Vizianagaram District News
-
No Headline
తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్నట్టు గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)కు వేతనాలు చెల్లించాలని ఏపీ వీఆర్ఏల సంఘం డిమాండ్ చేసింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలు సోమవారం ధర్నా చేశారు. వీఆర్ఏలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో నిబంధన విరుద్ధంగా గ్రామ రెవెన్యూ సహాయక సిబ్బందిని నైట్ వాచ్‌మన్‌గా, ఇసుక రీచ్ పాయింట్లో నైట్ డ్యూటీలు వేస్తున్నారని, తక్షణమే వీటిని రద్దు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు బి.సూర్యనారాయణ, వీఏఓలు పాల్గొన్నారు. – విజయనగరం అర్బన్ -
ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని పార్టీలు సహకరించాలి
శాసనమండలి స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీచేశామని, ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమైందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాయింట్ కలెక్టర్ చాంబర్లో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. నవంబర్ 11న మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 12న నామినేషన్ల పరిశీలన, 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. శాసన మండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం పార్వతీపురం, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓట్లలెక్కింపు డిసెంబర్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జరుగుతుందన్నారు. డిసెంబర్ 2 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణకు జేసీ ఎస్.సేతు మాధవన్ రిటర్నింగ్ అధికారిగా, విజయనగరం, పార్వతీపురం జిల్లా రెవెన్యూ అధికారులు ఏఆర్ఓలుగా వ్యవహరిస్తారని తెలి పారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, డీఎస్పీ పి.శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.వి.పి.రాజు, నరసింహమూర్తి, సోములు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.బి.ఆర్.అంబేడ్కర్ కోరారు. వచ్చేనెల 2వ తేదీ వరకు ఎన్నికల కోడ్ జిల్లాలో అమలులో ఉంటుందని స్పష్టంచేశారు. జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్.సేతుమాధవన్‌తో కలిసి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళి అమలుపై పర్యవేక్షణ, నిఘాకు ఎనిమిది బృందాలను నియమించామని కలెక్టర్ చెప్పారు. మరో ఎనిమిది వీడియోగ్రఫీ బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ శాసన మండలి ఉప ఎన్నికకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 2వ తేదీన ప్రచురించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 727 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 325 మంది ఓటర్లలో పురుషులు 132 మంది, మహిళలు 193 మంది, విజయనగరం జిల్లాలోని 402 మంది ఓటర్లలో మహిళలు 239 మంది, పురుషులు 163 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను 8వ తేదీలోగా తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఈ నెల 10న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. ఉదయం 11 నుంచి నామినేషన్ల స్వీకరణ కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ నామినేషన్ల స్వీకరణ -
–8లో
మోడల్ కోడ్ అమలు చేయాలి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు.బిల్లులు పెంచితే స్పందిస్తాం విద్యుత్ చార్జీలు పెంచుతారని అంటున్నారు. ఇంకా మాకు పూర్తి సమాచారం అందలేదు. బిల్లులు పెంచితే అప్పుడు స్పందిస్తాం. – శ్రీనివాసరాజు, ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల సంఘ ప్రతినిధి, బొబ్బిలి -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
విజయనగరం అర్బన్: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యంను ఈ నెల మూడోవారం నుంచి రైతు సేవా కేంద్రాల(ఆర్బీకేలు) ద్వారా కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ఆనందగజపతి ఆడిటోరియంలో సోమ వారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 3.40 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ–పంట నమోదు చేసు కొని ఈకేవైసీ పూర్తయిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు. గోనె సంచులను సరఫరా చేస్తామని, రైతులు స్వయంగా సమకూర్చుకొంటే ఆ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో ధాన్యం సొమ్ముతో కలిపి జమచేస్తామన్నారు. ధాన్యాన్ని సంచుల్లో నింపడం, తూకం వేయడం, సంచులు కుట్టడం, వాహనంలోకి లోడ్ చేయడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. సాధారణ రకం (కామన్ ) క్వింటా రూ.2,300, గ్రేడ్–ఏ రకం క్వింటా రూ.2,320 చొప్పున ధర చెల్లిస్తామని తెలిపారు. బయట మార్కెట్లో అధిక ధర లభిస్తే రైతులు విక్రయించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మీనాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, జిల్లా సహకార అధికారి రమేష్, తదితరులు పాల్గొన్నారు. ● ఈ నెల మూడో వారం నుంచి ధాన్యం కొనుగోలు: జేసీ సేతుమాధవన్ -
వైద్య సేవల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
