Uyyalawada narasimha reddy
-
ఆంగ్లేయులపై తిరగడ్డ కడప బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : భారతీయుల్లో జాతీయ భా వం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దొరవారి నరసింహారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నేటికి సరిగ్గా 176 ఏళ్ల క్రితం ఉరికొయ్యను ముద్దాడి ఆయన భావి భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా, దిక్చూచిగా నిలిచారు. తిరుగుబాటులో ముఖ్య సంఘటనలు 1846 జూన్‌లో తనకు రావాల్సిన పెన్షన్ కోసం అనుచరులను కోయిలకుంట్ల ట్రెజరీకి పంపగా తహసీల్దార్ రాఘవాచార్యులు తిట్టి పంపడంతో పోరాటానికి తెర లేచింది. జూలై 7 లేదా 8 తేదీల్లో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రా మాన్ని కొల్లగొట్టుకుపోతుండగా మిట్టపల్లె వద్ద పోలీసులతో పోరాటం జరిగింది. జూలై 10న కోయిలకుంట్ల ట్రెజరీపై రెడ్డి బృందం దాడి జరిపింది. జూలై 23న గిద్దలూరు వద్ద లెఫ్ట్‌నెంట్ వాట్సన్, 24న ముండ్లపాడు వద్ద కెపె్టన్ నాట్, కెప్టెన్ రసల్ నాయకత్వంలోని సైన్యంతో పోరాటం సాగింది. అక్టోబరు 6న పేరుసోముల కొండల్లో పట్టుబడ్డారు. 1847 ఫిబ్రవరి 22న సో మవారం ఉదయం 7 గంటలకు కోయిలకుంట్లలో 2000 మంది ప్రజలు చూస్తుండగా కడప కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో నరసింహారెడ్డిని ఉరి తీశారు. 1877 వరకు ఆయన తల ఉరి కంభానికి వేలాడుతూనే ఉంచారు. ‘సీమ’ రైతాంగ పోరాటం నరసింహారెడ్డి తన పెన్షన్ కోసం తిరుగుబాటు చేశారే తప్ప బ్రిటీషు పాలకులను వెళ్లగొట్టాలన్న లక్ష్యంతో కాదని ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో కొందరు వాదించడంలో నిజం లేదని జిల్లాకు చెందిన చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. పెన్షన్ కోసమే అయితే సుమారు 9 వేల మంది ప్రజలు తిరుగుబాటులో ఎందుకు పాలుపంచుకున్నారన్న ప్రశ్నకు విమర్శకుల వద్ద సమాధానం లేదు. కరువులు వచ్చి పంటలు పండకపోయినా భూమి శిస్తు వసూలు చేసేవారు. పైగా శిస్తుల భారం అధికంగా ఉండటంతో అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల భూములను రైతులు బీళ్లుగా పెట్టాల్సి వచ్చింది. గ్రామ కట్టుబడి బంట్రోతులు అనుభవించుకుంటున్న మాన్యం భూముల వంశపారంపర్య హక్కులు ప్రభుత్వం రద్దు చేసింది. సంతతి లేకుండా మరణించిన కట్టుబడుల భూములను లాగేసుకున్నారు. గ్రామ విధులను సరిగా నిర్వర్తించలేదని కొందరి తవర్జీ తగ్గించారు. బంట్రోతులను బదిలీ చేయడం, గ్రామ పోలీసు వ్యవస్థ పునర్ నిర్మాణానికి ప్రయత్నించారు. ఇవన్నీ కట్టుబడులలో అలజడి కలిగించడంతో నరసింహారెడ్డి వెంట నడిచారు. ఈ కేసు విచారణ చేసిన స్పెషల్ కమిషనర్ ఇంగ్లిస్ స్వయంగా ఈ వివరాలను బోర్డు ఆఫ్ రెవెన్యూకు నివేదించారు. ఈ కారణాల రీత్యా దీన్ని రాయలసీమ రైతాంగం జరిపిన తొలి తిరుగుబాటుగా భావించాలని చరిత్రకారులు అంటున్నారు. నరసింహారెడ్డి అందరివాడు జాతీయ నాయకుల మాదిరే నరసింహారెడ్డిని కూడా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి మాట్లాడే ధోరణి సరికాదని మేధావుల అభిప్రాయం. నరసింహారెడ్డి గురువుగా భావించే గోసాయి వెంకయ్య ప్రధాన అనుచరులైన కరణం అశ్వర్థామ, జంగం మల్లయ్య, వడ్డె ఓబన్నలతోపాటు చెంచులు, యానాదులు, బోయలు, వడ్డెరలు తిరుగుబాటులో ప్రధానంగా పాల్గొన్నారు. చివరకు బ్రాహ్మణులు సైతం పాల్గొన్నారంటే ఆ తిరుగుబాటుకు ఉన్న ప్రజా పునాది అర్థమవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. చరిత్రకారుల చిన్నచూపు సిపాయిల, సన్యాసుల, మోప్లా, చిట్టగాంగ్, రంపా, చీరాల–పేరాల తిరుగుబాట్ల గురించి నాటి చరిత్రకారులు పేర్కొన్నారు. కానీ వాటి కంటే ఎన్నో ఏళ్ల ముందు స్వరూపంలో ఏమాత్రం తీసిపోని నరసింహారెడ్డి తిరుగుబాటు గురించి పట్టించుకోలేదని అంటున్నారు. 1955లో బెంగాలి చరిత్రకారుడు ఎస్బీ చౌదరి మాత్రమే తాను రాసిన ‘సివిల్ డిస్ట్రబెన్సెస్ డ్యూరింగ్ ద బ్రిటీషు రూల్ ఇన్ ఇండియా (1765–1857)’ అనే గ్రంథంలో నరసింహారెడ్డి తిరుగుబాటు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆంధ్ర చరిత్రకారులు కనీసం తిరుగుబాటుకు సంబంధించిన కాలక్రమణికను కూడా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నేడు వర్ధంతి సభ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభను బుధవారం ఉదయం కడప నగరంలోని రెడ్డి సేవా సమితి కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా హైసూ్కలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – లెక్కల కొండారెడ్డి, రెడ్డి సేవా సమితి, కడప నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నరసింహారెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించడం, కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టడం అభినందనీయం. భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాలి. – కేశవులు నాయుడు, పాలెగార్ వంశీయులు, మాదినేనిపాలెం, గుర్రంకొండ -
అది ప్రభుత్వ విధాన నిర్ణయం
సాక్షి, అమరావతి: జిల్లాకు ఏ పేరు పెట్టాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. జిల్లాకు ఫలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం న్యాయస్థానం పని కాదని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఏదైనా జిల్లాకు లేదా పట్టణానికి రాజకీయ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, యోగి, ఇతర ప్రఖ్యాత వ్యక్తి పేరు పెట్టడం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టంచేసింది. ఒకవేళ కోర్టు అలాంటి ఆదేశం ఇవ్వాలంటే, రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు లేదా ప్రజల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పిటిషనర్ నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. జిల్లాలకు పేరు పెట్టే విషయంలో నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన చట్టం ఏదీ లేదని చెప్పింది. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. -
పోరాటాల పురిటిగడ్డ ఇది!
వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరికంబం ఎక్కి రేపటికి 175 ఏళ్లు. 19వ శతాబ్దం ప్రారం భంలో అంకురించిన చిత్తూరు పాలెగాళ్ళ పోరాటం దగ్గర నుంచి 1847 ఫిబ్రవరి 22న పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు ఉరితీయడం వరకు... రాయలసీమ పోరాటాలతో ఎరుపెక్కింది. ఈ పోరాటాలలో ఉరికంబం ఎక్కిన అమరవీరులు రాయలసీమ పాలెగాళ్ళు. బ్రిటిష్ మహావృక్షాన్ని మొక్క దశలోనే తుంచేయాలని పోరాటాలు చేసిన తొలి స్వతంత్ర పోరాట యోధులు వీరు. క్రీ.శ. 1801 నుంచి 1805 వరకు చిత్తూరు జిల్లా పాలెగాళ్ళు– బ్రిటిష్ వారికి మధ్య జరిగిన పోరాటంలో... యాదరాకొండ పాలెగాడు ముద్దు రామప్ప నాయుణ్ణి పట్టుకుని కల్లయ్య బండ అడవుల్లో ఉరితీశారు. మిగిలిన పాల్యాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనాటి బ్రిటిష్ సైనిక చట్టం ప్రకారం చిత్తూరు పాలెగాళ్లను కొందరిని ద్వీపాంతరం పంపారు. మరికొందరిని ఉరితీశారు. (చదవండి: మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం) క్రీ.శ.1600– 1800 వరకు రాయలసీమలో బలమైన రాజుల పాలన లేదు. రాయలసీమను రక్షించినది పాలెగాళ్లే. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట, పరాయి రాజుల వశమైనప్పటికీ... బురుజులు మాత్రం పాలెగాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. విజయనగరం రాజుల కాలంలోనే (క్రీ.శ.1336 –1680) పాలెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాలెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో సుల్తానుల చేతుల్లో పరాజయం పొందిన విజయనగరం రాజులు తమ రాజధానిని హంపీ నుంచి ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పెనుగొండకు క్రీ.శ.1591లో మార్చారు. అప్పటి నుంచి 1800 సంవత్సరంలో బ్రిటిష్‌వారికి రాయలసీమ ప్రాంతం ధారాదత్తం అయ్యేదాకా ఇక్కడ ముప్ఫై యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల న్నిటిలో సీమ ప్రజలకు ధన, మాన, ప్రాణ, నష్టం జరగకుండా చూసింది పాలెగాళ్లే. క్రీ.శ. 1800 నాటికి రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళు ఉండేవారు. వీరి కింద 30,000 మంది సైనికులు ఉండేవారు. రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్లకిందికి వచ్చిన తర్వాత పాలెగాళ్లు నామమాత్రులయ్యారు. బ్రిటిష్ వారి దోపిడీ పతాకస్థాయికి చేరుతుండటంతో పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదు వేలమంది సాయుధులతో, ఇతర పాలెగాళ్లు, జమీందారుల సహకారంతో వాళ్లపై 1846లో తిరుగుబాటును ప్రారంభించాడు. అనేక సంఘర్షణల అనంతరం 1846 అక్టోబర్ 6న నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు పట్టుకున్నారు. 200 మంది అనుచరులతో రెడ్డి ఎర్రమల కొండలను వదిలి పెరసోమలలోనికి పోయినట్లు అనుమానించి పెరసోమల గ్రామం వద్ద బ్రిటిష్‌వాళ్లు ఆయన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఉయ్యాలవాడను చివరకు 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. దీనిని కలెక్టర్ కాన్‌క్రేన్ పర్యవేక్షించాడు. మృతదేహం తలను నరికించి... ఆ తలను కోయిలకుంట్ల బురుజుకు వేలాడదీయించాడు. అలా 1847 నుంచి 1877 వరకు కోయిలకుంట్ల బురుజుకు ఆయన తల వేలాడుతూనే ఉంది. (చదవండి: ప్రజల గుండె చప్పుడు) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి త్యాగ ధనులు పుట్టిన రాయలసీమపై కొందరు... ఫ్యాక్షన్ ముద్రవేసి దాని గౌరవాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి! - డాక్టర్ ఏనుగొండ నాగరాజ నాయుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి (ఉయ్యాలవాడ ఉరికంబమెక్కి రేపటికి 175 ఏళ్లు) -
ప్రపంచ వ్యాప్తంగా రేనాటి ఖ్యాతి చాటిన ‘సూర్యచంద్రులు’
కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు మహనీయులు శతాబ్ధం క్రితమే రేనాడు ప్రాంతఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. బ్రిటీష్ నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసి అప్పటి ఇంగ్లాండ్ మహారాణితో సత్కరించబడి దానకర్ణుడిగా పేరొందిన బుడ్డా వెంగళరెడ్డి రేనాటి సూర్యచంద్రులుగా వెలుగొందుతున్నారు. నరసింహారెడ్డి వీరమరణం పొంది 174 సంవత్సరాలు, వెంగళరెడ్డి మరణించి 121 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెల్లదొరల పాలిట సింహస్వప్నమైన నరసింహారెడ్డి: కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్తత మండలాలుగా ప్రకటించి బ్రిటీష్వారికి దారాదత్తం చేశారు. నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. బ్రిటీష్ ప్రభుత్వం నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్‌పాలన నిరంకుశత్వపాలనను ప్రతిఘటించి 1842వ సంవత్సరంలోనే మొట్టమొదటి విప్లవవీరునిగా తిరుగుబాటుకు విప్లవశంఖం పూరించారు. 1846 వ సంవత్సరంలో కోవెలకుంట్ల పట్టణంలోని బ్రిటీష్ ట్రెజరీపై దాడి చేసి 805 రూపాయల 10 అణాల నాలుగుపైసలను కొల్లగొట్టారు. నరసింహారెడ్డి తిరుగుబాటుకు బ్రిటీష్ సామ్రాజ్యం గజగజ వణికిపోయింది. తన పోరాటంలో కోవెలకుంట్ల తహశీల్దార్‌ను నరికిచంపడమేకాక బ్రిటీష్‌వారి ఖజానాను కొల్లగొట్టారు. తెల్లదొరలపాలిట సింహ స్వప్నంగా మారటంతో నరసింహారెడ్డిని పట్టించిన వారికి 10వేల దినారాలు బహుమతి అందజేస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టకేలకు 1847 సంవత్సరంలో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని బందిపోటు దొంగగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22వతేదీ కోవెలకుంట్ల పట్టణ సమీపంలోగల జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలుపరిచారు. అయితే నరసింహారెడ్డి మరణించిన వంద సంవత్సరాలకు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నరసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం అలనాటి వీరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏటా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆయన వంశస్తులు, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విప్లవ సింహం నరసింహారెడ్డి జీవిత చరిత్రను వెండితెరపైకి ఎక్కించారు. చిరంజీవి కథానాయకుడిగా 2019వ సంవత్సరంలో సైరా నరసింహారెడ్డి పేరుతో చలనచిత్రం విడుదలైంది. రేనాటి చంద్రుడు బుడ్డా వెంగళరెడ్డి: భారతదేశంలోని రేనాటిగడ్డలో పాలెగాళ్లేకాదు దానకర్ణులూ ఉన్నారంటూ ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి మానవత్వాన్ని, దాతృత్వాన్ని ప్రపంచానికి చాటారు. ఉయ్యాలవాడ గ్రామంలో 1822 సంవత్సరం రైతు కుటుంబంలో నల్లపురెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించిన బుడ్డా వెంగళరెడ్డి చిన్ననాటి నుంచి దానధర్మాలు చేస్తూ దానకర్ణుడిగా వెలుగొందారు. 1860 సంవత్సరంలో రాయలసీమలో కనీవినీ ఎరగని రీతిలో డొక్కల కరువు సంభవించింది. అప్పట్లో పేదలు ఆకలిమంటలు తట్టుకోలేక సాటిమనసుల డొక్కలు చీల్చి వారి పేగుళ్లలోని ఆహారాన్ని తినేంతటి కరువని చరిత్ర పేర్కొంది. కరువును తట్టుకోలేక ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. బ్రిటీష్ ప్రభుత్వం అక్కడక్కడా గంజికేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కరువు బీభత్సాన్ని గమనించిన బుడ్డా వెంగళరెడ్డి గంజికేంద్రాలను ప్రారంభించి తన వద్ద ఉన్న ధాన్యంతో మూడు సంవత్సరాలపాటు అన్నదానం చేశారు. కర్నూలు జిల్లా ప్రాంత వాసులకేకాక బళ్లారి, చిత్తూరు, కడప ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చి ప్రతి రోజూ సుమారు 10వేల మందికి పైగా ఉయ్యాలవాడలో ఆయన ఇంటి వద్దనే భోజనం చేసేవారు. బుడ్డా వెంగళరెడ్డి దానగుణం తెలుసుకున్న ఇంగ్లాండ్ విక్టోరియా మహారాణి ఢిల్లీ రాజప్రతినిధుల సభలో ఆయనకు బంగారు పతకాన్ని, ప్రశంసాపత్రాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు. 1900 సంవత్సరం డిసెంబర్ 31న బుడ్డా వెంగళరెడ్డి మృతిచెందారు. కడప–కర్నూలు కాల్వకు, ఉయ్యాలవాడ – రూపనగుడి గ్రామాల మధ్య కుందూనదిపై నిర్మించిన వంతెనకు ఈయన పేరు పెట్టారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు నంద్యాల ఎస్బీఐ బ్యాంకులో బుడ్డా వెంగళరెడ్డి పేరున ఒక విద్యానిధిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వర్ధంతి రోజు, ఉగాది పండుగ రోజున బుడ్డా వంశుస్థులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, విక్టోరియా మహారాణి బహుకరించిన బంగారు పతకాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన సమాధిపై ఉంచుతున్నారు. ఇప్పటి కూడా యాచకులు బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో ఉత్తరాధి ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం చూడరయా, ధర్మ ప్రభువు బుడ్డా వెంగళరెడ్డి అంటూ జానపద గీతాలు ఆలపిస్తూనే ఉన్నారు. -
ఎగిరిపోదాం ఎంచక్కా..
