swine flu cases
-
ఢిల్లీలో 25 స్వైన్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్న దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో శనివారం ఒక్క రోజే 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. వీటితో కలుపుకుని ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 153కు చేరాయని పేర్కొంది. స్వైన్ ఫ్లూతో పాటు ఇన్‌ఫ్లూయెంజా (హెచ్3ఎన్2) కేసులు కూడా పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రోగుల్లో న్యుమోనియా ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తోందని చెబుతున్నారు. -
అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభణ
గువహటి: దేశంలోఒకవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండగానే ప్రాణాంతక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) అసోంను వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యాధి విజృంభణను అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం బుధవారం (నిన్న) ఆదేశించారు. అంతేకాదు వాటి యజమానులకు తగిన విధంగా పరిహారం చెల్లించాలని అధికారులను కోరారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరాను నిలిపివేశారు. పశుసంవర్ధక, పశువైద్య శాఖ సీనియర్ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఇప్పటివరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిపుణుల అభిప్రాయం మేరకు బాధిత జిల్లాల్లో వరాహాలను వధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవాలకు ముందే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగు త్వరితగతిన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పశుసంవర్ధక, పశువైద్య విభాగాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఫాంలలో సర్వే నిర్వహించాలని, ఆరోగ్యకరమైన జంతువులకు ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో14 జిల్లాల్లోని 30 బాధిత కేంద్రాల్లో కిలోమీటర్ పరిధిలో వరాహాలను సంహరించేందుకు నిర్ణయించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. అలాగే సంబంధిత పరిహారాన్నిఆయా యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత నిధిని కేంద్రం విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా 2019 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో వీటి సంఖ్య 21 లక్షలుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య సుమారు 30 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ వ్యాధి వ్యాపించింది. 2019 ఏప్రిల్‌లో చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో (అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు) ఏఎస్ఎఫ్ ను గుర్తించగా, 1921లో కెన్యా, ఇథియోపియాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉనికి తొలిసారి బైట పడింది. -
మళ్లీ విజృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ..!
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు కరోనా వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. మరో వైపు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా స్వైన్‌ఫ్లూ ప్రభావం చలికాలంలోనే ఉంటుంది.. కానీ సీజన్ కాని సీజన్లో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 15 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవ్వగా.. ఫిబ్రవరి నెలలోనే 8 కేసులు నమోదయ్యాయి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస కోశ సమస్యలతో కరోనా వైరస్ అనుమానంతో ఆసుపత్రులకు వెళ్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తే స్వైన్‌ఫ్లూ బయటపడుతుంది. చలి తీవ్రత తగ్గిన ప్రభావం తగ్గలేదు.. వేసవి ప్రారంభం కాగానే వైరస్ ప్రభావం తగ్గుతుంది. కానీ చలి తీవ్రత తగ్గిన స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గలేదు. గత ఏడాది స్వైన్ ఫ్లూతో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.. సాధారణంగా శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి.. ప్రస్తుత వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల దాని ప్రభావం తగ్గలేదని వైద్యులు చెబుతున్నారు. స్వైన్‌ప్లూ బారి నుంచి తప్పించుకోవడానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. -
ఎండకూ లొంగని స్వైన్‌ఫ్లూ..
