visakha
-
Diarrhea: వందల మందిని వణికిస్తున్న డయేరియా
-
సాయంకాలం.. చదువుల తీరం!
మురళీనగర్(విశాఖ ఉత్తర): పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారు పదోన్నతులు పొందేందుకు గాను తమ విద్యార్హతలను పెంచుకునే అవకాశం లభిస్తే.. భలే ఉంటుంది కదూ. డిప్లమో కోర్సులను సాయం కాలం చదివే అరుదైన అవకాశం విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇస్టిట్యూట్(గైస్) అందిస్తోంది. రాష్ట్రంలో 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా సాయంకాలం కోర్సులు నిర్వహణకు విశాఖలోని గైస్‌ను ఏఐసీటీఈ ఎంపిక చేయడం విశేషం. అలాగే మరో రెండు ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలలు.. బెహరా(నరవ), ప్రశాంతి(అచ్యుతాపురం)లలోనూ సాయంత్రం కోర్సుల నిర్వహణకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చిoది. వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు కెమికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ విభాగాల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌గా 2024–25 విద్యా సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు కోర్సులను నవంబర్ 1న ప్రారంభిస్తారు. ప్రతి కోర్సులోనూ 33 సీట్లుండగా.. వీటిలో 3 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉంటాయి. వీరు ఈ నెల 21 నుంచి 26వ వరకు సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బెహరా పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, మెకానికల్, ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీ(అచ్యుతాపురం)లో సివిల్ , మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. టైమింగ్స్: రోజూ సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు, ఆదివారం, సెలవు దినాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 వరకూ తరగతులు నిర్వహిస్తారు. అర్హత: గుర్తింపు పొందిన పరిశ్రమల్లో, లేదా కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో, ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ/ఐవీసీ/లేదా ఐటీఐ సర్టిఫికెట్తో కెమికల్ ప్లాంట్ మెయింటెనెన్స్ మెకానిక్/అటెండెంట్ ఆపరేటర్, లేబొరేటరీ అసిస్టెంట్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తదితర విభాగాల్లో ఏడాది రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. పై 3 కళాశాలకు 50 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. -
గ్లోబల్ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ : ఫైనలిస్ట్‌గా విశాఖ విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి పేరూరి లక్ష్మీ సహస్ర ప్రతిష్టాత్మక 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (TDCAC) గ్లోబల్ కాంపిటీషన్లో ఉత్తమ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఎంపికైంది. ఈ సందర్బంగా "టొయోటాస్ మెమరీ కార్" ఆర్ట్‌ను రూపొందించిన ఆమెను టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల సత్కరించింది. 90 దేశాలనుంచి 712,845 ఎంట్రీల్లో టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో లక్ష్మీ సహస్ర సంపాదించు కోవడం విశేషం. 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, రూ.2.51 లక్షల (3,000 డాలర్లు) బహుమతి గెల్చుకుంది.టొయోటా మోటార్ కార్పొరేషన్ 2004లో టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. "డ్రీమ్ కార్లను" తయారు చేసేలా విద్యార్థులను, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తుంది. లక్షల కొద్దీ పిల్లల ఆసక్తితో పోటీ విపరీతంగా పెరిగింది. ప్రారంభంనుంచి ఇప్పటిదాకా 144 దేశాలు, ప్రాంతాల 9.4 మిలియన్లకు పైగా పిల్లలు పాల్గొన్నారు, సృజనాత్మకతను పెంపొందించడం , రవాణా మరియు స్థిరత్వ భవిష్యత్తు గురించి ఆలోచించేలా యువతలో ఆలోచన రేకెత్తించడమే దీని ఉద్దేశం.15 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మూడు విభాగాలుగా విభజించారు: 7, 8–11 ,12–15 ఏళ్లలోపు. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 26 మంది విజేతలు ఎంపికయ్యారు. వీరిలో పేరూరి లక్ష్మీ సహస్ర కూడా ఒకరు.