tourist bus
-
డీజే టిల్లూ ‘కొట్టూ కొట్టూ...’
పలమనేరు (చిత్తూరు): ఓంశక్తి మాల ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు డీజే టిల్లూ డ్యాన్సు చుక్కలు చూపించిన సంఘటన ఆదివారం పలమనేరులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన 34 మంది ఓంశక్తి భక్తులు ప్రైవేటు బస్సును రూ.1.25లక్షలకు మాట్లాడుకొని ఆలయాల సందర్శనకు ఈ నెల 22న బయల్దేరారు. బస్సు అద్దెకు చెల్లించిన మొత్తం పోగా మిగిలిన పదివేలను స్వగ్రామంలో బస్సు దిగినాక ఇస్తామని తెలిపారు. ఈ టూరిస్ట్ బస్సు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల సందర్శనానంతరం బయలుదేరింది. ఈ నేపథ్యంలో బాగేపల్లి వద్ద డ్రైవర్ అరవింద్ డీజిల్‌కు డబ్బులిస్తేనే బస్సు కదులుతుందని ఆపేశాడు. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహించిన బస్సు డ్రైవర్ మహిళలపై దాడికి దిగాడు. తనకు డబ్బులు మొత్తం ఇస్తేనే బస్సు కదులుతుందని తెగేసి చెప్పారు. వారు ఇవ్వకపోవడంతో కర్ణాటకలోని ధర్మస్థలం వద్ద ప్రయాణికులను బస్సులోంచి దింపేశాడు. దీంతో పిల్లాపాపలతో వారంతా రాత్రిపూట రోడ్డుపై పడుకోవాల్సి వచ్చింది. ఆపై అందరూ కలిసి డబ్బులు సమకూర్చుకుని అదే బస్సులో ప్రయాణం మొదలు పెట్టారు. మార్గమధ్యంలో బస్సులోని వారు డీజే టిల్లు వీడియో సాంగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే బస్సులో వీడియో పనిచేయడం లేదని డ్రైవర్ చెప్పాడు. అప్పుడేమో అన్నీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని మళ్లీ డ్రైవర్‌తో ప్రయాణికులతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో బస్సులోని కొందరు యువకులు డీజే టిల్లు డ్యాన్స్‌లు మొదలు పెట్టారు. దీంతో డ్రైవర్ బస్సును పలమనేరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆపేసి తమ యజమానికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న యజమాని, డ్రైవర్లు స్థానిక యూనియన్ నాయకులతో కలసి సమస్యను పరిష్కరించారు. బస్సు గ్రామానికి వెళ్లిన తరువాత మిగిలిన అద్దె ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో ఓంశక్తి భక్తులు ఊరు చేరుకున్నారు. -
గుండెపోటుతో కూడా బస్సును అదుపు చేసి
వెంకటాపురం(కె): టూరిస్ట్ బస్సుడ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా.. బస్సుకు బ్రేక్ వేయడంతో తక్కువ వేగంతో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఏమీ కాలేదు కానీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం అంకన్నగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రయాణీకుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 45మంది శక్తి మాలలు ధరించి తీర్థ యాత్రల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భద్రాచలం పర్ణశాల నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి బయలుదేరారు. బస్‌డ్రైవర్ దేవ ఇరక్కమ్ (49) పర్ణశాల వద్ద నుంచే తనకు గుండె వద్ద నొప్పి వస్తోందని ఇబ్బందిగా ఉందని తెలిపాడు. దీంతో వేరే డ్రైవర్‌ను పిలిపించాలని ప్రయాణికులు సూచించారు. మరో డ్రైవర్ రావడానికి రెండు రోజులు పడుతుందని, అప్పటివరకు తానే బస్సు నడుపుతానని చెప్పి యాదాద్రికి బయలుదేరాడు. అంకన్నగూడెం గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్‌కు గుండెనొప్పి తీవ్రమై ఒక్కసారిగా కుప్పకూలాడు. బస్సు నెమ్మదిగా ఉండడం, డ్రైవర్ నొప్పితో ఉన్నా బ్రేక్ వేయడంతో బస్సు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. అపస్మారకస్థితిలో ఉన్న డ్రైవర్‌ను వెంటనే 108లో వెంకటాపురం వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. బస్సులోని 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ నొప్పి ఉన్నా సమయస్ఫూర్తితో బ్రేక్ వేశాడని, లేదంటే పెనుప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రయాణికులను కాపాడి.. మృత్యుఒడికి
బిట్రగుంట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): బోగోలు మండలం కడనూతల సమీపంలో ఓ టూరిస్టు బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడి తాను మృత్యుఒడిలో ఒరిగిపోయాడు. దీంతో అయ్యప్ప భక్తులతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు గురువారం తృటిలో పెనుప్రమాదం తప్పింది. బస్సులోని అయ్యప్ప భక్తుల కథనం మేరకు.... కిర్లంపూడి మండలం తామరక గ్రామానికి చెందిన 45 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలో దీక్ష పూర్తి చేసుకుని ఈ నెల 20న తిరుగు ప్రయాణమయ్యారు. కడనూతల వద్ద ఫ్లైఓవర్పైన విశాఖపట్నానికి చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్ (39) గుండెపోటుకు గురయ్యాడు. ఊపిరి ఆడకపోవడంతో వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి చాకచక్యంగా బస్సును ఫ్లైఓవర్‌పైనే ఒక పక్కగా నిలిపేశాడు. గుండెనొప్పిగా ఉందంటూ క్లీనర్‌కు చెబుతూనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. బస్సు ఏమాత్రం అదుపుతప్పినా ఘోరప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న బిట్రగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం
పాలక్కడ్: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. బేస్లియస్ స్కూల్‌కు చెందిన 10, 11, 12వ తరగతి విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లిన బస్సు.. ఓవర్ స్పీడ్‌తో ఓ కారును ఓవర్టేక్ చేయబోయే ప్రయత్నంలో అదుపు తప్పింది. అంజుమూర్తీ మంగళం బస్టాప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆపై అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. వలయార్-వడక్కన్‌చెర్రి జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గం. తర్వాత ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైంలో జోరుగా వాన కురుస్తోందని అధికారులు తెలిపారు. టూరిస్ట్ బస్సులో 41 మంది చిన్నారులు, ఐదుగురు టీచర్లు, బస్సుకు సంబంధించి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని, 28 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఆర్టీసీ బస్సు కొట్టారక్కరా నుంచి కొయంబత్తూరు రూట్లో వెళ్తోంది. ప్రమాదం తీవ్రమైంది కావడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు పాలక్కడ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వానలో టూరిస్ట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. Kerala | 9 people died while 38 were injured after a tourist bus crashed into Kerala State Road Transport Corporation (KSRTC) bus in Vadakkenchery in Palakkad district: State minister MB Rajesh — ANI (@ANI) October 6, 2022 ఇదీ చదవండి: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు -
ఒడిశా కశ్మీర్ చూసి వస్తుండగా.. రోడ్డంతా మంచుతో కప్పేసరికి..
