telangana polls
-
సీఎం పదవిపై భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని తాను ఆశించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కేంద్ర నాయకులు ఏ పదవి ఇచ్చినా.. నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఖాయమని ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అటు.. పాదయాత్రతోనూ భట్టి మంచి ప్రజాధరణ పొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి అత్యున్నత పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌కు దక్కనుందని మేధావులు ఊహించారు. భట్టి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కేంద్ర అధిష్ఠానం తర్జన భర్జన పడింది. చివరకు రేవంత్ పేరును ఖరారు చేశారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రుల పేర్లను కూడా అధిష్ఠానం ఎంపిక చేసింది. వారంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. -
తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే..
హైదరాబాద్: తెలంగాణలో మరికాసేపట్లో ప్రభుత్వం కొలువుదీరనుంది. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డితో పాటు 11 మంది నాయకులు మంత్రి పదవులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం బహిర్గతం చేసింది. తొలిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినవారవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా.. సీపీఎం 1 స్థానంలో విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిపై తర్జనభర్జన చేసిన కాంగ్రెస్ కేంద్ర అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్‌ను నిర్ణయించింది. ఆయనతో పాటు మరో 11 మందికి మంత్రి పదవులను కూడా ఫైనల్ చేసింది. ఎల్బీ స్టేడియంలో నేడు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది నాయకుల జాబితాలో భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ ఉన్నారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
వైఎస్సార్‌కు నివాళులర్పించిన భట్టి
హైదరాబాద్: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు #BhattiVikramarkaMallu#YSRLivesOn pic.twitter.com/8O9oo7iSsh— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 7, 2023 తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టనున్నారు. మంత్రులుగా భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖతో సహా మొత్తం 11 మంది మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి మద్దతు తెలిపిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుబంధం నిరంతరం పెరుగుతూ ఉంటుందని ఆశించారు. తెలంగాణ ప్రజలతో తమ అనుబంధం విడదీయరానిదని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పాటుపడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రమించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. My dear sisters and brothers of Telangana, Thank you for your support to the @BJP4India. Over the last few years, this support has only been increasing and this trend will continue in the times to come. Our bond with Telangana is unbreakable and we will keep working for the… — Narendra Modi (@narendramodi) December 3, 2023 తెలంగాణలో నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ విజయభేరి మోగించింది. బీజేపీ కూడా 8 స్థానాలను కైవసం చేసుకుంది. అటు.. అధికార బీఆర్ఎస్ పార్టీ 31 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. -
ప్రగతి భవన్ పేరు.. ఇకపై ప్రజా భవన్: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు విజయం కోసం చాలా కృషి చేశారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అటు.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం బాగా జరిగింది అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్‌చారి అమరుడయ్యారు.. ఇవాళ్టి ప్రజా తీర్పు శ్రీకాంత్‌చారికి అంకితం చేస్తున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రజలు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. భారత్ జోడో ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని తెలిపారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ కలిసి పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు. అమరవీరులకు అంకితం.. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజయంలో 30 లక్షల నిరుద్యోగుల పట్టుదల ఉందని పేర్కొన్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం చేేస్తున్నట్లు చెప్పారు. ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన థాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. 'సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్ఎస్ సహకారం అందిస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో ప్రజలు భాగస్వామ్యం కావాలి. కొత్త ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాతీర్పును అందరూ శిరసావహించాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు. గేట్లు తెరిచే ఉంటాయి.. ప్రగతి భవన్ పేరును మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రగతి భవన్‌ను ఇకపై డా. అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయం గేట్లు సామాన్య ప్రజలకు సదా తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అందరం కలిసి నెరవేర్చాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. -
