Travellers
-
ఆ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!
సాధారణంగా కొందరికి ప్రయాణాలంటే ఒక విధమైన యాంగ్జైటీ ఉంటుంది. దీంతో ఆందోళనగా చెమటలు పట్టేసి ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు. ఈ జర్నీ ఎప్పుడు పూర్తి అయ్యి ఇంటికి చేరుకుంటామా..! అని అనుకుంటుంటారు. అలాంటి వారికి ఈ ఎయిర్పోర్ట్ ఒత్తిడిని దూరం చేసేలా లామా థెరఫీని అందిస్తుంది. ఇదేంటి అనే కదా..!ఏం లేదండి మనకిష్టమైన వ్యక్తులు లేదా పెంపుడు జంతువులను చూడగానే రిలీఫ్‌గా ఉంటుంది. ఏ విధమైన భయాందోళనలు దరిచేరవు. పైగా ధైరంగా ఉంటుంది. అలాంటి ఆలోచనతోనే లోరీ గ్రెగోరీ, షానన్ జాయ్చే అనే తల్లికూతుళ్ల బృందం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన థెరపీని అందిస్తుంది. ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేలా లామాస్, అల్పాకాస్ అనే ఒంటె జాతికి చెందిన జంతువులతో లామా అనే థెరపీని అందిస్తోంది. అలాంటి జంతువులు ఈ ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం ఐదు లామాలు, ఆరు అల్పాకస్లు ఉన్నాయి. వాటితో ఈ థెరపీని అందిస్తుంది. ఈ జంతువులు మెడలకు "ఐ హార్ట్ PDX" నెక్కర్చీఫ్లు, పాంపమ్ హెడ్‌బ్యాండ్‌లతో ప్రయాణికులకు దర్శనమిస్తాయి. అసలు ఇవి ఎలా ప్రయాణికులకు థెరపీని అందిస్తాయనే కదా సందేహం..లామా థెరపీ అంటే..ఏం లేదండి ఇవి అందంగా ముస్తాభై ఎయిర్పోర్ట్ అంత కలియతిరుగుతాయి. అక్కడకు వచ్చిన ప్రయాణికుల దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగతుంటాయి అంతే..!. అయితే ఆ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రయాణికులు.. వాటిని చూడగానే జర్నీ వల్ల కలిగిన యాంగ్జైటీ అంతాపోయి ముఖంపై చిరునవ్వు వస్తుందట. దీన్నే లామా థెరపీ అంటారు. ఆ ఒంటె జాతికి చెందిన జంతువుల పేరు మీదుగా ఆ థెరఫీకి పేరు పెట్టారు. అంతేగాదు అక్కడకు వచ్చిన ప్రయాణికులంతా వాటిని చూడగానే ప్రశాంతత వస్తుందని, సంతోషంగా ఉంటామని చెబుతున్నారట. దీన్ని ఎలాంటి లాభప్రేక్ష లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఆ తల్లి కూతుళ్లు నిర్వహించడం విశేషం. అంతేగాదు విమానాశ్రయ ప్రతినిధి అల్లిసన్ ఫెర్రే ఈ జంతువుల కారణంగా ప్రయాణికుల ముఖాల్లో ఒత్తడి మాయం అయ్యి ప్రశాంతంగా కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు కూడా. ఈ పోర్ట్‌ల్యాండ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు శాంతియుత వాతావరణాన్ని అందించేలా సహజమైన కాంతిని అందించే లైట్లు, ఆహ్లాదభరితమైన అందమైన పూల కుండీలు తదితరాలతో టెర్మినల్ని రీ డిజైన్ చేశారట అక్కడ అధికారులు. అందులో భాగంగానే ఈ జంతువులను కూడా ఏర్పాటు చేశారట. ఇలా జంతువులతో సర్వీస్ అందించటం తొలిసారి కాదు గతంలో శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని "వాగ్ బ్రిగేడ్"లో డ్యూక్ అనే 14 ఏళ్ల పిల్లిని కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారట. ఆ పిల్లి పైలట్ టోపీ చొక్కా కాలర్ ధరించి ప్రయాణికుల ఆందోళన భయాలను పోగొట్టేలా ఆ ఎయిర్‌పోర్ట్‌లో కలియతిరుగుతుండేదట. View this post on Instagram A post shared by Portland International Airport (@pdxairport) (చదవండి: కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..) -
భారతీయులకు శుభవార్త.. సౌదీ వెళ్లడానికి కొత్త ఎంట్రీ వీసాలు
సౌదీ అరేబియా పర్యాటకాన్ని పెంచే దిశగా భారతీయ పౌరుల కోసం కొత్త వీసా ఎంపికలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో స్టాప్ఓవర్ వీసాలు, ఈవీసాలు, వీసా ఆన్ అరైవల్ వంటివి ఉన్నాయి. 2024 చివరి నాటికి సౌదీ అరేబియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలని ఈ కొత్త వీసాలను ప్రవేశపెట్టడం జరిగింది.భారతీయులు ఇప్పుడు స్టాప్ఓవర్ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 96 గంటలు చెల్లుతుంది. ఈ వీసాను సౌదియా ఎయిర్‌లైన్ వెబ్సైట్ ద్వారా 90 రోజులు ముందుగానే పొందవచ్చు. దీనికోసం నామినల్ ఫీజు వంటివి చెల్లించాల్సి ఉంటుంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లేదా స్కెంజెన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఈవీసా పొందటానికి అర్హులు. ఈ దేశాలలో శాశ్వత నివాసితులు లేదా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన తేదీ కంటే కనీసం మూడు నెలల చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవీసా అధికారిక పోర్టల్ ద్వారా దీనిని పొందవచ్చు.ఈవీసా కోసం అవసరమైన ప్రమాణాలు ఉన్నవారు.. వీసా ఆన్ అరైవల్ కూడా పొందవచ్చు. యూఎస్, యూకే, స్కెంజెన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలు కలిగిన వారికి మాత్రమే కాకుండా ఈ దేశాలలో శాశ్వత నివాసితులకు వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. దీని కోసం సౌదీ విమానాశ్రయాల్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు లేదా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.సౌదీ అరేబియా భారతీయ పౌరుల కోసం అందిస్తున్న ఈ వీసాల కోసం.. ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్లలోని 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరిన్ని నగరాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. సౌదీ విజన్ 2030లో భాగంగా 2030నాటికి 75 లక్షల మంది ప్రయాణికులను సౌదీ అరేబియా ఆహ్వానించనుంది. -
పండగ వేళ రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట
ఢిల్లీ: దీపావళి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. కొన్ని మార్గాల్లో రైళ్లు కిక్కిరిసిపోయాయి. టికెట్ ముందే బుక్ చేసుకున్నప్పటికీ రైలులో కాలుపెట్టే పరిస్థితి లేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యాజమాన్యంపై విమర్శలు కురిపిస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం వల్ల తాము దీపావళికి ఇంటికి చేరుకోలేకపోయామని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. "ఇండియన్ రైల్వే నిర్వహణలోపం నా దీపావళిని నాశనం చేసింది. ఏసీ టిక్కెట్‌ను కొన్నప్పటికీ రైలు ఎక్కే పరిస్థితి లేదు. పోలీసుల నుండి ఎటువంటి సహాయం లేదు. నాలాంటి చాలా మంది రైలు ఎక్కలేకపోయారు," అని ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి పంచుకున్నాడు. PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 దేశ రాజధానిలోనూ దీపావళి వేడుకల సందర్భంగా ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో ఆనంద్ విహారీ కౌశాంబి ప్రాంతంలో ఇంటర్ స్టేట్ బస్సు టర్మినల్లో నడవడానికి కూడా వీలులేని దుస్థితి ఏర్పడింది. పండగ సందర్భంగా జనం సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. #WATCH | Huge rush of people at Anand Vihar- Kaushambi on Delhi-UP border near the Anand Vihar railway station and inter-state bus terminal pic.twitter.com/DkDXSgganz — ANI (@ANI) November 11, 2023 న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్‌లో బీహార్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరికొందరు స్పృహతప్పి పడిపోయారని పోలీసులు తెలిపారు. #WATCH | Gujarat | A stampede situation ensued at Surat railway station due to heavy crowd; one person died while three others were injured. The injured were shifted to the hospital: Sarojini Kumari Superintendent of Police Western Railway Vadodara Division (11.11) pic.twitter.com/uAEeG72ZMk — ANI (@ANI) November 11, 2023 ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
ఫారిన్ టూర్.. ఫారెక్స్ కార్డ్ బెటర్
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గతంతో పోలిస్తే విదేశీ ప్రయాణం ఎంతో సౌకర్యంగా మారింది. విమానాశ్రయాలు, విమాన సర్వీసుల నెట్వర్క్ విస్తృతం అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా, సులభంగా ప్రయాణించే వెసులుబాటు దక్కింది. మరి విదేశాలకు వెళ్లే వారు తమ వెంట ఆయా దేశానికి చెందిన కరెన్సీని కూడా తీసుకెళుతుంటారు. ఈ అవసరాన్ని తప్పించేదే ఫారెక్స్ కార్డ్. ఏ దేశానికి వెళితే ఆ దేశ కరెన్సీ రూపంలో ఈ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్ ఉంటే కరెన్సీ నోట్లు పాకెట్లో లేకపోయినా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇది చెల్లుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ కంటే ఫారెక్స్ కార్డ్ వల్ల ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఈ ఫారెక్స్ కార్డుతో ప్రయోజనాలు? ఎలా పనిచేస్తుంది? ఇందులో ఎన్ని రకాలు? చార్జీలు తదితర విషయాలను తెలియజేసే కథనమే ఇది! ఫారెక్స్ కార్డ్ అంటే..? ఇదొక ప్రీపెయిడ్ కార్డ్. మీరు వెళ్లాలనుకునే దేశ కరెన్సీ మారకంలో డిపాజిట్ చేసుకుని, వినియోగించుకునే సాధనం. ఈ కార్డ్‌తో విదేశాల్లో చెల్లింపులు చేయడమే కాకుండా, ఏటీఎం నుంచి ఆ దేశ కరెన్సీని ఉపసంహరించుకోవచ్చు. ఈ కార్డ్ ఉంటే వెంట భౌతిక రూపంలో కరెన్సీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫారెక్స్ కార్డుల్లో రకాలు... విదేశాలకు వెళ్లే వారికి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవాలి. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఈ కార్డుల్లో పలు రకాలు ఉన్నాయి. సింగిల్ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఇందులో ఒకటి. ఏదైనా ఒక దేశ కరెన్సీనే ఇందులో లోడ్ చేసుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ రెండో రకం. ఇందులో ఒకటికి మించిన దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. వివిధ దేశాలకు వెళ్లే వారికి మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉపయోగకరం. దాదాపు ప్రముఖ బ్యాంకులన్నీ కూడా ఫారెక్స్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రయోజనాలు/సదుపాయాలు విదేశాల్లో చెల్లింపులు సురక్షితంగా చేసేందుకు ఫారెక్స్ కార్డ్ అనుకూలం. క్రెడిట్ కార్డ్‌కు మాదిరే అన్ని రకాల సదుపాయాలు కూడా వీటిల్లో ఉంటాయి. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో, ముందుగానే బ్యాంక్ ఖాతా నుంచి లోడ్ చేసుకోవాలి. ఫలితంగా విదేశాల్లో వినియోగంపై స్వీయ నియంత్రణ ఉంటుంది. కావాల్సినంతే లోడ్ చేసుకోవచ్చు. అంతే మేర ఖర్చు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్‌ను దాదాపు అన్ని చోట్లా ఆమోదిస్తారు కనుక సౌకర్యవంతగా ఉంటుంది. దీంతో ఏటీఎంలు లేదంటే ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాల కోసం చూసుకోవాల్సిన అవసరం రాదు. ముఖ్యంగా కరెన్సీని తీసుకెళ్లే అవసరాన్ని తప్పిస్తుంది. దీంతో నగదుతో పోలిస్తే సౌకర్యం, సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు కరెన్సీ విలువల్లో అస్థిరతల ప్రభావం కూడా ఉండదు. లోడ్ చేసిన రోజు విలువే స్థిరంగా కొనసాగుతుంది. దాంతో రోజువారీ కరెన్సీ మారకం హెచ్చుతగ్గుల సమస్య ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు చార్జీలతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ చౌక ఆప్షన్. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ కరెన్సీ మారకం చార్జీ పడుతుంది. ఎందుకంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశ కరెన్సీలోకి రూపాయిలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మారకం చార్జీని కరెన్సీ మార్కప్ చార్జీగా పేర్కొంటారు. కార్డ్, బ్యాంక్ ఆధారంగా ఈ చార్జీ 2–5 శాతం మధ్య ఉంటుంది. ఫారెక్స్ కార్డుల్లో ఎన్నో సదుపాయాలు ఉండడంతో, సంప్రదాయ చెల్లింపు సాధనాలతో పోలిస్తే ఇవి ఆకర్షణీయమైనవని చెప్పుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉంటే, ఒకేసారి ఒక దేశం తర్వాత మరో దేశానికి వెళ్లేట్టు అయితే ఉపయోగకరంగా ఉంటుంది. కావాల్సిన ప్రతిసారీ బ్యాంకుల్లో కరెన్సీని మార్చుకోవడం కంటే ఫారెక్స్ కార్డు తీసుకెళ్లడమే సౌకర్యం. బ్యాంకులకు సైతం ఫారెక్స్ కార్డులతో తక్కువ వ్యయం అవుతుంది. దీంతో అవి ఫారెక్స్ కార్డుదారులకు ఆ ప్రయోజనాలను అందిస్తుంటాయి. భౌతిక కరెన్సీతో పోలిస్తే ఫారెక్స్ కార్డులో లోడ్ చేసుకోవడం వల్ల మరింత మెరుగైన మారకం రేటు సాధ్యపడుతుంది. ఈ కార్డ్ పొందేందుకు ఆయా బ్యాంక్ ఖాతాదారు కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కనుక, బ్యాంక్‌లు సులభంగా మంజూరు చేస్తుంటాయి. మార్కెట్లో వివిధ బ్యాంకులు ఎన్నో ఫీచర్లతో వీటిని ఆఫర్ చేస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, తమకు అనుకూలమైనది తీసుకోవచ్చు. ఒకవేళ ఫారెక్స్ కార్డ్‌ను ఎక్కడైనా కోల్పోతే, వెంటనే బ్యాంక్ లేదా ఎన్బీ ఎఫ్సీకి కాల్ చేసి చెబితే మిగిలిన బ్యాలన్స్ దురి్వనియోగం కాకుండా ఫ్రీజ్ చేసేస్తారు. విదేశాల్లోని పీవోఎస్ మెషీన్ల వద్ద ఫారెక్స్ కార్డులను స్వైప్ చేస్తే ఎలాంటి చార్జీలు పడవు. కానీ అదే డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేసిన ప్రతిసారీ ఎంతో కొంత చార్జీ పడుతుంది. పైగా ఇతర సాధనాలతో పోలిస్తే ఫారెక్స్ కార్డులకు అంతర్జాతీయంగా ఎక్కువ ఆమోదం ఉంటుంది. అంతేకాదు విదేశాల్లో ఆన్లైన్ కొనుగోళ్లకు సైతం ఫారెక్స్ కార్డులతో చెల్లింపులు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌పై విదేశాల్లో ఖర్చు చేస్తే సకాలంలో చెల్లింపులు చేయకపోతే, భారీ వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజులు పడతాయి. ఫారెక్స్ కార్డ్ ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో ఈ సమస్య ఉండదు. ► ఒకేసారి ఒకటికి మించిన దేశాలను పర్యటించే వారు, ఆయా దేశాల కరెన్సీని వెంట తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా, మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఎంపిక చేసుకోవడం నయం. ► కార్డ్‌లో బ్యాలన్స్ మిగిలి ఉంటే, స్వదేశానికి వచి్చన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి నగదుగా మార్చుకోవచ్చు. ► విదేశీ పర్యటన ముగించి స్వదేశానికి వచ్చిన తర్వాత.. తిరిగి విదేశానికి వెళ్లేంత వరకు కార్డ్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్లీ విదేశీ యాత్రకు ముందు యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో వినియోగం లేకపోయినా చార్జీలు, పెనాలీ్టలు పడవు. మెయింటెనెన్స్ చార్జీలు కూడా ఉండవు. ► ఫారెక్స్ కార్డ్‌లపై డీల్స్, డిస్కౌంట్లు వస్తుంటాయి. ► ఫారెక్స్ కార్డుల్లో చాలా వరకు లాక్డ్ ఇన్ ఎక్సే్ఛంజ్ రేట్ అనే ఫీచర్‌తో వస్తాయి. అంటే కరెన్సీ రేటులో అస్థిరతలను ఈ సదుపాయంతో అధిగమించొచ్చు. ఉదాహరణకు కార్డులో డాలర్లు లోడ్ చేసుకుంటే, ఆ రోజు ఉన్న విలువ ప్రకారమే లాక్ అవుతుంది. దాని విలువ బ్యాలన్స్ ముగిసే వరకు స్థిరంగా కొనసాగుతుంది. ► ఫారెక్స్ కార్డ్ లేకుండా వెళితే, విదేశాల్లో అవసరమైన చోట కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం శ్రమపడాల్సి రావచ్చు. ఫారెక్స్ కార్డ్ అయితే ఉన్న చోట నుంచే కోరుకున్న మారకం రేటులో లోడ్ చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈ కామర్స్ పోర్టళ్లపై ఫారెక్స్ కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వర్తకులు ఈ కార్డ్‌ను ఆమోదిస్తారు. విమాన టికెట్ బుకింగ్‌లు, హోటల్ బుకింగ్, డైనింగ్, ఆఫ్‌లైన్, ఆన్లైన్ షాపింగ్‌కు వాడుకోవచ్చు. ► ఫారెక్స్ కార్డ్‌తో ఏ దేశంలో ఏటీఎం నుంచి అయినా ఆ దేశ కరెన్సీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం లొకేషన్ ఆధారంగా ఏ దేశంలో ఉన్నారనేది కార్డ్ నెట్వర్క్ గుర్తిస్తుంది. సంబంధిత దేశ కరెన్సీని అందిస్తుంది. ► ఫారెక్స్ కార్డ్‌లలో ఎంబెడెడ్ చిప్ టెక్నాలజీ ఉంటుంది. సున్నితమైన సమాచారం ఎన్క్రిపె్టడ్గా ఉండటంతో మోసాల రిస్క్ చాలా తక్కువ. ► ఇవి కనీసం ఐదేళ్ల ఎక్స్పైరీ తేదీతో వస్తాయి. ► ఒక దేశానికి వెళుతూ కొంత బ్యాలన్స్‌ను లోడ్ చేసుకున్న తర్వాత, చివరికి మిగులు ఉందనుకోండి.. ఆ తర్వాత ఆ బ్యాలన్స్‌ను ఏ దేశంలో అయినా వినియోగించుకోవచ్చు. ► మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్‌ల్లో 16–22 దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. ఫీజులు/చార్జీలు.. కార్డ్ జారీ చేసే సంస్థ ఆధారంగా ఫీజులు, చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సింగిల్ కరెన్సీ కార్డ్‌తో పోలిస్తే మల్టీ కరెన్సీ కార్డ్ చార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇష్యూయన్స్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ.100–500 మధ్య ఉంటుంది. రీలోడ్, రెన్యువల్ చార్జీలు కూడా చెల్లించుకోవాలి. కార్డులో కరెన్సీని లోడ్ చేసిన ప్రతిసారీ రీలోడ్ చార్జీ పడుతుంది. అదనపు కార్డ్ కావాలంటే యాడాన్ కార్డ్ తీసుకోవచ్చు. దీనికి విడిగా ఫీజు పడుతుంది. కార్డులో బ్యాలన్స్‌ను నగదు రూపంలో తీసుకున్న సందర్భంలోనూ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో కార్డ్ నుంచి నగదు తీసుకున్న ప్రతి సారీ చార్జీ విధిస్తారు. కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకున్నా కూడా చార్జీ పడుతుంది. మీరు చెల్లింపులు చేసిన కరెన్సీ, కార్డ్‌లో లోడ్ అయి ఉన్న కరెన్సీ వేర్వేరు అయితే అప్పుడు క్రాస్ కరెన్సీ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇది 3.5 శాతం వరకు ఉంటుంది. అదే మలి్టపుల్ కరెన్సీ కార్డులో ఈ సమస్య ఉండదు. కార్డ్‌ను కోల్పోయి, తిరిగి తీసుకుంటే అప్పుడు కూడా చార్జీ పడుతుంది. వీటిని గుర్తు పెట్టుకోవాలి.. ► ప్రతి లావాదేవీ అనంతరం కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్ ఎక్కడైనా పొగొట్టుకుంటే లేదా చోరీకి గురైనా వెంటనే బ్యాకప్ కార్డ్ తీసుకోవాలి. ► ప్రతీ పర్యటనకు ముందు ఏటీఎంకు వెళ్లి పిన్ మార్చుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్‌ను విదేశాల్లో ఇల్లు, కారు, రూమ్ రెంటల్స్‌కు వినియోగించుకోవద్దు. ► కార్డ్‌లో లోడ్ చేసిన కరెన్సీ కాకుండా, మరో కరెన్సీలో చెల్లింపులు చేయకుండా ఉండడమే మంచిది. దీనివల్ల అనవసర వ్యయాలను నివారించుకోవచ్చు. ► టోల్ చార్జీలు చెల్లించేందుకు సైతం ఫారెక్స్ కార్డ్‌ను వాడుకోవద్దు. ► కొన్ని బ్యాంక్‌లు తక్కువ మార్కప్, లోడింగ్ చార్జీతో క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిపై రివార్డులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇవి కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కానీ, అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దరఖాస్తుకు ముందు.. ఫారెక్స్ కార్డ్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న పలు రకాల కార్డ్‌లు, వాటిల్లోని ఫీచర్లను పూర్తిగా తెలుసుకోవాలి. చార్జీల గురించి అడిగి తెలుసుకోవాలి. బ్యాంక్‌లు, పెద్ద ఆరి్థక సంస్థలు, ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీల నుంచి ఈ కార్డ్ తీసుకోవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లి లేదంటే ఆన్లైన్ నుంచి అయినా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని సంస్థలు ఒకటికి మించిన కార్డ్‌లను వివిధ రకాల ఫీచర్లతో ఆఫర్ చేస్తున్నాయి. కార్డ్ తీసుకునేందుకు కొన్ని రకాల డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ కాపీ (స్వయంగా అటెస్ట్ చేసింది), వీసా కాపీ, ఎయిర్‌లైన్ టికెట్ కాపీ, పాన్ కార్డ్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్ మాదిరే ఫారెక్స్ కార్డుకు అనుబంధంగా పిన్ వస్తుంది. దీన్ని మొదటిసారి మార్చుకోవాలి. కార్డు జారీ చేసిన బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా ఈ సదుపాయం ఉంది. ప్రతి లావాదేవీ అనంతరం వచ్చే ఎస్ఎంఎస్ను చూసి తెలుసుకోవచ్చు. -
రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి..
పూణే: పూణే రైల్వే స్టేషన్లో అమానుషమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రైలు రావడం ఆలస్యమైన కారణంగానో మరేదైనా కారణం వల్లనో ఆదమరిచి నిద్రిస్తున్న ప్రయాణికులు కొంతమందిని నిద్ర లేపడానికి నిర్దాక్షిణ్యంగా వారి మొహం మీద నీళ్లు చల్లాడు ఓ సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్. ఈ దృశ్యాన్ని చరవాణిలో బంధించిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీనిపై స్పందిస్తూ పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ ఇందు దూబే ఇది అమానుషం అన్నారు. రైళ్ల రాకపోకలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని అనిశ్చితిలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో సేదదీరడం సర్వసాధారణంగానే మనం చూస్తూ ఉంటాం. రైల్వే ప్లాట్ ఫారం మీద నిద్రించడం నిబంధనలకు విరుద్ధమే. అయినా ఆ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఒక రైల్వే కానిస్టేబుల్ మాత్రం కర్కశంగా వ్యవహరించాడు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గాఢంగా నిద్రిస్తున్న ప్రయాణికుల మొహం మీద బాటిల్ తో నీళ్లు కుమ్మరించాడు. దీంతో ఏమైందోనని ఉలిక్కిపడి లేచారు ప్రయాణికులు. వారిలో ఒక పెద్దాయన కూడా ఉన్నారు. మానవత్వాన్ని తుంగలో తొక్కిన ఈ సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో "మానవత్వానికి నివాళులు" అని రాసి పోస్ట్ చేశాడు ఒక యువకుడు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోను ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. వీరిలో అత్యధికులు రైల్వే కానిస్టేబుల్ పై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు. RIP Humanity 🥺🥺 Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn — 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) June 30, 2023 రైల్వే స్టేషన్లలో ఇతరులకు అడ్డంకిగా ఎక్కడ పెడితే అక్కడ నిద్రించడం నిబంధనలకు విరుద్ధం. ఆ విషయాన్ని వారికి మర్యాదపూర్వకంగానూ, గౌరవంగా అర్ధమయ్యేలా కౌన్సెలింగ్ చెయ్యాలి గానీ ఈ విధంగా మొహాన నీళ్లు చల్లడం తీవ్ర విచారకరమని అన్నారు రైల్వే డివిజనల్ మేనేజర్ ఇందు దూబే. నెటిజన్లు ఈ సంఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. కొంతమంది రైల్వే కానిస్టేబుల్ ను నిందించగా మరికొంత మంది అతడికి మద్దతుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే.. -
ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా?