పూసపాటిరేగ: మండలంలో డయేరియా ప్రభావిత గ్రామమైన ఎరుకొండను కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమవారం సందర్శించారు. ముందుగా పీహెచ్సీలో వైద్యసేవలు పొందుతున్న ఎరుకొండ డయేరియా బాధితులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి కారణమేమిటని వైద్యాధికారి రాజేష్వర్మను ప్రశ్నించారు. గ్రామీణనీటి నీటిసరఫరా విభాగం పైపులైన్ లీకేజీల వల్ల నీరు కలు షితం కావడంతో వ్యాధి ప్రబలిందని వైద్యాధికారి చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహిస్తూ.. హెల్త్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చి సస్పెండ్ చేయిస్తాను, యు ఆర్ ఏ ఇంజినీర్.. ఏమి మాట్లా డుతున్నారంటూ మండిపడ్డారు. వైద్యసేవలు అందించడంలో జిల్లా వైద్యవిభాగం విఫలమైందంటూ పక్కనే ఉన్న డీఎంహెచ్ఓ భాస్కరరావును చూస్తూ అసహనం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు వద్దకు వెళ్లి.. ఆస్పత్రిలో చేరి ఎన్ని రోజులు అవుతోందని ప్రశ్నించారు. ముందుగా ఒకసారి చేరాను.. తగ్గిపోయిందని ఇంటికి పంపించారు.. మళ్లీ డయేరియా బారిన పడడంతో ఆస్పత్రిలో చేరినట్టు బాధితుడు తెలిపారు. పూర్తిస్థాయిలో ఎందుకు చికిత్స అందించలేదంటూ వైద్యసిబ్బందిని ప్రశ్నించారు. డయేరియాను ఎందుకు అదుపుచేయలేకపోయారంటూ నిలదీశారు. మరో ముగ్గురు బాధితులను పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగితెలుసుకున్నారు. అక్కడ నుండి ఎరుకొండ గ్రామం వెళ్లి గ్రామంలో డయేరియా పరిస్థితిపై ఆరా తీశారు. డయేరియా వ్యాప్తిపై సర్పంచ్ గొట్టాపు అప్పలస్వామిని అడిగి తెలుసుకున్నారు. గ్రామదేవత పండగ జరగడంతో ఆహారం వికటించి ఉండవచ్చని ఆయన తెలిపారు. గ్రామస్తులకు స్వచ్ఛమైన నీరు అందేలా చూడాలన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ దాట్ల కీర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.ఉమాశంకర్, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఈఈ కవిత, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ భాస్కరరావు, తహసీల్దార్ తాడ్డి గోవింద, ఎంపీడీఓ ఎం.రాధిక, వైద్యాధికారులు సుధారెడ్డి, రెవెన్యూఇన్స్పెక్టర్ పి.మాధురి, ఈఓపీఆర్డీ జ్ఞానేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఎరుకొండ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ డయేరియా అదుపుచేయలేకపోవడంపై మండిపాటు ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని పీహెచ్సీ సిబ్బందికి ఆదేశం వైద్యసేవలు అందించడంలో జిల్లా వైద్య విభాగం విఫలమైందంటూ అసహనం -
ఏపీ టెట్‌లో ‘విజయ’దుందుభి
విజయనగరం అర్బన్: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో విజయనగరం విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఎస్జీటీ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి మూడు ర్యాంకులను సొంతం చేసుకుని విద్యలనగరం పేరును ఇనుమడింపజేశారు. సుమారు 20 మంది విద్యార్థులు 145 మార్కులు పైబడి సాధించగా, 130–140 మధ్య మార్కులు పైబడి సాధించిన వారి సంఖ్య వందల్లో ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగం అంటే తమకు ఎంత మక్కువో మార్కుల సాధనలో చూపించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టెట్ ఫలితాలను ప్రభు త్వం సోమవారం విడుదల చేసింది. జిల్లాలో ఈ పరీక్ష కోసం 11,530 మందు దరఖాస్తు చేసుకోగా దాదాపు 1500 మంది గైర్హాజరుతో పరీక్ష రాశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) అర్హత పరీక్ష పేపర్–1, స్కూల్ అసిస్టెంట్ టీచర్ అర్హత పరీక్ష పేపర్–2, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ –1బి, పేపర్–2బిగా పరీక్షలు జరిగాయి. ఎస్జీటీ విభాగంలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కోండ్రు అశ్విని 150/150 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. చదువులో కుమార్తె చూపుతున్న ప్రతిభను చూసి ఆటోడ్రైవర్ అయిన ఆమె తండ్రి శంకరరావు, తల్లి వెంకటలక్ష్మి మురిసిపోతున్నారు. ఇదే విభాగంలో వీటి అగ్రహారానికి చెందిన దాసరి ధనలక్ష్మి 149.99/150, చీపురుపల్లికి చెందిన దేవ హారిక 149.46/150 మార్కులతో రాష్ట్రస్థాయిలో ద్వితీ య, తృతీయ స్థానాల్లో నిలిచారు. 145 పైబడి మార్కులు తెచ్చుకున్న వారిలో ఎన్.సుబ్బలక్ష్మి (147.08/150), ఎన్.శ్యామల (146.25/150), బి.కుమారి (145.07/150), ఎ.ప్రవల్లిక (145.07 /150), వి.చంద్రకళ (144.34/150), పి.రామక్ష్మి (143.51/150), జి.స్వాతి (141.13/150), ఎస్.హారిక (139.94/150), ఎ.వైష్ణవి (138.90/150) తదితరులు ఉన్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు ఆటోడ్రైవర్ కుమార్తెకు 150/150 ఉపాధ్యాయ ఉద్యోగ సాధనే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ -
రైతన్నను మోసం చేయొద్దు
రేగిడి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చారని, ఖరీఫ్ సీజన్ ముగిసినా సాయం అందించకపోవడం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారు జనార్దనరావు అన్నారు. రైతన్నను మోసం చేయొద్దన్నారు. కనీసం రబీ సీజన్ ఆరంభంలోనైనా పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ సంకిలి పంచాయతీ కార్యాలయం సిబ్బందికి సోమవారం వినతిపత్రం అందజేశారు. సాగునీటి కాలువలు, చెరువుల ఆక్రమణలు తొలగించాలని కోరారు. బీమా ప్రీమియం చెల్లించాలి ● జిల్లా ఉద్యాన అధికారి జమదాగ్ని విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సుమారు 13,735 ఎకరాల్లో జీడిమామిడి తోటలు సాగులో ఉన్నాయని, రైతులందరూ ఎకరాకు రూ.1500 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా ఉద్యాన అధికారి జమదాగ్ని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల తోటలకు నష్టం కలిగితే ఎకరాకు రూ.30వేల వరకు బీమా పరిహారం అందుతుందన్నారు. గతంలో రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేదని, ఇప్పుడు కూడా అదే పద్ధతి అమలుచేయాలంటూ ఇప్పటికే పలువురు రైతులు వినతులు అందజేయడం గమనార్హం. మైన్స్ ఏడీగా అశోక్‌కుమార్ విజయనగరం పూల్‌బాగ్: మైన్స్ రీజినల్ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బి.అశోక్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అశోక్‌కుమార్ అమలాపురంలో ఏడీగా పనిచేసి బదిలీపై ఇక్కడకు విచ్చేశారు. ఇక్కడ ఏడీగా పనిచేసిన బి.విజయలక్ష్మి శ్రీకాకుళం బదిలీపై వెళ్లారు. ఆ స్థానంలో అశోక్ కుమార్ నియామకమయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అశోక్‌కుమార్‌ను ఏజీ ఎస్పీకే మల్లేశ్వరరావు, సిబ్బంది అభినందించారు. పశుగణన పరిశీలన పూసపాటిరేగ : జిల్లాలో చేపట్టిన పశుగణన ప్రక్రియను పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ వైవీ రమణ సోమవారం పరిశీలించారు. పూసపాటిరేగ మండల కేంద్రంలోని మహంతి కల్లాలు సమీపంలో చేపడుతున్న పశుగణన కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. రోజుకు ఎన్ని పశువులను లెక్కిస్తున్నారు.. ఏయే వివరాలు నమోదు చేస్తున్న అంశాలపై ఆరా తీశారు. -
కొనసాగుతున్న విలువిద్య పోటీలు
సీతానగరం: మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాలయ ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతినాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్కూల్‌గేమ్స్ విలువిద్య క్రీడల పోటీలు రెండోరోజూ కొనసాగాయి. రాష్ట్రస్థాయి పోటీలకు పదమూడు జిల్లాల నుంచి హాజరైన అండర్ 14, 17,19 విభాగాల బాలురు, బాలికల మధ్య విలువిద్య పోటీలు మంగళవారం జరగనున్నాయి. విలువిద్య రాష్ట్ర పరిశీలకుడు ఎన్.వి.రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువిద్య స్కూల్‌గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీలు పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ రాజ్ కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, పార్వతీపురం, సీతానగరం ఎంఈఓలు కె ప్రసాదరావు, సూరిదేముడు, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఎం.మురళీకృష్ణ, డీటీ గాంధీ, ఎం శ్రీనివాసరావు, స్థానిక ప్రిన్సిపాల్ మధుబాబు రాజేంద్ర పాల్గొన్నారు. -
ఫెర్రో.. మొర్రో..!
విద్యుత్ చార్జీలు తగ్గించిన గత ప్రభుత్వం బొబ్బిలిలోని ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ బొబ్బిలి: అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ బిల్లులు తగ్గిస్తాం.. పరిశ్రమలకు రాయితీలు కల్పి స్తాం అంటూ ఎన్నికల సమయంలో హామీలిచ్చిన టీడీపీ కూటమి నేతలు... అధికారం చేజిక్కాక ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు సామాన్యులతో పాటు కంపెనీలపై సర్దు బాటు చార్జీల పేరుతో విద్యుత్ అదనపు భారం వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది తెలిసిన ఫెర్రోఎల్లాయీస్ కంపెనీ యాజమాన్యాలు అదనపు చార్జీలు చెల్లించడం తమవల్ల కాదంటూ మొర్రోమంటున్నాయి. కంపెనీలకు గడ్డుకాలం వచ్చిందంటూ వాపోతున్నాయి. పెంచనున్న చార్జీల కారణంగా చిన్నపాటి పరిశ్రమకు కూడా కోటి రూపాయలకు పైగా భారం పడనుంది. ● ఇదీ పరిస్థితి.. ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమలు రాష్ట్రంలో 36, ఉత్తరాంధ్రలో 26 ఉండగా అందులో విజయనగం జిల్లాలోనే 13 ఉన్నాయి. వీటిలో సుమారు 12వేల మంది కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న విద్యుత్ చార్జీలపెంపు నిర్ణయంతో వీరందరి ఉపాధిపై నీలినీడలు అలముకున్నాయి. విద్యుత్ సర్డుబాటు చార్జీల పెంచడం వల్ల కంపెనీల నిర్వహణకు కష్టమవుతుంది. ఫెర్రో కంపెనీల్లో ఉండే 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన చిన్నపాటి పరిశ్రమలోనూ రోజుకు 26 టన్నుల ఉత్పత్తి జరుతుంది. వీరు వినియోగించే ఫర్నేస్‌కు 4వేల యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. దీనికి రూ.1.88 లక్షల చొప్పున నెలకు రూ.56.17లక్షలు చార్జీలు అవుతాయి. ఒక్కోచోట రెండు నుంచి 10 ఫర్నేస్‌లను వినియోగిస్తారు. కనీసం రెండు ఫర్నేసులకు వినియోగించే పరిశ్రమలకు ఈ చార్జీల పెంపు వల్ల కోటి రూపాయలకు పైగా అదనపు భారం పడుతుందని కంపెనీ సాంకేతిక నిపుణులు చెబతున్నారు. అదే 10 ఫర్నేసులు వినియోగించే పెద్ద పరిశ్రమలకు నెలకు రూ.6.50 కోట్లు విద్యుత్ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఇంత భారం మోయడం కంటే కంపెనీలను మూత వేయడం మంచిదనే ఆలోచనకు పలు పరిశ్రమల యజమానులు వచ్చినట్టు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు భారీ స్థాయి నష్టాలు వచ్చి దాదాపు లక్ష మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితులున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో ఆవేదనలో ఫెర్రోఎల్లాయీస్ యాజమాన్యాలు కంపెనీలకు కోట్లాది రూపాయల సర్దుబాటు చార్జీల భారం! తక్కువగా రూ.