బరిలో బంధువులు.. ఫలితం ఏంటీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈసారి ఎన్నికల్లో భారీ స్థాయిలో బంధువులు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు, మామ అళ్లుల్లు ఇలా ఏదో ఒక రకంగా బంధుత్వాన్ని పంచుకున్నవారు ఎన్నికల్లో పోటీకి నిలిచారు. వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..? మామా అల్లుడు.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. ఇక మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఘనవిజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరుపున కోమటి రెడ్డి బ్రదర్స్ పోటీ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 21 వేల మెజార్టీతో గెలుపును ఖాయం చేసుకున్నారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో 54 వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. తండ్రి కోడుకులు.. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఓటమి దిశలో ఉన్నారు. అత్త.. అల్లుడు.. వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ తరుపున బాల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాడు. ఫలితాల్లో గెలుపు దిశగా దూసుకుపోతూ దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇదే స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మేనత్త అన్నపూర్ణమ్మ ఓడిపోయింది. ఎర్రబెల్లి బ్రదర్స్.. వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్ బీజేపీ తరుపున పోటీలో నిలిచారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. గడ్డం సోదరులు.. సోదరులు గడ్డం వినోద్, గడ్డం వివేక్ విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు. ఆయన సోదురుడు వివేక్ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఇద్దరు విజయం సాధించడం గమనార్హం. కేసీఆర్.. కేటీఆర్.. తండ్రికొడుకులు సీఎం కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు స్థానాల్లో పోటీలో నిలవగా ఆయన కుమారుడు కేటీఆర్ సిరిసిల్లలో బరిలోకి దిగారు. కామారెడ్డిలో ఓటమి పాలైన కేసీఆర్ గజ్వేల్ మాత్రం విజయం సాధించారు. అటు.. సిరిసిల్లలో కేటీఆర్ అధికారాన్ని కాపాడుకోగలిగారు. భార్యాభర్తలు.. తెలంగాణ ఎన్నికల్లో భార్యభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పోటీలో నిలిచిన ఆయన భార్య పద్మావతి రెడ్డి ఘనవిజయం సాధించారు. -
తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని, ఈవీఎంలను తరలించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే అంతకంటే ముందే ఉ.5:30 గం.లకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. పోలింగ్ ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4:00 వరకే పోలింగ్ ముగిస్తారు. సమయం ముగిసేలోపు క్యూలో నిల్చున్నవాళ్లకు మాత్రం ఓటేసేందుకు మినహాయింపు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే.. 27,094 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.48 లక్షల మంది ఉద్యోగులు ఇప్పటికే ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు.. దాదాపుగా 28వేల మంది ఓట్ ఫ్రమ్ హోం ద్వారా ఓటేశారు. తెలంగాణ ఎన్నికల కోసం 370 కేంద్ర బలగాలు, 45 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. మొత్తంగా 2.08 లక్షల మంది సిబ్బందిని ఎన్నికల కోసం నియమించారు. ఇదీ చదవండి: ఓటు విలువ: ‘కొంప’ ముంచిన ఒక్క ఓటు.. వీళ్ల ఓటమి ఎన్నికల చరిత్రకెక్కింది! -
తెలంగాణ పోలింగ్‌కు వరుణగండం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వరుణగండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అదే జరిగితే.. వరుణుడి ప్రతాపం నడుమ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల కోసం బుధ, గురువారాలను విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈసీ సూచనతో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది కార్మికశాఖ. ఇదీ చదవండి: ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె! -
మహ్మద్ అజారుద్దీన్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్‌పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఫిల్మ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఇన్నిరోజుల నుంచి రాజకీయ పార్టీలు ముమ్మరంగా సాగించిన ఎన్నికల ప్రచారానికి మంగళవారమే తెరపడింది. ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలను ఈసీ తీసుకుంటుంది. -
పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారు: మోదీ
సాక్షి, కరీంనగర్: పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని చెప్పారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారే సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యన్నతి బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కరీంనగర్ షోడశమహాజనపదాల్లో ఒకటిగా ఉండేదని ప్రధాని మోదీ చెప్పారు. పదేళ్ల పిల్లల్ల భవిష్యత్ కోసమే తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తారు.. అలాగే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేయాలని కోరారు. కరీంనగర్ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. దేశం కోసమే ఓటు వేయాలంటే అది బీజేపీకి మాత్రమే ఓటేయాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గమనించినట్లు మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ జరిగింది? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే అది బీఆర్ఎస్కేనని ప్రజలు గుర్తించాలని చెప్పారు. కేసీఆర్‌ను వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయొద్దని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు పిల్లల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీని చేస్తామంటే కేసీఆర్ అడ్డుపడ్డారని పేర్కొన్న మోదీ.. కరీంనగర్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. పీవీ నరసింహారావుని కాంగ్రెస్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. రైతులకు నీళ్లిచ్చేందుకు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. కుటుంబ పాలకులు వారి పిల్లల గురించే ఆలోచిస్తారు.. ప్రజల పిల్లల గురించి ఆలోచించబోరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్ఐ వంటి సంస్థలు పెరిగిపోయాయని తెలిపారు. ఫిలిగ్రి కళకు కరీంనగర్ పెట్టింది పేరు.. అలాంటి కళలను ప్రోత్సహించేందుకు కేంద్రం విశ్వ కర్మ యోజనను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా లక్షలాది రూపాయలు గ్యారెంటీ లేకుండానే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ నీడ పడితే కలలన్నీ చెదిరిపోతాయని భయం.. అందుకే తనను సీఎం కేసీఆర్ కలవట్లేదని విమర్శించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్ -
కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఫామింగ్ సీఎం: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దృష్టి అంతా రైతుల మీద ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఒక ఫామింగ్ సీఎం అని కొనియాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్, రైతుబంధుతో కేసీఆర్ వ్యవసాయం పండగ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక రైతు బిడ్డని గుర్తు చేశారు. ఇన్నాళ్లు నీళ్ళు లేక, పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పడితే రాష్ట్రం ఏమవుతుంది అనేదే భయమని అన్నారు. రిస్క్ తీసుకోవద్దు.. కారుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రశ్న: బీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీ వస్తే పరిస్తితి ఏంటి? హరీష్ రావు: పేదలకు బీజేపీ, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదు. అయిదు గ్యారంటీలతో కర్ణాటకలో కాంగ్రెస్ జనాన్ని మోసం చేసింది. రాహుల్, ప్రియాంక తమది గ్యారంటీ అన్నారు. ఆరు నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న నిరుద్యోగుల వద్దకు వెళ్లి రాహుల్ గాంధీ డ్రామాలు చేస్తున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఏమో గానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. 80 శాతం ఫీజుల్లో కోత పెట్టారు. అన్నింట్లో కోత పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 నుంచి 7 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. ప్రజలు ఆలోచించాలి. రైతు బంధు కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు ఉండే. మనం రిస్క్ తీసుకోవద్దు. ప్రశ్న: కర్ణాటక హామీల ప్రకటనలు ఇస్తోంది ఇక్కడ? హరీష్ రావు: కర్ణాటక ఇచ్చే యాడ్ అంత అబద్దం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? బస్సులు కూడా లేకుండా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక యాడ్ ఇవ్వటం ఎందుకు? ప్రశ్న: బీఆర్ఎస్ పరిపాలనలో పాజిటివ్‌తో వెళ్లాల్సిన బీఆర్ఎస్ భయపడుతుంది కాంగ్రెస్ కు అనే వాదన వస్తోంది? హరీష్ రావు: మాకు భయం అనేదే లేదు. ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. మేము 12 సార్లు రైతు బంధు ఇచ్చాం. కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తే 12 ముఖ్యమంత్రులు ఖాయం. ప్రశ్న: ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సీఎంలను మార్చలేదు ఇక్కడ ఎందుకు మారుస్తాం అంటున్నారు? హరీష్ రావు: తెలంగాణ రాకముందు ఇక్కడ సీఎంలను మార్చలేదా మనం చూడలేదా? కర్ణాటక మోడల్ అంటే ఏంటి? కరెంట్ ఇవ్వక పోవడమా? రైతు బంధు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రశ్న: కాంగ్రెస్ గాలి వీస్తుంది అనే వార్తలు వస్తున్నాయి? ఏమంటారు? హరీష్ రావు: మేము నిర్వహించిన మహబూబాబాద్, నర్సం పేట, పాలకుర్తి, భువనగిరిలో ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్ సభకు, ప్రియాంక సభకు జనం లేక వెలవెలభోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. జనం ముమ్మాటికీ మా వైపే ఉన్నారు. ఇంటింటికి మంచి నీరు, 24 గంటల కరెంట్, సాగు నీరు అందిచాం. ప్రశ్న: 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు? వెళ్లి చూద్దామా? అని ప్రతిపక్షాలు అంటున్నాయి మంత్రి హరీష్: 'ఇవన్నీ రాకపోతే టీవీ లోనో, పేపర్ లోనో రావాలి కదా. కరెంట్, నీళ్ళు ఇస్తే కారుకు ఓటెయ్యండి. రాని వాళ్ళు కాంగ్రెస్‌కు ఓటెయ్యండి. రిస్క్ వద్దు అనేది మా అభిప్రాయం. సాఫీగా తెలంగాణ పాలన సాగుతోంది. సంక్షేమ రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అనేక రంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో.నంబర్ 1 స్థానంలో ఉంచాం. హర్ గర్ జల్ అని కేంద్రం మిషన్ భగీరథను కాపీ కొట్టింది. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కొన్ని పథకాలు తప్ప వేరే కనపడటం లేదు. చేసింది, చూసిందే గమనించాలి అంటున్నాం. అందుకే ఇవ్వన్నీ గమనించి ఓటేయాలి.