ముంబై: హోటల్స్ ర్యాంకింగ్‌కు సంబంధించిన ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ (2023)లో జైపూర్‌కి చెందిన రాంబాగ్ ప్యాలెస్ ప్రపంచంలోనే నంబర్ వన్ హోటల్‌గా నిల్చింది. 1835 నాటి ఈ ప్యాలెస్‌ను ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) హోటల్‌గా తీర్చిదిద్ది, నిర్వహిస్తోంది. దీన్ని ’జ్యుయల్ ఆఫ్ జైపూర్’గా కూడా వ్యవహరిస్తుంటారు. ట్రావెల్ సైట్ ట్రిప్అడ్వైజర్ వార్షికంగా ప్రకటించే.. పర్యాటకులు మెచ్చిన హోటల్స్ జాబితాలో మాల్దీవులకు చెందిన ఓజెన్ రిజర్వ్ బాలిఫుషి, బ్రెజిల్‌లోని హోటల్ కోలీన్ డి ఫ్రాన్స్ రెండు, మూడో స్థానాల్లో నిల్చాయి. తమ పోర్టల్‌లో నమోదైన 12 నెలల డేటా (2022 జనవరి 1 నుంచి – డిసెంబర్ 31 వరకు) విశ్లేషణ ఆధారంగా ట్రిప్అడ్వైజర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. భారత్‌లోని టాప్ 10 హోటల్స్ ఇవే.. రాంబాగ్ ప్యాలెస్ - జైపూర్ తాజ్ కృష్ణ - హైదరాబాద్ వెస్టిన్ గోవా - గోవా బ్లాంకెట్ హోటల్ అండ్ స్పా - పల్లివాసల్ చండీస్ విండీ వుడ్స్ - చితిరపురం జేడబ్ల్యూ మారియట్ హోటల్ పూణే - పూణే షెరటన్ గ్రాండ్ చెన్నై రిసార్ట్ అండ్ స్పా - చెన్నై కోర్ట్ యార్డ్ అమృత్సర్ - అమృత్సర్ జేడబ్ల్యూ మారియట్ హోటల్ బెంగళూరు - బెంగళూరు లీలా ప్యాలెస్ ఉదయపూర్ - ఉదయపూర్ ఇదీ చదవండి: ఎల్ఐసీకి మంచి రోజులు.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులకు పెరిగిన విలువ -
ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో కొత్త వెర్షన్ వందే భరత్ రైళ్లు
-
తిరుపతి జిల్లా: పూడి క్రాస్ వద్ద ఆర్టీసి బస్సు బోల్తా
-
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్స్
-
హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న హై రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వారం రోజులు క్వారంటైన్లో ఉంచనున్నట్లు తెలిపింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి డా.కే శివకుమార్ శనివారం తెలిపారు. నాలుగు రకాల కరోనా వేరియంట్ల విజృంభణతో చైనా విలవిల్లాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. చదవండి: న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా.. -
ఆ దేశాల కరోనా ఆంక్షలపై చైనా సీరియస్.. ఇదేం తీరు..?
బీజింగ్: చైనాలో కరోనా కేసులు ఆందోళనకరస్థాయిలో పెరిగిన కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి నిబంధన తీసుకొచ్చాయి. అయితే ఈ విషయంపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశం నుంచి వచ్చినవారికే పరీక్షలు నిర్వహించడం వివక్షపూరితమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా కరోనా నియంత్రణకు తాము చేపట్టిన చర్యలను నిర్వీర్యం చేసినట్లేనని వ్యాఖ్యానించింది. అమెరికా, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్, తైవాన్ సహా భారత్ కూడా చైనా ప్రయాణికులపై ఇటీవలే ఆంక్షలు విధించింది. చైనా నుంచి వచ్చేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వ మీడియా స్పందించింది. అయితే చైనా వ్యాఖ్యలు చూస్తుంటే వింతగా అన్పిస్తోంది. మొన్నటివరకు ప్రపంచంలో ఏ దేశమూ చేయని విధంగా మూడేళ్లపాటు కఠిన కరోనా ఆంక్షలు అమలు చేసింది. విదేశాల నుంచి వెళ్లేవారు కచ్చితంగా క్వారంటైన్లో ఉండి, కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే అనుమతించింది. ఈనెల మొదట్లోనే ఆంక్షలు సడలించింది. జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్లు చెప్పింది. కానీ.. కరోనా పరీక్షమాత్రం తప్పనిసరి చేసింది. అలాంటి చైనా ఇప్పుడు వేరే దేశాలు ఆంక్షలు అమలు చేస్తే మాత్రం వివక్షపూరితం అనడం హాస్యాస్పదంగా ఉంది. డిసెంబర్ 7 నుంచి చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశారు. ఆ తర్వాత నుంచి కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చైనా మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది. చదవండి: సమాచారం దాచి.. సంక్షోభం పెంచి -
కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..
బీజింగ్: కరోనా నిబంధనలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణికులకు విముక్తి లభించింది. ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ద్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. అలాగే కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన విదేశీయులను ట్రాక్ చేయడాన్ని కూడా చైనా నిలిపివేస్తోంది. సరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వెలుగు చూసిన కొత్తలో విదేశీ ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులు ప్రభుత్వ కారంటైన్ కేంద్రంలో ఉండాలని చైనా రూల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు దీన్ని 21 రోజులకు పెంచింది. అయితే కేసులు తగ్గాక ఐదు రోజులకు తగ్గించింది. కోవిడ్ జీరో పాలసీ పేరుతో దాదాపు మూడేళ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది డ్రాగన్ దేశం. అయితే ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ ఆ తర్వాత కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్డౌన్..ప్లీజ్ వెళ్లకండి
వాషింగ్టన్: చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ పౌరులను హెచ్చరించింది అమెరికా. చైనాకు వెళ్లాలనుకునే అమెరికన్లు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పింది. వీలైతే పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది. చైనాలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడానికి ఆలస్యం అవుతోంది. అంబులెన్సులు కూడా సరిగ్గా అందుబాటులో లేవు. పలు చోట్లు ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు అక్కడకు వెళ్తే ఇబ్బందులు తప్పవు. మేం కూడా వైద్యపరంగా సాయం అందించలేం. అని అమెరికా తమ పౌరులను అప్రమత్తం చేసింది. అలాగే చైనా వెళ్లినవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. కరోనా లాక్డౌన్ ఉండదని ఎవరూ పొరపాటుగా అంచనా వేయవద్దని, పరిస్థితి అదపుతప్పితే చైనా ఏ క్షణంలోనైనా మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని అగ్రరాజ్యం తమ పౌరులను హెచ్చరించింది. చదవండి: మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు -
Health Tips: ప్రయాణాల్లో డయేరియాతో జాగ్రత్త.. ఇవి పాటిస్తే మేలు!
తరచూ ప్రయాణాలు చేసేవారు రకరకాల ప్రదేశాల్లో ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ప్రయాణ సమయాల్లో వారు ఆహారం తీసుకునే ప్రదేశాలూ, అక్కడ దొరికే పదార్థాలూ అంత పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. దాంతో ట్రావెలర్స్ డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. నిత్యం ప్రయాణాల్లో ఉండేవారికి ఈ ముప్పు ఎక్కువ. కానీ వేసవి సెలవుల్లో పిల్లలు ఏ బంధువుల ఇంటికో వెళ్లేప్పుడు ఒకసారి ప్రయాణం, మరోసారి తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రమాదాన్ని ట్రావెలర్స్ డయేరియాతో పోల్చలేనప్పటికీ... జర్నీ సమయంలో విరేచనాలు ఎప్పుడూ చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే అది ట్రావెలర్స్ డయేరియా అయినా, లేదా సాధారణ విరేచనాలే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. పాటించాల్సినవి.. 👉🏾ప్రయాణాల్లో దొరికే ఆహారం, నీరు కలుషితమయ్యేందుకు అవకాశాలెక్కువ. అందుకే సాధ్యమైనంతవరకు ఇంట్లో చేసిన పదార్థాలే ప్రయాణంలోనూ తినేలా ప్లాన్ చేసుకుని దానిని అమలు చేయాలి. 👉🏾అలాగే కాచి, చల్లార్చిన నీళ్లను ఇంటినుంచే తీసుకుని, ప్రయాణమంతా వాటినే వాడటం మంచిది. లేదా తప్పనప్పుడు నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన ప్యాకేజ్డ్ నీళ్ల బాటిల్‌ను తీసుకోవాలి. 👉🏾ట్రావెలర్స్ డయేరియాను నివారించేందుకు ప్రయాణికులు తాము ఎప్పుడూ తీసుకునే సురక్షితమైన, నమ్మకమైన చోటనే ఆహారం తీసుకోవాలి. 👉🏾తినడానికి ముందుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. 👉🏾ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. 👉🏾ఒకవేళ విరేచనాలు అవుతున్నప్పుడు దేహం ద్రవాలనూ, లవణాలను కోల్పోకుండా నమ్మకమైన ఓఆర్ఎస్ (ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్)ప్యాక్‌ను తీసుకోవాలి. 👉🏾మరీ ఆగకుండా విరేచనాలు అవుతున్నప్పుడు ప్రయాణానికి బ్రేక్ ఇచ్చి... ఆసుపత్రిలో సెలైన్ తీసుకోవడం లాంటి చికిత్సతో పాటు డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడాలి. పరిస్థితి పూర్తిగా చక్కబడ్డాకే మళ్లీ ప్రయాణం కొనసాగించాలి. చదవండి 👉🏾: Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! -
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏసియా శుభవార్త..!
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా(ఏఐ), ఎయిర్ ఏసియా ఇండియా(ఏఏఐపీఎల్)లు తమ ప్రయాణికులకు శుభవార్త అందించాయి. ఈ రెండు సంస్థలు ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ రెండు విమానయాన సంస్థలకు చెందిన ఏ విమానం రద్దయినా కూడా ప్రయాణికులు ఎలాంటి టెన్షన్ లేకుండా మరొక సంస్థ విమానంలో ప్రయాణం చేయొచ్చని తెలిపాయి. ఈ రెండు విమానయాన సంస్థలలో ఏదైనా ఒక విమానం రద్దయితే.. ప్రయాణికులకు మరో విమానంలో చోటు కల్పిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఉదాహరణకు అనివార్య కారణాల వలన ఎయిరిండియా విమానం రద్దు అయితే అందులోని ప్రయాణికులను ఎయిర్ ఏసియా ఇండియా విమానంలో తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. ఎయిరిండియా, ఎయిర్ ఏసియా ఇండియా మధ్య సహకార ఒప్పందంలో భాగంగా తాము ఈ తొలి అడుగు వేసినట్టు తెలిపింది. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అంటే ఫిబ్రవరి 9, 2024 వరకు వర్తిస్తుందని టాటా గ్రూప్ తెలిపింది. విమానాలు రద్దు అయినప్పుడు ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఈ రెండింటిలో ఏదైనా విమానంలో తీసుకొని వెళ్లనున్నారు. ఇందు కోసం ఇంటర్లైన్ కన్సిడరేషన్స్ ఆన్ ఇర్రెగ్యులర్ ఆపరేషన్స్(ఐఆర్ఓపీ) ఒప్పందంపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నాయి. (చదవండి: ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీ..!) -
భారతీయ ప్రయాణికులకు కెనడా శుభవార్త! ఆ నిబంధనలు ఎత్తివేత?
ఇండియా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఇండియా నుంచి నేరుగా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనల నుంచి సడలింపు ఇచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని చుట్టేస్తుండటంతో తమ దేశానికి వచ్చే ప్రయాణికుల విషయంలో కెనడా కఠిన ఆంక్షలు విధించింది. కెనడా బయట్దేరడానికి 18 గంటల ముందు కోవిడ్ నెగటీవ్ సర్టిఫికేట్ (ఆర్టీ పీసీఆర్) సమర్పిస్తేనే ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. ఇక సింగిల్ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులైతే మార్గమధ్యంలోని ఎయిర్‌పోర్టులో కూడా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటూ నిబంధన విధించింది. దీని కారణంగా అనేక మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో క్వారంటైన్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కెనడా ప్రభుత్వం తాజాగా సడలించిన నిబంధనల ప్రకారం ఇండియా నుంచి నేరుగా లేదా సింగిల్ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులకు 18 గంటల కోవిడ్ సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రయాణానికి 72 గంటల ముందు టెస్ట్ చేయించిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే చాలని పేర్కొంది. ఇండియాతో పాటు మొరాకో దేశానికి ఈ మినహాయింపును వర్తింప చేస్తోంది. 2022 జనవరి 28 నుంచి ఈ మినహాయింపు అమల్లోకి రానుంది. Effective January 28, 2022, we’re removing the modified pre-departure #COVID19 test requirements for travellers on direct flights to Canada from #India and #Morocco, and the requirement for third country testing for travellers on indirect routes to Canada from these countries. https://t.co/07qv65DtIQ — Transport Canada (@Transport_gc) January 28, 2022 కోవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేసిన సందర్భంలో భారతీయ ప్రయాణికులపై కెనడా నిషేధం విధించింది. ఐదు నెలల అనంతరం 2021 సెప్టెంబరు 27న విమాన ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. కానీ కొద్ది కాలానికే ఒమిక్రాన్ వెలుగు చూటడంతో మరోసారి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చదవండి: ప్రయాణం మధ్యలో పాజిటివ్. అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు -
Omicron: ‘నాన్ రిస్క్’ నుంచే రిస్క్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో కేవలం రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువగా దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన మూడు ఒమిక్రాన్ కేసులూ నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయాలని, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. 11 దేశాలను రిస్క్ కేటగిరీ కింద గుర్తించారు. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు యూఎస్, యూకే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన అందరు ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ర్యాండమ్‌గా శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలిన వారి నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. వారిని విమానాశ్రయం నుంచి నేరుగా టిమ్స్‌కు తరలిస్తున్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి (2 శాతం) కేవలం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ ఫలితం రాకముందే పంపేస్తున్నారు. ఇలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 7,018 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో నాన్ రిస్క్ దేశాలకు చెందిన వారు 1,622 మంది ఉన్నారు. ఈ విధంగా నిర్దేశించిన 2 శాతం కంటే ఎక్కువగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షలు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అందరినీ పరీక్షించాలి రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రిస్క్, నాన్ రిస్క్ దేశాలనే దానితో సంబంధం లేకుండా విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిపైనా దృష్టిపెట్టి పరీక్షలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన మూడు కేసులు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని అంటున్నారు. అలాగే ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్న వారిని ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేవరకు ఆపకుండా పంపించేయడం కూడా సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇలా పంపించేయ డం వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బయట పడిన 3 కేసులు ఇందుకు నిదర్శనమని అంటున్నారు. చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన -
ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు
చాన్నాళ్లుగా విదేశాల్లో చిక్కుపోయిన వారికి, ఎన్నాళ్ల నుంచో స్వదేశం రావాలని ప్లాన్ చేసుకున్న ఎన్నారైలకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతార్జతీయ ప్రయాణికులపై ఉన్న క్వారంటైన్ నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. లిస్ట్ ఏలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో క్వారెంటైన్ భయాలు తొలగిపోయాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్‌కి సంబంధించి 99 దేశాలతో భారత్ అవగాహన కుదుర్చుకుంది. ఈ దేశాల్లో డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన వ్యాక్సిన్లు అందిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఎయిర్ సువిధా పోర్టల్‌లో తమ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన రిపోర్టుని అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ప్రయాణానికి 72 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటీవ్ రిపోర్టకు కూడా జత చేయాలి. ఈ రెండు పనులు చేసిన ప్రయాణికులు ఇండియా వచ్చిన తర్వాత 14 రోజుల నిర్బంధ క్వారంటైన్ ఉండక్కర్లేదు. లిస్ట్ ఏలో 99 దేశాల జాబితాలో విదేశీ ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఖతర్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ తదితర దేశాలు ఉన్నాయి. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతెఓ పాటు ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రయాణం సందర్భంగా కోవిడ్‌రూల్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అక్టోబరు 15 నుంచే విదేశీ ప్రయాణికులను ఇండియాలోకి అనుమతి ఇస్తున్నారు. అయితే అప్పుడు కేవలం ఛార్టెడ్ ఫ్లైట్లకే అనుమతి ఇచ్చారు. కాగా ఇప్పుడు కమర్షియల్ విమానాలకు పచ్చజెండా ఊపారు. చదవండి: వలస కార్మికులకు ఉచిత వీసాలు -
యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్
అబుదాబి: యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్. ఆన్లైన్ పేమెంట్ల విషయంలో భారతీయ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు లైన్ క్లియర్ అయ్యింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది యూఏఈ. తద్వారా UPI పేమెంట్లకు అనుమతి ఇచ్చిన మూడో దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI).. మష్రెక్యూ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించనుంది. ఇండియాలో ఎలాగైతే యూపీఐ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటున్నారో.. యూజర్లు ఇక అదే రీతిలో విదేశీ ట్రాన్జాక్షన్లు చేసుకోవచ్చు. తద్వారా వ్యాపార, ఇతరత్ర వ్యవహారాలపై యూఏఈని సందర్శించే 20 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. సందర్శకులతో పాటు యూఏఈ వాసులకు సైతం క్యాష్‌లెష్ పేమెంట్స్‌కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని ఎఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లా వెల్లడించారు. ఇంతకు ముందు సింగపూర్, భూటాన్‌లు యూపీఐ పేమెంట్స్‌కు అనుమతి ఇచ్చాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్ పే మార్కెట్లో పాపులర్ అయ్యాయి. చదవండి: అఫ్గన్ కార్మికుల సంగతి ఏంటి? ప్రయాణికులకు ఊరట పాస్‌పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు టూరిస్ట్ వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: భార్య ఎఫైర్లన్నీ వెబ్సైట్లో.. సొంతవాళ్లపైనే భర్త అఘాయిత్యాలని ఆరోపణలు -
టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ : ప్రయాణాల్లో వివిధ కేటగిరీలకు అందించే రాయితీలపై రైల్వే మంత్రి కీలక ప్రకటన చేశారు. రాయితీలను ఎప్పుడు పునరుద్ధరించాలనే అంశంపై ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైల్వే టిక్కెట్లపై రాయితీలు ఇవ్వబోమన్నారు. ప్రస్తుతం ఉన్నట్టుగానే ఫుల్ ఛార్జీ వసూలు చేస్తామన్నారు. గతేడాది రైల్వేశాఖ తాత్కాలికంగా రద్దు చేసిన ప్రయాణ రాయితీలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారంటూ శుక్రవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రాయితీలు ఇప్పుడే పునరుద్ధరించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కరోనా సంక్షోభం కారణంగా 2020 మార్చిలో రైల్వేశాఖ దేశవ్యాప్తంగా రైళ్లను రద్దు చేసింది. ఆ తర్వాత క్రమంగా రైళ్లను ప్రారంభించింది. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తోంది. దీంతో ఈ రైళ్లలో రాయితీలు వర్తించడం లేదు. రైల్వే శాఖ ఆర్మీ, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 51 కేటగిరీలలో రాయితీలు అందిస్తోంది. ప్రస్తుతం ఇందులో దివ్యాంగులు, స్టూడెంట్స్, రోగులకే రాయితీలు వర్తిస్తున్నాయి. మిగిలిన కేటగిరీలకు ఫుల్ ఛార్జీని వసూలు చేస్తోంది. -
పుంజుకుంటున్న విమానయానం
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం నుంచి కోలుకుని విమానయానం క్రమేపీ వేగం పుంజుకుంటోంది. సెకండ్ వేవ్ ఉధృతిలో కాస్త తగ్గుదల కనిపిస్తుండటంతో క్రమంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. విజయవాడ విమానాశ్రయం కూడా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ నెల ఆరంభం నుంచి విజయవాడ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. కోవిడ్‌కు ముందు ఈ ఎయిర్‌పోర్టు నుంచి నెలలో 75 వేల నుంచి 90 వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కోవిడ్ రెండో దశ తీవ్ర రూపం దాల్చిన ఏప్రిల్ నెలలో 44,214 మంది ప్రయాణాలు చేయగా, మే నెలలో ఆ సంఖ్య 16,381కి తగ్గింది. అయితే జూన్ ఆరంభం నుంచి పరిస్థితి మారింది. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సగటున రోజుకు 600 మంది విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లకు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 10 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు వందే భారత్ మిషన్ కింద మస్కట్, దుబాయ్, సింగపూర్, కువైట్ల నుంచి అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. ఢిల్లీ సర్వీసు రద్దుతో ఇక్కట్లు.. ఎయిరిండియా సంస్థ ఢిల్లీ – విజయవాడ ఎయిర్‌పోర్టుల మధ్య రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు విమాన సర్వీసులను నడిపేది. వీటిలో ఉదయం సర్వీసును జూలై 31 వరకు రద్దు చేశారు. ప్రధానంగా ఈ సర్వీసు అమెరికా నుంచి వచ్చి, వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా ఉండేది. అమెరికా నుంచి అర్థరాత్రి దాటాక ఢిల్లీ చేరుకునే వారు ఈ సర్వీసు ద్వారా ఉదయానికల్లా విజయవాడకు వచ్చేవారు. ఇప్పుడు సాయంత్రం సర్వీసు ఒక్కటే ఉండడం వల్ల వీరంతా 20 గంటలకు పైగా ఢిల్లీలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్లేవారూ దాదాపు ఓ రోజు అదనంగా ఢిల్లీలో గడపాల్సి వస్తోందంటున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన ఢిల్లీ విమాన సర్వీసును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగింది పక్షం రోజుల్లో ప్రయాణికుల సంఖ్య రోజుకు వెయ్యికి చేరుకుంటుంది. ఈ నెలాఖరుకి ప్రయాణికుల సంఖ్య మునుపటి సగటు ప్రయాణికుల్లో 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. – జి.మధుసూదనరావు, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
కరోనా ఎఫెక్ట్: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం
వెల్లింగ్టన్: భారత్ కోవిడ్–19 హాట్ స్పాట్‌గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్ భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్‌లో ఉన్న న్యూజిలాండ్ పౌరులు సహా ఎవరూ ఏప్రిల్ 11 నుంచి రెండు వారాలు న్యూజిలాండ్‌కు రావద్దంటూ ఆంక్షలు విధించింది. 11 నుంచి 28 వరకు భారత్ నుంచి ఎవరినీ తమ దేశంలోకి అనుమతించబోమని న్యూజిలాండ్ ప్రధాని జకీండా ప్రకటించారు. -
ఎక్స్‌లేటర్‌పై కాలుతీసి బ్రేక్‌పై మోపడంతో...