కోటి వరకు పెంపు ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలకు గడ్డుకాలం గత ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల తగ్గింపు విద్యుత్ చార్జీల భారం వల్ల కంపెనీలు మూతపడే పరిస్థితులు వచ్చాయని, చార్జీలు తగ్గించి పరిశ్రమలు నడిచేలా నిర్ణయం తీసుకోవాలని ఫెర్రో పరిశ్రమల యజమానుల సంఘం విజ్ఞప్తి మేరకు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చార్జీలను తగ్గించింది. యూనిట్‌కు రూ.7లు ఉన్న ధరను రూ.6లకు తగ్గించింది. దీనివల్ల జిల్లాలోని ఫెర్రో పరిశ్రమలకు నెలకు రూ.9 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు మిగలడంతో పరిశ్రమల యజమానులు హర్షం వ్యక్తంచేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం అన్యాయం జార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఇచ్చేలా ఏపీలో కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంపెనీలకు రూ.1.60లు విద్యుత్ సబ్సిడీ ఇచ్చింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దీనిని కొనసాగించాలే తప్ప ఇంకా ట్రూ అప్ చార్జీల పేరిట అదనపు భారం వేయడం తగదు. విద్యుత్ చార్జీలు పెంచితే పరిశ్రమలు నడపడం కష్టం. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తాం. – పొట్నూరు శంకరరావు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ, బొబ్బిలి -
రేపటి నుంచి కంటి పరీక్షలు
పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు మొదటి విడతగా, 6 మండలాల పరిధిలో ఉన్న 138 సచివాలయాల పరిధిలో నేత్ర పరీక్షలు నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సుకుమార్ బాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లాలో పనిచేస్తున్న నేత్ర వైద్యాధికారులు, నేత్ర వైద్య సహాయకులతో సమావేశం నిర్వహించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్న విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంటి తనిఖీలు చేసిన వారికి దృష్టి దోషం ఉంటే మళ్లీ నేత్ర పరీక్షలు నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో వయసు మళ్లిన వాళ్లందరికీ నేత్ర పరీక్షలు చేయాలని ఆదేశించారు. నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేసిన వారి వివరాలు ఎలా పొందు పరచాలో వివరిస్తూ మెల్లకన్ను, గాయాల వలన వచ్చే క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సల కోసం పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా కంటి వెలుగు సెల్ నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి జిల్లాలో పనిచేస్తున్న నేత్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
27 తులాల బంగారం చోరీ
● కేసు నమోదు చేసిన పోలీసులు రాజాం సిటీ: రాజాం మున్సిపాల్టీ పరిధి పాలకొండ రోడ్డులో పొనుగుటివలస లక్ష్మీనగర్ అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు సోమవారం తెలిపిన వివరాల మేరకు లక్ష్మీనగర్ అపార్ట్‌మెంట్‌కు చెందిన విశ్రాంత వీఆర్వో సలాది శేషగిరి తన మూడో కుమార్తె వివాహం నిమిత్తం కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 2న ఏలూరు వెళ్లారు. ఆదివారం ఉదయం అపార్ట్మెంట్ వాచ్‌మన్ శేషగిరి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి ఇంటి యజమానికి ఫోన్‌చేశాడు. అక్కడినుంచి బయలుదేరి సోమవారం ఇంటికి చేరుకున్న శేషగిరి ఇంటి తాళాలు పగలగొట్టి, ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడాన్ని గమనించారు. ఇంట్లో బంగారు ఆభరణాలు లేకపోవడంతో దొంగలు పడ్డారని గుర్తించి సంతకవిటి పోలీసులకు సమాచారం అందించారు. ఏడు తులాల బంగారు హారాలు రెండు, ఐదు తులాల గాజులు, రెండు తులాల నల్లపూసలు, నాలుగు తులాల బంగారు నెక్లెస్‌లు 3, రెండు తులాల బ్రాస్లెట్స్ 2, తులం బంగారు చైను, తులం బంగారు బాల్ గొలుసు ఒకటి, ఒకటిన్నర తులం మరో చైన్, ఒకటిన్నర తులం నెక్లెస్ ఒకటి, రెండు తులాల పది జతల చెవిదిద్దులు మొత్తం 27 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర. సిబ్బంది, క్లూస్‌టీమ్‌తో కలిసి వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ధనలక్ష్మి
పాలకొండ రూరల్: స్థానిక సత్యసాయి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న బెహరా ధనలక్ష్మి కబడ్డీ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల నిర్వాహకుడు బి.లక్ష్మీనారాయణ తెలిపారు. తమ కళాశాల విద్యార్థిని ఇటీవల శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహించిన పోటీల్లో తలపడి సౌత్ జోన్ క్రీడలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 26న చైన్నెలో సౌత్‌జోన్ పోటీలు జరుగుతాయన్నారు. అలాగే తమ కళాశాలకే చెందిన మరో విద్యార్థిని జూక శివాని అండర్–19 అథ్లెటిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయి 400 మీటర్ల పరుగుపందెంలో రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఆ విద్యార్థినులను కళాశాల నిర్వాహకులు, ప్రిన్సిపాల్, సహచర అధ్యాపక సిబ్బంది సోమవారం అభినందించారు. కార్యక్రమంలో డీవీ రమణ, ఎ.శ్రీనివాసరావు, పీడీ కాయల రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలి
● గిరిజన జేఏసీ శాంతియుత ర్యాలీసీతంపేట: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు శతశాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 3ను ప్రభుత్వం పునరుద్ధరించాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీతంపేటలో సోమవారం గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గిరిజనులకు న్యాయంచేయాలని కోరుతూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూల్ మైదానం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ సాగిన అనంతరం బస్టాప్ వద్ద గిరిజనులు మానవహారంగా రూపొందారు. ఆదివాసీ జేఏసీ సభ్యుడు బి.శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో నంబర్ 3 అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నూతన చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల ఆవేదనను అర్ధం చేసుకుని తమ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏలో వందశాతం పోస్టులు గిరిజనులకు కేటాయించాలి. ఖాళీ పోస్టులను గిరిజన నిరుద్యోగులతో భర్తీ చేయాలి. గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న గిరిజన శాఖ మంత్రి రాష్ట్రపతి ఆమోదం తీసుకుని గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ ఉద్యోగ నియామక చట్టం జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ ఐటీడీఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.ధర్మారావు, బి.ఉమామహేశ్వరరావు, రామ్మోహన్రావు, రవి, ప్రమోద్, రామారావు, జాన్ సింహాచలం, మోహన్పాల్, చిరంజీవి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహుతైన ఎడ్లబండి, గడ్డి
విజయనగరం క్రైమ్: స్థానిక కేఎల్.పురం సమీపంలో సోమవారం సాయంత్రం ఎడ్లబండి, అందులో ఉన్న గడ్డి దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి అగ్నిమాపకశాఖ అధికారులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ నుంచి ఎడ్లబండిపై గడ్డిని కేఎల్.పురం తీసుకువస్తుండగా సిక్కుల గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగి, గడ్డితో పాటు బండి దగ్ధమైంది. దీంతో బండి యజమాని, స్థానికులు ఎడ్లను బండి నుంచి విప్పి దూరంగా కట్టారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్, బీడీ వంటివి విసిరేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.15వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకశాఖ అధికారులు అంచనా వేశారు. -
మోడల్ కోడ్ అమలు చేయాలి
కచ్చితంగా.. ● కలెక్టర్ అంబేడ్కర్ ● ఉమ్మడి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులంతా అప్రమత్తంగా విధులను నిర్వహించాలని, నిబంధనలను తు,చ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి సంబంధించి, ఉమ్మడి విజయనగరం జిల్లా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ సోమవారం వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. తొలుత ఎన్నికల ప్రక్రియను, షెడ్యూల్‌ను కలెక్టర్ వివరించారు. విజయనగరం జిల్లాలో 402 ఓట్లు, పార్వతీపురం జిల్లాలో 325, మొత్తం 727 ఓట్లు ఉన్నాయని తెలిపారు. 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, తుది ఓటర్ల జాబితాను ఈనెల 10వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు. గతంలో మాదిరిగానే విజయనగరం ఆర్డీవో కార్యాలయంలో, పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మోడల్ కోడ్ అమలు చేయడానికి పాత ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతి మండలానికి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, ఎస్హెచ్ఓ, వీడియోగ్రాఫర్‌తో ఒక ఎంసీసీ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక ఎస్ఎస్టి బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి విధులను నిర్వహించాలని సూచించారు. సాధారణ ఎన్నికల తరహాలోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మోడల్ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు, నాయకులు నిర్వహించే సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరూ పాల్గొనకూడదని తేల్చిచెప్పారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులకు సంబంధించిన ఫెక్సీలు, పోస్టర్లను తక్షణమే తొలగించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల చిత్రపటాలను తొలగించాలని చెప్పారు. తనిఖీలు, సోదాలు చేసేటప్పుడు తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. సున్నిత ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, బైండోవర్ కేసులు నమోదు చేయాలని, లైసెనన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ర్యాలీలు, ప్రదర్శనలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి సేతు మాధవన్ మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నిక నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా రెండు జిల్లాల రెవెన్యూ అధికారులను నియమించినట్లు జేసీ వివరించారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో పాల్గొన్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డిలు తమ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను, ఎన్నికల కోడ్ అమలుకు తీసుకున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీపీఓ టి.వెంకటేశ్వర రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
