vallabhaneni balashowry
-
ప్రజల గుండెల్లో రంగా స్థానం నేటికీ పదిలం
విజయవాడ రూరల్: పేదల హక్కుల కోసం కృషి చేసిన వంగవీటి మోహనరంగా మరణించి 34 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో నేటికీ ఆయన చిరస్థాయిగా నిలిచే ఉన్నారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. విజయవాడ సమీపంలోని నున్నలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. 1989లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రంగా శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం జీవించి, వారి కోసమే ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు వీఎం రంగా అన్నారు. ఆయన మరణించి 34 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఆపేక్ష లేని రంగా తనయుడు విజయవాడలో సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. వీఎం రంగా ప్రజల మనిషని అన్నారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేసి 35 సంవత్సరాలుగా ప్రజల మనిషిగా వారి గుండెల్లో నిలిచిపోయారన్నాని, రంగాకు మరణమే లేదని పేర్కొన్నారు. ఆయన తనయుడు రాధాకృష్ణ రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. వీఎం రంగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి తోట వెంకయ్య, విగ్రహ దాత కొట్టే రవికుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్వీఆర్, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ కె.సువర్ణరాజు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ యర్కారెడ్డి నాగిరెడ్డి, సర్పంచ్ కాటూరి సరళ పాల్గొన్నారు. -
ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సోమవారం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయే వధువరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని నూతన జంటకు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్.గోపాల్‌రెడ్డి, రమేశ్‌వర్మ, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘దుర్మార్గ ఆలోచనలకు చంద్రబాబు ఆద్యుడు’
సాక్షి, గన్నవరం: ప్రతిపక్షనేత చంద్రబాబు కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చిన రోజే.. రాష్ట్ర ప్రజలకు సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ‘నవరత్నాలు-పేదలకు ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. 2631 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. (చదవండి: చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం) ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తే.. పునాదులు కదులుతాయని ప్రతిపక్షాలు కుట్రపన్నాయని దుయ్యబట్టారు. 25 కోట్లు ఖర్చు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్లను పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో చంద్రబాబు ఆద్యుడు. ఆయనకి కొన్ని డబ్బా చానల్స్ వత్తాసు పలుకుతూ హడావుడి చేస్తున్నాయని కొడాలి నాని ధ్వజమెత్తారు.(చదవండి: ‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’) అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి సీఎం జగన్: ఎంపీ బాలశౌరి చర్రితలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే, గుండె ధైర్యం, కృషి, పట్టుదల ఉండాలని,అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎంపీ బాలశౌరి అన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదల గుండె చప్పుడు అయ్యారని, నేడు సీఎం వైఎస్ జగన్.. పేదల సొంతింటి కల నెరవేర్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే ఒక్క వైఎస్సార్ కుటుంబానికే సాధ్యమన్నారు. వైఎస్సార్ 1 రూపాయికే వైద్యం చేసి.. వృత్తికే వన్నె తీసుకువస్తే.. సీఎం జగన్ 1 రూపాయికే 30 లక్షల 70 వేలు టిడ్కో ఇళ్లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: ఎమ్మెల్యే వంశీ పేదల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గొప్పలు కోసం లక్ష పట్టాలు అని డబ్బా కొట్టుకొని స్థలం చూపించలేకపోయారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అందరికీ స్థలం,ఇల్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించేవారే అసలైన నాయకుడన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు.. పసుపు-కుంకుమ పేరు చెప్పి ప్రజల దగ్గరకు వెళ్తే చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. చెప్పింది చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని వల్లభనేని వంశీ అన్నారు. -
బ్యాటరీ కార్లను ప్రారంభించిన ఎంపీ
సాక్షి, కృష్ణా: బ్యాటరీ కార్లు వాడటం వల్ల కాలుష్య స్థాయి తగ్గుతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. సోమవారం ఆయన గన్నవరం విమానాశ్రయంలో కాలుష్య రహిత బ్యాటరీ కార్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గన్నవరం విమానాశ్రయంలో బ్యాటరీ కార్లను ప్రారంభించామన్నారు. ఇక ఈ ఎయిర్‌పోర్టు నుంచి వారానికి రెండు రోజులు దుబాయ్ సర్వీసులు నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎయిర్ ఇండియా అధికారులను కోరామని తెలిపారు. త్వరలోనే శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలకు సర్వీసలు గన్నవరం విమానాశ్రయం నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాలకు వారానికి రెండు రోజులు సర్వీసులు నడపాలని జెట్ ఎయిర్వేస్, ఇండిగో సంస్థలను కోరామన్నారు. ఇక్కడి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం దృష్ట్యా ఆయా సంస్థలు సానుకూలంగా స్పందించాయన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయా దేశాలకు సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావు పాల్గొన్నారు. చదవండి: ఏపీలో ‘కాంకర్’ పెట్టుబడులు -
