Visakapatnam Elections
-
మాట తప్పని నేత సీఎం జగన్
రావికమతం: మాట తప్పని మడమ తిప్పని నేతగా సీఎం జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. నాలుగు విడతల్లో రూ.25,552 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేసి అక్కచెల్లెమ్మల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా నాల్గో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం కొత్తకోట హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఇక్కడ బహిరంగ సభలో ధర్మశ్రీ మాట్లాడుతూ నాడు చంద్రబాబు, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేఎస్ఎన్ రాజు బ్యాంకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టు పెట్టిన బంగారం తెచ్చి ఇచ్చేస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. గెలిచన తర్వాత ఎవ్వరికై నా తాకట్టు పెట్టిన బంగారం తెచ్చి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఆనాడు వారి మాటలు నమ్మి వడ్డీలు చెల్లించని వారికి అప్పులు తడిసిమోపుడయ్యాయని వాపోయారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారన్నారు. నాడు జన్మభూమి కమిటీలు దోచుకున్నాయని దుయ్యబట్టారు. నేడు ఏ నాయకుడైనా లంచాలు అడిగారా? మీరెవ్వరికై నా ఇచ్చారా అని ప్రశ్నించగా? లేదు.. లేదంటూ.. మహిళలు ముక్తకంఠంతో పలికారు. అనంతరం రావికమతం మండలానికి రూ.11.89 కోట్ల చెక్కు, రోలుగుంట మండలానికి రూ.7.27 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీపీలు పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రావికమతం మండలాధ్యక్షుడు ముక్కా మహలక్ష్మినాయుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ, జెడ్పీటీసీ తలారి రమణమ్మ ఆదిమూర్తి, చోడవరం ఏఎంసీ వైస్ చైర్మన్ రాజాన నర్సింహులు, కొత్తకోట సర్పంచ్ కోన లోవరాజు పాల్గొన్నారు. -
మునగపూడిలో షర్మిలకు చేదు అనుభవం.!
నాతవరం: మునగపూడి రచ్చబండ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వ్యవహారశైలిని విమర్శిస్తూ స్థానిక వైఎస్సార్ అభిమానులు నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ పేరును.. ఆయన మరణాంతరం చార్జిషీట్లో చేర్చి వారి కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన విషయాన్ని శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ సాక్షిగా ప్రశ్నించారు. వైఎస్సార్ బిడ్డగా అలాంటి పార్టీలో మళ్లీ ఎందుకు చేరారు..? అంటూ వైఎస్సార్ అభిమాని లోవరాజు నిలదీశారు. వైఎస్సార్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించిన పార్టీలో కాకుండా మరే పార్టీని గెలిపించమన్నా.. వైఎస్సార్ బిడ్డగా మద్దతు ఇచ్చేవాళ్లమని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవని సీఎం జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించారు. దీంతో షర్మిల ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పది నిమిషాలపాటు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారు. ఈ క్రమంలో అతడి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు మైక్ లాక్కోన్నారు. అంతలోనే షర్మిల కలగజేసుకుని తనను మాట్లాడనివ్వండని నాయకులకు సూచించారు. లోవరాజు మాట్లాడుతున్నంత సేపు సభలో ఉన్న వారంతా ఈలలతో సందడి చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ పేరు చార్జిషీట్లో చేర్చిన విషయం సోనియా, రాహుల్ గాంధీలకు తెలియదని తన దగ్గర బాధపడ్డారన్నారు. రాష్ట్రంలో అధికార పక్ష, ప్రతి పక్ష నాయకులు బీజేపీ పెద్దల కాళ్లకు మొక్కుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులాంటివి పూర్తవ్వాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, రుద్రరాజు, పీసీసీ సభ్యుడు శ్రీరామమూర్తి, నర్సీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి సుబ్బ న్న, సన్యాసిరావు పాల్గొన్నారు. -
క్రీడా జోష్
విశాఖ స్పోర్ట్స్: మహా క్రీడా సంబరంతో విశాఖ మురిసిపోయింది. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’ తుది ఘట్టానికి విశాఖ వేదికైంది. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను విశాఖ రైల్వే స్టేడియంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. ఈనెల 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది. 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. ఈసందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే ఇదే చక్కటి సందర్భం అన్నారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్రా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తొలుత రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వీసీఎండీ టాలెంట్ హంట్‌లో భాగంగానే ఈ పోటీలు అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ క్రీడాకారులు పోటీతత్వం అలవర్చుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ విశాఖ వేదికగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం నగరం చేసుకున్న అదృష్టమన్నారు. భారత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్, స్థానికుడు కేఎస్ భరత్ మాట్లాడుతూ కష్టపడితే ఫలితం దక్కుతుందని అన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 26 జిల్లాలకు చెందిన మెన్, వుమెన్ జట్ల చేత అతిథులు క్రీడాప్రతిజ్ఞ చేయించారు. తొలుత రైల్వే స్టేడియంలోని వేదిక వద్ద శాప్ పతాకాన్ని ఆ సంస్థ చైర్మన్ సిద్ధ్దార్థరెడ్డి, జాతీయ పతాకాన్ని మంత్రి రోజా ఆవిష్కరించగా అతిథులు గౌరవవందనం సమర్పించారు. పోటీలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి ప్రకటించి గాల్లోకి బెలూన్లను విడిచారు. అనంతరం అతిథులు క్రీడాకారుల్ని పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏడీసీ కేఎస్ విశ్వనాథన్, ఇతర రాజకీయ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. -
మాడుగుల టికెట్ ఎవరికిచ్చినా పనిచేయాలి
మాడుగుల/చోడవరం: మాడుగుల టికెట్ ఎవరికిచ్చినా అందరూ కలిసి పనిచేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. శుక్రవారం మాడుగుల మండలంలోని ఘాట్‌రోడ్ జంక్షన్లో ఆ పార్టీ నాయకుడు రాయిపురెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి అందించిన సేవల వల్లే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చారని, గడచిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకపోవడం వల్లే జనసేన పార్టీ ఓటమి చవిచూసిందని చెప్పారు. సమావేశానికి జనసేన కార్యకర్తలు అరకొరగా హాజరయ్యారు. చోడవరంలో జనసేన పార్టీ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో చోడవరంలో జరిగిన సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుందనే అంశాలు వారం రోజుల్లో తేలుతాయన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు
నక్కపల్లి : ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబునాయుడు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పొత్తు లేనిదే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము చంద్రబాబునాయుడికి లేదన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న చంద్రబాబు తర్వాత పొత్తు లేకుండా ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో విఫలమైన బీజేపీతో చంద్రబాబు పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మళ్లీ 2024లో బీజేపీతో పొత్తు కోసం అమిత్‌షా, మోదీతో కాళ్ల బేరానికి దిగుతున్నారన్నారు. విభజన చట్టాలను అమలు చేయని బీజేపీతో పవన్ పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ నోరు మెదపడం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో చక్కెర కర్మాగారాలకు నిధులు మంజూరు చేసి నష్టాల ఊబిలో నుంచి గట్టెక్కిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మేడేటి శంకర్, జిల్లా కార్యదర్శి ఎం.ఎన్.చక్రవర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరావు, మండల శాఖ అధ్యక్షుడు ప్రగడ చక్రధరరావు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చోడవరం : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం మండలంలో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఆసరా పథకంలో 4వ విడతగా రూ.14.73 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు ధర్మశ్రీ శుక్రవారం అందజేశారు. ఇక్కడ శివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేలాది మంది డ్వాక్రా మహిళలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. ప్రధానంగా మహిళల సాధికారత, సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు దశలవారీగా రుణమాఫీ చేస్తుండగా మరో పక్క సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ వడ్డీని ప్రభుత్వమే భరించే విధంగా సహకారం అందిస్తున్నారన్నారు. సున్నా వడ్డీతోపాటు ఆసరా పథకంలో మంజూరైన డబ్బులు నేరుగా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేసి మహిళలకు అండగా ముఖ్యమంత్రి నిలిచారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాలను విడిపిస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడని ధర్మశ్రీ విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల ముందు పసుపు కుంకుం పేరుతో మహిళలను చంద్రబాబు మభ్యపెట్టాలని చూసినప్పటికీ ఆయనకు బుద్ధి చెప్పి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో మహిళలు పూర్తి సహకారం అందించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా పథకాలన్నీ పార్టీలకు అతీతంగా ప్రజల ఇంటి ముందుకే తెచ్చి అందిస్తుందన్నారు. ఇది ప్రచారాల ప్రభుత్వం కాదని, ఇది ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు మరింత మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిని మళ్లీ గెలిపించాలని ధర్మశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏరియా కో ఆర్డినేటర్ రత్నప్రభ, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, డీసీఎంఎస్ చైర్మన్ పల్లా నర్సింగరావు, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, చోడవరం సర్పంచ్ బండి నూకాలమ్మ , ఉప సర్పంచ్ పుల్లేటి వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, మహిళా విభాగం అధ్యక్షురాలు యర్రా దేవి, పట్టణ మాజీ అధ్యక్షురాలు అల్లాడ భవానీ, ఈఓపీఆర్డి చైతన్య, వెలుగు ఏపీఎం కనకరాజు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాయగాడు చంద్రబాబు.. బుచ్చెయ్యపేట : డ్వాక్రా రుణాలు బ్యాంకులకు కట్టొద్దని మహిళల్ని మోసగించిన మాయగాడు చంద్రబాబునాయుడైతే ఆసరా నగదు అందించి ఆదుకున్న మొనగాడుగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిలిచారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. శుక్రవారం దిబ్బిడి గ్రామంలో బుచ్చెయ్యపేట మండలానికి మంజూరైన నాల్గో విడత ఆసరా నగదు రూ, 7.60 కోట్లు నగదు చెక్కును మహిళలకు ఆయన అందించారు. 2014లో చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలెవరూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు, బంగారు రుణాలు తిరిగి కట్టొద్దని, అధికారంలోకి వస్తే రూ.13,800 కోట్లు మహిళల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. గద్దె నెక్కిన తరవాత చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసగించాడన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జగనన్న హామీ ఇచ్చిన నవరత్నాల పథకంలో భాగంగా మహిళల బ్యాంకు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసి ఆదుకున్నాడన్నారు. చంద్రబాబు అప్పట్లో ఉన్న అప్పు రూ.13,800 కోట్లు కట్టకపోవడంతో వడ్డీతో జగనన్న రూ, 25,532 కోట్లు బ్యాంకులకు కట్టి అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారన్నారు. మాట మీద నిలబడే జగనన్నకే మహిళంతా పట్టం కట్టాలని, సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. చోడవరం నియోజకవర్గంలో రూ.168 కోట్లు డ్వాక్రా రుణాలను మాఫీ చేసి ఆసరా ద్వారా నాలుగు విడతలుగా అందించడమే కాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని విప్ ధర్మశ్రీ కోరారు. కార్యక్రమంలో చోడవరం వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ పరిశీలకుడు చొక్కాకుల వెంకటరావు, ఎంపీపీ దాకవరపు నాగేశ్వరిదేవి, జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కె.అచ్చింనాయుడు, వైస్ ఎంపీపీలు గొంపా చినబాబు, దొండా లలితా నారాయణమూర్తి, సర్పంచ్ పెదిరెడ్ల మాణిక్యం, ఏపీఎం బాలరాజు, వెలుగు సిబ్బంది కొండలరావు, గణపతి పాల్గొన్నారు. -
పంచకర్లపై జనసైనికుల అసహనం
పెందుర్తి: పొత్తులో భాగంగా జనసేన నుంచి పెందుర్తి టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుపై స్థానిక నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్లో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో పంచకర్ల రమేష్‌బాబు, జనసేన సీనియర్ నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్‌కు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఆత్మీయ సమావేశానికి తమకు ఆహ్వానం లేదంటూ శివశంకర్ వర్గీయులు నిరసనకు దిగారు. కొత్తగా పార్టీలోకి వచ్చినవారు పెత్తనం చెలాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ప్రోటోకాల్ మర్యాదలు తెలియవంటూ రమే‹Ùబాబు వర్గీయులపై మండిపడ్డారు. ఈ దశలో ఆ పార్టీ కార్యదర్శి నాగబాబు వేదిక వద్దకు వచ్చే సమయం దగ్గర పడడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగేలా చేశారు. శివశంకర్–బండారుకు చెక్ జనసేనకు సీటు కేటాయిస్తే అది తనకే ఇవ్వాలని పంచకర్ల రమేష్‌బాబు పట్టుపడుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే తొలి నుంచి పంచకర్లతో రాజకీయ వైరం ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి.. పంచకర్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీకి అయితే తనకు, జనసేనకు అయితే శివశంకర్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంచకర్లకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితిలోనూ తాను పనిచేయనంటూ ఇరువర్గాల అధిష్టానాలకు బండారు ఇదివరకే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఆత్మీ సమావేశంలో పంచకర్ల రమేష్‌బాబు ఏకకాలంలో శివశంకర్, అతనికి బలంగా మద్దతు పలుకుతున్న బండారుకు ఏకకాలంలో చెక్ పెట్టేందుకు పావులు కదిపారు. తనకు పారీ్టలోనే ప్రత్యరి్థగా ఉన్న శివశంకర్‌తోపాటు అతని వర్గీయులెవరికీ ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు. దీంతో శివశంకర్‌తో పాటు అతని అనుచరులు కూడా రగిలిపోతున్నారు. ఒకవేళ టీడీపీకి టికెట్ వస్తే బండారుకు పని చేయబోమని పంచకర్ల వర్గం కూడా పరోక్షంగా చెప్పినట్లైందని జనసైనికులు అంటున్నారు. ఈ సమావేశంలో జనసేన కార్యదర్శి కె.నాగబాబు మాట్లాడుతూ టీడీపీ–జనసేన–బీజేపీల పొత్తు నిర్ణయంపై స్పష్టత వచ్చాకే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. -
రాజ్యసభలోనూ ఉత్తరాంధ్రకే పెద్దపీట
సాక్షి విశాఖపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మరోసారి ఉత్తరాంధ్ర పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైతే అందులో రెండు ఉత్తరాంధ్రకే అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి.. వైవీ సుబ్బారెడ్డిది ప్రకాశం జిల్లా మేదరమెట్ల. తల్లిదండ్రులు ఎర్రం చిన్నపోలిరెడ్డి, పిచ్చమ్మ. షోలాపూర్‌లో భారతీ విద్యాపీఠ్్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఎ(మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) పూర్తి చేసారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి 16వ లోక్‌సభలో అడుగుపెట్టారు. పరిశ్రమల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, ప్రైవేట్ బిల్లుల, తీర్మానాల కమిటీలో సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకాల(ఎంపీ ల్యాడ్స్) కమిటీ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కాన్సులేటివ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యేక హోదా కోసం 2018లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్పీకరించారు. వైఎస్సార్ సీపీలోనూ పలు పదవులు నిర్వర్తించారు. గతంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. విశ్వసనీయతకు గుర్తింపు విధేయత, విశ్వసనీయతకు గుర్తింపుగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. గ్రూప్–1 అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన బాబూరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాయకరావుపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అక్కడ ముప్పై ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు వేశారు. కొద్ది నెలలకే వైఎస్సార్ దుర్మరణం పాలవ్వడంతో తదనంతర పరిణామాల్లో జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీని స్థాపించారు. జిల్లాలో బాబూరావు ఒక్కరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వై.వి.సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావుకు అవకాశం -
