vc
-
17 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ల(వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.యూనివర్సిటీల్లో టీఎన్ఎస్ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. -
ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు
ఎచ్చెర్ల క్యాంపస్: ‘రాష్ట్రంలో చాలామంది వీసీలు రాజీనామా చేశారు. ఇంకా మీరెందుకు చేయలేదు. తక్షణమే రాజీనామా చేయండి..’ అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏయూ) వైస్ చాన్స్‌లర్ ఆచార్య కేఆర్ రజిని, రిజిస్ట్రార్ పి.సుజాతలను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్ ఎదుట గురువారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు.ముందుగా వీసీ వద్దకు వెళ్లి ‘ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు’ అని ప్రశ్నించారు. ‘అది మీకు అనవసరం..’ అని వీసీ సమాధానం చెప్పారు. దీంతో వీసీ చాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి వీసీ, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గంటసేపు గొడవ చేశారు. వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు.అనంతరం ‘మీరు రాజీనామా ఎలా చెయ్యరో చూస్తాం..’ అంటూ వీసీని హెచ్చరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచి రాజీనామా చేయాలని వీసీకి పలుమార్లు హెచ్చరికలు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ ఏకంగా వీసీ రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీసీని అవమానించడం అన్యాయందళిత వీసీని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అవమానించడం, బెదిరించడం అన్యాయమని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత, రెక్టార్ అడ్డయ్య, ఓఎస్డీ కావ్య జ్యోత్స్న తదితరులు తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పడిన 16 ఏళ్ల తర్వాత దళిత మహిళకు వీసీగా అవకాశం వస్తే అడ్డగోలుగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసేవారిపై జాతీయ మహిళా కమిషన్‌కు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.వైస్ చాన్సలర్ రజిని జనవరి 18న బాధ్యతలు చేపట్టారని, మూడేళ్లు కొనసాగుతారని స్పష్టంచేశారు. బలవంతపు రాజీనామాలు అన్యాయమని ఖండించారు. వీసీ చాంబర్ ఎదుట ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టపరంగా వర్సిటీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యూనివర్సిటీలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణకు సైతం ఆటంకం కలిగించారన్నారు. -
పలువురు వీసీల రాజీనామా
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామాతిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.వైదొలిగిన జేఎన్టీయూకే వీసీజేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. -
జీవో కాపీలను వీసీ రాజారెడ్డికి ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్
-
బాసర IIIT ఘటన పై గవర్నర్ తమిళ సై ఆవేదన..!
-
వీసీకి.. నీకు తేడా ఏముంటుంది?
విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కుంభకోణంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఈసీ సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. తెలుగు విభాగం స్కాలర్ పుప్పాల రవీందర్‌కు ఇచ్చిన పీహెచ్డీ అవార్డుపై విచారించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా ఆర్ట్స్ విభాగం డీన్ కనకయ్య ఇచ్చిన సూపర్ న్యూమరరీ కోటా పీహెచ్డీ అడ్మిషన్లపైనా విచారణకు తీర్మానం చేశారు. పీహెచ్డీ స్కాంపై నిజామాబాద్ జిల్లా విద్యార్థి, యువజన, విద్యావంతుల, మేధావుల ఐక్య కార్యాచరణ సమితి పేరిట తాజాగా నవీన్ మిట్టల్‌కు ఇప్పటికే ఫిర్యాదు అందింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అక్రమ నియామకా లకు పాల్పడిన వైస్ చాన్స్‌లర్‌కు, నీకు తేడా ఏముంటుందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ రిజిస్ట్రార్ యాదగిరిని మందలించారు. ఇప్పటికే అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం కా రణంగా తెలంగాణ వర్సిటీ పరువు పోయిందని, దీంతో ఈసీ చర్యలకు పూనుకుందని.. ఎలాంటి నియామకాలు చేయవద్దని ప్రభుత్వం, ఈసీ చెప్పినప్పటికీ.. అవసరం ఆధారంగా నియామకాలు చే యాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ యాదగిరి అనడంపై పాలకమండలి సభ్యులు అభ్యంతరం చెప్పడంతో పాటు గట్టిగా ప్రశ్నించడంతో నవీన్ మిట్టల్ ఈ వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రూసా భవనంలో టీయూ 58వ పాలకమండలి సమావేశం జరిగింది. వీసీ రవీందర్ గుప్తా హాజరు కాకపోవ డంతో నవీన్ మిట్టల్ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. రిజిస్ట్రార్ వ్యవస్థను కాపాడాల్సిందేనన్నారు. వీసీ చేసిన విధంగానే నియామకాలు చేస్తానంటే ఎలా అని మిట్టల్ మందలించారు. ఇదిలా ఉండగా అంతర్గత ప్రమోషన్లు పొందిన వారు యా దగిరిని కలిసిన నేపథ్యంలో.. వాళ్లకు తమను కలవాలని ఎలా సలహా ఇస్తారని పాలకమండలి సభ్యు లు నిలదీశారు. ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వొద్దని నిర్ణయిస్తే తమను కలవమని ఎలా సూచించార న్నారు. నెపం తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తే ఎలా అని ఈసీ సభ్యులు ప్రశ్నించారు. సమావేశంలో పలు తీర్మానాలను చేశారు. కేసు నమోదుకు.. ఈ నెల 15న విద్యావర్ధిని సస్పెన్షన్‌కు ఆర్డర్ జారీ చేయాలని రిజిస్ట్రార్ యాదగిరిని ఆదేశించారు. అదేవిధంగా అకడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్‌ను రిమూవ్ చేసే ఆర్డర్ సైతం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కనకయ్య నలుగురు ప్రొఫెసర్ల సర్వీసు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి జిరాక్స్ కాపీలను తీసి బయట పంచిపెట్టిన విషయమై సైతం కేసు నమోదుకు నిర్ణయించారు. సమావేశంలో ఈసీ సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, మారయ్యగౌడ్, ఎన్ఎల్ శాస్త్రి, ప్రవీణ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, ఆరతి, నసీమ్, చంద్రకళ పాల్గొన్నారు. ఈసీకి పంపిన తర్వాతే.. గత నెల 26న, ఈ నెల 5న నిర్వహించిన సమావేశాల్లో చేసిన తీర్మానాలను తక్షణమే అమలు చేయాలని రిజిస్ట్రార్ యాదగిరిని ఈసీ ఆదేశించింది. బడ్జెట్ ఆమోదం కానుందున ప్రస్తుత రిజిస్ట్రార్ జీతాలతో సహా చేసే ప్రతి ఖర్చు వివరాన్ని ప్రతి వారం ఈసీకి పంపి ఆమోదించాకే చేయాలని నిర్ణయించారు. వీసీ చేసిన నియామకాలను రద్దు చేయడంతో పాటు, విద్యావర్ధిని చేసిన జీతాల చెల్లింపునకు సంబంధించి రికవరీ చేయాలని నిర్ణయించారు. లేకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలని తీర్మానించారు. విద్యావర్ధిని, శివశంకర్ చేసిన నిధుల దుర్వినియోగం వివరాలను తదుపరి ఈ నెల 25న నిర్వహించే ఈసీ సమావేశంలో అందించాలని నిర్ణయించారు. -
నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ వర్సిటీలో పాలకమండలి సభ్యులు, వైస్ చాన్స్‌లర్ మధ్య న డుస్తున్న పోరు మరో స్థాయికి చేరుకుంది. శుక్రవా రం వీసీ రవీందర్ గుప్తా ఉన్నతవిద్యా శాఖ కమిష నర్ నవీన్ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వర్సిటీ నుంచి ప్రకటన విడుదల చేశారు. మరోవై పు నవీన్ మిట్టల్ చైర్మన్‌గా శుక్రవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో తెయూ పాలకమండలి 57వ సమావేశం జరిగింది. వీసీ రవీందర్ గుప్తా న వీన్ మిట్టల్‌పై ఆరోపణల పర్వాన్ని మరింత పెంచ గా, పాలకమండలి సభ్యులు సైతం తమ చర్యలకు మరింత పదును పెడుతున్నారు. ఏకంగా వర్సిటీ వ్యవహారాల విషయమై ఉన్నత స్థాయి దర్యాప్తు చే యించేందుకు, ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసు లు పెట్టేందుకు తీర్మానం చేయడం గమనార్హం. నవీన్ మిట్టల్ చైర్మన్‌గా.. వర్సిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఉన్నత స్థా యిలో విచారణ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పాలకమండలి తీర్మానం చేసింది. తె లంగాణ యూనివర్సిటీల చట్టం 1991 మేరకు సెక్ష న్ 18(1) ప్రకారం 10 మంది సభ్యుల కోరం ఉండడంతో ఈసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వీసీ హాజరు కాకపోవడంతో ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్‌గా వ్యవహరించా రు. 1991 తెలంగాణ యూనివర్సిటీల చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం రిజిస్ట్రార్‌ను నియమించేందుకు ఉన్న పూర్తి అధికారంతో పాలకమండలి ప్రొఫెసర్ యాదగిరిని పునర్నియామకం చేసింది. 2021 అక్టోబర్ 30న యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఈసీ నియమిస్తే, వర్సిటీల చట్టంలోని 50.6(ఏ) నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్లుగా వీసీ నియమించడం చట్టవ్యతిరేకమన్నారు. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ పదవీకాలం పూర్తయితే లేదా ఆ స్థానం ఖాళీ గా ఉంటే మాత్రమే కొత్త రిజిస్ట్రార్‌ను నియమించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈసీ ఆమోదం లేకుండా శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం తదితరాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ఏసీబీ డీజీ, నిజామాబాద్ సీపీలతో విచారణ చేయించాల ని తీర్మానించారు. 2022–23, 2023– 24 బడ్జెట్‌కు సంబంధించి సైతం విచారణ చేపట్టాలని, ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించా రు. తెయూలో అక్రమాలపై వరుస కథనాలను ప్రచురించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు. స మావేశంలో ఈసీ సభ్యు లు గంగాధర్ గౌడ్, వసుంధరా దేవి, మారయ్య గౌడ్, ఎన్ఎల్ శాస్త్రి, రవీందర్‌రెడ్డి, ఆరతి, నసీమ్, ప్రవీణ్‌కుమార్, చంద్రకళ పాల్గొన్నారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.. తెయూ (డిచ్పల్లి) : నాపై తప్పుడు, లేనిపోని అవినీతి ఆరోపణలతో తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను నాశనం చేస్తూ.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్ లక్ష్యమని తెయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని వారాలుగా తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పరిణామాలపై తీవ్ర వేదనతో, బాధతో మీడియా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తెయూ వీసీగా నియమించారని, అయితే నవీన్ మిట్టల్ ఇప్పుడు బ్యాక్‌డోర్ పద్ధతుల ద్వారా తన పరువు తీయాలని చూస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ కొన్ని నిరాధారమైన ఆరోపణలకు వివాదాలకు కేంద్రంగా మారిందన్నారు. వీటన్నింటికీ నవీన్ మిట్టల్ కారణమని చెప్పడానికి తనకు బాధగా ఉందన్నారు. మిట్టల్ తన నామినీ అయిన ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఎలాగైనా నియమించాలనే తపనతో ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ యాదగిరిని తాను వ్యతిరేకిస్తున్నానని, వర్సిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో సహకరించలేడని పేర్కొన్నారు. ఏప్రిల్ 19, 2023 న హైదరాబాద్ రూసా కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమించాలని తీర్మానాన్ని ఆమోదించారని తెలిపారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించి ఈసీ నిర్ణయాలపై స్టే తెచ్చినట్లు తెలిపారు. ఒకే ఒక్క ఐఏఎస్ అధికారి తన ఉద్దేశాలు, చట్టవిరుద్ధమైన నిర్ణయాలతో విద్యాశాఖలోని మొత్తం వ్యవస్థలను తారుమారు చేయడం దురదృష్టకరమని వీసీ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు సేవలందిస్తున్న గొప్ప యూనివర్సిటీ ఖ్యాతిని పణంగా పెట్టి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీకి విడుదల చేయాల్సిన రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్) మంజూరు నిధులను రూ.20 కోట్లను మిట్టల్ నిలిపివేస్తున్నారని ఆరోపించారు. రూసా డైరక్టర్‌గా ఉన్న మిట్టల్ తనకు నచ్చిన వ్యక్తిని ఇక్కడ రిజిస్ట్రార్‌గా నియమించినప్పుడే వర్సిటీకి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు సుముఖంగా ఉండటం శోచనీయమన్నారు. మిట్టల్ అనవసర జోక్యాన్ని అడ్డుకుని యూనివర్సిటీని యథావిధిగా నిర్వహించేలా చూడాలని సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఇతర ఉన్నతాధికారులకు వీసీ విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఏ ఏజెన్సీ ద్వారానైనా న్యాయవిచారణకు తాను సిద్ధంగా ఉన్నట్లు వీసీ స్పష్టం చేశారు. -
మరోసారి ఆందోళన బాటలో బాసర IIIT విద్యార్థులు
-
తిర‘కాసు’ వేతనం
అనంతపురం విద్య: కీలకమైన పదవిలో ఉన్న ఓ రిజిస్ట్రార్ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. ఆశ్రిత పక్షపాతంతో అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేశారు. అయిన వారికి అందినకాడికి దోచుకునే అవకాశం కల్పించారు. అనుమతులు లేకపోయినా.. ఉన్నట్లు సృష్టించి భారీగా లబ్ధి చేకూర్చారు. ఏకంగా రివైజ్డ్ పేస్కేల్ మంజూరయ్యేలా తతంగం నడిపించడం గమనార్హం. జీఓ ఏం చెబుతోందంటే.. ►గతేడాది ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 14ను జారీ చేసింది. ఇందులో అర్హులైన వారికి రివైజ్డ్ పేస్కేల్–2016 మంజూరు చేయాలని పేర్కొంది. ►మార్చి 20, 2019న ఎస్కేయూ పాలకమండలి సమావేశం(నెంబర్–163) జరిగింది. ఇందులో ఏ–4 అంశంగా ఆర్.పీ.ఎస్–2016ను ఎజెండాగా పేర్కొన్నారు. అయితే కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేసే డైరెక్టర్లకు మాత్రమే ఆర్పీఎస్ వర్తిస్తుందని పాలకమండలి తీర్మానం చేసింది. ఏం చేశారంటే.. ►ఏప్రిల్ 16, 2019లో అప్పటి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రహంతుల్లా ఆడిట్‌కు సిఫార్సు చేశారు. ►మే 5, 2019లో ఆడిట్ నివేదికకు అనుగుణంగా వీసీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఆర్పీసీ వర్తిస్తుందని.. వెంటనే మంజూరు చేయమని రిజి్రస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ►ఏప్రిల్ 16, 2019లో వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ లేకుండా, నేరుగా రిజి్రస్టార్.. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, తాజా మాజీ రిజి్రస్టార్ వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. గత ప్రభుత్వ హయాంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు రెండింతల పదోన్నతులను అక్రమంగా కట్టబెట్టారు. ఇందులోనూ నిబంధనలను పక్కనపెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇంతటితో ఆగకుండా ఏకంగా రివైజ్డ్ పేస్కేలు(2016)ను ఎవరి అనుమతి లేకుండానే మాజీ రిజిస్ట్రార్ మంజూరు చేశారు. వాస్తవానికి రివైజ్డ్ పేస్కేల్‌కు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనర్హుడు. పాలకమండలిలో ఆమోదం పొందలేదు.. వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు.. అయినప్పటికీ ఫైలు మీద రిజి్రస్టార్ సంతకం పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌కు అనుమతులు ఇచ్చేశారు. అనుకున్నదే తడవుగా ఎస్టాబ్లి‹Ùమెంట్ అప్పటి డిప్యూటీ రిజి్రస్టార్ రాజభక్తిని ప్రదర్శించి రివైజ్డ్ పేస్కేలు మంజూరు చేశారు. బయటపడిందిలా.. ►వాస్తవానికి ఎలాంటి ఉత్తర్వు అయినా వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా రిజి్రస్టార్ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు. వీసీ ప్రొసీడింగ్స్ లేకపోయినా ఉత్తర్వులు ఇవ్వడం చట్టరీత్యా నేరమని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలా ఇచ్చే ఉత్తర్వులు చెల్లవు. ►వీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయా? లేవా? అని ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజి్రస్టార్, సూపరింటెండెంట్ క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆర్పీఎస్–2016ను మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. ►గతేడాది మే చివర్లో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో.. జూలైలో ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే తతంగం బయటపడుతుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ►తాజాగా ఈ ఏడాది జూన్ 24న ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగం పరిశీలించడంతో వెలుగులోకి వచ్చింది. చర్యలు తప్పవు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా ఆర్పీసీ మంజూరు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. ఎస్టాబ్లిష్మెంట్ విభాగం నుంచి రికార్డులు తెప్పించుకుని పరిశీలిస్తాం. అక్రమాలు వీసీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఎ.మల్లిఖార్జున రెడ్డి, రిజిస్ట్రార్, ఎస్కేయూ -
వీసీ పీఠం దక్కేదెవరికో..?
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి నియామకం వ్యవహారం వేగం పుంజుకోనుంది. గడిచిన మూడు సంవత్సరాలుగా ఇన్చార్జి వీసీగా ఉద్యాన శాఖ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి పనిచేస్తున్నారు. డాక్టర్ బీఎంసీ రెడ్డి వీసీగా 2017లో ఉద్యోగ విరమణ చేశారు. ఆతర్వాత పూర్తిస్థాయి వీసీ నియామకం చేపట్టలేదు. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో సెర్చ్ కమిటీ ముగ్గురు సభ్యులతో ఏర్పాటైంది. ఈ కమిటీ ఈనెల 27న వీసీ నియామక ప్రక్రియ చేపట్టేందుకు కూర్చోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ మహోపాధ్యాయ , మరొక నిపుణుడుతో కలిసి ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ ఏర్పాటైంది. కోర్టు జోక్యంతో నోటిఫికేషన్ విడుదల వాస్తవానికి వీసీ నియామకపు ప్రక్రియ ఎన్నికలకు ముందు పూర్తికావాల్సి ఉంది. సాంకేతిక కారణాలలో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇన్చార్జి వీసీ పర్యవేక్షణలో అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేయడం సరికాదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీసీ నియామకం విషయంలో హైకోర్టు జోక్యంతో సెర్చ్ కమిటీ ఏర్పాటైంది. వీసీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేశారు. ఎవరిని వీసీగా నియమించాలనే విషయాలు చర్చించడానికి సెర్చ్ కమిటీ ఈ నెల 27న సమావేశం కానుందని అధికారిక వర్గాల సమాచారం 31 మంది ఆశావహులు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ వీసీ నియామకం విషయంలో 31 మంది ఆశావహులు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలి నోటిఫికేషన్లో 21 మంది, మలి నోటిఫికేషన్లో పది మంది వీసీ కోసం దరఖాస్తులు అందచేశారని అధికారులు తెలిపారు. ఈ 31 మందిలో ఐసీఏఆర్ నేపథ్యం కలిగిన వారు 20 మంది ఉండగా, మిగిలిన 11 మంది ఉద్యాన వర్సిటీలో అధికారులుగా పనిచేస్తున్నవారు. గతంలో పనిచేసిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అర్హతలు, సేవ, అనుభవం ప్రామాణికాలుగా వీసీ నియామక ప్రక్రియ జరగనుంది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా నియమించనున్నారు. 27న సమావేశం వీసీ నియామక ప్రక్రియ తంతును పూర్తి చేయడానికి ఈ నెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి సెర్చ్ కమిటీలోని మరో ఇద్దరు సభ్యులు సమావేశం కానున్నారు. సమావేశంలో దాదాపుగా వీసీ ఎవరనే విషయం తేల్చనున్నారు.సెర్చ్ కమిటీ తేల్చి ప్రతిపాదించిన పేర్లలో ఒకరిని వీసీ పీఠం వరించనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి పూర్తిస్థాయి వీసీ వచ్చే అవకాశం ఉంది. -
అసెట్.. అడ్మిషన్లు ఫట్!
‘మీకు సీట్లు కేటాయించాం. మా వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి’.. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఎస్సెమ్మెస్‌ను చూసి ఉత్సాహంగా చాలామంది విద్యార్థులు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ అందులో ఏ సీటు కేటాయించారన్న సమాచారం అందలో లేకపోవడంతో హతాశులయ్యారు. మొదటి దశ సీట్లు పొందినవారు ఈ నెల 19 లోగా ఫీజులు కట్టాలని అదే వెబ్సైట్లో ఫీజులు, చేరికల షెడ్యూల్ పెట్టారు. ఆ ప్రకారం దూరప్రాంతాల నుంచి ఉరుకులు, పరుగుల మీద వచ్చిన విద్యార్థులు.. ఫీజులు తీసుకోవడంలేదని తెలిసి ఉసూరుమన్నారు.ఆసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో నెలకొన్న ఈ గందరగోళం ప్రవేశార్థులను అయోమయానికి, ఆందోళనకు దారితీసింది.గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహస్తున్న సంస్థను కాదని.. ఉన్న పళంగా మరో కొత్త సంస్థకు అప్పగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వర్సిటీ ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే పురాతన, ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అపకీర్తి తెచ్చే మరో అంకానికి తెరలేచింది. వర్సిటీ పాలకుల నిర్లక్ష్యం, కాసుల కోసం కొందరు పెద్దల ఆరాటం విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రవేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పెద్దలు చేసిన తప్పిదం పీజీ, ఇంజినీరింగ్ ప్రవేశాల పక్రియను తలకిందలు చేసింది. తెరపైకి బెంగళూరు సంస్థ గత కొన్నేళ్లుగా ఆసెట్, ఆఈఈటీలకు సంబంధించి పరీక్షలతో సహా అన్ని రకాల అన్లైన్ పక్రియలను హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎస్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించింది. 2010 నుంచి 2018 వరకు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. 2019 ఆసెట్ నిర్వహణ బాధ్యతను మాత్రం వర్సిటీ పెద్దలు అనూహ్యంగా ఆ సంస్థ నుంచి తప్పించి బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పజెప్పారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత డైరెక్టర్ ఆచార్య నిమ్మా వెంకటరావు ప్రమేయం ఉందని సమాచారం. అడ్మిషన్ల ప్రక్రియలో పెద్దగా అనుభవం లేని ఆ సంస్థ నిర్వహణ లోపాలతో మొత్తం ప్రక్రియనే గందరగోళంలో పడేసింది. తొలిదశ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి నెల రోజులవుతున్నా నేటికి సీట్లు కేటాయించలేకపోయింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(డీవోఏ)లో ఏం జరుగుతుందో బయటకు పొక్కకుండా గుంభనం పాటిస్తుండటం అనుమానాలకు ఆస్కారమిస్తోంది. సీట్లు కేటాయింపులో గందరగోళం ఎట్టకేలకు జరిగిన తొలిదశ సీట్లు కేటాయింపు విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తొలి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థుల పోన్లకు ఆదివారం రాత్రి సంక్షిప్త సందేశాలు అందాయి. అందులోని సూచన మేరకు వెబ్సైట్లోకి వెళ్లి అటాల్మెంట్ ఆర్డర్లు చూసి విద్యార్థులు కంగుతిన్నారు. అందులో సీటు కేటాయించినట్టు గానీ.. లేదని గానీ ఎక్కడా పేర్కొనలేదు. అలాట్మెంట్ ఆర్డరులోకరెంట్ చాయిస్–1, ప్రయారిటీ –ఎక్స్.. ఇలా అర్థం కాని సమాచారం ఉంది. టాప్ ర్యాంకర్లకు సీట్లు ఏవీ..? దీంతో పాటు టాప్ 10 ర్యాంకులొచ్చిన చాలా మందికి వర్సిటీ కళాశాలల్లో కాకుండా ప్రైవేట్ కళాశాల్లో సీట్లు కేటాయించగా.. మరికొందరికి అసలు సీట్లే కేటాయించలేదు. హుమానిటీస్ (15 కోర్సులు), లైఫ్ సైన్స్ (16 కోర్సులు) కోర్సులకు టెస్ట్ రాసి టాప్ ర్యాంకులు సాధించిన చాలా మందికి సీట్లు కేటాయించలేదు. దాంతో సోమవారం వారంతా ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరిలో టాప్ 5, 8, 10, 18, 41 వంటి ర్యాంకులు సాధించినవారు ఉన్నారు. ప్రకటనలు మాయం తొలిదశ సీట్ల కేటాయింపుపై ఏయూ వెబ్సైట్లో రోజుకో ప్రకటన కనిపించింది. 16వ తేదీ రాత్రి తమకొచ్చిన ఫోన్ సందేశాల మేరకు విద్యార్థులు వెబ్సైట్లోకి వెళ్లారు. సీట్లు పొందినవారు 19 లోపు ఫీజులు చెల్లించాలని అందులో ఉండటంతో మంగళవారం ఉదయం నుంచి ఫీజు చెల్లించేందుకు అనేక మంది ప్రయత్నించినా కుదరలేదు. సీట్లు కేటాయింపులో తప్పిదాల నేపథ్యంలో సోమవారంనాడే పలువురు ఏయూకు వచ్చి గొడవ చేయడంతో వెబ్సైట్ నుంచి ఆ వివరాలు తొలగించారు. ప్రస్తుత సీట్లు కేటాయింపును రద్దుచేసి త్వరలోనే మళ్లీ కేటాయిస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫీజుల వసూళ్లు నిలిపేశారు. ఇది తెలియక ఫీజు కట్టేదామని వచ్చిన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి సాయంత్రం ఆన్లైన్ పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుందని మరో అబద్దం చెప్పి పంపించేశారు. దీంతో అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సీట్లు వచ్చిన వారికి అలాగే కొనసాగిస్తారా? లేక మళ్లీ కేటాయిస్తారా?? అన్న సందేహాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. కొంత గందరగోళం నిజమే: ఏయూ వీసీ ఆసెట్, ఆఈఈటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ, సీట్ల కేటాయింపుతో పాటు అన్ని రకాల అన్లైన్ ప్రక్రియలను ఈసారి బెంగళూరు సంస్థకిచ్చిన మాట నిజమేనని ఏయూ వీసీ నాగేశ్వరరావు అంగీకరించారు. ఈ ప్రక్రియలో సోమవారం కొందర గందరగోళం నెలకొనడం కూడా వాస్తవమేనని అన్నారు. కొంత మంది విద్యార్ధులు తన వద్దకు వచ్చి సమస్య చెప్పడంతో పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన అన్నారు. అవకతవకలపై విచారణ జరపాలి ఆసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించడం దారుణం. మా మేనకోడలు మైక్రోబయాలజీలో సీటు కోసం ఆసెట్ రాసింది. 57వ ర్యాంకు వచ్చింది. బీసీ–డి రిజర్వేషన్ కూడా ఉంది. మైక్రోబయాలజీతో పాటు బాటనీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు కూడా ఆప్షన్స్ పెట్టాం. అయితే ఇప్పటికీ ఎక్కడా సీటు కేటాయించలేదు. అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారు. దీంతో ప్రవేశాల పక్రియపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం తక్షణం ఇక్కడి అధికారులపై చర్యలు తీసుకొని పరిస్థితి చక్కదిద్దాలని కోరుతున్నాం. – శివరామనాయుడు, విశాఖపట్నం -
వైవీయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య గులాంతారీఖ్
సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య జి. గులాంతారీఖ్ నియమితులయ్యారు. ప్రస్తుత రిజిస్ట్రార్ ఆచార్య కె.చంద్రయ్య పదవీకాలం మంగళవారం ముగియడంతో సాయంత్రం గులాంతారీఖ్ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన యోగివేమన విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రగతి కోసం ఏర్పాటైన విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. విశ్వవిద్యాలయంలో వైస్ ప్రిన్సిపాల్‌గా, డీన్‌గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా పలు బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో మంచి పాలన అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆచార్య కె. చంద్రయ్యతో పాటు పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. గులాంతారీఖ్ నేపథ్యం.. ఆచార్య గులాం తారీఖ్ కడప నగరం అగాడికి చెందిన ప్రొఫెసర్ డా. షేక్ గులాంరసూల్ (లేట్), అజీమాబి దంపతుల కుమారుడైన ఈయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ అధ్యాపకవృత్తిలో ఉత్తముడుగా పేరుప్రఖ్యాతులు సాధించారు. తండ్రి వృత్తిరీత్యా తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిలో ఉండగా ఈయన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య సైతం అదే విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. ఎంఫిల్, పీహెచ్‌డీలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. 1983లో అధ్యాపక వృత్తిలో ప్రవేశించి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో లెక్చరర్‌గా, రీడర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2008 జూలై యోగివేమన విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 జనవరిలో ప్రొఫెసర్‌గా నియమితులైన ఈయన పలు కమిటీల్లో సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. వైవీయూ ఆంగ్లశాఖ విభాగాధిపతిగా, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, సెంట్రల్ అడ్మిషన్ సంచాలకులుగా, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్‌గా, ఎంఈడీ, ఇంగ్లీషు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఆర్ట్స్ విభాగం డీన్‌గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా, పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు. దీంతో పాటు 2016లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డును సైతం ఈయన అందుకున్నారు. ప్రస్తుతం వైవీయూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈయనకు రిజిస్ట్రార్‌గా అవకాశం లభించింది. ఆంగ్లసాహిత్యంలో పట్టు... ఆచార్య గులాం తారీఖ్ ‘కంటెపరరీ ఆఫ్రికన్ నావెల్’ అనే పుస్తకాన్ని రచించగా ఢిల్లీకి చెందిన పబ్లిషర్స్ దీనిని ముద్రించారు. దీంతో పాటు 30 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈయన పత్రాలు ప్రచురితమయ్యాయి. 50 వరకు జాతీయ, అంతర్జాతీయస్థాయి సెమినార్లలో పాల్గొని ప్రసంగించారు. బ్రిటీష్ లిటరేచర్, ఆఫ్రికన్ లిటరేచర్, ఇండియన్ ఇంగ్లీషు లిటరేచర్ అన్న అంశాలపై ఈయన పరిశోధన ప్రధానంగా సాగుతోంది. ఈయన వద్ద ఇప్పటి వరకు 10 ఎంఫిల్, మరో 10 మంది పరిశోధక విద్యార్థులు ఈయన మార్గదర్శకత్వంలో పీహెచ్డీ చేస్తుండటం విశేషం. -
ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలు
సాక్షి, రామారావుపేట (కాకినాడ లీగల్): ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికలో ఏఐసీటీఈ నిర్దేశ నియమాలను అనుసరించి రెండు ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టామని జేఎన్టీయూకే ఉపకులపతి ఎం.రామలింగరాజు తెలిపారు. వర్సిటీ ప్రాంగణం సెనేట్ హాలులో ‘ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికాభివృద్ధి, బోర్డ్ ఆఫ్ స్టడీస్’ సమావేశం డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్, ప్లానింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే వీసీ ఎం.రామలింగరాజు, ప్రత్యేక అతిథులుగా ఏపీ ఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్ టి.కోటేశ్వరరావు, కార్యదర్శి ఎస్.వరదరాజన్, ఏపీ ఎస్ఎస్డీసీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ గంటా సుబ్బారావు, గీతం వర్సిటీ వీసీ ఎన్.శివప్రసాద్, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కృష్ణయ్య, గౌరవ అతిథులుగా రెక్టార్ ఐ.శాంతిప్రభ వేదికనలంకరించగా రిజిస్ట్రార్ వీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ రామలింగరాజు మాట్లాడుతూ అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, బ్లూమ్స్ టాగ్జానమీ ప్రకారం బోధన జరుగుతుందని, దీనిని మరింత బలోపేతం చేయడానికి ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఇంటర్న్షిప్స్ ప్రాజెక్టŠస్ తదితర వాటిని పాఠ్య ప్రణాళికలో ప్రవేశపెట్టదలిచామన్నారు. ప్రస్తుతం 2019 రెగ్యులేషన్స్ ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో కనీసం నాలుగు ప్రాజెక్టులు చేసేలా రూపొందిస్తామన్నారు. ప్రొఫెసర్ టి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ పాఠ్యప్రణాళిక అన్ని యూనివర్సిటీలకు ఒకేలా ఉండేలా రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఎస్.వరదరాజన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్పీ టెల్ ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవాలని, ఫీల్డ్ వర్క్ చేయాలని, అలానే పాఠ్యప్రణాళికలో వర్చ్యువల్ రియాల్టీని ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. ఎన్.కృష్ణయ్య మాట్లాడుతూ తరగతి గదిలో అధ్యాపకుడు గంటలో 15 నిమిషాలకు మించి మాట్లాడకూడదని, విద్యార్థులను ప్రయోగ పద్ధతిలో మిగిలిన 45 నిమిషాలు కార్యాచరణలో నిమగ్నమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించాలన్నారు. గంజా సుబ్బారావు మాట్లాడుతూ లక్ష్యానికి చేరువయ్యేలా పలు శిక్షణలను కల్పించాలని, పాఠ్యాంశం నుంచి నేర్చుకుని మార్కులు పొందేలా కాకుండా సృజనాత్మకతను జోడించి పరిశోధనను అభివృద్ధి పరిచి ఆవిష్కరణలకు పెద్దపీట వేసేలా ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పాఠ్యప్రణాళిక పరిశ్రమలకు అనుగుణంగా రూపొందించనున్నామన్నారు. కార్యక్రమానికి డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, బీవోఎస్ చైర్పర్సన్లు, సభ్యులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, యుసీఈకే యుసీఈవీ, యుసీఈఎన్ ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అటానమస్, అనుబంధ కళాశాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
బదిలీ బహుమానం!
అనంతపురం న్యూసిటీ: అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని టీడీపీ నేతలు మారోమారు చాటుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో వ్యవహరించే అహుడా వీసీ ప్రశాంతిపై బదిలీ వేటు పడింది. ప్రభుత్వం ఆమెను కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ గురువారం జీఓ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 8న అహుడా వీసీగా ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. ఇదేఏడాది అక్టోబర్ 11న ఆమెకు ఐఏఎస్‌గా పదోన్నతి లభించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వీసీ బదిలీ జరిగినట్లు చర్చ జరుగుతోంది. బాధ్యతలు తీసుకున్న అనతి కాలంలోనే జిల్లాలోని రాప్తాడు, పెనుకొండ, అనంతపురం రూరల్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యక్షంగా పర్యటించి సంబంధిత బిల్డర్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. పెనుకొండలో నిర్మాణాలను సైతం తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులోనూ అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపారు. ఇకపోతే గతనెల 28న కియా సమీపంలోనూ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు. ఆహుడా పరిధిలో ఎలాంటి అక్రమాలనైనా సహించేది లేదని ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వీసీని ఆగమేఘాలపై బదిలీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఏపి సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
విశాఖ : ఏపీ సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 26 నుంచి మే 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరి అభ్యర్ధులకు రూ.1000, బీసీ కేటగిరి అభ్యర్ధులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్ధులకు రూ.500గా నిర్ణయించారు. వెయ్యి రూపాయల అదనపు రుసుముతో మే 10, రెండు వేల అదనపు రుసుముతో మే 21, ఐదు వేల అదనపు రుసుముతో జూన్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రొఫెసర్ తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తే చర్యలు: వీసీ
ఎస్కేయూ : విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్ పరీక్షల విభాగం ఉద్యోగులను హెచ్చరించారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్ అందజేసేందుకు ఆ విభాగం ఉద్యోగి డబ్బు డిమాండ్ చేశారని ఓ విద్యార్థిని వర్సిటీ అధి కారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన వీసీ, రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యమెందుకని ప్రశ్నించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œన్ సూర్యనారాయణ, డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రకాష్ పాల్గొన్నారు. -
వీసీగా నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నా
మూడు పూర్తయ్యాయి అనూర్ వార్షికోత్సవ సభలో వీసీ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నాడే నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నట్టు ఆచార్య ఎం. ముత్యాలునాయుడు తెలిపారు. వాటిని సాధించడంలో నన్నయ యూనివర్సిటీ సిబ్బంది అంతా ఒకే కుటుంబంలా త్రికరణశుద్ధితో పనిచేశారంటూ అభినందించారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నాలుగు లక్ష్యాలలో మొదటిది తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద యూనివర్సిటీగా అనూర్ అందరికీ తెలిసేలా చేయడం, రెండోది యూనివర్సిటీకి నిధులు సమీకరించడం, మూడోది అనూర్ పరిధిలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ కళాశాలలను బదిలీ చేయడం అని తెలిపారు. ఈ మూడు లక్షా ్యలు పూర్తయ్యాయన్నారు. నాల్గో లక్ష్యంగా ఎంచుకున్న 12 బీ గుర్తింపు కోసం ప్రయత్నించామని, గురు, శుక్రవారాలలో యూజీసీ కమిటీ సభ్యులు కూడా ఇక్కడకు వచ్చి, యూనివర్సిటీ పరిస్థితులను, సాధించిన ప్రగతిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయులు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య పీఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చని నన్నయ యూనివర్సిటీ సిబ్బంది నిరూపించారన్నారు. 2006 ఏప్రిల్‌లో ప్రారంభమైన నన్నయ యూనివర్సిటీ నేటి వరకు ఎదుర్కొన్న వివిధ సమస్యలు, సాధించిన విజయాలను పలువురు వక్తలు ప్రస్తావించారు. మొక్కలు నాటారు.. అనూర్ ఆవిర్భావ దినోత్సవంతోపాటు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం కూడా కావడంతో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్. లింగారెడ్డి, డీన్ ఆచార్య ఎస్. టేకి, ప్రిన్సిపాల్స్ ఆచార్య కేఎస్ రమేష్, ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్ ఎ. మట్టారెడ్డి, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉర్దూ వర్సిటీకి వీసీ నియామకం
కర్నూలు(సిటీ) : డాక్టర్ మౌలీ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ కె.ముజాఫిర్ అలీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవో ఆర్టీ నెం.54ను జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో మొదటి ఉర్దూ యూనివర్సిటీని కర్నూలు నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉర్దూ శాఖ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కె.ముజాఫిర్ను ఈ వర్సిటీకి వీసీగా నియమించారు. -
శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్ లేఖ
-
శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్ లేఖ
చెన్నై: తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సులర్లు శశికళను కలవడంపై ఆయన ఆ లేఖలో అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ పదవిలో లేని వ్యక్తిని వీసీలు ఎలా కలుస్తారని స్టాలిన్ లేఖలో ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు. కాగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. పెద్దగా తర్జనభర్జన అవసరం లేకుండానే ముఖ్యమంత్రి పదవి పన్నీర్‌సెల్వాన్ని వరించింది. జయ రెండుసార్లు జైలు కెళ్లినపుడు పన్నీర్సెల్వంకే సీఎం బాధ్యతలు అప్పగించడంతో ఆమె అభీష్టానికి అనుగుణంగా పన్నీరుకే పట్టం కట్టారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి జయలలిత నెచ్చెలి శశికళకే అప్పగించేందుకు రంగం కూడా సిద్ధమైంది. ఇందుకు శశికళ సైతం మౌనమే అంగీకారంగా వ్యవహరిస్తున్నారు. అలాగే పన్నీర్‌సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు శశికళను కలవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
నాణ్యమైన విద్యను అందించాలి
జేఎన్టీయూ వీసీ సర్కార్ అనంతపురం సప్తగిరి సర్కిల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కృషి చేయాలని జేఎన్టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్ సూచించారు. స్థానిక జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్వాలిటీ ఎడ్యూకేషన్ డెవలప్మెంట్పై ట్రైనింగ్ ప్లేస్మెంట్ అందించాలన్నారు. దీనికి అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలన్నారు. అనుబంధ కళాశాలల అధ్యక్షుడు శాంతరాముడు, రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ ప్రశాంతి, అనుబంధ కళాశాలల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
పరభాషలో కన్నా.. మాతృభాషలో అధ్యయనమే మిన్న
జాతీయస్థాయి సదస్సులో నన్నయ మాజీవీసీ జార్జ్ విక్టర్. భానుగుడి(కాకినాడ) : మాతృభాషలో అధ్యయనం వల్లే చైనా, జపాన్‌లు అభివృద్ధి చెందాయని నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య జార్జివిక్టర్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యత–సాంఘీకరణ పోకడలు అనే అంశంపై పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకులకు, అధికార యంత్రాంగానికి సరైన సామాజిక దృక్పథం కొరవడిందన్నారు. సోమవారం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో కుల, వర్ణ వ్యవస్థ, సాంస్కృతిక వైవిధ్యాలు పై విస్తృత స్థాయిలో పరిశోధన జరిగితేనే కుల వ్యవస్థపై అసహనం సమసిపోయి జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ పంజాబ్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను చెరసాల నుంచి తప్పించడం జాతీయ సమైక్యతకు ముప్పుగా పరిణమించవచ్చన్నారు. సదస్సులో నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ జాతి సంపదను అసమానంగా పంచబడడం, రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, అవిద్య, ఆహార కొరత మొదలైన అంశాలు జాతీయ సమైక్యతకు ముప్పుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, కందుల ఆంజనేయులు, యూజీసీ కోఆర్డినేటర్ హరిరామ ప్రసాద్, ఆర్గనైజింగ్ మెంబర్స్ వి.చిట్టిబాబు, కె.నరసింహారావు, స్వామి, పాండురంగారావు, పారేశ్వర సాహు, డాక్టర్ వీపురి సుదర్శన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
బాలమురళి కారణజన్ముడు
నన్నయ వీసీ ముత్యాలునాయుడు పుస్తక సంబరాల్లో ‘స్వర నివాళి’ రాజమహేంద్రవరం కల్చరల్ : గానగంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కారణజన్ముడని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముత్యాలునాయుడు అన్నారు. ప్రభుత్వ అటానస్ కళాశాలలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాల వేదికపై బుధవారం బాలమురళీకృష్ణకు స్వరనివాళి సమర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగు నేలకు, సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని చేకూర్చిన మంగళంపల్లి లేని లోటు తీరనిదని అన్నారు. విజయశంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల కూచిపూడి అధ్యాపకుడు పసుమర్తి శ్రీనివాసశర్మ మాట్లాడుతూ బాలమురళి స్వరం మధురం, వాక్కు చమత్కారభరితమన్నారు. సాహితీవేత్త రెంటాల శ్రీవెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎవరూ ప్రశ్నించలేని స్థాయిలో తెలుగు గాయకులకు బాలమురళి కంఠం గుర్తింపు తెచ్చిందన్నారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ అద్దేపల్లి సుగుణ మాట్లాడుతూ ఎన్నో జీవిత సత్యాలు, తత్వాలను బాలమురళి ఆలపించారన్నారు. గాయని ఎం.పార్వతి బాలమురళి గానం చేసిన ‘ఏమి సేతురా లింగా’, ‘ఊగుమా ఊయల’ తదితర గీతాలను ఆలపించారు. వయొలి¯ŒS విద్వాంసుడు కొక్కొండç సూర్యసుబ్రహ్మణ్యం బాలమురళి గానం చేసిన ‘వస్తా వట్టిదే–పోతా వట్టిదే–ఆశ ఎందుకంటా–చేసిన ధర్మము–చెడని పదార్థము’ అన్న గేయాన్ని ఆలపించారు. ముందుగా వీసీ బాలమురళి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. నన్నయ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ, విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్యపాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.వి.ప్రసన్నకుమారి పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే యూనివర్సిటీకి ఉత్తమ గ్రేడ్
వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఏఎన్‌యూ : యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేస్తేనే ఏఎస్యూకు ఉత్తమ నాక్ గ్రేడ్‌ను సాధించగలుగుతామని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ అన్నారు. నాక్ బృందం డిసెంబర్ మొదటి వారంలో ఏఎన్‌యూలో జరిపే పర్యటనలో అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌లో బుధవారం యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ అనుబంధ కళాశాలలు, యూనివర్సిటీ మధ్య సత్సంబంధాలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, విద్యార్థులకు అందించే సేవలు, పరస్పర సహకారం తదితర అంశాలపై నాక్ బృందం అనుబంధ కళాశాలతో సమావేశం కానుందన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు పూర్తి సమాచారం, అవగాహనతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. యూనివర్సిటీ మంచి గ్రేడు సాధిస్తే అనుబంధ కళాశాలలకు కూడా మంచి పేరు వస్తుందని, దానిని దృష్టిలో ఉంచుకుని కళాశాలలు సన్నద్ధం కావాలన్నారు. రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, సీడీసీ డీన్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు వివిధ అంశాలపై కళాశాలల యాజమాన్యాలకు సూచనలిచ్చారు. కళాశాలల యాజమాన్యాలు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. -
బ్లాక్మెయిల్ చేస్తే బెదరను
– ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తాను – కొందరు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు – విలేకర్ల సమావేశంలో ఆర్యూ వీసీ కర్నూలు సిటీ: యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తుంటే కొందరు విద్యార్థులు విద్యార్థి సంఘాల ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని, అయితే, వాటికి బెదరను అని రాయలసీమ యూనివర్సిటీ వీసీ వై. నరసింహులు అనా్నరు. ఆర్‌యూలో అక్రమాలు, అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శుక్రవారం ఆర్‌యూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అస్తవ్యస్తంగా ఉన్న వర్సిటీ నిర్వహణను చక్కదిద్దేందుకు తాను వీసీగా బాధ్యతలు తీసుకున్న తరువాత కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నానన్నారు. గతంలో మధ్యాహ్నం తరువాత విద్యార్థులు క్యాంపస్‌లో ఉండేవారు కాదన్నారు. ఇప్పుడు సాయంత్రం వరకు ఉండేలా చర్యలు తీసుకున్నానని చెప్పారు. కొందరు విద్యార్థులు క్లాస్‌లకు సక్రమంగా హాజరుకాకున్నా పరీక్షలకు అనుమతించాలని, కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. పీహెచ్డీ చేసిన వారినే బోధన సిబ్బందిగా నియమించామన్నారు. నియమకాల్లో అక్రమాలు జరిగాయని మూడునెలల తర్వాత ఆరోపణలు చేయడం తగదన్నారు. భర్తీ చేసే సమయంలో ఎందుకు అభ్యంతరం చేయలేదని ప్రశ్నించారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారన్నారు. హాస్టల్లో కొంత మంది విద్యార్థులు కిచెన్ స్టాఫ్ మీద దాడులు చేస్తుండడంతో పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. విద్యార్థులే కమిటీగా ఏర్పడి మెస్‌ను మెయింటెన్ చేసుకోమన్నా వారు వినిపించుకోవడం లేదన్నారు. వచ్చే ఏడాది ఎంఎస్ ఎర్త్ సైన్స్, మాస్టర్ ఆఫ్ జర్నలిజం కమ్యూనికేషన్ అనే కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నామన్నారు. విలేకర్ల సమావేశంలో రిజిస్ట్రార్ అమరనాథ్, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.