ఏపీలో ‘కాంకర్’ పెట్టుబడులు
సాక్షి, మచిలీపట్నం: ఏపీలో రానున్న మూడేళ్లలో రూ.5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్‌రామ్ అంగీకరించారు. సమావేశం నిర్ణయాలను బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం మీడియాకు వివరించారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సర్వీసెస్ కల్పనారంగంలో కాంకర్ సంస్థ అగ్రగామిగా ఉంది. కంటైనర్ ట్రైన్ సర్వీసెస్‌లో 75% మార్కెట్ షేర్‌తో దేశంలోనే టాప్ 500 కంపెనీల్లో 196వ స్థానంలో ఉంది. సంస్థ ఇప్పటికే కడపలో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, విశాఖలో లాజిస్టిక్ వర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చింది. తాజాగా విశాఖ పోర్టులో రూ.500 కోట్లతో, కృష్ణపట్నం పోర్టులో రూ.400 కోట్లతోనూ, కాకినాడ పోర్టులో రూ. 300 కోట్లతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ (ఎంఎంఎల్పీ) ఏర్పాటు చేయనుంది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధితో పాటు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌జోన్ (ఐఎంఎల్‌జెడ్) ఏర్పాటుకు రూ.3వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. విశాఖ– విజయనగరం మధ్య ఫ్రైట్ రైల్ రూ.వెయ్యి కోట్లతో విశాఖ–విజయ నగరం మధ్య 60 కిలోమీటర్ల మేర డెడికేటెడ్ ఫ్రైట్ రైల్ లైన్ నిర్మాణానికీ ముందుకొచ్చింది. ఇక మచిలీపట్నం పోర్టులో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఎల్‌ఎంజెడ్ లాజిస్టిక్స్ సర్వీసులు, ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్ (ఎఫ్టీడబ్ల్యూజెడ్), మాన్యుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్), వేర్ హౌసింగ్, అసెంబ్లీ లైన్, వాల్యూ ఎడిషన్ యాక్టివిటీస్‌కు ఉపకరించనుంది. అలాగే రైల్ కనెక్టివిటీ, రోడ్ ఆపరేటర్స్ అండ్, షిప్పింగ్ లైన్ ఏర్పాటుతో మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి, ఇక్కడి వ్యాపారం పెరుగుదలకు, పరిశ్రమల అభివృద్ధికి ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాల కల్పనకు ఎంతగానో దోహదపడనుంది. దశల వారీగా బందరు పోర్టును అభివృద్ధి చేసేందుకు ఐఎల్ ఎంజెడ్ ఉపయోగపడనుంది. ఐఎల్‌ఎంజెడ్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాంకర్ ముందు కొచ్చింది. -
ప్రతి విద్యార్థికి ఆ రెండు అవసరం
సాక్షి, విజయవాడ: నాడు-నేడు పేరుతో పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌళిక వసతులు కల్పించి వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా మొదటి దశలో రూ.1500 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఉంగుటూరు మండలంలో తేలప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. విద్య, వైద్యానికి సీఎం మొదటి ప్రాధాన్యతనిస్తున్నారన్నారు జనవరి 9న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. సీఎం జగన్ విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. నాడు-నేడు పేరుతో మొదటి దశలో 15 వేల పాఠశాలల అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. తేలప్రోలులో ప్రవాస భారతీయుడు కృష్ణమోహన్ రెడ్డి అందించిన రూ. కోటి విరాళంతో పాఠశాల రూపుదిద్దుకోవడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఆంగ్లవిద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు మానసికంగా వృద్ధులు ప్రతి విద్యార్థి విద్య తర్వాత ఆరోగ్యానికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల దాత, ప్రవాస భారతీయుడు డా. భీమవరపు కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు మానసికంగా వృద్ధులుగా ఉన్నారే కానీ శారీరకంగా కాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు చిన్నతనం నుంచే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. -
‘వాళ్లు క్షమాభిక్ష కోరకుండా చట్టాన్ని సవరించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార ఘటనల్లో నిందితులకు శిక్ష పడిన తర్వాత.. మళ్లీ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకూడదని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో దోషులకు క్షమాభిక్ష కోరకుండా చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. మద్య నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాల తరహాలోనే.. అన్ని రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మద్యం దుకాణల సంఖ్య తగ్గించాలని, బార్ల లైసెన్సులు రద్దు చేయాలని.. రాత్రి 8 గంటల తరువాత మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. -
