Tej I Love You
-
ప్రేక్షకుల ఈలలే గొప్ప కాంప్లిమెంట్స్
‘‘నా ప్రతి సినిమాలో ‘తొలిప్రేమ’ హ్యాంగోవర్ కనిపిస్తుంటుందని అంటుంటారు. ఎందుకంటే నేను కరుణాకరన్‌ని కాబట్టి. అది నా స్టైల్. జనాలకు ఏది నచ్చుతుందో అది చేయడం డైరెక్టర్ పని. ‘తొలిప్రేమ’ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటే భయంగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ నెక్ట్స్ మళ్లీ స్టేట్ ఫస్ట్ ఎందుకు రాలేదు? అని అడిగితే స్టూడెంట్స్‌కు ప్రెషర్గా ఉంటుంది. నాక్కూడా సేమ్’’ అన్నారు కరుణాకరన్. సాయిధరమ్ తేజ్, అనుపమ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ శుక్రవారం రిలీజైంది. శనివారం కరుణాకరన్ మీడియాతో మాట్లాడారు. ► ‘సినిమా బావుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంద’ని రిలీజైన రోజు నుంచి ఫోన్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఈలలే బెస్ట్ కాంప్లిమెంట్స్. ‘తేజ్’ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్ కాదు. నా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘ఎందుకంటే ప్రేమంట’, ఇప్పుడు ‘తేజ్’లో హీరోయిన్లు గతం మర్చిపోతారన్నది కావాలని రిపీట్ చేయలేదు. అది స్క్రీన్ ప్లేలో ఒక భాగం. ‘డార్లింగ్’లో ‘ఫస్ట్ హాఫ్ అబద్ధం’ అనే స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. అలా ఒక్కొక్క లవ్ స్టోరీని ఒక్కో స్టైల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంటా. ► లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇంపార్టెంట్. అందుకని నా సినిమాలో హీరోలకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా చూడటానికి ఆడియన్స్ వచ్చినప్పుడు మంచి విజువల్స్, మ్యూజిక్, రొమాన్స్ ఉంటేనే ఎంటర్టైన్ అవుతారు. ఆండ్రూ విజువల్స్ చాలా బాగా చూపించారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడ్డారు. వీళ్లంతా లేకపోతే నేను లేను. ► ఇప్పటివరకు ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకున్నది ‘తొలిప్రేమ’ వల్లనే. ఒక స్టాండర్డ్ సెట్ చేసింది ఆ సినిమా కాబట్టి నా ప్రతి సినిమాను అదే సినిమాతో కంపేర్ చేస్తుంటారు. వణుకు వచ్చేస్తుంటుంది. నేను కూడా ‘తొలిప్రేమ’ కంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాను. నా కథకు తగ్గట్టు సాయిధరమ్ తేజ్, అనుపమ అద్భుతంగా చేశారు. ► మా ఫ్యామిలీ మొత్తం 32మంది ఉంటారు. బాబాయిలు, మావయ్యలు, ఇలా చాలా మంది ఉంటాం. మా పిన్ని కూడా నన్ను కొడుకులానే చూస్తుంటారు. అదే నా సినిమాల్లో చూపిస్తాను. నా సినిమాకు వెళ్తే అందరూ ఎంజాయ్ చేయాలి. నా లైఫ్‌లో జరిగే బెస్ట్ మూమెంట్స్‌ని నా సినిమాలో వాడేస్తాను. అందులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ‘వద్దు సరోజా...’ ఎపిసోyŠ ఒకటి. మంచి మూమెంట్స్ అన్ని డైరీలో రాసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటాను (నవ్వుతూ). నా ఫస్ట్ లవ్ స్టోరీ డిజాస్టర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మేమిద్దరం లవ్‌లో ఉన్నాం. ► కేయస్ రామారావుగారు లెజెండ్. ఆయనతో సెకండ్ టైమ్ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 45 సినిమాలు చేశారు. ఎప్పటినుంచో సినిమాలు తీస్తున్నారు. కథ విని మంచి సలహాలు ఇస్తారు. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు. -
‘తేజ్ ఐ లవ్ యు’ మూవీ రివ్యూ
టైటిల్ : తేజ్ ఐ లవ్ యు జానర్ : రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తారాగణం : సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్, జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, అనీష్ కురివిల్లా సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : కరుణాకరన్ నిర్మాత : కేయస్ రామారావు మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలు అందుకున్నా.. తరువాత కెరీర్ గాడి తప్పింది. మాస్ హీరోయిజం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో.. ఈ సారి తేజ్ ఐ లవ్ యు అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ, డార్లింగ్ లాంటి లవ్ స్టోరిలను తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో లవర్‌బాయ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కరుణాకరన్ కెరీర్‌కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో రిజల్ట్ మీద ఆసక్తి నెలకొంది. మరి తేజ్ ఐ లవ్ యు ఈ ఇద్దరి కెరీర్లకు బ్రేక్ ఇచ్చిందా..? కథ; తేజ్ (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలోనే అమ్మానాన్నకు దూరం కావటంతో పెద్దమ్మ(పవిత్రా లోకేష్) పెదనాన్న(జయ ప్రకాష్), పిన్నీ బాబాయ్‌లు గారాభంగా చూసుకుంటుంటారు. కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకునే తేజ్, పదేళ్ల వయస్సులో ఓ మహిళను కాపాడే ప్రయత్నంలో హత్య చేసి జైలుకెళతాడు. (సాక్షి రివ్యూస్) ఏడేళ్ల శిక్ష తరువాత ఇంటికి తిరిగి వచ్చిన తేజ్‌ను ఆ కుటుంబం మరింత ప్రేమగా చూసుకుంటుంది. తేజ్ ప్రతీ పుట్టిన రోజును పండగలా చేస్తుంటుంది. కానీ ఓ సంఘటన మూలంగా తేజ్‌ను ఇంటి నుంచి గెంటేస్తారు. ఇంట్లో నుంచి వచ్చేసిన తేజ్ హైదరాబాద్‌లోని బాబాయ్ (పృథ్వీ) ఇంట్లో ఉంటూ మ్యూజిక్ ట్రూప్‌లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో ఓ కుర్రాడి అడ్రస్ కోసం వెతుకుతూ లండన్ నుంచి ఇండియాకు వచ్చిన నందిని (అనుపమా పరమేశ్వరన్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు తేజ్. (సాక్షి రివ్యూస్)నందిని కూడా తేజ్‌తో ప్రేమలో పడుతుంది. కానీ తేజ్‌కు తన ప్రేమ గురించి చెప్పాలనుకున్న సమయంలో ఓ యాక్సిడెంట్లో నందిని గతం మర్చిపోతుంది. నందినికి తిరిగి గతం గుర్తుకు వచ్చిందా..? నందిని లండన్ నుంచి ఇండియాకు ఎవరి కోసం వచ్చింది..? నందిని, తేజ్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరో రోల్స్ లో మెప్పించిన సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించాడు. తనదైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. నటన పరంగా ఆకట్టుకున్నా లుక్స్ పరంగా ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేది. (సాక్షి రివ్యూస్)తెర మీద తేజ్ చాలా బొద్దుగా కనిపించాడు. అంతేకాదు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ఇమిట్ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరణ్ ఒదిగిపోయింది. తనకున్న హోమ్లీ ఇమేజ్ను పక్కన పెట్టి మోడ్రన్ లుక్‌లోనూ అదరగొట్టింది. జయప్రకాష్, పవిత్రా లోకేష్‌ల నటన కంటతడిపెట్టిస్తుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వైవా హర్షలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; కరుణాకరన్ సినిమా అంటే యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తొలిప్రేమ, డార్లింగ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కరుణాకరన్ ఇటీవల ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని ఓ ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మరోసారి కరుణాకరన్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తన హిట్ చిత్రాల స్థాయిలో ఎమోషన్స్‌ను పండించలేకపోయాడు.(సాక్షి రివ్యూస్) చాలా చోట్ల కరుణాకరన్ గత చిత్రాల ఛాయలు కనిపించటం కూడా ఇబ్బంది పెడుతుంది. కథా పరంగా బలమైన ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా.. సాదాసీదా కథనంతో నడిపించేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ప్రేక్షకుడ్ని కథలో లీనం చేసే స్థాయి ఎమోషనల్ సీన్ ఒక్కటి కూడా లేకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ వర్క్ అవుట్ అయినా.. సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రం లేదు. రొమాంటిక్ ఎంటర్టైనర్కు సంగీతం చాలా ఇంపార్టెంట్. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ నిరాశపరిచాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని కామెడీ సీన్స్ హీరోయిన్ పాత్ర మైనస్ పాయింట్స్ ; సంగీతం స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మరోసారి తెరమీదకు మెగా మల్టీస్టారర్.!