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: స్కూళ్ళు మూత పడుతున్నాయి? మంత్రి హరీష్: 'ఒక్క విద్యార్థి కూడా లేని చోట మూత పడ్డాయి అంతే' అని హరీష్ రావు సమాధామిచ్చారు. ప్రశ్న: ధరణి విషయంలో విమర్శలు ఎందుకు? ధరణి ప్లాప్ అంటోంది కాంగ్రెస్? మంత్రి హరీష్: 'మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే దుష్ప్రచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన' అని హరీష్ రావు అన్నారు. ప్రశ్న: తెలంగాణలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేవు.. ధరణితో భూములు లాక్కుంటున్నారు అంటున్నారు? మంత్రి హరీష్: 'ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. 60 యేళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా రైతు గురించి ఆలోచించిందా. మా అధికారం అంత ప్రజలకు ఇచ్చాము.'అని హరీష్ రావు సమాధానమిచ్చారు. ప్రశ్న: కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శ? మంత్రి హరీష్: 'ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజా క్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళం. కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. సంక్షేమ రంగంలో అద్భుతాలు చేశాం. ప్రతిపక్షాలు చెప్పడానికి ఏం లేక, పదే పదే సొల్లు చెప్తోంది. దళిత బంధు ఓట్ల కోసం కాదు, దళితులను ఆర్థికంగా ఎదగాలని తీసుకొచ్చాం' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు బీఆర్ఎస్కు గుది బండలా మారుతుందా? మంత్రి హరీష్: 'దశల వారీగా ఈ పథకం అందరికీ అందిస్తాం. దళితులు ఆర్థికంగా ఆదుకోవటానికి ఇది తీసుకొచ్చాం. రైతు అందుబాటులో ఉన్న సమయంలో కరెంట్ తో నీళ్ళు పారించటానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ మధ్యలో అంతరాయం వస్తుంటేనే మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి. ఇది చాలాదా అందరికీ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కాళేశ్వరం లక్ష కోట్లు అవీనీతి అంటున్నారు? మంత్రి హరీష్: 'ప్రాజెక్ట్ మొత్తం రూ.80 వేల కోట్లు అయ్యింది. లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుంది. ఆ ప్రాజెక్టుతో వ్యవసాయం సస్యశ్యామలం అయ్యింది.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: డిజైన్ లో లోపాలు ఉన్నాయా? ఎందుకు కుంగిపోయింది.? మంత్రి హరీష్: 'ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న పిల్లర్ కుంగింది. ఇది ఎల్ అండ్ టీ టేకప్ చేసిన ప్రొజేక్ట్. ప్రజలపై భారం పడకుండా మళ్ళీ మరమత్తులు చేస్తామని చెప్పారు. ఓట్ల కోసం ఇంత రాజకీయం అవసరమా. ప్రాజెక్టు కూలితే కేంద్రం ఊరుకుంటుందా?' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: భారీ వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్తితి దారుణంగా ఉంది? మంత్రి హరీష్: 'హైదరాబాద్ విషయంలో కేటీఆర్ బాగా కష్టపడుతున్నారు.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: ఓయూ వెళ్ళడానికి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారా? మంత్రి హరీష్: 'ఓయూ వెళ్ళడానికి భయపడేది మేము కాదు. రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. వచ్చే ప్రభుత్వంలో ఉద్యోగ కాలెండర్ ప్రకటిస్తాం. అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా ప్రవేట్ ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం ఉద్యోగాల్లో 3 శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? మేము దాన్ని ముందు పెట్టడం లేదు. కొన్ని లోపాలు జరిగాయి. మేమే దాన్ని గుర్తించాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టే. కాంగ్రెస్‌కు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే అనే ఆరోపణ వస్తోంది? మంత్రి హరీష్: 'మేము ఎవరికీ బీ టీమ్ కాదు. వీళ్లు వాళ్ల మీద.. వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నారు' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కొంత వ్యతిరేకత ఉందని సర్వే లు చెప్తున్నాయి? మంత్రి హరీష్: 'అవన్నీ ఫేక్ సర్వేలు, పెద్ద పేరున్న ఛానళ్ళు చేస్తే ఓకే, పేపర్ల మీద సర్వే లు చేస్తే ఎలా?' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: మైనoపల్లి విమర్శలు ఎలా చూస్తారు? మంత్రి హరీష్: 'ఆయన మాట్లాడిన భాష ఆయన స్థాయికి నిదర్శనం. ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. అలాంటి వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోను.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కొంత మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది.కానీ అయిన వారికే టికెట్ల ఇచ్చారు అని వాదనపై మీ స్పందన? మంత్రి హరీష్: 'వ్యతిరేకత కాదు పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం. రేవంత్ రెడ్డి హెడ్ లైన్స్ కోసం సెన్సేషన్ కోసమో ఆయన ఆ భాషతో మాట్లాడుతున్నారు. మేము బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళం. మేము పాలన సక్రమంగా అందించాలని అనుకునే వాళ్ళం. ప్రధాని ఎన్నో చెప్తాడు. నిజంగా కేటీఆర్ ను సీఎం చేయాలంటే మా ఎమ్మెల్యేలు కావాలి కానీ, ఎంపీలు ప్రధాని సపోర్ట్ ఎందుకు? మోడీ కేసీఆర్‌ను ఎన్ని సార్లు మెచ్చుకున్నారు. ప్రశ్న: కేటీఆర్ ను సీఎం చేయాలనడంపై హరీష్ రావు అభిప్రాయం ఏంటి? మంత్రి హరీష్: 'మా పార్టీ ఏది అనుకుంటే అది చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యేలకు తీరిక ఉండదు. అన్ని పనులు సక్రమంగా సాగుతున్నాయి' అని హరీష్ రావు చెప్పారు. -
'ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు?'