త్వరలో నేరుగా గన్నవరం నుంచి దుబాయ్‌కు!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి గురువారం సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ ఖోరాతో భేటీ అయ్యారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనల మేరకు ప్రదీప్ సింగ్‌ను బాలశౌరి కలిశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారానికి రెండు సార్లు విజయవాడ- హైదరాబాద్-దుబాయ్ ల మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడపాలనిఘీ సందర్భంగా ప్రదీప్ సింగ్‌ను బాలశౌరి కోరారు. బాలశౌరి విజ్ఞప్తి మేరకు.. ఎయిర్ ఇండియా సర్వీసులు నడపడానికి ప్రదీప్ సింగ్ సానుకూలత వ్యక్తం చేశారు. ఇందుకోసం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరతగతిన పర్మినెంట్ బిల్డింగ్లు, ఏరో బ్రిఢ్జిల పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరంకి ఎయిర్ కనెక్టివిటీ అంశంపై చర్చించానంటూ హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. త్వరలోనే విజయవాడ-దుబాయ్ కి ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని కేంద్రం హామీ ఇవ్వడం ఆనందంగా వుందని తెలిపారు. -
‘ఏపీ చరిత్రలో ఇదొక విశిష్టమైన రోజు’
సాక్షి, విజయవాడ : పామర్రులోని అసిస్సీ జెడ్పీ పాఠశాలలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ జిల్లాస్థాయి కార్యక్రమం మంగళవారం జరిగింది. మంత్రి పేర్నినాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీ, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీని నిలుపుకుంటూ వారి కళ్ళలో ఆనందాన్ని నింపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ రోజు విశిష్టమైందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఒక్క పంటకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం తరువాత సీఎం జగన్ పాలనలొనే డ్యామ్‌లు నిండు కుండల్లా మారాయని గుర్తు చేశారు. రెండో పంటకు సైతం నీరు ఇస్తామని తమ పార్టీ నాయకులు గర్వంగా చెప్పగలుగుతున్నారని బాలశౌరి వెల్లడించారు. సమస్యలు పరిష్కరిస్తాం.. పామర్రులో జిల్లా స్థాయి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. పామర్రు నియోజకవర్గంలో 30,707 వేల కుటుంబాలకు రూ.41 కోట్లు మంజూరు చేశామని , ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చేరుతుందని తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా దాదాపు మూడు లక్షలకు పైగా రైతులు లబ్ది పొందనున్నారని వెల్లడించారు. నవంబర్ 15 వరకు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆధార్ సీడింగ్, వెబ్ లాండింగ్లో రైతుల పేర్లు సాధికారిక సర్వేలో నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని, గ్రామ సచివాలయ వలంటీర్ల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అక్కడ నుంచి ఇక్కడొచ్చి పడ్డారు.. టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్రెడ్డి పాలన చూసి ఓర్వలేక.. బరద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ‘పులివెందుల వరకు తరిమికొడతామని టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. టీడీపీ నాయకులను హైదరాబాద్ నుంచి తరిమికొడితే ఇక్కడకొచ్చి పడ్డారు’ అని ఎద్దేవా చేశారు. -
కేంద్ర ఆర్థిక మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీ లేఖ
సాక్షి, అమరావతి : ఆదాయ పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు శాతాన్ని తగ్గిస్తే ప్రజల ఆర్థిక లావాదేవీలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో భారతదేశం వ్యాపారరంగాన్ని మరింత అభివృద్ధి పరచే దిశలో భాగంగా విదేశీ పెట్టుబడిదారులకు వాణిజ్యపన్నుశాతాన్ని5కు (DA )తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం చాలా మంచింది. దీని వలన ఒక కోటి కేంద్ర ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులు లబ్ధిపొందుతారు. వివిధ వ్యాపార సంస్థలలో పెట్టుబడులకు అనేకమంది ఆసక్తి కనపరుస్తారు. దాదాపు రెండు కోట్ల మందికి ఆర్ధికకార్యకలాపాలలో పాలుపొందే వీలుంటుంది. కేంద్రం తీసుకున్నీ నిర్ణయం దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. అలాగే ఈ ఆర్థిక సవంత్సరానికిగాను వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు విషయమై జూన్ మాసంలోనే కేంద్రం నుంచి ఏదైనా ప్రకటన వస్తుందని ప్రజలంతా ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు శాతాన్ని తగ్గిస్తే లావాదేవీలు పెరుతుతాయి. ఈ పండుగ మాసంలో ప్రజలందరూ జరిపే ఆర్థికలావాదేవీలు మరింత పెరుగుతాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నాను’ అని బాలశౌరి లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఆర్ధిక సంవత్సరానికిగాను వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు విషయమై జూన్ మాసంలోనే కేంద్రం నుండి ఏదైనా ప్రకటన వస్తుంది అని భారతదేశ ప్రజలందరూ ఎదురుచూసి నిరాశకుగురిఅయ్యారు అని ఈ తరుణంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు శాతాన్ని తగ్గించినయెడల ఈ పండుగమాసంలో ప్రజలందరూ జరిపే ఆర్థికలావాదేవీలు మరింత పెరుగుతాయి అని ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని ఒక స్పష్టమైన ప్రకటన చేయవలసిందిగా లేఖలో బాలశౌరి కోరారు. -
పార్లమెంటులో వైఎస్సార్ విగ్రహం ప్రతిష్టించాలి