శృంగవరపుకోట: విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన గూడి ఉదయ్‌కుమార్(23) ఎస్.కోట మండలంలోని శిరికి రిసార్ట్ వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తన స్నేహితుడు యల్లబిల్లి ధనుంజయ్‌తో కలిసి ఉదయ్‌కుమార్ ఈ నెల 2వ తేదీన బైక్‌పై అరకు వెళ్లాడు. వారిద్దరూ తిరిగి 3వ తేదీన అరకు నుంచి విశాఖ వస్తుండగా అర్ధరాత్రి 1గంట సమయంలో శిరికి రిసార్ట్ జంక్షన్‌కు వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో, బైక్ అదుపు తప్పింది. దీంతో జరిగిన ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన ఉదయ్‌కుమార్ తలకు తీవ్రగాయం కావడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్నేహితుడు ధనుంజయ్‌కు ఈ ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. మృతుడి మేనమామ బోరి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.కోట ఎస్సై సి.హెచ్.గంగరాజు తెలిపారు. పీఎం యశ్వస్వి పథకం గడువు పొడిగింపుపార్వతీపురంటౌన్: పీఎం.యశస్వి పథకం గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ఎస్.కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న బీసీ, ఈబీసీ, సంచార జాతుల కులాలకు చెందిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వి పథకం కింద ఉపకారవేతనాలు పొందేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసేందుకు గడువు అక్టోబర్‌లోనే గడువు ముగిసిందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ పథకం గడువును ఈనెల 15 వరకు పొడిగించామని, అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు హెచ్‌టీటీపీఎస్://వెట్.ఎన్టీఏ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రకటనలో స్పష్టం చేశారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
రేగిడి: మండలంలోని గుళ్లపాడు గ్రామ సమీపంలో గల వీరసాగరం చెరువులో పడి ఓ యువకుడు సోమవారం మృతిచెందినట్లు ఎస్సై పి.నీలావతి తెలిపారు. మృతుడిని బీహర్ రాష్ట్రంలోని శౌర్య గ్రామానికి చెందిన కమలేష్ సింగ్(27) గా గుర్తించామని పేర్కొన్నారు. కమలేష్ సింగ్ మండలంలోని ఓ కర్మాగారంలో కలాసీగా పనిచేస్తూ..నిత్యం మద్యం తాగుతూ ఉంటాడని, చెరువుగట్టుపై నడుస్తూ వెళ్తుండగా, అదుపుతప్పి పడిపోయినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. స్థానికులు గమనించి చెరువులోనుంచి బయటకు తీసే సమయానికే మృతిచెందినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నామని, పోస్ట్‌మార్టం నిమిత్తం రాజాం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని వెల్లడించారు స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక రేపువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–19 స్కూల్‌గేమ్స్‌లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పీవీఎల్ఎన్ కృష్ణ సోమవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు బాడంగి మండలకేంద్రంలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో బాల,బాలికలకు టెన్నికాయిట్ క్రీడాంశంలోను, అలాగే అదే మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేస్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. అదేరోజున ఎస్.కోట మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా జట్ల ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న ఆయా పోటీల్లో విజయనగరం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టం చేశారు. ఎంపిక పోటీల్లో 19 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులు పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఫోన్ 9885111375 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అంతర్ వర్సిటీల పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులురాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు అంతర్ విశ్వవిద్యాలయాల తైక్వాండో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 6 నుంచి 9 వరకు అమృత్‌సర్‌లోని గురునానక్‌దేవ్ యూనివర్సిటీలో జరగనున్నాయన్నారు. జేఎన్టీయూజీవీ తరఫున తమ కళాశాలకు చెందిన పి.మణికంఠ (63 కేజీల విభాగం), పి.లక్ష్మీపతిరాజు (65 కేజీల విభాగం)లు ఎంపికయ్యారని చెప్పారు. ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్, ఇతర విద్యార్థులు అభినందించారు. జాతీయ క్రీడల్లో పతకాలు సాధించాలి● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ పార్వతీపురంటౌన్: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని క్రీడాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అసుతోశ్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయస్థాయి క్రీడలకు ఎంపికై న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సోమవారం ఆయన తన చాంబర్లో అభినందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి అరిక అభిచందు జమ్ముకశ్మీర్‌లో జరిగే ఫెన్సింగ్ పోటీలకు, అదే పాఠశాలలో చదువుతున్న అరిక చరణ్ ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల ఈ సందర్భంగా పీఓ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. జాతీయస్థాయికి వెళ్లే ఈ క్రీడాకారులకు అవసరమైన సామగ్రిని ఐటీడీఏ నుంచి సమకూరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీడీలు నిమ్మల మాధవరావు, భోగేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
వెళ్లిపోయావా నాన్నా..!