ఆమె కళాత్మక సృష్టి స్ఫూర్దిదాయకంటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ- మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానమైన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వానం పలకడమని టొయాటో సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. ప్రపంచ వేదికపై సహస్ర సాధించిన విజయం స్ఫూర్తిదాయకమన్నారు. చాలా సంతోషంగా ఉందిటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది లక్ష్మీ సహస్ర. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించా..అదే డ్రీమ్ కారు టొయోటాస్ మెమరీ కార్. సాంకేతికత అనేది మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో, అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. తన లాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటాకు కృతజ్ఞతలు చెప్పింది. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం, పేరూరి లక్ష్మీ సహస్ర అవార్డు-గెలుచుకున్న కారుఘార్ట్ ఇతర అద్భుతమైన ఎంట్రీలు చూడాలనుకుంటే, అధికారిక పోటీ వెబ్సైట్ toyota-dreamcarart.com. వీక్షించవచ్చు. -
విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న కంటైనర్ టెర్మినల్ లో అగ్నిప్రమాదం
-
విశాఖ స్టీల్ వద్ద ఉద్రిక్తత
-
విశాఖలో ఘనంగా వినాయక చవితి సంబురాలు (ఫొటోలు)
-
చంద్రబాబుకు కార్మికుల డెడ్ లైన్..
-
చివరకు తప్పుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పోటీకి అందరూ ససేమిరావాస్తవానికి.. ఎలాగైనా ఎవరో ఒకర్ని పోటీలో నిలపాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు భావిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం, వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ అ«భ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్లలో ఎవరో ఒకర్ని పోటీచేయించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, గెలిచేందుకు ఏమాత్రం అవకాశంలేకపోవడం.. పైగా బలమైన ప్రత్యర్థి బొత్స ఉండడంతో పోటీకి వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు. ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశపెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్ కూడా ఈయన పేరును తెరపైకి తెచ్చారు. గెలిచే అవకాశంలేని ఎమ్మెల్సీ సీటుకు పోటీచేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడంతో గత్యంతరంలేని స్థితిలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఓటమి భయంతోనే వెనకడుగుఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఓటమి ఘోర పరాభవం కింద లెక్కే. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఇదే జరిగింది.అక్కడ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని తట్టుకుని నిలబడటం టీడీపీకి పెను సవాల్‌గా మారే పరిస్థితి ఉందని.. పైగా, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతులెత్తిసినట్టు సమాచారం. బొత్స ఎన్నిక లాంఛనమేమరోవైపు.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ సవాల్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు. గడువులోగా ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ జరిగినా బొత్స ఎన్నిక లాంఛనమే. దిలీప్‌కు హితోపదేశం..! ఇదిలా ఉంటే.. దిలీప్ పేరుని ప్రతిపాదించిన లోకేశ్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్లు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దిలీప్ చక్రవర్తికి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ద్వారా మంతనాలు ప్రారంభించారు. సదరు అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తికి హితోపదేశం చేయడం ప్రారంభించారు. రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు ఖర్చుచేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. డబ్బులు, టైమ్ వేస్ట్ అంటూ బ్రెయిన్‌వాష్ చేశారని సమాచారం. ఓట్ల అంతరం చాలా ఉందనీ.. దాన్ని అధిగమించడం కష్టమనీ.. అందుకే ఓడిపోయే సీటును అంటగట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. నామినేషన్ వేసి.. కోట్ల రూపాయలు నష్టపోయే కంటే.. అసలు పోటీలో ఉండకపోవడం మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే గండి బాబ్జీ, పీలా గోవింద్‌లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వివరించారు. అంతా విన్న దిలీప్ పోటీచేయలేనంటూ లోకేశ్‌కి తెగేసి చెప్పేశారు. -
విశాఖ బీచ్ రోడ్డు డైనోసర్ పార్క్ లో అగ్నిప్రమాదం..
-
బాబుకు టీడీపీ నేతల వార్నింగ్..
-
వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
-
Vizag MLC Election: కూటమిలో కన్ఫూజన్.. పోటీ చేయాలా? వద్దా?