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రూపాయి డాక్టర్‌గా వైద్య సేవలు అందించి.. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు పోలవరం, పులిచింతల ప్రాజెక్టులతో వైఎస్సార్ జలయఙ్ఞానికి శ్రీకారం చుట్టారని బాలశౌరి లేఖలో పేర్కొన్నారు. అటువంటి మహానేత విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించి.. ఆయనను సముచితంగా గౌరవించాలని విన్నవించారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్సార్ పథకాలను దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయని లేఖలో పేర్కొన్నారు. జూలై 8న (సోమవారం) మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటు విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
‘చంద్రబాబూ.. అది నీ అయ్య తరం కూడా కాదు’
సాక్షి, మచిలీపట్నం : పచ్చమీడియా ఎన్ని పచ్చిరాతలు రాసినా.. వైఎస్ జగన్‌ను ఓడించడం.. చంద్రబాబు తరం కాదు కదా.. ఆయన్ని పుట్టించినోడి తరం కూడా కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌలశౌరి మాట్లాడుతూ.. చంద్రబాబు..ఎల్లోమీడియాపై మండిపడ్డారు. తన ప్రసంగంలో వ్యంగ్యాస్త్రాలు, పిట్టకథలతో ఆకట్టుకున్నారు. ‘మీ అందరిని చూస్తుంటే వైఎస్ జగన్ సీఎం కావడం కాయం. గత ఎన్నికల్లో చంద్రబాబు బందరు వచ్చి.. మమ్మల్ని గెలిపించండి.. ఈ బందర్‌ను బందరు లడ్డులా చేస్తానని చెప్పాడు. బందర్‌ను బందరు లడ్డూ చేయలేదు కానీ ఆయన కొడుకు లోకేష్ బాబును మాత్రం అవసరానికి ఎక్కువగా బందరు లడ్డు మాదిరిలా చేశాడు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, టీఆర్ఎస్తో.. చివరకు సిగ్గు శరం లేకుండా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా వస్తోంది. సింహంలా వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఓ మీడియాధిపతికి సంబంధించిన వీడియో గత నాలుగు రోజులుగా వైరల్ అవుతోంది. అదేంటో తెలుసా.. చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ మీడియాధిపతి.. ఇంటర్వ్యూకు ముందు మాట్లాడుకున్న సంగతులు. వీరు అధికారంలోకి రాగానే పథకాలకు వాడి(ఎన్టీఆర్) పేరు తీసేద్దామని, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేకుండా చంద్రబాబు అమర్యాదకంగా మాట్లాడారు. ఇలా మనిషి ముందు ఒకలా, మనిషి వెనుకా ఒకలా మాట్లాడే నైజం చంద్రబాబుది. దీనికి గురించి ఒక ఉదహారణ చెప్పుతా.. ఒక రైతు సోదరుడు బాగా శ్రమించి చెట్టు కింద మంచంపై గుర్రుకొడుతూ నిద్రపోతున్నాడట.. ఈ చంద్రబాబులాంటోడు ఒకడు అక్కడికి వచ్చి నిద్రపోతున్న రైతన్నకు ఉన్న వేలు ఉంగరాన్ని దొంగలించే ప్రయత్నం చేశాడంట. వెంటనే ఆ రైతు మేల్కొనగానే.. లేదు బావా.. నీవు కనుక్కుంటావో లేదోనని చేశా అన్నాడట. అది చంద్రబాబు నైజం. ఈ ఎల్లో మీడియా అంతా ఒకవైపు చేరి విషరాతలు రాస్తుంది. భయంకరంగా చూపిస్తోంది. వారెన్ని రాతలు రాసినా.. జగన్‌ను ఓడగట్టడం చంద్రబాబు తరం కాదు కదా.. ఆయనను పుట్టించినోడి తరం కూడా కాదు. ఈ ఎల్లో మీడియా అసత్యపు వార్తలు నవ్మవద్దు. తెలంగాణలో ప్రజలు వాతపెట్టారు. అది సౌండ్ మాత్రమే.. ఇక్కడి ఫలితాలతో రీ సౌండ్ వినిపిస్తోంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి.. పొరపాటున కూడా ఎవ్వరిని సైకిల్ ఎక్కవద్దని చెప్పండి. సైకిల్ ఎక్కారా వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతారు. డిశ్చార్జ్ కావాడానికి 5 ఏళ్లు పడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజానికానికి కావాల్సింది చల్లటి గాలి. అది ఒక్క సీలింగ్ ఫ్యాన్ ద్వారానే సాధ్యం. సీలింగ్ ఫ్యాన్‌కు ఓటేద్దాం.. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మచిలీపట్నం పోర్ట్, ప్రత్యేకహోదాను సాధించుకుందాం. పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగ సమస్యను తగ్గిద్దాం. ఇక బైబై బాబు.. బైబై బాబు.. కావాలి జగన్.. రావాలి జగన్’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. -
సైకిల్ ఎక్కారా.. వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతారు
-
పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదు
-
‘చంద్రబాబు పోటీ చేసినా గెలిచేది కొడాలి నాని’
సాక్షి, గుడివాడ: ‘పార్లమెంట్ చూడాలంటే ఢిల్లీకి వెళ్లాలి. తాజ్‌మహల్ చూడాలంటే ఆగ్రా వెళ్లాలి. చార్మినార్ చూడాలంటే హైదరాబాద్ పోవాలి. కానీ అమరావతి చూడాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తిరగేస్తే అందులో ఊహా చిత్రాలు కనిపిస్తాయి. చంద్రబాబు చెప్పే అభివృద్ధి ఇలా ఉంటుంద’ ని వైఎస్సార్సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని సింగపూర్ చేస్తానని చెబుతున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అనేకసార్లు మాట మార్చారని, ఊసరవెల్లి కూడా ఇన్ని రంగులు మార్చదని విమర్శించారు. విశ్వసనీయత, వెన్నుపోటు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టబోతున్నారని బాలశౌరి అన్నారు. జనాన్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ వస్తున్నారని చెప్పారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా గెలిచేది కొడాలి నాని, ఎగిరేది వైఎస్సార్సీపీ జెండా అని పేర్కొన్నారు. గుడివాడ నియోజక వర్గానికి పర్మినెంట్ ఎమ్మెల్యే కొడాలి నాని అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. (చదవండి: ‘చంద్రబాబు మైండ్ పనిచేయడం లేదు’) -
బందరు బాద్షా ఎవరో?