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ వైరస్ ఎండ మంటకూ లొంగడం లేదు. సాధారణంగా చలికాలంలో విజృంభించే హెచ్1ఎన్1 వైరస్... విచిత్రంగా ఎండలు దంచుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెల ఇప్పటివరకు ఏకంగా 573 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 12 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఈ నాలుగైదు రోజుల్లోనే 35 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిపింది. రెండ్రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతిచెందారు. చలికాలంలో విస్తృతిని పెంచుకునే వైరస్, ఎండలు మండుతున్నా తట్టుకుని ఉంటోందని వైద్య నిపుణులు అంటున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 14,992 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 1,103 మంది చనిపోయారు. దారుణ విషయం ఏంటంటే.. ఈ ఏడాది రెండున్నర నెలల కాలంలోనే 20 వేల స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 605 మంది చనిపోయారు. గతేడాది నమోదైన కేసుల కంటే, ఈ రెండున్నర నెలల్లో నమోదైన కేసులు అధికంగా ఉండటం గమనార్హం. పైగా ఈ రెండున్నర నెలల్లో నెల మాత్రమే చలికాలం కాగా, మిగతాదంతా ఎండా కాలం. ఎన్నికలపై ప్రభావం... ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ప్రజలు గుంపులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇలా గుంపులుగా ఉన్నప్పుడే స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వైరస్ మరింత సోకి కేసులు సంఖ్య పెరగవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఏమీ కాదన్న ధీమాతో ఉంటే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం కావాల్సి ఉంది. కాగా కేసులు నమోదవుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కనీసం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఫ్లూ నియంత్రణ, రోజువారీ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. -
తూర్పు గోదావరి జల్లాలో స్వైప్లూ కలకలం
-
స్వైన్‌ఫ్లూ కలకలం
నిజామాబాద్‌అర్బన్: స్వైన్‌ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో జనవరిలో మూడు కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కొలుకోగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి ఈ వ్యాధి ప్రతాపం చూపుతుంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా, జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నెలలో ఒకరిద్దరు లక్షణాలతో వెలుగులోకి వస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువ సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. పది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన 46 సంవత్సరాల వ్యక్తికి స్వైన్‌ప్లూ సోకింది. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మాలపల్లికి చెందిన 30 సంవత్సరాల మహిళ , గౌతంనగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారికి స్వైన్‌ప్లూ సోకింది. వైద్యులను సంప్రదించగా లక్షణాలు వెలుగులోకి రావడంతో జిల్లా వైద్యశాఖకు సమాచారం అందించారు. అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంటింటికి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్లో సుభాష్‌నగర్‌కు చెందిన ఒకరికి స్వైన్‌ప్లూ సోకకగా హైదరాబాద్‌లో చికిత్స పొందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది 11 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో మూడు కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. స్వైన్‌ప్లూకు సంబంధించి అధికారులు మందులను అందుబాటులో ఉంచారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కలిగి ఉన్న రోగులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు. నిజామాబాద్‌అర్బన్: స్వైన్‌ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో జనవరిలో మూడు కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కొలుకోగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి ఈ వ్యాధి ప్రతాపం చూపుతుంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా, జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నెలలో ఒకరిద్దరు లక్షణాలతో వెలుగులోకి వస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువ సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. పది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన 46 సంవత్సరాల వ్యక్తికి స్వైన్‌ప్లూ సోకింది. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మాలపల్లికి చెందిన 30 సంవత్సరాల మహిళ , గౌతంనగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారికి స్వైన్‌ప్లూ సోకింది. వైద్యులను సంప్రదించగా లక్షణాలు వెలుగులోకి రావడంతో జిల్లా వైద్యశాఖకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ౖÐð వైద్యాధికారులు ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంటింటికి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్లో సుభాష్‌నగర్‌కు చెందిన ఒకరికి స్వైన్‌ప్లూ సోకకగా హైదరాబాద్‌లో చికిత్స పొందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది 11 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో మూడు కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. స్వైన్‌ప్లూకు సంబంధించి అధికారులు మందులను అందుబాటులో ఉంచారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కలిగి ఉన్న రోగులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు. స్వైన్‌ప్లూ వీరికి ప్రమాదకరం.. గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లపైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి చికిత్సకు తగ్గని అధిక జ్వరం ఊపిరిపీల్చడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఛాతి,కడుపులో నొప్పి, వరుసగా వాంతులు హఠాత్తుగా ఆయోమయస్థితి చిన్నపిల్లల్లో దద్లుర్లతో కూడిన జ్వరం శరీరం నీలిరంగుగా మారడం జాగ్రత్తలు స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్న రోగులు జనసామూహంలోకి వెళ్లకూడదు. తగ్గినప్పుడు, తూమ్మినప్పుడు ముఖానికి చేతిరుమాలు పెట్టుకోవాలి తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులను శుభ్రంగా కడుకోవాలి. స్వైన్‌ప్లూ సోకిన వ్యక్తి వాడిన వస్తువులు, దుస్తులు ఇతరులు వాడకూడదు. స్వైన్‌ప్లూ సోకిన వారికి కరచానలం చేయకుండా దూరంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్రమత్తంగా ఉండాలి స్వైన్‌ప్లూపై ముందస్తు జాగ్రత్తలే మేలు. వ్యాధి లక్షణాలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. సరైన చికిత్స ద్వారా వ్యాధి నయమవుతుంది. కాని వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఈ వ్యాధికి అనుకూలంగా కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ జలగం తిరుపతిరావు, జనరల్ ఫిజీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల -
రాజస్థన్లో సైన్‌ప్లూ విలయతాండవం
-
కర్నూలులో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు
కర్నూలు: జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా గరువారం జిల్లాలో మరో కేసు నమోదు అయింది. కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల మహిళకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు జిల్లాలో 56 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, 15 మంది స్వైన్ ఫ్లూతో మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. -
కర్నూలు జిల్లాను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ
-
పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు, వైద్యులు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. సాధారణ జ్వరం, ఆయాసంతో చేరుతున్న వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. వారం వ్యవధిలో వ్యాధితో జిల్లాలో ముగ్గురు మరణించడం, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధితో కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్, పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన ఒకరు, ప్రొద్దుటూరుకు చెందిన మరొకరు మరణించారు. వేంపెంటకు చెందిన ఒక మహిళతో పాటు కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ, తాజాగా కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడికి చెందిన ఓ యువకునికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఒకవైపు తీవ్రమైన ఎండలు ఉండే సమయంలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఎలా జీవిస్తుందోనని అధికారులు, వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఈ వ్యాధి కారక వైరస్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా విస్తరిస్తుంది. అయితే ప్రస్తు తం ఎండలు వేసవిని తలపిస్తున్నా కేసులు పెరుగుతుండటం అర్థంకావడం లేదు. రోగుల కోసం కర్నూలు వైద్యశాలలో ప్రత్యేకంగా ఐసోలేషన్ విభాగం ఏర్పాటు చేశారు. వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి.. గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు (ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, రక్తపోటు, కిడ్నీ, షుగర్, నరాల వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవీ/ఎయిడ్స్) స్వైన్‌ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. చికిత్సకు తగ్గని అధిక జ్వరం, కష్టంగా ఊపిరిపీల్చుకోవడం, ఛాతిలో, కడుపులో నొప్పి, వరుస వాంతులు కావడం, హఠాత్తుగా మగత, అయోమయ పరిస్థితి, చిన్నపిల్లల్లో దద్దుర్లతో కూడిన జ్వరం, శరీరం రంగు నీలంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ప్రత్యేక వైద్యశిబిరాలు.. కర్నూలు, ఆదోని, నంద్యాల, మంత్రాలయం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో స్వైన్‌ఫ్లూ వ్యాధి పరిశీలనా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక కొత్తబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ఒక వైద్యుడు, స్టాఫ్‌నర్సు, ఇద్దరు వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ నెల 21వ తేదీ వరకు కేంద్రాలు కొనసాగుతాయని, అవసరమైతే పొడిగిస్తామన్నారు. కర్నూలు డివిజన్‌కు అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సరస్వతి, నంద్యాలకు డాక్టర్ రమణ, ఆదోనికి డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శారదలను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. తక్షణ సమాచారం, సహాయం కోసం స్వైన్‌ఫ్లూ సెల్ : 9849902379 నంబర్లో సంప్రదించాలని కోరారు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సరస్వతి, డీఐఓ డాక్టర్ వెంకటరమణ, కల్లూరు, గార్గేయపురం వైద్యాధికారులు పాల్గొన్నారు. వ్యాధి లక్షణాలు.. ఊపిరిపీల్చడం కష్టంగా ఉండటం, దగ్గు, జలుబు, జ్వరం, కీళ్లనొప్పులు, డయేరియా (విరేచనాలు), గొంతునొప్పి, తలనొప్పి, వణుకు, అలసట, వాంతులు మొదలైనవి. ఎలా వ్యాపిస్తుంది? గాలి ద్వారా హెచ్1ఎన్1 అనే స్వైన్‌ఫ్లూ వ్యాధి ఇన్ఫ్లూయింజా ‘ఏ’ వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఫ్లూ వ్యాధివలే ఉండి ఊపిరితిత్తుల అంతర్భాగానికి సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం కలిగిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాపిస్తుంది. నివారణ చర్యలు.. వ్యాధి లక్షణాలు ఉన్న వారు జనసమూహంలోకి వెళ్లకూడదు. సాధ్యమైనంత వరకు ఇంటిపట్టునే ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు/నోరుకు మోచేతి వంపులో దగ్గాలి/తుమ్మాలి. అడ్డంగా వస్త్రం పెట్టుకోవాలి. స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులు వాడిన దుస్తులు, తువ్వాళ్లు, జేబురుమాళ్లు మొదలైనవి ఇతరులు వాడకూడదు. వీరితో కరచాలనాలు, ఆలింగనాలు చేయకపోవడమే మేలు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు వైద్యుల సలహా లేకుండా సొంతంగా మందులు వాడరాదు. తగినంత సమయం నిద్రపోవాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. పౌష్టికాహారం భుజించాలి. -
సాగర తీరంలో స్వైన్ ఫ్లూ సైరన్..!
-
జిల్లాలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు
తిరువళ్లూరు: డెంగీ జ్వరంతో జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో జిల్లా ప్రజలకు స్వైన్‌ఫ్లూ ద్వారా వస్తున్న మరో ప్రమాదం ప్రజల్లో కలవరానికి గురిచేసింది. గత సంవత్సరం తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదు కావడంతో పాటు దాదాపు పది మందికి పైగా మృతి చెందారు. అప్పట్లో డెంగీ రూపంలో వచ్చిన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే స్వైన్‌ఫ్లూ విజృంభించడం ప్రజలను మరింత ఆందోళన గురి చేసింది. ఇటీవలే తిరుత్తణి ప్రాంతానీకి చెందిన వీరరాఘవన్ స్వైన్‌ఫ్లూ భారిన పడి మృతి చెందగా, గుమ్మిడిపూండిలో మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ భారిన పడి మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర అలజడి సృష్టించగా, అప్రమత్తమైన జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. స్వైన్న్ఫ్లూ భారిన పడిన వారికి చిక్సిత అందించడానికి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరువళ్లూరు వైద్యశాలలో చేరిన ఇద్దరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టుగా గుర్తించారు. కాకలూరు ప్రాంతానికి చెందిన కుమరేషన్, తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన రంజిత్‌కు స్వైన్‌ప్లూ ఉన్నట్టు నిర్ధారించి వారికి చిక్సిత అందిస్తున్నారు. -
