VJ Sunny
-
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
కల నెరవేర్చుకున్న బిగ్‌బాస్ విన్నర్
బిగ్‌బాస్ విన్నర్, హీరో వీజే సన్నీ తన కల నెరవేర్చుకున్నాడు. ఒక సెలూన్ ప్రారంభించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. ద బార్బర్ క్లబ్ (టీబీస్) సెలూన్ ఫ్రాంచైజీని హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ ఓపెనింగ్‌కు బిగ్‌బాస్ సెలబ్రిటీలే మానస్, సోహైల్, ఆర్జే కాజల్, దీప్తి సునయన తదితరులు హాజరై సందడి చేశారు.ద బార్బర్ క్లబ్ సెలూన్‌ను ప్రవేశపెట్టిన జోర్డాన్ హైదరాబాద్‌లో ఫ్రాంచైజీ ఓపెనింగ్‌కు విచ్చేశాడు. అతడికి హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోను సన్నీ షేర్ చేస్తూ నేటి నుంచి సెలూన్ అందుబాటులోకి వచ్చేసిందని తెలిపాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెలూన్ తెరిచి ఉంటుందని పేర్కొన్నాడు.ఇది చూసిన అభిమానులు మొత్తానికి బిగ్‌బాస్ షోలో చెప్పిన కలను సాధించేశావు.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొని విజేతగా అవతరించాడు. చివరగా సౌండ్ పార్టీ సినిమాలో నటించాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) చదవండి: సినీ‘వారం’: సాయితేజ్ ట్వీట్.. మంచు విష్ణు ఫైర్.. సారీ చెప్పిన సిద్ధార్థ్ -
‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ
టైటిల్: సౌండ్ పార్టీ నటీనటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్,రేఖ పర్వతాల తదితురులు నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సమర్పణ : ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ రచన - దర్శకత్వం : సంజయ్ శేరి సంగీతం: మోహిత్ రెహమానిక్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి ఎడిటర్: జి.అవినాష్ విడుదల తేది: నవంబర్ 24, 2023 బిగ్‌బాస్ విజేత వీజే సన్నీ, యంగ్ హీరోయిన్ హృతికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం సౌండ్ పార్టీ. పేపర్ బాయ్‌తో హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ తన చిరకాల మిత్రుడు సంజయ్ శేరికి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. అలా వీరి కాంబినేషన్లో సౌండ్ పార్టీ తెరకెక్కింది. అమాయకులైన తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథాచిత్రమిది. మరి ఈ కథ జనాలకు కనెక్ట్ అయిందా? ప్రేక్షకులను మేరకు మెప్పించింది? బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సౌండ్ చేయనుంది? అనేది రివ్యూలో చూసేద్దాం.. కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన డాలర్ కుమార్(వీజే సన్నీ) ఆయన తండ్రి కుబేర్ కుమార్(శివన్నారాయణ)..కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. ఈజీ మనీ కోసం రకరకాల బిజినెస్‌లు చేసి నష్టపోతుంటారు. చివరకు కుబేర్ కుమార్‌కు పరిచయం ఉన్న సేటు నాగ భూషణం(నాగిరెడ్డి) దగ్గర అప్పు తీసుకొని ‘గోరు ముద్ద’అనే హోటల్ని ప్రారంభిస్తారు. అది ప్రారంభంలో బాగానే నడిచినా..డాలర్ కుమార్ ప్రియురాలు సిరి(హృతిక శ్రినివాస్) తండ్రి చెడగొడతాడు. దీంతో డాలర్ కుమార్ ఫ్యామిలీ మళ్లీ రోడ్డున పడుతుంది. మరోవైపు అప్పు ఇచ్చిన నాగ భూషణం డబ్బు కోసం ఒత్తిడి చేస్తుంటాడు. అలాంటి సమయంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) కొడుకు చేసిన నేరం మీద వేసుకిని వెళ్తే...రూ. 2 కోట్లు ఇస్తామని చెబుతారు. డబ్బుకు ఆశపడి అసలు నేరం ఏంటో తెలియకుండా తండ్రీ కొడుకులు జైలుకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరమేంటి? ఉరిశిక్ష పడిన తండ్రీకొడుకులు దాని నుంచి ఎలా బయటపడ్డారు? ఆ రెండు కోట్ల రూపాయలు ఏం అయ్యాయి? కోటీశ్వరులు కావాలనే వారి కోరిక నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కష్టపడకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ఆశపడే ఓ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులొ చాలా సినిమాలే వచ్చాయి. సౌండ్ పార్టీలో కొత్తదనం ఏంటంటే..