తన రెక్కల కష్టంపై కుటుంబాన్ని మోసి..కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేసిన తండ్రి అకస్మాత్తుగా మృతిచెందాడు. ఆయనకు కొడుకులు లేరు. ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే. కన్నతండ్రిని కోల్పోయిన దుఃఖాన్ని పంటి బిగువన అదిమిపెట్టిన ఆడపిల్లలు తండ్రి పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించి కన్నతండ్రి రుణం తీర్చుకున్నారు. తమ ఇద్దరిలోనే వారసులను చూసుకున్న తమ తండ్రి ఆదర్శమూర్తి అంటూ కుమార్తెలిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామస్తులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో భాగస్వాములయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. –పాలకొండ రూరల్ పాలకొండ మండలంలోని గొట్ట మంగళాపురం గ్రామానికి చెందిన మండపల పెంటయ్య (42) ఆటో డ్రైవర్‌గా, సమీప చక్కెర కర్మాగారంలో సహాయకుడిగా విధులు నిర్వహిస్తుండగా..ఆయన భార్య వసుధ ఆదే గ్రామంలో ఆశ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దకుమార్తె పద్మ బీఎస్సీ నర్సింగ్ చేస్తుండగా, రెండవ కుమార్తె పావని ఇంటర్మీడియట్ చదువుతోంది. ఎంతటి కష్టం వచ్చినా ఇతరులపై ఆధారపడకుండా పెంటయ్య కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడని గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బంధువులు పేర్కొంటున్నారు. గత శుక్రవారం గ్రామం నుంచి బయటకు వెళ్లిన పెంటయ్య గోపాలపురం వద్ద నడుస్తూ కప్పకూలిపోయాడు. దీంతో బంధువులు, కుటుంబసభ్యులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించినప్పటికీ ఫలితం లేకపోవడంతో శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రైయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ బతికించాలంటూ వైద్యులను ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిని సముదాయించిన వైద్యులు ఆవయవదానంపై అవగాహన కల్పించారు. వైద్యులు చెప్పింది విన్న భార్యాపిల్లలు బాధాతప్త హృదయాలతోనే అవయవ దానానికి అంగీకరించారు. దీంతో జెమ్స్ ఆస్పత్రిలోనే పెంటయ్య శరీరం నుంచి గుండె తదితర భాగాలను గ్రీన్ చానల్ ద్వారా వైద్యులు సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆస్పత్రి వద్దకు చేరుకుని పెంటయ్య మృతదేహంపై పూలవర్షం కురిపిస్తూ నివాళులర్పించారు. తండ్రి పాడె మోసిన కుమార్తెలు బాధాతప్త హృదయాలతో అంత్యక్రియల నిర్వహణ శోకసంద్రమైన గ్రామం -
No Headline
ఎందుకింత జాప్యం..! జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసి జగనన్న ప్రభుత్వం ప్రజల చిరకాల కోరికను తీర్చింది. కళాశాలను ప్రారంభించి రెండో ఏడాది తరగతులు కూడా జరుగుతున్నాయి. ఈ పనుల కోసం అప్పట్లోనే రూ.కోట్లు మంజూరు చేసి పనులను పరుగులు పెట్టించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమైందో తెలియదుగాని పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లుల చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ● నత్తనడకన వైద్య కళాశాల భవనాల నిర్మాణం ● కావాలనే జాప్యం చేస్తున్నారని గుసగుసలు ● నిర్మాణం పూర్తయితే సర్వజన ఆస్పత్రిని వైద్య కళాశాలకు తరలించాలి ● ప్రస్తుతం ఉన్న చోటే ఉంచేందుకు అధికార పార్టీ నేత ప్రయత్నం ● వైద్య విద్యార్థులకు తప్పని అవస్థలు -
రాష్ట్రంలో విద్యా వ్యాపారం
● రాష్ట్ర రాజకీయాల్లో విద్యా వ్యాపారులదే కీలక పాత్ర ● విద్యా రంగాన్ని కాపాడుకోవాలి ● టీచర్స్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా విజయగౌరి ● యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభలో శర్మ జామి: రాష్ట్రంలో ప్రస్తుతం విద్యను వ్యాపారంగా మార్చేశారని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ధ్వజమెత్తారు. జామిలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ముందుగా యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యను వ్యాపార రంగంగా మార్చిన కొందరు ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రస్తుతం చదువును కొంటున్నారని, దీన్ని విడనాడి చదువు నేర్చు కోవాలని హితవు పలికారు. విద్య కార్పొరేట్ చేతు ల్లో బందీగా మారిందని, దీన్ని కాపాడాల్సిన బాధ్య త మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయగౌరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా కె.విజయగౌరి బరిలో ఉంటారని శర్మ ప్రకటించారు. యూటీఎఫ్ సభ్యులుగా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తూ విజయానికి కృషి చేయాలన్నా రు. అర్హులైన టీచర్లను ఓటరుగా నమోదు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వసతిగృహ విద్యార్థి మృతి
● ఆస్పత్రికి వచ్చేసరికే మృతి చెందాడన్న వైద్యులు ● నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్ విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని కాటవీధిలో ఉన్న వెనుకబడిన తరగతుల వసతిగృహం ఏడో తరగతి విద్యార్థి ఆదివా రం ఆకస్మాత్తుగా మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన శ్యామలరావు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత మంచినీరు తాగి బట్టలు ఉతికేందుకు రూమ్ నుంచి వెళ్తూ.. కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వచ్చేసరికే మృతి చెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు తెలిపారు. శ్యామలరావును సహచర విద్యార్థులు ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే క్యాజువాలిటీ వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారని చెప్పారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్యామలరావు కుటుంబసభ్యులు సర్వజన ఆస్పత్రికి చేరుకొని విలపించారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్ వసతిగృహ విద్యార్థి శ్యామలరావు మృతిపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అధికారులను నివేదిక కోరారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద విద్యార్థి మృతికి సంబంధించి సహచ ర విద్యార్థులు, వసతిగృహం సిబ్బందితో ఆయన ఆదివారం మాట్లాడారు. సంఘటనపై ఆరా తీశా రు. విద్యార్థి మృతిపై వైద్యులతో మాట్లాడారు. ఈ సంఘటనపై సమగ్ర నివేదికను రెండు రోజుల్లో అందజేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షే మ శాఖ అదికారికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట చైల్డ్‌లైన్ సిబ్బంది ఉన్నారు. -
వసతుల్లేక అవస్థలు
ప్రస్తుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులకు, యంత్ర పరికరాలు అమర్చేందుకు పూర్తి స్థాయి లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకటి రెండు విభాగాలకు ప్రొఫెసర్లు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గదులు చాలక ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యంత్ర పరికరాలు ఏర్పాటు చేయడానికి గదులు చాలక వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఆస్పత్రి వైద్య కళాశాల ఏర్పాటుతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారింది. రోగులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. రోగులకు పడకలు చాలక వరండాలో కొన్ని సందర్భాల్లో చికిత్స అందిస్తున్నారు. రోగులకు తగ్గట్టుగా వార్డుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంది. -
నదీస్నానాల వద్ద జాగ్రత్త చర్యలు
విజయనగరం క్రైమ్: కార్తీకమాసం సందర్భంగా జిల్లాలో ఎక్కువ మంది భక్తులు వచ్చే శివాలయాలు, స్నానాలు ఆచరించే నదులు, సముద్రం, పికినిక్స్, వన భోజనాలు నిర్వహించే ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు, జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్తీకమాసం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు నదులు, సముద్ర స్నానాలు ఆచరించే అవకాశమున్నందున పోలీస్‌స్టేషన్ పరిధిలోని నదీ స్నానాలు ఆచరించే ప్రాంతాలను గుర్తించి, ఆయాప్రాంతాల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరికబోర్డులు ఏర్పాటుచేయాలని, యువత నదుల్లో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా బందోబస్తు, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కార్తీక మాసంలో సోమవారాలు, ముఖ్య రోజుల్లో ఎక్కువ మంది భక్తులు శివాలయాలకు వచ్చే అవకాశమున్నందున పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన శివాలయాలను గుర్తించి, బందోబస్తు ఏరాచచేయాలని, ఎటువంటి దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ -
లక్ష్య సాధనపై గురి పెట్టాలి
సీతానగరం: చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఉన్నతమైన లక్ష్యంపై విద్యార్థులు గురిపెట్టి కఠోర శ్రమతో సాధించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. సీతానగరం మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులం మైదానం వద్ద జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి 68వ విలువిద్య స్కూల్‌గేమ్స్ పోటీలు ఆదివారం ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. పదమూడు జిల్లాల నుంచి పాల్గొన్న అండర్ 14, 17, 19 విభాగాల బాలురు, బాలికల విలువిద్య పోటీల ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్‌గేమ్స్ విలువిద్య పోటీలకు మన్యం జిల్లా ఆతిథ్యం ఇవ్వడం ఆనందదాయకమన్నారు. ఈ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి కనబరిచి ప్రతిభ చూపేందుకు మంచి అవకాశమని అభిప్రాయ పడ్డారు. సామర్థ్యాన్ని, అవకాశాలను ఏ మాత్రం వృథా చేసుకోకుండా క్రీడాకారులు ఏకాగ్రతతో నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటే విజయం దాసోహం అవుతుందంటూ వారిలో స్ఫూర్తి నింపారు. నిర్వాహకులు క్రీడాకారులకు కల్పించిన ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణను కలెక్టర్ సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.తిరుపతినాయుడు, విలువిద్య రాష్ట్ర పరిశీలకుడు ఎన్.వి.రమణ, ఉప విద్యాశాఖాధికారి రాజ్‌కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఎం. మురళీకృష్ణ, సీతానగరం, పార్వతీపురం మండల విద్యాశాఖ అధికారులు సూరిదేముడు, కర్రి ప్రసాదరావు, ప్రిన్సిపాల్ జేవీఎస్.మధుబాబు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి విద్యార్థి మృతి
రాజాం సిటీ: నీ కుమారుడు పాఠశాలలో అందరికంటే బాగా చదువుతున్నాడు. చదువు మద్యలో నిలిపివేయకుండా చదివించమ్మ అని ఉపాధ్యాయులు అంటుంటే ఆ తల్లి ఉబ్బితబ్బిబ్బయ్యేది. చదువులో చురుగ్గా ఉన్న కుమారుడు ప్రయోజకుడై ఆదుకుంటాడనుకుంటుండగా కుమారుడు అకాల మరణం చెందాడన్న విషయం తెలుసుకున్న ఆ తల్లి జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ విషాదకర ఘటన రాజాం మండల పరిధి కంచరాం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన పుల్లేటికుర్తి కృష్ణవేణికి బిడ్డ పుట్టిన ఏడాదికే ఆమె భర్త మరణించాడు. అప్పటి నుంచి కృష్ణవేణి ఓ జ్యూట్ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఒక్కగానొక్క కుమారుడు భాస్కరరావు (14)ను అల్లారుముద్దుగా పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలిసి భాస్కరరావు రాజయ్యపేట గ్రామ సమీపంలోని రాజుగారి కోనేరులో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోతుండగా అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేశారు. భాస్కరరావును ఒడ్డుకు తీసి సపర్యలుచేసిన అనంతరం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై జనార్దనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.