Vijayawada Floods
-
టీడీపీ నుంచి ఒక్క సాయం అందలేదు.. చంద్రబాబుకు వరద బాధితులు వార్నింగ్
-
తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన వరద బాధితులు
-
అగ్గిపెట్టెలకు 23 కోట్లు.. ప్రశ్నించినందుకు సాక్షిపై కేసు
-
టీడీపీ నేతలు.. వరద బాధితులను కలిసే దమ్ముందా?: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌కు పేదలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సంక్షోభం నుంచి అవినీతి ఎలా చేస్తారో చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓదార్పు కలగలేదు. వరద బాధితుల కోసమని చిన్నపిల్లలు కూడా వారు దాచుకున్బ డబ్బు ప్రభుత్వానికి ఇచ్చారు. వరదల వలన లక్ష నుండి రెండు లక్షల వరకు ఒక్కో ఇంటికి నష్టం వచ్చింది. బాధితులకు ఐదు రోజులపాటు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. రూ.368 కోట్లు భోజనాల పేరుతో దోచుకున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెప్పారు. రూ.26 కోట్లతో వాటర్ బాటిల్స్ ఇచ్చారంట. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.అలాగే, 412 డ్రోన్లతో ఆహారం అందించామని తప్పుడు లెక్కలు చెప్పారు. బాధితులకు సహాయం చేయకుండానే చేసినట్టు ఎందుకు లెక్కలు చెప్తున్నారు? పేదలంటే ఎందుకు అంత చులకనా?. కేంద్రం ఇచ్చిన నిధులు, విరాళాలు ఏం చేసినట్టు?. విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని చంద్రబాబు డ్యామేజ్ చేశారు. బాధితులు సహాయం కోసం రోడ్డు మీదకు వస్తే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించారు. ఇదేనా ప్రభుత్వ విధానం?. వరద బాధితుల పేరుతో కూడా దోచుకోవటం ఇప్పుడే చూస్తున్నాం. పదో తేదీన వరద బాధితుల కోసం ధర్నా చేయబోతున్నాం. ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వం చేయలేని పని మేము చేశాం. మా పార్టీ తరఫున బాధితులను సహాయం అందించాం. ప్రభుత్వం అడ్డుకున్నా నడుచుకుంటూ వెళ్లి సాయం చేశాం. వరద బాధితులను నిలువునా ముంచారు. వరద బాధితుల ప్రాంతాల్లో టీడీపీ నేతలు పోలీసులు లేకుండా తిరిగే ధైర్యముందా?. ఒకసారి జనంలోకి వస్తే బాధితులే సమాధానం చెబుతారు.దసరా నవ రాత్రులు జరుగుతున్న తీరు బాధాకరం. మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుమీద ఆపేశారు. కాదంబరీ జత్వానీని పోలీసు ఎస్కార్టుతో పంపటం దారుణం. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదు. ఉచిత బస్సుల్లో వృద్దులను ఎక్కించుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ వెళ్తే సాధారణ భక్తులను గంటల తరపడి ఆపేశారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మేము గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం: వైఎస్ జగన్ -
బాబూ.. వరద సంక్షోభం నుంచి సంపద సృష్టించుకున్నారా?: కన్నబాబు
సాక్షి, కాకినాడ: విజయవాడ వరదలతో కూటమి అసలు స్వరూపం బయటపడిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు చెప్పుకొచ్చారు. దాతల నుండి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరం చేశారని ఆరోపించారు.మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వరదలను చంద్రబాబు పండుగ చేసుకున్నారు. సంక్షోభం నుండి సంపద సృష్టించినట్లు ఉంది. సకాలంలో వరద సహయక చర్యలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కూటమి అసలు స్వరూపం ఏమిటో బయట పడింది. ప్రజలు ఏమనుకుంటారో అని సిగ్గులేకుండా ప్రభుత్వం ఉంది. వినాయక చవితి, దసరా చందాలు వసూలు చేసినట్లు చంద్రబాబు వరదలకు సహాయం వసూలు చేశాడు. రూ.368 కోట్లతో ఎంత మందికి భోజనాలు పెట్టారు.కృష్ణా, గోదావరి వరదలకే చంద్రబాబు హడావిడి చేశాడు. కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు రూ.28 కోట్లు ఖర్చు చేశారా?. డ్రోన్లకు రూ.2కోట్లు ఖర్చు చేశారంట. చంద్రబాబు సర్కార్‌కు వరదొచ్చినా.. కరువొచ్చినా పండుగే. ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్న కూటమి నేతలు చెబుతున్నారు. వరద లెక్కలకు తేడా చూడమని ప్రజలను కోరుతున్నాం. నష్టపోయిన లక్షలాది ఎకరాల్లో పంటలకు ఎన్యూమరేషన్ జరగలేదు. ఇన్ని లెక్కలు వేసుకుంటున్న మీకు ప్రజలు ఏ లెక్క వేస్తారో అర్ధం కావడం లేదా?ఎన్నో సంస్థలు.. స్వచ్చంద సంస్థలు వరద బాధితులకు సాయం చేశాయి. వైఎస్సార్సీపీ కూడా ముందుకు వచ్చి వరద సాయం అందించింది. దాతల నుంచి వచ్చిన వరద సాయాన్ని హారతి కర్పూరం చేశారు. ఇప్పటికీ విజయవాడలో సాయం అందలేదని వరద బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. వరద నష్టం కోసం మేయర్ అడిగితే విజయవాడ అధికారులు ఎందుకు నిరాకరించారు. ఇంత దుర్మార్గంగా ఖర్చు చేశామని లెక్కలు ఎలా రాస్తారు. రేపు ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు మన గురించి ఎలా ఆలోచిస్తారు అని చంద్రబాబుకు ధ్యాసే లేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: పవన్ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా -
బాబూ.. 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: విజయవాడలో బుడమేరు వరద కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు వందల కోట్లు మిగిల్చిందన్నారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. అలాగే, వరద బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు వరదతో విజయవాడ ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలితే.. కూటమి నాయకులకు, చంద్రబాబుకి కోట్ల రూపాయలు మిగిలాయి. చంద్రబాబుకి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరుకు వరద వచ్చింది. చంద్రబాబుకి ఒక పక్క ఫోటో షూట్స్.. మరోపక్క విరాళాల వరద వచ్చింది. బుడమేరు, చంద్రబాబు మిలకత్ అయ్యారు. బుడమేరు వరద చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చింది.వరదలో వందల కోట్లు ఖర్చు చేశారంట. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారు. రూ.368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారు. వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారు, ద్వారక తిరుమల, సింహాద్రి అప్పన్న నుండి వచ్చింది. దేవుడు భోజనాలు పెడితే 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.రూ.26కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్పారు. ఆరు లక్షల మంది వరదలో ఉంటే కోటిన్నర ఎవరికి ఇచ్చారు. వైఎస్ జగన్ కోటి రూపాయలతో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్ ఇచ్చారు. గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రూ.52కోట్లు శానిటేషన్ కోసం ఖర్చు చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టాల కోసం 23 కోట్లు ఖర్చు చేశారు. డ్రోన్స్ కోసం రెండు కోట్లు ఖర్చు అయింది. సరిగ్గా 10 మందికి కూడా ఆహారం అందించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు ఫోటో వదిలారు. దానికి రెండు కోట్లు. 534 కోట్లకు టెండర్ వేశారు. వచ్చిన విరాళాలకు ఖర్చులు చూపించారు. ఎవరికి కాంట్రాక్టు ఇచ్చారో.. ఎంతకీ ఇచ్చారో లెక్కలు బయటపెట్టాలి. నష్ట పరిహారం చెల్లించారా?. నష్ట పరిహారం కోసం ప్రజలు రోడ్డెక్కితే లాఠీ ఛార్జ్ చేశారు.కలెక్టర్ వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. కలెక్టరేట్‌కి రోజుకు వేల మంది వస్తున్నారు. పేదల జీవితాలు చిన్నాభిన్నం అయితే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నష్టపోతే గంటల వ్యవధిలోనే బాధితుల అకౌంట్లో డబ్బులు వేసేవారు. వైఎస్ జగన్‌పై అక్కసుతో సచివాలయ వ్యవస్థను, వలంటీర్ వ్యవస్థని నీరు కార్చాడు చంద్రబాబు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఉన్న వ్యత్యాసం ప్రజలు గమనించాలి.విజయవాడ ప్రజలు కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయి అంటే చంద్రబాబు చేసిన తప్పిదమే. మళ్ళీ వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ చేయాలి. నష్ట పోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలి. బాధితుల తరపున వైస్సార్సీపీ పోరాటం చేస్తుంది. వరద బాధితులను పరామర్శించని పవన్.. మత విద్వేషాలను రెచ్చకొడుతున్నాడు. పవన్‌కి ప్రజలే బుద్ధి చెబుతారు. విజయవాడ ముందే మునిగిపోతుందని తెలిసి కూడా సిసోడియా ఎందుకు చెప్పలేదు’ అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?: ఎంపీ విజయసాయిరెడ్డి -
గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా!
సాక్షి, విజయవాడ: విజయవాడలో బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు...కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు. వరద బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు.మరోవైపు.. విజయవాడ వరద ఖర్చుల్లో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విరాళాలన్నీ ఖర్ఛు చేసినట్టు కూటమి ప్రభుత్వం లెక్క సెట్ చేసింది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23కోట్లుగా ప్రభుత్వం రాసేసింది. వరద బాధితులకు భోజనం కోసం ఏకంగా రూ.368కోట్లుగా సర్కార్ లెక్క చెప్పింది. ఒక్కో భోజనానికి రూ.264 ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించారు.పులిహోర, సాంబార్ రైస్, వెబ్ బిర్యానీకి భారీ ధర కనిపిస్తోంది. అన్నా క్యాంటీన్ భోజనం రూ.95కు సరఫరా చేశారు. వరదల్లో మాత్రం భారీగా ధర చెల్లించినట్టు గోల్మాల్ చేశారు. వరదల్లో డ్రోన్ల కోసం రూ.2కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు చూపించారు. రూ.534కోట్లలో ఆహారం, నీళ్లు, వసతి, పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే, వరదల సందర్భంగా తమకు 10 రోజుల పాటు ఆహారం, నీళ్లు అందక బాధితులు గగ్గోలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొట్టాయి. అయినా, బాధితులకు అన్నీ ఏర్పాట్లు చేసి డబ్బులు ఖర్చు చేసినట్టు కరెక్ట్‌గా లెక్కల్లో చూపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు రాసేశారని సీపీఎం, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాతల సాయాన్ని కూడా ప్రభుత్వం లెక్కల్లో రాసేసిందని మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్ -
అర్జీలన్నీ అట్టపెట్టెల్లోకే..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితుల అర్జీల పరంపర శుక్రవారం కూడా అనేక ఇక్కట్ల మద్య కొనసాగింది. కలెక్టరేట్‌కు వేలాదిగా బాధితులు శుక్రవారం కూడా అర్జీలతో చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ వీరెవర్నీ కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. రోజూలాగే మండుటెండలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై, మురుగుకాల్వగట్లపై అవస్థలు పడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకోవడంతో అధికారులు చేసేదిలేక హడావుడిగా బాధితులను లోపలికి అనుమతించారు. అయితే, శుక్రవారం కౌంటర్లలో అర్జీలు తీసుకోబోమని తెగేసి చెప్పారు. అట్టపెట్టెలు ఏర్పాటుచేసి ఎవరికి వారు తమ అర్జీలను అందులో పడేసి వెళ్లిపోవాలన్నారు. మరోవైపు.. అప్పటివరకూ ఎండనపడి వచ్చిన బాధితులు చెట్ల నీడలో సేదతీరుతుండగా పోలీసులొచ్చి వారిని కనికరం లేకుండా తరిమేశారు. తమతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారంతా మండిపడుతూ.. సర్కారుకు శాపనార్ధాలు పెడుతూ వారంతా ఉసూరుమంటూ బయటకొచ్చారు. -
కూటమి ప్రభుత్వంపై వరదబాధితులు ఫైర్
-
గుడ్‌న్యూస్.. వరద బాధితులకు ఉచితంగా ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.పదో తరగతి హిందీ సిలబస్ కుదింపుసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదలతాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
విజయవాడ వరదలు వచ్చి నెల రోజులు.. బాధితులకు చంద్రబాబు చేసింది..
-
సాయం అందక.. నిస్సహాయంగా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) / విజయవాడ స్పోర్ట్స్: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ కలెక్టరేట్‌కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నాం. ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.చివరి రోజు కావడంతో..బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్‌కు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.జాబితాలో చిత్ర విచిత్రాలు..‘‘ప్రియమైన పైడి సాయిదీపక్...! మీ బ్యాంకు ఖాతా ఆధార్ నంబరుతో లింక్ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్‌తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్‌కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్ లింక్ అయ్యే అవకాశమే లేదు. నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.పొంతన లేని లెక్కలు..ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.జగన్ ప్రభుత్వమే ఉంటే..కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.అమ్మకు రిక్త హస్తం..వాంబే కాలనీ హెచ్ బ్లాక్‌లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – కురిటి సుజాత, వాంబే కాలనీగతంలో ప్రతిదీ ఇంటి వద్దే..జగన్ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. – పాముల పద్మ, వాంబే కాలనీఇదిగో.. అదిగో అంటున్నారుప్రకాష్ నగర్లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో అర్జీ ఇద్దామని వచ్చా. – షేక్ ఫాతిమా, ప్రకాష్నగర్ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులుకాళ్లు అరిగేలా తిరిగా..పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – వెంకాయమ్మ, పైపుల రోడ్డుఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్‌నగర్ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్ నెంబర్ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. -
వరద బాధితుల వేదన
-
వరద దెబ్బకు పడిపోయిన రిజిస్ట్రేషన్లు
మధురానగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద రియల్ఎస్టేట్ రంగాన్ని ఛిదిమేసింది. ఇప్పటి వరకు నగరంలోని తక్కిన ప్రాంతాలతో దీటుగా రామకృష్ణాపురం, దేవీనగర్, గద్దె వెంకట్రామయ్యనగర్, దావుబుచ్చయ్యకాలనీ, వినాయకనగర్, గుణదల, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాలలో క్రయ విక్రయాలు జరిగేవి. ఆ పరిసర ప్రాంతాలలో గజం రూ. 35వేల నుంచి రూ. 45వేల వరకు వెళ్లింది. ఈ ప్రాంతాలలో బుడమేరు వరద ప్రభావం ఉండదని రియల్టర్లు ప్రచారం చేయటంతో కనీసం మురుగుకాలువలు, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు, లే అవుట్లు లేకున్నప్పటికీ పెట్టుబడిదారులు, బ్రోకర్లు ఎగబడి కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.కొనుగోలుదారులు హడల్..ఈ ప్రాంతాలలో బుడమేరు వరద పోటెత్తటంతో ఇటువైపు కొనుగోలుదారులు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు సైతం వాటిని వదిలేసుకుంటున్నారు. తమకు వరద ముంపు బెడద ప్రాంతాలు అవసరం లేదంటూ కొనుగోలు దారులు తెగేసి చెప్పటంతో కృత్రిమంగా రేట్లను పెంచేసి అధిక రేట్లకు విక్రయిస్తున్న బ్రోకర్లు భయాందోళనలకు గురవుతున్నారు. తాము పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వస్తుందో రాదో నంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఆయా ప్రాంతా లలో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు ప్లాట్లను కొనుగోలు చేసేవారు ముందుకు రాకపోవటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో కొనుగోలుదారులు అధికంగా ఉండటంతో బిల్డర్లు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరీ అనధికారిక నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్లాట్లు అమ్ముడవుతాయో లేదో తెలియక తలలు పట్టుకుంటున్నారు.అద్దెకు కూడా వద్దు..ఏ సౌకర్యాలు లేకున్నప్పటీకీ ప్రశాంతంగా ఉండవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రాంతాలకు వచ్చి అద్దెకుంటున్న వారు కూడా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. వరద వల్ల పడిన కష్టాలు చాలని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతామని చెబుతున్నారు. ప్రభుత్వం వరద సాయం ఇచ్చేస్తే ఇళ్లు ఖాళీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన నిర్మాణాల ఈఎంఐలు ఏ విధంగా కట్టాలోనని భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు.వరద సాయం అందేనా?వరద నీరు ముంచెత్తిన గద్దె వెంకట్రామయ్యనగర్, వినాయకనగర్, దావు బుచ్చయ్యకాలనీలో వరద సాయం ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని ఇళ్లలోకి ప్రవేశించగా మరికొన్ని ఇళ్ల వద్ద రోడ్లపై నడుంలోతు నీళ్లు రోజుల తరబడి నిలిచిపోయాయి. అయితే అధికారులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తగ్గిన రిజిస్ట్రేషన్లుఆయా ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు కూడా గణనీయంగా పడిపోయాయి. కొనుగోలుదారులు అక్కడ వేటినీ కొనేందుకు ముందుకు రావడం లేదు. బుడమేరు వరదకు ముందు గాంధీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సుమారు 70 నుంచి 80వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం కేవలం సుమారు 30 రిజిస్ట్రేషన్ల వరకు మాత్రమే జరుగుతున్నాయి. అలాగే గుణదల రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సుమారు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం 10 నుంచి 20 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. వాటిలో కూడా వీలునామా, మార్ట్గేజ్ తదితర రిజిస్ట్రేషన్లు ఎక్కువ. కొనుగోలుదారులు వరద ముంపు ప్రభావం లేని ప్రాంతాల వైపు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇటీవల కాలంలో విజయవాడ శివారు ప్రాంతాలు బాగా అభివృద్ధిచెందుతున్నాయి. కోర్ సిటీలో స్థలాల లభ్యత లేకపోవడంతో అందరూ నగర శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. నిర్మాణాలు బాగా పెరిగాయి. సిటీలోని రణగొణ ధ్వనులకు దూరంగా ఉండాలనుకునేవారు, ప్రశాంతత కోరుకునే వారు కూడా అటువైపు ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బుడమేరు వరద ఎఫెక్ట్ వల్ల ఆ ప్రాంతాల్లో తాము ఉండలేమంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుదేలైంది. -
డైవర్షన్ బాబుకి దెబ్బపడింది అక్కడే!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి పార్టీ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి. ‘‘సూపర్ సిక్స్’’ అంటూ అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పాలన ఈ వందరోజుల్లో ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగానే తానిచ్చిన హామీల అమలుకు ప్రయత్నించారా? లేదా... గతంలో మాదిరిగానే ఈ సారి కూడా వాటిని ఎలా ఎగవేయాలన్న ఆలోచనల్లోనే ఉండిపోయారా?... ఇవీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల్లో మెదలుతున్న సందేహాలు, సంశయాలు! హామీల అమలులో తన వైఫల్యం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చేందుకు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయాన్ని తెరపైకి తెచ్చిన తన తుచ్ఛ రాజకీయ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని అనాలి.తాను అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనకు కూడా జగన్ ప్రభుత్వంపై తోసివేయడంలో బాబుకు మించిన వారు ఇంకోకరు ఉండరేమో. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి సూపర్ సిక్స్ తదితర హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. తన అనుభవాన్నంతా ఉపయోగించి సంపద సృష్టిస్తానని.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఊదరగొట్టారు. ఈవీఎంల మాయాజాలమో.. ప్రజలు నిజంగానే బాబు మాటలను నమ్మి ఓటేశారో స్పష్టంగా తెలియదు కానీ.. అధికారమైతే కూటమికి దక్కింది. దురదృష్టం ఏమిటంటే.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలా అన్న ప్రయాసే బాబు, కూటమి నేతల్లో కనపడింది. అసెంబ్లీ వేదికగా బాబు మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు భయమేస్తోందని మాట్లాడటమే ఇందుకు ఒక నిదర్శనం. వంద రోజులలో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వాగ్దాన భంగం కాకుండా జరిగిందేమిటని ఒకసారి తరచి చూస్తే... విధ్వంసం, విద్వేషం, వక్రభాష్యాలు, హింస, దౌర్జన్యకాండ, అత్యాచారాలు, రెడ్ బుక్ రాజ్యంగం, పగ, ప్రతీకారాలే కనిపిస్తాయి. వీటన్నింటితో ఈ వందరోజుల్లో ప్రజలు ఏనాడూ ప్రశాంతంగా ఉండలేకపోయారు. అయినా సరే.. ఈ ప్రభుత్వం చాలా మంచిదని భాగస్వాములతో కలిపి కూటమి ప్రకటించుకుంది. నిర్భీతిగా ప్రచారం చేసుకుంటోంది. చంద్రబాబు ఒకపక్క ఖజానా ఖాళీ అంటూనే.. ఈ రకమైన తప్పుడు ప్రచారాలకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూండటం ఆశ్చర్యకరం. సూపర్ సిక్స్ హామీల్లో వృద్ధుల ఫింఛన్‌ను వెయ్యి రూపాయల చొప్పున పెంచడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు మినహా మిగిలిన వాటినేవీ అమలు చేసినట్లు కూటమి సైతం చెప్పుకోలేకపోయింది. ప్రచార ప్రకటనల్లోనూ మొక్కుబడిగా వీటిని ప్రస్తావించారు.విజయవాడలో వరద బాధితుల కష్టాలు ఇప్పటికీ తీరకపోయినా, చంద్రబాబు వరదలపై విజయం సాధించారని చెప్పుకుంటున్నారు. అసలు వరదలు వచ్చిందే బాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల అని, బుడమేరు రెగ్యులేటర్‌ను ముందస్తు హెచ్చరికల్లేకుండా అకస్మాత్తుగా విజయవాడ మీదకు వదలి ప్రజలను నానా యాతనకు గురిచేసి, ఇప్పుడు విజయం సాధించామని అంటున్నారు. కరకట్ట మీద తన అక్రమ నివాసం పూర్తిగా మునిగిపోకుండా, అమరావతిలోనే పలు ఇతర ప్రాంతాలు వరద మయం కాకుండా ఉండడానికి ఈ వరదలను సృష్టించారన్న విమర్శలను కప్పిపుచ్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసిందన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కుట్రలు,కుతంత్రాలు చేయడం తప్ప, తాము చెప్పినవాటిలో ఫలానా స్కీము అమలు చేశామని చెప్పుకోలేని దుస్థితి కూటమి ప్రభుత్వానిది. పోనీ ఫలానా అభివృద్ది కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కూడా ఆ ప్రకటనల్లో తెలపలేకపోయారు. వృద్దాప్య పెన్షన్లు ఒక వెయ్యి పెంచినా, లక్షలాది మందికి కోత పెడుతున్నారు.అన్నా క్యాంటీన్ లలో ఐదు రూపాయలకు భోజనం పెడుతూ లక్షల మంది ఆకలి తీర్చుతున్నామని చెప్పుకున్నారు. రోజూ ఒక క్యాంటీన్ లో వంద నుంచి మూడు వందల మంది తింటే.. లక్షల ప్రజల ఆకలి ఎలా తీరుతుందో తెలియదు. చంద్రబాబు ప్రకటించిన వాటిలో కీలకమైన తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి వాటి గురించి ప్రస్తావనే లేదు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇస్తామని ఇచ్చిన హామీలపై నోరెత్తితే ఒట్టు. అందుకే సోషల్ మీడియాలో వాటిపై జోకులే జోకులు!! ఇవన్నీ ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి ప్రజల గొంతు నొక్కడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఇంకో ఎత్తు. గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అద్వాన్నపాలనను సాగిస్తూ చంద్రబాబు అప్రతిష్ట పాలవుతున్నారు.కాకపోతే పవన్ కళ్యాణ్‌ను, బీజేపీని పూర్తిగా లోబరచుకుని అటువైపు నుంచి ఎలాంటి ప్రశ్నలు రాకుండా చేసుకుంటున్నారు. చంద్రబాబు ఇంతకుముందు చేసిన పద్నాలుగేళ్ల పాలన లో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి కానీ మరీ ఇంత నీచంగా లేదు. జగన్ తీసుకువచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, ఇంటి వద్దకే రేషన్..తదితర వ్యవస్థలను రద్దు చేసి ప్రభుత్వాన్ని తిరోగమనం వైపు నడుపుతున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని చెప్పి, ఇప్పుడు అసలుకే మోసం తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఏమవుతుందో తెలియదు సీబీఎస్ఈ, టోఫెల్ వంటి వాటిని ఎత్తివేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాజకీయ ప్రత్యర్ధులపై దమనకాండ సాగించారు.ఎన్నడూ లేని రీతిలో కొన్ని వేల దాడులు, దౌర్జనాలు ఈ వంద రోజులలో జరిగాయి. శాంతిభద్రతలు ఏపీలో ఇంత ఘోరంగా ఎన్నడూ లేవు. కాకపోతే ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ చేయడానికి మాత్రం గట్టిగానే పూనుకున్నారు. ఇక ఏపీలో ఊరువాడ మద్యం షాపులు రాబోతున్నాయి. తాగినోడికి తాగినంత అన్నట్లుగా తయారు చేస్తున్నారు. తన ప్రభుత్వ వైఫల్యాలను,హామీల ఎగవేతను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు మాత్రం కొనసాగిస్తున్నారు.అందులో అత్యంత నీచమైంది తిరుమల ప్రసాదం లడ్డు వివాదం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా తిరుమల లడ్డూపై కామెంట్ చేసి ఉండరు. లడ్డూలో వాడిన నేతిలో జంతువుల కొవ్వు కలుస్తోందని ఆరోపిస్తూ, జగన్ ప్రభుత్వంపై నెట్టే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అయిన నేయి క్వాలిటీపై అనుమానాలు వస్తే దానిని గత ప్రభుత్వానికి ఆపాదించడం చంద్రబాబు తెలివితేటలకు అద్దం పడుతుంది. తిరుమలకు అపచారం చేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోతారేమో! అందుకే చంద్రబాబుది ఎప్పుడూ దుర్బుద్దే అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఒకవైపు జగన్ పై ఈ విషయాలలో ఆరోపణలు చేస్తూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తుండగా, జగన్ మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా టిటిడిలో ఉన్న ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించిన పరీక్షల తీరు మొదలైనవాటిని వివరించారు. చంద్రబాబు 20142019 మధ్య టరమ్ లో ఇలా నాణ్యతమీద సందేహాలు వచ్చినప్పుడు పద్నాలుగుసార్లు నేతి టాంకర్లను వెనక్కి పంపారని, తన హాయంలో ఇది పద్దెనిమిదిసార్లు జరిగిందని,అయినా లడ్డూలో ఏదో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్యమైన తిరుమల శ్రీవెంకటేశ్వుడి పట్ల పాపం చేయవద్దని జగన్ కోరారు. చంద్రబాబు ,పవన్ లు కలిపి సుమారు 200 హామీలు ఇచ్చారు.వాటిని అమలు చేయడానికి వారికి చిత్తశుద్ది లేదు.అవి ఆచరణ సాధ్యం కానివని తెలిసినా,జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని లక్ష్యంతో ఇచ్చిన హామీలవి.ఈ మూడునెలల కాలంలోనే సుమారు 27వేల కోట్ల అప్పుచేసి, అమరావతి పేరుతో మరో పదిహేనువేల కోట్ల అప్పునకు సిద్దం అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం నిత్యం కుట్రలు,కుతంత్రాలతో కాలం గడుపుతూ ,అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ,ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది.అందువల్లే ప్రజలలో వంద రోజుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నా,ప్రజలు మాత్రం ఇది మహా వంచన ప్రభుత్వంగా పరిగణిస్తున్నారని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయవాడ విపత్తులో ఘోరంగా విఫలమైన బాబు ప్రభుత్వం
-
మంత్రి, మాజీ ఐఏఎస్, ప్రపంచ బ్యాంకులకూ బుద్ధీ జ్ఞానం లేవా బాబూ?
‘అమరావతి మునిగిపోతోందని చెబుతున్న వాళ్లు బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆగ్రహంతో రగిలిపోతూ అన్నమాటలివి. చంద్రబాబు మనసులో తాను వైఎస్సార్సీపీని విమర్శిస్తున్నానని అనుకుని ఉంటారేమోగానీ.. వాస్తవానికి ఈ విమర్శ నేరుగా తగిలేది ఆయన మంత్రివర్గ సహచరుడు పి.నారాయణకే. ఎందుకంటే.. వరదొస్తే అమరావతి మునిగిపోతుందని, రాజధాని నగర నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది ఈ నారాయణ గారే. ఈ విషయాన్ని బుద్ధీ, జ్ఞానం లేకుండా మంత్రి బయటపట్టేశాడన్న కోపం బాబుకు ఉండి ఉండవచ్చు. కానీ నారాయణతో తనకున్న ఆర్థిక సంబంధాలు, ఇతర కారణాల రీత్యా నేరుగా ఏమీ అనలేక నెపాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టినట్టు కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి పాపం చంద్రబాబు బాధ అర్థం చేసుకోదగ్గదే. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌గా రాజధాని నిర్మాణాన్ని మార్చేసి తన వారికి మేలు చేయాలన్న ‘విజన్’కు గండి పడేలా ఎవరు మాట్లాడినా కోపం రాకపోతుందా మరి! వరదలొస్తే అమరావతి ప్రాంతం మొత్తం నీట మునుగుతుందన్నది బాబు ఆత్మకూ తెలిసిన విషయమే. కానీ మనసు చెప్పినట్లు నడుచుకునే నైజం బాబుది కాదు కాబట్టి... అమరావతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒంటికాలిపై లేస్తూంటారు. ‘‘నాలుకలు కత్తిరించాలి’’ అనబోయి తమాయించుకుని తాళాలు వేయాలని సెలవిచ్చారు. అయితే నోళ్లకు తాళాలు వేయాలన్నది నానుడి. నాలుకలకు కాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసన భారీ వర్షాలకు అమరావతిలోని అనేక ప్రాంతాలు మునిగిపోయినట్లు స్పష్టంగా ఫొటోలూ, కథనాలు వచ్చాయి. అంతెందుకు.. చంద్రబాబు కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీరు వచ్చిన సంగతి ఆయనకు తెలియకుండానైతే ఉండదు. కరకట్ట నివాసానికి దగ్గర్లోనే ఉండే ప్రకృతి చికిత్స కేంద్రంలోకి పెద్ద ఎత్తున కృష్ణా నది వరద నీరు చేరడం కూడా అందరి కళ్లెదుట జరిగిన ఘటనే. బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు అకస్మాత్తుగా ఎత్తేసి నీరంతా వదిలేయడంతో విజయవాడ మునిగింది కానీ లేదంటే బుడమేరు వరద నీరు మొత్తం కృష్ణలోకి చేరి అమరావతి ప్రాంతంలో వరదనీటి మట్టం మరింత ఎక్కువగా ఉండేది. అయినా... ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని విస్పష్టంగా చెప్పినా... వాళ్లక్కూడా బుద్ధీ, జ్ఞానం లేదని చంద్రబాబు చెప్పదలిచారా? 201419 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణ రావు వంటి ఐఏఎస్ అధికారి కూడా ఒక ఇంటర్వ్యూలో అమరావతిలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయని స్పష్టంగా చెప్పారు. ఎగువన భారీ వర్షాలు కురవలేదు కనుక గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు, ఇతర వాగుల నుంచి వరద ఎక్కువగా లేదని, కృష్ణకు వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల వరదకు తోడు కొండవీటి వాగుకూ వరద వచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన వివరించారు కూడా. నిజంగా అలాంటి పరిస్థితే వచ్చి ఉంటే వరదను కృష్ణా నదిలోకి మళ్లించడమూ సాధ్యమయ్యేది కాదని.. ఫలితంగా అమరావతి ప్రాంతం మరింత జలమయమయ్యేదని కృష్ణారావు ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి అన్న విషయంపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అమరావతి ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని యోచించిన భూమికి కూడా వరద ముప్పు ఉందని ఆయన తెలిపారు. ఇలా చెప్పినందుకు ఐవైఆర్ కృష్ణారావుకు కూడా బుద్ది లేదని అంటే ధర్మంగా ఉంటుందా? అమరావతిపై అనేక కోణాలలో అవగాహన కలిగిన కృష్ణారావు వంటివారు ఏపీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారే తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఆశించి కాదని అందరికి తెలుసు. ‘‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ’’ అన్నట్లు, చంద్రబాబుకు ఇష్టమైనది కనుక అమరావతి గురించి అంతా ఆహా, ఓహో అని పొగడాలని ఆయన కోరుకుంటు ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నోళ్లకు తాళాలు వేయడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. ‘‘నీళ్లు కిందకు ప్రవహిస్తాయని ఆకాశంలో కట్టుకుంటామా!’’ అని బాబు వ్యాఖ్యానించడమే కాకుండా... ఏ మహా నగరం మునగలేదో చెప్పాలని విచిత్ర, వితండ వాదానికి దిగడం ఆయనకే చెల్లింది. అమరావతికి మల్లే కర్నూలు, బెంగళూరు, ముంబై వంటి నగరాలను లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టలేదు. కాలక్రమంలో అవి ఎదుగుతూ మహా నగరాలయ్యాయి. కొన్ని సమస్యలూ వచ్చి ఉండవచ్చు. కాదనలేము. కానీ లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ముంపు ప్రాంతంలో రాజధానిని కట్టాలన్న బాబు మంకుపట్టుతోనే వస్తోంది సమస్య మొత్తం! మూడు పంటలు పండే ప్రదేశాన్ని ధ్వంసం చేయవద్దని గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పినా వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది చంద్రబాబు కాదా? పోనీ నాగార్జున యూనివర్శిటి సమీపంలో జాతీయ రహాదారికి రెండో వైపులా అందుబాటులో ఉన్న రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించినా ఈ రచ్చ ఈ స్థాయికి చేరేది కాదు. అమరావతి సంక్షోభానికి చంద్రబాబే కారణం కనుక, ఆ విషయం బయటపడకుండా ఎదుటివారిపై ,ముఖ్యంగా వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ డబాయిస్తుంటారు. తెలుగుదేశంతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు అమరావతి మునగలేదని అబద్దపు ప్రచారం చేసినా, ప్రజలకు అక్కడ ఏమి జరిగిందో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాలు మునిగాయి కనుక అమరావతి మునిగినా ఫర్వాలేదని ముఖ్యమంత్రి స్థాయిలోని వారు చెప్పవచ్చా? అక్కడ భూమి స్వతహాగా భారీ నిర్మాణాలకు అనువు కాదని 201419 హయాంలోనే తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో తెలియదు. ఒక వైపు తాము ఇచ్చిన హామీల అమలుకు అసలు డబ్బులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెబుతూ, మరో వైపు వేల కోట్లు అమరావతిలో వెచ్చిస్తామని అనడంలో తర్కమూ కనిపించదు. తొలి దశలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. అంత డబ్బు ఎలా సమకూరుతుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అసలు ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, పైసా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయవలసిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక చిన్న ప్రాంతంలో ఖర్చు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా రూ.10 15 వేల కోట్ల అప్పు ఆర్ధిక సంస్థల ద్వారా సమకూర్చడానికి కేంద్రం అంగీకరించింది. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ భిన్నమైన నివేదికను ఇచ్చింది. అయినా ఎక్కడో చోట మేనేజ్ చేసి అప్పులు తెస్తారేమో తెలియదు. దీనివల్ల రాష్ట్రంలో మళ్లీ అసమానతలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు. అనేక విద్యా సంస్థలను అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని, లక్ష మంది విద్యార్ధులు చదివే అవకాశం ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడిందట. వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియడంలా? వాటిలో ఎన్ని వస్తాయో, రావో కాని, నిజంగా వస్తే వికేంద్రీకకరించకుండా అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామనడం అన్యాయం అవుతుంది. కర్నూలులో ఏర్పాటు కావల్సిన లా యూనివర్శిటీని కూడా అమరావతిలోనే నెలకొల్పుతారట. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. కృష్ణా నది వరదలలో కొట్టుకు వచ్చి ప్రకాశం బారేజీని ఢికొట్టిన ఉదంతంలో వైఎస్సార్సీపీ కుట్ర ఉందని చంద్రబాబు ముందుగా డిటెక్టివ్ మాదిరి కనిపెట్టి ప్రకటించారు. దాంతో టీడీపీ మంత్రులు కూడా అదే పల్లవి అందుకుని ప్రచారం చేశారు. ఇంత నీచంగా టీడీపీ నేతలు ఇలా కుట్ర స్కీమ్ అమలు చేస్తున్నారేమిటా అని ఆలోచిస్తే అసలు విషయం బోదపడింది. కృష్ణానది వెంబడి ప్రకాశం బారేజీ ఎగువన భారీ గోడ నిర్మిస్తామని, తద్వారా అమరావతి వైపు వరద రాకుండా పరిరక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అదన్నమాట అసలు సంగతి. నేరుగా ఆ గోడ కడతామని అంటే నది వరద జోన్ లో కరకట్టలోపల ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రముఖుల భవనాలు నీట మునగకుండా ఈ రిటైనింగ్ వాల్ కట్టబోతున్నారని ప్రజలు భావించి విమర్శించవచ్చు. దానికి ముందుగా ఈ బోట్ల కుట్ర ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ ఏదో చేసిందన్న తప్పుడు వాదనలు వినిపించాక ఈ గోడ ప్రతిపాదన తెస్తే పెద్దగా వ్యతిరేకత రాదని అనుకుని ఉండవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం బారేజీకి దిగువన ఉన్న విజయవాడలోని కృష్ణలంక తదితర ప్రాంతాలు మునగకుండా భారీ వాల్ నిర్మించారు. దాంతో గత వరదలలో అనూహ్యమైన రీతిలో నీటి ప్రవాహం ఉన్నా ఈ ప్రాంతం సేఫ్ అయింది. కాని ప్రకాశం బారేజీ ఎగువన ఇలా గోడ కట్టడం శాస్త్రీయంగా కరెక్టా, కాదా?అన్నది ప్రభుత్వం పరిశీలించాలి.తొందరపడి, తమ ఇళ్లు కాపాడుకోవడానికి ఇలాంటి నిర్మాణం చేస్తే ప్రవాహ వేగం పెరిగి ,అప్పుడు నిజంగానే బారేజీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అధ్యయనం చేసిన తర్వాతే సరైన నిర్ణయం చేయాలని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అమరావతో, భ్రమరావతో,గ్రాఫిక్స్ మోజులో పడి చంద్రబాబు అక్కడ ముంపే లేదని,ముప్పు లేదని తనను తాను సంతృప్తి పరచుకునే యత్నం చేసుకుంటే,ఆత్మ వంచనే అవుతుంది. అది ఆయననే కాదు ..రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని చంద్రబాబు హేతుబద్దంగా వ్యవహరించాలి.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ‘బీమా మాటలు’ బోగస్..
సాక్షి, అమరావతి : ‘నా ఆటో వరదలో మునిగి వారం రోజులు ఉండిపోయింది. అన్ని భాగాలు పాడైపోయాయి. ఇంజిన్ సీజ్ అయిపోయింది. దాన్ని బాగుచేయాలంటే రూ.60 వేలు వరకు అవుతుందని మెకానిక్ చెప్పాడు. బండికి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్లు చూసి ఇంజిన్ సీజ్ అయితే ఇన్సూరెన్స్ ఇవ్వలేమని చెప్పారు. గట్టిగా అడిగితే రూ.4 వేలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి సంబంధంలేదు. ఆటోనే నా జీవనాధారం. పైగా.. ఇంట్లో అన్ని వస్తువులు వరదలో మునిగి పాడైపోయాయి. ఏం చేయాలో, ఎలా బతకాలో తెలీడంలేదు’.. ఇదీ విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలోని శాంతినగర్‌లో ఉంటున్న వేల్పుల మురళి ఆవేదన. .. ఇలా బుడమేరు వరదలో మునిగి విజయవాడలో దాదాపు రెండు లక్షల వాహనాలు పాడైపోయినట్లు అంచనా. అందులో సుమారు లక్షన్నర ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఆటోలు 15 వేలు, కార్లు 20 వేల వరకూ ఉండొచ్చని అంచనా. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ముంపు వాహనాలే కనిపిస్తున్నాయి. వరద నీటిలో మునగడంతో చాలా వాహనాల ఇంజన్లు సీజ్ అయిపోయాయి. కానీ, ఇన్సూరెన్స్ ఉన్న ఇలాంటి వాహనాలకు ఇబ్బందుల్లేకుండా క్లెయిమ్‌లు ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీమా సంస్థలతో సమావేశం నిర్వహించి క్లెయిమ్‌ల పరిష్కారంలో ఉదారంగా ఉండాలని చెప్పామని, వాళ్లు ఒప్పుకున్నారనీ చెప్పారు. ఈయన మాటలు నమ్మి పూర్తి ఇన్సూరెన్స్ వస్తుందన్న ధీమాతో బాధితులు దెబ్బతిన్న తమ వాహనాలను కంపెనీలకు తీసుకెళ్తున్నారు. అక్కడ కంపెనీల ప్రతినిధులు వీటికి అసలు బీమా ఎలా వస్తుందని బాధితుల్ని ఎదురు ప్రశి్నస్తున్నారు. బీమా నిబంధనలతో ఆందోళన.. వాహనాలు వరద నీటిలో ఉన్నప్పుడే తాము చూడాలని, కడిగి తీసుకొస్తే బీమా క్లెయిమ్ చేయడం కుదరదని చెబుతుండడంతో వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. వాహనాలను చూసేందుకు సైతం కంపెనీల ప్రతినిధులు రావడంలేదు. 10–15 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. అప్పటివరకు ఆగలేమని చెబుతుండడంతో ఎంతోకొంత క్లెయిమ్ ఇస్తామని చెప్పి రూ.2 నుంచి రూ.5 వేల వరకూ నిర్థారించి పంపేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మీ వాహనం మునిగిందని గ్యారంటీ ఏమిటని చాలామందిని ప్రశ్నిస్తున్నారు. అలాగే, వరదలో బండి మునిగిన ఫొటోను అడుగుతుండడంతో బాధితులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే నరసింహారావు ఇంజన్, ఎలక్ట్రిక్ వైరింగ్, గేర్‌బాక్స్ ఇతర పరికరాలు పనికిరాకుండా పోవడంతో రిపేర్‌కు రూ.30 వేలు అవుతుందని షోరూమ్‌లో కొటేషన్ ఇచ్చారు. కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం వాహనాన్ని కడిగేసి తీసుకొచ్చారు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేసింది. అతను ప్రాథేయపడితే రూ.3 వేలు ఇవ్వడానికి ఒప్పుకుంది. మరోవైపు.. ఇలాంటి ద్విచక్ర వాహనాల్లో దాదాపు 70 శాతానికి పైగా ఇన్సూరెన్స్ లేదని చెబుతున్నారు. వారంతా సొంత డబ్బుతోనే వాహనాలను బాగుచేయించుకుంటున్నారు. ఆటోవాలాల పరిస్థితి దయనీయం.. ఇక పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు తీసుకెళ్లే ఆటోవాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వెంటనే ఆటో మరమ్మతు చేయించుకోకపోతే ఉన్న వ్యాపారం పోయి రోడ్డు మీద పడతామని గగ్గోలు పెడుతున్నారు. కంపెనీల వాళ్లు కనీసం 10 రోజుల సమయం అడుగుతుండడం, వేచి ఉన్నా నామమాత్రంగా ఎంతోకొంత ఇచ్చే పరిస్థితి ఉండడంతో దానిపై ఆశలు వదిలేసుకుని అప్పుచేసి ఆటోలను బాగు చేయించుకుంటున్నారు. -
విజయవాడలో వరద నష్టం అంచనాపై గందరగోళ పరిస్థితులు
-
అటు ఎండబెట్టి.. ఇటు ముంచేసి..
కృష్ణా వరద నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యమే విజయవాడతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జలప్రళయం సంభవించడానికి.. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందని జలవనరుల శాఖ అధికార వర్గాలు, సాగునీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను శ్రీశైలం ప్రాజెక్టులో నియంత్రించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు మళ్లించి.. గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదలచేసి ఫ్లడ్ కుషన్ ఉంచుకుని ఉంటే జలప్రళయం సంభవించే అవకాశమే ఉండేది కాదని వారు తేల్చిచెబుతున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి శుక్రవారం ఉ.6 గంటల వరకూ 1,016.19 టీఎంసీల ప్రవాహం వస్తే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 93.21 టీఎంసీలే మళ్లించారు. ఆ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం. నిజానికి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని 2019లో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో.. వరదల సమయంలో గరిష్ఠస్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఒడిసి పట్టి ఉంటే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు నిండి ఆ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని.. ప్రకాశం బ్యారేజీ దిగువన ముంపు ముప్పు తప్పేదని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టానికి జరిగేది కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 2019, 2020, 2021, 2022లలో కృష్ణా వరదను ప్రభుత్వం ఇదే రీతిలో నియంత్రించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. – ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి వరద నియంత్రణ చేసేది ఇలాగేనా..ూ కృష్ణా నది చరిత్రలో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009, సెపె్టంబరు 2న గరిష్ఠంగా 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అప్పట్లో ఈ వరదను సమర్థవంతంగా నియంత్రించడంవల్ల ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహాన్ని గరిష్ఠంగా 11.10 లక్షలకు పరిమితం చేశారు. » కృష్ణా బేసిన్లో ఈ ఆగస్టు 30, 31.. సెప్టెంబరు 1 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 28న 1,69,303 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. కానీ, ఆ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 30 వేల క్యూసెక్కులను మాత్రమే వదిలారు. ఆ తర్వాత శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగినా ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 30 వేల క్యూసెక్కుల చొప్పున.. సెప్టెంబరు 1న 26,042 క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తూ వచి్చన వరదను వచి్చనట్లు సాగర్, పులిచింతల ద్వారా దిగువకు వదిలేశారు. » దీంతో ప్రకాశం బ్యారేజీని కృష్ణా వరద ముంచెత్తింది. బ్యారేజీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సెపె్టంబరు 2న గరిష్ఠంగా 11,43,201 క్యూసెక్కుల వరద రావడానికి దారితీసింది. ఆ రోజున కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 16,417 క్యూసెక్కులు.. సెపె్టంబరు 3న 12 వేల క్యూసెక్కులు మాత్రమే మళ్లించారు. రాష్ట్ర ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణం.. » వరద నియంత్రణలో ప్రభుత్వ ఘోర వైఫల్యంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 647.16 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ప్రభుత్వం ముందుచూపుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లించి ఉంటే.. కడలిలో కలిసిన జలాల్లో కనీసం 100 టీఎంసీలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కి ఉండేవని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సీజన్లో ఏ ఒక్కరోజూ ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు.» ఇక హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలిస్తేనే 120 రోజుల్లో ప్రస్తుత డిజైన్ మేరకు 40 టీఎంసీలు రాయలసీమకు అందించవచ్చు. కానీ, ఇప్పటికి కేవలం 4.24 టీఎంసీలే తరలించారు. ఈ సీజన్లో గరిష్ఠంగా 1,688 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోశారు. » వరద రోజుల్లో మళ్లించిన జలాలను కృష్ణా బోర్డు కోటాలో కలిపేది కాదు.. దీనివల్ల రాష్ట్ర కోటా 512 టీఎంసీల కంటే అధికంగా వాడుకునే అవకాశం ఉండేది. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి దారితీసేది. » ఇక శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వాడుకోవాలి. కానీ, తెలంగాణ జెన్కో కంటే ఏపీ జెన్కో తక్కువ విద్యుదుత్పత్తి చేసింది. శ్రీశైలంలోకి ప్రవాహాలు ఇలా..» ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు » శ్రీశైలానికి వచ్చిన ప్రవాహం : 1,016.19 టీఎంసీలు » ఇందులో జూరాల నుంచి వచ్చింది : 797.68 టీఎంసీలు » సుంకేశుల నుంచి వచ్చింది : 217.51 టీఎంసీలు » హంద్రీ నుంచి వచ్చింది : 1.00 టీఎంసీశ్రీశైలం నుంచి విడుదల చేసింది ఇలా..ఆంధ్రప్రదేశ్..» పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ : 93.21 టీఎంసీలు » హంద్రీ–నీవా : 4.24 టీఎంసీలు »కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 101.45 టీఎంసీలుతెలంగాణ..» కల్వకుర్తి ఎత్తిపోతల : 9.91 టీఎంసీలు » ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 152.74 టీఎంసీలు » గేట్ల ద్వారా నదిలోకి విడుదల : 604.53 టీఎంసీలు -
నేను, నా ఇల్లు సేఫ్.. 4 లక్షల మందిని ముంచేసింది బాబేనా ?
-
ఎవరికోసం ఈ కృత్రిమ విపత్తు?
భోపాల్ దుర్ఘటనకు ఇప్పుడు సరిగ్గా నలభయ్యేళ్ల వయసు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. తమ నిర్లక్ష్యం కారణంగా లేదా చర్యల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్లడాన్ని నేర శిక్షాస్మృతి 'culpable homicide'గా పరిగణిస్తుంది. ఐపీసీ స్థానంలో ‘భారత న్యాయ సంహిత’ (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత, తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టం సెక్షన్ 106 కిందకు వస్తుందని చెబు తున్నారు. కారకులకు పదేళ్లు జైలు, జరిమానా కూడా ఉండ వచ్చు.ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఈ హక్కును ప్రాథమిక హక్కుగా (Article 21, Right to life) గుర్తించింది. దీన్ని ఉల్లంఘించే అధికారం ఏ వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదు. నిర్లక్ష్యం వల్లనో, ఉద్దేశ పూర్వకంగానో పౌరుల ప్రాణాలను బలిగొనే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. రెండు వారాల కింద విజయవాడ నగరం ఎదుర్కొన్న ఆకస్మిక వరదల కారణంగా డజన్లకొద్దీ ప్రాణాలు పోయాయి. మూడు లక్షల కుటుంబాలు తమ సమస్తాన్నీ కోల్పోయాయి. పదేళ్ల కష్టార్జితాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలామని ఆ కుటుంబాలు రోదిస్తున్నాయి.విజయవాడ ఆకస్మిక వరదలను ‘ప్రకృతి విపత్తు’ కోటాలో వేసేయలేము. వీటిని నివారించడానికి ఉన్న అవకాశాలను బాధ్యులైన వారు వినియోగించలేదు. బహుశా అందువల్లనే ఈ వరదలను ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’గా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అభివర్ణించారు. కచ్చితంగా ఈ విషాదం మానవ కల్పితమే! ఈ మానవ కల్పిత విషాదం వెనుక ప్రభుత్వ నిర్లక్షం ఉన్నది. పరిపాలనా వైఫల్యం ఉన్నది. పాలకుల దురుద్దేశం కూడా దాగున్నది. జరిగిన పరిణామాలను క్రమానుగతంగా పరిశీలిస్తే ఈ సంగతి ఎవరికైనా తేటతెల్లమవుతుంది.ఆగస్టు 28వ తేదీ బుధవారం నాడు భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) వారు ఒక నివేదికను విడుదల చేశారు. బంగా ళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర, ఒడిషాలపై ప్రభావం చూపబోతున్నదనే అంశం కూడా ఈ నివేదికలో ఉన్నది. వాతావరణ నివేదికల్లో తుపాను సంబంధిత హెచ్చరికలు వెలువడగానే తీరప్రాంత రాష్ట్రాలు తక్షణం స్పందించి సమీక్ష జరపడం రివాజు. పైగా గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తుపాను హెచ్చరికలపై స్పందన వేగంగా ఉండాలి. కానీ ప్రభుత్వ పెద్దలు గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.ఆ మరుసటిరోజు ఆగస్టు 29న ఐఎమ్‌డీ రెండో నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి శనివారం వరకు పడతాయని నివేదిక హెచ్చరించింది. ఐఎమ్డీతోపాటు ‘ఆంధ్ర ప్రదేశ్ వెదర్‌మ్యాన్’, ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ కూడా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తలైన ఈ యువకులు ‘వెదర్‌మ్యాన్’ పేరుతో అత్యంత కచ్చితత్వంతో కూడిన హెచ్చరికలు జారీచేస్తూ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్’ సాయి ప్రణీత్ 29న డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ నివేదికను విడుదల చేశారు. విజయనగరం నుంచి పల్నాడు జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ముఖ్యంగా శనివారం నాడు అతి భారీ వర్షా లుంటాయి కనుక పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించాలని పవన్ కల్యాణ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.వరుస హెచ్చరికలున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి కూర్చున్నది. రాజకీయ – అధికార ముఖ్యులందరూ వీకెండ్ మూడ్‌లోకి, చలో హైదరాబాద్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రిజర్వాయర్లలో ‘ఫ్లడ్ కుషన్’ మెయింటెయిన్ చేయలేదని జగన్మోహన్రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నట్టు నదుల్లో వరద నియంత్రణ చర్యలను యంత్రాంగం గాలికి వదిలేసింది. భారీ వర్ష సూచనలున్నప్పుడు నిండుగా ఉన్న రిజర్వాయర్ల నీటిని కొంత మేరకు దిగువకు విడుదల చేసి వచ్చే వరద ప్రవాహానికి కొంత కుషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రోటోకాల్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయి వరద చేరి పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దీని ప్రభావం బుడమేరు మీద, రాజ ధాని ప్రాంతం మీద కూడా పడింది.బుడమేరు అనే వాగుకు ఎప్పటినుంచో ‘బెజవాడ దుఃఖ దాయని’ అనే పేరున్నది. విజయవాడకు ఉత్తర దిక్కున ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ వాగు దక్షిణా భిముఖంగా ప్రవహించి, నగరానికి వాయవ్య దిక్కున ఉన్న వెలగలేరు అనేచోట తూర్పు వైపు తిరిగి, పలు వంపులు తిరు గుతూ నగరం మీదుగా కొల్లేరు దాకా పారుతుంది. విజయ వాడకు వరద ముప్పును నియంత్రించడం కోసం వెలగలేరు మలుపు దగ్గర బుడమేరుపై గేట్లు బిగించారు. వరద ప్రవాహాన్ని దక్షిణం వైపు మళ్లిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి పారేలా ‘బుడమేరు డైవర్షన్ కెనాల్’ (బీడీసీ) ఏర్పాటు చేశారు. దిగువన ఇబ్రహీంపట్నం దగ్గరున్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఏర్పాటైన కూలింగ్ కెనాల్‌తోనే ఈ బీడీసీని అనుసంధానించారు. పోలవరం కుడికాల్వను కూడా వెలగలేరు వద్ద బీడీసీతో కలిపేశారు. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసె క్కులని చెబుతారు. కానీ అంతకుముందే అక్కడ వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌పై చంద్రబాబు ఓ యెల్లో మీడియా ప్రముఖునికి ఇచ్చిన పవర్ ప్లాంట్ కారణంగా ఐదు వేల క్యూసెక్కులకు మించి అక్కడ ప్రవహించే అవకాశం లేదని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. బుడమేరు వరదెత్తిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ఆ ప్రవాహాన్ని బీడీసీలోకి మళ్లిస్తే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది. ఆ గరిష్ఠ స్థాయి మళ్లింపునకు అడ్డుగా ఉన్న పవర్ ప్లాంట్‌ను తొలగించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా కోర్టు›స్టేల వల్ల సాధ్యం కాలేదు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో 45 వేల క్యూసెక్కుల వరద రాబోతున్నదని శనివారం మధ్యా హ్నానికి ముందే స్థానిక ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బుడ మేరు రెగ్యులేటర్ డీఈ మాధవనాయక్ ‘సాక్షి’ టీవీతో ఆన్ రికార్డు ఈ విషయాన్ని నిర్ధారించారు. బీడీఎస్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులే కనుక అనివార్యంగా బుడమేరు గేట్లను శని వారం సాయంత్రానికల్లా ఎత్తవలసి ఉంటుందని కూడా వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘పైస్థాయి’ వారు వెంటనేస్పందించి గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకొని ఉంటే విజయ వాడలోని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను తరలించడానికి సరిపోయే సమయం ఉండేది. రాబోతున్న వరదను గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉండేది. ప్రొటో కాల్ ప్రకారం గేట్లు ఎత్తడానికి పన్నెండు గంటల ముందు ప్రజ లను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరికలు వెలువడి నప్పుడే ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం జరిపి నిర్ణయాలు తీసు కోవాలి. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్ర బాబు కరకట్ట నివాసంలోకి కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్‌లోకి తన బసను మార్చుకున్నారు. అప్పటికే బుడమేరు పరిస్థితి భయానకంగా ఉన్నట్లు సమాచారం ఉన్నది. ఆ సమ యంలో తీరిగ్గా మూడు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసు కున్నారో ఎవరికీ తెలియదు. ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు. ప్రజలకు హెచ్చరి కలు జారీ కాలేదు. వారిని తరలించే ప్రయత్నాలూ జరగలేదు.మూడు లక్షలమందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒక రోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసనీ, కానీ రెండు లక్షల కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదు కనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంత కంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంత కన్నా బాధ్యతా రాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం! ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలి పెట్టడం! ఇది కేవలం ఆ ఉన్నతాధికారి నిర్ణయం మాత్రమే అను కోలేము కదా! అత్యున్నత స్థాయి నిర్ణయాన్నే ఆయన వెల్లడించి ఉంటారు కదా!హెచ్చరికలు లేకుండా, ఏర్పాట్లు లేకుండా బుడమేరు గేట్లెత్తి లక్షలాదిమందిని వరదపాలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులేమిటి? శనివారం మధ్యా హ్నానికే ప్రకాశం బ్యారేజీలోకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుకున్నది. కరకట్ట మొదటి అంతస్తుల్లోకి ప్రవేశించింది. బ్యారేజీ దగ్గర కృష్ణానది బెడ్ లెవెల్ సముద్ర మట్టానికి 11.24 మీటర్లు. రాజధాని ప్రాంతం గుండా పారే కొండవీటి వాగు ఉండవల్లి దగ్గరున్న కృష్ణానది తూము ద్వారా నదిలో కలుస్తుంది. అక్కడ దాని బెడ్ లెవెల్ 11 మీటర్లు. ఐదారు లక్షల క్యూసెక్కుల ప్రవాహం గనుక బ్యారేజీ దగ్గర ఉన్నట్లయితే కొండవీడు వాగు కృష్ణలో కలవడానికి బదులు కృష్ణ నీళ్లు వాగు లోకి ఎగదన్నుతాయి. కొండవీడు వాగు మోసుకొచ్చే వరదను రాజధాని ప్రాంతంలో నియంత్రించడం కోసం ఒక లిఫ్టును ఏర్పాటు చేశారు. దాని సామర్థ్యం ఐదువేల క్యూసెక్కులు మాత్రమే. కృష్ణాలో ప్రవాహం పెరిగి వాగులోకి ఎగదన్నడం ఎక్కువైతే అమరావతి డ్రీమ్ ప్రాజెక్టుకు కోలుకోలేని డ్యామేజ్ అవుతుంది. బ్యారేజీలో కొంచెం ఎగువన నదికి మరోవైపున బుడమేరు డైవర్షన్ కెనాల్ కృష్ణానదిలో కలుస్తున్నది. ఈ బుడ మేరు నీళ్లనే కృష్ణలో కలిపి కృష్ణా–గోదావరి నదుల అనుసంధా నాన్ని పూర్తి చేశానని గతంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీనికే ఆయన ‘పవిత్ర సంగమం’ అనే నామకరణం చేశారు.ఇక్కడ కృష్ణానది, బుడమేరు కాలువల బెడ్‌లెవెల్ సమానంగా ఉంటుంది. ఫలితంగా కృష్ణా ప్రవాహం వేగంగా కాల్వ లోకి ఎగదన్నడం మొదలైంది. మరోపక్క బుడమేరు గేట్లు మూసి ఉన్నందువలన వరద మొత్తం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణ వైపు పరుగెత్తుతున్నది. పవర్ ప్లాంట్ కారణంగా ఇరుకైన కాలువ తట్టుకోలేక గట్టుకు గండ్లు పడి కృష్ణా జలాలు పడమటి దిక్కు నుంచి విజయవాడ వైపు మళ్లాయి. శనివారం రాత్రి పడిన ఈ గండ్లనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూడ్చలేకపోయిందని అధికార పార్టీ ప్రచారంలో పెట్టింది. గేట్లు ఎత్తితే బుడమేరు వరద ఎదురు రాకుండా కృష్ణా వరద స్వేచ్ఛగా ఎగదన్నడం వలన బ్యారేజీ నీటిమట్టం ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రించవచ్చనే ఆలోచన కూడా కారణం కావచ్చు. రాత్రి పూట చెప్పాపెట్టకుండా గేట్లు ఎత్తేశారు. బుడమేరు వరద బెజవాడపై ఉత్తరం దిక్కు నుంచి విరుచుకుపడింది.శనివారం మధ్యాహ్నానికే నిర్ణయం తీసుకొని, చాటింపు వేయించి ప్రజలను తరలించి ఉన్నట్లయితే పెను ఉత్పాతం నివారించడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సన్నద్ధంగా లేదు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కిమ్మనాస్తిగా స్తంభించిపోయింది. పెద్దల ఆయువుపట్టుకే దెబ్బ తగలబోతోందన్న ఆలోచన రాగానే విజయవాడను బలిపెట్టడా నికి సిద్ధమైనట్టుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ ఘోరవైఫల్యం, దూరదృష్టి లేకపోవడం, పాలనా యంత్రాంగ నిస్తేజం, ఆపైన పెద్దల సొంత ప్రయోజనాలు... వెరసి విజయవాడ వీధుల్లో కన్నీటి కెరటాలు ఎగసిపడ్డాయి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారం రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు పడినపాట్లు అన్నీ ఇన్నీ కావు. విష్ణుమూర్తి అవతారాల మాదిరిగా కొన్నిసార్లు పడవల మీద, కొన్నిసార్లు బుల్డోజర్లపై, మరికొన్ని సార్లు కాలినడకన ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి ప్రజ లకు అభివాదాలు చేస్తూ కనిపించారు. వర్షంలోనే గండ్లు పూడ్చుతూ కనిపించే మంత్రుల ఫొటోలు, వీడియోలు దర్శన మిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోల్లో, డ్రోన్ల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించి నట్టుగా వైఫల్యాల సుడిలో కొట్టుమిట్టాడుతున్న సర్కార్‌కు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లు కనిపించాయి. ఈ బోట్లను వైసీపీ వాళ్లే ప్రయోగించారనీ, ఈ బోట్ల కారణంగానే బెజవాడ మునిగిందనే డైవర్షన్ స్కీమును ముందుకు తెచ్చారు. బురదను కడుక్కోవాలి కనుక అవతలి పక్షం వారు కూడా బోట్లు టీడీపీ వారివేననే సాక్ష్యాలను ముందుకు తెచ్చారు. ఈ బోట్ల కాట్లాట నడుమ అసలైన కారణాలను మరుగున పడేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. వారి లక్ష్యం ఏదైనా కావచ్చు, ప్రజల ప్రాణాలను బలిగొనే నేరపూరిత నిర్లక్ష్యాలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. ప్రభుత్వాల చేతగానితనాన్ని సహించడం కూడా క్షేమం కాదు. జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు కావాలి. ఈ విషాదానికి కేవలం నిర్లక్ష్యం, చేతగాని తనాలే కారణాలా? మరేదైనా లోతైన కారణం ఉన్నదా అనే కోణంలో విచారణ జరగాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బాధ్యత మరచిన మంత్రి అనగాని.. ఫారిన్లో ఎంజాయ్!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విజయవాడ ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. విజయవాడ జల దిగ్బంధం కావడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ వారం రోజుల పాటు వరద నీటిలోనే కాలం వెళ్లదీశారు. ఇక, వరద బాధితులను పట్టించుకోవడంతో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది.మరోవైపు.. ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి నేతలు, మంత్రులు మాత్రం ఫారిన్ టూర్, హైదరాబాద్ టూర్లలో బిజీ ఉన్నారు. అయితే, విజయవాడలో వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావని అనుకుంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ వెళ్లారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈమేరకు వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్. బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన చేస్తున్నారని కామెంట్స్ చేసింది. వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన @JaiTDP మంత్రి అనగాని సత్యప్రసాద్ విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్ బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన#BabuMadeDisaster#VijayawadaFloods… pic.twitter.com/FgIDbkmKwA— YSR Congress Party (@YSRCParty) September 14, 2024 ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
విజయవాడలో తీరని నష్టం మిగిల్చిన వరదలు..
-
కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ మిగలలేదు..