బిట్‌కాయిన్ అనే పాయింట్‌తో కామెడీ పండించడం. లాజిక్కులను పక్కకి పెట్టి..కేవలం కామెడీని నమ్ముకొనే ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు సంజయ్ శేరి. అయితే పేపర్‌పై రాసుకున్న కామెడీ సీన్‌ని తెరపై అదే స్థాయిలో చూపించి, రక్తికట్టించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమాలోని ప్రతి సీన్ నవ్వించే విధంగానే ఉంటుంది. కానీ కొన్ని సన్నివేశాలు కావాలనే కథకు అతికినట్లుగా అనిపిస్తుంది. కుబేర్ కుమార్ ఫ్యామిలీ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. స్టార్టింగ్ సీన్‌తోనే కథనం ఎలా సాగబోతుందో తెలియజేశాడు. డబ్బు కోసం తండ్రి కొడుకులు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్స్ మాత్రం కథకు అతికినట్లుగానే అనిపిస్తాయి. అలాగే కొన్ని చోట్ల చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. హీరోయిన్ ఇంటికి వెళ్లిన హీరో..ఆమె పేరెంట్స్ దొరికిపోయినప్పుడు చేసే కవరింగ్.. అలాగే తండ్రీకొడుకులు అప్పు తీసుకున్న తీరు.. రొటీన్‌గా అనిపిస్తాయి. సీన్ల పరంగా చూస్తే ఫస్టాఫ్ నవ్వుకోవచ్చు. కానీ కథనం మాత్రం రొటీన్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. జైలు నుంచి తప్పించుకునేందుకు తండ్రీకొడుకులు చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపించినా.. నవ్వులు పూయిస్తాయి. పత్తి సతీష్‌గా చలాకీ చంటి ఒకటిరెండు సీన్లలో కనిపించినా..బాగానే నవ్వించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ సన్నివేశానికి చేసిన స్ఫూప్ సినిమాకు ప్లస్ అయింది. బిట్ కాయిన్ ఎపిసోడ్ కథను మలుపు తిప్పుతుంది. లాజిక్కులను పక్కకి పెట్టి.. సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ‘సౌండ్ పార్టీ’ అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం శివన్నారాయణ, సన్నీ పాత్రలే. కుబేర్ కుమార్ పాత్రలో శివన్నారాయణ, డాలర్ కుమార్ పాత్రలో సన్నీ అదరగొట్టేశారు. వీరిద్దరి ఫాదర్-సన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సిరి పాత్రకు హృతిక న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే. ఫాదర్-సన్ కెమిస్ట్రీ ముందు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తగా అలీ ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నవ్వించాడు. ఎమ్మెల్యే వరప్రసాద్‌గా పృథ్వీ మెప్పించాడు. హీరో చెల్లెలుగా రేఖ పర్వతాల తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించింది. ప్రియ, నాగిరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మోహిత్ రెహమానిక్ నేపథ్య సంగీతంతో పాటు పాటలు బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రెండుగంటలు నవ్వుతూనే ఉంటారు
‘‘అమాయకులైన తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథే ‘సౌండ్ పార్టీ’. ఈ పాత్రలకి శివన్నారాయణ, సన్నీ కరెక్ట్‌గా సరిపోయారు. నా నిజ జీవితంలోని అనుభవాల నుంచి వినోదాత్మకంగా ఈ చిత్ర కథను రాశాను. ఈ సినిమాతో రెండు గంటలపాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అని డైరెక్టర్ సంజయ్ శేరి అన్నారు. వీజే సన్నీ, హృతికా శ్రీనివాస్ జంటగా శివన్నారాయణ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో ఫుల్ మూన్ మీడియాపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ–‘‘మాది కామారెడ్డి. పూరి జగన్నాథ్‌గారిని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ కావాలనుకున్నా. దర్శకులు మారుతి, సంపత్ నందిగార్ల వద్ద రచనా విభాంగలో పనిచేశా. జయశంకర్ ద్వారా నిర్మాతలకు ‘సౌండ్ పార్టీ’ కథ వినిపించాను.. వారికి నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ ఆరంభించాం. శివ కార్తికేయన్గారితో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు. -