సాక్షి, కర్నూలు(సెంట్రల్): విమానయానంపై కర్నూలు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణ సమయం ఆదా అవుతుందనే ఉద్దేశం, నూతన ప్రయాణ అనుభూతి పొందాలన్న ఉత్సుకతతో విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో కర్నూలు ఎయిర్‌పోర్టు (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం – ఓర్వకల్లు) నుంచి రాకపోకలు ఊపందుకున్నాయి. నగరాలకు చలో చలో కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఏడాది మార్చి 28న విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఉడాన్ పథకం కింద ఇక్కడి నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో ఆయా నగరాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు అధికశాతం విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీకెండ్లో రెండు రోజుల సెలవు ఉంటుండడంతో విమానంలో సొంతూళ్లకు వచ్చి వెళుతున్నారు. విశాఖపట్నం అందాలను తిలకించడానికి జిల్లా నుంచి వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. గోవాకు వెళ్లే వారు వయా బెంగళూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. విశాఖ – కర్నూలు మధ్య నడిచే సర్వీసుల్లో 72 సీట్లకు గాను ప్రతిసారి 55–60 మంది ప్రయాణిస్తున్నారు. బెంగళూరుకు కూడా 50 మందికి తగ్గకుండా వెళ్తున్నారు. చెన్నైకి వెళ్లే వారి సంఖ్య మాత్రం కాస్త తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం ఆ నగరానికి రాకపోకలు సాగిస్తున్న వారిలో వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారు. కర్నూలు– చెన్నై సర్వీసుల్లో 72 సీట్లకు గాను 40–45 సీట్లు భర్తీ అవుతున్నాయి. క్రమంగా పెరుగుదల కరోనా రెండో దశ ప్రభావం విమాన ప్రయాణాలపైనా బాగానే పడింది. బెంగళూరు, చెన్నై నగరాల్లో లాక్డౌన్ విధించడం, ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ పెట్టడంతో ఆ సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విమాన రాకపోకలపై నిషేధం లేకున్నా లాక్డౌన్, కర్ఫ్యూ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. మే మాసంలో ఒక్కో ట్రిప్పులో 10–15 మంది కూడా ప్రయాణించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే కరోనా కేసులు తగ్గిపోవడం, లాక్డౌన్ ఎత్తేయడం, కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో విమాన ప్రయాణాలు మళ్లీ పుంజుకున్నాయి. విద్యా సంస్థలు పునః ప్రారంభమై, వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో ఊపందుకుంటే ఇక్కడి నుంచి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది కరోనా సెకండ్ వేవ్‌తో మే మాసంలో విమాన ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. అయితే ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్లేవారు..వచ్చే వారు అధికంగా ఉంటున్నారు. – కైలాస్ మండల్, ఏడీ, ఎయిర్‌పోర్టు అథారిటీ విమానాల టైం టేబుల్ ఫ్లైట్ నంబర్ సర్వీసు అందుబాటులో బయలుదేరు సమయం చేరుకునే సమయం ఉండే రోజులు ఎయిర్‌పోర్టు ఎయిర్‌పోర్టు 6ఈ7911 సోమ, బుధ, శుక్ర, ఆది బెంగళూరు 09.05 కర్నూలు 10.10 6ఈ7912 సోమ, బుధ, శుక్ర, ఆది కర్నూలు 10.30 విశాఖపట్నం 12.40 6ఈ7913 సోమ, బుధ, శుక్ర, ఆది విశాఖపట్నం 13.00 కర్నూలు 14.55 6ఈ7914 సోమ, బుధ, శుక్ర, ఆది కర్నూలు 15.15 బెంగళూరు 16.25 6ఈ7915 మంగళ, గురు, శని, ఆది చెన్నై 14.50 కర్నూలు 16.10 6ఈ7916 మంగళ, గురు,శని, ఆది కర్నూలు 16.30 చెన్నై 17.50 విమాన టికెట్ ధరలు (రూ.లలో) కర్నూలు – బెంగళూరు 2,077 కర్నూలు – చెన్నై 2,555 కర్నూలు– విశాఖపట్నం 3.077 -
న్యాయ రాజధానికి విమాన శోభ
తొలి స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా ఈ విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని నామకరణం చేస్తున్నాం. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆమోదంగా ఇటీవల జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారు. మీ కోసం మరింతగా పని చేస్తాం.రాష్ట్రంలో ఇప్పటివరకు తిరుపతి, కడప, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్‌లో విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక నుంచి కర్నూలులోని ఓర్వకల్లులో కూడా విమానాశ్రయం ప్రారంభమవుతోంది. మనందరం నిర్మించుకోబోతున్న ‘న్యాయ రాజధాని’ నుంచి ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను కలిపే ఎయిర్‌పోర్టుగా ఇది నిలబడుతుందని గర్వంగా చెబుతున్నా. కర్నూలు: ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని ప్రజల హర్షధ్వానాల మధ్య నామకరణం చేశారు. సీఎం వైఎస్ జగన్ విజయవాడ నుంచి ఉదయం 11.45 గంటలకు ఓర్వకల్లు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ బిల్డింగ్ వద్దకు చేరుకుని, జాతీయ జెండాను ఎగుర వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి టెర్మిల్ బిల్డింగ్ ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదికపై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలు, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు చరిత్రలో ఈ రోజు (గురువారం) ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. కారణమేంటంటే కర్నూలు నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండేవని, ఇక నుంచి విమానయానం ప్రారంభమవుతోందన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. బెంగళూరు, వైజాగ్, చెన్నైలకు సర్వీసులు నడుస్తాయని, ఇక్కడ ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రూ. 110 కోట్లతో విమానాశ్రయం పనులు ఎన్నికలకు కేవలం నెలరోజుల గడువు ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్టు పూర్తికాక మునుపే, అనుమతులు రాకుండానే, విమానాలు ఎగరకుండానే, చివరకు కనీసం రన్‌వే కూడా పూర్తి స్థాయిలో పూర్తవ్వకుండానే అప్పటి ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేశారు. ఆయన పేరు చంద్రబాబునాయుడు. ఇది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో విమానాశ్రయం కచ్చితంగా రావాలనే పట్టుదలతో రూ.110 కోట్లు విలువైన పనులను కేవలం ఏడాదిన్నరలోపే పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, పోలీసు బ్యారెక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, బ్యారెక్, సబ్స్టేషన్లు, రన్వేలలో బ్యాలెన్సింగ్ పనులు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లతో పాటు ఇతరత్రా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. ఆస్ట్రియా నుంచి రెండు అధునాతన అగ్నిమాపక శకటాలు తెప్పించాం. కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), డీజీసీఏ అనుమతులు తెప్పించడం, విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలు పూర్తి చేయడంలో సంబంధిత మంత్రితో పాటు అందరూ శ్రమపడ్డారు. ‘ఉయ్యాలవాడ’ పేరుపై చిరంజీవి కృతజ్ఞతలు విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’పేరు పెట్టడంపై ప్రముఖ సినీ హీరో చిరంజీవి ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశంలో తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషం’అని చిరంజీవి పేర్కొన్నారు. ఉయ్యాలవాడకు అసలైన నివాళి.. మనదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో పుట్టింది. 1915లో గాంధీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటగా బిహార్‌లోని చంపారన్‌లో సత్యాగ్రహం జరిగింది. వీటి కంటే ముందు, స్వాతంత్య్రానికి వందేళ్లు ముందే.. తొలి స్వాతంత్య్ర పోరాటం అని చరిత్రకారులు చెప్పిన 1857లో సిపాయిల తిరుగుబాటుకంటే ముందే 1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచి వచ్చారు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ కార్యక్రమానికి ముందు తపాలా శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయ పోస్టల్ స్టాంప్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బందితో గ్రూపు ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం
-
సీఎం జగన్ ప్రకటన.. చిరంజీవి హర్షం