కరీంనగర్: ఇందిరమ్మ పాలన బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీలో ప్రజలను జైళ్లలో పెట్టడమా..? అని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలోనే వలసలు జరిగాయని దుయ్యబట్టారు. 1969 ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపింది ఎవరో మర్చిపోవద్దని గుర్తుచేశారు. మానుకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పార్టీల చరిత్ర ఎంటో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటు తలరాతను మారుస్తుందని గుర్తు చేసిన సీఎం.. ఆలోచించి ఓటు వేయకపోతే అదే కాటేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఆటోల ఫిట్నెస్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మేడ్చల్.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే! -
బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి మార్పు రాదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ కు సంబంధించినవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. కు ఓటేస్తే నష్టమే తప్ప ఎలాంటి మార్పు రాదని అన్నారు. కుటుంబ, అవినీతి పాలనను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన నుంచి 8 మంది బరిలో ఉన్నారని చెప్పారు. బీజేపీ తరుపున నామినేషన్ వేసిన వారు దాదాపు ఉపసంహరించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 10 రోజులుగా బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని కిషన్ రెడ్డి అన్నారు. కొందరు దొంగ కంపెనీల పేరిట సర్వేలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో కూర్చుని సర్వే నివేదికలు రిలీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, జనసేన తరపున భారీ మొత్తంలో బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. బీజేపీ 36 మంది, జనసేన నుంచి ముగ్గురు బీసీ అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. రెండు జనరల్ స్థానాల్లో కూడా దళితులకు అవకాశం ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చిందని తెలిపిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ 23 మంది బీసీలకు మాత్రమే టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. గజ్వేల్ లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ రెండు సీట్లలో పోటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలోనూ వెంకటరమణ రెడ్డి చేతిలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మాత్రమే మిగిలిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే దేశాభివృద్ధి జరగదని కిషన్ రెడ్డి అన్నారు. సంకీర్ణం జరిగితే కేసీఆర్ వెంట వచ్చే ఏకైక పార్టీ ఎంఐఎం అని తెలిపారు. ఈ నెల 17న అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని తెలిపిన తెలిపిన కిషన్ రెడ్డి.. 18న నాలుగు జిల్లాల్లో సభలు ఉంటాయని వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. రోజ్ గార్ మేళాలాగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఖాళీలు భర్తీ చేసి రాష్ట్ర నిరుద్యోగులకు నియామకపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: 2024లో సంకీర్ణ సర్కారు ఖాయం.. బీఆర్ఎస్దే హవా: సీఎం కేసీఆర్ -
2024లో సంకీర్ణ సర్కారు ఖాయం: సీఎం కేసీఆర్
నిజామాబాద్: 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడటం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజల అండ ఉంటుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణను ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం:కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తోందని అన్నారు. రైతు దుబారానా? అని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నాయకుల మాటలను ఎండగట్టారు. ఈ ప్రాంతానికి ఆనాడు నీళ్లు ఎందుకివ్వలేదని దుయ్యబట్టారు. ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నేడు ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు లాంటి పథకాలను దేశంలో తెలంగాణ మాత్రమే అమలు పరుస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుని మత కలహాలు సృష్టించిందని విమర్శించారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోందని ఆరోపించారు. వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీగాని నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను 5016కు పెంచుతామని వెల్లడించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు! -
జానారెడ్డి సహా పలువురి నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. నల్లగొండ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో చాలావరకు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరగ్గా.. జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో 2 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్ మానకొండూరులోనూ ఏడుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా.. 18మంది అభ్యర్థుల నామినేషన్ లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 22 నామినేషన్లు దాఖలు కాగా 7 నామినేషన్లు తిరస్కరణ బరిలో 15 మంది అభ్యర్థులు కామారెడ్డి జిల్లా మొత్తం 19 మందికి గాను పరిశీలనలో 2 పోగా 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జుక్కల్ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు. పరిశీలనలో 5 గురు అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారులు. 28 నామినేషన్లకు గాను 23 మంది నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందులలో 34 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు పరిశీలనలో నలుగురు అభ్యర్థుల తొలగింపు ఖమ్మం జిల్లా: పాలేరు నియోజకవర్గం నుంచి దాఖలైన నామినేషన్ లు 58 రిజెక్ట్ చేసినవి ఐదు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు 53 మంది అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మొత్తం దాఖలైన 25 మంది అభ్యర్థులు నామినేష్లను ముగ్గురు అభ్యర్థుల నామినేష్లను తిరస్కరించిన అధికారులు బరిలో 23మంది అభ్యర్థులు ఖమ్మం జిల్లా: సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 41నామినేషన్లు దాఖలు తిరస్కరణకు గురైన 6 నామినేషన్లు పోటీలో 25 మంది అభ్యర్థులు సూర్యాపేట జిల్లా : సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 42 మంది అభ్యర్థులు 81 నామినేషన్లు దాఖలు నామినేషన్ల పరిశీలనలో భాగంగా 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా దరఖాస్తు చేసిన నామినేషన్లలో 20 దరఖాస్తులకు ఆమోదం, 5 నామినేషన్ లు సరైన డాక్యుమెంట్ లేని కారణంగా తిరస్కరించిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్మల్ నియోజకవర్గం: మూడు నామినేషన్లు తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి ఎన్నికల బరిలో పదేహేను మంది అభ్యర్థులు నారాయణపేట జిల్లా మక్తల్ లో మొత్తం 15 నామినేషన్లలో మూడు నామినేషన్లు తిరస్కరణ. నామినేషన్ల పరిశీలనలో BSP అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ రాష్ట్ర వ్యాప్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో BSP అభ్యర్థుల తిరస్కరణ స్టేషన్ ఘనపూర్, ఆలేరు, పాలకుర్తి, మధిర, భువనగిరి, బహదూర్ పుర, జనగామ సెగ్మెంట్ల అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరించిన RO లు ఆదిజలాబాద్ జిల్లా: ఖానాపూర్ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసిన 17 మంది వివిధ కారణాలతో 4 గురు రిజెక్ట్ బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు కరీంనగర్ జిల్లా: చొప్పదండి నియోజకవర్గంలో 18మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు.. లింగాల లచ్చయ్య అనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు. పెద్దపల్లి జిల్లా: మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది అభ్యర్థులు.. నలుగురి నామినేషన్ల తిరస్కరణ. కరీంనగర్ జిల్లా: కరీంనగర్ అసెంబ్లీలో ఏడుగురి నామినేషన్ల తిరస్కరణ.. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. హుజూరాబాద్ అసెంబ్లీలో ఏడుగురి నామినేషన్ల తిరస్కరణ.. 13 మంది అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం. పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రయ. మొత్తం దాఖలైన నామినేషన్లు 30. తిరస్కరణకు గురైన నామినేషన్లు 5. పోటీలో నిలిచిన అభ్యర్థులు 25 మంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించిన ఎన్నికల అధికారులు కామారెడ్డి జిల్లా: కామారెడ్డి నియోజక వర్గంలో ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు. 6 గురు అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారులు. 64 నామినేషన్లకు గాను 58 మంది నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి. వరంగల్: వర్ధననపేట నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి 26 మంది 40సేట్ల నామినేషన్ దాఖలు 6 నామినేషన్ల తిరస్కరణ.. 20 మంది నామినేషన్లు అమోదం తెలిపిన ఎన్నికల ఆధికారి... వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 38 మంది అభ్యర్థులు 51 సెట్లు నామినేషన్ దాఖలు 31 నామినేషన్లను ఆమోదించగా.. ఆరు నామినేషన్లు తిరస్కరణ జనగామ జిల్లా: జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి 32 నామినేషన్లు దాఖలు 5 నామినేషన్ల తిరస్కరణ బరిలో 27 మంది అభ్యర్థులు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులలో 5 మంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారి స్టేషన్ ఘనపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా జానకిపురం సర్పంచ్ నవ్య నామినేషన్ ఆమోదించిన ఎన్నికల అధికారి. ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంలో మొత్తం 18 మంది 28 సెట్లను నామినేషన్ దాఖలు చేయగా ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారి వరంగల్ జిల్లా: ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. వరంగల్ తూర్పులో 31 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. పరకాలలో 36 మంది నామినేషన్లకు ఆమోదం. వర్ధన్నపేటలో 20 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. నర్సంపేటలో 19 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. జనగామలో 27 మంది అభ్యర్థులకు ఆమోదం. పాలకుర్తిలో 22 మంది నామినేషన్లకు ఆమోదం. స్టేషన్ ఘనపూర్ లో 23 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. ములుగులో 16 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. భూపాలపల్లిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. మహబూబాబాద్ లో 15 మంది నామినేషన్లకు ఆమోదం. డోర్నకల్ నుండి 17 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. వరంగల్ పశ్చిమలో 20మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. ఇదీ చదవండి: రేవంత్‌పై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు.. బీఆర్ఎస్ వ్యతిరేక యాడ్స్‌పై కాంగ్రెస్ రియాక్షన్ ఇది -
పంతం నెగ్గించుకున్న ఈటల, బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ నాలుగో విడుత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12 మంది అభ్యర్థులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 100 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. నాలుగో విడత జాబితాలో వేములవాడ, హుస్నాబాద్‌లలో పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఈటల రాజేందర్, బండి సంజయ్ తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. వేములవాడలో తుల ఉమాకు టికెట్ అవ్వాలని ఈటల రాజేందర్ పట్టుబట్టారు. చివరకు ఈటల తన అనుచరురాలు తుల ఉమకు టికెట్ ఇప్పించడంలో విజయం సాధించారు. అటు.. హుస్నాబాద్‌పై బండి సంజయ్ కూడా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. హుస్నాబాద్ టికెట్‌ను బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి బండి సంజయ్ బట్టు పట్టి మరీ ఇప్పించుకున్నారు. బీజేపీ టిక్కెట్ తుల ఉమకు దక్కడంపై వేములవాడ బీజేపీలో ముసలం మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో పనిచేసినవారిని గుర్తించలేదంటూ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలాధ్యక్షులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటు హెచ్చరికలు జారీ చేశారు. మూడురోజుల్లో టిక్కెట్ మార్చకపోతే కచ్చితంగా రాజీనామాలకు సిద్ధమంటున్నారు. ఇక టిక్కెట్ దక్కని చెన్నమనేని వికాస్ రావు.. తాను బండి సంజయ్ నేతృత్వంలో పని చేస్తానంటున్నారు. టిక్కెట్ దక్కకపోయినా అధిష్ఠానం ఏం చెబితే అది చేసేందుకు, ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నట్టు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. గంగిడికి మొండి చేయి.. మునుగోడు నియోజక వర్గంలో గంగిడి మనోహర్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం మొండి చేయి చూపించింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఆయనకు పార్టీ పెద్దలు ఈ సారి టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలోకి వచ్చిన చలమల కృష్ణారెడ్డికి టికెట్‌ను ఖరారు చేశారు. ఇదీ చదవండి: Telangana: బీజేపీ నాలుగవ జాబితా విడుదల -
పార్టీల చరిత్ర చూసి ఓటేయండి: సీఎం కేసీఆర్
మహబూబ్ నగర్: ఓటేసే ముందు అన్ని పార్టీల చరిత్ర చూడాలని పాలమూరు ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. ఎవరో చెప్పారని ఓటు వేయొద్ధని.. ప్రజల వద్ద ఉన్న వజ్రాయుధం ఓటు అని అన్నారాయన. సోమవారం మధ్యాహ్నాం జిల్లాలోని దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ నేడు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో పాలమూరును ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన దేవరకద్ర అభివృద్ధితో తమ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘30 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించిన నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ విధానం చూసి ఓటు వేయండి’’ అని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. రాబోయే ఐదేళ్ల కాలం ప్రజల భవిష్యత్ నిర్ణయిస్తుందని, కాబట్టి విచక్షణతో ఓటు వేయాలని ప్రజలను కోరారు. అయితే ఇప్పటిదాకా కూడా ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణితి రాలేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: గెలిపిస్తేనే వస్తా.. లేదంటే రాను : కేటీఆర్ -
సీఎం కేసీఆర్‌కు రేవంత్ సవాల్
కొడంగల్: కొడంగల్‌కు ప్రత్యేక గుర్తింపు తన హయంలోనే వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ దత్తత తీసుకొని ఈ ప్రాంతానికి చేసిందేమీలేదని ఆరోపించారు. గురునాథ్ రెడ్డి మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే కొడంగల్‌ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కొడంగల్‌కు సాగునీరు తేలేదు, కాలేజీలు రాలేదని దుయ్యబట్టారు. సిరిసిల్ల, సిద్దిపేటను అభివృద్ధి చేసినట్లుగా కొడంగల్ ను అభివృద్ధి చేయలేదని స్పష్టం చేశారు. కొడంగల్ లో నిజంగా అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికలు కొడంగల్ రూపురేఖలను మారుస్తాయని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు దేశ ముఖచిత్రంలో కొడంగల్ పేరు మారుమోగుతుందని అన్నారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు అల్లాడుతున్నారని తెలిపిన రేవంత్ రెడ్డి.. ప్రాణ సమానమైన కాంగ్రెస్ కార్యకర్తలతో నామినేషన్ వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ శాఖకు తనను అధ్యక్షుడిగా సోనియమ్మ నియమించిందని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలంతా ఆలోచన చేయాలని సూచించారు. ఇదీ చదవండి: గెలిపిస్తేనే వస్తా.. లేదంటే రాను : కేటీఆర్ -
వేరే పార్టీలోకి జంపయ్.. టికెట్ పట్టేయ్..!