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు వద్దకు చేరినా పంచాయితీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు.వైఎస్సార్ సీపీకి పెరిగిన మరింత బలంమరో వైపు ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉండగా మరో ముగ్గురు ఓటు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు నమోదు కార్యక్రమం శనివారంతో ముగిసింది. కొత్తగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, డాక్టర్ కుంభా రవిబాబు దరఖాస్తు చేశారు. వీటిని విచారణ కోసం జీవీఎంసీకి పంపారు. ఈనెల 13న తుది జాబితాను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.16 మంది ఎంపీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ సీపీకి 477 మంది, టీడీపీకి 116 మంది, ఇండిపెండెంట్లు 28 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఆరుగురు, సీపీఐకి ఇద్దరు, సీపీఎంకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. యలమంచలి పురపాలక సంఘం పరిధిలో 25 మంది కౌన్సిలర్లు, నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. -
విశాఖలో హ్యాండ్లూమ్స్ కోసం చీర కట్టులో స్పెషల్ వాక్ ర్యాలీ (ఫొటోలు)
-
అమ్మో ఏపీకా?
సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడదామనుకున్న వారు మరో దారి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో వెలుగులీనిన విశాఖ నగరం... ఇప్పుడు విలవిల్లాడుతోంది. ఒక్క విశాఖ నగరమే కాదు.. ఆంధ్రప్రదేశ్ వైపు ఐటీ పరిశ్రమలు రావాలంటేనే మొహం చాటేస్తున్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలంటే.. అమ్మో.. ఏపీకా.. అంటూ భయపడుతున్నాయి. నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్కుబై బై చెబుతున్నాయి. విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ ఇప్పుడు వెనకడుగు వేసి, చెన్నైకి చెక్కేసింది. ఆరు నెలలుగా విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో కూడా ఆలోచనలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, హింసా వాతావరణంతో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, ఇతర పెట్టుబడిదారులు జంకుతున్నారు. ఒక్కసారిగా కుదుపువిభిన్నమైన ఐటీ పాలసీని మెచ్చి.. గత మూడేళ్లుగా దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతూ ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ వంటి సంస్థలు వరుసగా క్యూ కట్టాయి. దివంగత వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ.. ఆరు నెలల క్రితం కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా.. దిగ్గజ కంపెనీలన్నీ.. ఏపీలో శాఖలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రశాంత వాతావరణం కాస్తా.. అశాంతి వాతావరణంగా మారడంతో అన్ని సంస్థలూ పునరాలోచనలో పడిపోయాయి. ఏపీలో అడుగు పెట్టాలంటేనే ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు భయపడిపోతున్నాయి. ఇందుకు క్యాప్జెమినీనే ఉదాహరణ. అడుగడుగునా దాడులు.. బెదిరింపులు నెల రోజులుగా రాష్ట్రంలో వరుస దాడులు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార దిగ్గజాలను బెంబేలెత్తిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కాకుండా వ్యాపార సంస్థలపై కూడా వరుస దాడులు జరిగాయి. రైస్ మిల్లులు, ఫ్యాక్టరీలను మూయిస్తున్నారు. నిన్నటికి నిన్న మామూళ్లివ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ‘మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్ని రోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. వారు పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకుని లారెన్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన 11 లారీల అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. వెంటనే మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీల లారీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ రైస్ మిల్లును మూయించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్ బ్రూవరీస్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. ముడి సరుకు తీసుకొస్తున్న లారీలను ఆపేశారు. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పగులగొడుతున్నారు. ఊళ్లొదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారాల్లో ఉచిత వాటాలు కోరుతూ.. ఒప్పుకోని వారిపై కక్షగట్టి దాడులు చేస్తున్నారు. మేం ఫలానా వాళ్ల తాలూకా.. మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. మేం లోకేశ్ తాలూకా.. అంటూ బండ్లు, వాహనాలపై పేర్లు రాసుకుని బెదిరింపులకు దిగుతుండటం కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల బండ్ల నంబర్ ప్లేట్లు తీసేసి ఇలా రాసుకుని తిరుగుతూ వ్యాపారులను, ప్రజలను భయపెడుతున్నారు. అందుకే పలు సంస్థలు మరో దారి రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇప్పటికే ఇక్కడకు రావాలని నిర్ణయించిన పలు సంస్థలు మరో దారి చూసుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సాహసమే అవుతుందని ఆలోచిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయమై.. దేశంలోని ఇతర నగరాలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. లక్నో, ఇండోర్, జైపూర్, కొచ్చి, నాగ్‌పూర్, చండీగఢ్ తదితర నగరాలవైపు అడుగులు వేస్తున్నాయి. విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో సంస్థ కూడా.. పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విస్తరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్రంలో పరిస్థితి వారిని కలవరపెడుతోందని సమాచారం. కొన్నాళ్లు వేచి చూసి.. తదుపరి నిర్ణయం తీసుకోవాలని విప్రో ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని ఐటీ అనుబంధ సంస్థలు, బీపీవోలు కూడా విశాఖలో శాఖలు ఏర్పాటు చేయాలని భావించినా, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయని ఐటీ రంగ ప్రముఖుడొకరు తెలిపారు. అధికార పార్టీ నేతల తీరు వల్ల ఐటీ రంగం మళ్లీ కునారిల్లే దుస్థితి వచ్చిందని ఐటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.విశాఖ కంటే.. చెన్నై బెటర్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు తమ కార్యక లాపాల్ని సాగరనగరిలో విస్తరించేందుకు గతంలో సన్నద్ధమైంది. క్యాప్ జెమినీ సంస్థ కూడా తమ శాఖను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇతర నగరాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల మధ్య క్యాప్ జెమినీ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ జాబితాలో వైజాగ్‌ని కూడా చేర్చింది. క్యాప్‌జెమినీలో పని చేస్తున్న వారిలో ఇప్పటి వరకు సింహభాగం ఉద్యోగులు విశాఖను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఇన్ఫోసిస్‌లో కూడా ఇదే విధమైన సర్వే చేశారు. ఫిబ్రవరిలో క్యాప్ జెమిని సంస్థ ప్రతినిధులు సైతం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు క్యాప్‌జెమినీ సంస్థ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే నెల రోజులుగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలించిన సంస్థ.. చెన్నైలో విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రూ.1,000కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా 2027నాటికి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంస్థ గతంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అనుకూల వాతావరణం కనిపించి ఉంటే కచ్చితంగా ఈ సంస్థ శాఖ విశాఖలో విస్తరించేది. టీడీపీ, జనసేన నేతల దాడులు, విధ్వంస పర్వంతో రాష్ట్రంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తుండటంతో ఇది సరైన వేదిక కాదని మానసు మార్చుకుని క్యాప్‌జెమినీ సంస్థ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. -
సముద్ర జలాల్లో శాంతి స్థాపనే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సురక్షిత నౌకాయానం, రూల్–బేస్డ్ వరల్డ్ ఆర్డర్, యాంటీ పైరసీ, హిందూ మహా సముద్ర ప్రాంత(ఐవోఆర్) పరిధిలో శాంతి– స్థిరత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో సారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన విశాఖలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇండియన్ నేవీ ఉనికిని మరింత ప్రభావవంతంగా చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు చెందిన స్నేహపూర్వక దేశాలు సురక్షితంగా ఉంటూ పరస్పర ప్రగతి పథంలో కలిసి ముందుకు సాగేలా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశ అభివృద్ధిలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందనీ.. అంతర్జాతీయ వేదికగా భారత నౌకాదళ ఖ్యాతి పెరుగుతోందని ప్రశంసించారు. ఆర్థిక, సైనిక శక్తి ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశం ప్రమాదంలో పడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగిన భారత నౌకాదళం భరోసానిస్తోందన్నారు. పాక్ పౌరుల్ని రక్షించి మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది ఈ ఏడాది మార్చిలో అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీ పౌరులను సోమాలి సముద్రపు దొంగల బారి నుంచి విడిపించినప్పుడు నేవీ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ తీరు ప్రశంసనీయమన్నారు. జాతీయత, శత్రుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా ఇండియన్ నేవీ సిబ్బంది వ్యవహరిస్తూ.. మానవత్వ విలువల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. భారతదేశ వాణిజ్య ప్రయోజనాలు ఐవోఆర్తో ముడిపడి ఉన్నాయనీ, వి్రస్తృత జాతీయ లక్ష్యాలను సాధించేందుకు నౌకాదళం సముద్ర సరిహద్దులను సంరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. పెరుగుతున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల ద్వారా భారత నౌకాదళం నిరంతరం బలపడుతోందన్నారు. షిప్‌యార్డ్‌లు విస్తరిస్తున్నాయనీ, విమాన వాహక నౌకలు బలోపేతమవుతున్నాయన్నారు. ఇండియన్ నేవీ కొత్త శక్తివంతమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఘన స్వాగతం తొలుత విశాఖలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి చేరుకున్న రక్షణ మంత్రికి ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. 50 మందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌తో సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రానికి చేరుకున్న ఆయన ఐఎన్ఎస్ జలాశ్వలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ నౌకలు, జలాంతర్గాములు, నేవల్ కమాండ్ విమానాల ద్వారా డైనమిక్ కార్యకలాపాలను వీక్షించారు, తూర్పు సముద్ర తీరంలో భారత నౌకాదళం కార్యాచరణ సంసిద్ధతని రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షించారు. ‘డే ఎట్ సీ’ ముగింపులో భాగంగా స¯Œరైజ్ ఫ్లీట్ సిబ్బందితో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భోజనం చేశారు. గౌరవ వీడ్కోలు అనంతరం.. ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ఢిల్లీకి పయనమయ్యారు. -
విశాఖలో సెయిలర్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సెయిలర్స్ కోసం సాగర్ పేరుతో ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ విశాఖలో ప్రారంభమైంది. నావికుల శిక్షణ కోసం ఐఎన్ఎస్ విశ్వకర్మ బేస్‌లో ఉన్న సెయిలర్స్ ఎనెక్స్ ఇన్స్టిట్యూట్ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించారు. సాగర్ పేరుతో ఆధునికీకరించిన ఈ భవనాన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ బుధవారం ప్రారంభించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేసిన సాగర్‌లో పురుషులతో పాటు మహిళా సెయిలర్స్, అగ్నివీర్లకు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించే వారి కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈఎన్సీ చీఫ్ అడ్మిరల్ పెందార్కర్ తెలిపారు. భారత దేశ రక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న సెయిలర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణంలో మోటివేషన్ అందించడంతో పాటు విశ్రాంతి తీసుకునేలా సాగర్ నిర్మాణం సాగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు. నౌకాదళ సిబ్బందికి ‘ఏఐ’ క్యాప్సుల్ కోర్సు సాంకేతిక పరిజ్ఞానంలో నౌకాదళ సిబ్బంది ప్రతిభా పాటవాలు మెరుగు పరిచేందుకు తూర్పు నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాప్సుల్ కోర్సును అందించారు. గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ కళింగలో ఈనెల 10 నుంచి 3 రోజుల పాటు ఏఐ అప్లికేషన్స్‌తో పాటు మెషిన్ లెర్నింగ్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా సందేహాలు నివృత్తి చేయడంతో వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్‌లో ప్రయోగాత్మక వివరణలు అందించారు. శిక్షణలో పాల్గొన్న తూర్పు నౌకాదళ సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు. -
విశాఖపట్నంలో కూటమి నేతల హంగామా
విశాఖ సిటీ/ ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ నగరంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రుషికొండ పర్యాటక భవనాలపై టీడీపీ జెండా ఎగుర వేశారు. బీచ్‌రోడ్డులో అభివృద్ధి చేసిన వైఎస్సార్ వ్యూపాయింట్ వద్ద ఉన్న వైఎస్సార్ నేమ్ బోర్డును కాళ్లతో తన్నుతూ తొలగించారు. వీఐపీ రోడ్డు జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్లను తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు వారిస్తున్నా.. జేసీబీతో కొన్ని స్టాపర్లను తీసేశారు. బుధవారం టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీతో పాటు మరికొందరు నాయకులు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్టాపర్లను తొలగించారు. సాయంత్రానికి పోలీసులు మళ్లీ వాటిని ఏర్పాటు చేశారు.విశాలాక్షినగర్ సమీపంలో బీచ్‌రోడ్డులో సీతకొండ వద్ద వైఎస్సార్ సీ వ్యూ పాయింట్ బోర్డును కొందరు ధ్వంసం చేశారు. ఇక్కడ వై.ఎస్.ఆర్. అనే అక్షరాలపై మంగళవారం రాత్రి అబ్దుల్ కలాం పేరుతో ఉన్న సిక్కర్‌ను అంటించారు. బుధవారం ముగ్గురు వ్యక్తులు అబ్దుల్ కలాం స్టిక్కర్‌ను తొలగించారు. బోర్డుపై ఉన్న వై.ఎస్.ఆర్. అక్షరాలను రాడ్డులతో కొట్టి తీసేశారు.మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ దాడిసుబ్బారెడ్డి సోదరుడికి తీవ్ర గాయాలు ∙ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే దాడిరాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఎండపల్లి గ్రామంలో అలజడి మొదలైంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సిద్దార్థ గౌడ్, అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు సుబ్బారెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా సుబ్బారెడ్డి ఇంటిలో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎండపల్లి గ్రామం బోయపల్లెలో సుబ్బారెడ్డి ఇంటిపైకి సిద్ధార్ధ గౌడ్, అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. రాళ్లు రువ్వుతూ దాడికి తెగబడ్డారు. ఇంటి బయట ఉన్న సుబ్బారెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకోబోయిన సుబ్బారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి పైనా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. వెంకటరామిరెడ్డి ఇంట్లోకి చొరబడి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి హుటాహుటిన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి చెప్పారు. -
విశాఖ జైలులో ఈ–ములాఖత్‌లు ప్రారంభం
ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్‌ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్‌కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్‌లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్సైట్లో అప్లికేషన్‌ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్సైట్ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్‌కు రాలేని వారు ఇకపై ఆన్లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు. -
ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో సంచలన రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి సాధించామని విశాఖ సీపీ రవిశంకర్ అన్నారు. ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, కంబోడియా నుంచి విశాఖకి చెందిన 58 మందిని మేము భారత్ కి తీసుకొని వచ్చామని వెల్లడించారు.ఇప్పటికే వారు ఢిల్లీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5:15 నిమిషాలకు విశాఖకి బాధితులు వస్తారు. ఎన్.ఐ.ఎలో నాకున్న అనుభవంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నా. ఈ ముఠా వెనుక ఉన్న చైనా గ్యాంగ్‌ను పట్టుకుంటామని సీపీ తెలిపారు.కాగా, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టింది.ఇది జరిగింది..గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు.ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది.సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నారు. -
మహా వైశాఖి అంటే..? ఇది బుద్ధ పూర్ణిమగా ఎందుకు ప్రసిద్ధి..?
మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. పూర్ణిమ విశిష్టత..ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు. బుద్ధ పూర్ణిమ అని ఎందుకు పిలుస్తామంటే.. వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. బోధి వృక్షానికి పూజలు..బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత, అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు. వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం నుంచే వచ్చాయని పురాణ వచనం.(చదవండి: 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?) -
విశాఖ జూకు కొత్త అతిథులు
ఆరిలోవ (విశాఖజిల్లా): విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (సీజెడ్ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది.కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచు తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్‌కతాలోని అలీపూర్ జూ పార్కు నుంచి జంతుమారి్పడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, జత స్కార్లెట్ మకావ్ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్‌నెక్డ్ వాలిబీ, స్వైరల్ మంకీస్, మార్మోసెట్ మంకీస్, గ్రీన్ వింగ్ మెకావ్లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లు జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం వంద సంవత్సరాలు. ఇవి అరుదైనవి. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. ఇతర జూ పార్కుల నుంచి జంతుమారి్పడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.త్వరలోనే కొత్త వన్యప్రాణులు విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్కాట్, రెడ్‌నెక్డ్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్ఏ అనుమతులు లభించాయి. అహ్మదాబాద్ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పోలింగ్ సరళి చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 4వ తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీ, హామీల అమలు ముఖ్యమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇలాంటి ప్రమాణాలు పాటిస్తూ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీని విజయం వైపు తీసుకెళ్తోందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్ జగన్‌కే ఉందని, వారంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారని తెలిపారు. లబ్ధి పొందిన ప్రతి మహిళా మళీ సీఎంగా వైఎస్ జగన్ కావాలని కోరుకుంటున్నారన్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, వృద్ధులకు ఇంటికే పింఛన్ అందుతుందని, అవినీతి లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ పథకాల ఆర్థిక సహాయం అందుతుందని భావించి ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు అధికార దాహంతో అనేక రకాల కుయుక్తులకు పాల్పడ్డాడని, స్థాయికి తగని తప్పుడు భాష వాడారని తెలిపారు. వ్యక్తిగతంగా కుటుంబంపై దూషణలు చేశాడన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన దౌర్భగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కుటిల యత్నాలు చేశాడని తెలిపారు. చివరికి పోలింగ్ రోజు కూడా వైఎస్సార్సీపీ వారిపై దాడులు చేయించాడన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చంద్రబాబు ఓటమి ఖాయమైందని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. ఫలితాలు వచ్చే వరకూ చాలా విధాలుగా వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా టీడీపీ వారితో మాట్లాడిస్తాడని, ఎవరూ ఉద్రిక్తతకు లోనుకాకుండా సంయమనం పాటించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించబోహని కరాఖండిగా చెప్పారు. ఓటర్లలో చైతన్యం చూశాం: బొత్స ఝాన్సీ వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గత 35 రోజులుగా ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, జగనన్న అభిమానులు, విశాఖ ప్రజలు, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన ప్రతి ఓటరుకూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళా ఓటర్లలో చైతన్యం చూశామని, ఉదయం నుంచే మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారని చెప్పారు. గత ఎన్నికలకంటే ఎక్కువగా పోలింగ్ జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనడానికి ఇది సూచిక అని తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కూడా పాల్గొన్నారు. -
నేను గెలుస్తానో లేదో..
సాక్షి,విశాఖపట్నం/పాలకొండ/వీరఘట్టం: విశాఖ ఎన్నికల సభలో జనసేన అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. యువత గుండెల్లో నిప్పంటించడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడు కూడా గుర్తుకు రాడంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదోనని.. పదవి వస్తుందో రాదోనని కూడా అనుమానం వ్యక్తంచేశారు. తాను నటుడిని కాకపోతే సాయుధ పోరాటంలోకి వెళ్లేవాడినన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అంతా అవగాహన చేసుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలని, అందుకే తాను గత ఎన్నికల్లో గాజువాక, భీమవరాల్లో ఓడిపోయినా బాధపడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను యువత ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, ఆయనలో ఏముందని ప్రశ్నించారు. విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి జగదాంబ జంక్షన్లో కూర్చోబెడతానని, తొక్కేస్తానని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకపక్క ఆవేశంతోను, మరోవైపు నిర్వేదంతో ప్రసంగించిన పవన్ చెప్పిన అంశాలనే పదేపదే ప్రస్తావించి సభికులకు బోరు తెప్పించారు. పవన్ వచ్చిన కాసేపటికే జనం తిరుగు ముఖంపట్టారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పవన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపెద్ద పోస్టర్లు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. -
విశాఖలో కాపు ఆత్మీయ సమావేశం..!
-
ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..
మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. తండ్రి సెల్‌కి పంపిన మెసేజ్ ఇలా.. హాయ్ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అని బెదిరించారు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో, ర్యాగింగ్ కేసు నమోదు మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.