వ్యాధుల విజృంభణ
* పెరుగుతున్న డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ కేసులు * ఇప్పటివరకు 1,073 డెంగీ కేసులు నమోదు... ఇద్దరు మృతి * బెంబేలెత్తుతున్న జనం... ఆస్పత్రులు కిటకిట సాక్షి, హైదరాబాద్: వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పారిశుద్ధ్యం లోపించింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ కేసులూ నమోదవుతుండటంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదని, పూర్తిస్థాయిలో మందులులేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హెదరాబాద్లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలుడు, అంబర్‌పేటకు చెందిన 22 ఏళ్ల యువతి డెంగీతో చనిపోయారు. సర్కారు లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 1,073 డెంగీ కేసులు, 2,435 మలేరియా కేసులు, 31 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. సాధారణ విషజ్వరాలు దాదాపు 3 లక్షల వరకు ఉంటాయని అంచనా. గత నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రంలో 45 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు నిలువుదోపిడీకి తెగబడ్డాయి. 20 వేల నుంచి 50 వేలలోపున్న ప్లేట్లెట్లు ఉన్నవారికి కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయి. మందులకు నిధుల కొరత రాష్ట్రంలో 750 పీహెచ్‌సీలు, 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 30 ఏరియా ఆస్పత్రులు, 7 జిల్లా ఆస్పత్రులున్నాయి. వాటికి రోజువారీగా దాదాపు 330 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. దీనికోసం సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో మందులను తీసుకెళ్లాలి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో అవసరమైన స్థాయిలో మందులు లేవని అంటున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులందరికీ మందులిచ్చే పరి స్థితి లేకపోవడంతో బయట కొనుక్కోవాల్సి వస్తోంది. రెండో త్రైమాసికం పూర్తి కావస్తున్నా నిధులు విడుదల చేయలేదు. అయితే అన్ని మందులను అందుబాటులో ఉంచామని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాలరావు తెలిపారు. ‘ఆన్లైన్లో ఏమేమి ఉన్నాయో ఆ ప్రకారం పీహెచ్‌సీలు ఇండెంట్ పెట్టుకొని తీసుకెళ్లవచ్చు. తీసుకెళ్లలేదంటే అది వాళ్ల సమస్యే. దానికి మేం బాధ్యులం కాదు. డిమాండ్‌ను బట్టి రోగులందరికీ మందులు ఇవ్వడం సాధ్యంకాదు. మా బడ్జెట్ ప్రకారమే మందులు కొనుగోలు చేస్తాం. అయినా మందులు లేవంటూ మాకు ఫిర్యాదులు రాలేదు’ అని ఆయన అన్నారు. -
మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం
సికింద్రాబాద్ : స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగిన తరుణంలో గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు రోగులకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగు రోజుల క్రితం అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన మహిళ (50) గాంధీకి రాగా ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. బుధవారం సన్‌షైన్ ఆస్పత్రి నుంచి మూడేళ్ల బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రాగా పరీక్షల్లో వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో గాంధీలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్న సమయంలో విజృంభించే వ్యాధి కారక వైరస్ చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో వెలుగులోకి రావడంతో రూపాంతరం చెందిందేమోనని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గర్భిణిలకు ఉచితంగా హెచ్1ఎన్1 వ్యాక్సిన్
