Vimal
-
పుష్ప-2 మూవీ వీక్షించిన దర్శకధీరుడు.. ఏ థియేటర్లో చూశాడంటే?
డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల వసూళ్లతో సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ ఊపు చూస్తుంటే ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించేలా కనిపిస్తోంది. మరోవైపు నార్త్‌లోనూ పుష్ప-2 హవా కొనసాగుతోంది. తొలి రోజు నుంచే హిందీలో వరుస రికార్డులతో దూసుకెళ్తోంది పుష్ప-2. కేవలం హిందీలోనే నాలుగు రోజుల్లో రూ.339 నెట్ వసూళ్లు సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ సృష్టిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లిన సినిమా నుంచి బయటికి వస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తే బాలనగర్‌లోని విమల్ థియేటర్లో పుష్ప-2 వీక్షించినట్లు తెలుస్తోంది.కాగా.. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అమెజాన్ అడవులో నేపథ్యంలో అడ్వంచర్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధ కాగా.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ మూవీ కోసం ఇప్పటికే లోకేషన్స్ వేటలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. Director rajamouli sir watched #Pushpa2 🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/qlzzp8IEHn— AlluBabloo Mithun (@allubabloo18) December 9, 2024 -
అప్పుడు హీరో చెల్లెలు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్.. ఎవరంటే? (ఫొటోలు)
-
విలేకరిగా మారిన హీరో విమల్
సాక్షి, చెన్నై: నటుడు విమల్ విలేకరి అవతారమెత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుడిక్కుమ్ కరంగళ్’. ముంబై బ్యూటీ మనీషా నాయికగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈమె ఇంతకుముందు తెలుగులో రెండుచిత్రాలు, కన్నడంలో ఒక చిత్రం చేశారు. ఒడియన్ టాకీస్ పతాకంపై కె.అన్నాదురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేలుదాస్ దర్శకత్వంతో పాటు సహ నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద 23 ఏళ్లు పని చేసిన ఆయన సోదరుడి కొడుకు రాఘవ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్మీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటుడు విమల్ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూ విలేకరిగా బాధ్యతలను నిర్వహిస్తారన్నారు. ఈ షూటింగ్‌ను చెన్నైలో 45 రోజుల్లో పూర్తి చేశామన్నారు. -
మధుమేహులకు వర్షిత తీపికబురు!
డయాబెటిస్ రోగికి రోజూ వేలికి సూది గుచ్చుకుని మరీ పరీక్ష చేస్తేగానీ... రక్తంలో చక్కెర మోతాదు ఎంత ఉందో తెలియదు. మరి అలాంటి అవసరమే లేకుండా దేహంలో షుగర్ ఎంత ఉందో చటుక్కున తెలిసిపోతే ఎంత బాగుంటుంది? క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాల్సి రావడం వల్ల నెలకు నాలుగైదు వేలు ఖర్చు తప్పదు. కానీ ఇలా రోజూ పరీక్షలు చేయిస్తున్నా సరే... నాలుగేళ్లు గడిచాక కూడా ఆ వ్యయం... నెల ఖర్చుకు మించకపోతే ఇంకెంత బాగుంటుంది? చక్కెర జబ్బు అంటూ పేరులో మాత్రమే తీపి ఉన్న డయాబెటిస్ అనే ఈ సమస్య రోజూ చేసుకోవాల్సిన చిన్నపాటి గాయాలతోనూ, వ్యయాలతోనూ చాలా బాధిస్తుంటుంది. కానీ ఇకపై అలాంటి బాధలేవీ లేకుండానే... మొబైల్సహాయంతోనే చక్కెర మోతాదును తెలుసుకునే యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది దువ్వూరు వర్షిత. ఆ ప్రయత్నానికి సాంకేతికంగా సహాయపడ్డాడు విమల్ అనే ఇంజినీర్. కాలం కలిసొస్తే ఎలాంటి గుచ్చుకోవడాలు లేకుండా మన మొబైల్లోనే గ్లూకోమీటర్ రూపొంది... దాని సహాయంతో చక్కెర మోతాదులు చాలా తేలిగ్గా తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనీ, మహా అయితే మరో ఆర్నెల్లు లేదా ఏడాది లోపే ఇది అందుబాటులోకి రావచ్చంటున్నారు 20 ఏళ్ల వర్షిత, యువ ఇంజనీర్ విమల్ కుమార్ లు. వారిరువురూ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పిన విషయాలు డయాబెటిస్తో బాధపడుతున్న ఎందరికో తీపికబురు కాబోతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. ‘‘నా పేరు దువ్వూరు వర్షిత. మాది నెల్లూరు. పుట్టినప్పట్నుంచే టైప్–1 డయాబెటిస్ తో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఒకేరోజు నాలుగైదుసార్లు సూదితో వేలిని గుచ్చుకుని చక్కెరను పరీక్షించుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి పరీక్ష కోసం పెట్టే ఖర్చు రూ. 40 వరకు అయ్యేది. అంటే ఒక్కరోజుకు రూ. 160 అన్నమాట. అలా చూస్తే నెలలో కేవలం వైద్యపరీక్ష కోసమే ఐదువేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చేది. చిన్నప్పుడు పెద్దగా బాధ తెలియకపోయినా పెరుగుతున్న కొద్దీ వేదన మరింత ఎక్కువైంది. రోజులో ఇన్నిసార్లు పరీక్షల కోసం పెట్టే ఖర్చే కాకుండా... ఇక మందులు, ఇన్సులిన్ లాంటివాటికి ఎంతవుతుందో ఊహించవచ్చు. ఓ సగటు మధ్యతరగతి వారికి ఇది ఎంత పెద్ద మొత్తమో ఎవరికైనా తెలిసే విషయమే. ఎప్పటికైనా నాలాంటివాళ్లకోసం ఏదైనా చేస్తానంటూ పదేళ్ల వయసప్పుడే నాన్న దగ్గర ఓ సంకల్పం తీసుకున్నా. అందుకే ఐఐటీకి క్వాలిఫై అయి, అందులో చేరాక కూడా బయోటెక్నాలజీపై ఆసక్తితో బయటకి వచ్చి చెన్నైలో ఆ కోర్సులో చేరాను. కోయంబత్తూరులో 2019లో ఓ హ్యాకాథాన్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై తమ తమ భావాలు, ఆలోచనలు పంచుకునే సదస్సు) నిర్వహించారు. అక్కడ పరిచయమయ్యారు తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన విమల్‌కుమార్ అనే యువ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈ హ్యాకాథాన్లో నా ఆలోచనలను వివరించా. తన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సామర్థ్యంతో నా ఐడియాలను సాకారం చేయవచ్చని విమల్‌తో మాట్లాడినప్పుడు తెలిసింది. అంతే... మేమిద్దరమూ కలిసి మా ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభించాం. ఇందుకోసం రూపొందించిన గ్లూకోమీటర్ కూడా చాలా సింపుల్‌గా పనిచేస్తుంది. నిజానికి ఇదో చిన్న పెన్ డ్రైవ్ తరహాలో ఉండే పరికరం. దీన్ని మన మొబైల్‌కి జతచేయాలి. అక్కడ మన వేలిని ఉంచితే చాలు... ఎలాంటి సూదిగాయాలూ, నొప్పి లేకుండానే మన రక్తంలోని చక్కెర మోతాదులు తెలిసిపోతాయి’’ అంటూ తమ ప్రాజెక్టు గురించి వివరించింది వర్షిత. ‘‘ఇది వన్ టైమ్ ఎక్స్పెన్స్ ఎక్విప్మెంట్. అంటే ఒక్కసారి కొంటే చాలు ఎప్పటికీ వాడుకునేలా రూపొందించిన డివైస్ ఇది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్) అనే సాంకేతికత సహాయంతో ఎలాంటి గాటూ లేకుండానే మన దేహంలోని చక్కెరను అంచనా వేస్తుంది ‘ఈజీ లైఫ్’ అనే పేరున్న ఈ పరికరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చక్కెర విలువలను విశ్లేషించడం వల్ల నిమిషంలోపే షుగర్ రీడింగ్స్ మనకు తెలిసిపోతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అంటూ వివరించారు విమల్. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో వర్షిత, విమల్‌ల ఈ ‘స్టార్ట్ అప్’ ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు ‘ఎమ్పవర్–2021’ పేరిట గతేడాది నిర్వహించిన ‘వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్’లో రన్నరప్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు... ‘ఎన్ఐటీటీఈ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్’ హ్యాకథాన్‌తో పాటు మరికొన్ని సదస్సుల్లోనూ వీరి ఆవిష్కరణ అనేక బహుమతులను గెలుచుకుంది. గతంలో దుబాయిలో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించిన ఓ సదస్సులో దాదాపు 42 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. ‘టై ఉమన్ గ్లోబల్ పిచ్–2021 హైదరాబాద్ చాప్టర్’ ప్రాజెక్టును ప్రోత్సహించి... వర్షితను ఆ సదస్సు కు పంపినప్పుడు అక్కడ కూడా ఆమె ప్రాజెక్టుకు మంచి ప్రశంసలు దొరికాయి. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన గ్రేలాజిక్ టెక్నాలజీస్ అండ్ ఎడిఫై పాత్ సంస్థల డైరెక్టర్ వర్ల భానుప్రకాశ్‌రెడ్డి... ఈ ప్రాజెక్టుకు మెంటార్‌గా, ప్రమోటర్‌గా వర్షిత, విమల్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పరిశోధనలో పాలు పంచుకునేలా అనేక ఇతర సంస్థలను సైతం వీరి ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్న ఈ ప్రాజెక్టుకు ‘వివాలైఫ్’ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ల పరిశోధనలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా నిలిచింది. -
నటులు విమల్, సూరిలపై కేసు నమోదు
పెరంబూరు: ఎంత పని చేశావే కరోనా అని నటుడు విమల్, సూరి తలపట్టుకుంటున్న పరిస్థితి. ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయినట్టుంది ఈ ఇద్దరు నటుల పరిస్థితి. నటుడు విమల్, హాస్య నటుడు సూరి కరోనా కాలంలో ఇంట్లో కూర్చుని ఏమీ తోచక ఈ ఇద్దరూ కలిసి ఇటీవల కోడైకెనాల్‌కు జాలీ ట్రిప్ వేశారు. వెళితే వెళ్లారు లాక్డౌన్ నిబంధనలను పాఠించారా అంటే అదీ లేదు ఈ పాస్ లాంటివి తీసుకోకుండా అదీ కొడైకెనాల్లోని నిషేధిత ప్రాతానికి వెళ్లారు. అక్కడ ఒక కొలనులో చేపలను పట్టి సరదా తీర్చుకున్నారు. అయితే ఈ నటుల ఎంట్రీ గురించి సమాచారం అందిన అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి నాలుగు చివాట్లు పెట్టడంతో పాటు అపరాధం కూడా విధించారు. పోన్లే అపరాధమే కదా అని అదేదో కట్టేసి వచ్చేశారు ఈ నట ద్వయం. అయితే కథ అక్కడితే ఆగలేదు. తాజాగా కొడైకెనాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలను పాటించకుండా, ఈ పాస్ పొందకుండా ప్రయాణం చేసిన నేరం కింద నటుడు విమల్, సూరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు. ముందుగా కొడైకెనల్‌కు వచ్చిన వీరికి సహకరించింది ఎవరు, కార్లను సరపరా చేసింది ఎవర్నది విచారించారు. దీంతో కొడైకెనల్‌కు చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తి విమల్, సూరి అక్కడ పర్యటించడానికి కారును, జీప్‌ను, బస చేయడానికి వస తి ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీంతో కారును, జీప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు విమల్, సూరితో పాటు ఖాదర్‌బాషాపైనా కేసు నమోదు చేశారు. -