అందుకే ‘సౌండ్ పార్టీ’ సినిమాలో నటించాను: వీజే సన్నీ
-
'ఆడిషన్స్‌కు వెళ్తే పాతిక లక్షలడిగారు, బిగ్‌బాస్ 7లో వాళ్లే టాప్ 5'
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సౌండ్ పార్టీ. హృతిక శ్రీనివాస్ హీరోయిన్గా నటించింది. సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో వీజే సన్నీ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు. హ్యాపీ డేస్ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు అడిగారని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చే స్థోమత లేకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాల కోసం కష్టపడుతూనే ఉన్నానని పేర్కొన్నాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా విజయం సాధించిన సన్నీ ఈ సీజన్లో ప్రశాంత్, అమర్దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, శివాజీ టాప్ 5లో ఉంటారని అంచనా వేశాడు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. మొదట్లో సీరియల్స్‌లో నటించిన ఇతడు తర్వాత వెండితెరపై మెరిశాడు. అన్‌స్టాపబుల్, సకలగుణాభిరామ సినిమాలు చేశాడు. చదవండి: ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అమ్మకు కూడా చెప్పా.. మనసులో మాట బయటపెట్టిన హీరో -
మందు బాటిల్ తో పోలీసులకు దొరికిపోయా
-
సీరియల్ అవకాశం ఎలా వచ్చిందంటే?: VJ సన్నీ
-
‘సౌండ్ పార్టీ’ ప్రతి పంచ్‌కి నవ్వాను: అనిల్ రావిపూడి
‘సౌండ్ పార్టీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్ కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. ఈ సినిమా విజయంతో వీజే సన్నీ కెరీర్లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’.ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.ఈ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంతో సన్నీ కెరీర్ మలుపు తిరగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. సన్నీ మాట్లాడుతూ.. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా’అని అన్నారు. ‘ఈ చిత్రం రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్ సంజయ్ శేరీ అన్నారు. ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి అని నిర్మాతలు రవి, మహేంద్ర అన్నారు. -
క్లీన్ కామెడీతో పార్టీ
‘‘రెండు గంటల పాటు ప్రేక్షకులు నవ్వుకునే క్లీన్ కామెడీతో ‘సౌండ్ పార్టీ’ని రూపొందించాం’’ అన్నారు రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర. వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో వ్యాపారం చేస్తున్న మేం సినిమాలపై ఫ్యాషన్‌తో తెలుగులో ‘సౌండ్ పార్టీ’ తీశాం. అమాయకులైన తండ్రీ కొడుకులిద్దరూ ధనవంతులు అయిపోవడానికి ఏం చేశారనేది ఈ చిత్రకథ. మన ప్రేక్షకులైనా, అమెరికా ఆడియన్స్ అయినా కామెడీ జానర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 100, యూఎస్‌లో 150కి పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
తండ్రీ, కొడుకులు ఇన్నోసెంట్ అయితే.. 'సౌండ్ పార్టీ' ఉండాల్సిందే!
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్తా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారనేదే సినిమా కాన్సెప్ట్. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఫుల్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.' అని అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
ఆమనికి ఈ హీరోయిన్ ఏమవుతుందో తెలుసా?