రాజ్యసభలోనూ ఉత్తరాంధ్రకే పెద్దపీట
సాక్షి విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఉత్తరాంధ్ర పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైతే అందులో రెండు ఉత్తరాంధ్రకే కేటాయించారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి.. వైవీ సుబ్బారెడ్డిది ప్రకాశం జిల్లా మేదరమెట్ల. తల్లిదండ్రులు ఎర్రం చిన్నపోలిరెడ్డి, పిచ్చమ్మ. షోలాపూర్‌లో భారతీ విద్యాపీఠ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఎ(మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) పూర్తి చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి 16వ లోక్‌సభలో అ డుగుపెట్టారు. పరిశ్రమల స్టాండింగ్ కమిటీలో స భ్యుడిగా, ప్రైవేట్ బిల్లుల, తీర్మానాల కమిటీలో స భ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అ భివృద్ధి పథకాల(ఎంపీ ల్యాడ్స్) కమిటీ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కాన్సు లేటివ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యేక హోదా కోసం 2018లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్పీకరించారు. వైఎస్సార్ సీపీలోనూ పలు పదవులు నిర్వ ర్తించారు. గతంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. గొల్ల బాబూరావు.. నక్కపల్లి: విధేయత, విశ్వసనీయతకు గుర్తింపుగా సీఎం వైఎస్ జగన్ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. గ్రూప్ 1 అధికారిగా పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ స్థాయి వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన బాబూరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాయకరావుపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అక్కడ ముప్పై ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు వేశారు. కొద్ది నెలలకే వైఎస్సార్ దుర్మరణం పాలవ్వడంతో తదనంతర పరిణామాల్లో జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీని స్థాపించారు. జిల్లాలో బాబూరావు ఒక్కరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.వ కష్టకాలంలో తనతో ఉండి తన కుటుంబానికి అండగా నిలిచిన బాబూరావుకు జగన్మోహన్రెడ్డి సముచిత స్ధానం కల్పించారు. పెద్దల సభకు పంపించి బాబూరావుపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా తనను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. -
జనసేన నేతల నిలదీత.. తలదించుకున్న నాగబాబు!
సాక్షి, అనకాపల్లి: టీడీపీ జెండా ఇంకా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు.. అంటూ జనసేన నేతలు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి షాక్ ఇచ్చారు. ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని.. ఇవ్వకుంటే ఎన్నికల ప్రచారంలో సహాయ నిరాకరణ చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. పాయకరావుపేటలో మరోసారి జనసేన టీడీపీ సీటు వివాదం రాజుకుంది. బుధవారం ఆ నియోజకవర్గంలో జనసేన నాయకులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఆ సందర్భంలో.. టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నేతలు కోరారు. ‘‘గతంలో జనసేన మద్దతుతో నెగ్గిన అనిత.. అనేక కేసులతో మమ్మల్ని వేధించారు. జనసేనకు సీటు ఇవ్వకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎంతమాత్రం సహకరించేది లేదు’’ అని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు మౌనంగా ఫోన్ చూస్తూ ఉండిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచారని... ఇబ్బంది పెట్టారని.. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని మొదటి నుంచి జనసేన నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకే ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మాత్రం తాము పని చేయమని ఖరాకండిగా చెబుతూ వస్తున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఇంకా పొత్తు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీలో సీట్ల లొల్లి నడుస్తోంది. మరోవైపు చర్చల పేరిట టైం పాస్ చేస్తూ వస్తున్న జనసేనాని.. టీడీపీ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ? అనే అంశంపై స్పష్టమైన హామీ పొందలేక పోవడంపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తీవ్రంగా అవమానించిన టీడీపీతో కలిసి నడవడం ఇబ్బందిగా అనిపిస్తోందంటూ పలువురు నేతలు పవన్ దగ్గర ఏకరువు పెడుతున్నా.. ఆయన మాత్రం కలిసి నడవాల్సిందేనని.. టీడీపీ జెండా మోయాల్సిందేనని చెబుతుండడం గమనార్హం. -
జనసేనలో వర్గపోరు
నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గ జనసేనలో వర్గపోరు మొదలయింది. పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించడంతోపాటు అభ్యర్థిగా బోడపాటి శివదత్‌ను ప్రకటించాలని ఆ వర్గం నాయకులు మంగళవారం నక్కపల్లి పార్టీ కార్యాలయం వద్ద పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, సహాయ కార్యదర్శి కురందాసు అప్పలరాజు మాట్లాడుతూ.. గత ఆరేడు సంవత్సరాల నుంచి శివదత్ నియోజకవర్గంలో చురుకై న పాత్ర పోషిస్తూ పార్టీ తరపున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారని అన్నారు. ఆయనకు కాకుండా, ఇప్పటికిప్పుడు పార్టీలో చేరి టికెట్ తమకే ఇవ్వాలని కోరే లక్ష్మీ శివకుమారికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. మరోపక్క నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి జనసేనలో చేరి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గెడ్డం బుజ్జి తమ పార్టీ అభ్యర్థిగా లక్ష్మీ శివకుమారిని తెరమీదకు తీసుకురావడంతోపాటు, ఆమెను నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోను కార్యకర్తలకు పరిచయం చేస్తున్నారు. జనసేన పార్టీలో రెండు వర్గాలు తయారైన నేపథ్యంలో దీనిని అవకాశంగా తీసుకుని టీడీపీ ఆ పార్టీలో కుంపటి రాజేసింది. బోడపాటి శివదత్ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకున్నారు. ఇస్తే టికెట్ తమకు ఇవ్వాలని, కాని పక్షంలో టీడీపీకి ఇవ్వాలని శివదత్ వర్గం మాట్లాడుతున్నారు. జనసేనలోని రెండు వర్గాలు వేర్వేరు అభ్యర్థులను ప్రతిపాదిస్తే.. ఈ కుమ్ములాటల వల్ల టీడీపీకే టికెట్ కేటాయిస్తారన్న ఎత్తుగడలో భాగంగానే జనసేనలో రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి వర్గపోరుకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఉచ్చులో చిక్కుకుంటే ఈ దఫా కూడా మళ్లీ జెండా కూలీలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా మత్స్యలింగం
సాక్షి, పాడేరు: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వమయకర్తగా రేగం మత్స్యలింగంను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హుకుంపేట జెడ్పీటీసీ పనిచేస్తున్న ఆయన అరకు నియోజకవర్గంలోని బలమైన కొండదొర సామా జిక వర్గానికి చెందిన వారు. గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయుడిగా, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 2018లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గిరిజనుల సేవే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మత్స్యలింగం పేర్కొన్నారు. -
YSRCP: జనక్షేత్రంలో జేజేలు