సాక్షి,మచిలీపట్నం : మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలో స్థూలంగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారుల జనాభా అధికం. 1952 నుంచి 16 సార్లు ఎన్నికలు జరగ్గా, తొమ్మిది సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ గెలిచాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు. మచిలీపట్నం లోకసభకు తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి సనక బుచ్చికోటయ్య ఎంపీగా ఎన్నికయ్యారు. 1957లో కాంగ్రెస్ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండల వెంకటస్వామి విజయం సాధించారు. ఈ నియోజకవర్గ పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు గెలుపొందారు. మరోసారి ఆయననే టీడీపీ బరిలోకి దించింది. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి.. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెచ్చుమీరిన అంతర్గత విభేదాల వల్ల టీడీపీ బలహీనపడింది. దీంతో ఈసారి ఎంపీగా గెలవడం కష్టమని భావించిన కొనకళ్ల నారాయణ పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి వరకూ ప్రయత్నించినా కుదర్లేదు. పైగా పార్లమెంటు పరిధిలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీపై సొంత సామాజికవర్గంలోని వ్యతిరేకత ఏర్పడింది. బలమైన కేడర్ ఉన్న దాసరి జైరమేష్, బాలవర్ధన్‌రావు వైఎస్సార్సీపీలో చేరడం టీడీపీకి భారీ దెబ్బ. గుడివాడ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను టీడీపీ బరిలోకి దించింది. స్థానికేతరుడైన అవినాష్‌ను ఈ నియోజకవర్గ ఓటర్లు ఆదరించే పరిస్థితి లేదు. బలమైన నాయకుడైన వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలినాని ముందు అవినాష్ తేలిపోయారు. ఇక పెడనలో మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీ టికెట్ కోసం బాగా ప్రయత్నించారు. చివరకు కాగిత కృష్ణప్రసాద్‌కు అక్కడ టీడీపీ టికెట్ ఇవ్వడంతో వేదవ్యాస్ వర్గం ఎన్నికల్లో సహకరించే పరిస్థితి లేదు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగిరమేష్ దూసుకుపోతున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి కొల్లురవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య(నాని) నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అవనిగడ్డలో టీడీపీ నేత అంబటి శ్రీహరి ప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు కుమారుడి అవినీతి అక్రమాలతో బాగా చెడ్డపేరు వచ్చింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బరిలో ఉన్నారు. పామర్రు(ఎస్సీ)లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను టీడీపీ బరిలోకి దించింది. దీంతో ఓ సామాజిక వర్గం అలకబూనింది. అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ఆమె పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్ పోటీగా బరిలోకి దిగారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ బరిలో మరోసారి టీడీపీ అభ్యర్థిగా బోడెప్రసాద్ బరిలో ఉన్నారు. కాల్‌మనీ వ్యవహారం, దౌర్జన్యాలు నియోజకవర్గ పరిధిలో మితిమీరిపోయాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. రాజన్న మాట.. అభివృద్ధి బాట దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులకు బీజం వేశారు. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనుల్లో భాగంగా బందరు కాలువ డ్రయినేజీ పనులు చేపట్టారు. నూజివీడులో 2008లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్అండ్టీ సంయుక్త సౌజన్యంతో నిర్మించిన ఐటీపార్కు మొదటి టవర్‌లో 14 కంపెనీలు పూర్తిస్థాయిలో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 1,500 మంది ఐటీ విద్యార్థులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల అయిన బందరు పోర్టు ఏర్పాటుకు 2008 ఏప్రిల్ 23న రూ. 1,500 కోట్లతో ఆయన శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. – ఎం. రామ్మోహన్ సాక్షి, అమరావతి బ్యూరో వల్లభనేని బాలశౌరి (వైఎస్సార్సీపీ) 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి లోక్‌సభ(2009 ప్రాదేశిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు లేదు) ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఈయన వ్యాపారవేత్త. ఆయన ఎన్నో కళాశాలలను నెలకొల్పారు. రక్షణ, వాణిజ్య విభాగం పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొనకళ్ల నారాయణరావు(టీడీపీ) ఈయన ఎంపీగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఆ సమయంలో ఆయన సరిగా వాదన వినిపించలేదని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏనాడు బందరు పోర్టు పనుల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలున్నాయి. మొత్తం ఓటర్లు 14,29,861 పురుషులు 7,01,396 మహిళలు 7,28,355 ఇతరులు 110 -
సంక్షేమ పాలనే వైసీపీ లక్ష్యం
సాక్షి, మంతెన(కంకిపాడు): సంక్షేమ పాలన కోసం వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆపార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తిచేశారు. మండలంలోని మంతెన గ్రామంలో గురువారం రాత్రి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ప్రచార వాహనంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథితో కలిసి పర్యటించారు. స్థానిక బోసు బొమ్మ, ఎస్సీ కాలనీ సెంటర్లలో జరిగిన సభల్లో బాలశౌరి ప్రసంగించారు. నీతికి, నిజాయతీకి మారుపేరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీకి మధ్యనే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. టీడీపీ నేతలు అన్ని వర్గాల ప్రజలనూ వంచించారన్నారు. టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావా లన్నా, బందరు పోర్టును సాధించాలన్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనాకాలంలో మాదిరిగా రెండు పంటలకూ డెల్టాలో నీరిచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ కాలేదన్నారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తు ప్రజల్ని మోసం చేయాలని టీడీపీ చూస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పాలకులను, ఓట్లు అడిగేందుకు వచ్చేటీడీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకూ పథకాలు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంతెన గ్రామంలో ఇళ్లస్థలాలు పంపిణీకి కృషి చేస్తామని, వసతులు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బలహీనవర్గాల ప్రజలపై కనీస గౌరవం లేని టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో సారథి తనయుడు నితిన్‌కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, రాష్ట్ర నేతలు తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), నక్కా శ్రీనివాసరావు, రామినేని రమాదేవి, వల్లె నర్సింహారావు, జిల్లా నాయకులు బండి నాంచారయ్య, మాదు వసంతరావు, బాకీ బాబు, నెరుసు సతీష్, అన్నే చంటిబాబు, మాగంటి శ్రీను, మంతెన గ్రామ నేతలు బండి శ్రీను, పటాకుల శ్రీనివాస్, ఎంపీటీసీ కె. వెంకటేశ్వరరావు, వీరంకి రమణ, భావన్నారాయణ, కొండేటి నాని, రాజులపాటి శివబ్రహ్మేశ్వరరావు, కె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కంకిపాడు ప్రధాన సెంటరు నుంచి పార్టీ రాష్ట్ర నేతలు కొండవీటి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో యువత మోటరు బైక్ ర్యాలీ చేశారు. మంతెన ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని కొనసాగించారు. -
పోలవరానికి ఒక్కపైసా అయినా కేటాయించారా?
-
‘చంద్రబాబు ఎప్పుడు ఎవర్ని తిడతాడో తెలియదు’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పోలవరం ప్రాజెక్టు కడుతూ.. తానే దానిని కడుతున్నాని చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ మలలీపట్నం పార్లమెంట్ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరానికి వెళ్లి హడావుడి చేసి తానే ఆ ప్రాజెక్టును కడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. దివంగనేత వైఎస్సార్‌పై నమ్మకంతో పోలవరం ప్రాజెక్టుకు రైతులు భూములు ఇచ్చారన్నారు. వైఎస్సార్ హయంలో ఆరువేల కోట్లు ఖర్చు చేసి పోలవరం కాలువలు తవ్విస్తే..ఇప్పుడు చంద్రబాబు వచ్చి మోటార్లు పెట్టి స్విచ్ ఆన్ చేసి అదే పట్టిసీమ అంటున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి చంద్రబాబు నాయుడు వంగి వంగి నమస్కారాలు పెట్టి పోలవరాన్ని లాక్కున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ మాదిరి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరానికి వెళ్లి లెక్కలు చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి ఒక్క పైసా అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. ఎప్పుడు ఎవర్ని తిడతాడో తెలియదు చంద్రబాబు ఎవర్ని ఎప్పుడు తిడతాడో, ఎవర్ని ఎప్పుడు పొగుతాడో తెలియని అయోమయ పరిస్థితులలో టీడీపీ నేతలు ఉన్నారని బాలశౌరి ఎద్దేవా చేశారు. సోనియా గాంధిని దెయ్యం అని తిట్టి..నేడు దేవత అని పొగుడుతున్న ఘనత చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. నరేంద్ర మోదీ హైదరాబాద్‌కి వస్తే అరెస్ట్ చేయిస్తానన్న చంద్రబాబు.. మోదీ మాత్రమే ఈ దేశానికి ప్రధాని కావాలని ప్రకటించారని గుర్తు చశారు. చంద్రబాబు తీరువల్ల టీడీపీ నేతలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తప్పు చేయకపోతే విచారణకు అంగీకరించండి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ తప్పు చేయలేదని చంద్రబాబు భావిస్తే ... ఆ కేసుపై ఎన్ఐఏ విచారణకు అంగీకరించాలని బాలశౌరి సవాల్ చేశారు. కోర్టు ఈ కేసును ఎన్ఐఏకి ఇస్తే గుమ్మడికాయల దొంగ ఎవరంటే చంద్రబాబు అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి ఉందన్నారు. పరిటాల రవి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తే 24 గంటల్లో సీబీఐ దర్యాప్తుకు అప్పజెప్పిన ఘనత వైఎస్సార్‌దని ప్రశంసించారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే వైఎస్సార్ అలా చేశారన్నారు. టీడీపీ తప్పు చేయలదేని భావిస్తే ఎన్ఐఏ విచారణకు అంగీకరించాలన్నారు. ఇసుక, మట్టి విచ్చలవిడిగా దచుకుంటున్నారు రాష్ట్రంలో టీడీపీ నేతలు ఇసుక, మట్టిని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని బాలశౌరి ఆరోపించారు. ‘తెలంగాణలో ఇసుకపై ఆదాయం గతంలో రూ.100కోట్లు వస్తే..ఇప్పుడు దానిని రూ. రెండు వేల కోట్లకు పెంచారు. ఆ రాష్ర్టం కంటే మన రాష్ర్టంలో నదులు ఎక్కువ.అలా చూస్తే కనీసం మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి. అదంతా మీ అనుచరులకు కట్టబెట్టిన విషయం వాస్తవం కాదా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ లు పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులలో దోచుకుంటుంటే, ఎమ్మెల్యేలు,మంత్రులు ఇసుక మట్టిలో దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత దోపిడికి పాల్పడిన చంద్రబాబుకు తెలంగాణలో ఎలాంటి తీర్పు వచ్చిందో..అదే తీర్పు ఏపీలోనూ వస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
సీబీఐ వెంట పడతారేం?: హైకోర్టు
* హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు * అదేమైనా అంత పెద్ద సంస్థా? * అసలు దానికి చట్టంలో చోటెక్కడుంది? * దానికన్నా లోకల్ పోలీసులే నయం * కెనెటా పవర్‌పై వ్యాజ్యం విచారణకు విముఖత * పిటిషన్ ఉపసంహరించుకున్న పిటిషనర్ సాక్షి, హైదరాబాద్ : ‘‘సీబీఐ.. సీబీఐ..! ఎందుకంతా దాని వెంటపడతారు? అదేమైనా అంత పెద్ద సంస్థా? జస్ట్ ఓ డిటెక్టివ్ ఏజెన్సీలాంటిది. అది ఛేదించలేని కేసులెన్నో స్థానిక పోలీసులు ఛేదించారు. అయినా అందరికీ సీబీఐ ఫోబియా పట్టుకుందేంటి? అసలు దాని వెనకాల పడేందుకు దానికున్న చట్టబద్ధతేంటి? చట్టంలో దానికి స్థానమెక్కడైనా ఉందా? గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వటం వల్లే అది బతికి బట్టకడుతోంది. మేం మాత్రం సీబీఐ గురించి ఏమాత్రం పట్టించుకోం’’ అంటూ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి చెందిన కెనెటా పవర్‌కు భూ కేటాయింపులపై సీబీఐ, ఈడీల చేత దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బాలశౌరి ఆస్తులు, కెనెటా పవర్ లిమిటెడ్‌కు భూ కేటాయింపులపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ న్యాయవాది ఎం.వి.వి.ఎస్.ప్రసాద్ గతవారం ఈ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు స్పందిస్తూ... ‘‘స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? ముందు అది చేయండి. వారు స్పందించకుంటే మా వద్దకు రండి’’ అని చెప్పింది. తాము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ చెప్పగా... ‘‘అదంతా మాకు చెప్పొద్దు. పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో చెప్పండి’’ అని స్పష్టంచేసింది. పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ చెప్పగా... తమకు చట్టం ఏం చెబుతుందో అదే ముఖ్యమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘‘కోల్‌కతాలో ఓ బాలిక తప్పిపోయిన కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు ఆ బాలిక ఆచూకీ కనుక్కోలేకపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లోని ఓ ఎస్సై విజయవంతంగా ఆ కేసును ఛేదించి బాలిక ఆచూకీ కనుక్కున్నారు. సీబీఐ పనితీరు ఎలాంటిదో దీనినిబట్టి తెలుసుకోండి’’ అని ధర్మాసనం చెప్పింది. భూ కేటాయింపులకు మాత్రమే పరిమితమైతే పిటిషన్‌ను విచారిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. -
టీడీపీకి సత్తాలేకే బీజేపీతో పొత్తు
కృష్ణాయపాలెం (మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడే సత్తా లేక భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకుందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. మంగళగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)తో కలసి ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. కృష్ణాయపాలెంలో బాలశౌరి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి సొంతగా పోటీచేసి గెలవగలమనే విశ్వాసమే వుంటే బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తాను చేసిన చారిత్రాత్మక తప్పిదం అని గతంలో చంద్రబాబు చెప్పారని, అయితే నేడు ఆ తప్పు ఏమైంది.. ఆయన విశ్వసనీయత ఏమైంది.. విలువలు ఏమయ్యాయని బాలశౌరి ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పో యి బీజేపీ వారి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు రావడం సిగ్గుచేటన్నారు. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ దెబ్బకు ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ బీజేపీల పొత్తుతో రాష్ట్రంలోని మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలంతా ఏకమవుతున్నారని.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌లను అభిమానించే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలంతా గమనిస్తూనే వున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్‌ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి 16 నెలల పాటు జైల్లో పెట్టినా కడిగిన ముత్యంలా బెయిలుపై బయటకు వచ్చారని ఆయన గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను, విజయమ్మను, షర్మిలను గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాలశౌరి కోరారు. రానున్న ఎన్నికల్లో అంతిమ విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. -
మరోసారి దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్
హైదరాబాద్/గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం, అభద్రతకు గురౌతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. తమ పార్టీ నాయకులతో ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు విన్నవించిన దళితుడిపై టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. దళితులపై పయ్యావుల దాడి తగదన్నారు. మరోసారి ఇలాంటి దాడులు చేస్తే తాము సహించబోమని హెచ్చరించారు. ఓటమి భయంతో బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వల్లభనేని బాలశౌరి విమర్శించారు. బీజేపీ వద్దన్నా వినకుండా కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు రూరల్ ఉప్పరపాలెం, కొత్తపాలెం, పెదఇటికంపాడులలో రావి వెంకటరమణతో బాలశౌరి కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విజన్ ఉన్న నేత జగన్
తెనాలిరూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రాభివృద్ధిపై ఓ దృక్పథం, ఓ విజన్ ఉన్న నేత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. చంద్రబాబుకు విజన్ ఉందంటూ ఓ వర్గం మీడియా, కొందరు నాయకులు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన చంద్ర బాబు తెలుగు జాతిని విడదీసిన ఘనతను మూటగట్టుకున్నారని ఆరోపించారు. కొత్తపేటలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలశౌరి మాట్లాడారు. చంద్రబాబుకు విజన్ ఉంటే వందేళ్లకు పైగా కృష్ణాడెల్టా రైతాంగం పోరాడిన పులిచింతల ప్రాజెక్టును తన హయాంలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టత, విజన్ ఉండబట్టే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. యలమంచిలి శివాజీ వంటి నేతలు పులిచింతల విషయమై మాట్లాడేందుకు వెళితే చంద్రబాబు వారిని దుర్భాషలాడి పంపేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పులిచింతల పూర్తి కావడం వల్లే డెల్టా రైతాంగానికి కొంత ఊరట లభించిందన్నారు. 2009 సాధారణ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండు పార్లమెంటు, 53 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే, టీడీపీ దాదాపు 35 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని, ఏ ఒక్క స్థానంలోనూ గెలవలేదని గుర్తు చేశారు. అలాంటిది బలం పుంజుకున్నాం, పైకి వెళుతున్నామంటూ చంద్రబాబు సహా టీడీపీ నాయకులు ప్రకటించుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనంగా చెప్పారు. 2009లోనూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేక మహాకూటమిగా ఏర్పడ్డారనీ, అయినా వైఎస్ చేతిలో పరాజయం పాలు కాక తప్పలేదని, తిరిగి ఇప్పుడు బీజేపీ, శివసేన, లోక్‌సత్తా వంటి పార్టీలతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడాన్ని గమనిస్తే టీడీపీ ఏ మేరకు బలం పుంజుకుందో అర్థమవుతుందన్నారు. మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించబోతుందనీ, సీమాంధ్రలోనే 130కుపైగా సీట్లను సాధిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, పట్టణ కన్వీనర్ ఈఎస్‌ఆర్‌కే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మీకుమారి,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రచారం
సాక్షి, గుంటూరు: పురపాలక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గుంటూరు, నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గురువారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పురపాలక సంఘాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ, టీడీపీ మున్సిపాలిటీలను ఏవిధంగా నిర్వీర్యం చేసిందీ వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీని నేరుగా ఎదుర్కోలేక టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కైన తీరును తేటతెల్లం చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి బాలశౌరి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం బాలశౌరితోపాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి పురపాలకసంఘాలకు ఎన్నికలు జరుగుతుండడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) గత 20 రోజులుగా అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి రావి వెంకటరమణ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి ముస్లిం మైనార్టీకి చెందిన అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ విజయం సునాయాసం కానున్నదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెనాలిలో సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. బాపట్ల పార్లమెంట్ పరిథిలో బాపట్ల, రేపల్లె మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వైఎస్సార్సీపీకి ఎంపీ అభ్యర్థి లేనప్పటికీ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉంది. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి, రేపల్లెలో మాజీమంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిథిలో నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగే మున్సిపాలిటీల్లో చిలకలూరిపేట, పిడుగురాళ్ళ, వినుకొండల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీ శ్రేణులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా భరోసా ఇస్తూ అందర్నీ ఏకతాటిపై నడుపుతున్నారు. సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, పిడుగురాళ్ళలో గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృ ష్ణమూర్తి, చిలకలూరిపేటలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని సుధ, నరసరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ అభ్యర్థుల విజయానికి గత మూడువారాలుగా నిర్విరామంగా కృషిచేస్తున్నారు. డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధమైన టీడీపీ నాయకులు... నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో గురువారం నుంచే టీడీపీ నాయకులు ఆయా మున్సిపాలిటీల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు, మద్యంతో రెడీ అయ్యారు. ఓటర్ స్లిప్పులతోపాటు డబ్బు కట్టలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఓటర్ స్లిప్పులతోపాటు మద్యం స్లిప్పులను ఇచ్చి నేరుగా మద్యం దుకాణాల్లో తాగేలా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, పిడుగురాళ్ళ, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో టీడీపీ నాయకులు ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఎన్నికల నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పండి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం జిల్లాకు వచ్చిన మోసగాళ్లను నమ్మవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి ప్రజలకు సూచించారు. అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటూ మభ్యపెడుతున్న టీడీపీ నాయకులకు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు నలందానగర్లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలకు, ఉద్యమాలకు, విప్లవాలకు గుంటూరు జిల్లా పెట్టింది పేరు అని, ఇక్కడి ప్రజలు చాలా వివేకవంతులని చెప్పారు. చంద్రబాబు మాయ పథకాలను ప్రజలు విశ్వసించబోరన్నారు. అధికారం కోసం మైనార్టీలు, బీసీలు, కాపులకు ప్రత్యేక బడ్జెట్లు అని ప్రకటిస్తూ రోజుకో కొత్త పథకం ప్రకటిస్తున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం కోసం ఏగడ్డి క రవటానికైనా సిద్ధపడతారని విమర్శించారు. రాష్ర్టంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయటం ద్వారా మహిళలు ఆర్ధికంగా ఎదుగుతారని తెలిపారు. సీమాంధ్ర కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలా అని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు లాలుపురం రాము, థామస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.