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితికా శ్రీనివాస్‌మాట్లాడుతూ–‘‘నటి ఆమనిగారు మా మేనత్త. దీంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించాను. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తారు? అనేది ‘సౌండ్ పార్టీ’ కథ. ఇందులో నేను సిరి పాత్రలో నటించాను. కామెడీతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. తెలుగులో సాయిపల్లవిగారంటే ఇష్టం. ఆమెలాంటి పాత్రలు చేయాలని ఉంది. హీరోల్లో నానీగారు అంటే ఇష్టం. భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది’’ అన్నారు. -
‘సౌండ్ పార్టీ’లో నా పాత్ర ధోనీలా ఉంటుంది: హీరోయిన్
‘సౌండ్ పార్టీ’సినిమాలో నేను సిరి అనే పాత్ర పోషించాను. క్రికెట్ టీమ్‌లో ధోనీలా నా పాత్ర ఉంటుంది. మ్యాచ్ లాస్ట్‌లో వచ్చి ధోని ఎలా సిక్స్ లు కొడతారో అలా నా పాత్ర ఉంటుంది.క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను’ అని హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ హ్రితిక మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను. హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో సినిమా. అల్లంత దూరాన తర్వాత నటించిన చిత్రమిది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారని నమ్మకం ఉంది. ►ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. సిరి చాలా తెలివైన అమ్మాయి. నా పాత్ర సినిమాలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుంది. ►అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్ నే చాలా ఫన్నీగా దర్శకులు చూపించారు. ఇందులో బిట్ కాయిన్ గురించి కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బిట్ కాయిన్ వాల్యూను చూపించారు. ►సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ లో ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారు. చాలా జెన్యూన్ గా, ఓపెన్ గా ఉంటారు. సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారు. సెట్ లో సన్నీ చాలా సపోర్ట్ చేశారు. తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రాకపోతే ఆయనే నేర్పించారు. ►ఇందులో సిచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే రెండు పాటలు మాత్రమే ఉంటాయి. మనీ మనీ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ తో పాటు మరో సాంగ్ ఉంటుంది. డైరెక్టర్ సంజయ్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. జయశంకర్ సార్ ప్రజెంటర్ గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాతలు రవి సార్, మహేంద్ర గజేంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ►ఎక్స్పరిమెంట్స్ సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం. -
'ఇప్పుడు యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది'
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం 'సౌండ్ పార్టీ'. ఈ చిత్రాన్ని సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో వీజే సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా పంచ్ డైలాగ్‌లు ఉన్నాయి. ఈ ట్రైలర్లో ప్రస్తుతం యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది' అనే డైలాగ్ హైలెట్‌గా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ఇంటూరి వాసు, చలాకి చంటి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మోహిత్ రెహమానిక్ సంగీతమందించారు. -
బిగ్ బాస్: నా ప్రైజ్ మనీలో వాళ్లే రూ. 27 లక్షలు తీసుకున్నారు: వీజే సన్నీ
బిగ్గెస్ట్ రియాలటీ షోగా బిగ్‌బాస్‌కు మంచి గుర్తింపు ఉంది. అందులో వారం వారం కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్‌తో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. దీంతో ఎలాగైన విన్నర్ కావాలని అందరూ అనుకుంటారు. ఈ షో ద్వారా మంచి అవకాశాలతో పాటు చేతకి డబ్బు కూడా అందుతుందని భావిస్తారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీజన్-5 విన్నర్ వీజే సన్నీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'నేను విన్నర్ అయితే కంగ్రాట్యులేట్ నా ఒక్కడికే చెప్పకోలేదు.. గవర్నమెంట్‌కి కూడా చెప్పాను. ఎందుకంటే.. జీఎస్టీ ద్వారా నాకంటే ఎక్కువగా.. దాదాపు ఫిఫ్టీ- ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్టే మేము. ఆడింది నేను.. గెలిచింది వాళ్లు అనేలా ఉంది. ఆట నాది ప్రైజ్ మనీ వాళ్లది. బిగ్ బాస్ విన్నర్ అయిన నాకు రూ.50 లక్షలు ఇవ్వాలి కానీ అందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికి వెళ్లిపోయింది. అంత డబ్బు టాక్స్ రూపంలో తీసేసుకున్నారు. కరెక్ట్‌గా ఎంతనేది నాకు గుర్తు లేదు కానీ.. దాదాపు సగానికి సగం టాక్స్ ద్వారా తీసేసుకున్నారు. గవర్నమెంట్ టాక్స్ కట్ చేసుకున్న తరువాతే మిగిలిన అమౌంట్ నాకు వచ్చింది. ఛానల్ వాళ్లు టాక్స్ రూపంలో ఆ డబ్బు కట్ చేసుకుని మిగిలన మొత్తం ఇస్తారు. డొనేషన్స్ రూపంలో చాలామంది టాక్స్ ఎగ్గొడుతుంటారు కానీ.. మనకి అన్ని తెలివితేటలు ఉంటే.. ఇక్కడెందుకు ఉంటాం.. అందుకే ఫుల్ అమౌంట్ టాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చింది.' అంటూ తన ప్రైజ్ మనీ గురించి చెప్పుకొచ్చాడు వీజే సన్నీ. ఈ లెక్కన ఆయనకు కేవలం రూ. 23 లక్షలు చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పన్నుతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చేరడంతో ప్రైజ్ మనీలో ఎక్కువ కోత పడిందని ఆయన తెలిపాడు. బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న వీజే సన్నీ హీరోగా పలు సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. -