లండన్ పోలీసులకు చిక్కిన శ్రియ
చెన్నై : నటి శ్రియ లండన్ పోలీసుల చేతిలో చిక్కి షాక్‌కు గురైంది. ఈ బ్యూటీ కథానాయకిగా బిజీగా నటిస్తూనే గత ఏడాది చాలా గోప్యంగా రష్యాకు చెందిన తన బ్యాయ్ఫ్రెండ్ ఆండ్రి కోస్కిన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నటనకు కొద్ది కాలం దూరంగా ఉంది. అలాంటిది ప్రస్తుతం తమిళంలో సండైక్కారి అనే చిత్రంలో నటిస్తోంది. వివాహానంతరం ఈ బ్యూటీ నటిస్తున్న దక్షిణాది చిత్రం ఇదొక్కటేనన్నది గమనార్హం. నటుడు విమల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాస్ ప్రొడక్షన్స్ కార్పొరేషన్ అండ్ మెట్రో నెట్ మలీ్టమీడియా సంస్థల సమర్పణలో జే.జయకుమార్ నిర్మిస్తున్నారు. ఆర్.మాదేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి శ్రియ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది. విమల్ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్‌గా నటిస్తున్నాడు. కాగా సండైక్కారి చిత్ర షూటింగ్ ఇటీవల లండన్‌లో నిర్వహించారు. ఆ వివరాలను దర్శకుడు తెలుపుతూ లండన్‌లోని అతి పెద్ద విమానాశ్రయం స్టెన్పోర్టులో విమల్, శ్రియ, సత్యన్ నటించిన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగిందన్నారు. నటి శ్రియ తెలియకుండా విమానాశ్రయంలోని భద్రతా ప్రాంత సరిహద్దులను దాటి వెళ్లిందన్నారు. దీంతో లండన్ భద్రతాధికారులు ఆమెను చుట్టి ముట్టి అనధికారికంగా ఈ ప్రాంతంలోకి ఎలా వస్తావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారన్నారు. దీంతో బిత్తరపోవడం శ్రియ వంతైందన్నారు. దీంతో సమస్య జఠిలం అవుతుందని గ్రహించిన ఆ ప్రాంతానికి కాస్త దూరంగా ఉన్న నటుడు విమల్ వెంటనే అక్కడికి వెళ్లి తగిన ఆధారాలు చూపి పరిస్థితిని వివరించారన్నారు. దీంతో పోలీసులు శ్రియను చిరునవ్వులో వదిలిపెట్టినట్లు చెప్పారు. కాగా ఇందులో నటుడు ప్రభు, కేఆర్.విజయ, రేఖ, ఉమా పధ్మనాభన్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా మగ«దీర చిత్రం ఫేమ్ దేవేందర్ సింగ్గిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రీష్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ
చెన్నై : దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగిన నటి శ్రియ. ముఖ్యంగా కోలీవుడ్‌లో యువ నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ వరకూ జత కట్టేసిన ఈ ఉత్తరాది భామకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. అలా అనడం కంటే శింబుకు జంటగా నటించిన అన్భానవన్ అసరాధవన్ అడంగాదవన్ చిత్రం తరువాత శ్రియకిక్కడ అవకాశాలు రాలేదు. అంతే కాదు టాలీవుడ్‌లోనూ అవకాశాలు లేవు. అయితే ఇటీవల సైలెంట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ సినిమాలకు దూరం అయ్యిందనే టాక్ వినిపోస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం శ్రియ తలుపుతట్టింది. సైలెంట్‌గా నటుడు విమల్‌తో నటించేస్తోంది కూడా. నటుడు విమల్‌కు ఇప్పుడు ఒక సక్సెస్ అవసరం. ఇటీవల అతడు నటించిన ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం తనను హీరోగా నిలబెట్టిన కలవాని చిత్ర సీక్వెల్లో నటించాడు. సర్గుణం తెరకెక్కించిన ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఇటీవల వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొన్న నటుడు విమల్ తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సండకారి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆర్.మాదేశ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి శ్రియ ఆయనకు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు పూర్తిగా వెల్లడించకపోయినా, షూటింగ్ తొలి షెడ్యూల్‌ను సైలెంట్‌గా లండన్‌లో పూర్తి చేశారని తెలిసింది. రెండవ షెడ్యూల్‌ను రూరల్ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మావీరన్, సుర చిత్రాల ఫేమ్ దేవ్‌గిల్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇకపోతే నటి శ్రియ విమల్‌కు బాస్‌గా నటిస్తోందని తెలిసింది. మొత్తం మీద సండైక్కారి చిత్రంతో ఆ అమ్మడి రీఎంట్రీ అలా మొదలైందన్నమాట. -
నటుడి కోసం పోలీసుల వేట..
పెరంబూరు: నటుడు విమల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల నటుడు విమల్ రాత్రివేళ స్థానిక విరుగంబాక్కమ్కు చెందిన అభిషేక్ అనే వర్ధమాన నటుడిపై మద్యం మత్తులో తన అనుచరులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అభిషేక్ విరుగంబాక్కమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విమల్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విమల్‌ను విచారించడానికి సిద్ధమయ్యారు. బుధవారం అతని ఇంటికి వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు రావలసిందిగా పిలిచారు. దీంతో మీరు వెళ్లండి, తాను వస్తాను అని చెప్పినట్లు సమాచారం. అయితే విమల్ చెప్పినట్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడ్డ విమల్ పరారయ్యాడు. అతని సెల్‌ఫోన్ కూడా స్విచాప్ చేయబడింది. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. విమల్ నటిస్తున్న చిత్రాల షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అని విచారిస్తున్నారు.అదే విధంగా నటడు అభిషేక్‌పై దాడి జరిగిన ఇంటి సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
మద్యం మత్తులో నటుడు రచ్చ..
తమిళనాడు, పెరంబూరు: నటుడు విమల్ మద్యం మత్తులో రగడ చేశాడు. తన అనుచరులతో కలిసి మరో నవ నటుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆ నటుడు విమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూర్‌కు చెందిన అభిషేక్ అనే వర్థమాన నటుడు స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తున్నాడు. ఇతను అవన్ ఇవళ్ ఆదు అనే చిత్రంలో నటించాడు. కాగా శనివారం రాత్రి అభిషేక్ తను నివశిస్తున్న అపార్ట్మెంట్ పైభాగంలో ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. ఆ సమయంలో నటుడు విమల్ నలుగురు అనుచరులతో అక్కడికి వచ్చి కాసేపు ఇక్కోడ కూర్చోవచ్చా అని అభిషేక్‌ను అడిగాడు. అందుకు అతను తాను ఇంటి ఓనర్‌ను కాదనీ, కాబట్టి తాను బాధ్యుడిని కాదనీ బదులిచ్చాడు. దీంతో విమల్ గొడవకు దిగాడు. విమల్ మద్యం మైకంలో ఉన్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. విమల్ తన అనుచరులతో కలిసి అభిషేక్‌పై దాడి చేశారు. దీంతో గాయాల పాలైన అభిషేక్ స్థానిక వడపళనిలోని ఒక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. అనంతరం విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో విమల్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హీరోను నిజంగానే కొట్టేశాను..
సినిమా: మగ మిత్రులు తనతో సరదాగా మాట్లాడడానికే భయపడుతున్నారని నటి పూర్ణ అంటోంది. ఈ మలయాళీ భామ మాత్రభాషతో పాటు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అయితే కథానాయకి పాత్రల్లోనే నటిస్తానని బెట్టు చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించడానికి సిద్దం అనడంతో కాళీ లేకుండా నటించేస్తోంది. ప్రస్తుతం విమల్ హీరోగా నటిస్తున్న ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రంలో పోలీస్అధికారిణిగా మాస్ పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా పలు విషయాలను ముచ్చటించింది. అవేమిటో చూద్దాం. ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రం. ఇందులో రౌడీ పోలీస్అధికారిణిగా కనిపిస్తాను. హీరో విమల్‌ను, సింగంపులిని తరిమి తరిమి కొట్టడమే నా పని. అలాంటి సన్నివేశాల్లో చాలాసార్లు వారిని నిజంగానే కొట్టేశాను. దీంతో పాటు బ్లూవేల్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. అందులో ఒకటి పోలీస్ పాత్ర కావడం విశేషం. అయితే ఆ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. అదేవిధంగా మమ్ముట్టితో కలిసి మధురవీరన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే ఒక తెలుగు చిత్రం చేస్తున్నాను. అందులో నటి జయప్రదకు తల్లిగా, కూతురిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నాతో పాటు నటించడానికి వచ్చిన సహ నటీమణులు ఇప్పుడు ఫీల్డ్‌లో లేరు. నేను ఇంకా నటిగా కొనసాగడం సంతోషంగా ఉంది. ఇందుకు కారణం తమిళ ప్రేక్షకుల ఆదరణే. నటనకు అవకాశం ఉన్న పాత్రలే నన్ను వెతుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా సంతోషమే. ఇకపోతే నా శరీరాకృతికి గ్లామర్ సెట్ అవ్వదు. అదేవిధంగా ఇలానే నటించాలన్న నిబంధనలేమీ లేవు. నేనొక క్లాసికల్ డాన్సర్‌ని. చాలా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చాను. ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రం కోసం గుండు కొట్టించుకోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఈ విషయంలో స్వామికి జుత్తు సమర్పించినట్లుగా నేను భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే నాకు బాయ్ కట్ హెయిర్‌స్టైల్‌లో చూసుకోవాలన్నది చాలా కాలంగా ఉన్న కోరిక. గుండు కొట్టించుకోవడంతోనే అది సాధ్యం అయ్యింది. ఇప్పుడు మీటూ కలకలం సృష్టిస్తోంది. అయితే మీటూ వ్యవహారానికి నేను మద్దతు పలకను. ఎందుకంటే ఏదైనా ఒక విషయం జరిగితే వెంటనే రియాక్ట్ కావాలి. అంతే కానీ, నెల తరువాత స్పందిస్తే వృథానే. అదే విధంగా మీటూ కారణంగా నా సన్నిహిత మగ మిత్రులు కూడా సరదాగా మాట్లాడడానికి భయపడుతున్నారు. షూటింగ్ స్పాట్లో జాలీగా మాట్లాడుకునే కాలం కొండెక్కింది. ఇది మనల్ని మనమే అసహ్యించుకునే చర్యగా భావిస్తున్నాను. -
‘గ్లామర్ ఏ మాత్రం తగ్గదు’
సంతానంకు జంటగా, వల్లవనుక్కు పుల్లుం ఆయుధం, ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో పాపులర్ అయిన నటి ఆశ్నా జవేరి. గతంలో మోడలింగ్ రంగంలో దుమ్మురేపిన ఆశ్నాజవేరి 2014లో కోలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేసింది చాలా తక్కువ సినిమాలే. అందుకు కారణం అవకాశాలు రాకపోవడమే. నాలుగేళ్లు దాటినా పెద్ద హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం రాకపోవడం, స్టార్ హీరోయిన్ ఇమేజ్ పొందలేకపోవడంతో ఇక లాభం లేదు అనుకుందో ఏమో అందాలారబోతకు గేట్లు తెరిచేసింది. తాజాగా విమల్‌తో రొమాన్స్ చేస్తున్న ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రంలో గ్లామర్‌లో విచ్చలవిడిగా నటించేసిందట. ఈ విషయాన్ని ఆశ్నాజవేరినే చెప్పింది. తెలుగు చిత్రం గుంటూర్ టాకీస్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన ఈ బ్యూటీతో చిన్న భేటీ. ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రంలో అందాలారబోతకు గేట్లు తెరిచేశారట? ఈ చిత్రంలో తొలిసారిగా గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. అవును ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం పూర్తిగా గ్లామరస్ కథా చిత్రం. ఇది తెలుగు చిత్రం గుంటూర్ టాకీస్‌కు రీమేక్. ఆ చిత్రం మాదిరిగానే ఇందులోనూ గ్లామర్ ఏమాత్రం తగ్గదు. ఇక కథ డిమాండ్ మేరకే నేనూ గ్లామరస్‌గా నటించాను. అయితే దీన్ని ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్రంతో పోల్చకూడదు.ఆ చిత్రాన్ని నేను చూడకపోయినా, కచ్చితంగా ఇది అలా ఉండదు. ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం రొమాంటిక్ కామెడీ కథా చిత్రంగా ఉంటుంది. నటుడు విమల్‌కు జంటగా నటించడం గురించి? విమల్‌కు జంటగా నటించడం చాలా సంతోషకరమైన అనుభవం. ఆయన జాలీ టైపే అయినా, చాలా నిరాడంబరంగా ఉంటారు. విమల్‌తో మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను. కోలీవుడ్‌లో మీ తొలి చిత్ర హీరో సంతానం గురించి? సంతానం ద్వారానే నేను కోలీవుడ్‌లో పాపులర్ అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ఆశ పడుతున్నాను. అదే విధంగా విజయ్, అజిత్, సూర్య ప్రముఖ హీరోల సరసన నటించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు? నిజం చెప్పాలంటే నాకు పలాన పాత్రలో నటించాలని ఏమీ లేదు. కథకు, పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుని నటిస్తాను. తమిళం మినహా ఇతర భాషల్లో అవకాశాలేమైనా? తెలుగులో ఒక చిత్రం చేస్తున్నాను. అయితే తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేయాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. -
ఆయనకు ఎక్కడో మచ్చ ఉంది
తమిళసినిమా: నటుడు విమల్‌కు ఎక్కడో మచ్చ ఉంది. ఏమిటీ అర్థం కావడం లేదా. విమల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు (ఇతనికి ఎక్కడో మచ్చ ఉంది) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆయనకు జంటగా ఆషా జవేరి నటిస్తోంది. ఏఆర్.ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి ప్రొడక్షన్స్ పతాకంపై నటి చార్మిళ మాన్రే, ఆర్.సావంత్ కలిసి నిర్మిస్తున్నారు. వీరిలో నటి చార్మిళ మాన్రే కన్నడంలో ప్రముఖ కథానాయకిగా రాణించారన్నది గమనార్హం. ఈమె అక్కడ ప్రముఖ హీరోలందరితోనూ సుమారు 40 చిత్రాలకు పైగా నటించారు. ఈమె నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు. చార్మిళ మాన్రేను కన్నడంలో కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఆర్.ముఖేశ్నే ఆమె తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈయన తమిళంలో ఇండ్రు ముదల్, ఆయుదం చిత్రాలతో పాటు కన్నడంలో గజనీ, జోకర్ అనే హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు. తాజా చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం గురించి తెలుపుతూ ఇది గ్లామర్‌తో కూడిన హ్యూమర్ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. దీని షూటింగ్ తొలి షెడ్యూల్ 10 రోజుల పాటు లండన్‌లో నిర్వహించినట్లు తెలిపారు. రెండవ షెడ్యూల్‌ను చెన్నైలో జరుపుతున్నట్లు చెప్పారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు జాలీగా ఎంజాయ్ చేసే పూర్తి ఎంటర్టెయినర్గా ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ఉంటుందని, అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు అని దర్శకుడు తెలిపారు. దీనికి సంగీతాన్ని నటరాజ్ శం కరన్, ఛాయాగ్రహణం గోపి అందిస్తున్నారు. -
విమల్‌తో వైగైపులి
తమిళసినిమా: యువ నటుడు విమల్‌తో కలిసి వైగైపులి వడివేలు నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న హాస్యనటుడు వడివేలుపై రెడ్ కార్డు పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఆయన మాత్రం అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా కొత్త చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా నటుడు విమల్‌తో కలిసి నటించనున్నారు. నటుడు విమల్ కథానాయకుడిగా నటించి నిర్మించిన మన్నర్ వగైయరా చిత్రం మంచి సక్సెస్‌ను అందించడంతో ఈయన కూడా ఇప్పుడు జోరు పెంచారు. మన్నర్ వగైయరా చిత్ర సక్సెస్‌తో పలువురు ప్రముఖ, యువ దర్శకులు విమల్‌తో చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే చిత్రాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న విమల్ ఈ ఏడాది అరడజను చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడు ఎళిల్‌తో కలిసి ఒక చిత్రం, సురాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. సురాజ్ దర్శకత్వంలో పోలీస్అధికారి పాత్రలో నటించనున్నారు. ఇందులో వడివేలు ప్రధాన పాత్రలో నవ్వించడానికి రెడీ అవుతున్నారు. వెట్ట్రివేల్ చిత్రం ఫేమ్ వసంతమణి, తమిళన్ చిత్రం ఫేమ్ మజిత్ దర్శకత్వంలోనూ విమల్ నటించడానికి అంగీకరించారు. అదేవిధంగా మన్నర్ వగైయరా చిత్రం ఫేమ్ భూపతి పాండియన్ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ఇలా ఈ ఏడాది ఆయన డైరీ ఫుల్ అయిపోయింది. ప్రస్తుతం నటిస్తున్న కన్నిరాశి చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నాయకిగా నటిస్తున్నారు. సర్గుణం దర్శకత్వంలో నటిస్తున్న కలవాణి 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. చిత్రపరిశ్రమ సమ్మె కారణంగా నిలిచిపోయిన కలవాణి 2 చిత్రం మే 3 నుంచి మళ్లీ మొదలుకానుంది. -
పూజ పూర్తి.. షూటింగ్‌కి రెడీ
దైవం ఆశీస్సులుంటే ఏ అడ్డంకులు రాకుండా తమ సినిమా షూటింగ్ సవ్యంగా సాగుతుందని చాలామంది నమ్ముతారు అందుకే సినిమా స్టార్టింగ్ టైమ్‌లో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే పూజలు చేశారు మలయాళ డైరెక్టర్ ఆర్.ఎస్. విమల్. విక్రమ్ హీరోగా విమల్ దర్శకత్వంలో మహాభారతం ఆధారంగా రూపొందనున్న సినిమా ‘మహావీర్ కర్ణ’. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌కు శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో పూజలు చేయించారు దర్శకుడు విమల్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఆర్టిస్టులను తీసుకోనున్నారు. హాలీవుడ్ లెవల్ టెక్నీషియన్స్‌ను ఎంపిక చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాలోని స్క్రిప్ట్‌ను గత ఏడాదిన్నర టైమ్‌లో ఎయిట్ టైమ్స్ రీ–రైట్ చేశారట విమల్. అంటే స్క్రిప్ట్ పరంగా ఆయన ఎంత హార్డ్‌వర్క్ చేస్తున్నారో ఊహించుకోవచ్చు. కథ మీద దర్శకుడు ఈ రేంజ్లో కసరత్తులు చేస్తుంటే మరోవైపు హీరో విక్రమ్ ఫిజిక్ మీద దృష్టి పెట్టారట. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు భారీగా ఉంటాయి. వాటి కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ డైరెక్టర్స్‌ని పిలిపించనున్నారని భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వరలక్ష్మి ప్రేమలో పడిందా?
తమిళసినిమా: నటి వరలక్ష్మీశరత్కుమార్ది కన్యరాశియేనా? ఈ బ్యూటీ ప్రేమలో పడ్డారా, లేదా? ఏమిటీ అర్థం పర్థం లేని ప్రశ్నలు అని అనుకుంటున్నారా? దానికో కథ ఉందంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కథానాయకిగా ఇప్పుడు చాలా బిజీ. కోలీవుడ్‌లో వరుస పెట్టి అవకాశాలు వచ్చేస్తున్నాయి. తాజాగా యువ నటుడు విమల్‌తో డ్యూయెట్లు పాడేస్తున్నారు. ఈ చిత్రం పేరు కన్యరాశి. ఇంతకు ముందు ఇదే పేరుతో నటుడు ప్రభు నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. విమల్, వరలక్ష్మీశరత్కుమార్ల కన్యరాశి చిత్రాన్ని కింగ్ మూవీమేకర్స్ పతాకంపై పి.షమీం ఇబ్రహీం నిర్మిస్తున్నారు. దీనికి ఎస్.ముత్తుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యపాత్రలను పాండిరాజన్, రోబోశంకర్, యోగిబాబు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఎస్.సెల్వకుమార్, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖరన్ అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదానికి పెద్ద పీట వేసే ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. విమల్ కుటుంబానికి చెందిన అందరిదీ కన్యరాశినే నని చెప్పారు. అదే విధంగా అందరూ ప్రేమ వివాహమే చేసుకుంటారని తెలిపారు. అలాంటిది విమల్ మాత్రం తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపడతాడన్నారు. అలాంటి సమయంలో వాళ్ల ఇంటికి ఎదురింట్లో వరలక్ష్మి కుటుంబం కొత్తగా దిగుతారన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడుతుందని తెలిపారు. ఆ తరువాత ఎం జరిగిందన్నది వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్యరాశి అని చెప్పారు. ఇంతకీ వరలక్ష్మీది కన్యరాశియేనా, విమల్ ఈమె ప్రేమలో పడ్డాడా? తనే ఆయన లవ్‌లో పడిందా? అన్న ఫుల్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా కన్యరాశి చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
ఓవియ తొలి చిత్రానికి సీక్వెల్
తమిళసినిమా: నటి ఓవియను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం కలవాణి. విమల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సర్గుణం తెరకెక్కించారు. ఆయనకి దర్శకుడిగా ఇది మొదటి చిత్రమే. 2010లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. ముఖ్యం గా నటి ఓవియకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టిన చిత్రం కలవాణి. కాగా ఆ తరువాత ఓవియకు సరైన సక్సెస్‌లు పడలేదనే చెప్పా లి. అంతే కాదు అవకాశాలు రాలేదు. అయితే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న ఓవియను ఆ గేమ్ షో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. నటిగా అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, కథా నాయకుడిగా నటిస్తున్న కాంచన–3 చిత్రంలో ఓవియ కథా నాయకిగా నటిస్తోంది. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కలవాణి చిత్రానికి సీక్వెల్ తయారు అవుతోం ది. ఎనిమిదేళ్ల తరువాత కలవాణి–2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదే విమల్, ఓవియల జంట కలిసి నటిస్తున్నారు. కలవాణి చిత్ర దర్శకుడు సర్గుణం తన వర్ణన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇందులో నటించే ఇతర నటీనటులు, సంకేతిక వర్గాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాత సర్గుణం తెలిపారు. ఈ కలవాణి జంట మరోసారి మ్యాజిక్ చేస్తారా? అన్నది చూడాల్సిందే. ఇక ఈ చిత్ర టైటిల్‌ను గురువారం సాయంత్రం నటుడు శివకార్తికేయన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం విశేషం. ఇప్పటికే సర్గుణం మాధవన్ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నా రు. ఈ రెండు చిత్రాల షూటింగ్ మార్చిలో జరగనుందట. -
300 కోట్ల భారీ ప్రాజెక్టు.. కర్ణునిగా విక్రమ్..
చెన్నై: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ హీరో, చియాన్ విక్రమ్ మహాభారతంలోని ఉదాత్తమైన కర్ణుడి పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహావీర్ కర్ణ’ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. ‘ఎన్ను నింతే మొయిదీన్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ మలయాళీ దర్శకుడు ఆర్ఎస్ విమల్ తెరకెక్కించనున్న ఈ సినిమాను న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ నిర్మించనుంది. ఈ విషయాన్ని విక్రమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రధాన పాత్రలకు వివిధ భాషల్లోని ప్రముఖ నటులను ఎంపికచేసే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు. 2019 క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదట కర్ణుని పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ను తీసుకోవాలని దర్శకుడు భావించారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీయాలని అనుకున్నారు. అయితే, ఇంత బడ్జెట్‌ను బరిచేందుకు నిర్మాతలు వెనుకాడటంతో ఈ ప్రాజెక్టుకు వెనుకకుపోయినట్టు భావించారు. అయితే, అనూహ్యంగా న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ ఫిలిం కింగ్డమ్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో చియాన్‌తో చేతులు కలిపి దర్శకుడు విమల్ తన ప్రాజెక్టుకు దృశ్యరూపం ఇస్తున్నారు. విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ ‘ధ్రువ నక్షత్రం’, సామి స్క్వేర్( సామి సినిమా సీక్వెల్) సినిమాలతో బిజీగా ఉన్నాడు. -
మహావీర్ కర్ణ
కురుక్షేత్ర రణరంగంలో కర్ణుడు కౌరవుల వైపు ఉండి పాండవులను ఓడించడానికి యుద్ధం చేసి ఉండవచ్చు. కర్ణుడి మరణానికి అనేక పరిస్థితులు కారణం కావచ్చు. కానీ.. కర్ణుడి దానగుణం గొప్పది. ఆయన శౌర్య పరాక్రమం అందరికీ అబ్బనిది. కర్ణుడి గొప్పతనాన్ని చెప్పేలా వెండితెరపై చాలా సినిమాలు వచ్చాయి. లేటెస్ట్గా హిందీలో ‘మహావీర్ కర్ణ’ అనే టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కనుంది. విక్రమ్ హీరోగా యునైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ పతాకంపై మలయాళంలో ‘యన్ను నిన్టే మోయిదీన్’ ఫేమ్ ఆర్.యస్. విమల్ దర్శకత్వంలో ‘మహావీర్ కర్ణ’ చిత్రం రూపొందనుంది. ‘‘హిందీలో తెరకెక్కించి మిగతా భాషల్లోకి డబ్ చేయాలనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేరున్న టెక్నీషియన్స్‌ను తీసుకోవాలనుకుంటున్నాం. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లి, వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ సినిమాను తొలుత పృథ్వీరాజ్‌తో తీయాలని దర్శకుడు విమల్ భావించినా ఏవో కారణాల వల్ల విక్రమ్ ఫైనలైజ్ అయ్యారని మాలీవుడ్ వర్గాల కథనం. -
కళవాణి సీక్వెల్‌కు రెడీ
– విమల్ తమిళసినిమా: యువ నటుడు విమల్ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం కళవాణి. ఆ చిత్ర దర్శకుడు సర్గుణం, నటి ఓవియాకు ఇది తొలి చిత్రం అన్నది గమనార్హం. కళవాణి చిత్రం తరువాత విమల్ వరుసగా పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల చిన్న గ్యాప్ వచ్చింది. విమల్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాదిన్నర పైనే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో విమల్ నిర్మాతగా మారి మన్నర్ వగైయారు అనే చిత్రాన్ని నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నారు. దీనికి భూపతి పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వెట్రివేల్ చిత్రం ఫేమ్ వసంతమణి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా కళవాణి–2 చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. దీనికి సర్గుణం దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం మాధవన్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఇది పూర్తి అయిన తరువాత కళవాణి–2 చిత్రం ప్రారంభమవుతుందని నటుడు విమల్ వెల్లడించారు. మొత్తం చిన్న గ్యాప్ తరువాత విమల్ మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారన్నమాట. కళవాణి చిత్రంలో నటించిన సూరి, గంజాకరుప్పు దానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న కళవాణి–2లో నటించనున్నారు. మరి నటి ఓవియా కూడా నాయకిగా నటిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
ఖుషీఖుషీగా విమల్
యువ నటుడు విమల్ ఖుషీఖుషీగా ఉన్నారు. 2017 నూతనోత్సాహాన్నిచ్చే సంవత్సరంగా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. పసంగ చిత్రం విజయంతో దూసుకొచ్చిన ఈ యువ నటుడు కలవాణి, వాగై చూడవా, కలగలప్పు, మాంజా చిత్రాల విజయాలతో తనకంటూ ఒక గుర్తింపును పొందారు.అరుుతే ఇటీవల కాస్త వెనుక బడ్డ విమల్ మళ్లీ ఎగిసిన అలలా వస్తున్నానంటున్నారు. ప్రస్తుతం భూపతి పాండియన్ దర్శకత్వంలో మన్నర్ వగేరా చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందని విమల్ తెలిపారు. తదుపరి దర్శకుడు సుశీంద్రన్ నిర్మాణ సంస్థలో ఆయన శిష్యుడు శివ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతాన్ని డి.ఇమాన్, మాటలను దర్శకుడు పాండిరాజ్ వంటి ప్రముఖులు పని చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. అదే విధంగా రాజతందిరం చిత్రం ఫేమ్ అమిత్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్లు చెప్పారు.అంతే కాకుండా మరో నలుగురు ప్రముఖుల చిత్రాల్లో నటించే విషయై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం మీద 2017 తనకు నూతనోత్సాహాన్నిచ్చే సంవత్సరంగా ఉంటుందనే ఆనందాన్ని నటుడు విమల్ వ్యక్తం చేశారు. -
‘అల్లుడు సింగం’ మూవీ స్టిల్స్
-
పాలిటిక్స్ ప్రేమకథ
ఏమో.. నాకన్నీ అలా తెలిసిపోతాయంతే! అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో అమాయకంగా మాట్లాడిన అంజలి, ‘గీతాంజలి’లో ప్రేక్షకులను భయపెట్టారు. ఇప్పుడేమో యువరానర్ అంటున్నారు. విమల్, అంజలి జంటగా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని సత్యదేవ పిక్చర్స్ పతాకంపై రావిపాటి సత్యనారాయణ ‘అల్లుడు సింగం’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ప్రేమకథ. అంజలి లాయర్‌గా, పొలిటీషియన్‌గా కనిపిస్తారు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు. -
సరదా... సరదాగా...
రెండు ఊళ్ల మధ్య ఉన్న పగ, ప్రతీకారాలను ఓ యువకుడు ఎలా రూపుమాపాడన్న కథాంశంతో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘దేశింగు రాజా’. విమల్, బిందుమాధవి జంటగా ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ అనువదించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘సరదా... సరదాగా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. మన తెలుగమ్మాయి బిందుమాధవి చాలా రోజుల తరువాత ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఈ నెల 12న పాటలను విడుదల చేయనున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇమాన్, సాహిత్యం: వనమాలి, మాటలు: కృష్ణతేజ. -
విమల్‌తో మరోసారి
నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ అవకాశాలను పెంచుకుంటోంది. ఇంతకుముందు అంగాడి తెరు, ఎంగేయుం ఎప్పోదు, కలగలప్పు వంటి చిత్రాలతో విజయాల బాట పట్టిన అంజలి అనూహ్యంగా తన పినతల్లితో మనస్పర్థలు కారణంగా హైదరాబాదుకు వెళ్లిపోయి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ తెలుగమ్మాయి తాజాగా మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం సూరజ్ దర్శకత్వంలో జయం రవితో జతకడుతున్న అంజలికి మరో అవకాశం వచ్చింది. మాప్పిళ్లై సింగం అనే నూతన చిత్రంలో విమల్ సరసన నటించడానికి సిద్ధం అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు తూంగానగరం, కలగలప్పు చిత్రాలు తెరకెక్కాయి. దీంతో ముచ్చటగా మూడవసారి విమల్‌తో రొమాన్స్‌కు అంజలి సిద్ధం అవుతున్న మాట. ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ సంస్థ అధినేత మదన్ నిర్మించనున్నారు. ఇంతకు ముందు మాన్ కరాటే వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఈయన ప్రస్తుతం ప్రభుసాల్మన్ దర్శకత్వంలో కయల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి విమల్, అంజలితో మాపిళ్లైసింగం చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. - తమిళ సినిమా -
విమర్శల వలలో ప్రియ
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నది ఆర్యోక్తి. అయితే నటి ప్రియాఆనంద్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకు విజయం కోసం తహతహలాడిన ఈ బ్యూటీ ఇటీవల వరుసగా రెండు హిట్లు రావడంతో వాటిని తలకెక్కించుకున్నట్లు ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం నటుడు విమల్ సరసన ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం ముందుగా అనుకున్న దాని కంటే కోటిన్నర వరకు పెరిగి పోయిందట. ఇందుకు కారణం నటి ప్రియా ఆనందేనని అంటున్నారు. నిర్మాతల వద్ద ఆమె బాగా ఖర్చు పెట్టించిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ అలంకరణ సామగ్రి కోసం ప్రియా ఆనంద్ అధికంగా ఖర్చు చేయించినట్లు కోలీవుడ్ టాక్. మరో విషయం ఏమిటంటే ప్రియా ఆనంద్ తమిళ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నట్లు ఆమె అభిమానులే ఆగ్రహిస్తున్నారు. పియా ఆనంద్ ఇంతకు ముందు చేసిన అరిమా నంబి చిత్రంలో మద్యంలో మునిగి తేలేలా నటించడాన్ని ఆమె అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి ప్రియా ఆనంద్ ఘాటుగానే స్పందించారు. ఆడ - మగ సమానం అంటున్న ఈ రోజుల్లో మగవారు మద్యం సేవించగా లేనిది ఆడవారు సేవిస్తే తప్పా! మీకో న్యాయం మాకో న్యాయమా? అంటూ లా తీస్తుండడం ఆమె అభిమానులకే నచ్చడం లేదు. ప్రియా ఆనంద్ ప్రవర్తన మార్చుకోకపోతే సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టం అంటున్నారుు కోలీవుడ్ వర్గాలు.