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుబ్బిరామి రెడ్డి లాంటి వారు ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినా.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తేజ్ ఐ లవ్ యు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న అల్లు అరవింద్ తొలిప్రేమ సినిమా సమయంలో జరిగిన సంఘటన వివరించారు. తొలిప్రేమ షూటింగ్ సమయంలో సెట్ వెళ్లిన అరవింద్ చిరు, పవన్‌ల కాంబినేషన్లో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నా అది నువ్వే డైరెక్ట్ చేయాలని దర్శకుడు కరుణాకరన్‌కు చెప్పారట. అయితే కరుణాకరన్ మాత్రం అంతటి బాధ్యతను తాను మోయలేని భయపడిపోయాడన్నారు అరవింద్. ఈసందర్భంగా ఎప్పటికైన వారిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమాను తానే నిర్మిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా పనుల్లో బిజీగా ఉండగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌ను అరవింద్ ఎప్పటికీ.. ఎలా సెట్ చేస్తారోచూడాలి. -
పోస్టర్లో పేరులా నిర్మాత మిగిలిపోకూడదు
నిర్మాతకు ఫ్రీడమ్ లేదంటుంటారు. అసలు ఫ్రీడమే నిర్మాతది కదా. అతనికి ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి? ఓ మంచి సినిమా తీయడం కోసం కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలగాలి. తన టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమా తీయించుకోవాలి’’ అని కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్ ఐలవ్ యు’. క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘తేజ్ ఐ లవ్యూ’ మా బ్యానర్లో వస్తున్న 45వ సినిమా. ఇప్పటివరకూ మా బ్యానర్లో నిర్మించిన మంచి చిత్రాల్లో ఇది మరో మంచి చిత్రం. లవ్, ఎమోషన్స్, మంచి ఫీల్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. గోపీసుందర్ సంగీతం, కరుణాకరన్ టేకింగ్ స్టైల్, ఆండ్రూ అందమైన ఫొటోగ్రఫీ, సాయి ధరమ్– అనుపమ పెయిర్ మా సినిమాకు ప్లస్. ► నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 6 దశాబ్దాలు అవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నప్పటి నుంచి కథలు వినడం, చదవడం అలవాటైంది. అది మా బ్యానర్లో నిర్మించిన చిత్రాల కథల సెలెక్షన్‌కి ఉపయోగపడింది. మొదట్లో సినిమాలకు రేడియోల ద్వారా పబ్లిసిటీ చేసేవాణ్ణి. అప్పట్లో అందరూ నన్ను రేడియో రామారావు, పబ్లిసిటీ రామారావు అని కూడా పిలిచేవాళ్లు. డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను అంత క్యాపబుల్ కాదేమో అనుకుంటాను. అప్పట్లో సౌందర్యకు ఓ కథ కూడా చెప్పాను. ► నిర్మాతలు రెండు రకాలు ఉంటారు. కేవలం పోస్టర్ మీద పేరులా ఉండేవాళ్లు ఒక రకం. మంచి కంటెంట్‌తో సినిమా తీద్దాం. మన బ్యానర్ పేరు గుర్తుండిపోయేలా సినిమా తీయాలని అనుకునేవాళ్లు మరో రకం. నిర్మాతలు అనే వాళ్లు కేవలం కాంబినేషన్ సెట్ చేసేవాళ్లు కాదు. ► కొత్త నిర్మాతలు వస్తున్నారు.. వెళ్లిపోతున్నారు అనడం కరెక్ట్ కాదు. ‘రంగస్థలం’ తీసింది కొత్తవాళ్లే. ‘బాహుబలి’ తీసింది కూడా కొత్తవాళ్లే కదా. కొత్త పాత అని ఉండదు. ఎంత ఇష్టంతో నిర్మాత సినిమా తీశారన్నది ముఖ్యం. ► రచయిత యండమూరితో మళ్లీ అసోసియేట్ అవ్వడం లేదా? అని అడుగుతున్నారు. ఆయన నవలలు రాయడం తగ్గించాడు. నేను సినిమాలు తీయడం తగ్గించాను కదా (నవ్వుతూ). ► రామ్ చరణ్ ఫస్ట్ సినిమా నుంచి ఆయన నెక్ట్స్ సినిమా తీయాలనే అనుకున్నాను. ఎవ్వరైనా అనుకుంటారు. చిరంజీవిగారితో కూడా మళ్లీ ఓ సినిమా తీయాలనుంది. ఛాన్స్ ఉంటే చరణ్ కంటే ముందే చిరంజీవిగారితో సినిమా తీయాలనుంది. చిరంజీవిగారితో దాదాపు నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. ఆయనకు, నాకు మధ్యలో కొన్ని డిస్ట్రబెన్స్ వచ్చినా ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ పేజీని మేమిద్దరం ఎప్పుడో తిప్పేశాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో డిస్ట్రబెన్సెస్ జరుగుతుంటాయి. కానీ అనవసరమైన వాటిని అవసరమైన దానికంటే ఎక్కువ చూపించకూడదని నా ఉద్దేశం. ► మా బ్యానర్లో నెక్ట్స్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ విపరీతంగా పెరిగింది. మంచి కంటెంట్‌తో సినిమా తీయాలని దర్శకులందరిలో పోటీ వాతావరణం ఉంది. ఇది మంచి పరిణామం. -
‘తేజ్’పై చెర్రీ కామెంట్!