సాక్షి, ముంబై : గర్భిణి మహిళలకు హెచ్1ఎన్1 వ్యాక్సిన్‌ను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఉచితంగా వేయడం ప్రారంభించింది. కస్తూర్బా ఆస్పత్రి వార్డ్ నెం.19లో ఆరు నుంచి 9 నెలల గర్భిణిలు వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఇక్కడ గర్భిణిల నుంచి వచ్చే స్పందనను బట్టి తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఉన్న మెటర్నిటీ (ప్రసూతి) హోంలలో కూడా ఈ సేవలను ప్రారంభిస్తామని బీఎంసీ ఎపిడమాలజీ ఇన్చార్జ్ డాక్టర్ మినిఖేటర్పాల్ తెలిపారు. 200 హెచ్1ఎన్1 డోస్‌లు బీఎంసీ వద్ద ఉన్నాయని, ఈ వ్యాక్సిన్ వేయడం ద్వారా హైపర్ టెన్షన్, డయాబెటీస్ రోగుల మరణాల రేటును అరికట్టవచ్చని మహా రాష్ర్ట అంటువ్యాధుల నివారణ, నియంత్రణ సాంకేతిక కమిటీ చైర్మన్ డాక్టర్ సుభాష్ సాలుంకే చెప్పారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ ఇన్ఫెక్షన్ నియంత్రణలోనే ఉన్నా నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరిం చారు. స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతు న్న ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొన్నారు. వైరస్ గరిష్ట స్థాయికి చేరాక వ్యాక్సిన్ వేయించుకున్నా లాభం లేదని ప్రముఖ డాక్టర్ ఓం శ్రీవాస్తవ్ అన్నారు. -
ట్రైనీ ఐపీఎస్‌లకు స్వైన్‌ఫ్లూ: కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)లో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఆరోగ్యకర వాతావరణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలోని ఐపీఎస్ ట్రైనీలకు స్వైన్‌ఫ్లూ సోకడంపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. సకల సదుపాయాలతో అకాడమీ నిర్వహిస్తున్నప్పటికీ ట్రైనీ ఐపీఎస్‌లు అకాడమీ నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించడంపై హోం శాఖ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిి సంది. అకాడమీలో స్వైన్‌ఫ్లూ ప్రబలిన విషయం తెలుసుకున్న ఐపీఎస్ శిక్షణార్థుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 9 మంది శిక్షణార్థులు స్వైన్‌ఫ్లూ బారినపడడానికి దారి తీసిన కారణాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. అకాడమీలోని పరిస్థితులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ఓ బృందం త్వరలో అకాడమీకి రానున్నట్లు తెలిసింది. బయటి నుంచే వైరస్ అటాక్: సువిశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలో ఆరోగ్యకర వాతావరణం ఉందని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు తేల్చారు. బయటి ప్రాంతం నుంచే హెచ్1ఎన్1 వైరస్ అకాడమీలోకి వ్యాపించిందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. తిరుపతి ఉప ఎన్నికల పరిశీలన కోసం అక్కడికి వెళ్లి తిరిగి వచ్చాకే ట్రైనీ ఐపీఎస్‌లు అస్వస్థతకు గురయ్యారని అకాడమీ అధికారులు తెలిపారు. వైరస్ సోకిన 9 మంది అకాడమీ వసతి భవనంలోని ఒకే బ్లాక్‌లో బస చేసేవారు. ప్రస్తుతం ఆ బ్లాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా, వీరిలో ఆరు మంది కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. -
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ..
మంచిర్యాల టౌన్ : తగ్గుముఖం పట్టిందనుకున్న స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభించింది. తాజాగా మరో మూడు స్వైన్‌ఫ్లూ కేసులు పాజిటివ్‌గా రావడంతో ఒక్కసారిగా జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో 20 మంది వరకు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరగా ఇందులో ఐదుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ అరుు్యంది. వారిలో ఇద్దరు కోలుకుని ఇంటికి వెళ్లగా.. మరో ముగ్గురు తాజాగా వ్యాధి బారిన పడ్డారు. మంచిర్యాల రాంనగర్‌కు చెందిన వంగపల్లి సాగర్‌రావు (53), ఏసీసీకి చెందిన కుక్క మేరి(27) ఈ నెల 9వ తేదీన స్వైన్ ఫ్లూ లక్షణాలతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావు ఆదేశాల మేరకు వైద్యురాలు నీరజ వారి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఇద్దరికీ స్వైన్ ఫ్లూ ఉన్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో సాగర్‌రావు గత రాత్రి ఇంటికి వెళ్లగా హుటాహుటినా ఆస్పత్రికి పిలిపించి వైద్య సేవలందిస్తున్నారు. కాగా.. మందమర్రి దీపక్‌నగర్‌కు చెందిన బెల్లారపు భారతి (35)కి కూడా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు రిపోర్ట్ రావడంతో మందమర్రి నుంచి ఆమె నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో ప్రస్తుతం మేరీ, సాగర్‌రావు చికిత్స పొందుతున్నట్లు వైద్యుడు నీలకంఠేశ్వర్రావు తెలిపారు. -
