Tablet
-
భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 18.4 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెండింతలకుపైగా పెరిగి 129 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. క్యూ2లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్యాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయడం, అలాగే గతేడాది ఏప్రిల్–జూన్‌లో అమ్మకాలు తక్కువగా ఉండడం 2024 జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటుకు కారణం అయింది. 2023 ఏప్రిల్–జూన్‌లో 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడయ్యాయి. ముందంజలో సామ్సంగ్..ట్యాబ్లెట్ పీసీల విపణిలో జూన్ క్వార్టర్లో 48.7 శాతం వాటాతో సామ్సంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ సెగ్మెంట్లో 54.1, కంజ్యూమర్ విభాగంలో 38 శాతం వాటాను సామ్సంగ్ సాధించింది. ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా మూడింతలై 9,01,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఏసర్ 23.6 శాతం, యాపిల్ 9.5, లెనోవో 6.9, షావొమీ 4.7 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఏసర్ అమ్మకాలు 27,000 నుంచి 4,37,000 యూనిట్లకు ఎగశాయి. యాపిల్ 12.3 శాతం వృద్ధితో 1,76,000 యూనిట్ల సేల్స్ సాధించింది. లెనోవో విక్రయాలు 2.8 శాతం క్షీణించగా, షావొమీ 85.8 శాతం దూసుకెళ్లింది. స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గతేడాదితో పోలిస్తే 178.1 శాతం పెరిగింది. డిటాచేబుల్ ట్యాబ్లెట్స్ సెగ్మెంట్ 23.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: దేశీ స్టార్టప్ పిక్సెల్కు నాసా కాంట్రాక్టు ఈ ఏడాది 20 శాతం వృద్ధి..భారత ట్యాబ్లెట్స్ మార్కెట్ 2023తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 20 శాతం వృద్ధితో 50,76,000 యూనిట్లు నమోదు చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ కంపెనీ కెనాలిస్ అంచనా వేస్తోంది. 2025లో వృద్ధి 8 శాతానికి పరిమితం అవుతుందని జోస్యం చెబుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్స్ విక్రయాలు 54,79,000 యూనిట్లను తాకుతుందని ధీమాగా ఉంది. 2024 జనవరి–మార్చిలో 13,47,000 యూనిట్ల ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయని కెనాలిస్ వెల్లడించింది. 2023 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది భారత్‌లో 11 శాతం, 2025లో 15 శాతం దూసుకెళుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, ట్యాబ్లెట్ పీసీలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–మార్చిలో 43 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. -
స్లిమ్‌గా కనిపించాలని ఆ మాత్రలు వేసుకుంది!..అంతే ఆమె..
స్లిమ్‌గా, నాజుగ్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందులో తప్పులేదు. కానీ అందుకోసం అనుసరించే పద్ధతులు ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే పర్లేదు. షార్ట్‌కట్‌లో త్వరితగితన తగ్గాలని రకరకాల ట్రీట్మెంట్లు, మందులు జోలికి వెళ్తే మాత్రం లేనిపోని సమస్యలు తలెత్తడమే గాక ఒక్కోసారి అదే మీ ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకోస్తాయి కూడా. అందుకు ఈ ఉదంతమే ఉదహరణ. కూతురు పెళ్లిలో చక్కగా స్లిమ్‌గా కనిపించాలనుకోవడమే శాపమై ప్రాణాలను కోల్పోయేలా చేసింది. ఈ విషాధ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాకు చెందిన 56 ఏళ్ల ట్రిష్ వెబ్‌స్టర్ మహిళ తన కూతురు పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలనుకుంది. అందుకోసం వైద్యులను సంప్రదించి మరీ ఓజెంపిక్ మాత్రలను వాడటం ప్రారంభించింది. ఆ మ్రాతలను వాడిన ఐదు నెలల్లోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బరవు తగ్గుతుందనుకునే లోపు ఉన్నటుండి హఠాత్తుగా ఓ రోజు కుప్పకూలి చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెకు సీఆర్పీ చేసి.. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. దీన్ని ప్రధానంగా టైప్-2 మధుమేహానికి ఉపయోగిస్తారు. చర్మం కింద ఇంజెక్షన్‌గా ఉపయోగిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానకి సమర్థవంతంగా ఉంటుందని పేషెంట్లకు ఈ మాత్రను సూచిస్తుంటారు. అదే ఆమెకు శాపమై జీర్ణశయాంతర వ్యాధికి దారితీసి చనిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు ఉపయోగిస్తారా? ఈ ఓజెంపిక్ మాత్రను బరువు తగ్గించడానికి ప్రసిద్ధ ఔషధంగా ఉపయోగిస్తారు. సహజ హర్మోన్ జీఎల్పీ-1ను ప్రేరిపించి బరువు కోల్పోయేలా చేస్తుంది. ఇది కడుపు, ప్రేగుల్లోకి ఆహారం వెళ్లడాన్ని నెమ్మదిస్తుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నవాళ్లకు ఎక్కువసేపు పొట్ట ఫిల్ అయ్యి ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీని వల్ల కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు పలు కేసుల్లో వెలడైంది కూడా. చాలామంది వైద్యులు దీన్ని సిఫార్సు చేసేందుకు మొగ్గు చూపడం లేదని సమాచారం. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశంతో అదే పనిగా ఈ మాత్రలను కొన్ని నెలలుగా వేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు దారితీసి మరణానికి కారణమైంది. ఆమె చనిపోయే టైంలో ఆమె నోటి నుంచి ఒక విధమైన గోధుమ రంగులో నురుగ వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మాత్ర అధికంగా వాడితే ఇలియస్ అనే పరిస్థితికి దారితీసి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు ఓజెంపిక్ దుష్ప్రభావాలు ఇతర మందులు మాదిరిగానే ఇది కూడా కొన్ని రకాల దుష్ప్రభావాలను చూపిస్తుంది. అవేంటంటే.. మలబద్ధకం అతిసారం వికారం పొత్తి కడుపు నొప్పి వాంతులు,వికారం ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాస్‌లో మంట థైరాయిడ్ క్యాన్సర్ డయాబెటిక్ రెటినోపతి, కళ్లకు హాని కలిగిస్తుంది హైపోగ్లైసీమిక్ లేదా తక్కువ రక్త చక్కెర పిత్తాశయ వ్యాధి పిత్తాశయ రాళ్లు, మీ పిత్తాశయం వాపు అలర్జీలు తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించమని వైద్యులు సూచిస్తున్నారు (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
110 సంస్థలకు అనుమతులు..
-
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్‌లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్‌లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్‌కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
చైనా స్మార్ట్‌మేకర్ షావోమీ కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. హైఎండ్ ఫీచర్స్‌తో షావోమీ ప్యాడ్ 6 మోడల్‌ను తీసుకొచ్చింది. షావోమీ ప్యాడ్ 5 అప్‌గ్రేడ్ వేరియంట్‌గా ఆల్ మెటల్ డిజైన్‌తో దీన్ని ఆవిష్కరించింది. ధర, ఆఫర్ షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించింది.అలాగే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. జూన్ 21న సేల్ ప్రారంభం. షావోమీ ఆన్లైన్ స్టోర్లతోపాటు,అమెజాన్‌లో లభిస్తుంది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?) ఇక ఆఫర్ విషయానికి వస్తే..ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఫలితంగా షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.23,999కు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు కొనుగోలుచేయవచ్చు. షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్ 11 అంగుళాల 2.8K ఎల్సీడీ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కె కెమెరా 8,840mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్ ఎం9: ధర రూ.15 వేల లోపే
సాక్షి,ముంబై: లెనోవో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎం9 పేరుతో భారీ మార్కెట్లో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 12,999తోగా నిర్ణయించింది. మార్కెట్లో ఉన్న అత్యంత తేలికైన టి టాబ్లెట్లలో ఎమ్9 ఒకటని కంపెనీ ప్రకటించింది. LTE, Wi-Fi ఓన్లీ ఇలా రెండు వేరియంట్లలో, అలాగే ఫ్రాస్ట్ బ్లూ , స్టార్మ్ గ్రే రంగులలో లెనోవో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లభించనుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) 9 అంగుళాల IPS LCD డిస్ప్లే , 1,340 x 800 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12, డాల్బీ అట్మాస్ సపోర్ట్ , MediaTek Helio G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్,గరిష్టంగా 64జీబీ స్టోరేజ్,8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100mAh బ్యాటరీ(10W ఛార్జింగ్ సపోర్ట్) గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ,ఫేస్-అన్‌లాక్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డ్యూయల్-టోన్ మెటల్ ఛాసిస్ 344 గ్రాముల బరువుతో తీసుకొచ్చిన పట్టుకోవడానికి ఎం9 సౌకర్యంగా ఉంటుంది. జూన్ 1 నుండి రూ. 12,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తోపాటు, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కేంద్రం కొత్త రూల్స్..ట్యాబ్లెట్, సిరప్ కొనుగోలుదారులకు ముఖ్యగమనిక
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న డ్రగ్ రూల్స్ (ఫార్మాస్యూటికల్)ను సవరించింది. ఈ రూల్స్ వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 18న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..డ్రగ్ రూల్స్ (ఎనిమిదవ సవరణ)- 2022లో భాగంగా కాల్పోల్,అల్లేగ్రా,బెటాడిన్, గెలుసిల్, డోలో 650తో సహా టాప్ 300 డ్రగ్ ఫార్ములేషన్ ప్యాకేజింగ్ లేబుల్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌ను తప్పని సరి చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా నకిలీ మెడిసిన్‌ను గుర్తించవచ్చని తెలిపింది. ఆగస్ట్ 1, 2023 నుంచి కొత్త డ్రగ్ రూల్స్ ఆగస్ట్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. షెడ్యూల్ హెచ్2లో పేర్కొన్న డ్రగ్ ఫార్ములేషన్ ఉత్పత్తుల తయారీదారులు దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్ (ప్రైమరీ ప్యాకేజీ లేబుల్) పై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను ప్రింట్ చేయాలి లేదా అతికించాలి. ప్రాథమిక ప్యాకేజీ లేబుల్‌లో తగినంత స్థలం లేకపోతే, నిల్వ చేసే సెకండరీ ప్యాకేజీ లేబుల్‌పై ప్రామాణీకరణను సులభతరం చేయడానికి సాఫ్ట్వేర్ అప్లికేషన్‌తో చదవగలిగే డేటా ఉంచాలని’ స్పష్టం చేసింది క్యూఆర్ కోడ్‌తో క్యూఆర్ కోడ్ సాయంతో మెడిసిన్ తయారీ చేసిన ప్రొడక్షన్ కోడ్, డగ్స్ సరైన..సాధారణ పేరు, బ్రాండ్ పేరు, తయారీదారు పేరు,చిరునామా, బ్యాచ్ నంబర్, మ్యానిఫ్యాక్చరింగ్ తేదీ, ఎక్స్‌పైయిరీ డేట్ (గడువు తేదీ). లైసెన్స్ నంబర్ డేటా వివరాలు తెలుసుకునే సౌకర్యం కలగనుంది. కాగా, నకిలీ మెడిసిన్ లేదా సిరప్‌ల అమ్మకాల్ని అరికట్టేందుకు రష్యా, బ్రిటన్,జర్మనీ,అమెరికా తోపాటు ఇతర దేశాల్లో ఈ క్యూఆర్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉండగా తాజాగా భారత ప్రభుత్వం ఈ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపింది. -
వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!
ఇటీవలకాలంలో యువత తమ సృజనాత్మకతను జోడించి చాలా వినూతనంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా ఔరా! అనిపించేలా వివాహాలు జరుపుకుంటున్నారు. కొంతమంది హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది చాలా సింపుల్‌గా వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడోక జంట భావించింది కాబోలు. ఆ నవ దంపతుల వివాహా ఆహ్వాన పత్రికను చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు విషయమేమిటంటే...ఆ దంపతులు తమ వెడ్డింగ్ కార్డు వెరైటీగా ఉండాలనుకున్నారు కాబోలు. అందుకోసం వారి వివాహా ఆహ్వాన పత్రికనే ఒక ట్యాబ్లెట్ స్టిప్స్ ఆకారంలో రూపొందించారు. ట్యాబ్లెట్ వెనుకవైపు ఉండే విభాగంలో ఆయా ట్యాబ్లెట్‌కి సంబంధించిన వివరాలు మాదిరిగా.. హెచ్చరిక, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి తదితర అంశాలో వారి సమాచారం ఉంది. నిశితంగా చూస్తేనే అది ఆహ్వాన పత్రిక అని తెలుస్తుంది. పైగా చాలా ఫన్నీగా అనిపిస్తోంది కూడా. పెళ్లి పత్రికలో ఎలా అయితే వధువు, వరుడు వివరాలు ఉంటాయో అలానే అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఇలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్. అంతేకాదండోయ్ వరుడు పేరు ఎళిలరసన్ ఫార్మసీ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, వధువు వసంతకుమారి నర్సింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్. తరుచు సోష్ల్ మీడియాలో యాక్టివిగ్ ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయెంకాను ఎంతగానో ఇంప్రెస్ చేసింది ఈ వివాహ పత్రిక. ప్రజలు చాలా కొత్తదనం కోరుకోవడమే కాదు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని కొనియాడారు. ఇది ఫార్మసిస్ట్ వివాహా ఆహ్వాన పత్రిక అంటూ...ఆ జంట ఆలోచనని ప్రశంసించారు. A pharmacist’s wedding invitation! People have become so innovative these days…. pic.twitter.com/VrrlMCZut9 — Harsh Goenka (@hvgoenka) August 20, 2022 (చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!) -
Dolo-650ని సిఫార్సు చేసేందుకు డాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు.. సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజలకు సంజీవని ఔషధం ఇదేనంటూ తమ మాత్రను సూచించాలంటూ డోలో–650 ఎం.జీ. ట్యాబ్లెట్ల తయారీసంస్థ దేశవ్యాప్తంగా వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎం.జీ ఉత్పత్తిదారుల ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ సంస్థ ఔషధాలు రోగులకు సూచించాలంటూ వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఫార్మాస్యూటికల్ సంస్థలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎఫ్ఎంఆర్ఏఐ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. ఈ మేరకు సంస్థ తరఫు లాయర్లు సంజయ్ పారిఖ్, అపర్ణా భట్లు గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘ట్యాబ్లెట్ల 500 ఎం.జీ. పరిమాణం వరకు మార్కెట్ ధర నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంతకుమించిన ఎం.జీ అయితే ఆ ట్యాబ్లెట్ల తయారీదారుల ఇష్టానుసారం ధర నిర్ణయించుకుంటారు. దీంతో అధిక లాభాలను మూటకట్టుకునేందుకు 650 ఎం.జీ డోస్ ఉన్న తమ సంస్థ ట్యాబ్లెట్లనే రోగులకు సూచించాలని డోలో–650 తయారీదారులు వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చారు’ అని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ డోస్ కాంబినేషన్ నిర్హేతుకమైనదని వాదించారు. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరింది. తద్వారా పర్యవేక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తూ పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంది. కోడ్ ఉన్నప్పటికీ దానికి స్వచ్ఛంద హోదా లేదా చట్టబద్ధంగా ఉండేలా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చట్టాలు రూపొందించాలని పార్లమెంటును ఆదేశించలేమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. కోడ్‌కు చట్టబద్ధత వచ్చే వరకు ఔషధ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులను నియంత్రించడానికి కోర్టు మార్గనిర్దేశనం చేయాలని పారిఖ్ కోరారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అధిక/అహేతుక ఔషధాల ప్రిస్కిప్షన్, అధిక ధర ఉన్న ఔషధాలనే రోగులకు వైద్యులు సూచించే పద్ధతులు పెరిగాయన్నారు. ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించిన ప్రజల జీవించే హక్కును ఉల్లంఘించినట్లేనని ధర్మాసనానికి తెలిపారు. ఫార్మా స్యూటికల్ రంగంలోని అవినీతి.. రోగుల ఆరోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తుందో చూపే ఘటనలు కోకొల్లలు ఉన్నాయని ఉదహరించారు. చదవండి: అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన ఇది తీవ్రమైన సమస్యే ఎఫ్ఎంఆర్ఏఐ లేవనెత్తిన అంశంపై జస్టిస్ చంద్రచూడ్ ఏకీభవించారు. ‘తనకు కోవిడ్ సోకినప్పుడు ఇదే సందర్భం ఎదురైంది. దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పది రోజుల్లో స్పందన తెలపాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్‌ను కోర్టు ఆదేశించింది. తదనంతరం వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలన్న లాయర్ పారిఖ్‌కు సూచించింది. ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. మైక్రోల్యాబ్స్‌పై దాడులు కోవిడ్ కాలంలో అత్యధికంగా అమ్ముడుపోయిన డోలో–650 ఎం.జీ ట్యాబ్లెట్ల తయారీదారు అయిన మైక్రో ల్యాబ్స్ సంబంధ కార్యాలయాల్లో ఇటీవల సీబీడీటీ అధికారులు సోదాలు చేశారు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలు జరిగాయని గుర్తించారు. వైద్యులకు ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇచ్చినట్లు గుర్తించారు. -
రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ, ఇంకా బోలెడు ఫీచర్లు!
హైదరాబాద్: రియల్మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో ట్యాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో, 11 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్ప్లే, 8,340 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ డార్ట్ చార్జింగ్‌తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో వైఫై వెర్షన్ ధర రూ.19,999. ఇదే సామర్థ్యాలతో వైఫై, 5జీ సిమ్ సపోర్టెడ్ ట్యాబ్లెట్ ధర రూ.25,999. ఇందులో 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఆగస్ట్ 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి. అలాగే, రియల్మీ వాచ్3, ఒక ఫ్లాట్ మానిటర్, రియల్మీ బడ్స్ ఎయిర్3 నియో, రియల్మీ బడ్స్ వైర్లెస్ 2ఎస్ ఉత్పత్తులను కూడా సంస్థ విడుదల చేసింది. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
ట్విటర్ ట్రెండ్: డోలో 650 మేనియా
Dolo 650 Twitter Trending: ‘సొంత వైద్యం’.. కరోనా టైంలో ఎక్కువ చర్చకు వచ్చిన అంశం. అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణుల సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు!. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమో, మరేయితర కారణాల వల్లనో ఇంటి వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యం లభించింది ఫస్ట్ వేవ్ టైంలో. అదే సమయంలో అల్లోపతి మందులకు ఫుల్ డిమాండ్ నడిచిన విషయమూ చూశాం. మూడో వేవ్ ముప్పు తరుణంలో మళ్లీ ఇప్పుడా పరిస్థితి నెలకొంది. అసలే ఫ్లూ సీజన్. ఆపై కరోనా ఉధృతి. తాజాగా లక్షాయాభై వేలకు కొత్త కేసులు చేరువైన వైనం. కేసులు ఒక్కసారిగా పెరిపోతుండడంతో జనాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ఇతర ట్యాబెట్లు, సిరప్‌ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డోలో మాత్రపై ట్విటర్లో సరదా-సీరియస్ కోణంలో కొనసాగుతున్న ట్రెండ్ ఇందుకు నిదర్శనం. డోలో 650 మేనియా.. అవును ఇప్పుడిది ట్విటర్‌ను షేక్ చేస్తోంది. ప్రమోషనో లేదంటే ట్విటర్ యూజర్ల అత్యుత్సాహామో తెలియదుగానీ నిన్నటి నుంచి ట్విటర్లో పోస్టులు పడుతూనే ఉన్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో మునిగిపోయారు చాలామంది. కొవిడ్ టెస్టులకువెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఏదో చాక్లెట్ చప్పరించినట్లు డోలో మాత్రల్ని వేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. విచ్చిల విడిగా వాడడం మంచిదికాదని.. వాడితే తగ్గిపోతుందని ఎవరికి తోచిన ట్వీట్లు వాళ్లు చేసుకున్నారు. ఈ దెబ్బతో ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో #Dolo650 నడుస్తోంది. అందులో కొన్ని పోస్టులు.. Every Indian during Covid 3rd wave👇😂 Taking Dolo 650#Dolo650 pic.twitter.com/ygNploDihV — சிட்டுகுருவி (@save_sparrow2) January 7, 2022 Dolo 650 has become a joke in this country. I see random people behaving like medical experts & popping pills of Dolo 650 like vitamin tablets. Understand. Medicines have a composition & dosage for a reason. Consult a doctor, before becoming a pseudo doctor yourself.🤦🏻♀️#COVID19 — Santwona Patnaik (@SantwonaPatnaik) January 8, 2022 Indian patient when the doctor doesn't prescribe Dolo 650 😂🤣😂#dolo650 pic.twitter.com/QCFMdA9q0V — JITESH JAIN (@Jitesh_Jain) January 8, 2022 I don't no about theories, but it has zero side effects and cure 100%. Biggest medical Mafia is going on be careful my friend. It's time help people. Homeopathy will cure from roots. And You should have a good doctor. Do you know how paracitamol or dolo 650 damage liver ? — Dr.Venkat (@KiteTrades) January 8, 2022 When chemist gives only one Dolo 650.... Indian nibba : pic.twitter.com/zeRC53hDei — Arush Chaudhary (@ArushGzp) January 7, 2022 ప్రొడక్షన్ పెరిగింది ఫ్లూ సీజన్లో సాధారణంగా ట్యాబెట్లు వాడే జనం, కరోనా ఫియర్‌తో ఈసారి అడ్డగోలుగా మందుల్ని వేసుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ మాత్రలకు ఫుల్ గిరాకీ నడిచిన విషయం తెలిసిందే. అయితే రెండో వేవ్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో ఆ వ్యవహారం కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ పూర్తైనా కరోనా బారిన పడుతున్నారనే అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత చిట్కాలను పాటించడంతో పాటు మెడిసిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఈ డిమాండ్‌ను పసిగట్టి మరోవైపు మందుల కంపెనీలు సైతం ప్రొడక్షన్‌ను పెంచుతున్నాయి. "Dolo 650" i.e. acetaminophen/ paracetamol. Liver injury induced by paracetamol. .. pic.twitter.com/IqXfUiwBYI — Amit 🗨️ (@newindia_in) January 8, 2022 వైద్యుల కీలక ప్రకటన అయితే ‘అన్నింటికి ఒకే మందు’ అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వ్యవహారాన్ని వైద్యులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఏ మందు అయినా అవసరం ఉన్నప్పుడు.. అవసరం మేరకే వాడాలి. అంతేకానీ ముందు జాగ్రత్త, సొంత ట్రీట్మెంట్ పేరుతో వాడితే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా అవసరం లేకున్నా వాడడం వల్ల బాడీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్’ పెరిగి.. అవసరమైనప్పుడు మందులు పనిచేయకుండా పోతాయని చెప్తున్నారు. ►ఒమిక్రాన్కానీ, ఇంకేదైనా వేరియెంట్‌గానీ కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు. ►కరోనా అవునో కాదో తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదికాదు. ►ఎవరో ఒకరిద్దరికి తగ్గిందనే భ్రమతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం ప్రాణాల మీదకు తెస్తుంది. ►సోషల్ మీడియా ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.. వైద్యులను నమ్మండి ►లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా కావాలి. జాగ్రత్తలు పాటించాలి. ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవడం, ఆసుపత్రికి వెళ్లడం లేదంటే డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. ►కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సకు మనోధైర్యం తోడైతే కొవిడ్-19 వ్యాధిని అధిగమించొచ్చు. ►అవసరమైతే టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్‌ను సంప్రదించొచ్చు. ►టీకాలతో ఏం ఒరగట్లేదనే ఆలోచన మంచిది కాదు. అవి వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తాయి. రోగ నిరోధకశక్తిపై దీర్ఘకాలం పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండకూడదు. ►అనుమానంతో పదేపదే కరోనా టెస్టులు చేయించుకుంటూ ఇబ్బంది పడొద్దు. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దు. ►అన్నింటికి మించి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత తదితర జాగ్రత్తలతో కరోనాను జయించొచ్చు. -
నయా ట్యాబ్లెట్: బ్యాక్టీరియా ఖతం.. నీరు ఫిల్టర్
బయటికి వెళ్లినప్పుడు మంచి నీళ్లు కావాలంటే.. వెంటనే ఓ బాటిల్ కొంటారు. మరి బాటిల్స్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్తే? కంటి ముందు నీటి ప్రవాహాలున్నా... తాగడానికి అనువుగా లేకపోతే? మనిషికి ఎంత కష్టం కదా! ఇక ఆ బాధ అక్కర్లేదు. మీరు అడవుల్లో ఉన్నా, గుట్టలపై ట్రెక్కింగ్ చేస్తున్నా... ముందు నీటి కాలువ ఉంటే చాలు. ఆ నీటిని ఫిల్టర్‌చేసే ట్యాబ్లెట్ వచ్చేసింది. అదే హైడ్రోజెల్. కలుషితమైన నీటిని గంటలోపే స్వచ్ఛమైన తాగునీరుగా మార్చేస్తుంది. టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్లు దీనిని కనిపెట్టారు. అక్కడి విద్యార్థి యోహాంగ్ గుయో సూర్యకాంతితో నీటిని శుద్ధి చేసే ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా హైడ్రోజెల్ ఆలోచన వచ్చింది. నీటి కొరత తీరొచ్చు... ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజానీకానికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. నీటిని తాగాలంటే మరగబెట్టడమో, శుద్ధీకరణో చేయాల్సిందే. ఆ రెండు పద్ధతులకు విద్యుత్ అవసరం. అంతేకాదు... అధిక సమయం, శ్రమ కూడా. కానీ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుకు తగిన వనరులు లేవు. కానీ హైడ్రోజెల్ ఒక్క ట్యాబ్లెట్ ఉంటే... ఇవేవీ అక్కర్లేవు. హైడ్రోజెల్లో ఉన్న హైడ్రోజెన్ పెరాక్సై డ్... నీటిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఇందుకు విద్యుత్ అవసరం లేదు. ఇందులో ఎలాంటి హానికారకాలు లేవు. సూర్యకాంతితో నీరు ఆవిరయి అందులోని కాలుష్యాన్ని వేరు చేసినట్టుగానే... హైడ్రోజెల్ తనంతట తానే నీటిని శుద్ధి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాగునీటి కొరతను తీర్చడంలో హైడ్రోజెల్ గొప్పగా సహాయపడుతుందని టెక్సాస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుహియాయు తెలిపారు. -
ఈ మందుతో అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్‌కు చెక్ పెట్టే మందును ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్లాక్ ఫంగస్ మాత్రమే కాకుండా దాదాపు అన్ని రకాల ఫంగల్ (శిలీంధ్రం) ఇన్ఫెక్షన్ల చికిత్సలోనూ దీన్ని వాడొచ్చని, ఏదైనా ఫార్మా కంపెనీ ముందుకొస్తే ఈ మందు తయారీ సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ ఫంగస్‌కు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్–బి అనే ఇంజెక్షన్‌తో చికిత్స కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మందు ఖరీదైనది మాత్రమే కాకుండా.. పలు దుష్ప్రభావాలూ ఉన్నాయి. గతంలో ఇదే మందును కాలా అజార్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్న ఆంఫోటెరిసిన్–బిపై రెండేళ్ల నుంచే ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్, డాక్టర్ చంద్రశేఖర్ శర్మ, పీహెచ్డీ స్కాలర్లు మృణాళిని గాయ్ధనే, అనిందిత లాహాలు పరిశోధనలు చేస్తున్నారు. నానో టెక్నాలజీ సాయంతో... ఈ మందును నానోస్థాయి పోగులతో కలిపి ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయొచ్చని వీరంతా గుర్తించారు. ట్యాబ్లెట్ల రూపంలో ఆంఫోటెరిసిన్–బి తయారు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అతితక్కువ మోతాదుల్లో ప్రభావవంతంగా మందు అందించవచ్చని, ఇంజెక్షన్ ద్వారా అందించేటప్పుడు మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుండగా ట్యాబ్లెట్ల ద్వారా ఈ దుష్ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్ తెలిపారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు ఆంఫోటెరిసిన్– బి శరీరంలో చిన్నచిన్న గడ్డలు కట్టే అవకాశాలు ఉంటాయని, వీటిని శరీరం నుంచి తొలగించేందుకు మూత్రపిండాలు ఎక్కువ భారం మోయాల్సి వచ్చేదని ఆయన వివరించారు. జిలాటిన్ పదార్థంతో కలిపి తాము ఈ మందును తయారు చేశామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉత్పత్తి అవసరం.. బ్లాక్‌ఫంగస్‌తో పాటు ఇతర శిలీంధ్ర సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ మాత్రలను పెద్ద ఎత్తున తయారు చేయడం అవసరమని అన్నారు. ఇంజెక్షన్ల మాదిరిగా ఈ ట్యాబ్లెట్లూ ఖరీదుగా మారకుండా ఉండేందుకు తాము ఈ టెక్నాలజీపై పేటెంట్ హక్కులేవీ పొందలేదని, కేవలం 60 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్‌తో ఆంఫోటెరిసిన్–బి మందు నెమ్మదిగా.. స్థిరంగా 8 గంటల పాటు శరీరానికి అందించవచ్చన్నారు. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.200 వరకూ ఉండొచ్చని చెప్పారు. ఏదైనా ఫార్మా కంపెనీ ట్యాబ్లెట్ల తయారీకి పూనుకుంటే వాటి క్లినికల్ ట్రయల్స్‌కు మార్గం సుగమం అవుతుందని అన్నారు. -
హువావే కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్ : తక్కువ ధరలో
సాక్షి, ముంబై : చైనా టెక్ కంపెనీ హువావే కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. మ్యాట్ ప్యాడ్ టీ8 పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా కరోనా కాలంలో ఆన్ లైన్ క్లాసుల కోసం కంప్యూటింగ్ పరికరాన్ని తీసుకొచ్చింది. కొనుగోలుదారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా ఈ ట్యాబ్‌ను ఆవిష్కరించింది. రికార్డర్, కెమెరా, మల్టీమీడియా కిడ్స్ పెయింటింగ్ , పేస్ అన్ లాక్ లాంటి ఫీచర్లతో ఇది కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఎక్కువ కాలం పాటు టాబ్లెట్‌ను ఉపయోగిస్తున్నట్లయితే పిల్లల భంగిమను సరిదిద్దేలా హువావే హెచ్చరిక కూడా ఇస్తుందని తెలిపింది. దీంతోపాటు టైమర్ మరియు మల్టీ లేయర్డ్ కంటి రక్షణ ఫీచర్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.12 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని వెల్లడించింది. అన్ని వైపులా పెద్ద బెజెల్స్‌తో వైఫై, ఎల్టీఈ రెండు వెర్షన్లలో లభ్యం. హువావే మ్యాట్ ప్యాడ్ టీ8 స్పెసిఫికేషన్లు 8 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1280 x 800 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 512 జీబీ విస్తరించుకునే అవకాశం. 5 ఎంపీ రియర్ కెమెరా 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ హువావే మ్యాట్‌ప్యాడ్ టీ8 ధర, లభ్యత వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఎల్టీఈ వేరియెంట్ ధర రూ.10,999 సెప్టెంబర్ 14 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ప్రీ-ఆర్డర్ వ్యవధిలో ఎల్టీఈ వేరియంట్‌పై వెయ్యి రూపాయల తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి కొనుగోలుకు లభ్యం. -
హువావే ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ ట్యాబ్లెట్ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ డివైజెస్ తయారీ సంస్థ హువావే.. తాజాగా ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ పేరుతో ట్యాబ్లెట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదలచేసింది. కాలేజీకి వెళ్ళేవారు, పని నిపుణులు, కళాకారులు, పిల్లలకు సరిపోయే విధంగా దీనిని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ డివైజ్ ధర రూ. 21,990 వద్ద నిర్ణయించింది. శక్తివంతమైన 8–కోర్ ప్రాసెసర్, 10.1 అంగుళాల డిస్ప్లే, 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో స్పెసిఫికేషన్లుగా వెల్లడించింది. నూతన ట్యాబ్ సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ వెబ్ సైట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ‘5జీ’ ట్రయల్స్‌కు అనుమతి దక్కేనా..! భారత్‌లో 5జీ ట్రయల్స్‌కు హువావే ఆసక్తిని వెల్లడించగా.. జాతి ప్రయోజనాల ఆధారంగా ఈ అంశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నామని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ అన్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. 4 నెలల్లో స్పెక్ట్రమ్ వేలం ఉండనుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
ఒక్క టాబ్లెట్‌తో గుండె జబ్బులు మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు నాలుగు మందుల మిశ్రమం కలిగిన ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడం ద్వారా దేశంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఓ తాజా వైద్య అధ్యయనం వెల్లడించింది. తద్వారా ‘జాతీయ ఆరోగ్య స్కీమ్’ కింద ప్రభుత్వానికి ఖర్చవుతున్న కోట్లాది రూపాయలను ఆదా చేయవచ్చని కూడా ఆ అధ్యయనం సూచించింది. ఆస్ప్రిన్, స్టాటిన్ మందులతోపాటు రక్తపోటును నియంత్రించే ఏవైనా రెండు మందులతో కూడిన ‘పోలి పిల్’ వేసుకుంటే గుండెపోటు రాకుండా చేయవచ్చని అధ్యయనం జరిపిన వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ఎలాంటి గుండె జబ్బులు లేని వారు కూడా ఈ ‘పోలి పిల్’ వేసుకుంటే వారిలో 40 శాతం వరకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వారు చెప్పారు. పలు మందుల మిశ్రమ‘ పోలి పిల్స్’ గురించి గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో అధ్యయనాలు కొనసాగుతున్నా తాజా అధ్యయనమే సత్ఫలితాలిచ్చాయని వైద్యులు తెలిపారు. పైగా ఒక్క ట్యాబ్లెట్‌కు భారతీయ కరెన్సీలో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని వారు చెప్పారు. 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఏడువేల మందిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరపడం వల్ల ఈ ‘ పోలి పిల్’ ప్రభావాన్ని అధ్యయనం చేయగలిగామని వైద్యులు ‘ది లాన్సెట్’ పత్రికలో వివరించారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ‘స్టాటిన్ ట్యాబ్లెట్ల’తోపాటు బీపీ మందులు వాడుతున్నారని, వారు అనేక మందులు తీసుకునే బదులు రోజుకో ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని అధ్యయనంలో పాల్గొన్న బర్మింగమ్ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్ టామ్ మార్శల్ తెలిపారు. ఎలాంటి గుండె జబ్బులు లేకుండా 50 ఏళ్ల వయస్సు దాటిని వారంతా ఈ ‘పోలి పిల్’ వాడడం వల్ల గుండె జబ్బులను అరికట్టవచ్చని ఆయన చెప్పారు. -
పంచమి 3
ఏ వార్త వింటానో ఏమిటో? ఇంతకీ చవితి వెళ్లిందో లేదో?! చలిగా ఉంది. షాల్ నిండుగా కప్పినా చలిగానే ఉంది. కలతగా ఉంది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. ఒక పడుచు అమ్మాయి కూర్చుని కళ్ళు తుడుచుకుంటంది. కొందరు గురక పెట్టి నిద్ర పోతున్నారు. కొందరు చడీ చప్పుడు లేకుండా శుప్తావస్థలో ఉన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. నిద్ర పోతున్నానో మేలుకుని వున్నానో తెలీడం లేదు. ఏదో కలవరం. ఎవరో తట్టినట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. ఎవరూ కనబడలేదు. ఇందాక ఏడ్చిన అమ్మాయి కూడా మగతలోకి జారినట్లు ఉంది. పెద్దావిడ ఎలా ఉందో. ఆలోచనలన్నీ ఆమె చుట్టూతా తిరుగుతున్నాయి. మొదటగా ఆ ఇంటికి వెళ్ళిన సాయంత్రం గుర్తుకొచ్చింది.‘ఇవాళే చేరమన్నా చేరతాను’ ప్రాధేయ పూర్వకంగా అన్నాను. నా అవసరాలు నావి. బంగారం కొట్ల వెనక మూడో సందులో ఐదో ఇల్లు. మనిషి కావాలంట అన్నారు. విన్నది తడవుగా వెళ్ళాను. ఖాళీగా కూర్చుంటే జరుగుబాటు ఎలా? వానాకాలం చివరి రోజులు. మబ్బులు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఏదో ఒక వూరిలోనో, వాగుపైనో అడుగు బొడుగు మిగిలిన చివరి చినుకులు దులపరించుకుంటున్నాయి. చిత్తడి నేలలో బురద చీర మీదికి చిమ్మకుండా నిదానంగా నేను నడుచుకుంటూ వెళ్ళేప్పటికి ఇంటి వరండాలో కోడలు ఉంది. పనికోసం వొచ్చానని అడిగితే అత్తగారి గది చూబించింది. తనుగా ఏ ఆరాలూ తియ్యలేదు. పెద్దావిడ మా కుటుంబం, కులం ఇంతకు ముందు ఎక్కడెక్కడ పని చేసిందిలాంటి కొన్ని వివరాలు అడిగింది. మాట్లాడుతూనే గోడ గడియారం చూసుకుని నీరసంగా బల్ల మీద మందులు తీసింది. టాబ్లెట్ పైని కవర్ చించి లోపలి మందు బిళ్ళ తీసే ఓపిక లేక కాసేపు అలానే నిస్సత్తువగా మొహం వేలాడేసింది. సాయం చెయ్యబోయాను. ‘ఆగు ఆగు’గట్టిగా వారించింది. ఏవైందో అని తెల్లబోయాను. పక్కన ఉన్న కేలండర్ దగ్గరికి తీసుకుని కాసేపు పరీక్షించింది. ఎల్లుండి సాయంకాలం వర్జం, దుర్ముహూర్తం వెళ్ళిపోతాయి. తిధి, నక్షత్రం బావున్నాయి. అప్పుడు ఒచ్చి చేరు అన్నది. పెద్ద జ్యోతిష్యం తెలిసిన మనిషిలాగా ధీమాగా. నాకేమో ఇప్పటికిప్పుడే చేర్చుకోవచ్చుకదా అని ఆశ. మంచి నీళ్లు చేతికిస్తే గ్లాసు కింద పడకుండా తాగగలదో లేదో? అయినా సరే సాయానికి మనిషిని పెట్టుకునేదానికి ముహూర్తం చూసుకుంది! కనీసం మాత్ర మీద కవరు చింపడానికి కూడా ఒప్పుకోలేదు. కవర్ చింపితే కూడా పన్లో చేరిపోయినట్టేనా? మరీ విడ్డూరం.ఎల్లుండి చేరాలి. అంటే, నేను రెండ్రోజులు జీతం లేకుండా ఖాళీగా ఉండాలి. సర్లే. ఎల్లుండి నుంచి నిఖార్సుగా పని దొరికింది. అంతవరకూ నయం.నా పేరు మణి. పెద్దావిడ పేరు ఏదో ఉంది. నేను మాత్రం‘అమ్మా’అంటాను. రోజంతా ఆవిడని కనిపెట్టుకుని ఉండటం. ఎప్పటికీ కలగని ఉపశమనాన్ని కాసేపు కలిగినట్టుగా భ్రమ పడటానికి ఏది చెబితే అది చెయ్యడం. ఏదీ చెయ్యడానికి లేనప్పుడు ఊరికే కూచుని చూడటం. అదే నా ఉద్యోగం. జీవన్మరణ సంధి కాలంలో మనిషికి తోడు ఉండటం. ఎప్పటి నించో ఇదే పని. ‘మనిషి పుటక్కి తొమ్మిదే రంధ్రాలు. నాకు మాత్రం ఎన్నో లెక్కే తెలీదు. ఎప్పుడు ఏ పాపం చేశానో, ఏ పూజలో దోషం చేశానో, ఈ మందులూ, సూదులూ. మందులు లోపలంతా రంధ్రాలు చేస్తే సూదులు పైన పైన పొడిచి చంపుతున్నాయి’ నర్స్ ఇంజక్షన్ చేయడానికి వొచ్చినప్పుడల్లా ఇలాంటి మాటలు అనేది. ‘చెయ్యి కదపకుండా ఉండాలి. మంచి మందులు ఇవ్వన్నీ. టైముకి మందులు వాడితే రెండు రోజుల్లో లేచి ఇల్లంతా తిరిగేయ్యోచ్చు’ కుర్ర నర్సమ్మ అనేది. ఈ మాట వినీ వినీ ఎన్ని ‘రెండు రోజులు’ గడిచాయో లెక్కే లేదు. అయినా ఒక క్షణం కళ్ళు తళుకుమనేవి. వినబుద్ధి పుట్టించే, నమ్మ బుద్ధి పుట్టించే నర్స్ కబుర్లు విని నిట్టూరుస్తుంది. పని పూర్తి అయి తను వెళ్ళిపోయినాక ఆ పిల్లని గురించి కాసేపు కోపంగానో, ప్రేమగానో, చాడీ కోరుతనంగానో నాలుగు మాటలు చెబుతుంది. ఇంజక్షన్ తరవాత దూదిని స్పిరిట్‌లో ముంచి సూది గుచ్చిన దగ్గర పడిన సన్నటి రక్తం చుక్కని గంట సేపు తుడువమంటుంది.లేక పోతే ఐసు ముక్కలు తీసి రుద్దమంటుంది. కొద్దిగా ఓపిక చిక్కితే లేచి అటూ ఇటూ తిరుగుతుంది. ఆవిడ తిరిగినంత సేపూ నేనూ చెయ్యి పట్టుకుని నడవాలి. ఇవన్నీ కాలక్షేపాల్లో భాగాలు.‘ఇది అసలు రోగం కాదు. గాలేదో సోకింది నాకు. చీటాకు తెమ్మని చెప్పాలి వాడికి’‘ఎప్పుడు ఎక్కడ ఏ ఎర్ర నీళ్లు తొక్కానో. ఇలాగ రోజు రోజుకీ తగ్గిపోతున్నా’‘గుమ్మానికి కట్టిన గుమ్మడి కాయ మార్పించాలి. పటిక గడ్డ ఒకటి తెచ్చి కట్టాలి. నాకు దిష్టి తగిలింది’ రోజులో ఎక్కువ భాగం ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండేది.పెద్దామె భర్త రెండేళ్ళ క్రితం కాలం చేశాడు. ఒక్కడే కొడుకు. ఎందరో దేవుళ్ళకి ముడుపులు కట్టగా కట్టగా లేక లేక పుట్టాడంట. కొడుక్కి మొగ పిల్లలు ఇద్దరు. ఎనిమిది పదేళ్ళ లోపు వాళ్ళు. పెద్ద పిల్లాడు ఉషారుగా ఉంటాడు. చిన్న వాడు ఎక్కడున్నాడో తెలీనంత నింపాదిగా ఉంటాడు. కానీ వాడి ఉనికి మనకి తెలిసేలా వాళ్ళమ్మ చీటికీ మాటికీ వాడిని కలవరిస్తూ వుంటుంది. ‘స్నానానికి వేడి నీళ్లు రెడీ గా ఉన్నాయి’‘టిఫిన్ తిందువు రా నాన్నా’ ‘అన్నం వండేశాను. నువ్వింక రావాలి’ ఏది అడిగినా గట్టి సమాధానం చెవినిపడదు పది సార్లు పిలిస్తూనే ఉంటుంది! పిల్లలు, అమ్మల పిలుపుకి చప్పున స్పందించపోవడం మామూలే. కానీ, వీడు మరీ విడ్డూరం. వినపడినా పలకడు. ఎప్పుడు పది నిమిషాలు తీరిక దొరికినా, ఏదో ఒక మూల మందపాటి దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటాడు. పది సార్లు కేకలేస్తే నింపాదిగా వొచ్చి మంపుగా వాళ్ళమ్మ భుజాలు పట్టుకుని వేలాడుతూ నీలుగుతూ ఉంటాడు.‘మంచి రోజు అని రెండ్రోజులు ముందే బొజ్జలోంచి బైటికి తీయించింది వీడి నాయనమ్మ.కడుపులో వెచ్చగా, హాయిగా ఇంకా కొన్నాళ్ళు వుండనివ్వాల్సింది. అలా చప్పున లోకం లోకి లాగేటప్పటికి వాడికి ఏం అర్ధం కాలేదు. పుట్టిన రోజు మొదలు, నిద్ర పోతూనే ఉన్నాడు. ఆ నాలుగు రోజుల లోటు ఏళ్ల తరబడి తీర్చుకుంటూనే ఉన్నాడు’ గారాబంగా వాడి జుట్టు నిమురుతూ, అత్తగారి వంక నిరసనగా చూసింది కోడలు.‘ఇదివరకంటే అవకాశం లేదు. ఇప్పుడు అన్నింటికీ మంచి చెడ్డ చూసుకుని నడిచే అవకాశం ఉంది కదా. నిద్ర ఎక్కువ పోతాడని మాటే గానీ, తొందరగా అక్షరాలు పట్టేశాడు, బుద్ధిమంతుడు అని వాడకట్టలో మంచి పేరు. ఇంక అంతకన్నా ఏం కావాలి?’ ఆవిడ తన వాదన వినిపించింది.ఎవరు మాట్లాడితే వాళ్ళ వంక తిరిగి తల ఊపుతూ వింటాను. నేను చేసే ఆయా పనిలో అత్తా కోడళ్ళ మధ్యలో తలదూర్చి చేసే తీర్మానాలు ఏం ఉంటాయి గనక. చివరి వానలు కూడా కురిసి చలి రోజులు మొదలు అయ్యేప్పటికి ఆవిడలో ఉషారు తగ్గిపోసాగింది. మంచం మీద పడుకునే ఉంటే కదుములు కడతాయని లేచి కూర్చుని ఉంటోంది. కానీ ఇదివరకటిలా అటూ ఇటూ తిరగడం లేదు. ‘ఆస్పత్రిలో చేరాలి. బలమైన టానిక్కులు రాయించుకుని తాగితే సత్తవ వొస్తుంది. లేచి తిరగాలి. ఎన్నాళ్లైందో చింతకాయ తొక్కు, నెయ్యి కలుపుకుని అన్నం తిని. కోడలు రోలు వాడనే వాడదు. ఆ మిక్సీలో వేసి తిప్పితే ఏం బాగుంటాయి పచ్చళ్ళు? పోనీ నాకు అది కూడా పెట్టరు. ఉత్త చప్పిడి కూడు. ఏదైనా అంటే, తేడా చేస్తుంది. ఒద్దు. ఒంటికి మంచిది కాదు అని చెబ్తారు. ఓపిక రానీ. ఈ సారి వేరు పొయ్యి పెట్టుకుని నేనే వొండుకుంటాను’ నిన్నటి నుంచి ఇలా ఏదో ఒకటి మాట్లాడ్డం మొదలు పెట్టింది. చాలా రోజులు అయ్యింది ఇన్ని మాటలు విని. నాకు అనుమానం వొచ్చింది. కానీ బైటికి చెప్పలేదు. రాత్రి పది గంటలు అయ్యిందేమో. బాత్రూమ్కి తీసుకెళ్లమంది. పగటి పూట ఐతే కోడలు సాయానికి వొస్తుంది, మంచం దగ్గర నుంచి బాత్రూమ్ తలుపు దాకా. రాత్రిళ్ళు నేనే తిప్పలు పడతాను. ‘ముందు జన్మలో నువ్వు నా బిడ్డవి మణీ’ అంది. ‘మరేనమ్మా’ నేను చిన్నగా నవ్వాను.‘ఈ నైటీలు నాకు అసలు నచ్చవు. ఏంటో నాకు ఇవి వేస్తున్నారు. నాలుగు రోజులాగి కాస్త ఓపిక వస్తే చీరలు కట్టుకోవాలి’. ‘అలాగే కట్టుకుందురు గానీ’. ‘అయినా ఇప్పుడు అందరూ నైటీలే వేస్తున్నారు. నాకే ఎందుకో నచ్చవు’నేను ఏం మాట్టాడలేదు. ఆమె కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉంది. పొడి బట్టలు తొడిగి మంచం మీద పడుకోబెట్టాను. ‘ఈ రోజు తిధి ఏమిటో చూడు మణీ’ కళ్ళు మూసుకునే చెప్పింది. నేను గమ్మునున్నాను.కాసేపు గడిచాక చిన్నగా మూలగడం మొదలు పెట్టింది. మధ్యలో ఏదో గొణుగుడు. సరిగా అర్ధం కావడం లేదు. స్పష్టంగా మాట్లాడటానికి లోపల్నించి సహకారం లేదు. కొడుకుని పిలవనా అనుకున్నాను. గది లోంచి బైటికి వొచ్చి తలుపు తట్టబోయాను. కొడుకూ కోడలూ మేలుకునే ఉన్నట్లున్నారు. లోపల్నించి సన్నటి ధ్వని! రూపమాత్రంగా రెండుగదుల్లో శబ్దం ఒకటే. కానీ భావనలు జీవితపు భిన్న పార్శా్వలకు ప్రతీకలు. తలుపు కొట్టడానికి మొహమాటపడి వెనక్కి వొచ్చేశాను. కానీ పరిస్థితి క్షణ క్షణానికీ మారుతోంది. చెప్పక తప్పదు, ఏకాంతానికి భంగం అయినా సరే. ఫోన్ తీశాను. ఆరేడు రింగులు మోగగానే అటునుంచి కట్ అయ్యింది. నిమిషంలో కొడుకూ కోడలూ వొచ్చారు. వాళ్ళు వొచ్చేప్పటికి ఆమె కళ్ళు మూసుకుని ఉంది. నావంక ప్రశ్నార్ధకంగా చూశారు. నేను ఆవిడ వొంక చూబించాను. అబ్బాయి, దగ్గరికెళ్ళి ఊపిరి ఉందో లేదో అని అనుమానంగా గమనించాడు. ఊపిరి ఆడుతోంది.‘ఏమైంది?’అన్నాడు‘బాగాలేనట్లు ఉంది’ ‘హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాలా?’ అంటూనే అంబులెన్సుకి ఫోన్ చేశాడు. అంబులన్స్ వచ్చేలోగా అవసరమైన టవలు, చీరలు కొన్ని వస్తువులూ నేను సంచిలో సర్దాను. అన్నీ సర్దటం అయ్యాక అబ్బాయి, గోడకి తగిలించిన కేలండర్ ఓ సారి చూసి, తరవాత దానిని తీసి సంచిలో వస్తువుల పైన పెట్టాడు! కాసేపటికి అంబులన్స్ వొచ్చింది. నన్ను కూడా ఎక్కమన్నారు. ఆసుపత్రి ఇంద్ర భవనంలా ఉంది. నరకానికి అందమైన డెకరేషన్ చేస్తే అదే ఆసుపత్రి. పెద్ద పెద్ద మెట్లు, ఎక్కువ మంది నిలబడగల లిఫ్టు, అందమైన పూల పూల ప్లాస్టిక్ కర్టెన్లు, మరక పడని గ్లాస్ తలుపులు, తళ తళా మెరిసే రాళ్ళు పరిచిన నేల, శుభ్రమైన డాక్టర్లు, నర్సులు. పేషంట్లు ఏరీ? రోగాలు ఏవీ? ఎక్కడా కనబడవే? వాళ్లని మాత్రం అందరికీ కనబడేలా పెట్టరు! ఖరీదైన ఆసుపత్రికదా. నొప్పీ, రోదనా, రోగాలు జాగ్రత్తగా లోపలెక్కడో దాచి పెట్టబడతాయి. అబ్బాయిని పెద్ద డాక్టర్ లోపలికి పిలిచారు. కోడలు, పిల్లల్ని బైట కూచోబెట్టుకుని సముదాయిస్తోంది. లోనికి రావాలంటే భయమంది. అందుకని నన్ను తోడు పిలిచాడు. పెద్దామె చేతికీ మోహానికీ, మూతికీ, గొంతులోకీ ఏవేవో గొట్టాలు బిగించి ఉంచారు. సృష్టికర్తకి మనిషి విసురుతున్న సవాల్. పై వాడు ఊపిరి ఆపెయ్యాలని చూస్తాడు. మనిషి ఒప్పుకోడు. ఆడిస్తాడు. ప్రేమో, భయమో, రాజకీయమో. అవసరం పేరు ఏదైనా గానీ. ఆడిస్తాడు. మరి, ఎంతకీ దేవుడికేనా చావు పుట్టుకల వినోదం?‘కండిషన్ సీరియస్. ఎంత సేపో కూడా చెప్పలేము’ డాక్టర్ మాటకి అబ్బాయి మొహం వాడిపోయింది.‘ఎలా ఇప్పుడు?’ ఆదుర్దాగా అడిగాడు.‘వెయిట్ చెయ్యడమే’ డాక్టర్ ప్రశాంతంగా చెప్పాడు.‘అది కాదు డాక్టర్ గారూ. నక్షత్రం, తిధి రెండూ బాగాలేవు. చవితి వెళ్ళేదాకా ఎలాగోలా ఊపిరి ఉండేలా చూడండి. ప్లీజ్’ డాక్టర్ని బ్రతిమిలాడినట్లు అడిగాడు. నేను ఆశ్చర్య పోయాను. డాక్టర్ మాత్రం నాలాగా ఆశ్చర్య పోలేదు.‘చూద్దాం. హామీ ఐతే ఏమీ ఇవ్వలేం. ఒక బాటిల్ రక్తం ఎక్కించి, డయాలిసిస్ చేద్దాం!’‘అలాగే డాక్టర్. ఎలాగైనా చవితి వెళ్ళేదాకా ఆపి ఉంచండి’ మళ్ళీ ప్రాధేయపడ్డాడు. మిషన్లు, మొరాయిస్తున్న ఊపిరి తిత్తులని ప్రయత్నపూర్వకంగా గాలితో నింపుతున్నాయి. గుండె చప్పుడుని పర్యవేక్షిస్తున్నాయి. మెదడు మేలుకొని ఉన్నదో లేదో గమనిస్తున్నాయి. ఒద్దు మొర్రో, నన్ను హాయిగా చావనియ్యండి అని బిగ్గరగా మొత్తుకోలేని అశక్త దేహం. దుర్మార్గమైన ఆట. ట్రీట్మెంట్ జరుగుతోంది!‘మణీ, అమ్మతో పాటు నువ్వు వుండు. పేషంట్‌తో ఒచ్చిన ఒక్కరికే బెడ్ ఇస్తారు. ఇంటి దగ్గర పిల్లలు కదా. నాకు ఇక్కడ ఉండటం కుదరదు. ఎటువంటి అవసరం వొచ్చినా వెంటనే ఫోన్ చెయ్యి’ ఏమంటానో అన్నట్లు నా మొహంలోకి చూశాడు. ఒక్క ఘడియ ఆలోచించి సరే చెప్పాను. పాత రోజుల్లో మనిషికి బాలేదంటే గుంపులుగా బంధువులు ఆస్పత్రి బైట నిలబడి అయినా ఉండేవారు. ఇప్పుడు అందరికీ అలా సాగడం లేదు. ఎవరి పనులు వారివి. ఎవరి జీవితం వారిది. చావు వేడుకలో పాలు పంచుకోవడం కోసం, బ్రతికిన వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం వుండటం లేదు.ఘడియలు ఒకదాని వెంట ఒకటి మెల్లగా కదులుతున్నాయి. రాత్రి ముప్పావు భాగం పైగా గడిచింది. చల్లటి గది. తెల్లటి నున్నటి నేల. సౌకర్యంగా పడుకోడానికి ఏర్పాట్లు. శుభ్రమైన బాత్ రూమ్. అన్నీ బావున్నాయి. ఆ మూల ఉన్న ఫోన్ బాలేదు. అది మోగిందంటే, ఎవరో ఒక పేషంట్ పేరు వినబడుతుంది. ఆ రోగి తాలూకా వాళ్ళకి పిలుపు వస్తుంది. భయం భయంగా వాళ్ళు గదిలోంచి బైటికి వెళతారు. మిగిలిన వాళ్ళు, మనకి సంబంధించిన పేరు కాదు అని తాత్కాలికంగా స్వాంతన చెందుతారు. నిన్న మొన్న చేరినట్లు ఉంది. అప్పుడే రెండు నెలలు పైనే. ఎప్పటి ఋణానుబంధమో. దీర్ఘ శ్వాస వొదిలి కళ్ళు మూశాను. మళ్ళీ ఎవరో తట్టారు. చప్పున కళ్ళు తెరిచాను.పెద్దావిడ!! ఇంటి దగ్గర రెండు అడుగుల దూరం జరగడాకి మంచాలు పట్టుకుని ఒంగి నడుస్తుంది. ఇప్పుడు మాత్రం నిటారుగా నిలబడి ఉంది. మోహం మాత్రం పాలిపోయి ఉంది. మచ్చుకైనా కళ లేదు. ఇక్కడికి ఎలా వొచ్చింది? ఇన్ని రూములు దాటి నా దాకా ఎలా వొచ్చింది? ‘మణీ, ఆ గొట్టాలు, వైర్లు అన్నీ అడ్డంగా ఉన్నాయి. చిరాగ్గా ఉంది. అవన్నీ పెట్టొద్దు తీసెయ్యమను. ఇక్కడ ఉండలేను. వాడితో చెబితే వినడం లేదు. నువ్వొచ్చి చెప్పు మణీ. ఏం బాలేదు మణీ. వెళ్ళిపోవాలని ఉంది. ఉండలేను మణీ’ బ్రతిమలాడుతుంది.‘అమ్మా, అసలు మీరు ఇక్కడికెలా వొచ్చారు?’ హైరానాగా కేక పెట్టి నేను దిగ్గున లేచి కూర్చున్నాను. పక్కనే మంచాల మీద నిద్ర పోతున్న వొకరిద్దరు నా చప్పుడికి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. చుట్టూతా చూశాను. ఎటువెళ్ళింది? ఒణుకు పుట్టింది. ఉలికిపాటుకు గురి చేస్తూ ఇంతలోకి గణగణా ఫోన్ మోగింది. ఇందాక కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చిన పిల్ల లేచి గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళింది.‘ఆవిడ తాలూకా ఎవరు?’ నా యజమానురాలి పేరు చెప్పి అడిగింది. ‘నేనే’ శాలువా తీస్తూ హడావిడిగా లేచాను. నా సెల్ ఫోన్ మోగింది. పెద్దావిడ కొడుకు. గుండెలు దడ దడ మంటున్నాయి. చేతులు కంపిస్తున్నాయి. ఫోన్ ఎత్తాను.‘మణీ, ఐదు నిమిషాల్లో వొచ్చేస్తున్నా’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. టైం చూశాను.ఈ సమయంలో ఆవిడ ఎలా వొచ్చింది? ఎలా వెళ్లింది? అబ్బాయి అర్జెంట్‌గా వస్తున్నట్లు ఫోన్ ఎందుకు చేశాడు. అక్కడికి వెళ్లి ఏ వార్త వింటాను? శాలువా లుంగ చుట్టి సంచిలో పెడుతుంటే పైనున్న కేలండర్ కింద పడింది. చేతిలోకి తీసుకుని చూశాను. వారం, నక్షత్రం మారాయి. కొద్దిసేపటిక్రితమే చవితి కూడా వెళ్ళిపోయింది. - ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి -
చుట్టేసే ట్యాబ్లెట్ ఇది...
ఫొటో చూస్తే విషయం అర్థమైపోతుంది. కెనెడాలోని క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ట్యాబ్లెట్ ఇది. స్క్రీన్‌ను ఉండలా చుట్టేయగలగడం దీని ప్రత్యేకత. డాక్టర్ రోల్ వెర్టిగాల్ నేతృత్వంలోని బృందం ఈ నమూనా యంత్రాన్ని తయారు చేసింది. వివరాలు చూస్తే.. ఏడున్నర అంగుళాల వెడల్పు ఉండే ఈ ట్యాబ్లెట్ స్క్రీన్‌పై చిత్రాలు 2కే రెజల్యూషన్‌లో కనిపిస్తాయి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తయారుచేసిన గొట్టం లాంటి ఆకారంపై ఈ తెరను చుట్టేయవచ్చు. గొట్టానికి రెండు చివరల చక్రాల్లాంటివి ఉంటాయి. వాటిని అటు ఇటు తిప్పితే స్క్రీన్‌పై ఉండే ఫొటోలు, వీడియోలు, సమాచారం కనిపిస్తుందన్నమాట. ఈ చక్రాలకు ఒకవైపు ఉండే కెమెరాలను వాడుకుంటే సంజ్ఞల ద్వారా కూడా ట్యాబ్లెట్‌ను పనిచేయించవచ్చు. మొబైల్‌ఫోన్, వాయిస్ రికార్డర్గానూ దీన్ని ఉపయోగించుకోవచ్చునని, అవసరం లేనప్పుడు ఎంచక్కా జేబులో పెట్టేసుకోవచ్చునని వెర్టిగాల్ తెలిపారు. ఈ వినూత్నమైన ట్యాబ్లెట్ వివరాలను ఈ వారం స్పెయిన్‌లో జరగబోయే మొబైల్ హెచ్సీఐలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. -
ఒక్క మాత్రతో మధుమేహానికి చెక్!
ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. మధుమేహం నయమైతే ఎలా ఉంటుందంటారూ? అబ్బో అద్భుతం ఆవిష్కారమైనట్లే కదూ. ఇంకొన్నాళ్లు ఆగితే ఇదే జరగబోతోంది. ఎందుకంటే బరువు తగ్గేందుకు చేసుకునే బేరియాట్రిక్ సర్జరీని తలపించేలా పనిచేసే ఓ కొత్త మాత్రను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బేరియాట్రిక్ సర్జరీతో బరువు తగ్గడమే కాకుండా కొంతమందిలో మధుమేహం కూడా నయమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలంగా గుర్తిస్తూ వస్తున్నారు. ఎందుకిలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం కాలేదు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న 20 వేల మందిలో 84 శాతం మందికి మధుమేహం అన్నది లేకుండా పోయినట్లు తెలిసింది. ఈ అంశం ఆధారంగా బ్రైగమ్, విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఒక మాత్రను అభివృద్ధి చేశారు. ఇది పేగుల్లోపల కొద్దిసమయంపాటు ఒక పూతను పూస్తుంది. ఫలితంగా ఆహారం తీసుకున్న తరువాత హఠాత్తుగా రక్తంలో చక్కెర శాతం పెరగడం దాదాపుగా ఉండదు. ఎలుకలపై ఇప్పటికే ఈ మాత్ర ప్రభావం బాగా ఉన్నట్లు స్పష్టమైందని, పూత పూయడం ద్వారా ఈ మాత్ర తాత్కాలికంగా బేరియాట్రిక్ సర్జరీ ప్రభావాన్ని సృష్టించిందని యూహాన్ లీ అనే శాస్త్రవేత్త చెప్పారు. -
జరం గోలీకీ దిక్కులేదు
► తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులపై కాగ్ అసంతృప్తి ► ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులు లేవు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య రంగం పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం అత్యవసర మందులూ అందుబాటులో లేవని, సాధా రణ మందుల విషయం గురించి చెప్పాల్సిన అవస రం లేదని పేర్కొంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, వసతులు న్నచోట సిబ్బంది లేరని వివరించింది. వివిధ విభాగాల పనితీరుపై కాగ్ ఇచ్చిన నివేది కలను పార్లమెంటుకు కేంద్రం సమర్పించింది . 2011–12 నుంచి 2016 వరకు ఐదేళ్ల కాలంలో వైద్య రంగానికి రూ. లక్ష కోట్లను కేంద్రం కేటాయించ గా..మౌలిక వసతులు, సిబ్బంది కొరత, నిధు ల వ్యయం, మళ్లింపు, మందుల సర ఫరా, ఆస్పత్రుల దురవస్థ అంశాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిశీలించి కాగ్ నివేదిక ఇచ్చింది. 2011 –12లో ఖర్చు చేయని నిధులు రూ. 7,375 కోట్లుండగా.. 2015–16 లో ఆ మొత్తం రూ. 9,509 కోట్లకు చేరిందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో వేరే పథకాలకు నిధులు మళ్లించారని తెలి పింది. ఎక్స్పైరీ తేదీలూ చూడరా?.. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్స్పైరీ తేదీలనూ చూడకుండా రోగుల కు మందులు ఇచ్చారని కాగ్ పేర్కొం ది. ఆశా వర్కర్ల వద్ద నవజాత శిశువుల బరువు కొలిచే, గర్భిణులకు బీపీ చూసే పరికరాలు, డెలివరీ, ప్రెగ్నెన్సీ కిట్లు, పారాసెటమల్, ఐరన్ మాత్ర లు వంటివేవీ లేవంది. ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో పలు పీహెచ్‌సీలు వైద్యులు లేకుం డానే పనిచేస్తున్నాయంది. 28 రాష్ట్రాల్లో కనీ సం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లూ లేవని తెలి పింది. దేశవ్యాప్తంగా అంబులెన్స్‌ల కోసం రూ. 175. 26 కోట్లు విడుదల చేస్తే రూ. 155. 93 కోట్లను వినియోగించనేలేదని పేర్కొంది. పరికరాలున్నా.. సిబ్బంది లేరు.. తెలంగాణ జనాభాకు అనుగుణంగా 768 పీహెచ్‌సీలకు గాను 668 మాత్రమే ఉన్నాయని.. మరో 78 సీహెచ్‌సీలు అవసరమని కాగ్ తెలిపింది. ఏపీలో మరో 25 పీహెచ్‌సీలు, 104 సీహెచ్‌సీలు అవసర మని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మౌలిక వసతులు లేవని తెలిపింది. అనేక హెల్త్ సెంటర్లకు ప్రజా రవాణా, విద్యుత్, తాగునీరు వసతి లేదని, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా వినియోగంలోకి రాలేదని వాపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరికరాలున్నా.. సిబ్బంది లేక నిరుపయోగంగా ఉన్నాయంది. ఈ రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులూ లేవని.. పారాసిటమల్, విటమిన్–ఏ, బీ–కాంప్లెక్స్, అల్బెండజోల్, గర్భ నిరోధక మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గైనకా లజీకి సంబంధించిన కిట్లు వంటివేవీ లేవని తెలిపింది. -
తరచూ జలుబు... తగ్గేదెలా?