కొంతకాలంగా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని రొటీన్ కథలను ఎంచుకోకుండా...ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే కరుణాకరన్ డైరెక్షన్లో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి మూవీపై హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో మిలియన్ వ్యూస్దాటి ట్రెండింగ్‌లో నడుస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ‘విజువల్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. కరుణాకరన్ నుంచి హిట్ సినిమా రాబోతోంది. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. కేయస్ రామారావు, సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. రామ్ చరణ్‌కు సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌లు ధన్యవాదాలు తెలిపారు. -
అభిలాషకి జరిగినట్లుగానే తేజ్‌కి జరిగింది – సాయిధరమ్ తేజ్
‘‘ఈ సినిమా టోటల్ క్రెడిట్ హీరో సాయిధరమ్ తేజ్‌కే చెందుతుంది. ఎందుకంటే నాకు తేజ్ డేట్స్ ఇచ్చిన ఏడాదిన్నర వరకు మంచి కథలు దొరకలేదు. ఓ రోజు ఫోన్ చేసి ‘నేను ఒక కథ విన్నాను. నాకు నచ్చింది, మీకు న చ్చితే ఆ సినిమా చేద్దాం’ అని తేజ్ అన్నారు. కరుణాకరన్ వచ్చి కథ చెప్పారు. నాకు నచ్చటంతో సినిమా స్టార్ట్ అయ్యింది. యూత్‌ను ఆకట్టుకునే సినిమా ఇది. నా బ్యానర్లో ఎన్నో íß ట్ సినిమాలు నిర్మించాను. వాటికి ఏ మాత్రం తగ్గకుండా మా బ్యానర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్ అవుతుంది’’ అన్నారు కేయస్ రామారావు. సాయిధరమ్ తేజ్ , అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యూ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పలువురు సినీ పి.ఆర్.ఓ (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్)ల సమక్షంలో సాయిధరమ్, ఇంద్ర ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం సాయిధరమ్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు నటించిన ‘అభిలాష’ సినిమా పబ్లిసిటీ పి.ఆర్.ఓలు, జర్నలిస్టులతో ప్రారంభమైందని విన్నాను. నేను నటించిన ‘తేజ్’ సినిమా ట్రైలర్కూడా పి.ఆర్.ఓల సమక్షంలో జరగటం ఆనందంగా ఉంది. కరుణాకరన్‌గారు మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కేయస్ రామారావుగారికి కథ నచ్చాకే సినిమాను స్టార్ట్ చేశాం. మంచి సినిమా తీశాం. గోపీసుందర్ సంగీతం, ‘డార్లింగ్’ స్వామి మాటలు, ఆండ్రూ కెమెరా పనితనం, సాహీ సురేశ్ ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు ఎస్సెట్స్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమాలో లవ్ ఫీల్ ఉంది. కరుణాకరన్‌గారికి మంచి హిట్, కేయస్ రామారావు గారికి బాగా డబ్బు రావాలి’’ అని మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి అన్నారు. -
‘తేజ్’ ట్రైలర్ విడుదల
-
‘తేజ్’ ట్రైలర్ విడుదల
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం ఓ హిట్ కావాలి. మెగా హీరోల్లో గత కొంతకాలం పాటు విజయాలు లేక డీలాపడ్డాడు. వరుస డిజాస్టర్స్‌తో ఉన్న ఈ హీరో, తన టాలెంట్‌ని మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని చూస్తోన్న డైరెక్టర్ కరుణాకరన్‌తో కలిసి తీసిన సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, లుక్స్, పాటలకు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటకు మంచి మార్కులే పడుతున్నాయి. గోపి సుందర్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆమె టార్చర్ పెట్టింది : సాయిధరమ్
లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందిన చిత్రం ‘తేజ్’.. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్ రామారావు నిర్మించారు. ‘తేజ్’ మూవీలో హీరోయిన్ అనుపమా తనను టార్చర్ పెట్టిందని, ఇదిగో ప్రూఫ్ అంటూ సాయిధరమ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొంతసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 6న రిలీజ్‌కు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఆండ్రూ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహ నిర్మాత: వల్లభ. -
హీరోయిన్ టార్చర్ పెట్టింది..ఇదిగో ప్రూఫ్
-
చిరంజీవితో అర నిమిషమైనా నటించాలని ఉంది
‘‘నా అభిమాన హీరో చిరంజీవి. ఆయన గొప్ప నటుడు.. చాన్స్ వస్తే చిరంజీవిగారితో అర నిమిషమైనా నటిస్తే నా జన్మ ధన్యమైనట్లే’’ అని హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ అన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న అనుపమ శనివారం విజయవాడలో జరిగిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. పలు విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘తేజ్ ఐలవ్ యూ’ మంచి లవ్‌స్టోరీ. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. నేను నటించిన ‘అ..ఆ’ చిత్ర విజయోత్సవం గుంటూరులో జరిగింది. అప్పుడే విజయవాడ గురించి, ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ఆలయం గురించి తెలుసుకున్నాను. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉంది. నా అభిమాన నటి నిత్యామీనన్. సావిత్రిగారు గొప్ప నటి. ఆమె గురించి ఇటీవలే ‘మహానటి’ సినిమా చూసి తెలుసుకున్నాను. ప్రస్తుతం ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు బాగానే ఉన్నాయి. నా వరకూ బాగానే ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. రామ్ సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో నటిస్తున్నాను. నటిగా మంచి గుర్తింపు పొందాలనేది నా ఆకాంక్ష. ముందు తెలుగు మాట్లాడటం రాక ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
‘తేజ్..’ అందమైన ప్రేమకవితలాంటి సినిమా!
సాక్షి, హైదరాబాద్ : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘తేజూ.. ఐ లవ్ యూ’. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ తాజాగా నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కేఎస్ రామారావు, దర్శకుడు కరుణాకరన్, హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడతూ.. ‘ఈ సినిమా కరుణాకరన్ బ్రాండ్ తగినట్టు ఉంటుంది. అందమయిన లవ్ స్టోరీ తీశాం. అందమయిన ప్రేమకవితలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. ‘క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్‌లా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. హీరో తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో బాగా సక్సెస్ అయ్యింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. జులై 6న ఈ సినిమా విడుదల అవుతుందని తెలిపారు. ఇది క్యూట్ సినిమా అని, తన లైఫ్‌లో ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. -
తేజ్ ఐ లవ్ యూ సినిమా ప్రమోషన్
-
‘తేజ్’ వాయిదా పడిందా!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. సాయిధరమ్ ‘సుప్రీం’ సినిమా తరువాత వచ్చిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే డైరెక్టర్ కరుణాకరన్‌తో ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే సినిమాను చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొదటగా జూన్ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ముందు అనుకున్న తేదీ కాకుండా జూలై 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాయి ధరమ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, ఈ మూవీకి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. -
‘లవ్ యూ మామయ్య’
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’. నిన్న (జూన్ 9) జరిగిన ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ రాకతో ఈ ఫంక్షన్‌కు క్రేజ్ ఏర్పడింది. వేడుకలో చిరు ప్రసంగం కూడా అందరిని ఆకట్టుకుంది. కే ఎస్ రామారావు, తనకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోవడం, తొలిప్రేమ సినిమా గురించి మాట్లాడుతూ పవన్ టాపిక్ తీయడం మెగా అభిమానులను అలరించింది. అయితే ఈ వేడుకకు హాజరైనందుకు చిరంజీవికి మెగా మేనల్లుడు ధన్యవాదాలు తెలియజేశారు. వేడుకలోనే ధన్యవాదాలు తెలిపినప్పటికీ మళ్లీ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా తన కృతజ్ఞతలను తెలియజేశారు. ‘ థ్యాంక్యూ సో మచ్ మామయ్య.. మీరు ఫంక్షన్‌కు వచ్చి మా జీవితాల్లో నింపిన ఆనందాలను మా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటాం. లవ్ యూ మామయ్య- తేజ్ ఐ లవ్ యూ బృందం’ అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. Thank you so much mamayya .... you made our lives special.......your presence gave us memories that we would cherish throughout our lives... love you mamayya ❤️ -team Tej I love you pic.twitter.com/ruq5vBX5bm — Sai Dharam Tej (@IamSaiDharamTej) June 10, 2018 -
ఈ జన్మకు ఇది చాలదా అనిపిస్తుంటుంది
‘‘మీ (ఫ్యాన్స్) ఈలలు, చప్పట్లు, కేరింతలు ఎప్పుడు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎడారిలో దాహంతో ఉన్నవాడికి నీళ్లిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంతటి ఆనందం అనుభవిస్తా’’ అని హీరో చిరంజీవి అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1980వ దశకంలో చిరంజీవికి ఎక్కువ సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయన్నా, నవలా కథానాయకుడని పేరు తెచ్చుకున్నాడన్నా, ఎవరికీ లేని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయన్నా.. ముఖ్యంగా ఇళయరాజాగారి నుంచి వచ్చాయన్నా.. సుప్రీమ్ హీరోగా ఉన్న నా పేరుని ఈ రోజు మెగాస్టార్ అని ముద్దుగా, ఆప్యాయంగా పిలుస్తున్నారన్నా, ఆ పేరు నాకు ఎవరు ఆపాదించారన్నా వాటన్నింటికీ సమాధానం ఒక్కటే ‘క్రియేటివ్ కమర్షియల్స్’. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం’.. వరుస హిట్లు వచ్చాయి. అలాంటి మంచి సినిమాలిచ్చిన నిర్మాత రామారావుగారు. ‘అభిలాష’ సమయంలో నాకు ఆయన పరిచయం. నెల్లూరులో మా అమ్మగారు యండమూరి ‘అభిలాష’ నవల చదివారు. అందులో హీరో పేరు చిరంజీవి. ‘ఆ నవల చదువుతుంటే నువ్వే గుర్తొచ్చావు, సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రామారావుగారు ‘అభిలాష’ నవల హక్కులు తీసుకున్నా. మీరు డేట్స్ ఇస్తే సినిమా చేద్దామన్నారు. వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్లో రామారావుగారిని మరచిపోలేను. ఇన్నేళ్ల తర్వాత ఆయనకి సభా ముఖంగా ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం లభించింది. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చాక కూడా ఆయన మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. అలాంటి ఆయన బ్యానర్లో ‘స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్’ లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చాం. ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే తప్పు ఆయనది కాదు నాది. కథ నచ్చింది. డైరెక్టర్‌గా యండమూరిని పెడదామన్నారు. ఆయన డైరెక్షన్లో చేయాలనే కోరిక నాకూ ఉండటంతో సరే అన్నాను. దానికంటే ముందు యండమూరి తీసిన ‘అగ్నిప్రవేశం’ అనుకున్నంత సక్సెస్ కాలేదు. బయ్యర్స్ నుంచి ఒత్తిడి ఉండటంతో పునరాలోచనలో పడి డైరెక్టర్ని మారుద్దామన్నారు రామారావుగారు. నేను వద్దన్నాను. ఆ సినిమా నా వల్లే ఫ్లాప్ అయిందని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు యండమూరిగారు. రామారావుగారి అభిరుచి మేరకు డైరెక్టర్ని మార్చుంటే ఫలితం ఎలా ఉండేదో? ఆ తర్వాత ఆయన ‘చంటి’ వంటి మంచి సినిమాలు తీస్తూ హిట్స్ అందుకున్నారు. ఈ మధ్యలో కొంచెం మా మధ్య గ్యాప్ వచ్చింది. మెగాస్టార్‌తో కానీ, వారి కుటుంబ సభ్యులతో కానీ సినిమా తీయలేకపోతున్నాననే లోటు ఆయన నాతో వ్యక్తపరిచారు. అయితే తేజూతో ఈ సినిమా తీయడం ద్వారా ఎంతో కొంత తృప్తి చెందానని ఆయన చెప్పడం హ్యాపీ. ఈ మధ్య రామ్ చరణ్ ‘డాడీ.. నేనిప్పటి వరకూ డైరెక్టర్, కథ ఏంటని చూసి ఆ తర్వాత నిర్మాత ఎవరని చూస్తా. ఎందుకో రామారావుగారితో ఓ సినిమా చేయాలనిపిస్తోంది.. కచ్చితంగా చేస్తాను’ అన్నాడు. ఈ జనరేషన్ వాళ్లు ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నారంటే ఆయనేంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఈ సినిమాతో మళ్లీ తన వైభవాన్ని తీసుకొస్తారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకు కారణం కరుణాకరన్. లవ్‌స్టోరీస్ తీయడంలో అతనికి అతనే సాటి. తెలుగు మేగజైన్స్ కవర్ పేజీలోని నా ఫొటోలను కట్ చేసి, వాటిని ఆల్బమ్‌గా చేసినటువంటి పెద్ద ఫ్యాన్ కరుణాకరన్. చదువుకున్న విజ్ఞులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్, యంగ్ డైరెక్టర్స్.. వీళ్లందరూ నన్ను ఇంతగా అభిమానిస్తున్నారంటే ఈ జన్మకు ఇది చాలదా? ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంటుంది నాకు. వీళ్లందరికీ (మెగా హీరోలు) నా నుంచి సంక్రమించింది నా ఇమేజ్ మాత్రమే కాదు కష్టపడే మనస్తత్వం. కష్టపడి పనిచేస్తున్నారా? లేదా? క్రమశిక్షణగా ఉంటున్నారా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. అంతేకానీ వారి సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నవి సెకండ్రీ. తేజ్ నా గుడ్ బుక్స్‌లో ఎప్పుడూ ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే వాళ్ల అమ్మకంటే ముందు వార్న్ చేసేది నేనే. ఆ అవకాశం తేజు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇవ్వడు కూడా. ‘తేజ్ ఐ లవ్ యు’ రషెస్ చూశా. కనుల పండువగా ఉంది. చక్కటి ఫ్యామిలీ, లవ్‌స్టోరీ. మిమ్మల్నందర్నీ అలరిస్తుంది. గోపీసుందర్ పాటలు చాలా బాగున్నాయి. అనుపమ మంచి నటన, భావోద్వేగాలు కనబరిచింది’’ అన్నారు. కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అందుకే ఆయన సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే మెగాస్టార్. ఆయన్ను చూసి ఇండస్ట్రీ ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కరుణాకరన్‌గారు నాకు కావాల్సిన సినిమా తీసిపెట్టారు’’ అన్నారు. ‘‘నాకు మామూలుగానే మాట్లాడటం రాదు. చిరంజీవి అన్నయ్య ఉన్నప్పుడు గుండె దడదడలాడుతుంది. సినిమా కల ఇచ్చింది పెద్ద అన్నయ్య చిరంజీవి. డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చింది చిన్న అన్నయ్య కల్యాణ్.ఇప్పుడు తమ్ముడు తేజ్‌తో సినిమా చేశా’’ అన్నారు కరుణాకరన్.‘‘నేను నిద్ర లేవగానే మా మావయ్య చిరంజీవిగారి ముఖం (ఫొటో) చూసి గుడ్ మార్నింగ్ చెబుతా. ఆయన ఆశీర్వాదం లేకుండా నా జీవితం సాగదు’’ అన్నారు సాయిధరమ్. సహనిర్మాత వల్లభ, కెమెరామెన్ అండ్రూ.ఐ, సంగీత దర్శకుడు గోపీసుందర్, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
బావ.. బావమరిది.. సిటీలో సందడి
మెగా హీరోలు రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్‌లు శుక్రవారం సిటీలో సందడి చేశారు. చందానగర్‌లో ఓ మొబైల్ స్టోర్‌ను ప్రారంభించిన రామ్‌చరణ్ అభిమానులను పలకరిస్తూ..వారితో ఫొటోలు దిగారు. కూకట్‌పల్లిలో సాయిధరమ్ తేజ్ తన మూవీ ‘తేజ్’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుపమా పరమేశ్వరన్తో సెల్ఫీలు దిగారు. కూకట్‌పల్లిలో తేజ్ సందడి మూసాపేట : కూకట్‌పల్లిలోని లాట్ మొబైల్ షోరూమ్‌లో శుక్రవారం ‘తేజ్’ సినిమా నటీనటులు సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌లు సందడి చేశారు. తేజ్ ఐ లవ్యు సినిమాలోని ‘నచ్చుతుందే..’ పాటను విడుదల చేశారు. అనంతరం తేజ్ లాట్ మొబైల్ ఆఫర్స్‌ను ఆవిష్కరించారు. క్రియేటివ్ బ్యానర్స్ ఎంతో చరిత్ర గలదని, ఈ బ్యానర్లో పనిచేయటం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ కరుణాకర్, నిర్మాత కె.ఎస్.రామారావు, లాట్ మొబైల్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. హ్యాపీ మొబైల్ స్టోర్ ప్రారంభించిన చెర్రీ చందానగర్ : హీరో రామ్‌చరణ్ రాకతో చందానగర్‌లో సందడి నెలకొంది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్‌ను రామ్‌చరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా హ్యాపీ మొబైల్స్ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. అభిమానుల మధ్య హ్యాపీ మొబైల్ స్టోర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో సంచలనాత్మక రీతిలో ఒకే రోజు 20 షోరూంలను ప్రారంభిస్తున్నామని హ్యాపీ మొబైల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణపవన్ తెలిపారు. మెగా ఆఫర్ ప్రారంభించిన మొదటి నెల రోజులు రెండు కోట్ల విలువ గల బహుమతులు, ప్రతి కొనుగోలుపై ఒక బహుమతి ఇస్తున్నామని చెప్పారు. -
మేనల్లుడికి గెస్ట్‌గా...
సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 9న జరగనుంది. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి అటెండ్ కానున్నారు. ‘‘నువ్వు నా ప్రపంచం. థ్యాంక్యూ మామా’’ అని ఈ సందర్భంగా సాయిధరమ్ పేర్కొన్నారు. -
‘తేజ్..’ ఆడియోకి మెగాస్టార్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యు. ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేయస్ రామారావు, వల్లభలు నిర్మిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ సాయి ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా తన వయసు తగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. జూన్ 9న ఆడియో రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన తేజ్ ఐ లవ్ యు సినిమాను జూన్ 29న రిలీజ్ కానుంది. -
‘తేజ్’ ప్రీమియర్ క్రికెట్ లీగ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో బిజీగా ఉన్నారు. గత కొంత కాలం నుంచి ఈ మెగా హీరో నటించిన సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించడం లేవు. మాస్ సినిమాలు తీసి ప్రేక్షకులకు బోర్ కొట్టించిన ఈ హీరో ప్రస్తుతం లవ్‌స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్స్‌పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కరుణాకరన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీని తన గత సినిమాల్లానే మంచి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా జూన్ 2న ఆర్జే ( రెడియో జాకీ) వర్సెస్ తేజ్ ఐ లవ్ యూ టీమ్ క్రికెట్ లీగ్ ఆడబోతోంది. గెలిచిన వారి చేతుల మీదుగా ఈ మూవీలోని మొదటి సాంగ్‌ను విడుదల చేయించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘అందమైన చందమామ’ అనే ఈ ఫస్ట్ సాంగ్‌ను ఎవరు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. A crazy movie, A crazy gang, A super crazy song launch! 🤟 TEJ Premier League 🏏🏏🏏 Our movie team vs RJ's team. Join the fun and be a part of the #TejILoveYou madddnesss... @IamSaiDharamTej @anupamahere pic.twitter.com/CFvsngfj9O — Creative Commercials (@CCMediaEnt) May 31, 2018 -
‘డార్లింగ్ కాదు తేజ్ ఐ లవ్ యు’
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో తేజ్ ఐ లవ్ యు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ గిటార్ తగిలించుకొని మైక్ పట్టుకొని పాట పాడుతున్న స్టిల్ ను రిలీజ్ చేశారు అయితే ఈ స్టిల్ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ స్టిల్ లా ఉందంటు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన సాయి ధరమ్ ‘కేవలం గిటార్ తగిలించుకొని మైక్ పట్టుకున్నంత మాత్రానా డార్లింగ్ కాదు.. ఇది తేజ్ ఐ లవ్ యు’అంటూ కామెంట్ చేశాడు. Just because I have a guitar and I hold a 🎤 doesn’t mean its darling..... and it’s Tej...I love you 😉 pic.twitter.com/aSzk8QDYnq — Sai Dharam Tej (@IamSaiDharamTej) 30 May 2018 -
ప్లాఫ్ ఇచ్చిన డైరెక్టర్‌తో మళ్లీ మెగాహీరో
ఈ మధ్య మెగా హీరోల్లో అసలు టైమ్ కలిసిరానిది సాయిధరమ్తేజ్కే. రామ్ చరణ్, వరుణ్ తేజ్ విజయాలతో దూసుకెళ్తుంటే.. ఈ హీరో మాత్రం విజయాన్ని చూసి చాలా కాలమైంది. సుప్రీం సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు ఈ హీరో ఖాతాలో. రీసెంట్గా వచ్చిన ఇంటెలిజెంట్ దారుణంగా బెడిసికొట్టింది. మాస్ మంత్రం జపిస్తూ... ఒకే ధోరణిలో సినిమా చేస్తున్న ఈ సుప్రీం హీరో ప్రస్తుతం ట్రాక్ మార్చినట్టు కనిపిస్తోంది. కరుణాకరన్‌తో తేజ్ ఐలవ్యూ, కిషోర్తిరుమలతో మరో లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. విన్నర్ లాంటి డిజాస్టర్‌ను ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో ప్రాజెక్టును చేయబోతున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కామెడీ, మాస్ అంటూ సినిమాలు చేసే ఈ డైరెక్టర్ మరి ఈ సారి ఈ హీరోను ఎలా చూపిస్తారో..వేచి చూడాలి. జె.భగవాన్– జె.పుల్లారావు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
మంచి ఫీల్
‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి లవ్ ఫీల్‌తో సాగుతుంది. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: అండ్రూ.ఐ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహనిర్మాత: వల్లభ. -
తేజ్..ఐ లవ్ యూ టీజర్ విడుదల
-
‘తేజ్ ఐ లవ్ యూ’ టీజర్
కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డాడు. యంగ్ డైరెక్టర్‌లనుంచి స్టార్ డైరెక్టర్ల వరకు ఎవ్వరూ తేజ్ కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయారు. దీంతో కాస్త రూట్ మార్చి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సాయి ధరమ్. కరుణాకరన్ డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తేజ్.. ఐ లవ్ యూ. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. తేజ్ ఫస్ట్ ఫీల్ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్లో కరుణాకరన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అనుపమా పరమేశ్వరన్ ఈ చిత్రంలో తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిన సాయి ధరమ్ కెరీర్‌ను గాడిలో పెడుతుందేమో చూడాలి.