ఇదే పార్టీలో ఉంటే ఎప్పటికీ టికెట్ రాదనే.. వేరే పార్టీలోకి జంపయ్.. మళ్లీ ఈ పార్టీలోకి మారితే టికెటిచ్చారు! -
మరోసారి ప్రవాసి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు శనివారం నుంచి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు తరలివెళ్లనున్నారు. పార్టీపరంగా చేపడుతున్న ‘ప్రవాసీ యోజన’లో భాగంగా ఇప్పటికే రెండు, మూడు విడతలుగా వారు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సైతం వెలువడి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావడంతో..వీరంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల పరిధిలో నెలరోజుల పాటు మకాం వేయనున్నారు. అంటే ఎన్నికలు ముగిసే దాకా అక్కడే ఉండనున్నారు. పార్టీ ప్రచారం, నేతల మధ్య సమన్వయం ఇతర అంశాలను అధిష్టానం దూతలుగా పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇంటింటి ప్రచారం, ప్రధాన పార్టీల బలాబలాలు వంటివి పరిశీలించి నాయకత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇన్చార్జీల నియామకం! పార్టీ పరంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలు, 6 జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. కాగా ఈ జిల్లాలు, జోన్ల వారీగా ఇతర రాష్ట్రాల నేతలు దృష్టి కేంద్రీకరించనున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పనిచేస్తున్న వారితో పాటు కిందిస్థాయిలో పరిస్థితుల అంచనాకు ఈ నేతల సేవలను పార్టీ ఉపయోగించుకోనుంది. ఈ నేతలు థర్డ్ పార్టీ మాదిరిగా పనిచేస్తుండడంతో, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు జవాబుదారీతనంతో పనిచేసే వీలుంటుందని నేతలు చెబుతున్నారు. జోన్లకు ఇన్‌చార్జీలుగా కూడా వీరు వ్యవహరిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయ కులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు నేతలు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన వర్క్‌షాపులో జాతీయ నేతలు ప్రకాశ్ జవదేకర్, తరుణ్ ఛుగ్, అరి్వంద్ మీనన్ వారికి దిశానిర్దేశం చేశారు. ఆరుజోన్లు, జిల్లాలు, ఆయా నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీల నియామకం జరిగినట్టు సమాచారం. డబుల్ చెక్కు దోహదం బీజేపీ జాతీయ నాయకత్వం కొంతకాలంగా అనుసరిస్తున్న రాజకీయ విధానంలో భాగంగానే ప్రవాసీ యోజనను చేపడుతున్నట్టు ఓ ముఖ్యనేత సాక్షికి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినపుడు కూడా తెలంగాణకు చెందిన నేతలు ఆయా ప్రాంతాలకు వెళ్లి పూర్తిసమయం కేటాయించి పనిచేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. నేతల మధ్య సమన్వయం సాధించడంతో పాటు, ఎన్నికలకు సంసిద్ధత, ఇతర అంశాల్లో ఏవైనా లోటుపాట్లు, లోపాలు గుర్తిస్తే వాటిని సరిచేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు. స్థానికంగా కార్యకర్తల ఇళ్లల్లోనే భోజనాలు చేయడం ద్వారా వారితో కలిసిపోయేందుకు వీలు కలుగుతుందని, క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ కమిటీల సమన్వయం, ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై దృష్టి సారించడం ద్వారా పార్టీ పరంగా డబుల్ చెకింగ్‌కు వీలు కలుగుతుందని తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఓటమి ఖాయమైంది -
ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే బండ ప్రకాష్‌ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. -
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. రాథోడ్ బాపురావ్‌తో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత చెల్లమల కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సందర్బంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మాట్లాడుతూ.. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో చేరానని చెప్పారు. రాష్ట్ర సాధనకోసం తనవంతు ప్రయత్నం చేశానన్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. రెండుసార్లు గెలిచిన తనను ప్రజల్లో ఆదరాభిమానాలున్నప్పటికీ కొందరు కక్షగట్టి మూడోసారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని బాపురావ్ తెలిపారు. దీనిపై మాట్లాడాలని కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. అనంతరం ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ రెడ్డి, చెల్లమల కృష్ణారెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు సురిగి నర్సింహా, బిట్టు సత్యనారాయణ పార్టీలో చేరారు. వీరందరినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదీ చదవండి: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే..? -
వివేక్ దారిలోనే కొండా? ఆయన వెంటే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్ వెంకటస్వామి పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరి దారిలోనే బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పయనించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు లిస్టుల్లో 53 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మూడో లిస్టు పై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇదే పని మీద స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జనసేన తో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపైనా బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఈ పొత్తులో భాగంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సీటును జనసేనకు కేటాయిస్తారన్న లీకులు బయటికి వస్తున్నాయి. శేరిలింగంపల్లి సీటు విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తన పార్లమెంటు నియోనజకవర్గం పరిధిలోకి వచ్చే సీటును జనసేనకు ఎలా ఇస్తారని, ఎప్పటినుంచో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కొడుకు రవియాదవ్ కే సీటు కేటాయించాలని కొండా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సీటును రవియాదవ్ కు ఇవ్వకపోతే తానూ బీజేపీకి రిజైన్ చేస్తానని పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇలా ఉంటే కొండా పార్టీని వీడితే ఆయన బాటలోనే స్టేట్ బీజేపీ మరో టాప్ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈటల భార్య జమునా రెడ్డి కొండాకు దగ్గరి బంధువవుతారు. రాజకీయంగా వీళ్లంతా కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తాజా పరిణామాలతో స్టేట్ బీజేపీ నుంచి నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక -
కేసీఆర్‌కు బై బై చెప్పండి: రాహుల్ గాంధీ
సాక్షి, కల్వకుర్తి: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ కు బై బై చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో బుధవారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆదాయం వచ్చే శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం వద్దే ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ధరణితో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ లూటీ చేసిన ప్రతీ పైసాను కాంగ్రెస్ కక్కిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. తాను మోదీలా మోసం చేయనని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మాటిచ్చారు. ఇదీ చదవండి: దళిత బంధు తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ -
గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే..?
ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ , కిషన్ రెడ్డిలు పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. అయితే.. ఇదే వరుసలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ గూటికి రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక