శామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కానుంది. టెర్మినేటర్ జెనిసిస్ హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రాలలో టెర్మినేటర్ ఒకటి. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటిదాకా వచ్చిన రోబో చిత్రాలకు మార్గదర్శి. ఇప్పటిదాకా నాలుగు భాగాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు భాగాలకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ ఐదో భాగానికి ‘థోర్’ చిత్ర ఫేమ్ అలెన్ టేలర్ దర్శకుడు. ఎమీలియా క్లార్క్, జై కోర్టినీ, క్రిస్టియన్ బేల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకెన్స్ దర్శక, రచయిత జార్జ్ లూకాస్ 1977లో అనుకుని ఉండరేమో... తన ఊహాసృష్టి ‘స్టార్ వార్స్’ పెను మార్పుకు దారితీస్తుందని! ఆయన దర్శకత్వం వహించిన ‘స్టార్ వార్స్’ ఫస్ట్‌పార్ట్ అప్పట్లో పెను సంచలనం. అది ఓ ఫ్రాంచైజ్‌గా మారిపోయింది. తర్వాత వరుసగా ఏడు వచ్చాయి. ఇప్పుడు ఎనిమిదో సినిమా కూడా రానుంది. హ్యారిసన్ ఫోర్డ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జె.జె. అబ్రమ్స్ దర్శకుడు. రానున్న డిసెంబర్ 18న ఈ చిత్రం రిలీజవుతోంది. -
అరుదైన మహిళ జీవితకథతో...
ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్, సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్, నటి జెన్నీఫర్ లారెన్స్... అరుదైన ఈ కాంబినేషన్ నిజం కానుంది. యుద్ధక్షేత్రాల్లో ఫోటోలు తీయడంలో ప్రసిద్ధురాలైన లిన్సే అడారియో జ్ఞాపకాల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ‘ఇట్స్ వాట్ ఐ యు - ఎ ఫోటోగ్రాఫర్స్ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ వార్’ అనే జ్ఞాపకాల పుస్తకాన్ని తెర కెక్కించే హక్కుల్ని వార్నర్ బ్రదర్స్ సొంతం చేసుకుంది. ప్రధానంగా పురుషులే ఉండే ‘వార్ ఫోటోగ్రఫీ’లో స్థానం సంపాదించి, ఒకప్పుడు కిడ్నాప్‌కు కూడా గురైన ఈ మహిళా ఫొటోగ్రాఫర్ జీవితం అరుదైన వెండితెర అనుభవం కానుంది. -
తిరస్కరణకు గురయ్యారు..!
‘కరేజ్ డజ్ నాట్ ఆల్వేస్ రోర్..’ అనేది ఇంగ్లిష్‌లోని ఒక నానుడి. వ్యక్తిలోని ప్రతిభను ఒక్కోసారి అవతలి వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక రంగంలో అద్భుతాలు సాధించగల వారు కూడా ఒక్కోసారి అదే రంగంలో అనామకులనిపించవచ్చు. అందుకు ఉదాహరణ వీళ్లు. అపారమైన ప్రతిభను కలిగి ఉండి.. ఒకే లక్ష్యంతో పాటుపడుతున్న సమయంలో వీరికి తిరస్కారాలుఎదురయ్యాయి. అయితేనేం.. అలాంటి తిరస్కారాలను వైఫల్యాలుగా భావించకుండా, తిరిగి కృషి చేసి అద్భుతాలు సాధించిన స్ఫూర్తిమంతులు వీళ్లు. జేకే రౌలింగ్ ఒకరు కాదు ఇద్దరు కాదు... పన్నెండు మంది పబ్లిషర్స్ రౌలింగ్ రచనని తిరస్కరించారు. ఆమె అక్షరాల ద్వారా సృష్టించిన ‘హారీపొటర్’ ప్రపంచం వారిని ఆకట్టుకోలేకపోయింది. ప్రచురణకు ఎవరూ ముందుకు రాలేదు. అయితేనేం... రౌలింగ్ ప్రతిభకు ప్రచురణకర్తల తిరస్కరణ అడ్డు కాలేకపోయింది. ఆ తర్వాత దక్కిన చిన్న అవకాశంతో రౌలింగ్ తన సత్తాచాటారు. ఎమినిమ్ ఈ పేరు వింటే పాప్ ప్రపంచం ఊగిపోతుంది. సంగీత ప్రపంచంలో అతడొక తరంగమని కీర్తిస్తుంది. ఈ ప్రశంసలూ, పేరు ప్రఖ్యాతులన్నీ ఎమినిమ్ గ్రామీ అవార్డులను అందుకోవడం మొదలైన తర్వాత మొదలైనవి. డజను సార్లకుపైగా ఆ అవార్డును అందుకున్నాక పతాక స్థాయికి చేరినవి. అయితే సంగీతకారుడిగా పేరు తెచ్చుకోకమునుపు ఎమినిమ్ను ఆదరించిన వారు లేరు. తన ప్రతిభను గుర్తించకపోగా తన పేదరికాన్ని చూసి అనేకమంది అసహ్యించుకొన్నారని ఈ పాప్‌స్టార్ అనేక సార్లు తన గతం గురించి ప్రస్తావించాడు. మైఖేల్ జోర్డాన్ ‘గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ఆల్‌టైమ్’ ఆట నుంచి రిటైర్ అయిన సమయానికి ఈ అమెరికన్ ప్లేయర్ పేరు ముందు చేరిన బిరుదు ఇది. ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్’ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన మైఖేల్ జోర్డాన్ ఆట విషయంలో అనేక సార్లు నిరాదరణకు గురయ్యాడు. స్కూల్ టీమ్, టీనేజ్‌లలో సెలెక్టర్లు జోర్డాన్‌ను పట్టించుకునే వారు కాదట. అలాంటి సందర్భాల్లో ఒక్కడే రూమ్‌లో కూర్చొని ఏడ్చేసేవాడినని జోర్డాన్ చెబుతారు. అయితే నిరాదరణకు గురైన జోర్డాన్ ప్రతిభ అసలైన సమయంలో మాత్రం వికసించింది. స్టీవెన్ స్పీల్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్లో చేరాలని తీవ్రంగా ప్రయత్నించాడు స్పీల్బర్గ్. అయితే వర్సిటీ వాళ్లు స్టీవెన్‌కు అంత టాలెంట్ లేదని తేల్చేశారు. సినిమాల్లోకి రాకముందు రెండు సార్లు స్పీల్బర్గ్ దరఖాస్తును వారు తిరస్కరించారట. అలా ఫిల్మ్‌స్కూల్ లో స్థానం సంపాదించలేకపోయినా స్పీల్బర్గ్ హాలీవుడ్ ఆవిష్కరించిన అద్భుతాల గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు! లియోనల్ మెస్సీ ఇప్పుడంటే మెస్సీకి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సాకర్ ప్లేయర్ ఆట తీరుకు ముగ్ధులవుతున్నారు. అయితే టీనేజ్‌లో మెస్సీని ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తించిన వారెవరూ లేరు. ఆటపై అమితమైన ప్రేమ, ప్రావీణ్యత కలిగి ఉన్నా.. మెస్సీ టీమ్‌లలో చోటు సంపాదించలేకపోయాడు. అప్పటికి బక్కగా, రివటలా ఉన్న మెస్సీని గేలి చేస్తూ అతడిది సాకర్‌కు పనికొచ్చే పర్సనాలిటీ కాదని అందరూ తేల్చేశారట. అయితేనేం ఆ తర్వాత మెస్సీ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత మైన ప్లేయర్ అనే పేరే తెచ్చుకున్నాడు. -
బంపర్ ఆఫర్!
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ టాలెంట్ చూపుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్‌ఖాన్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మెగా దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తీయబోయే తరువాతి సినిమాలో మనోడికి చాన్స్ దక్కిందని సమాచారం. స్పీల్బర్గ్ అప్‌కమింగ్ వెంచర్ ‘జురాసిక్ వరల్డ్’ చిత్రం ప్రమోషన్స్ కోసం వెళుతున్న ఇర్ఫాన్... మరో వెంచర్ డిస్కషన్లో ఉన్నాడని ఓ పత్రిక కథనం. మీరు చేయబోయేది ‘మార్వెల్ యూనివర్స్’ ప్రాజెక్టేనా అంటే కామెంట్ చేయడానికి అతగాడు నిరాకరించాడు. ఏది ఏమైనా హాలీవుడ్లో ఎవరికీ లేనన్ని వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు ఇర్ఫాన్. -
వీళ్లు డ్రాపౌట్స్..!
పంచామృతం: చదువు మానేయడం... జీవితాన్నే మార్చేస్తుంది. సాధారణంగా చదువు మానేయడం అనేది జీవితాలను నాశనం చేసే పని. అయితే మరికొంద రికి మాత్రం చదువుకు స్వస్తి పలికాకే ఉన్నత మార్గాలు చేరడానికి దారి దొరికింది. స్కూల్ దశలోనే బడికి నామం పెట్టిన వాళ్లు కొందరు... కాలేజీకి చుట్టపుచూపుగా వెళ్లిన వారు కొందరు... అయినప్పటికీ వాళ్లు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటారు. చదువుతో వచ్చే గుర్తింపునకు మించి సాధించారు. అలాంటి వారిలో కొందరు. బ్రాడ్‌పిట్ ఈ హాలీవుడ్ హీరో కొంచెం చిత్రమైన పరిస్థితుల్లో చదువు వదిలేశాడు. సినిమాల్లోకి రాకముందు జర్నలిస్టుగా చేసిన బ్రాడ్ ఆ ఉద్యోగం కోసం చదువు మానేశాడట. జర్నలిస్టు కావడానికి గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేకపోవడంతో బ్రాడ్ ఆ జాబ్‌లో చేరిపోయాడు. ఆ తర్వాత సినిమాలవైపు అడుగేశాడు. ఆ రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. డేవిడ్ కార్ప్ టీనేజ్లోనే బిలియనీర్‌గా పేరు సంపాదించుకోవడంతో పాటు... టంబ్లర్ బ్లాగ్ సృష్టికర్తగా కూడా గుర్తింపు ఉన్న కార్ప్ హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయకుండా చదువుకు స్వస్తిపలికాడు. తల్లిమాట మేరకు చదువు మానేసి కంప్యూటర్స్ మీద దృష్టి పెట్టాడు. ఆ రంగంలో అద్భుతాలు సాధించాడు. అందుకే అమ్మ మాట వినాలి. దీపికా పదుకొనె మోడలింగ్ కెరీర్‌తో బిజీ అయిపోయినప్పుడే దీపిక చదువు వదిలేసింది. హై స్కూల్ పూర్తికాగానే ఈమె గ్లామరస్ ఫీల్డ్‌వైపు వెళ్లాలని ఫిక్సయ్యిందట. మోడలింగ్ చేస్తున్న దశలో దీపిక దూరవిద్యద్వారా బీఏ పూర్తి చేయడానికి ప్రయత్నించింది. కానీ వృత్తిలో బిజీ అయిపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. అయితేనేం దీపిక ఇప్పుడు బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో ఒకరు! ఆలియా భట్ ఇప్పుడు నీకున్న డ్రీమ్ ఏమిటి? అంటే.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అని అంటుంది ఆలియా. ప్లస్‌టూ కూడా సరిగా పూర్తి చేయకుండానే సినిమాలవైపు వచ్చేసిన ఆలియాకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అనేది సాధ్యం అవుతుందో లేదో కానీ సినిమాల్లో అయితే దూసుకుపోతోంది. తండ్రి మహేశ్‌భట్ ప్రసిద్ధ దర్శకుడు కావడంతో సినీ పరిశ్రమతో ఏర్పడిన పరిచయాలు ఆలియాను ఈ రంగాన్ని ఎంచుకొనేలా చేశాయి. చదువును పక్కనపెట్టేలా చేశాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ అకాడ మిక్ చదువు విషయంలో స్పీల్బర్గ్ ట్రాక్ రికార్డ్ ఏ మాత్రం బాగుండదు. చదువు వంటపట్టించుకోలేకపోయిన స్పీల్‌బర్గ్‌కు స్కూళ్లలో, కాలేజీల్లో అడ్మిషన్ లు దక్కించుకోవడమే కష్టం అయ్యింది. అంత కష్టం ఎందుకని ఇష్టమైన రంగంవైపు వచ్చాడు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు. -
స్పీల్బర్గ్... కోల్డ్ వార్
హాలీవుడ్ మెగా డెరైక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ మరో కళాఖండానికి శ్రీకారం చుట్టాడు. న్యూయార్క్ మహానగరంలోని నివాస ప్రాంతం ‘డంబో’ (డౌన్ అండర్ ది మన్హటన్ బ్రిడ్జి ఓవర్‌పాస్) పరిణామక్రమాన్ని తెరకెక్కిస్తున్నాడు. కోల్డ్‌వార్ సమయంలో మన్హటన్ బ్రిడ్జికి సమీపంలోని ఈ ప్రాంతం నాటి స్థితిగతులను బిగ్స్క్రీన్పై చూపించబోతున్నాడు. టామ్ హ్యాంక్స్, ఆమి రియాన్, ఈవ్ హ్యూసన్డజ్ నటించే ఈ సినిమాకు ‘సెయింట్ జేమ్స్ ప్లేస్’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.