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడికి సముచిత గౌరవం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగించిందన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును కేంద్రమంత్రి పి హర్దీప్సింగ్తో కలిసి సీఎం జగన్ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టునకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన చిరంజీవి.. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటనతో ఆనందంలో మునిగితేలుతున్నా. భారత ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. గొప్ప దేశభక్తుడు, నిజమైన యోధుడు.. ఆయన ఈ గుర్తింపునకు పూర్తి అర్హుడు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్ర పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం’’ అని సంతోషం వ్యక్తపరిచారు. రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ సినిమాలో మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. చదవండి: ‘ఉయ్యాలవాడ’ పేరుతో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు: సీఎం జగన్ Heartened & Overjoyed at the Hon'ble CM @ysjagan 's announcement naming #KurnoolAirport after the Firstever Freedom Fighter of India #UyyalavadaNarasimhaReddy Much deserved recognition to the greatest patriot & unsung Hero.Was fortunate & honored to play the great soul on screen — Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2021 -
సైరా నరసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ
ఆంగ్లేయులపై దేశంలోనే తొలిసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేసి, వారి పాలిట సింహ స్వప్నమై రాయలసీమ ముద్దుబిడ్డగా, రేనాటి వీరుడిగా, సైరా నరసింహారెడ్డిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి పొందారు. శిస్తు వసూలులో తెల్లదొర పెత్తనంపై దండయాత్ర చేసి చివరికి ఉరికొయ్యకు వేలాడి స్వాతంత్య్రోదమానికి బీజం వేశారు. సాక్షి, ఉయ్యాలవాడ: సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ.. అనే జానపద గేయం రాయలసీమ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపింది. దేశంలో తెల్లదొరల నిరంకుశ పాలనపై మొట్టమొదటి సారిగా తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నమయ్యాడు రేనాటి గడ్డ సూర్యుడు, విప్లవ వీరుడు మన ఉయ్యాలవాడ వీర నారసింహారెడ్డి. ఆయన వీర మరణం పొంది రేపటికి 174 సంవత్సరాలు కావడంతో ప్రత్యేక కథనం.. నేపథ్యం.. జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్త మండలాలుగా ప్రకటించి బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశారు. ఇందులో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. నారసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్ నిరంకుశ పాలనకు ప్రతిఘటించి మొదటిసారిగా 1842లో వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. నరసింహారెడ్డి తిరుగుబాటుతో బ్రిటీష్ సామ్రాజ్యం వణికిపోయింది. నరసింహారెడ్డి వినియోగించిన ఫిరంగి తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరికిచంపడమేగాక బ్రిటీష్‌వారి ఖజానాను కొల్లగొట్టారు. ఈయన విప్లవ మార్గాన్ని వణికిపోయిన ఆంగ్లేయులు..ఆయనను పట్టించిన వారికి 10వేల దినారాలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని, బందిపోటు దొంగగా ముద్రవేసి, 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు పరిచారు. అయితే నరసింహారెడ్డి మరణించి వందేళ్లకు స్వాతంత్య్రం సిద్ధించింది. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుచుకుంటుంటారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నరసింహారెడ్డిపై జానపద గేయాలు వినిపిస్తున్నాయి. ఏటా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆయన వంశస్తులు, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నేడు రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ సభ ఈ నెల 21వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో రేనాటి సూర్య చంద్రుల సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నట్లు సేవా సమితి నిర్వహకులు కోట్లో బాబు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉయ్యాలవాడ విప్లవ వీరుడు నరసింహారెడ్డి 174వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్మరణ సభకు నంద్యాల ఎంపీ పోచాబ్రహ్మనందరెడ్డి హాజరు కానున్నారని చెప్పారు. -
పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు
బంజారాహిల్స్: తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని కొణిదల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ తాలూకా, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5వ తరం వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి మాట్లాడుతూ గత మే నెలలో స్వామినాయుడు, రాంచరణ్ పీఏ అవినాష్ తమను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు పిలిపించి ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి రూ. 5 కోట్లు ఇప్పిస్తామంటూ అగ్రిమెంట్ చేసి నోటరీ కూడా చేసి ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు. గత నెల 16న ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని తేల్చిచెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు తమకు న్యాయం చేయకపోవడంతో తాము రాంచరణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఇటీవల అతడి పీఏ అవినాష్ మీకెలాంటి హక్కులు లేవంటూ చెప్పేశాడని ఆరోపించారు. తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటరీ చేసినప్పుడే 15 రోజుల గడువు ఇచ్చారని దానిని పూర్తిగా విస్మరించారన్నారు. -
ఇండియాలో ఆయనే మెగాస్టార్
‘‘సైరా: నరసింహారెడ్డి’ చరిత్ర మరచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన సినిమా. దేశంలోని ప్రజలందరూ ఇలాంటి వీరుడి కథ తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. బడ్జెట్ పరిమితుల కారణంగా ఒకటిన్నర దశాబ్దంగా ‘సైరా’ వాయిదా పడుతూనే ఉంది. సురేందర్‌రెడ్డి, చరణ్ ‘సైరా’ చిత్రం చేయడానికి ముందుకు రావడంతో నా కల నెరవేరింది’’ అన్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవికిషన్, తమన్నా కీలక పాత్రధారులు. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయాలనుకుంటున్నారు. హిందీ వెర్షన్‌ను ఫర్హాన్ అక్తర్, రితీష్ అద్వానీ విడుదల చేస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా టీజర్‌ను మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆజ్కా గూండారాజ్’ (1992) సినిమా తర్వాత బాలీవుడ్లో నాకు ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియడం లేదు. సరైన కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ రాలేదు. ఆ కారణంగానే కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్లాను. మళ్లీ 2016లో సినిమాల్లోకి వచ్చాను. ఆ సమయంలో కొత్త వాతావరణం కనపడింది. మళ్లీ బాలీవుడ్‌కి రావాలన్నప్పుడు ‘సైరా’ సినిమా అయితే సరిపోతుందనిపించింది. అమితాబ్‌గారు నా రియల్ లైఫ్ మెంటర్. నాకు తెలిసి ఇండియాలో మెగాస్టార్ అంటే అమితాబ్ బచ్చన్‌గారే. ఆయన దగ్గరకు ఎవరూ రీచ్ కాలేరు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. సినిమాలో నా గురువుగారి పాత్రలో చేయాలని అమితాబ్‌ని కోరినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారు. ఆయనకు రుణపడి ఉంటాను’’ అని అన్నారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయడం చాలెంజింగ్గానే అనిపించింది. అమితాబ్‌గారు, చిరంజీవిగారు నాకు కంఫర్ట్ జోన్‌ను క్రియేట్ చేశారు. నా వెనక చిరంజీవిగారు, చరణ్‌గారు ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయగలిగాను’’ అన్నారు. ‘‘అమితాబ్ బచ్చన్, చిరంజీవి వంటి గొప్ప స్టార్స్‌తో కలిసి నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు విజయ్ సేతుపతి. ‘‘అద్భుతమైన నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గొప్ప వరంగా భావిస్తున్నా. ప్రతిసారీ ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం రాదు. వచ్చినప్పుడు కాదనుకుండా చేయడమే’’ అన్నారు సుదీప్. ‘‘మెగాస్టార్ చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన దగ్గర్నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు రవికిషన్. ‘‘దక్షిణాది భాష అర్థం కావడమే కష్టం. కానీ సంగీతానికి భాష లేదు. దర్శకుడు, రైటర్స్ నా పనిని సులభం చేశారు’’ అన్నారు సంగీత దర్శకుడు అమిత్ త్రివేది. ‘‘నాన్నగారు ఇంట్లో ఒకలా, మేకప్ వేసుకున్నప్పుడు ఒకలా ఉంటారు. ఈజీగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారు’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘చిరంజీవిగారితో కలిసి నటించాలనే నా కల నెరవేరింది’’ అన్నారు తమన్నా. ‘‘సినిమాకు భాష లేదు. ‘సైరా’ ఒక గొప్ప చిత్రం. ‘వార్’ (హృతిక్ రోషన్–టైగర్ ష్రాఫ్ నటిస్తున్న హిందీ సినిమా), ‘సైరా’ (ఈ రెండు సినిమాలు అక్టోబరు 2న విడుదల అవుతున్నాయి) రెండు వేర్వేరు సినిమాలు. ప్రేక్షకులు రెండు సినిమాలను చూడొచ్చు’’ అన్నారు ఫర్హాన్ అక్తర్. ‘‘సైరా’ గురించి రామ్‌చరణ్ చెప్పగానే నేను టీజర్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. మరికొన్ని రషెస్ చూశాను. దాంతో హిందీలో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నాం’’ అన్నారు రితీష్ అద్వాని. నా కమ్ బ్యాక్ మూవీ అనుకుంటా ‘జంజీర్’ (2013... తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం) తర్వాత బాలీవుడ్లో మరో సినిమా ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు రామ్‌చరణ్ బదులు చెబుతూ – ‘‘ఎంత పెద్ద నటుడికైనా కంటెంట్ ఉన్న సినిమా కుదరాలి. వచ్చే ఏడాది రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’తో మీ ముందుకు (హిందీ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ) రాబోతున్నాను. బాలీవుడ్లో నా కమ్ బ్యాక్ మూవీ ఇది. రామ్‌చరణ్, చిరంజీవి, ప్రభాస్ ‘సైరా’తో ‘సాహో’! ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్ విడుదల వేడుక మంగళవారం ముంబైలో జరిగింది. ‘సాహో’ మూవీ ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ కూడా ముంబైలోనే ఉన్నారు. ఇలా చిరంజీవి, రామ్‌చరణ్, ప్రభాస్ కలిసి ఓ ఫొటోకు ఫోజు ఇచ్చి, అభిమానుల దిల్ ఖుషీ చేశారు. ఫర్హాన్ అక్తర్, రితేష్ అద్వానీ, రామ్‌చరణ్, తమన్నా, చిరంజీవి, సురేందర్ రెడ్డి, సుదీప్ -
స్వాతంత్ర్య సంగ్రామంలో కందనవోలు
రాయలసీమ ముఖ ద్వారంగా పేరొందిన కందనవోలు.. తొలి స్వాతంత్య్రోద్యమ ఖిల్లాగా చరిత్రకెక్కింది. స్వాతంత్య్రోద్యమానికి నాందిగా భావిస్తున్న సిపాయిల తిరుగుబాటుకు ముందే కర్నూలు జిల్లాలో తెల్లదొరలపై ఉద్యమానికి బీజం పడింది. 1801లోనే తిరుగుబాటు ప్రారంభమైంది. తెల్లదొరల దాస్య శృంఖలాల నుంచి మాతృభూమిని విడిపించేందుకు సమర యోధులు అవిశ్రాంత పోరాటం చేశారు. జైలు శిక్షలకు వెరవక ఉద్యమమే ఊపిరిగా సాగారు. వందేమాతరం అంటూ ఉప్పెనై కదిలి బ్రిటీష్ పాలకులను గజగజ వణికించారు. తుపాకీ తూటాలను సైతం లెక్క చేయక స్వాతంత్య్రమే లక్ష్యంగా కదం తొక్కారు. ఈ పోరాటంలో కందనవోలు ప్రజలు చురుకైన పాత్ర పోషించారు. వారిలో కొద్దిమంది గాథలు ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయి. వారి స్వాతంత్య్ర స్ఫూర్తి నలు దిశలా వ్యాపించింది. తెల్లదొరల పాలిట ‘సింహ’ స్వప్నం తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు రేనాటి సూర్యుడు, విప్లవ వీరుడు ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు ఈయన. అప్పట్లో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వచ్చింది. బ్రిటీష్ నిరంకుశత్వ పాలనకు ప్రతిఘటించి 1842వ సంవత్సరంలోనే వారిపై తిరుగు బాటు బావుటా ఎగురవేశాడు. తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరికి చంపడమే కాక బ్రిటీష్ వారి ఖజానాను అంతా కొల్లగొట్టారు. ఈయన విప్లవ మార్గానికి వణికిపోయిన బ్రిటీష్‌వారు ఆయనను పట్టించిన వారికి 10 వేల దినారాలు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. 1847లో సంజామల మండలం జగన్నాథ గుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని బందిపోటు దొంగగా ముద్రవేశారు. 1847 ఫిబ్రవరి 22వ తేదీన కోవెలకుంట్ల సమీపంలో గల జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు పరిచారు. పోరుగల్లు.. తెర్నేకల్ జిల్లాలో 1801లోనే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు తెర్నేకల్ వాసులు. ఈ గ్రా మం ప్రథమ స్వాతంత్య్ర పోరుగల్లుగా నిలిచింది. ఈ పోరాటాన్ని నేటికీ జానపదులు గానం చేస్తూ స్మరించుకుంటారు. 1801లో కరువు కాటకాలకు గురైన తెర్నేకల్ రైతుల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బ్రిటీష్ దొర థాకరే రైతులపై పన్ను విధించారు. గ్రామ నాయకుడు ముత్తుకూరు గౌడప్ప మరికొందరి రైతులను కూడగట్టుకుని పన్ను కట్టేది లేదని వారిని ఎదురించాడు. థాకరే భారీ సైన్యం మందుగుండు సామగ్రితో తెర్నేకల్పై దాడి చేశాడు. గౌడప్పకు తోడుగా అదే గ్రామానికి చెందిన అప్పటి నాయకురాలు రెడ్డెక్కమ్మ కూడా బ్రిటీష్ సైన్యంతో పోరాటం సాగించింది. గౌడప్పతో పాటు ఆ గ్రామ రైతులు బలయ్యారు. భర్తలను కోల్పోయిన కొంతమంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు. బ్రిటీష్ సైన్యం మృతదేహాలను గ్రామంలో ఉన్న కుక్కల బావిలో కుప్పలుగా పోశారు. తెల్ల దొరలను తుదముట్టించిన గులాం రసూల్ ఖాన్.. కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ బ్రిటీష్ దొరల పెత్తనంపై పెనుతుపానై ఎగిశాడు. అప్పటి నవాబులందరూ తెల్లదొరలకు జీ హుజూర్ అంటూ గులాములైన నేపథ్యంలో గులాం రసూల్ ఖాన్ ఉద్యమానికి లాల్ సలామ్ చేశాడు. తన అనుచరులందరినీ వెంటబెట్టుకొని వెళ్లి కర్నూలు సమీపంలోని జొహరాపురం కేంద్రంగా ఉద్యమం ప్రారంభించారు. 1839లో వహబీ ఉద్యమ నేతలతో సంబంధాలు పెట్టుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికీ కర్నూలు కిడ్స్ వరల్డ్‌లో కనిపిస్తున్న ఫిరంగి గులాం రసూల్ ఖాన్ కాలం నాటిదే. హంద్రీ నదీ తీరంలో గులాం రసూల్ ఖాన్ మర ఫిరంగులను పేలుస్తూ వేలాది బ్రిటీష్ దొరలను హతమార్చారు. బ్రిటీష్ సైన్యం గులాం రసూల్ ఖాన్‌ను బంధించి తిరుచునాపల్లి జైలుకు తరలించింది. ఆయనపై విష ప్రయోగం చేసి నిర్దాక్షిణ్యంగా హతమార్చింది. ఆంధ్రా తిలక్.. గాడిచర్ల.. ఆంధ్రా తిలక్‌గా పేరొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలు ప్రాంతానికి చెందిన వారు. నంద్యాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఆయన నంద్యాల కేంద్రంగా కొన్నేళ్లు ఉద్యమాన్ని నడిపారు. స్వరాజ్య ప్రతికను స్థాపించి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తిలేస్వరంలో బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులపై జరిపిన కాల్పుల ఘటనలను తీవ్రంగా విమర్శిస్తూ స్వరాజ్య పత్రికలో ఆయన వ్యాసాలు రాశారు. దీంతో ప్రభుత్వం ఆయనను జైలుకు పంపి తలకు మురికి టోపీ పెట్టి కాళ్లకు చేతులకు గొలుసులు వేసి మట్టి చిప్పలో భోజనం పెట్టి తిడుతూ కొడుతూ హింసించినా ఆయన ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని తిరస్కరించిన బియాబానీ.. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భయమే ఎరుగని వీరునిగా సయ్యద్‌షా మొహియుద్దీన్ ఖాద్రి బియాబానీ నిలిచారు. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్న కంభంలో ఈయన జన్మించారు. అలీఘర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. ఆయనకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇవ్వజూపింది. అయితే వారి వద్ద బానిసగా పనిచేసేందుకు తనకు ఇష్టం లేదంటూ ఆ ఉద్యోగాన్ని తోసిపుచ్చారు. కర్నూలులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సదస్సులో పొల్గొని చురుకైన పాత్ర పోషించి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1923లో అఖిల భారత జాతీయ పతాక సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను భుజాన వేసుకొని ఆయన పల్లెపల్లె తిరిగారు. ఆ సయమంలో బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను రహస్యంగా కలుసుకున్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను జైలులో ఉంచింది. బ్రిటీష్ వారికి భయపడకుండా ఆయన 14 భాషలు నేర్చుకొని ఆయా రాష్ట్రాల్లో ప్రసంగించి అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను బంధించి గయలోని జైలులో ఉంచి హింసించింది. అయినా ఆయన వెన్ను చూపలేదు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పొలొంటూనే కర్నూలు నగరంలో పలు విద్యా సంస్థల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. తన 500 ఎకరాల భూమిని పేదలకు విరాళమిచ్చారు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం ఇచ్చిన 15 ఎకరాల భూమిని సైతం ఉచితంగా పేదలకు పంచి పెట్టారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు ఆయన ప్రియశిష్యుడు. రహస్య దళాల నాయకుడు నివర్తి పత్తికొండకు చెందిన నివర్తి వెంకటసుబ్బయ్య.. నంద్యాలకు వలస వచ్చారు. తాలూకా ఆఫీసులోని ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్య్రోద్యమ బాట పట్టారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న నివర్తిని, 140 మంది సహచరులను అక్టోబర్ 14, 1940లో ప్రభుత్వం అరెస్ట్ చేసి 8 నెలలు జైలు శిక్ష వేసింది. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లారు. విద్యార్థులతో కాంగ్రెస్ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశారు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్దేశిస్తూ ఆయన రూపొందించిన సర్క్యులర్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నిషే«ధించింది. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఆయన లొంగిపోయారు. స్వాతంత్య్రం వచ్చాక 1968 నుంచి 78 వరకు ఈయన శాసనమండలి అధ్యక్షునిగా పనిచేశారు. ఆదర్శ వనిత పద్మావతమ్మ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆస్తిని విరాళంగా ఇవ్వడమే కాకుండా పోరాటాన్ని జరిపిన ఏకైక మహిళగా పద్మావతమ్మ ఆదర్శంగా నిలిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్‌గా పనిచేసిన శ్యాముల్ బెనెటిక్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు. నంద్యాలకు ప్రాంతానికిచెందిన దేశాయి కప్పురావు, కోడి నరసింహం, ఆత్మకూరు నాగభూషణం శెట్టి, ఎర్రబోలు సుబ్బారెడ్డి, యాతం మహానందిరెడ్డి, రాజా శ్రీనివాస్‌లు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మహాత్ముడి నడయాడిన నేల.. స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత గాంధీజి ప్రసంగం ఆదోని ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. 1926లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించింది. ఇందుకు నిరసనగా గాంధీజీ పాదయాత్ర చేపట్టి దేశ ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు యత్నించారు. ఇందులో భాగంగానే ఆయన 1930 సెప్టెంబర్ 30న కర్ణాటకలోని సండూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం రైలులో ఆదోనికి చేరుకున్నారు. స్థానిక మున్సిపల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో జాతిపిత ఉద్వేగంగా హిందీలో ప్రసంగించారు. ఆదోని పట్టణానికి చెందిన చున్నీలాల్ జయచంద్ సోనో ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించారు. గాంధీజీ ఉద్వేగ పూరితంగా చేసిన ప్రసంగం స్థానికంగా ప్రజల్లో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని నింపింది. -
స్వాతంత్య్రానికి సైరా
నేడు స్వాతంత్య్ర దినోత్సవం. మనం ఆనందిస్తున్న ఈ ఫ్రీడమ్‌ను మనకు అందించడం కోసం ఎందరో పోరాడారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లలో తొలి తరం యోధుల్లో తెలుగు వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఒకరు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి లీడ్ రోల్లో ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించారు. దాదాపు 225 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ పీరియాడికల్ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావడానికి చిత్రబృందం పడిన శ్రమ, మేకింగ్ ఆఫ్ ‘సైరా’ గురించి కొన్ని విశేషాలు మీకోసం. మేకింగ్ ఆఫ్ ‘సైరా’ రాజ్య వ్యవస్థలను, రాజులను ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకొని తమ అదుపులో ఉన్న ప్రాంతాలకు ‘పాలెగాళ్ల’ను ఏర్పాటు చేసేవాళ్లు. అలాంటి ఓ పాలెగాడు నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై ఎలా ఎదురుతిరిగాడు? ఈ ఉద్యమంలో ఎవరెవరిని తనతో కలుపుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది చిత్రకథ అని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ రాణిగా కనిపిస్తారు. సినిమా అనుష్క వాయిస్ ఓవర్‌తోనే మొదలవుతుందని తెలిసింది. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్ నటించారు. రాజ నర్తకి పాత్రలో తమన్నా, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డికి మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చే దళ నాయకుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తారు. ఎవరి పాత్రేంటి? చిరంజీవి – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నయనతార – సిద్ధమ్మ అమితాబ్ బచ్చన్ – గోసాయి వెంకన్న జగపతి బాబు – వీరారెడ్డి ‘కిచ్చ’ సుదీప్ – అవుకు రాజు విజయ్ సేతుపతి – రాజా పాండీ తమన్నా – లక్షి అనుష్క – ఝాన్సీ లక్ష్మీభాయ్ సైరా బృందం రచన : పరుచూరి బ్రదర్స్ దర్శకుడు : సురేందర్ రెడ్డి నిర్మాత : రామ్‌చరణ్ ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ కెమెరా మేన్ : రత్నవేలు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ : గ్రెగ్ పోవెల్, రామ్ లక్ష్మణ్, లీ వైట్కర్ కాస్ట్యూమ్ డిజైనర్ : అంజూ మోడీ, సుష్మితా కొణిదెల, ఉత్తరా మీనన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కణ్ణన్ సంగీతం : అమిత్ త్రివేది రాజస్తాన్ స్పెషల్ కత్తి యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 150కు పైగా వివిధ రకాలైన కత్తులను తయారు చేయించారట. ప్రధానంగా చిరంజీవి రెండు కత్తులు వాడారని సమాచారం. ఒక కత్తిని ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి తెప్పించారట. ఇక్కడ డిజైన్ చేసి, రాజస్తాన్ పంపించి, ఆ కత్తిని తయారు చేయించారు. మరో కత్తిని హైదరాబాద్‌లోనే తయారు చేయించారు. ఇంకా మిగతా కత్తులను ఇక్కడ డిజైన్ చేసి, చెన్నైలో తయారు చేయించారు. రెండు భారీ యుద్ధాలు! ‘సైరా’ సినిమాలో రెండు భారీ యుద్ధాలు ఉంటాయని తెలిసింది. ఈ యుద్ధ సన్నివేశాల్లో ఒకటి జార్జియా దేశంలో, మరొకటి హైదరాబాద్‌లోని కోకాపేట్ సెట్లో షూట్ చేశారు. జార్జియాలో నెల రోజుల పాటు ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించగా, కోకాపేట్లో దాదాపు 35 రోజులుపైగా నైట్ షూట్ చేశారట. సినిమాలో వచ్చే ఈ మేజర్ వార్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలిసింది. ఇంకా ఇవి కాకుండా పోరాట దృశ్యాలు మరిన్ని ఉంటాయి. వాటిలో నీటి లోపల తీసిన అండర్ వాటర్ ఎపిసోడ్ ఓ హైలైట్ అని తెలిసింది. ఈ ఎపిసోడ్‌ను ముంబైలో వారం రోజులు షూట్ చేశారు. పదిహేను సెట్లు ‘సైరా’ చారిత్రాత్మక చిత్రం. స్క్రీన్ మీద ఆ కాలాన్ని ప్రతిబింబించాలంటే సెట్లు కచ్చితంగా నిర్మించాల్సిందే. ‘సైరా’ చిత్రాన్ని ఎక్కువ శాతం సెట్లోనే షూట్ చేశారు. దాని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు సెట్లు, ఆర్ఎఫ్సీలో రెండు సెట్లు, కోకాపేటలో మూడు సెట్లు (టెంపుల్ సెట్, ప్యాలెస్ సెట్‌తో పాటు మరోటి), ఇంకా హైదరాబాద్‌లోనే రెండు సెట్లు, పాండిచెరీలో ఒకటి, మైసూర్, తమిళనాడులో హోగెనకల్లో ఒకటి, కేరళలో ఒకటి, రెండు సెట్లను రూపొందించారు. ఇలా 15కు పైగా భారీ సెట్లను ఈ సినిమా కోసం రూపొందించారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో అద్భుతమైన సెట్లు తయారు చేశారు. నయనతార గెరిల్లా ఫైట్ నరసింహారెడ్డి ఆంగ్లేయులతో తలపడిన విధానాల్లో గెరిల్లా ఒక పద్ధతి. శత్రువుల్లో కలిసిపోయి అనూహ్యంగా దాడి చేయడం ఈ యుద్ధ విద్య విశేషం. సినిమాలో ఓ పాటలో ఈ గెరిల్లా పోరాటాన్ని చూపించనున్నారట చిత్రబృందం. పాట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ ఫైట్‌లో చిత్రకథానాయకుడు చిరంజీవితో పాటు దాదాపు 500మంది పాల్గొన్నారు. కాస్ట్యూమ్స్ ఇందులో చిరంజీవి సుమారు 50 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చిరంజీవి కాస్ట్యూమ్స్‌ను ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల డిజైన్ చేశారు. తమన్నా నర్తకి పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూడా ఓ 25 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. నయనతారకి 20 డ్రస్ చేంజ్‌లు ఉంటాయని తెలిసింది. సినిమాలో ఎక్కువ కాస్ట్యూమ్స్ ఈ మూడు పాత్రలకే ఉంటాయి. అంజూ మోడీ, ఉత్తరా మీనన్‌లు కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. తమన్నా ‘‘సైరా’లో నా పాత్ర రెండు నిమిషాలు కూడా ఉండదు. కానీ మేకింగ్ వీడియోలో నా విజువల్స్ కూడా వేశారు చరణ్ (రామ్ చరణ్) అన్న. అది చాలా స్వీట్ అనిపించింది. అన్న స్టైలే అది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మా అందర్నీ హ్యాపీగా ఉంచుతాడు. ఇది రక్షాబంధన్‌కి అడ్వాన్స్‌గా ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను’’ అని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు నిహారిక. ఇందులో నిహారిక కాసేపు కనిపిస్తారు. నిహారిక -
హీరో రాంచరణ్ ఇంటి ముందు ఆందోళన
-
‘కొణిదెల’ కార్యాలయం ఎదుట ఆందోళన
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను కథగా మలుచుకొని కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీస్తున్న సంగతి తెలిసి ందే. ఈ నేపథ్యంలోనే ఉయ్యాలవాడకు చెందిన దాదాపు ఏడు కుటుంబాలు లక్ష్మి నేతృత్వంలో ఇక్కడికి చేరుకున్నాయి. తమ కుటుంబసభ్యులకు కొణిదెల ప్రొడక్షన్స్ సభ్యులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, ఒప్పందం కూడా చేసుకున్నారన్నారు. అయితే శనివారం రాత్రి హీరో రామ్‌చరణ్ మేనేజర్ అభిలాశ్ ఫోన్ చేసి, ఇక్కడికి రావద్దని కథపై తమకెలాంటి హక్కులు లేవని చెప్పడంతో తాము అవాక్కయ్యామన్నారు. తమ నిరసన వ్యక్తం చేసేందుకే ఇక్కడికి వచ్చామన్నారు. తమ కథను వాడుకోవడమే కాకుండా తమ ఆస్తులను కూడా వాడుకున్నారన్నారు. కథ విషయంలో తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇంటి ముందున్న సామగ్రిని నాశనం చేశారని ఆరోపించారు. మార్చి 11న చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఏడు కుటుంబాలకు చెందిన 22 మందిని పిలిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రామ్‌చరణ్ న్యాయం చేస్తానని మాటిచ్చారని, అయితే మధ్యవర్తులు కొందరు అందుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సిబ్బంది వారితో మాట్లాడి తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఆ కుటుంబాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. ఇదిలా ఉండగా ఈ విషయంలో ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఇప్పటికే రెండుసార్లు కోర్టును ఆశ్రయించాయని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సైరా నిర్మాణ వర్గాలు స్పష్టం చేశాయి. -
విప్లవ వీరుడు.. రేనాటి సూర్యుడు
1847 సంవత్సరం.. ఫిబ్రవరి 22వ తేదీ తెల్లవారు జామున కోవెలకుంట్ల జైలు ద్వారం తెరుచుకుంది. వందల మంది బ్రిటీషు సైనికులు మధ్యన గొలుసులతో బంధించిన ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ పక్కనే ఉన్న వేలాది జనం ‘దొరకు జై’.. అంటూ హోరెత్తారు. ‘ఉద్యమం మరణించదు.. ఎప్పటికీ జీవించే ఉంటుంది’ అంటూ జనానికి అభివాదం చేస్తూ జుర్రేరు ఒడ్డు వైపు అడుగులు వేశాడు ఆయన. అక్కడేనిలువెత్తు పాతిన ఉరి కొయ్యను ఎక్కి చిరునవ్వుతో భరతమాత ఒడిలో ఊపిరి వదిలాడు. బ్రిటీషులు ఆయన తలను 30 ఏళ్లు కోట గుమ్మానికి వేలాడదీసి ప్రజలను భయపెట్టాలనుకున్నారు. అయితే ప్రజలకు ఆయన పోరాటం మార్గమైంది. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచింది. రేనాటి సూర్యుడిగా ఖ్యాతికెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు : భారత దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు బావుట ఎగుర వేసిన మొట్ట మొదటి విప్లవ వీరుడు.. ఉయ్యాలవాడనరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్తత మండలాలుగా ప్రకటించి బ్రిటీష్వారికి ధారాదత్తం చేశారు. రేనాటి ప్రాంతంలో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్ద మల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్‌పాలన నిరంకుశత్వ పాలనను ప్రతిఘటించి మొదటిసారిగా 1842లో తిరుగుబాటు బావుట ఎగర వేశాడు. నరసింహారెడ్డి పోరాటానికి బ్రిటీష్ సామ్రాజ్యం గజగజ వణికిపోయింది. తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరికిచంపడమే కాక బ్రిటీష్ వారి ఖజానాను కొల్లగొట్టారు. ఆయనను పట్టించిన వారికి 10 వేల దినారాలు బహుమతి అందజేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకున్నారు. బందిపోటు దొంగగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22వ తేదీన కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేశారు. ప్రజలు భయపడేలా 1877 వరకు ఆయన తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశారు. అయితే నరసింహారెడ్డి మరణించిన వంద సంవత్సరాలకు స్వాతంత్య్రం సిద్ధించింది. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుచుకుంటుంటారు. ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నరసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం ఆయన వీరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏటా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆయన వంశస్తులు, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో పోచా బ్రహ్మానందరరెడ్డి, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, నరసింహారెడ్డి, తదితరులు నిర్వహిస్తుండగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే అధికారికంగా వర్ధంతిని జరుపునుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కోవెలకుంట్లలో స్మారక స్మృతి వనం బ్రిటీష్ పాలనలో కోవెలకుంట్ల పట్టణంలోని ప్రస్తుత గాంధీసెంటర్ సమీపంలో ట్రెజరీ ఏర్పాటు చేసుకున్నారు. 1846వ సంవత్సరంలో నరసింహారెడ్డి ఈ ట్రెజరీపై దాడి చేసి నరసింహారెడ్డి 805 రూపాయల 10 అణాల నాలుగుపైసలను కొల్లగొట్టారు. ట్రెజరీపై దాడికి గుర్తుగా ఆ ప్రాంతంలో 2012వ సంవత్సరంలో పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది చిన్న ఎల్లారెడ్డి ఆర్థిక సహకారంతో నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ప్రతి ఏటా వర్ధంతిని నిర్వహిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా సైరా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరపైకి ఎక్కిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా చలన చిత్రం రూపొందిస్తున్నారు. నరసింహారెడ్డి వర్థంతిని ప్రతి సంవత్సరం మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించేవారు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అధికారికంగా నిర్వహించనుండటంతో వర్ధంతికి ప్రాధాన్యత సంతరించుకుంది. కోవెలకుంట్ల పట్టణ శివారులోని కుందూనది ఒడ్డున రేనాటి సూర్యచంద్రుల పేరుతో స్మారక స్మృతి వనం ఏర్పాటవుతోంది. నాలుగు రోడ్ల కూడలిలో నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్రిటీష్‌వారిని గడగడ లాడించిన నరసింహారెడ్డి రేనాటి సూర్యుడిగా, దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి రేనాటి చంద్రుడిగా 2002వ సంవత్సరం తంగిరాల సుబ్బారావు రేనాటి సూర్యచంద్రుల గ్రంథాన్ని ఆవిష్కరించారు. పాఠ్యాంశంగా చేర్చాలి:తెల్లదొరలను గడగడ లాడించిన విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రేనాటి చంద్రుడిగా వెలుగొందుతున్న బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్రలను పాఠ్యాంశంగా చేర్చాలి. రేనాటి సూర్యచంద్రుల జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వారి ఖ్యాతిని దేశ నలుమూలాల వ్యాపింప చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కామని వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జాయింట్ యాక్షన్‌కమిటీ కో ఆర్డినేటర్, కోవెలకుంట్ల నరసింహారెడ్డి నడియాడిన ప్రదేశాలనుస్మృతి వనాలుగా తీర్చిదిద్దాలి: నరసింహారెడ్డి నొస్సం కోట కేంద్రంగా బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు బావుట ఎగుర వేశాడు. నరసింహారెడ్డి దాడి చేసిన ట్రెజరీ, పట్టుబడ్డ గిద్దలూరు జగన్నాథ స్వామి ఆలయం, ఉరితీసిన జుర్రేరు ప్రాంతం, నరసింహారెడ్డి తలను వేలాడ దీసిన ప్రాంతాలను స్మృతి వనాలతో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. నరసింహారెడ్డి, రిటైర్డ్ లైబ్రేరియన్, కోవెలకుంట్ల -
అవుకు రాజు అండీ... అవుకు రాజు
ఎవరీ అవుకు రాజు? ఏమా కథ? అంటే.. మరెవరో కాదు.. ఆయన అభినయ చక్రవర్తి. అబ్బా.. అవుకు రాజు ఎవరో తెలియదు.. మళ్లీ అభినయ చక్రవర్తి అని కొత్త ట్విస్ట్ ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. అభినయ చక్రవర్తి అంటే కన్నడ స్టార్, ‘ఈగ’ ఫేమ్ సుదీప్. అవుకు రాజు కూడా ఆయనే. సుదీప్ పుట్టినరోజు నేడు. కన్నడ చిత్ర సీమలో అభిమానులంతా ఆయన్ను ముద్దుగా అభినయ చక్రవర్తి అని పిలుస్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘సైరా’లో ఆయన అవుకు రాజు పాత్ర చేస్తున్నారు. చిరంజీవి టైటిల్ రోల్లో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. యుద్ధ సన్నివేశానికి సంబంధించినట్లుగా ఉన్న ఈ స్టిల్‌లో అవుకు రాజుతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిటిష్ సైన్యం కనిపిస్తోంది కదూ. సో.. అవుకు రాజు బ్రిటిష్ వైపు అని అర్థం చేసుకోవచ్చేమో. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ‘సైరా’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వరకర్త, రత్నవేలు ఛాయాగ్రాహకుడు. -
వీరనారిగా...
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ స్టార్ క్యాస్ట్‌తో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో స్క్రీన్ అంతా ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా మారనుడటం పక్కా. ఇప్పుడీ భారీ చిత్రంలో టాలీవుడ్ టు బాలీవుడ్ వెళ్లి స్థిరపడిన టబు కూడా యాడ్ అయ్యారని సమాచారం. ‘సైరా’ సినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్గా కనిపించనున్నారట. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న పీరియాడికల్ మూవీ ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు ఓ ముఖ్య ఘట్టంలో ఝాన్సీ లక్ష్మీభాయ్ కూడా ఉన్నారట. దాంతో ఈ పాత్రకు టబును సెలెక్ట్ చేసుకున్నారట చిత్ర బృందం. పదేళ్ల గ్యాప్ తర్వాత టబు నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతిలతో నిండిపోయిన ఈ పీరియాడికల్ మూవీలో టబు కూడా జాయిన్ అవ్వడం కచ్చితంగా ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అమిత్ త్రివేది. -
‘ఉయ్యాలవాడ’ ముని మనుమరాలి పెళ్లి వేడుక
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. కొద్ది రోజలు క్రితం వరకు చరిత్ర మీద అవగాహన ఉన్నవారికి తప్ప పెద్దగా ఎవరికీ తెలియని స్వాతంత్ర్య సమరయోధుడు. కానీ ఇప్పుడు ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతోనే రూపొందిస్తున్నారు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన ముని మనుమరాలు సంజన రెడ్డి వివాహం చెన్నైకి చెందిన ప్రతాప్ రెడ్డితో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి విచ్చేసిన ప్రముఖులకు సంజనరెడ్డి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి, సుచరిత స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు, దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు సుమన్, మంత్రి అఖిల ప్రియ, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు విశ్వేశ్వరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉయ్యాలవాడ వారసులు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను గతంలో మేమే చలనచిత్రంగా నిర్మించాలనుకున్నాము. అప్పట్లో ఈ విషయమై నటులు సుమన్, సాయికుమార్‌లను కూడా సంప్రదించాం. కానీ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ జీవితాన్ని సినిమాగా తియ్యటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. -
‘నరసింహారెడ్డి’ ముని మనుమరాలి పెళ్లి వేడుక
-
హోరా హోరీ పోరు
లాఠీలు, తూటాలతో బ్రిటీష్ పోలీసులు ఒకవైపు, బాకులు, బరిసెలతో సమరయోధులు ఇంకోవైపు. ఒకరిది అధిపత్య పోరు. మరొకరిది స్వాతంత్య్ర సమరం. నడి రాత్రి బ్రీటిష్ సైన్యానికి, ‘సైరా’ టీమ్‌కి జరిగిన యుద్ధ నేపథ్యం ఇది. మరి.. ఈ పోరాటం ఏ స్థాయిలో జరిగిందనేది వెండితెరపై చూడాల్సిందే. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన షెడ్యూల్ గురువారం కంప్లీటైందని చిత్రబృందం పేర్కొంది. ‘‘దాదాపు 35 రాత్రుల పాటు షూటింగ్ జరిపి చాలెంజింగ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాం. ‘సైరా’ సెట్లో బ్రిటిష్ సైన్యంతో మాత్రమే కాదు. రెయిన్‌తో కూడా ఫైట్ సాగింది. సూపర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం’’ అని ఈ చిత్రం కెమెరామెన్ రత్నవేలు పేర్కొన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
సైరాకి సై
నరసింహారెడ్డి చేసే సాహసాలకు తెరపై సంగీతం అందించడానికి సంగీత దర్శకుడు దొరికారట. ఆల్రెడీ నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయట. చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. షెడ్యూల్ బిజీ కారణంగా ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణి, యస్.యస్. తమన్ అని పలు పేర్లు వినిపించాయి. కానీ ఎవరి పేరూ కన్ఫర్మ్ అయినట్లు న్యూస్ రాలేదు. లేటెస్ట్గా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ‘సైరా’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సై అన్నట్లు సమాచారం. ‘సీక్రెట్ సూపర్‌స్టార్, క్వీన్, డియర్ జిందగీ, ప్యాడ్‌మ్యాన్’ వంటి పాపులర్ సినిమాలకు సంగీతం అందించారాయన. త్వరలో స్టార్ట్ కానున్న ప్రభాస్– రాధాకృష్ణ కుమార్ సినిమాకు కూడా అమిత్‌నే సంగీతం సమకూర్చనున్నారు. ‘సైరా’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ కూడా స్టార్ట్ చేశారట అమిత్. ఈ సినిమాలో మూడు పాటలకు ట్యూన్స్ ఇచ్చే పనిలో పడ్డారాయన. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కానున్న చిత్రం టీజర్‌కు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ పనిలో ప్రస్తుతం బిజీ ఉన్నారట. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేస్తున్నారు. -
వేడి తగ్గలేదు
రుతువు మారి వర్షాకాలం వచ్చిన తర్వాత వెదర్ చల్లగా మారింది. కానీ ‘సైరా’ సెట్లో మాత్రం వార్ వేడి ఇంకా చల్లారలేదు. పైగా వేడి ఇంకా పెరుగుతోంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. ఇప్పటివరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయిందట. గత 30 రోజుల నుంచి వార్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్ సీన్స్నే తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి, సుదీప్‌లపై ఈ పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ వార్ బ్యాక్‌డ్రాప్ షెడ్యూల్ ఈ నెల 25 వరకు కొనసాగనుందని సమాచారం. ‘సైరా’ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గ్యారీ పావెల్ వర్క్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు రత్నవేలు ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్లో అండ్ స్టడీ
ఉదయాన్నే ఖాళీ ప్లేస్‌లో రౌండ్స్ కొడుతున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషీ. రన్నింగ్ రౌండ్సా? డ్రైవింగ్ రౌండ్సా? అంటే.. రెండూ కాదు.. గుర్రంపై రౌండ్స్ వేస్తున్నారు. తాజాగా ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ‘‘ఉదయాన్నే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. స్లో అండ్ స్టడీగా నేర్చుకుని ఆ నెక్ట్స్ స్పీడ్ పెంచుతా’’ అని పేర్కొన్నారు హ్యూమా. సడన్‌గా ఆమె గుర్రపు స్వారీ ఎందుకు నేర్చుకుంటున్నారు? అంటే ‘సైరా’ చిత్రం కోసమనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తోన్న సినిమా ‘సైరా’. నయనతార కథానాయిక. అమితాబ్, తమన్నా, విజయ్‌సేతుపతి, సుదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హ్యూమాను సంప్రదించారట. అందుకే క్యారెక్టర్ కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని టాక్. -
సత్తా చూపిస్తా
విల్లు ఎక్కుపెట్టినా, కత్తి విసిరినా టార్గెట్ మిస్సవ్వరు తమన్నా. వీరనారి పాత్రలో ఆమె గురి ఎలా ఉంటుందో, ధైర్య సాహసాలు ఎలాంటివో ‘బాహుబలి’ సినిమాలో చూశాం. ఇప్పుడు ‘సైరా’ చిత్రం కోసం ఆమె కత్తి పట్టి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్నారు. బ్రిటీషర్లకు భారతీయ మహిళల సత్తా ఏంటో చూపిస్తున్నారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సైరా’. సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు–నిర్మాత రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సైరా’ షూటింగ్లో తమన్నా పాల్గొంటున్నారు. చిత్రంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.