'విశాఖలో ఏడు స్వైన్‌ఫ్లూ కేసులు'
విశాఖపట్టణం: జిల్లాలో ఇప్పటి వరకు ఏడు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయినట్లు జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. శనివారం ఆయన స్వైన్‌ఫ్లూ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ...ఏడు కేసుల్లో రెండు స్వైన్‌ఫ్లూగా నిర్ధారణకాగా, రెండింటి రిపోర్టులు అందాల్సి ఉందని తెలిపారు. మరో రెండు కేసులు నెగిటివ్‌గా తేలాయని తెలిపారు. స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో 14 బృందాలతో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటంతోపాటు..12 బృందాలతో వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, స్వైన్‌ఫ్లూ బాధిత కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు చేయటంతోపాటు వారికి ముందు జాగ్రత్తలు వివరిస్తామన్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి మాస్క్‌లు అందజేయనున్నట్లు చెప్పారు. -
విశాఖలో ఏడు స్వైన్‌ఫ్లూ కేసులు
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. శనివారం ఆయన స్వైన్‌ఫ్లూ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఏడు కేసుల్లో రెండు స్వైన్‌ఫ్లూగా నిర్ధారణకాగా, మరో రెండింటి రిపోర్టులు అందాల్సి ఉందని తెలిపారు. మరో రెండు కేసులు నెగిటివ్‌గా తేలాయన్నారు. స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో 14 బృందాలతో స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నట్టు జేసీ తెలిపారు.12 బృందాలతో వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు వైద్య సిబ్బందికి మాస్క్‌లు అందజేయనున్నట్టు చెప్పారు. -
చలి తగ్గినా.. ‘స్వైన్’ తీవ్రమే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో రెండు రోజుల నుంచి చలిగాలుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం 17.5 కనిష్ట, 29.8 గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అయినా స్వైన్‌ఫ్లూ మాత్రం విజృంభిస్తూనే ఉంది. తాజాగా గాంధీలో 34 మంది, ఉస్మానియాలో ఆరుగురు అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఐపీఎంకు పంపారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి మరో 60 నమూనాలు పంపారు. అయితే వాటి ఫలితాలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఒకరు ఆర్మీజవాను ఉండగా, మరొకరు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. ఫ్లూ నిర్ధారణ పరీక్షల కిట్స్ కరువు నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఐపీఎం పై ఉన్న భారాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ స్వైన్‌ఫ్లూ టెస్టులు ప్రారంభించి రెండు రోజులు గడవక ముందే ల్యాబ్‌లో కిట్స్ అయిపోయాయి. దీంతో ఆయా ఆస్పత్రుల నుంచి వచ్చిన శాంపిల్స్ ఇప్పటి వరకు నిర్ధారణ పరీక్షలకు నోచుకోలేదు. ఆందోళన అవసరం లేదు: వైద్య నిపుణులు ‘ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, ప్రస్తుతం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ వైరస్ ఉంది. ఒకే సారి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటంతో కిట్స్ కొరత ఏర్పడుతోంది. ఫీవర్ ఆస్పత్రి ల్యాబ్‌లో అవసరానికి తగినన్ని కిట్స్ లేకపోవడంతో వ్యాధి నిర్థారణ పరీక్షల్లో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. త్వరలోనే కిట్స్‌ను తెప్పించి వీలైనంత తర్వగా ఐపీఎం నుంచి ఫీవర్ ఆస్పత్రికి అందిన శాంపిల్స్‌ను పరీక్షించి రిపోర్టులు ఇస్తాం’అని ఓ వైద్య నిపుణుడు స్పష్టం చేశారు. -
స్వైన్‌ఫ్లూ కేసులు 61
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి 61 మంది స్వైన్‌ఫ్లూ భారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. వీరికి వివిధ స్థాయిల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఇప్పటికే నలుగురు మృతి చెందారు. వ్యాధి నివారణ చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం.. ప్రధాన ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచింది. 2,450 ఒసెల్టామీవిర్ 75ఎంజీ, 52 ఒసెల్టామీవిర్ ఎంఎల్‌లను క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులకు పంపిణీ చేశారు. 90వేల వాల్‌పోస్టర్లు, కరపత్రాలతో స్వైన్‌ఫ్లూపై విస్తృతంగా చైతన్యం కల్పిస్తున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఏపీలో విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ
12 కేసులు నమోదైనట్లు చెప్పిన మంత్రి కామినేని సాక్షి, విజయవాడ బ్యూరో/ విశాఖపట్నం: తెలంగాణను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ మెల్లగా ఏపీలోనూ విస్తరిస్తోంది. ఒంగోలు, విశాఖపట్నంలో పలువురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 12 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వారం క్రితం సంతమాగులూరు క్వారీలో పనిచేసే శివకృష్ణ (27) ఈ లక్షణాలతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఆరేళ్ల బాలుడు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో మృతి చెందాడు. అక్కడే మరో ఎనిమిదేళ్ల బాలికకు ఈ వ్యాధి లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కేజీహెచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయనే అనుమానంతో వారి శాంపిల్స్‌ను వైద్య పరీక్షలకు పంపారు. వరుసగా ఈ కేసులు బయటపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సరైన చికిత్స తీసుకుంటే ఆదిలోనే నివారించవచ్చని చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ముదిరిపోయిన తర్వాత ప్రభుత్వాస్పత్రికి వచ్చే కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే అర్హులైన వైద్యులను సంప్రదిస్తే ఈ వ్యాధిని నివారించవచ్చని, ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రతీ జిల్లాలోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. తిరుమలలో అలర్ట్ సాక్షి, తిరుమల: స్వైన్‌ఫ్లూపై తిరుమల శ్రీవారి భక్తులూ అప్రమత్తమయ్యారు. దీంతో ఎక్కువమంది భక్తులు ఎన్ 95 మాస్కులు, సాధారణ మాస్క్‌లు ధరించి తిరుగుతున్నారు. తక్షణం వైద్యసాయం అందించేందుకు వీలుగా టీటీడీ అశ్విని ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసింది. మాస్క్‌లు, మందులు తెప్పించింది. -
స్వైన్‌ఫ్లూ ప్రాణాంతక వ్యాధి కాదు: వైద్యులు
ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న స్వైన్‌ఫ్లూ ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు తెలిపారు. శరీరంలోనే ఉండే వ్యాధి నిరోధకాలు స్వైన్ ఫ్లూను ఎదుర్కొంటాయని నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు బుధవారం చెప్పారు.స్వైన్‌ఫ్లూ వ్యాధికి ప్రత్యేక చికిత్స, టీకా ఏదీ అవసరం లేదని వారు తెలిపారు. శీతాకాలంలో వచ్చే వైరస్ స్వైన్‌ఫ్లూ అని... ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇలాంటి వైరసే ఉందని వైద్యులు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని వైద్యులు అన్నారు. -
హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ!
హైదరాబాద్ : స్వైన్‌ఫ్లూ హైదరాబాద్‌ను వణికిస్తోంది. ఈ వ్యాధితో ఈరోజు ఇక్కడ మరో ముగ్గురు మృతి చెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు, గాంధీ ఆస్పత్రిలో ఒకరు మృతి చెందారు. తాజాగా 50 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో పది మంది మృతి చెందారు. రోజురోజుకు ఈ వ్యాధి సోకినవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులలో స్వైన్‌ఫ్లూను అరికట్టడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్నిమార్గదర్శకాలను విడుదల చేసింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్లని సంప్రదించాలని కోరింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి స్వైన్‌ఫ్లూ వ్యాధికి లక్ష్యణాలుగా పేర్కొంది. -
హైదరాబాద్‌లో కొత్తగా 25 స్వైన్‌ఫ్లూ కేసులు
హైదరాబాద్ : ఓవైపు చలి, మరోవైపు స్వైన్‌ఫ్లూ ... హైదరాబాద్ ప్రజలను వణికిస్తోంది. నగరంలో కొత్తగా మరో 25 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 173 కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఈ వ్యాధిని అరికట్టడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్నిమార్గదర్శకాలను విడుదల చేసింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్లని సంప్రదించాలని కోరింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి స్వైన్‌ఫ్లూ వ్యాధికి లక్ష్యణాలుగా పేర్కొంది. కాగా స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్ర జేపీ నడ్డా పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూ సోకినవారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.