ఇఎన్‌టి కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నాను. జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – చిన్నారావు, ఏలూరు మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది అన్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్ని సార్లు కింద కూడా పడిపోయాను. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా, పరిష్కారం సూచించండి. – పద్మనాభప్రసాద్, విజయవాడ మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
పేదల పాలిట దేవుడు!
సాధారణంగా ఎనభై ఏళ్ల వయసులో ఎవరైనా కాటికి కాళ్లు చాపుకొంటూ కూర్చుంటారు. సాయం పడితే తప్ప తమ పనులు చేసుకోలేని స్థితిలోకి జారుకుంటారు. అలాంటి వయసులో ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన గొప్ప సమాజసేవకు నడుం కట్టాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈయన కథేంటో మనమూ తెలుసుకుందాం..! ఈ రోజుల్లో పేదోడికి జబ్బు చేస్తే అంతే సంగతులు. ఆసుపత్రులు శ్రీమంతులకే సేవలు చేస్తారుు. ఈ వివక్ష ఓంకార్‌నాథ్ శర్మను తీవ్రంగా బాధించింది. కనీసం ఒక మాత్ర కూడా కొనలేని నిస్సహాయులను చూసి కదిలిపోయాడు. వారికోసం ఇంటింటికీ తిరిగి, వాడకుండా కాలపరిమితి దాటని టాబ్లెట్లను, టానిక్కులను సేకరించే పనిలో పడ్డాడు. ఇలా.. గత ఏడేళ్లుగా పేదవాళ్లకు మందుగోలీలు ఉచితంగా ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ నోరుుడాలోని కై లాష్ హాస్పిటల్ లో బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్‌గా పనిచేసి రిటైరైన ఓంకార్‌నాథ్‌ను 2008లో జరిగిన ఒక ఘటన పూర్తిగా మార్చేసింది. ఒకసారి తూర్పు ఢిల్లీలో మెట్రో పనులు జరుగుతుంటే.. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలిపోరుుంది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యారుు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. సరైన వైద్యం లేకపోవడంతో నరకం చూశారు వాళ్లు! ఆరోజే పేదలకోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణరుుంచుకున్నాడు. అలా మెడిసిన్ బాబాగా అవతారమెత్తాడు. మెడిసిన్ బాబా అడిగితే టాబ్లెట్లు లేవు అని ఎవరూ అనరు. అవసరం ఉన్నా సరే, వేరే తెచ్చుకుంటాంలే అని ఉన్నవన్నీ అతని చేతిలో పెడతారు. ఒకవిధంగా చెప్పాలంటే ఓంకార్ తమ వీధిలో కనిపించడమే మహాభాగ్యం అనుకుంటారంతా. అతనికి సాయపడుతున్నందుకు గర్వంగా కూడా ఉందని ప్రతీ ఒక్కరూ చెప్తుంటారు. ధనికులు ఉండే ఏరియాల కంటే.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, గవర్నమెంటు కాలనీవాసులే తన ఆశయానికి మద్దతు పలుకుతుంటారని చెబుతాడాయన. ఓంకార్ నాథ్ చేసే పని అంత సులభం కాదు. ఎన్నో అవాంతరాలు. అంతెందుకు అతను ఉంటున్న ఇల్లు కూడా సొంతం కాదు. భార్య, కొడుకు ఉన్నారు. విషాదం ఏంటంటే 45 ఏళ్ల తన కుమారుడు మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. నెలకు ఎంత లేదన్నా 4 నుంచి 6 లక్షల విలువైన మెడిసిన్స పంచుతాడు ఈ బాబా. ఆనోటా ఈనోటా విని మీడియా ఓంకార్నాథ్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలా మెడిసిన్ బాబాగా పాపులర్ అయ్యాడు. జనం కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకుని కాలేజీలు, గుళ్ల దగ్గర మెడిసిన్ కలెక్షన్ బాక్సులు పెట్టి మందులు సేకరిస్తున్నారు. ఈ మెడిసిన్ బాబాను పేదలపాలిట దేవుడు అంటే తప్పేం ఉండదేమో! -
జియో సపోర్ట్‌తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్ ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో విడుదల చేసింది. దీని ధరను రూ.12,799 గా కంపెనీ నిర్ణయించింది. ఈ టాబ్లెట్ లు ఇప్పటికే మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. స్లైడ్ క్యూ 27' ఫీచర్స్ 10.10 అంగుళాల డిస్ ప్లే 1.3గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 800x1280పిక్సెల్స్ రిజల్యూషన్ 2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5ఎంపి రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 5500ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆస్తమాకు సరికొత్త ఔషధం
లండన్: ఆస్తమా బాధితులకు ఒక తీపి కబురు.. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా ఉబ్బసం తీవ్రతను గణనీయంగా తగ్గించే సరికొత్త ట్యాబ్లెట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఈ ట్యాబ్లెట్ ఉబ్బసం లక్షణాలను తగ్గించి ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుందని, ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించి, వాయు నాళాలను శుభ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉబ్బసం చికిత్సలో ఈ ఔషధం కొత్త ఒరవడిని సృష్టించనుందని యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫర్ బ్రైట్లింగ్ అన్నారు. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉంది. -
బటన్ నొక్కితే విచ్చుకునే స్క్రీన్!
లండన్: ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లు ఎన్ని ఉన్నా... ఓ డెస్క్‌టాప్ కంప్యూటర్‌తో వచ్చే సౌలభ్యమే వేరు. విశాలమైన స్క్రీన్‌తో డెస్క్టాప్పై ఎలాంటి పవర్‌పాయింట్ ప్రెజెంటేషనైనా, ఎక్సెల్షీట్నైనా సులువుగా రన్ చేయవచ్చు. మార్పులు చేర్పులు చేయవచ్చు. కానీ పెద్ద సైజు వల్ల డెస్క్‌టాప్ కంప్యూటర్ను మనకు కావాల్సిన చోటుకు తీసుకెళ్లలేము. దీన్ని అధిగమించేందుకు వినూత్నమైన ఆలోచన చేశారు అలెగ్జాండర్ వీస్లీ. మీటనొక్కగానే విచ్చుకునే గొడుగు మాదిరిగా అరచేతిలో ఇమిడిపోయే హెచ్డీ డిస్ప్లేను సిద్ధం చేశాడు. ‘స్పడ్’ అని పిలుస్తున్న ఈ సరికొత్త కంప్యూటర్ డిస్ప్లే కొంచెం అటుఇటుగా సెట్‌టాప్ బాక్స్ సైజు ఉంటుంది. బటన్ నొక్కగానే ఒక్క సెకన్లో 24 అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది. వైర్‌లెస్‌గా కానీ హెచ్డీఎంఐ కేబుల్ ద్వారాగానీ ఇన్పుట్లు అందుకోవచ్చు. ప్రత్యేకమైన వినైల్‌తో తయారైన స్క్రీన్ 1280 ్ఠ 720 రెజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ నమూనాలు రెడీ అయిపోగా... వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వీస్లీ కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే ఒక్కో స్పడ్ ఖరీదు దాదాపు రూ. 21 వేల వరకూ ఉండవచ్చు.