ఆదోని టౌన్: ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆదోని బస్టాండు నుంచి శనివారం ఉదయం 25 మందితో ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మేళిగనూరుకు బయలు దేరింది. కుప్పగల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురైంది. అప్రమత్తమైన కండక్టర్ లక్ష్మన్న.. డ్రైవర్ బసయ్య వైపు చూశారు. ఆయన డ్రైవింగ్ సీట్లోనే కుప్పకూలడం గమనించారు. గట్టిగా కేకలు వేస్తూ డ్రైవర్‌ను అలర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ప్రయాణికులు కూడా డ్రైవర్ చెంతకు చేరుకుని కేకలు వేశారు. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎక్స్‌లేటర్‌పై కాలుతీసి బ్రేక్‌పై మోపాడు. బస్సు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. కండక్టర్ వెంటనే 108కు సమాచారమిచ్చి డ్రైవర్‌ను ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బీపీ పెరగడంతో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. -
కొత్త కరోనా వైరస్.. బ్రిటన్ నుంచి విమానాలు రద్దు!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. ఇప్పడిప్పుడే కోవిడ్ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిటన్‌లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల బ్రిటన్‌లో పరిస్థితి చేయి దాటి పోవడంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . క్రిస్మస్ సంబరాలను సైతం రద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. చదవండి: యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్ నుంచే వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్‌లా ఉందని సోమవారం (డిసెంబర్ 21) ఆయన ట్వీట్ చేశారు. తక్షణమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఇప్పటి వరకు ప్రయాణ నిషేధాన్ని ప్రకటించిన జాబితాలో ఉన్న దేశాలు. 1. ఫ్రాన్స్ : రోడ్డు, వాయు, సముద్రం, రైలు ద్వారా వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రయాణాలతో సహా ఆదివారం అర్ధరాత్రి నుంచి 48 గంటల వరకు బ్రిటన్ నుంచి వచ్చే అన్ని ప్రయాణాలను నిలిపివేస్తామని ఫ్రాన్స్ ఆదివారం తెలిపింది. 2. జర్మనీ: ఆదివారం నుంచి బ్రిటన్ నుంచి అన్ని సంబంధాలను ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఇది ప్రస్తుతానికి డిసెంబర్ 31 వరకు కొనసాగుతందని పేర్కొంది. కార్గో విమానాలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. 3. ఇటలీ: ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన ఇటలీలో ఒక వ్యక్తిలో కొత్త వైరస్ కనుగొన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 4. ఐర్లాండ్: ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమానాలను కనీసం 48 గంటలు నిషేధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 5. కెనడా: కొత్త కరోనా వైరస్ వల్ల యూకే నుంచి అన్ని విమానాలను 72 గంటలు నిషేధిస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. 6. నెదర్లాండ్ : బ్రిటన్ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లే అన్ని ప్రయాణీకుల విమానాలను జనవరి 1 వరకు నిషేధించినట్లు డచ్ ప్రభుత్వం తెలిపింది. 7. బెల్జియం: యూకే నుంచి బెల్జియంకు వెళ్లే అన్ని విమాన, రైలు ప్రయాణాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి కనీసం 24 గంటలు నిలిపివేస్తామని ప్రధాని అలెగ్జాండర్ చెప్పారు. 8. ఆస్ట్రియా : బ్రిటన్ నుంచి ప్రయాణ నిషేధానికి వియన్నా వివరాలు రూపొందిస్తున్నట్లు ఆస్ట్రియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రెస్ ఏజెన్సీ ఏపీఏకు తెలిపింది. 9. స్వీడన్: బ్రిటన్ నుంచి ప్రజలు ప్రవేశించడాన్నినిషేధించడానికి దేశం సిద్ధమవుతోందని సోమవారం అధికారికంగా పేర్కొంది.. 10. ఫిన్లాండ్: సోమవారం మధ్యాహ్నం నుంచి రెండు వారాల పాటు యూకే నుంచి ప్రయాణీకుల విమానాలను ఫిన్లాండ్లో ల్యాండ్ చేయడానికి అనుమతించరని రవాణా లైసెన్సింగ్ ఏజెన్సీ ట్రాఫికామ్ ఆదివారం ఆలస్యంగా ప్రకటించింది. 11. స్విట్జర్లాండ్: బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్విట్జర్లాండ్ ఆదివారం తెలిపింది 12. బాల్టిక్స్ 13. బల్గేరియా 14. టర్కీ 15. ఇరాన్, 16. రొమేనియా 17. ఇజ్రాయిల్, 18. సౌదీఅరేబియా 19. క్రొయేషియా ఉన్నాయి. భారత్-బ్రిటన్ల మధ్య విమాన సర్వీసులు రద్దు బ్రిటన్‌లో కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రభావంతో భారత్-బ్రిటన్ల మధ్య విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దును రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారికి వారం రోజులు క్వారంటైన్ విధించనుంది. -
ఒమన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
సాక్షి, మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ పర్యాటకులకు ఒమన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విజిట్ వీసాతో సంబంధం లేకుండానే ఒమన్‌లో పది రోజులపాటు పర్యటించడానికి అవకాశం కల్పించింది. భారత్‌సహా 103 దేశాల పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో ఒమన్‌లో పర్యటిం చాలంటే నెల లేదా 3 నెలల కాలపరిమితి గల విజిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. విజిట్ వీసా కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అయ్యేది. ఎవరైనా స్పాన్సర్లు ఉంటే విజిట్ వీసా ఉచితంగానే లభించేది. తాజా వెసులుబాటు నేపథ్యంలో ఒమన్‌లో పర్యటించే పర్యాటకులు అక్కడి రాయల్ పోలీసు నిబంధనలను అనుసరించాలి. ఆరోగ్య బీమా, ఒమన్ వచ్చి వెళ్లడానికి విమాన టికెట్లు, బస చేసే హోటల్ వివరాలను ఒమన్ రాయల్ పోలీసులకు అందించాలి. పర్యటన ఆసాంతం పోలీసుల నిఘా ఉంటుంది.