సాక్షి,బరంపురం(భువనేశ్వర్): కొందమాల్ జిల్లాలోని కళింగా ఘాటీలో బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జి.ఉదయగిరి పోలీసులు వైద్యసేవల నిమిత్తం పుల్బణి ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ఒడిశా కశ్మీర్‌గా పేరొందిన దరింగబడి అందాలను తిలకించి, వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సరిగ్గా రెండు రోజుల క్రితం దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాకి చెందిన 40 మంది పర్యాటకులు ఓ బస్సులో తమ ప్రయాణం ఆరంభించారు. శుక్రవారం సాయంత్రం దరింగబడి పర్యాటక స్థలానికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా, బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని తొలుత దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందజేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. అయితే మంచు కారణంగా దారి కనిపించకపోవడంతోనే దుర్ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి.. -
నాకు రెండే రెండిష్టం: ఒకటి స్మిమ్మింగ్, మరొకటి టూర్
ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాల్సిందేనా?! మనకు మనంగా ఎక్కడికీ వెళ్లలేమా! వెళ్లిరాలేమా! మనకోసం ఒకరు తోడు ఉండటం మంచిదే. స్కూల్‌కి అక్క తోడు. కాలేజ్‌కి అన్న తోడు. పెళ్లయ్యాక భర్త తోడు. ఎప్పుడైనా మనసు ‘సోలో’గా వెళ్లానుకుంటే? తోడు రావడానికి సిద్ధంగా ఉండాల్సింది మనకు మనమేగా!! బళ్ళారి నివాసి రజని లక్కా ట్రావెల్ అనుభవాలు.. ఆమె మాటల్లో... నా ప్రధానమైన ఇష్టాల్లో ఒకటి స్మిమ్మింగ్, మరొకటి టూర్. అయితే సోలో ట్రావెలర్‌ని కాదు. ఎప్పుడూ బంధువులు, స్నేహితులతో కలిసి వెళ్లేదాన్ని. కానీ 2014 ఆగస్టులో కెనడాకి ఒక్కదాన్నే వెళ్లాను. ఒంటరిగా ప్రయాణించడం అదే తొలిసారి, కెనడాకు వెళ్లడమూ మొదటిసారే. అప్పుడు మాంట్రియెల్‌లో ‘ఫినా మాస్టర్స్ స్విమ్మింగ్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. ఆ పోటీల కోసం కెనడాలో అడుగుపెట్టాను. పోటీలు పది రోజులు, కానీ మరో ఇరవై రోజులు దేశంలో పర్యాటక ప్రదేశాలను చూడడానికే ఉండిపోయాను. వెనక్కి చూసుకుంటూ వెళ్లాను మాంట్రియెల్‌లో యాక్సెసరీ కార్డు తీసుకున్నాను. ఆ కార్డు ఉంటే నగరంలో బస్సులు, మెట్రో రైళ్లు అన్నింటిలోనూ ప్రయాణించవచ్చు. చూడాలనిపించిన పర్యాటక ప్రదేశానికి ఏ రూట్లో వెళ్లాలో మ్యాప్ చూసి తెలుసుకోవడం, ఆ రూట్ రైలు, బస్సు ఎక్కి వెళ్లిపోవడమే. అక్కడ రైల్వే లైన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. రైళ్లు పైకి కనిపించవు. రైల్వే స్టేషన్ నుంచి బయటపడడం అంటే ఆ స్టేషన్‌తో కలిసి ఉన్న మాల్‌లోకి వెళ్లడమే. మాల్ నుంచి రోడ్డు మీదకు రావాలి. నేను మాంట్రియెల్‌లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నప్పుడు బస్ పాయింట్ నుంచి వాళ్ల ఇంటి వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు నడిచి వెళ్లాను. నడిచినంత సేపూ భయం, నేను ఒంటరిగా ఉండడంతో ఎవరైనా ఫాలో అవుతారేమోననే బెరుకుతో పది అడుగులకోసారి వెనక్కి చూసుకున్నాను. నేను భయపడినట్లు ఎవరూ ఫాలో కాలేదు. అక్కడ సిస్టమ్ చాలా సెక్యూర్డ్‌గా ఉంది. ఇండియాలో కూడా అంత ధైర్యంగా ఒంటరిగా తిరగలేమేమో అనిపించింది. రెండు గంటల ఆలస్యం... అంతే! ఒకరోజు స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ఓపెనింగ్ సెరిమనీ పూర్తయిన తర్వాత మెట్రో రైల్లో ఇంటికి రావాలి. ఆ రోజు అక్కడ పబ్లిక్ హాలిడే అనుకుంటాను. ఆ రష్ చూస్తే జనం అంతా రోడ్లమీదనే ఉన్నారా అనిపించింది. ఆ రష్లో రైలు ఎక్కలేక కొంచెం ఖాళీగా ఉన్న రైలు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను. తీరా మా ఫ్రెండ్స్ ఇంటికి చేరేసరికి రెండు గంటలు ఆలస్యం అయింది. ఈ లోపు నేనింకా ఇంటికి రాలేదని మా ఫ్రెండ్స్ పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, పోలీసులు వచ్చి ఆ ఇంట్లో నా గది, బ్యాగ్ తనిఖీ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా నేను ఇల్లు చేరినట్లు నిర్ధారణ అయ్యే వరకు ఫోన్లో ఫాలో అప్ చేశారు. ట్రైన్ రష్ కారణంగా ఆలస్యం అవుతోందని ఇంట్లో వాళ్లకు తెలియచేయడానికి నా దగ్గర ఫోన్ లేదు. కెనడా సిమ్ అప్పటికింకా రాకపోవడంతో నా దగ్గర మొబైల్ ఫోన్ లేకపోయింది. ఆ మరుసటి రోజు ఫ్రెండ్స్ వాళ్ల సిమ్ ఒకటి ఇవ్వడంతో ఒక సమస్య తీరింది. నయాగరా వీక్షణం మాంట్రియెల్ నుంచి టొరంటోలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాను. అదొక అనుభవం. మాంట్రియెల్‌లో ఫ్రెండ్స్ ఇచ్చిన మొబైల్ సిమ్ వాళ్లకు ఇచ్చేసి టొరంటోకెళ్లాను. అక్కడ దిగగానే పబ్లిక్ ఫోన్ నుంచి బంధువులకు ఫోన్ చేసి నగరంలో దిగినట్లు చెప్పి, నయాగరా వాటర్ ఫాల్స్ చూసుకుని సాయంత్రానికి ఇంటికి వస్తానని సమాచారం ఇచ్చాను. నయాగరా నుంచి మా బంధువులుండే ఏరియా వరకు బస్‌లో వచ్చేశాను. పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేశాను. వాళ్లు ఫోన్ తీయలేదు. ఏం చేయాలో తోచలేదు. దగ్గరలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే చూస్తూ ఓ గంట సేపు గడిపాను. మళ్లీ ఫోన్ చేసినప్పుడు వాళ్లు ఫోన్ తీశారు. ఇంటికి అడ్రస్, డైరెక్షన్ చెప్పారు. టొరంటో తర్వాత మా అన్న కూతురు ఉండే కాల్గరీలో పదిహేను రోజులున్నాను. కాల్గరీ గ్లేసియర్లు, లేక్‌లకు ప్రసిద్ధి. బాగా ఎంజాయ్ చేశాను. తిరిగి మాంట్రెయల్కు వచ్చి ఇండియాకి వచ్చే విమానం ఎక్కాను. నెలరోజుల కెనడా ట్రిప్ అలా జరిగింది. నేను చెప్పేదొక్కటే భయపడితే సాధించేదేమీ ఉండదు. ధైర్యం ఉంటే వయసు కూడా అడ్డంకి కాదు. సోలో ట్రిప్కెళ్లినప్పుడు నా వయసు 54. టూర్ బస్సులో తొమ్మిది దేశాలు ఒక రోజు టూరిస్టు బస్‌లో క్యూబెక్ సిటీ టూర్కెళ్లాను. మాంట్రియెల్‌లో పికప్ చేసుకుని టూర్ పూర్తయ్యాక మాంట్రియెల్‌లో దించింది. అప్పుడు ఆ బస్సులో ప్రయాణించింది పదిహేను మందిమి మాత్రమే. వాళ్లలో తొమ్మిది దేశాల వాళ్లం కలిసి ప్రయాణించాం. -
అరకు: లోయలో పడ్డ బస్సు: నలుగురు మృతి
సాక్షి, విశాఖపట్నం : అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి డముక వద్ద శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్ బస్సు లోయలో పడింది. దీంతో నలుగురు మృతి చెందగా 10 మందికిపైగా గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అరకునుంచి హైదరాబాద్ తిరిగివెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఎస్‌కోట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్‌చంద్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మెరుగైన చికిత్స అందించండి: సీఎం జగన్ అమరావతి : విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో డముకు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై సీఎంఓ అధికారులను ఆరా తీశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశింశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి హైదరాబాద్ : అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి న్యూఢిల్లీ : అరకు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
మంటల్లో ట్రావెల్స్ బస్సు,తప్పిన పెనుప్రమాదం
-
శ్రీకాకుళం జిల్లాలో టూరిస్ట్ బస్ దగ్ధం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పైడి భీమవరం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు మంటల్లో కాలి బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద ఘటనతో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
తీర్థయాత్రలో కన్నీటిసుడి
కర్ణాటక ,చెళ్లకెర రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో టూరిస్టు బస్సు లోయలోకి పల్టీ కొట్టిన ప్రమాదంలో ఏడుగురు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు మృతులు కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరకు చెందిన ఆర్యవైశ్య కుటుంబాలవారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లి ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రయాణం జిల్లాలో వ్యాపార కేంద్రమైన చెళ్లకెరలో ఆర్యవైశ్య కుటుంబాలవారు 24 మంది శనివారం రెండు టెంపో ట్రావెలర్ వాహనాల్లో ఏపీలో పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. మొదట శ్రీశైలం దర్శనం ముగించుకొని ముందుకు సాగిపోయారు. పెనుగొండలో వాసవీమాత దర్శనం కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఇంతలో ప్రమాద వార్త తెలిసింది. మృతుల్లో ఐదుగురు చెళ్లకెరవాసులు కాగా, ఇద్దరు అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన వారు. మృతులను చెళ్లకెరకు చెందిన కుందం రమేష్ (56), ఆయన భార్య కుందం అమృతవాణి (48), మేడా గాయత్రమ్మ (52), మేడా శ్వేతా (25), సావిత్రమ్మ (45)లుగా గుర్తించారు. మడకశిరకు చెందిన ఇద్దరు మేడా శ్రీనివాసులు (57), మేడా రుద్రాక్షమ్మ (56)లు మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రులను కురుడి శ్రీనివాస్, కురుడి శ్వేతా, మేడా జగన్నాథ్, మేడా వెంకటేశ్వర్లు, జ్ఞానశ్రీలుగా గుర్తించారు. చెళ్లకెరలో విషాద చాయలు ప్రమాద సమాచారాన్ని టీవీలలో చూసిన వెంటనే చెళ్లకెర ఆర్యవైశ్య సంఘం వారు దిగ్బ్రాంతికి గురయ్యారు. నీ ఆరోగ్యం జాగ్రత్త అని పర్యటనకు వెళ్లే ముందు అక్క జాగ్రత్తలు చెప్పిందని, కానీ తానే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని మృతురాలు శ్వేత తమ్ముడు అశోక్ విలపిస్తూ చెప్పాడు. మరో మృతుల బంధువు అశ్వత్ నారాయణశెట్టి మాట్లాడుతూ మృతురాలు సావిత్రమ్మ కుమారుడు నాదగ్గరే ఉన్నాడు, ఈ ఘోరం ఎలా చెప్పాలి అని దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని కన్నీరు కార్చాడు. యాత్రకు వెళ్లింది వీరే తీర్థయాత్రకు వెళ్లినవారు: రంగనాథ, సుధా, గోవిందరాజు, మమతా, కృష్ణమూర్తి, రాధా, బృందా, జగన్నాథ్, రామలక్ష్మి, వెంకటచలపతి, సావిత్రమ్మ, శ్వేతా, గీతమ్మ, శ్వేతా, ఏఎస్.మారుతీ, ఎస్.లక్ష్మి, శ్రియా, కిశోర్, మారుతి, రమేష్, వాణి, కే.శ్రీనివాస్ అని తెలిసింది. -
టూరిస్టు బస్సు బోల్తా
స్థానిక అక్కివరం కూడలి వద్ద శనివారం ఉదయం ప్రమాదవశాత్తు టూరిస్టు బస్సు బోల్తా పడింది. బస్సులో 45మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళ్తే...వైఎస్సార్ జిల్లా (కడప), ప్రొద్దుటూరు నుంచి ఏపీ04 టీడబ్ల్యూ 3413 టూరిస్టు బస్సు కాశీయాత్రకు భక్తుల్ని తీసుకు వెళ్లింది. యాత్రను పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరింది. శనివారం ఉదయం పూసపాటిరేగ వద్ద యాత్రికులు టీ తాగి బయలుదేరారు. అక్కివరం కూడలి వద్దకు వచ్చేసరికి అండర్ పాస్ పనులు జరుగుతున్న చోట ఎదురుగా మతిస్థిమితం లేని వ్యక్తి ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చేశాడు. అతన్ని తప్పించబోయిన డ్రైవరు బ్రహ్మయ్య బస్సును రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మలతో ఏర్పాటు చేసిన స్టాపర్లను ఢీకొట్టింది. రోడ్డు పక్కకు బస్ నిలపడంతో, వంతెన నిర్మాణానికి రోడ్డు తవ్వేసి ఉండడంతో గోతులోకి రోడ్డు పెళ్ళలు విరిగి పడ్డాయి. దీంతో బస్సు గోతిలోకి ఒరిగి పోయింది. బస్సు పూర్తిగా కింద పడకుండా సిమ్మెంటు దిమ్మలు అడ్డు పడడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారు పిల్లలతో సహా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న వారిని ఎ.రావివలస పంచాయతీ కార్యాలయానికి తరలించారు. -
టూరిస్ట్ బస్సులో పాము
కర్నూలు, కొలిమిగుండ్ల: టూరిస్ట్ బస్సులో నుంచి శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై పాము కింద పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. యాత్రికుల బృందం బెలుం గుహలను తిలకించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తాడిపత్రి వైపునకు బయలు దేరారు. కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ దాటగానే డ్రైవర్ వైపు నుంచి నాగుపాము కింద పడింది. స్థానికులు గమనించి కర్రలతో కొట్టి చంపారు. కాగా పాము బస్సులో ఉన్న విషయంతో పాటు కిందపడిన సమాచారం యాత్రికులకు తెలియకపోవడం గమనార్హం. -
టూరిస్ట్ బస్సుల్లో 170 కత్తులు..ఆందోళన !
బహ్రెయిచ్(ఉత్తరప్రదేశ్): భారత్- నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు జరిపిన వాహన సోదాల్లో 170 కత్తులు లభించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం రాత్రి సరిహద్దు భద్రతా దళం, స్థానిక పోలీసులు కలిసి నేపాల్‌తోపాటు యూపీలోని మిగతా జిల్లాల వైపు వెళ్లే వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా రెండు బస్సుల్లో 93, 81 చొప్పున కత్తులు లభించాయి. దీనికి సంబంధించి నేపాల్‌కు చెందిన మున్నవర్, ఇర్పాన్, రాజుతోపాటు హర్దోయి జిల్లాకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ జుగల్ కిషోర్ తెలిపారు. కాగా, ఈ బస్సులో ప్రయాణికులెవరూ లేరని, పట్టుబడిన వారంతా బస్సు నిర్వాహకులేనని ఆయన వివరించారు. కత్తులను వారు నేపాల్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. అయితే, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని తెలిపారు. పండుగ నేపథ్యంలో కత్తులు పెద్ద సంఖ్యలో లభించడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం వాహన లనిఖీలు ముమ్మరం చేశారు. -
లోయలో పడిన యాత్రికుల బస్సు
- పలువురికి గాయాలు పుదుచ్చేరి : పుదుచ్చేరి సమీపంలోని నాగూర్ నాగపట్నం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో పలువురు యాత్రికులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు. బాధితులంతా నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుకు చెందినవారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పుదుచ్చేరి అధికారులతో మాట్లాడుతున్నారు. -
టూరిస్ట్ బస్సు బోల్తా
నల్లగొండ: టూరిస్ట్ బస్సు బోల్తాపడటంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి వద్ద చోటు చేసుకుంది. బీఎస్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన టూరిస్ట్ బస్సు భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా గోపలాయపల్లి వద్ద అదుపుతప్పడంతో రోడ్డు పక్కన బోల్తాకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్ల తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
భువనేశ్వర్‌లో బస్సు ప్రమాదం
-
భువనేశ్వర్‌లో బస్సు ప్రమాదం
భువనేశ్వర్: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ధౌలి కొండ ప్రాంతం నుంచి టూరిస్టు బస్సు జారిపడింది. పశ్చిమ బెంగాల్ మెదీనాపూర్ నుంచి పర్యాటకులతో వచ్చిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ విచారకర సంఘటన మంగళవారం సంభవించింది. ఈ సంఘటనలో 35 మంది గాయపడ్డారు. కొండపై శాంతి స్థూపం సందర్శన ముగించుకుని వస్తుండగా మలుపులో అదుపు తప్పి బస్సు కొండ నుంచి దిగువ ప్రాంతానికి జారడంతో ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రి, కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లోగడ పలుసార్లు పర్యాటక బస్సులు జారి ఇటువంటి ప్రమాదాలకు గురైన దాఖలాలు ఉన్నాయి. చర్యలు శూన్యం బంగారు త్రిభుజం పర్యటన కింద దేశ, విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. ధౌలి కొండపైన ఉన్న శాంతి స్థూపం సందర్శించేందుకు వెళ్తారు. తిరిగి వచ్చే సమయంలో మలుపు తిరిగే చోట తరచూ బస్సులు జారి పడుతున్నాయి. కొండపైకి పర్యాటక బస్సుల్ని అనుమతించడం శ్రేయోదాయకం కాదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ ఈ మేరకు ఎటువంటి చర్యల్ని చేపట్టకపోవడం విచారకరం. 2012 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన పశ్చిమ బెంగాలు నుంచి విచ్చేసిన పర్యాటక బస్సు ఇదే ప్రాంతంలో 60 అడుగుల లోతుకు జారి పడింది. ఈ సంఘటనలో 7 మంది మరణించగా 40 మంది పైబడి గాయపడ్డారు. 2016 సంవత్సరం మే 23వ తేదీన ఇదే చోట ఇటువంటి విషాద సంఘటన జరిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం సంభవించింది. 35 మంది గాయపడ్డారు. బస్సు ఊగిసలాడే పరిస్థితిలో ఉండడంతో మరణాలు సంభవించనట్టు తదుపరి విచారణ తేల్చింది. మంగళవారం మరోసారి అదే పరిస్థితి పునరావృతం కావడం దురదృష్టకరం. పశ్చిమ బెంగాలు మెదినాపూర్ ప్రాంతం నుంచి 65 మంది పర్యాటకులతో వచ్చిన బస్సు తాజా ప్రమాదానికి గురైంది. చర్యలకు ఆదేశిస్తాం: మంత్రి ధౌలి ప్రాంతంలో తరచూ సంభవిస్తున్న పర్యాటక బస్సు దుర్ఘటనల నివారణకు విభాగం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా తెలిపారు. కొండపైకి భారీ బస్సుల్ని అనుమతించకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు వివరించారు. కొండ దిగువ భాగంలో బస్సుల్ని నిలిపి చిన్న బస్సుల్లో పర్యాటకుల్ని కొండపైకి వెళ్లేందుకు అనుమతించేందుకు విభాగం చర్యలు చేపడుతుంది. బ్రేక్ ఫెయిల్, స్టీరింగ్ ఫెయిల్, టైర్లు పరిస్థితి వగైరా అంశాల్ని పరిశీలిస్తున్నారు. పరిశీలన మేరకు తదుపరి చర్యల్ని పేపడతామని స్థానిక ఎమ్వీఐ బిరాంచీ నారాయణ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిస్తే ప్రమాదానికి దారి తీసిన వాస్తవ కారణాలు, పరిస్థితులు స్పష్టం అవుతాయన్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవరుకు విచారణ జరిపితే దుర్ఘటన పూర్వాపరాలు తేటతెల్లం అవుతాయని నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి తెలిపారు. నిందితుడు అరెస్టు జయపురం: జయపురం సమితి ధన్పూర్ గ్రామంలో చింగుడు హరిజన్‌ను హత్య చేశాడన్న ఆరోపణతో నిందితుడు బుడు హరిజన్‌ను జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం సదర్ పోలీసు స్టేషన్ ఐఐసీ నిర్మళ మహాపాత్రో మంగళవారం విలేకరులకు తెలిపారు. నిందితుని వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీన పరుచుకున్నట్టు చెప్పారు. ఈ హత్యకు ప్రధాన కారణం పాత విభేదాలేనని వెల్లడించారు. నిందితుని మంగళవారం కోర్టులో హాజరు పరచినట్టు పేర్కొన్నారు. గతంలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆ గ్రామంలో తన చిన్నాన్న కుమారుడు చింగుడు హరిజన్‌ను బుడు హరిజన్ కత్తితో పొడిచి ఫరారీ అయ్యాడు. ఎట్టకేలకు పట్టుపడ్డాడు. -
వృద్ధురాలిని తప్పించబోయి...
• కంటెయినర్‌ను ఢీకొట్టిన టూరిస్టు బస్సు • ఇద్దరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు జడ్చర్ల టౌన్: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురా లిని తప్పించబోరుున టూరిస్ట్ బస్సు.. ఆగి ఉన్న కంటెరుునర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో బస్సులోని ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 25 మందికి స్వల్ప గాయాల య్యారుు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. కేరళ రాష్ట్రం మళక్పురం జిల్లా పెరుంతల్మన్నలోని అల్షిఫా ఫార్మా కాలేజీకి చెందిన 28 మంది విద్యార్థులు, ముగ్గురు ట్యూటర్లతో కలిసి విజ్ఞాన యాత్ర కోసం పొంపి ట్రావెల్స్ బస్సులో సోమవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు. బస్సు డ్రైవర్ హకీం ఉదయం 8 గంటల సమయంలో జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని తప్పించబోరుు పక్కనే నిలిపి ఉన్న కంటెరుునర్ను ఢీకొట్టాడు. దీంతో కంటెరుునర్ పైపులు 8 అడుగుల మేర టూరిస్టు బస్సులోకి చొచ్చుకుపోయారుు. ప్రమాదంలో బస్సులో నిద్రిస్తున్న మన్నార్కాడ్ గ్రామానికి చెందిన కండక్టర్ రాజీవ్ (30), పెరినింతమన్నకు చెందిన క్లీనర్ అల్మీన్ (28) పైపుల్లో ఇరుక్కుపోరుు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ హకీం తీవ్ర గాయాలతో బయటపడి పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. ఆరుగురికి తీవ్ర, 25 మందికి స్వల్ప గాయాలయ్యారుు. కొందరు క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రికి, మరికొందరిని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల సీఐ గంగాధర్ ఘటనాస్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను వేరుచేసి మృతదేహాలను బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. -
టూరిస్టు బస్సు కారు ఢీ ముగ్గురు మృతి
- బస్సును ఢీకొన్నకారు - ముగ్గురు యువకుల మృతి - మేట్టూరుపాళయంలో ఘటన టీనగర్: మేట్టుపాళయం శనివారం రాత్రి టూరిస్టు బస్సుపై కారు ఢీకొన్న ప్రమాదంలో కోయంబత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు మృతిచెందారు. కేరళ రాష్ట్రం మూనార్లోగల అడిమాలిలో ఫాతిమా మాతా బాలికల మహోన్నత పాఠశాల వుంది. ఈ పాఠశాల నుంచి గత 24వ తేదీ రాత్రి రెండు బస్సులలో మైసూరుకు విహారయాత్రగా బయలుదేరారు. టీచర్లు జెస్సిజోసెఫ్ (38), రెజిమోల్ మేథ్యూ (30), అంబాలిజోస్ (50), సింధుసినో (40) ఆధ్వర్యంలో 100 విద్యార్థినులు వెళ్లారు. మైసూరు, ఊటి ప్రాంతాలలో పర్యటించి శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఊటీ నుంచి మూనార్కు తిరిగివస్తున్నారు. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో మేట్టుపాళయం, అన్నూరు రోడ్డులో ముందు వెళుతున్న బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కోవైకు చె ందిన ముత్తు (21), వినీత్ (21), కరణ్ (21) అనే ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వినయ్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న మేట్టుపాళయం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మేట్టుపాళయం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.రైలు ఢీకొని విద్యార్థి మృతి: పెరంబూరులో రైలు ఢీకొనడంతో విద్యార్థి మృతిచెందాడు. చెన్నై, ఐనావరం చెల్లియమ్మన్ కోవిల్ వీథికి చెందిన వ్యక్తి రవి. ఇతని కుమారుడు అరవింద్ (18). ఇతను ముగప్పేర్లోగల ఒక ప్రైవేటు కళాశాలలో బిఎస్సి రెండవ ఏడాది చదువుతూ వచ్చాడు. శనివారం సాయింత్రం పెరంబూర్ క్యారేజ్ రైల్వేస్టేషన్- వర్కుషాపు మధ్య గల పట్టాలను దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆవడి నుంచి సెంట్రల్ వైపుగా వస్తున్న విద్యుత్ రైలు అతన్ని ఢీకొంది. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిగురించి సమాచారం అందగానే పెరంబూర్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. అరవింద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపారు. దీనిగురించి పెరంబూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఇక ఆర్టీసీ ‘టూరిస్టు’ బాట...
పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు టీఎస్‌టీడీసీ హోటళ్ల నిర్వహణకు పరిమితం పర్యాటకులకు రవాణా సదుపాయంలో ఆర్టీసీ సిటీబ్యూరో: ఆర్టీసీ ఇక పర్యాటక బాటలో పయనించనుంది. ఇప్పటి వరకు స్టేజీ క్యారేజీలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఇక నుంచి టూరిస్టు బస్సులుగా కూడా సేవలందజేయనున్నాయి. నగరంలోని సందర్శనీయ స్థలాలతో పాటు, రాష్ర్టంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ పర్యాటక ప్రాంతాలకు ఆర్టీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించేందుకు సన్నాహాలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు నష్టాలను అధిగమించేందుకు వివిధ రకాల ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో భాగంగా మొట్ట మొదట పర్యాటక రంగంలోకి బస్సులను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం పర్యాటకాభివృద్ధి సంస్థ స్వయంగా బస్సులను నడపడంతో పాటు, వసతి తదితర సదుపాయాలను కూడా అందజేస్తోంది. ఇక నుంచి పర్యాటకుల వసతి, హోటళ్ల నిర్వహణ బాధ్యతలు పర్యాటకాభివృద్ధి సంస్థ పరిధిలోకి, రవాణా సదుపాయాలు ఆర్టీసీ పరిధిలోకి వచ్చే విధంగా రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వివిధ అంశాలపైన ఈ రెండింటి మధ్య ఒక సమన్వయం కుదిరితే త్వరలోనే ఆర్టీసీ టూరిస్టు బస్సులు ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి షిరిడీ, శ్రీశైలం, పంచారామాలు వంటి కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుపుతోంది. పూర్తిస్థాయిలో పర్యాటక బస్సులను ప్రవేశపెడితే రాష్ర్టంలోని అన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు, ఇతర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ టూరిస్టు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. త్వరలో స్పష్టత... ప్రస్తుతం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 62 బస్సులతో పర్యాటకులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తుంది. ప్రతి రోజు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సుమారు 3000 మంది పర్యాటకులు బయలుదేరి వెళ్తారు. షిరిడీ, శ్రీశైలం, భద్రాచలం, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ర్టల్లోని పర్యాటక ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తున్నాయి. వంద మందికి పైగా డ్రైవర్లు బస్సులు నడుపుతున్నారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఈ బస్సులన్నింటినీ ఆర్టీసీ కొనుగోలు చేయడంతో పాటు, ఆ సంస్థకు చెందిన డ్రైవర్లకు సైతం ఆర్టీసీలో నియామక అవకాశం కల్పించడం ద్వారా బస్సుల నిర్వహణ బాధ్యత పూర్తిగా తమ పరిధిలోకి వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. అలాగే ఇప్పుడు ఉన్నట్లుగానే టూరిజంకు చెందిన హోటళ్లు, ఇతర వసతి సదుపాయాల నిర్వహణ పర్యాటకాభివృద్ధి సంస్థ పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. ఆదాయ, వ్యయాలు, సిబ్బంది వంటి అంశాలపైన ఒక అవగాహనకు వస్తే ఆర్టీసీ టూరిస్టు బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఈ దిశగా ప్రభుత్వ స్థాయిలో సైతం రెండు విభాగాల మధ్య ఒక అవగాహన ఏర్పడవలసి ఉంది. గ్రేటర్లో సైట్ సీయింగ్... పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు, తీర్థయాత్రలతో పాటు నగరంలోని గోల్కొండ, చార్మినార్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌పార్కు, లుంబినిపార్కు, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా, గోల్కొండ టూంబ్స్, ట్యాంక్‌బండ్, జూపార్కు, చిలుకూరు వంటి పర్యాటక, సందర్శనీయ స్థలాలకు సైతం ఆర్టీసీ బస్సులు నడుపుతారు. నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా ప్యాకేజీలను రూపొందిస్తారు. శని, ఆదివారాల్లో టూరిస్టుల కోసం ప్రత్యేక బస్సులను సైతం నడుపనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. శని,ఆది వారాల్లో సాధారణ ప్రయాణకుల రద్దీ కూడా తక్కువగానే ఉంటుంది. నగరవాసులు ఎక్కువ శాతం ఏదో ఒక పర్యాటక స్థలాన్ని ఎంపిక చేసుకొని వెళ్తారు. ఇందుకు తగినట్లుగా ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది. -
ఎన్కౌంటర్ చేస్తామంటే.. లొంగిపోయారు!
రైల్వేకోడూరు రూరల్(వైఎస్సార్): టూరిస్ట్ బస్సులో వైఎస్సార్ జిల్లాలోకి వస్తున్న ఎర్రకూలీలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో 23 మంది తమిళ కూలీలు ఉన్నారని, మరో 25మంది వరకు పరారైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్థరాత్రి సమయంలో సీఐ రసూల్సాహెబ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ టూరిస్ట్ బస్సు వచ్చింది. తిరుపతి నుంచి కడప వెళుతోందని తెలుసుకున్న పోలీసులు అనుమానంతో ఆపారు. పోలీసులను చూడగానే కొందరు బస్‌లో నుంచి దూకి పారిపోయారు. పోలీసులు, చెక్‌పోస్టు వద్ద ఉన్న సిబ్బంది బస్ చుట్టూ కట్టెలు పట్టుకుని నిలబడ్డారు. ఎన్కౌంటర్ చేస్తామని సీఐ హెచ్చరించడంతో చివరకు 23 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. వారిని బస్ సహా కోడూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. బస్‌పై ఉన్న ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
విద్యార్థి ప్రాణం తీసిన టూరిస్టు బస్సు
పెద్దదోర్నాల : పదో తరగతి విద్యార్థిని ఓ టూరిస్టు బస్సు మృత్యువు రూపంలో వచ్చి కబళించింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామచంద్రకోటలో గురువారం జరిగింది. వివరాలు.. చిన్న దోర్నాలకు చెందిన గోతం విక్రమ్(15) రామచంద్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వచ్చిన విక్రమ్.. మార్కాపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న తాతను చూసేందుకు ఉపాధ్యాయుల అనుమతితో వెళ్లాడు. తిరిగి ఆటోలో పాఠశాల వద్ద దిగి స్డడీ అవర్ కోసం లోనికి వెళ్తున్నాడు. ఇంతలో ఓ టూరిస్టు బస్సు వేగంగా వచ్చి విక్రమ్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడటంతో ఉపాధ్యాయులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం హుటాహుటిన దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విక్రమ్ మృతి చెందాడు. ఎస్సై బ్రహ్మనాయుడు తన సిబ్బందితో కలిసి వైద్యశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సహచరుల్లో విషాద ఛాయలు రోడ్డు ప్రమాదంలో విక్రమ్ మరణించాడని తెలిసి సహచర విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయినులు భోరున విలపించారు. విద్యార్థి తల్లిదండ్రులు వెంగయ్య, తిరుపతమ్మలు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జంకె ఆవులరెడ్డిలు ఆస్పత్రికి వచ్చి విక్రమ్ మృతదేహానికి నివాళులర్పించారు. ైవె ద్యులపై చర్యలు తీసుకోవాలి తీవ్రంగా గాయపడిన విద్యార్థికి సరైన వైద్యం చేయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్యశాల ఎదుట భైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విక్రమ్‌కు సరైన వైద్యం అందించి ఉంటే బతికే వాడన్నారు. ఖాళీ సిలండర్ పెట్టటం వ ల్ల ఆక్సిజన్ అందక విక్రమ్ మృతి చెందాడని ఆరోపించారు. ఎస్సై బ్రహ్మనాయుడు తన సిబ్బందితో కలిసి ఆందోళనకారులకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
ఐదుగురి సజీవదహనం
తమిళనాడులో టూరిస్ట్ బస్సులో చెలరేగిన మంటలు మృతులు బెంగాల్‌వాసులు సాక్షి, చెన్నై: విహారయాత్రకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌వాసులు ప్రయాణిస్తున్న బస్సు శనివారం అర్ధరాత్రి తమిళనాడులో ప్రమాదానికి గురైంది. రామనాథపురం సమీపంలో బస్సులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్గూర్, ఉక్కులి, మిడ్నాపూర్ ప్రాంతాలకు చెందిన 70 మంది ఆగస్టు 22న బస్సులో విహారయాత్రకు బయలు దేరారు. ఈ బృందం శనివారం రామనాథ స్వామి దర్శనానంతరం కన్యాకుమారికి బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుప్పులాని వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో చెలరేగిన మంటలతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. గాఢ నిద్రలో ఉన్న వాళ్లు మేల్కొని బయటకు పరుగులు తీశారు. బస్సులో వంట నిమిత్తం ఉంచిన సిలిండర్ పేలడంతో మంటలు మరింత వ్యాపించాయి. 50 మందికి పైగా బస్సు నుంచి బయట పడగా.. మిగిలిన వారు మంటల్లో చిక్కారు. రోడ్డు ప్రమాదంలో 10 మంది భక్తుల మృతి జోధ్‌పూర్: రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది భక్తులు మృత్యువాతపడ్డారు. మరో 34 మంది గాయపడ్డారు. ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు పాలీ జిల్లా మనీడా గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. -
టూరిస్టు బస్సు బోల్తా
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 28 మందికి గాయాలు 8 మంది పరిస్థితి విషమం నందిగామ/ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యా యి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లోని కాకాగూడ ప్రాంతాలకు చెందిన 48 మంది ప్రయాణికులు మోహిని ట్రావెల్స్ బస్సులో ఫిబ్రవరి 9న తీర్థయాత్రలకు బయల్దేరారు. మేడారం జాతర, భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండ గా... మునగచర్ల సమీపంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో వెనుక టైర్లు బస్సు నుంచి వేరయ్యాయి. అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో చేకూరి శోభారాణి, జి.అంజమ్మ, గుండెపల్లి విమల, ఎ.స్వరూపరాణి, జి.సత్యనారాయణ, ఎం.సరిత, ఎం.లక్ష్మి, ఎస్.అఖిల, లింగాల మంగ, సుస్మిత, జి.జమ్ధీర్, ఆర్.ఉమాకారత్, వై.సహస్ర, పి.తుసీక్, ఎం.పద్మ, ఎల్.మంగ, ఎన్.లక్ష్మి, ఎం.ఆశ, ఎస్.లావణ్య, జి.స్వరూప, పి.రామకృష్ణ, పి.కొండమ్మ, ఎం.ఆనంద్‌గౌడ్, నవీన్‌గౌడ్ ఆర్.కళావతి, ఎల్.సునీల్ కుమా ర్, జె.దుర్గమ్మ, పి.ఇందిర, ఎల్.విక్రమ్గౌడ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు నందిగామ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని పలు ఆసుపత్రులకు తరలించారు. మిగతా ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల్లో సికింద్రాబాద్‌కు పంపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. వేరే ప్రమాదంలో.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీవీ సీరియల్ బృందం కారు ఆదివారం ఇబ్రహీంపట్నం రింగురోడ్డు సెంటర్లో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. -
టూరిజం బస్సులో పొగలు..
బొల్లారం/అనంతపురం, న్యూస్‌లైన్: రాష్ట్రంలో బుధవారం రెండు చోట్ల బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్ని కలవరానికి గురి చేశాయి. హైదరాబాద్ నుంచి షిర్డీకి బయలుదేరిన టూరిజం బస్సు (ఏపీ23వై 2179) కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. బస్సులో ఎడమ పక్క నుంచి పొగలు రావడాన్ని ఒక ప్రయాణికుడు గుర్తించి డ్రైవర్లు అహ్మద్, వెంకటేశ్వర్లను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సును నిలిపివేసిన వెంటనే ఎనిమిది మంది ప్రయాణికులు దిగిపోయారు. బ్యాటరీ బాక్సు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్లు, దానిపై నీళ్లు, మట్టి కుమ్మరించి మంటలు చెలరేగకుండా నివారించారు. మరోపక్క అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో కదిరి డిపో బస్సు(ఏపీ28 జెడ్ 4947)లో డ్రైవర్ లక్ష్మయ్య సెల్ఫ్ బటన్ నొక్కగానే.. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంజిన్ మంటలు రేగాయి. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు భయాందోళనతో కిందకు దిగి పరుగులు తీశారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. బాయినెట్ కప్పును తీసివేసి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారని, ఆ సమయంలో ఆయన చేతులకు స్వల్ప గాయాలయ్యాయని ఆర్ఎం జి. వెంకటేశ్వరరావు చెప్పారు.