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.4.21 లక్షల కోట్లను డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రాష్ట్ర ప్రజలకు అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమంతో పలుకరించింది. సుపరిపాలనతో ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదిస్తూ ప్రజలు ప్రతి అడుగులోనూ వెన్నంటే నిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన భీమిలి సభ సీఎం జగన్‌కు జనామోదం ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. సముద్రంలా ఉప్పొంగిన జన వాహిని సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికింది. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు లక్షల మందిని సమీకరించాలని ఆదేశించినా ఏ సభ చూసినా పట్టుమని 10 – 15 వేల మంది కూడా రాకపోవడంతో బేజారెత్తుతున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాభీష్టం అలా ఉన్నప్పుడు తామేం చేయగలమని పార్టీ నేతలు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 15 సభలకు వచ్చిన జనం మొత్తం అంతా కలిపినా కూడా సీఎం జగన్ తాజాగా పాల్గొన్న ఒక్క భీమిలి సభతో పోలిస్తే సగం మంది కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి కలగడం సాధారణం! కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్నిక ఏదైనా సరే ఏకపక్షంగానే ఫలితాలు వెలువడటం ప్రజాభీష్టానికి తార్కాణంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజురోజుకూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఇటీవల టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గత 56 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పే వైఎస్సార్సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరగడానికి దారి తీస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవైపు సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతుండటం, వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రతి నియోజకవర్గంలోనూ జనం పోటెత్తుతుండటం.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలకు జనం మొహం చాటేస్తుండటాన్ని బట్టి చూస్తే 2019కి మించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యంత భారీ విజయాన్ని సాధించడం ఖాయమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబద్ధతతో పెరుగుతున్న విశ్వసనీయత.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన వాటితోపాటు తాను స్వయంగా గుర్తించిన సమస్యలను క్రోడీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో ఇంత ఘనవిజయం సాధించిన పార్టీ మరొకటి లేదు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ నిబద్ధత చాటుకుంటూ ఇప్పటికే 99.5 శాతం హామీలను నెరవేర్చారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఇప్పటిదాకా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.21 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రజలకు మరెవరూ మేలు చేసిన దాఖలాలు లేవు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. వలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. విద్య, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నడూ ఇచ్చిన మాటకు కట్టుబడని నైజం కలిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది. విశ్వసనీయతకు పట్టం.. టీడీపీ చరిత్రలో 2019 ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల.్లో పోటీ చేసేందుకు ఆపార్టీకి అభ్యర్థులు సైతం దొరకని దుస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళన చెందిన చంద్రబాబు నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. 2021 ఫిబ్రవరిలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు 10,299 పంచాయతీల్లో (80 శాతం) గెలుపొందారు. టీడీపీని 2,166, జనసేనను 157 పంచాయతీలకు ప్రజలు పరిమితం చేశారు. ► ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కంటే మరింత ఘోర పరాభవం తప్పదని పసిగట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చి నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి కుట్రలకు పాల్పడినా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ► మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. వైఎస్సార్సీపీకి చారిత్రక విజయాన్ని అందించారు. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న, ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన 23 నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. ► తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ స్థానాలకు 2021లో, ఆత్మకూరు శాసనసభ స్థానానికి 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ► సీఎం జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారనేందుకు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ సాధించిన వరుస ఘనవిజయాలే తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ► ఇటీవల జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రజా తీర్పు పేరుతో నిర్వహించిన సర్వేలో 1.16 కోట్ల కుటుంబాలు (80 శాతం కుటుంబాల ప్రజలు) మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది. -
మాడుగుల ఇన్చార్జి ఎంపీపీగా రాజారామ్
రాజారామ్‌కు ఉత్తర్వుల కాపీ అందజేస్తున్న జెడ్పీ సీఈవో పోలినాయుడు మాడుగుల: వైస్ ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్‌కు ఇన్చార్జి ఎంపీపీ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జెడ్పీ సీఈవో ఎం. పోలినాయుడు సోమవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో రాజారామ్‌కు ఆర్డర్ కాపీ అందజేశారు. మాడుగుల ఎంపీపీ రామధర్మజ వ్యక్తిగత కారణాలతో తన పదవికి ఇటీవల రాజీనామా చేసిన విదితమే. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కిముడు రమణమ్మ, వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ గోపాల్‌రావు, ససర్పంచ్ ఎడ్ల కళావతి, వీరవిల్లి కోఆపరేటివ్ పర్సన్ ఇన్చార్జి కొరుకొండ చెల్లంనాయుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు కాత వెంకటరమణ పాల్గొన్నారు. -
ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని: సీఎం జగన్
అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది. ఇక్కడకు వచ్చిన ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, స్నేహితుడు, అవ్వ, తాతల్లో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు కనిపిస్తున్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే.. అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదొంగల ముఠా ఉంది. వారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు మోసపూరిత వాగ్దానాలు, ఎత్తులు, పొత్తులు, చిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఈ అర్జునుడికి మీ అందరి తోడు.. కృష్ణుడి రూపేణా అండదండలున్నాయి. అందుకే మీ బిడ్డ భయపడడు. దేనికీ తొణకడు. గత ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. తద్వారా చెప్పాడంటే చేస్తాడంతే.. అని నిరూపించాం. ఇది నా ఒక్కడి పార్టీ కాదు. ఇది అందరి పార్టీ. అందుకే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పదవులు, నియామకాల్లో అగ్రభాగం కల్పించాం. రానున్న ఎన్నికలు పేదలకు ఎంతో కీలకం. మన పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందాలన్నా.. వారికి ట్యాబ్‌లు రావాలన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఎఫ్బీ ప్యానల్స్‌తో విద్యను అందించాలన్నా.. పోటీ ప్రపంచంతో మన విద్యార్థులు ధైర్యంగా ఢీకొట్టాలన్నా.. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను చేతికి అందాలన్నా.. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీరాలన్నా.. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ విధానం కొనసాగాలన్నా.. మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతీ ఒక్కరు గడప గడపకు వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జన నినాదాల నడుమ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు. సభలో అభిమాన జనం మధ్య ఏర్పాటు చేసిన ర్యాంపుపై అడుగులు ముందుకు వేస్తూ అభివాదం చేశారు. శంఖం పూరించి.. నగారా మోగించి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమని లక్షలాది మంది శ్రేణుల ఈలలు, కేకలు, నినాదాల మధ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 56 నెలలో కాలంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మనం చేసిన మంచి కనపడుతుందని తెలిపారు. సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు–నేడుతో మారిన పాఠశాలలతో రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ మార్క్, జగన్ మార్క్ కనిపిస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఆయన మార్క్ పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పథకాలే ఎన్నికల బాణాలు, అస్త్రాలు ► 2024 ఎన్నిల్లో మన పార్టీ జైత్ర యాత్రకు.. మరో పాతికేళ్ల పాటు సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపునకు.. ఈ భీమిలిలో సన్నాహక సమావేశం జరుగుతోంది. మన పార్టీని భుజాన మోసిన, మోస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఇక్కడ సమావేశమయ్యాం. మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాటా అధికారంలోకి వచ్చాక త్రికరణ శుద్ధితో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ఈ పార్టీలో మీతో నా ఆలోచనలను పంచుకోడానికే ఈ సమావేశం. ► పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో 56 నెలల కాలంలో అమలు చేస్తున్న పథకాలే మనకు రానున్న ఎన్నికలకు బాణాలు, అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. గెలుపే మన లక్ష్యం. దేవుడి దయతో ప్రతి ఇంటికి, ప్రాంతానికి, ఊరికి చేసిన మేలుతో చంద్రబాబుతో సహా వారంతా ఓడాల్సిందే. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వారికి లేదు ► గత ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేశాయి. మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది. అందుకే ప్రజలకు మనం దగ్గరయ్యాం. వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజలు తమ పార్టీగా భావిస్తున్నారు. చంద్రబాబు 75 ఏళ్ల వయస్సు మళ్లిన నాయకుడు. ► ఒంటిరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడు తున్నాడంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి. చంద్రబాబు తాను మంచి పని చేశానని, ఒక స్కీమ్ పెట్టామని చెప్పలేక.. కొత్త వాగ్దానాలతో గారడి చేయాలని చూస్తున్నాడంటే ప్రజల్లో వారు లేరని అర్థం. చివరికి 2019లో వచ్చినన్ని 23 స్థానాలు కూడా వారికి రావని అర్థం. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు అభ్యర్థులు కూడా లేరని అర్థం. మన చరిత్ర ఇంటింటి విజయగాథ ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్తు.. సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు. మనది వయస్సుతో పాటు మంచి భవిష్యత్తు ఉన్న పార్టీ. మన పాలనలో అన్ని రంగాల్లో చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రెండింటిలో సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ అని గర్వంగా చెబుతున్నా. నేను మోసాన్ని నమ్ముకోలేదు. ఇంటింటికి చేసిన సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకొని ప్రజల దగ్గరకు మళ్లీ వెళుతున్నాను. ► పేదరికం, అసమానత సంకెళ్లను బద్దలు కొట్టి.. ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ.. 21 శతాబ్ధంలోకి నడిపిస్తున్న మనసున్న, బాధ్యత గల ప్రభుత్వం మనది. ఇదే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. 70 రోజుల్లో ఎన్నికల యుద్ధానికి ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యతలు పెడుతున్నాం. అబద్ధానికి నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. 2014లో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చారు. అందులో 10 శాతం కూడా అమలు చేయలేదు. మన ప్రభుత్వం 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం వల్ల ప్రతి ఇంట్లో సంతోషం చూసి సంబర పడుతున్నాం. నా గుండెల నిండా మీరే.. ► పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ ఈ వర్గాలకే ఇచ్చాం. కేబినెట్లో ఏకంగా 68 శాతం మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ ఒక బీసీ, కౌన్సిల్ చైర్మన్‌గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఒక మైనార్టీ కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి వారిని గుండెల్లో పెట్టుకున్నాం. ఆలయ కమిటీ చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా కనిపిస్తున్నారు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు. ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే ఇది మనందరి ప్రభుత్వం. ► ఈ 56 నెలల్లో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ ప్రభుత్వం మరో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. ఇందులో ఏకంగా 80 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకొనే నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నా. ► అక్కచెల్లెమ్మలపై ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే లంచాలు, వివక్ష లేకుండా మీ బిడ్డ ఒక బటన్ నొక్కి రూ.2.53 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి వేశాడు. ఇంతటి ఆప్యాయత చూపిస్తున్నాం కాబట్టే అట్టడుగున ఉన్న వారికి అధికారుల నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వుతో సెల్యూట్ కొడుతున్నారు. పేద, సామాజిక వర్గాల మీద ప్రేమ చూపించడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ? ► పేద వర్గాలు కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు సీఎం నోటి నుంచి అటువంటి మాటలు వస్తే గ్రామాల్లో ఎవరైనా ఆ ఎస్సీలను పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్.. అంటే గ్రామాల్లో వారిని పట్టించుకుంటారా? చంద్రబాబుకు పేద, సామాజిక వర్గాలపై, వారి అభ్యున్నతిపై ప్రేమ ఎక్కడుంది? ఎక్కడ చూసినా, ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కనిపించేది వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ మాత్రమే. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు.. ► రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్లండి. మీ ఇష్టం. ఎక్కడకు వెళ్లినా ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. జగన్ ఏం చేశాడంటే.. ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలో ఎన్నెన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. 540 పౌర సేవలు. అందులో దాదాపు 10 మంది మన పిల్లలు శాశ్వత ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ఎక్కడా అవినీతి, లంచాలు, వివక్ష ఉండదు. ► ఇంటింటికీ ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా మన గడపకే తెచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వచ్చింది. అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. ఇటువంటివన్నీ మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. ► నాడు–నేడుతో విద్యా రంగానికి మంచి రోజులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబ్‌లు, ఐఎఫ్బీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్‌లు ఇలా అన్నీ మన ప్రభుత్వంలోనే అమలయ్యాయి. అదే గ్రామంలో సచివాలయంలో మహిళా పోలీస్. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోని ఫోన్లో దిశ యాప్.. వారికి ఎటువంటి అపాయం సంభవించినా కేవలం బటన్ నొక్కిన వెంటనే లేదా మొబైల్ అయిదుసార్లు ఊపితే 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు వచ్చి చెల్లమ్మను ఏమైందని అడిగే వ్యవస్థ వచ్చింది ఇప్పుడే. బ్రాడ్ బ్యాండ్, డిజిటల్ లైబ్రరీలు కట్టిందీ ఇప్పుడే. ► ఇలాంటి మంచి పనులు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ రాలేదు. ఎందుకంటే వీరు పెత్తందారులు కాబట్టి. పల్లె ప్రజలంటే బాబు దృష్టిలో పని మనుషులు. పెత్తందారుల పొలాల్లో, ఇళ్లలో పని చేసే పని మనుషులు. పొట్ట పోసుకోవడం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని చంద్రబాబు నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామం, పల్లె బాగుపడదు. ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, భవిష్యత్తు మారాలన్న తాపత్రయం పెత్తందార్లకు లేదు. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ ► రైతు సంక్షేమాన్ని చూస్తే మనమక్కెడ.. చంద్రబాబు ఎక్కడ? అని ఆలోచన చేయాలి. రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచింది చంద్రబాబు. రైతులు 87,612 కోట్లు బ్యాంకులకు కట్టొద్దని పిలుపిచ్చాడు. మొట్టమొదటి సంతకంతో రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టి రైతులను మోసం చేశాడు. ► ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైనా, ఎరువులైనా, ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పగటి పూట ఉచిత్ విద్యుత్, ఉచిత బీమా, సున్నా వడ్డీ అందుతున్నాయన్నా, ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ అందుతోందంటే గుర్తుకొచ్చేది జగన్. ► ఏ పొలంలోకి వెళ్లినా చంద్రబాబు చెప్పుకోడానికి ఏముంది? చంద్రబాబు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. 108, 104 చూసినా, 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ విస్తరించినా.. ఆరోగ్య ఆసరా చూసినా, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఇంటింటినీ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైద్య రంగంలో 53 వేల కొత్త నియామకాలు.. నాడు–నేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు.. ఇలా ఏది తీసుకున్నా ఒక వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ► ఏ ప్రభుత్వ బడిని తీసుకున్నా.. మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, తెలుగు, ఇంగ్లిష్ భాషలు ఉన్న పాఠ్యపుస్తకాలు, బైజూస్ కంటెంట్, మన ప్రభుత్వ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లలో ఐఎఫ్‌పీలు, గోరుముద్ద, బడి తెరిచే సరికే విద్యా కానుక, పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు అవ్వకూడదని ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లోని టాప్ యూనివర్శిటీల్లో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. జాబ్ ఓరియంటెడ్ కరిక్యులం ద్వారా ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలో చేర్చడం, ఇలా విద్యా రంగంలో ఏది తీసుకున్నా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పెత్తందారులను ఓడిద్దాం ► వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. వారి వంచనకు, మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో, పంచుకో, తినుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోడానికి మధ్య జరుగుతున్న యుద్ధం. వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఒక సైన్యంలా పని చేయాలి. ► ప్రతిపక్షాలు పది వైపుల నుంచి చేసే దాడులను వారి ఎల్లో మీడియాను, వారి సోషల్ మీడియాను, అందులో చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్పోన్లు ఉన్నాయి. అవే మీకు అస్త్రాలు. సెల్‌ఫోన్ ఉన్న ప్రతి పేద వాడు కూడా సోషల్ మీడియాను శాసించవచ్చు. బూత్ కమిటీల సభ్యులు, గృహ సారథులు, వలంటీర్లు, సామాన్య కార్యకర్త మొదలు, రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కీలకమైన పాత్ర పోషించాలి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు. 25కి 25 ఎంపీలు మన లక్ష్యం. ► ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగింది. అందులో 60 శాతం కుటుంబాలు మీ వెంట, మన వెంట ఉంటే అన్ని సీట్లు మనవే. మంచి చేసిన, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన, చేస్తున్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం, సై అంటున్న మీ బిడ్డకు మీరందరూ తోడుగా ఉండడానికి సిద్ధమా అని అడుగుతున్నా. (సిద్ధం.. అని జనం నుంచి కేకలు) జనంలో లేని, పేదవారి గుండెల్లో లేని వారు, దిగజారుడు పార్టీలన్నింటికీ మీ జగనన్నే టార్గెట్. పేదవాడి భవిష్యత్తు, వైఎస్సార్సీపీయే లక్ష్యంగా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను, ఓడించేందుకు మీరు సిద్ధమా.. (సిద్ధమేనని నినాదాలు) వారందరిపై ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరికీ భయపడడు. సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ మేం యుద్ధానికి సిద్ధమని వైఎస్సార్సీపీ ఇక్కడి నుంచి పిలుపునిస్తోంది. -
దుష్టచతుష్టయం.. గజదొంగల ముఠాతో ఇక సమరమే: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని.. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరన్నారు. చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు. మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదని.. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి.. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదని సీఎం ధ్వజమెత్తారు. ‘‘ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పాలన్నారు ‘‘మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా.? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం స్పష్టం చేశారు. -
సంగివలసలో సీఎం జగన్ సింహనాదం
సాక్షి, విశాఖపట్నం: ఇక్కడ ఉన్నది అర్జునుడు.. ఇటు పక్క పాండవ సైన్యం ఉంది. అటు పక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు. ‘‘ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు. ‘‘14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం. ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం. అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం . నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం. స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను నెరవేర్చాం. అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ?. మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం. ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే. ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి’’ అని సీఎం చెప్పారు. మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం పేర్కొన్నారు. -
Bheemili : యుద్ధానికి YSRCP సిద్ధం
సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు 5.45pm, జనవరి 27, 2024 భీమిలిలో అటు సముద్రం ... ఇటు జనసముద్రం కనిపిస్తోంది కురుక్షేత్ర యుద్దానికి సిద్ధమైన పాండవుల సైన్యం కనిపిస్తోంది అటు కౌరవ సైన్యం ఉంది .. గజ దొంగల ముఠా ఉంది ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు .. అర్జునుడు 175కు 175 ఈ యుద్ధంలో 175 కు 175 సీట్లు గెలుపే మన లక్ష్యం ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్ల పాటు మన జైత్రయాత్ర కు శ్రీకారం చుడుతున్నాం మన మేనిఫెస్టో లో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీ కి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు మంచి చేసాం.. ఓట్లు అడుగుతున్నాం చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు మరో 75 రోజుల్లోనే ఎన్నికలు అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం ఇదీ వెన్నుపోటు బాబు పాలనకు, రాజన్న రాజ్యానికి తేడా 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు మీ జగన్ ... రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం పదవుల్లో, అధికారంలో పెద్దపీట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం పేదల సొంతింటి కలను నెరవేర్చాం అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే మీ ఖాతాను అడగండి చెబుతుంది గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ? మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం మీ జగన్ .. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే ... జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం .. మోసాలు చేయడం తెలియదు మీ బిడ్డ చెప్పాడంటే .. చేస్తాడంతే ఈ యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? ఒంటరి పోరాటానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? దుష్టచతుష్టయాన్ని ..గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా ? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి దుష్టచతుష్టయం సోషల్ మీడియా లో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే Updates.. సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు మీ బిడ్డ చెప్పాడంటే... చేస్తాడంతే ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?: ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించండి అలా చేస్తే మళ్లీ లంచాలు, వివక్ష కల్గిన జన్మభూమి కమిటీలకు ఆమోదం తెలిపినట్లే పొత్తు లేకపోతే పోటీ చేయడానికే అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు వారి మాటలు వింటుంటే కొన్ని సామెతలు గుర్తుకువస్తున్నాయి ఓటి కుండకు మోత ఎక్కువ.. చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయి. కార్యకర్తలు.. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏం సంక్షేమం అందించిందో మీ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అర్ధమవుతుంది ఏ ఒక్క రూపాయి అయినా సంక్షేమం ద్వారా అందించారా అని వారినే అడగండి మళ్లీ అడగండి.. 2019 నుంచి 2024 వరకూ మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్మును చూడమనండి రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం కోవిడ్ కష్టకాలంలో సాకులు వెతుక్కోలేదు కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా, ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు.. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ ప్రభుత్వమని అందరికీ చెప్పండి వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్జీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పోరేటర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నా ఇది మీ పార్టీ.. ఇది ఒక జగన్ పార్టీ కాదు.. మీ అందరి పార్టీ వైఎస్సార్సీపీలో ఉన్నవారు.. వైఎస్సార్సీపీ కోసం కష్టపడ్డవారందరికీ కూడా ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గౌరవం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీనే 58 నెల కాలంలో ప్రతీ ఇంటికి మంచి చేయగలిగాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా పేద వర్గాలు కనిపిస్తే.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలా అంటాడు ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే గ్రామాల్లో ఉన్న ఎస్సీలు ఎవరైనా పట్టించుకుంటారా? బీసీలు తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్ అంటాడు చంద్రబాబు.. అలా చేస్తే గ్రామాల్లో ఉన్న బీసీలు పట్టించుకుంటారా? అసలు ఎక్కడ ఉంది.. చంద్రబాబుకు సామాజిక వర్గాలపై ప్రేమ అసలు ఎక్కడ ఉంది.. పేద సామాజిక వర్గాల అభ్యున్నతిలో చంద్రబాబు మార్క్ డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని అక్కా చెల్లెమ్మలకు చంద్రబాబు మోసం చేశాడు అక్కా చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు తోడుగా ఆర్బీకేలను నిర్మించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్‌బ్యాండ్‌లు తీసుకొచ్చాం 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువును అందుబాటులోకి తెచ్చాం ఏ రంగంలో చూసినా వైఎస్జగన్ మార్కే కనిపిస్తోంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీన వర్గాలకే ఇచ్చాం స్థానిక సంస్థల పదవులు అన్నింటిలోను సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం 3,257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరించాం ఒక్క వైద్య రంగంలోనే 53 వేల కొత్త నియామకాలు నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది ఇక్కడకు వచ్చిన ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు ఇటు పక్క పాండవ సైన్యం ఉంది అటు పక్క కౌరవ సైన్యం ఉంది అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు..ఇక్కడ ఉన్నది అర్జునుడు ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది ఆలోచన చేయండి.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు మన ప్రభుత్వం అలా కాదు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదు ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం 3:40PM, Jan 27, 2024 సంగివలస చేరుకున్న సీఎం జగన్ సంగివలస సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు 3:30PM, Jan 27, 2024 పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్ పాలనలో కార్యకర్తలకు గౌరవం పెరిగింది చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలి కుల, మత పార్టీలకతీంగా అందరికీ సంక్షేమం అందించాం 3:23PM, Jan 27, 2024 విశాఖ చేరుకున్న సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం విశాఖ బయల్దేరిన సీఎం జగన్ ►కాసేపట్లో భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ►ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ ►టీడీపీ, జనసేన కుట్రలను చిత్తు చేసేలా శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం ►34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ►175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం ►రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ►వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సాంగ్.. ఓ వైసీపీ కార్యకర్తలారా Full Song! 🎵🎶#Siddham pic.twitter.com/jaP4ASEMFH — YSR Congress Party (@YSRCParty) January 27, 2024 ►ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధం…✊🏻 పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు జెండాలు జతకట్టే టీడీపీ, జనసేన దోపిడీదారులపై యద్ధానికి సిద్ధం….✊🏻#Siddham#JaganannaAgenda pic.twitter.com/ypxwmcgfY7 — YSR Congress Party (@YSRCParty) January 26, 2024 ►ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ►సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ►సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి మూడు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు. బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి.. ►మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష పరిశీలించారు. -
పాడేరు టీడీపీలో
పాడేరు నియోజకవర్గంలో టీడీపీ నేతల వ్యవహారశైలి తలోదారి అన్నట్టుగా ఉంది. గత 20 ఏళ్లుగా ఉనికే లేని ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానానికి మింగుడు పడటం లేదు. పార్టీ ప్రధాన నేతలంతా ఐదు వర్గాలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం తలనొప్పిగా మారింది. ● వెలుగులోకి వర్గపోరు.. క్యాడర్ తలోదారి ● ఐదు గ్రూపులుగా విడిపోయిన నేతలు ● ఎవరికి వారే కార్యక్రమాల నిర్వహణ ● అసెంబ్లీ టికెట్ కోసం సిగపట్లు -
మాడుగుల ఎంపీపీ పదవికి రామధర్మజ రాజీనామా
మాడుగుల రూరల్ : మాడుగుల మండల పరిషత్ అధ్యక్ష పదవికి వేమవరపు రామధర్మజ (పెదబాబు) సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈవో ఎం.పోలినాయుడుకు అందజేశారు. తాను ఎంపీటీసీగా కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో పోలినాయుడు మాట్లాడుతూ ఎంపీపీ రాజీనామా లేఖను కలెక్టర్ అమోదం కోసం పంపిస్తామన్నారు. పెదబాబు మాట్లాడుతూ తనకు రెండున్నర సంవత్సరాలు పాటు సహకరించిన ఎంపీటీసీ సభ్యులు, నాయకులకు, ఉద్యోగులకు కృతజ్జతలు తెలిపారు. -
ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న సుమారు 3 లక్షల మందితో భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో 175/175 లక్ష్యంతో ఎన్నికల ప్రచారం సాగుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ఇచి్చన హామీలను అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా అమలుచేసి చూపించారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని భీమిలి బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమవుతారని చెప్పారు. పార్టీ క్యాడర్లో అసంతృప్తిని తొలగించడంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వైఎస్ జగన్ వివరిస్తారన్నారు. విశాఖ రాజధాని కావడం తథ్యం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యమని, దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే విశాఖ నగరం, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టిందని కొనియాడారు. కాదని చేప్పే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమిలి బహిరంగ సభకు ముందు ఈ నెల 21 నుంచి 23 వరకు ఉత్తరాంధ్రలో నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, దీనిని ప్రజలు చూస్తూ ఊరుకోరని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. తమ సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిస్తూ.. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. జూనియర్ ఎనీ్టఆర్ ఫ్లెక్సీలు ఎందుకు తీసేశారనేది టీడీపీ ఇష్టమని.. తమకు సంబంధం లేని అంశంపై తాను మాట్లాడనన్నారు. -
చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
సాక్షి, అనకాపల్లి జిల్లా: చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీకి గ్రాంట్ రూపంలో రూ.12 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. చెరుకు రైతుల బాకీల నిమిత్తం రూ.9 కోట్ల 30 లక్షల రూపాయలు, కార్మికుల జీతాల పెండింగ్ బిల్లుల కోసం మూడు కోట్ల రూపాయలు గ్రాండ్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. -
బండారు బెండు వంచారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీటు కోసం నోటికి పని చెప్పి... వయస్సును కూడా మరచిన బండారు బెండు వంచింది సొంత పార్టీ. రానున్న ఎన్నికల్లో పెందుర్తి నుంచి టికెట్ లేదంటూ ఆ పార్టీ అధినేత బండారుకు తేల్చిచెప్పినట్టు సమాచారం. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈ సీటును ఆ పార్టీకి కేటాయించనున్నట్టు పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల రాజకీయంలో ఉండాలంటే మాడుగుల నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తేల్చిచెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, మాడుగుల నుంచి బరిలోకి దిగేందుకు బండారు ససేమిరా అంటున్నారు. పెందుర్తి టికెట్ కావాలంటూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు వయస్సును కూడా మరచి మంత్రి రోజాపై అవాకులు చెవాకులు పేలారు. అయినప్పటికీ బండారుకు గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. పైగా ఆయన వ్యాఖ్యలతో మరింతగా పరిస్థితి దిగజారిపోయిందంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే ఇక బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ చాప్టర్ ముగిసిన అధ్యాయమేనని ఆయన వర్గీయులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా సీటు కోసం నోటికి పనిచెప్పి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని దిగజార్చుకున్నా ఫలితం లేకపోవడంతో తన సన్నిహితుల వద్ద పార్టీ అధినాయకత్వంపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి రోజాపై వ్యాఖ్యల తర్వాత బండారు రాజకీయ గ్రాఫ్ మరింత వేగంగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వాస్తవానికి గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా కూడా బండారు పనిచేశారు. గత ఎన్నికల్లో యువకుడైన అదీప్‌రాజ్ చేతిలో మట్టికరిచారు. అప్పటి నుంచి ఎలాగోలా వార్తల్లో ఉండేలా బండారు నోటికి పనిచెబుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ వార్తల్లో నిలిచే విధంగా చూసుకున్నారు. అయితే, ప్రజల్లో మద్దతు కోల్పోవడంతో ఆయనకు సీటు ఇచ్చినా గెలిచే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసినా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఆయన కుమారుడు వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకతను మరింతగా పెంచింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. కేవలం భూకబ్జాలకే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పెందుర్తి నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలంటూ జనసేన పార్టీ పట్టుబట్టింది. అయితే, పెందుర్తి నుంచి టికెట్ ఇవ్వకపోతే తన సత్తా చూపిస్తానంటూ బండారు సన్నిహితుల వద్ద తేల్చిచెబుతున్నట్టు తెలుస్తోంది. వయసైపోయిన నేపథ్యంలో తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుండటం.. ఇప్పటికీ వారసత్వంగా కొడుకును పరిచయం చేయకపోవడం బండారును చాలా బాధ పెడుతున్నట్టు తెలుస్తోంది. పెందుర్తి సీటుపై జనసేన కన్ను గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలవడంతో ఈ సీటు కోసం జనసేన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ పంచకర్ల రమేష్‌బాబు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారికంగా పార్టీ ప్రకటించనప్పటికీ ఈ సీటు తనదేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే, సీటు జనసేనకు కేటాయించినా తెలుగుదేశం పార్టీ వర్గాలు సహకరించేది కష్టమేననన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ సీట్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో తెలుగుదేశం–జనసేన కలిసి జెండాలు పట్టుకుని రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎక్కడా కలిసి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అధికారికంగా బండారుకు ఝలక్ ఇస్తే.. జనసేన అభ్యర్థికి సహకరించడం కష్టమేనని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఇరు పార్టీల పొత్తుకు ఇక్కడి నుంచే బీటలు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఏజెన్సీ ముఖద్వారంలో ‘సామాజిక’ జైత్రయాత్ర
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శనివారం ‘జై జగన్..జైజై జగన్’ నినాదాలతో దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం ఉత్సాహం, ఉత్తేజంతో సాగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికార పదవులు లభించాయని కొనియాడారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళితులకు అడుగడుగునా మేలు.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని కొనియాడారు. జనవరి 1 నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు. రెండు వేళ్లు చూపించే టీడీపీ నేతలకు.. ఇక వృద్ధులు, వితంతువులు మూడు వేళ్లు చూపాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా మేలు జరుగుతోందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఈసారి తనను రాజ్యసభకు పంపుతున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజల సంక్షేమం కోసం రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశంసించారు. వైద్య విప్లవం తీసుకొచ్చారు.. సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కొనియాడారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ.. సీఎం సహకారంతో రూ.2,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సాధికారతకు సీఎం జగన్ నిజమైన అర్థం చెప్పారని కొనియాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, పార్టీ నేత చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష పాల్గొన్నారు. -
‘ఆడుదాం ఆంధ్ర’పై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆడుదాం ఆంధ్ర పేరుతో విశాఖపట్నంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. విశాఖ వెస్ట్, నార్త్ నియోజక సమన్వయకర్తలు ఆడారి ఆనంద్, కేకే రాజు అధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఎన్ఏడీ నుంచి డీఎల్బీ గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర అద్భుతమైన కార్యక్రమం. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలను ప్రొత్సహించేందుకు అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి క్రీడాకారులకు మంచి ప్లాట్‌ఫామ్‌ను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభ బయటకు వస్తుంది. దీంతో, క్రీడాకారులను గుర్తించడమే కాకుండా వారికి కావాల్సిన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సరైన అవకాశాలు లేక క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ మరుగున పడిపోతోంది. ఆడుదాం ఆంధ్ర ద్వారామట్టిలో మాణిక్యాలను వెతికి తీయవచ్చు’ అంటూ కామెంట్స్ చేశారు. ( ఫైల్ ఫోటో ) మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. క్రీడలకు రాజకీయాలను ముడి పెట్టవద్దు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెతికి తీయడం కోసమే ఆడుదాం ఆంధ్ర. ఓటు హక్కు లేని వారు కూడా ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో పాల్గొంటున్నారు. నాడు-నేడు ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. మీరందరికి ఓట్లు లేవన్న సంగతి ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది.