sukesh chandrasekhar
-
‘వాళ్లు తీహార్ జైల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న తీహార్ జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో ఆప్ నేత సత్యేంద్ర జైన్ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని లేఖలో సుఖేష్ ఆరోపించాడు. అంతేకాదు.. తనను జైలులో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. జైల్లో ఆప్ నేతలంతా సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అధికారులు కూడా కొందరు వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. అధికార దుర్వినియోగం చేసిన వచ్చిన వాళ్లకు తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు అత్యంత సన్నిహితుడిని ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారన్నారు. అలాగే జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారన్నారు. ఎశరు బెదిరించినా తాను వెనక్కు తగ్గనంటూ సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశాడు. -
వెల్కమ్ టు తీహార్ జైలు అక్కా
-
కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ.. తీహార్ జైలు ప్రస్తావన..
సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్.. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైలు క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, సుఖేష్ మంగళవారం ఉదయం కవితకు లేఖ రాశారు. ఈ లేఖలో..‘తీహార్ జైలు కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్లో సభ్యులు కాబోతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్‌పై దర్యాప్తు జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. మీ అందరికీ తీహార్ జైలులో స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తుంటాను’ అని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్’ ఫైర్ మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఏడు రోజుల కస్టడీలో భాగంగా నేడు మూడో రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు.. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో, సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. 👉: సుఖేష్ లేఖ ఇదే.. -
నువ్వు మరింత అందంగా తయారవుతున్నావ్.. హీరోయిన్‌కు ప్రేమలేఖ!
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పరిచయం అక్కర్లేని పేరు. 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించింది. ఇవాళ ఆమె 38వ ఏడాదిలో అడుగు పెడుతున్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించింది. అయితే తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపాడు. (ఇది చదవండి: చిరంజీవిపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్!) రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో సుకేశ్ చంద్రశేఖర్ తన ఫ్రెండ్‌కు విషెస్ చెప్పాడు. నటి పుట్టినరోజు సందర్భంగా సుకేశ్ ఆమెకు ఓ ప్రేమ లేఖ రాశారు. ఈ ప్రేమలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను చాలా మిస్సవుతున్నా సుకేశ్ లేఖలో రాస్తూ..'నా బేబీ జాక్వెలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వదాలు నీకు ఎప్పుడు ఉంటాయి. నా జీవితంలో ప్రతి ఏడాది నీ పుట్టినరోజు అత్యంత ఇష్టమైన రోజు. నా బర్త్ డే కంటే కూడా ఎక్కువ. బేబీ నువ్వు రోజు రోజుకి మరింత అందంగా..యవ్వనంగా తయారవుతున్నావ్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. వచ్చే ఏడాది నీ పుట్టినరోజును కలిసి జరుపుకుంటానని ఆశిస్తున్నా. ఈ గ్రహంలోని ఏ శక్తి నిన్ను ప్రేమించకుండా ఆపలేదు.' అంటూ తీవ్రమైన భావోద్వేగంతో రాసుకొచ్చాడు. గతంలో చంద్రశేఖర్ ఆమెను కౌగిలించుకోవడం, కేక్ తినిపించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు. అయితే గతంలో సుఖేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్‌తో ఆ సినిమాలో ) -
మంత్రి కేటీఆర్‌కు సుకేశ్ లీగల్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి కేటీఆర్‌కు మండోలి జైలులో మనీలాండరింగ్ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసు పంపారు. రోగ్, నోటెడ్ క్రిమినల్, ఫ్రాడ్ అంటూ చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయంటూ అనంతరం లీగల్ అడ్వొకేట్, సొలిసిటర్స్ ద్వారా నోటీసుఇచ్చారు. రాజకీయ, సినిమా వ్యాపార రంగాల్లో తనకు మంచి పేరుందని, అయితే కేటీఆర్ వ్యాఖ్యలతో తన సర్కిల్లో కీర్తిప్రతిష్టలు దెబ్బతిన్నాయని సుకేశ్ ఆరోపించారు. వారంలోగా తనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
కేటీఆర్, కవితకు షాకిచ్చిన సుఖేశ్..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై తాను చేసిన ఆరోపణలన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని, తగ్గేదేలే.. అని సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసుకు స్పందిస్తూ.. తనని ఫ్రాడ్ అని సంబోధించినందుకు తాను కూడా పరువునష్టం దావా వేస్తానని, కోర్టులో కలుద్దామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవాలు అనిపించినప్పుడు మంత్రి కేటీఆర్ ధైర్యంగా సీబీఐ విచారణను స్వాగతించాలని సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీబీఐ విచారణ చేస్తే తాను చెప్పిన చాట్లు, రికార్డింగ్‌లు నిజమా? నకిలీవా అనే విషయం తేలుతుందని తెలిపారు. సుఖేశ్ ఆరోప ణలపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం విధితమే. దీనికి మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో ఉన్న సుఖేశ్ స్పందిస్తూ ఓ లేఖ రాశారు. దీనిని గురువారం తన న్యాయవాది ద్వారా విడుదల చేశారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసును స్వాగతిస్తున్నట్లుతెలిపారు. తన ఫిర్యాదులు ఉపసంహరించుకొనేది లేదని తేల్చి చెప్పా రు. నిజం ఎప్పటికైనా బహిర్గతం అవుతుందన్నారు. సీబీఐకి తాను చేసిన ఫిర్యాదులు అన్నీ అసత్యాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారని, మరి సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిగితే నిజం బయట పడుతుందన్నారు. తానేవరో కేటీఆర్‌కు తెలియనప్పుడు సీబీఐ విచారణ స్వాగతించే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. తనని ఫ్రాడ్ అంటున్నారని.. కేటీఆర్, కవిత వారి పనుల కోసం ఉపయోగించుకున్నప్పుడు ఈ విషయం తెలియదా అని నిలదీశారు. కేటీఆర్ తనని ఆ విధంగా సంబోధించడం బాధాకరమని పేర్కొన్నారు. తన కేసుల గురించి వ్యాఖ్యానించే ముందు కేటీఆర్ పార్టీలోని సహచరులు డజన్ల కొద్దీ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తనను క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరారని, తానెందుకు క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో సుఖేశ్ ప్రశ్నించారు. కేటీఆర్ అహంకారాన్ని తన వద్దే ఉంచుకోవాలని, తనపై పనిచేయదని అన్నారు. ఏ విషయాన్నీ వ్యక్తిగతంగా తీసుకోవద్దని, కేటీఆర్ అంటే తనకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని సుఖేశ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు కేసీఆర్? -
కవిత, కేటీఆర్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్‌కు మరో లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌కు సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేష్ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఆధారాలు ఇవ్వాలని అడుగుతున్నారని అన్నారు. ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని తెలిపారు. తన వద్ద రూ. 2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు. ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65- బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చానని, కవిత నుంచి రూ. 15 కోట్లు తీసుకొని కేజ్రీవాల్ తరపు వారికి ఇచ్చానని పేర్కొన్నారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: మంత్రి హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించిన కేటీఆర్ మరోవైపు సుఖేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. నేరస్థుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయన్నారు. సుఖేష్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని, వాడెవడో కూడా నాకు తెలియదని అన్నారు. సుఖేష్ అనే ఒక రోగ్(పోకిరి) చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. సుకేష్ లాంటి మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. Just learnt from media that a delusional fraudster and a noted criminal called Sukesh has made some ludicrous allegations about me I have never heard of this rogue and intend to pursue strong legal action against him for his nonsensical utterances Request media also to be… — KTR (@KTRBRS) July 14, 2023 -
కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో 3 అపార్ట్మెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మండావలి జైలులో గడుపుతున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కాంట్రాక్టర్ నుంచి 2020లో అందిన ముడుపులతో వీటిని కొనుగోలు చేశారని ఆరోపించాడు. ఈ మేరకు మండావలి జైలు నుంచి మీడియాకు సుఖేష్ తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా తాజాగా మరో లేఖను విడుదల చేశారు. దుబాయ్‌లోని జుమైరా పామ్స్‌లోని మూడు అపార్ట్మెంట్లను అత్యవసరంగా 65 మిలియన్ దిర్హామ్స్ (ఏఈడీ)కు అమ్మాలని వారం క్రితం దుబాయ్‌లోని తన సహచరుడు మనోజ్ జైన్‌ను కేజ్రీవాల్ కోరారని సుఖేశ్ ఆ లేఖలో ఆరోపించాడు. తనకు, సత్యేందర్ జైన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లో దుబాయ్‌లో మూడు అపార్ట్మెంట్ల కొనుగోలు లావాదేవీల వివరాలున్నాయని, ఆ చాట్‌ను విడుదల చేస్తానని సుఖేశ్ పేర్కొన్నాడు. వారం రోజుల్లో ఈడీ, అవినీతి నిరోధక విజిలెన్స్‌కి ఆధారాలు పంపిస్తానని కూడా వెల్లడించాడు. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే హతమారుస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. త్వరలో కేజ్రీవాల్ తిహార్ జైలుకు చేరుతారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. -
కవిత నెంబర్లతో సేవ్ చేసిన స్క్రీన్ షాట్స్ ను విడుదల చేసిన సుఖేష్
-
నేను ఛాట్ చేసింది కవితక్కతోనే: సుఖేష్ మరో లేఖ
ఢిల్లీ: తీహార్ జైలు నుంచి ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల చేశాడు. తాను ఛాట్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోనే నంటూ స్పష్టం చేస్తూ తాజా లేఖలో పేర్కొన్నాడు. సుఖేష్ ఎవరో తనకు తెలియదంటూ కల్వకుంట్ల కవిత ట్విటర్ ద్వారా స్పందించిన నేపథ్యంలో.. ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సుఖేష్ ఐదు పేజీల లేఖలో కవితపై విమర్శలు చేశాడు. నేను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితక్కతోనే. ఆమె నెంబర్లు ఇవే అంటూ లేఖ ద్వారా స్క్రీన్‌షాట్‌ను విడుదల చేశాడు సుఖేష్. ఆ నెంబర్లు 6209999999, 8985699999గా ఉన్నాయి. అలాగే ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్ వ్యక్తిగత ఫోన్ నెంబర్ 919810154102గా లెటర్లో పేర్కొన్నాడు సుఖేష్. అంతేకాదు.. కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘తీహార్ క్లబ్’కు వస్తున్నారంటూ వెల్కమ్ చెబుతూ రాశాడు. ‘‘కేజ్రీవాల్ తర్వాత నీ వంతే అంటూ కవితను ఉద్దేశించాడు సుఖేష్. కవితను తాను కవితక్క అని పిలుస్తానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని సుఖేష్ తెలిపాడు. ట్విటర్ ద్వారా సమాధానలు ఇవ్వొద్దని, అవన్నీ పాత ట్రిక్కులనీ, పని చేయవంటూ లేఖలో కవితను ఉద్దేశించి పేర్కొన్నాడు సుఖేష్. నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దేశ ప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడాలి. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలంటూ కవితకు లేఖ ద్వారా సవాల్ విసిరాడు సుఖేష్ చంద్రశేఖర్. అతి త్వరలో కేజ్రీవాల్‌తో చేసిన ఛాటింగ్‌ను సైతం రిలీజ్ చేస్తా అంటూ లేఖ ద్వారా పేర్కొన్నాడు. కోర్టు ధ్రువీకరణతో ఎవిడెన్స్ చట్టం 65 బి కింద తాను స్క్రీన్ షాట్లను విడుదల చేశానని వెల్లడించిన సుఖేష్.. కవితక్క కు రూ. 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైం లో కేజ్రీవాల్, సత్యెంద్ర జైన్ తోనూ మాట్లాడిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తానంటూ తెలిపాడు. తనను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్థరహితమన్న సుఖేష్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా నంటూ లేఖలో పేర్కొనడం గమనార్హం. -
సుఖేష్ చంద్రశేఖర్ చాట్స్ పై స్పందించిన కవిత
-
సుఖేష్ ఎవరో నాకు తెలియదు: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ ఛాటింగ్ ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్ఎస్పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని, కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై దాడికి దిగారని కవిత ట్విటర్ ద్వారా కౌంటర్‌ఎటాక్‌కి దిగారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బిఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్ లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని,కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు. ఇది అత్యంత దురదృష్టకరం. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బి ఆర్ యస్ పార్టీ పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని తెలంగాణ సమాజం గ్రహించాలి..జాగ్రత్త పడాలి. తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలు ఎంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ గారి మీద కక్ష్యతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుంది. నా మీద బురద జల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..! జై తెలంగాణ... జై భారత్ కల్వకుంట్ల కవిత తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..! జై తెలంగాణ... జై భారత్ pic.twitter.com/f8ha3TF7Sa — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 13, 2023 -
కవితతో జరిపిన వాట్సాప్ చాట్ విడుదల
-
అక్కా.. ఇచ్చేశా..
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మరో సంచలన లేఖ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు అందజేశానంటూ గతంలో లేఖ రాయగా.. తాజాగా నేరుగా పేర్లను ప్రస్తావిస్తూ మరో లేఖను, వాట్సాప్ చాటింగ్‌ల స్క్రీన్ షాట్లను విడుదల చేశారు. ఆ సొమ్ము అందజేసే క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పలుసార్లు కోడ్ పేర్లతో వాట్సాప్ చాటింగ్ చేశానని లేఖలో పేర్కొన్నారు. అంతేగాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ నేతలకు, ఎమ్మెల్సీ కవితకు మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి తాను బయటపెట్టే అంశాల ఆధారంగా.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు. తన దగ్గరున్న 703 వాట్సాప్ స్క్రీన్ షాట్లలో.. రెండింటిని విడుదల చేస్తున్నానని.. వీటిపై దర్యాప్తు చేయాలని సుప్రీం సీజే, కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీబీఐ, ఈడీ డైరెక్టర్లను కోరారు. సుకేశ్ లేఖలో పేర్కొన్న అంశాలివీ.. ‘‘ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన, అధికారంలో ఉన్న వ్యక్తులతోపాటు అవినీతిపై పలు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న వ్యక్తులకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ల స్క్రీన్షాట్లను మీ దృష్టికి తీసుకొచ్చాను. నేను విజిల్ బ్లోయర్‌గా ఉండి ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చాను. నా దగ్గరున్న 703 వాట్సాప్ స్క్రీన్షాట్ల నుంచి రెండింటిని అందిస్తున్నా. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నా. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కైలాశ్ గెహ్లోత్‌లతో 2015 నుంచీ పలు లావాదేవీల్లో భాగస్వామిని అయ్యాను. దర్యాప్తు చేయదగిన పత్రాల్లో నేను చెప్తున్న అంశాలు కూడా కీలకమైనవే. అరవింద్ కేజ్రీవాల్, ఆయన సహచరులు.. సౌత్ గ్రూపు, ఇండోస్పిరిట్స్ సంస్థ యజమానులు అరుణ్ పిళ్లై, ఎమ్మెల్సీ కవితలతో చురుకుగా సంప్రదింపులు చేసినట్టు స్పష్టమవుతోంది. 2020లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ల సూచన మేరకు హైదరాబాద్‌లోని నా సిబ్బంది ద్వారా బీఆర్ఎస్కు చెందిన కవితకు డెలివరీ చేసిన లావాదేవీ చాటింగ్‌లు ఇవి. సత్యేంద్ర జైన్‌తో నా చాట్ వివరాలు జత చేశాను. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ల సూచన మేరకు ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్‌లో రూ.15 కోట్లు ఇచ్చిన దానికి చెందిన చాటింగ్‌లు ఇవి. ఢిల్లీ మద్యం లైసెన్సుల నిమిత్తం కేజ్రీవాల్‌తో కవిత ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కిక్‌బ్యాక్ అయిన మొత్తం హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో పలు ఆసియా దేశాలకు (ఆప్‌కు అనుకూలంగా ఉన్న) పంపారు. ఢిల్లీ నుంచి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని కేజ్రీవాల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీంతో అన్ని క్యాష్ లావాదేవీలు కరోనా కాలంలో హైదరాబాద్ నుంచి చేపట్టారు’’ అని సుకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. నాపై ఒత్తిడి ఉంది.. వెంటనే దర్యాప్తు చేయాలి.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నుంచి తనపై, తన కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఉందని.. అందువల్ల తాను వెల్లడించిన అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలని సుకేశ్ లేఖలో కోరారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. తనకు, ఆమ్ఆద్మీ పార్టీ, అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్య అనేక రకాల ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నారు. ఢిల్లీ మద్యం విధానంపై దర్యాప్తు కొనసాగుతున్నందున.. అందులో ప్రమేయమున్న ఆప్, కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత మధ్య సంబంధాలను ఈ చాటింగ్ వివరిస్తుందని.. దర్యాప్తునకు తోడ్పడుతుందని వివరించారు. ఆప్ సీనియర్ నేతలతో జరిపిన అన్ని లావాదేవీల వాయిస్ రికార్డులు, ఇతర చాటింగ్‌లను అందించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సొంతంగానే చాటింగ్‌ల వివరాలు అందిస్తునన్నాని.. దీనిపై జోక్యం చేసుకోవాలని సీజేఐ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి, సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. కవితతో సుకేశ్ చాటింగ్‌గా పేర్కొన్న సంభాషణ ఇదీ సుకేశ్: అక్కా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా.. కొన్ని వివరాలు కావాలి. – హాయ్.. ఇపుడే మెసేజ్ చూశాను సుకేశ్: ఇబ్బందేమీ లేదు అక్కా.. ఏకే ప్యాకేజీని మీకు ఇవ్వాల్సి ఉంది. నా దగ్గర సిద్ధంగా ఉంది. – ఎస్.. ఓకే సుకేశ్: దీన్ని జేహెచ్ ఇంటికి పంపించనా? – వద్దు వద్దు. అరుణ్‌కు నేను ఫోన్ చేసి నీతో మాట్లాడుమని చెప్తా. దీన్ని ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది. సుకేశ్: ఓకే అక్కా.. మీరు చెప్పినట్లే చేస్తా.. – అతను కొద్దిసేపట్లో ఫోన్ చేస్తాడు. సుకేశ్: సరే అక్కా.. ఎస్జే బ్రదర్ ఈ రోజే మీకు అందజేయాలని చెప్పారు. – ఎస్ సుకేశ్: నేను కో–ఆర్డినేట్ చేసుకుంటా అక్కా. – మీ వైపు నుంచి అంతా ఓకే కదా.. మీ డాడీకి ఆరోగ్యం ఎలా ఉంది? సుకేశ్: డాడీ గురించి అడిగినందుకు కృతజ్ఞతలు అక్కా.. ప్రస్తుతం కెమో థెరపీ చేస్తున్నారు. – ఆయన త్వరగా కోలుకుని రావాలని కోరుకుంటున్నా.. సుకేశ్: ఎస్ అక్కా.. దేవుడు కూడా అదే చేస్తాడని అనుకుంటున్నా.. – టేక్ కేర్.. నేను మళ్లీ మాట్లాడుతా.. సుకేశ్: ఒకే అక్కా మీ ఇష్టం ఎప్పుడైనా చేయండి. కేసీఆర్ గారిని అడిగినట్టు చెప్పండి – నమస్తే (ఎమోజీ) సుకేశ్: అక్కా డెలివరీ చేసేశాను – ఓకే సుకేశ్: అక్కా.. ఏకే గారికి లేదా ఎస్జేకు ఇన్ఫార్మ్ చేయండి – మనీష్‌తో మాట్లాడాను సుకేశ్: ఓకే అక్కా.. థ్యాంక్స్ సత్యేంద్ర జైన్‌తో సుకేశ్ చాటింగ్‌గా పేర్కొన్న సంభాషణ ఇదీ – బోలో సుకేశ్: బ్రదర్ ఇంకో నంబర్ సరిగ్గా పనిచేయడం లేదు – బ్యాటరీ లో సుకేశ్: ఓకే బ్రో.. బ్రో నెయ్యి టిన్ రెడీ – ఫుల్ కదా సుకేశ్: ఎస్ బ్రో.. 15 కేజీలు – దాన్ని హైదరాబాద్ సిస్టర్‌కు పంపించు సుకేశ్: బ్రో ఢిల్లీలో కాదా? – కాదు కాదు హైదరాబాద్‌లో.. సుకేశ్: ఓకే బ్రో.. పంపిస్తా.. – టైమ్? సుకేశ్: రెండు గంటలు టైమ్ ఇవ్వండి – సాయంత్రం ఐదు గంటలకల్లా ఇవ్వాలి సుకేశ్: ఓకే బ్రో.. మరి బిగ్ బ్రోకు కూడా ఇన్ఫార్మ్ చేయండి.. లేదా నన్నే చేయమంటారా? – ఏకే భాయ్‌కు తెలుసు.. ఆయన ఫేస్ టైమ్‌లో 3 గంటలకు మాట్లాడతారు సుకేశ్: ఓకే మై బ్రో.. సుకేశ్ చాటింగ్‌లలో పేర్కొన్న కోడ్ల పేర్లు చాట్–1లో.. ఏకే బ్రో: అరవింద్ కేజ్రీవాల్ ఎస్జే బ్రో: సత్యేంద్ర జైన్ మనీశ్: మనీశ్ సిసోడియా అరుణ్: అరుణ్ పిళ్లై జేహెచ్: జూబ్లీహిల్స్‌లోని కవిత నివాసం ఆఫీస్: బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ప్యాకేజీ: రూ.15 కోట్ల నగదు చాట్–2లో.. బ్రో: సత్యేంద్ర జైన్ 15 కేజీల నెయ్యి: రూ.15 కోట్ల క్యాష్ 25 కేజీల నెయ్యి: రూ.25 కోట్ల క్యాష్ హెచ్‌వైడీ: హైదరాబాద్ సిస్టర్: కవిత ఏకే భాయ్: అరవింద్ కేజ్రీవాల్ -
BRS నేతలతో వాట్సప్ చాట్..! బాంబ్ పేల్చిన సుఖేష్ చంద్రశేఖర్
-
అరుణ్పిళ్లైకి 15 కోట్లు ఇచ్చా
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల ఆదేశం మేరకు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రూ.15 కోట్లు ఇచ్చానని అందులో పేర్కొన్నారు. తాను డబ్బులు ఇచ్చింది ఏపీ అలియాస్ అరుణ్పిళ్లైకి అని స్పష్టం చేశారు. సొమ్ము అందినట్లుగా బీఆర్ఎస్ నేత చేసిన మెసేజ్‌లకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను ఉద్దేశించి లేఖ రాసిన సుఖేశ్ దానిని మీడియాకు విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇది ఆరంభమే..అసలైంది ముందుంది ‘రూ.15 కోట్లు మీ (కేజ్రీవాల్) ఆదేశాల మేరకే అందించానన్న వివరాలు చాట్ రూపంలో స్పష్టంగా ఉన్నాయి. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచించిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నేత కూడా సొమ్ములు అందుకున్నట్లు ధ్రువీకరించారు. లిక్కర్ స్కాం కేసులో సౌత్‌గ్రూప్‌కు సంబంధించిన టీఆర్ఎస్ నేతతో మీ అనుబంధాన్ని చాట్ స్పష్టంగా వివరిస్తోంది. రూ.15 కోట్లు అలియాస్ 15 కేజీల నెయ్యి ఎవరికి అందించాలో టీఆర్ఎస్ నేత నిర్దేశించిన విధానం కూడా ఇది వివరిస్తుంది. ఆ సూచనల మేరకే ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న బ్లాక్ రేంజ్‌రోవర్ 6060 నంబరు కలిగిన కారులో నగదు పెట్టెలను అరుణ్పిళ్లైకు అందజేశా. ఆప్, టీఆర్ఎస్, టీఆర్ఎస్ నేత ఏ విధంగా చేతులు కలిపారో, వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు ఎలా చేస్తున్నారో కూడా చాట్ స్పష్టం చేస్తుంది. నేను విడుదల చేస్తున్న ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ప్రారంభం మాత్రమే. అసలైంది ముందుంది. టీజర్ కోసం సహచరులతో కలిసి వేచి ఉండండి. మీ అందరితో కలిసి నార్కో పరీక్షలకు సిద్ధం నాపై ఏ కేసు రుజువు కానందున ఎలాంటి వ్యాఖ్యలు చేయకండి. మీ అవినీతి బృందం.. సమస్యను దారి మళ్లించడానికి నా విశ్వసనీయత గురించి మాట్లాడుతోంది. నేను మీ అందరితో కలిసి నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నా. 2015–2023 వరకు ప్రతి ప్రకటనకు నా దగ్గర ఆధారం ఉంది. కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అన్నింటికీ సిద్ధంగా ఉండండి. టీజర్ స్క్రీన్ షాట్–1 విడుదలైన తర్వాత మీరు, మీ స్నేహితుల ఏడుపులు, నిందలు చూడడానికి చాలా ఉత్సుకతతో ఉన్నా. కేజ్రీవాల్ జీ మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ నినాదం నా దగ్గర ఉంది. అద్భుతమైన సంగీత బృందంతో సంగీతం కంపోజ్ చేయిస్తున్నా..’ అని సుఖేశ్ పేర్కొన్నారు. -
‘బీఆర్ఎస్కు 75 కోట్లు’.. ప్రీప్లాన్డ్ యవ్వారమేనా? ఇందులో నిజమెంత?
భారత రాష్ట్ర సమితి కార్యాయలంలో డబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానంటూ తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణ కలకలం సృష్టించింది. ఇది ప్రీప్లాన్డ్ గా చేసిన ఆరోపణా? లేక నిజంగా జరిగిందా? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీనికి సంబంధించిన వార్తను చదువుతుంటే అదేదో డిటెక్టివ్ కథ మాదిరిగా ఉంది. కథలో అన్నిసార్లు లింక్‌లు అవసరం లేదు. నిజాలతో సంబంధం ఉండనవసరం లేదు. కల్పితాన్ని ఎంత బాగా రాయగలిగితే అది అంతగా చదువరులకు నచ్చుతుంది. ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఇలాంటి కథలు, కదనాలు పెద్ద ఎత్తునే వస్తున్నాయి. ఏది నిజమో, ఏది కాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొని ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలో అధికారంలోకి రావడమే కాకుండా, తాజాగా పంజాబ్‌లో పవర్‌ను సాధించిన అరవింద్ కేజ్రీవాల్‌పై ఈ ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇది నిజమే అయితే అవినీతిపై పోరాటం చేస్తున్నామని చెప్పేవారిని కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించి మాత్రమే నమ్మాలన్న అభిప్రాయం కలుగుతుంది. సుఖేష్ అన్న వ్యక్తి 200 కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేసిన కేసులో అరెస్టు అయ్యారు. ఆయన గతంలో కేజ్రీవాల్‌తో సంబంధాలు నెరపారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ డిల్లీ ప్రభుత్వ పెద్దలను, అలాగే తెలంగాణలోని ప్రముఖులను ఇరకాటంలో పెడుతున్న తరుణంలో కొత్తగా ఈ బాంబు పడడం సంచలనమే అవుతుంది. అయితే ఇది రాజకీయ బాంబు అవుతుందా? లేక నిజంగా ఏదైనా ఆధారాలతో రుజువు అవుతుందా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఇదంతా ఢిల్లీ రాజకీయ వివాదంగా కనిపిస్తున్న తరుణంలో , అందులో తెలంగాణ రాజకీయం కూడా ఉండడం చిత్రమైన పరిణామం. డిల్లీ లిక్కర్ కేసులో అక్కడి మంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురు అరెస్టు అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవిత పలుమార్లు విచారణకు హాజరు కావల్సి వచ్చింది. ఆ కేసు లో తనను వేధిస్తున్నారని ఆమె సుప్రింకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులు కొందరు పారిశ్రామికవేత్తలు కూడా చిక్కుకున్నారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీని మార్చి ప్రైవేటు వ్యాపారులకు లైసెన్స్‌లు ఇచ్చిన వ్యవహారం స్కామ్‌గా మారిందన్నది అభియోగం. ఇందులో ప్రత్యక్షంగా వంద కోట్లు చేతులు మారాయని అభియోగం. అది అలా ఉండగానే ఇప్పుడు ఈ డెబ్బైఐదు కోట్ల స్కామ్ ఆరోపణ తెరపైకి వచ్చింది. జైలులో ఉన్న ఒక నిందితుడు రాసిన లేఖలో ఈ విషయాలు ప్రస్తావించారు. కేజ్రీవాల్‌తో అతను జరిపిన చాట్ 700 పేజీలు ఉందని చెబుతున్నారు. వాటిలో ఏముందో వచ్చే వారాలలో తెలుస్తుంది. కాని ఈ వార్తను చదువుతుంటే కొన్ని సంశయాలు వస్తాయి. అసలు సుఖేష్‌కు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. హైదరాబాద్‌లోనే సేకరించారా?. లేక ఎక్కడినుంచైనా వచ్చిందా? సుఖేష్ దీనిని తీసుకు వెళ్లి ‘ఏపీ’ అన్న వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? ‘ఏపీ’ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒక నిందితుడుగా ఉన్న అరుణ్ పిళ్లై కావచ్చా అంటూ కొన్ని మీడియాలు కథనాలు ఇచ్చాయి. టీఆర్ఎస్ (ప్రస్తుతం బిఆర్ఎస్ ఆఫీస్) ఆఫీస్‌లో ఎందుకు డబ్బు అందచేశారు. అసలు టీఆర్ఎస్కు ఈ డబ్బుతో అవసరం ఏముంది? ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సే 400 కోట్లపైబడి ఉన్నట్లు అధికారికంగానే ప్రకటించారు. అలాంటప్పుడు నగదు 2020లో తీసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది. పంజాబ్ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఆప్‌కు సాయం చేసిందన్న ఆరోపణలు అప్పట్లో కొందరు చేశారు. ఆ లావాదేవీకి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి ఎన్నో జవాబు లేని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మామూలుగా అయితే ఈ వార్తకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత రావాలి. కాని అంత విశేష ప్రాధాన్యత లభించినట్లు కనిపించదు. బహుశా ఇలాంటి సందేహాలు ఉండబట్టే మీడియా కూడా కాస్త జాగ్రత్తగా కవర్ చేసిందా? ఈనాడు వంటి మీడియా అయితే ఈ వార్త జోలికివెళ్లకపోవడం విశేషం. తెనాలిలో ఒక కౌన్సిలర్‌కు సంబంధించిన వార్తను సైతం తెలంగాణ ఎడిషన్‌లో ప్రచురించిన ఈనాడు ఇంత పెద్ద వార్త ఇవ్వలేదంటే ఇందులో మర్మమేమిటి? ఏపీలో ఉన్నవి, లేనివి నిత్యం అసత్యాలు వండి వార్చుతున్న ఈనాడు తెలంగాణలో మాత్రం అధికార పార్టీకి భయపడుతోందా? ఈ సంగతి ఎలా ఉన్నా ఈ కొత్త ఆరోపణను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. బిఆర్ఎస్ ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామా అని విమర్శించింది. కేజ్రీవాల్ కూడా ఇలాంటి ఖండనే ఇచ్చారు. సుఖేష్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారా? అన్న డౌటు రావడం సహజమే. ఇప్పటికైతే ఈ ఆరోపణ చూస్తే గాలిలో కత్తి తిప్పినట్లుగా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలు చూపనంతవరకు దీనికి అంత ప్రాధాన్యత రాదు. ఈ ఏడాది ఆఖరుకు తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కథనాలు ప్రచారంలోకి వస్తే మాత్రం అది శోచనీయమే అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటివి విఘాతం కలిగిస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది పెద్దగా ఉపయోగపడకపోగా, రాజకీయంగా నష్టం కూడా కలుగుతుంది. ఆధార సహితంగా ఈ అబియోగాలు వస్తే మాత్రం అక్కడ ఆమ్ ఆద్మిపార్టీకి, ఇక్కడ భారత రాష్ట్ర సమితికి ఇరకాట పరిస్థితే ఏర్పడుతుంది. మరో సంగతి ఏమిటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీక్ కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు మంత్రి కేటీఆర్ వంద కోట్లకు పరువు నష్టం నోటీసు ఇవ్వడం సరైనదే అవుతుంది. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ ఆధారాలు లేకుండా ఎదుటివారిపై ఏది పడితే అది ఆరోపణ చేయడం వర్తమాన రాజకీయాలలో రివాజుగా మారింది. ఒక వేళ అధారాలు ఉంటే చూపవలసిన బాధ్యత సంజయ్, రేవంత్‌లపై ఉంటుంది. ఆధారాలు చూపితే కెటిఆర్ తన పదవిని వదలుకోవలసిన పరిస్థితి వస్తుంది. కేటీఆర్ సవాల్‌ను వీరు ఎంతవరకు అంగీకరిస్తారన్నది డౌటే. ఏది ఏమైనా ఇటీవలి పరిణామాలు బిఆర్ఎస్ను కాస్త చికాకుపెడుతున్నాయి. వచ్చే తొమ్మిది నెలల కాలంలో బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు సహజంగానే యత్నిస్తాయని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా.: సుఖేశ్ చంద్రశేఖర్
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖే‹Ôæ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. 2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి) కార్యాలయంలో ‘ఏపీ’ అనే వ్యక్తికి రూ.75 కోట్లు అందజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తనను ఆదేశించారని వెల్లడించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయిన ‘ఏపీ’ అనే వ్యక్తికి టీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు అందజేశానని తెలియజేశాడు. ఒక్కో పెట్టెలో 15 కిలోల నెయ్యి (కోడ్ భాషలో రూ.15 కోట్లు) ఉందని, మొత్తం 5 పెట్టెలు (రూ.75 కోట్లు) హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ తనతో చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు వాటిని టీఆర్ఎస్ కార్యాలయంలో సంబంధిత వ్యక్తికి చేరవేశానని స్పష్టం చేశాడు. సదరు వ్యక్తి టీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలో రేంజ్ రోవర్ కారులో కూర్చొని ఉండగా డబ్బులు అందజేశానని తెలిపాడు. ఈ మేరకు సుకేశ్ శుక్రవారం తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఒక లేఖ విడుదల చేశాడు. 2020లో తనకు, కేజ్రీవాల్‌కు మధ్య నడిచిన చాటింగ్ గురించి సుఖేశ్ చంద్రశేఖర్ ఇందులో ప్రస్తావించాడు. కేజ్రీవాల్ కరడుగట్టిన అవినీతిపరుడని, ఆయన బాగోతం మొత్తం బయటపెడతానని లేఖలో పేర్కొన్నాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. తాను, కేజ్రీవాల్ పరస్పరం పంపించుకున్న సందేశాలను బహిర్గతం చేస్తానని వెల్లడించాడు. 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగ్ తన వద్ద ఉందన్నాడు. తాను బయటపెట్టే నిజాలతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జోక్‌గా మారిపోతున్నాయని ఎద్దేవా చేశాడు. తీహార్ క్లబ్‌లోకి కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీశ్ సిసోడియా తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం తథ్యమని సుఖేశ్ చంద్రశేఖర్ ఇటీవలే వెల్లడించాడు. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం అతడిని ఇటీవల కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరవింద్ కేజ్రివాల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అన్నాడు. ఆయన త్వరలో ‘తీహార్ క్లబ్’లో చేరబోతున్నారని చెప్పాడు. వచ్చేవారం ముఖ్యమైన అంశాలను బయటపెట్టబోతున్నానని తెలిపాడు. సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, పార్టీకి రూ.60 కోట్లు రూ.200 కోట్లు బలవంతంగా వసూలు చేసిన కేసులో సుఖేష్ చంద్రశేఖర్ గత ఏడాది అరెస్టయ్యాడు. అప్పటినుంచి కేజ్రివాల్‌కు, ఆమ్ ఆద్మీ పారీ్టకి వ్యతిరేకంగా వరుసగా లేఖలు విడుదల చేస్తున్నాడు. కేసుల నుంచి బయటపడడానికి కేజ్రివాల్ సహచరుడు సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.60 కోట్లు అందజేశానని లేఖల్లో వెల్లడించాడు. అయితే, సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలను కేజ్రివాల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే సుఖేష్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. అతడిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యం లేదని తెలిపారు. ఎవరీ సుఖేష్ చంద్రశేఖర్? సుఖేష్ చంద్రశేఖర్ అలియాస్ బాలాజీ 1989లో కర్ణాటక రాజధాని బెంగళూరులో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జని్మంచాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. ఖరీదైన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లపై మోజు పెంచుకున్నాడు. డబ్బు కోసం అడ్డదారులు ఎంచుకున్నాడు. మోసాలే వృత్తిగా మార్చుకున్నాడు. 17 ఏళ్ల వయసులో తమ కుటుంబ మిత్రుడిని రూ.1.5 కోట్ల మేర మోసగించాడు. ఆ కేసులో అరెస్టయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలామందిని దగా చేశాడు. కోట్ల రూపాయలు దండుకున్నాడు. సినీ నటి లీనా మారియా పాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2011లో వారిద్దరూ విడిపోయారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. ఓ కేసులో బెయిల్ ఇప్పిస్తానంటూ ఫోరి్టస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య ఆదితీ సింగ్ నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు. ఇదే కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. తన మోసాలకు బాలీవుడ్ నటీమణులను పావులుగా వాడుకోవడం సుఖేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. ప్రముఖ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీకి ఖరీదైన బహుమతులు, కార్లు ఇచి్చన లోబర్చుకున్నట్లు సుఖే‹Ùపై ఆరోపణలున్నాయి. చదవండి: టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీ వ్యవహారంలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు -
నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్
ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి ఛాహత్ ఖన్నాకు రూ.100కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపాడు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కావాలని అతని తరఫు న్యాయవాది హెచ్చరించాడు. ఛాహత్ ఖాన్నా చేసిన ఆరోపణల వల్ల సుఖేష్ పరువు పోయిందని, మానసికంగా వేధనకు గురయ్యాడని న్యాయవాది పేర్కొన్నాడు. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు, సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛాహత్ ఖన్నా. ముఖ్యంగా 'బడే అచ్చే లగ్తే హై' సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుఖేశ్ తనను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించాడని, తిహార్ జైల్లో అతడ్ని కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటాని ప్రపోజ్ చేశాడని ఆరోపించింది. 'ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి ఏంజెల్ ఖాన్(పింకీ ఇరానీ) అనే మహిళ నన్ను తీసుకెళ్లింది. తీహార్ జైలు రోడ్డు మార్గం నుంచి వెళ్లాలని పేర్కొంది. ఆ తర్వాత జైలు వద్ద ఆపి లోపలికి తీసుకెళ్లింది. అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ నన్ను కలిశాడు. బ్రాండెడ్ షర్టు వేసుకొని బాగా సెంటు రాసుకొని మెడలో గోల్డ్ చైన్ ధరించి ఉన్నాడు. తాను ఓ సౌత్ ఇండియా టీవీ ఛానల్ ఓనర్నని, జే జయలలిత మేనల్లుడినని పరిచయం చేసుకున్నాడు. ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో ఆరెస్టయ్యానన్నాడు. అసలు నన్ను ఇక్కడకు ఎందుకు పిలిపించారు? ఆరు నెలల బిడ్డను వదిలేసి వచ్చా అని నేను చెప్పా. అప్పుడు అతను నేనంటే ఇష్టం ఇన్నాడు. బడే అచ్చే లగ్తే హై సీరియల్లో నా నటన చూసి ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. దీంతో నేను అతనిపై అరిచా. నాకు పెళ్లైంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పా. నా భర్త నాకు సరైనోడు కాదని, తాను ఎంతగానో ప్రేమిస్తున్నాని సుఖేష్ చెప్పాడు. నేను కోపంతో అక్కడి నుంచి వచ్చేశా. ఆ తర్వాత నేను తిహార్ జైలుకు వెళ్లిన వీడియో చూపించి ఒకరు రూ.10లక్షలు ఇవ్వమని బెదిరించారు. దీంతో నేను జైలుకు వెళ్లిన విషయం ఎవరికీ తెలియవద్దని, తన పెళ్లిపై ప్రభావం పడొద్దని ఆ డబ్బు వాళ్లకు ఇచ్చేశా. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నా భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. నేను ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. కానీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటి నుంచి నేను బయటపడాలనుకున్నా.' అని ఛాహత్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా.. సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నారు. చదవండి: మైనర్‌తో బాడీ మసాజ్ చేయించుకున్న క్రికెట్ కోచ్ -
అతని వల్ల నా కెరీర్ మొత్తం నాశనం: ప్రముఖ నటి
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో సుకేశ్ చంద్రశేఖర్‌పై సంచలన కామెంట్స్ చేసింది. కాగా ఈ కేసులో కీలక నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌పై బాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతని వల్లే తన కెరీర్ పూర్తిగా నాశమైందని వాపోయింది. సుకేశ్ తన భావోద్వేగాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జాక్వెలిన్ మాట్లాడుతూ..'సుకేష్ చంద్రశేఖర్ నా కెరీర్ నాశనం చేశాడు. అతను ఒక మోసగాడు. నేను అతని తప్పులను గుర్తించలేకపోయా. నన్ను నయవంచనకు గురిచేశాడు. తనను తప్పుదారి పట్టించాడు. నా భావోద్వేగాలతో ఆడుకున్నాడు.' అంటూ తన వాంగ్మూలంలో వివరించింది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. కాగా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
ఆప్ నేతకు రూ. 60 కోట్లు ఇచ్చా: సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న కాన్మన్ సుకేశ్ చంద్రశేఖర్.. గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశాడు. తాజాగా మరోసారి ఆప్ పార్టీపై, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. పార్టీ నేత సత్యేంద్ర జైన్‌కు రూ. 60 కోట్లు ఇచ్చిన్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను సైతం కలిసినట్లు తెలిపాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌ను మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేశ్ వాంగ్మూలాన్ని స్వీకరించిందని, దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని అతని తరపు న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు. తనను రాజ్యసభకు నామినేట్ చేస్తానని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత జైన్‌కు 2016లో అసోలాలోని తన ఫామ్‌హౌజ్‌లో రూ.50 కోట్లకు పైగా ఇచ్చానని సుకేశ్ తెలిపాడు. తర్వాత హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కేజ్రీవాల్ జైన్‌తో కలిసి పాల్గొన్నారని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. అంతేగాక 2019లో జైలులో తన భద్రత కోసం జైన్ రూ. 10 కోట్లు వసూలు చేశాడని చంద్రశేఖర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాసిన లేఖలో ఆరోపించారు.పార్టీ కోసం 20 మంది వ్యక్తులను వెతికి వారి నుంచి పార్టీ కోసం 500 కోట్ల ఫండ్ సమకూర్చాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. సత్యేంద్ర జైన్ తనను బెదిరించారని తెలిపాడు. అప్పటి జైళ్ల శాఖ డీసీ సందీప్ గోయెల్‌కు రూ.12.50 కోట్లు చెల్లించినట్లు కూడా పేర్కొన్నాడు. తాను నేరస్థుడు అని భావిస్తే.. నా నుంచి రూ.50 కోట్లు ఎందుకు స్వీకరించారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. అయితే చంద్రశేఖర్ ఆరోపణలు అబద్దమని ఆప్ కొట్టిపారేసింది. ఇవన్నీ బీజేపీ ఆడుతున్న నాటకాలని విమర్శించింది. చదవండి: యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్ కాగా ఇదే కేసులో బాలీవుడ్ నటులు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విలువైన బంగ్లాతో పాటు విలువైన కానుకలు సుకేశ్ స్వీకరించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఈడీతో పాటు ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. -
‘నేను పెద్ద దొంగనైతే.. కేజ్రీవాల్ మహా దొంగ’
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్. ‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు. అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్ -
సుకేశ్ నుంచి ఆప్ మంత్రికి నెలకి రూ.2కోట్లు.. చిక్కుల్లో కేజ్రీవాల్!
న్యూఢిల్లి: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్.. జైలు నుంచే అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. జైలులో అన్ని సౌకర్యాలు అందించేందుకు సుమారు 80 మందికిపైగా అధికారులకు లక్షల్లో ముడుపులు అందించాడు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. తాను జైలులో సురక్షితంగా ఉండేందుకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టజెప్పానని వెల్లడించటం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేశ్ లేఖ రాసినట్లు తెలిసింది. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు ప్రొటెక్షన్ మనీ ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు సుకేష్ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఖండించిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవన్ని తప్పుడు ఆరోపణలని, గుజరాత్ ఎన్నికలు, మోర్బీ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్రగా ఆరోపించారు. ‘అన్ని కట్టుకథలు. మోర్బీ ఘటనపై దృష్టి మళ్లించే ప్రయత్నాలు. గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వారు భయపడుతున్నారు. ఆప్ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్థిక నేరస్థుడిని ఉపయోగించి సత్యేంద్ర జైన్‌పై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు.’ అని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదీ చదవండి: Rs 200 crore extortion case: బాలీవుడ్ హీరోయిన్, భర్తకు ఈడీ షాక్ -
బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ అక్రమార్జన కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం 6 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో ఈడీ కూడా ఇప్పటికే ఫతేహిని ప్రశ్నించింది. ఆమెతో పాటు మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా సుకేశ్ నుంచి ఖరీదైన కార్లు, ఇతర వస్తువులను బహుమతిగా అందుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో జాక్వెలిన్‌పై ఆగస్ట్‌లో ఈడీ కేసు కూడా నమోదు చేసింది. జాక్వెలిన్‌తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే తెలిపారు. చదవండి: రూ.100 పేటీఎం లావాదేవీ.. రూ.6 కోట్ల దోపిడీ దొంగలను పట్టించింది! -
నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి
ముంబై: తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫొటోలను బహిరంగపరచవద్దని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(36) మీడియాను కోరారు. సుకేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడితో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో ఆదివారం జాక్వెలిన్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. బహ్రెయిన్‌లో ఉన్న జాక్వెలిన్ తల్లి ఇటీవల గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. చంద్రశేఖర్ తదితరులకు సంబంధమున్న మనీ లాండరింగ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట పలుమార్లు జాక్వెలిన్ హాజరైన విషయం తెలిసిందే.