ఆ రోజు సౌండ్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ, ‘మిర్చి’ ప్రియ కీలక పాత్రల్లో నటించారు. సంజయ్ శేరి దర్శకత్వంలో జయశంకర్ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు .దర్శక– నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రెహమానిక్. -
'బిగ్‌బాస్' విన్నర్ సన్నీ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం బిగ్‌బాస్ 7వ సీజన్ నడుస్తోంది. హౌస్మేట్స్ గొడవలతో ఓ మాదిరిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మరోవైపు ఈ షో ఐదో సీజన్ విజేత వీజే సన్నీ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, పాటలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఇంతకీ ఏ మూవీ? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్లాన్ ఫెయిల్? ఈసారి ఆమెను కాపాడటం కష్టమే!) వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) -
'సౌండ్ పార్టీ'తో రచ్చ చేస్తున్న విజే సన్నీ
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా 'సౌండ్ పార్టీ' అనే సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీలో గట్టిగానే సౌండ్ చేస్తుంది. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా సౌండ్ పార్టీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయ శంకర్ సమర్పణలో విడుదలవుతున్న ఈ మూవీకి సంజయ్ శేరి దర్శకుడు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి) హ్రితిక శ్రీనివాస్- విజే సన్నీ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఓ పాటను తాజాగా ఒక పాటను మేకర్స్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో వైరల్ అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ తో హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ లిరికల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన 'సౌండ్ పార్టీ' చిత్రం ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్ లో రీ -సౌండ్ సృష్టించడం ఖాయం అనడంలో సందేహం లేదు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత రవి పోలిశెట్టి మాట్లాడుతూ... 'ఎప్పుడైతే మా 'సౌండ్ పార్టీ' చిత్రం టీజర్ విడుదలైందో అప్పటి నుంచి మా చిత్రానికి మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా టీజర్లో వీజే సన్నీ, శివన్నారాయణ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమర్ ఉండబోతుందో అర్థమవుతోంది. మా సంగీత దర్శకుడు మోహిత్ రెహమానిక్ అద్భుతమైన పాటలతో పాటు సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారు. అలాగే చిత్ర సమర్పకుడు జయ శంకర్ , దర్శకుడు సంజయ్ శేరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.' అని రవి పోలిశెట్టి అన్నారు. -
జాతి రత్నాలులా అనిపిస్తోంది
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలి శెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు అతిథిగా హాజరై, టీజర్‌ను విడుదల చేసిన దర్శక–నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ టీజర్ బాగుంది. మరో ‘జాతి రత్నాలు’ సినిమాలా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో శివన్నారాయణగారు, నేను తండ్రీకొడుకులుగా చేశాం. ఇద్దరం ఫుల్‌గా నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘మా సినిమాను 28 రోజుల్లో పూర్తి చేయగలిగామంటే అది యూనిట్ సపోర్ట్ వల్లే’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే మా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు రవి పోలిశెట్టి. ‘‘నేను చేయాల్సిన ఈ సినిమాను మా తమ్ముడు సంజయ్‌తో చేయించాను. ‘సౌండ్ పార్టీ’ను ఆదరిస్తే జంధ్యాల, ఈవీవీగార్ల తరహా చిత్రాలు సంజయ్ నుంచి చాలా వస్తాయి’’ అన్నారు జయశంకర్. -
'సౌండ్ పార్టీ' టీజర్.. స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తీస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?) తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా 'సౌండ్ పార్టీ' టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సౌండ్ పార్టీ' టీజర్ బాగుంది. మోహిత్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుంది' అని అన్నారు. (ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ) -
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ'.. పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంటర్టైన్ చేయనుందని టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , చిత్రబృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. (ఇది చదవండి:83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ..' ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వస్తోన్న మొదటి సినిమా `సౌండ్ పార్టీ` పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత లాంఛ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన సౌండ్ పార్టీ టైటిల్‌కు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా యూనిట్ అంతా ఎంతో శ్రమించి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.'అని అన్నారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ...' ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది' అన్నారు. దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ' పోస్టర్‌ను కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని' అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!) -
ఓటీటీలోకి వచ్చేసిన 'అన్‌స్టాపబుల్' మూవీ
'పిల్లా నువ్వు లేని జీవితం', 'సీమ శాస్త్రి', 'ఈడోరకం ఆడోరకం' తదితర కామెడీ సినిమాలతో రచయితగా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ 'అన్‌స్టాపబుల్'. 'అన్లిమిటెడ్ ఫన్' అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఏ2బీ ఇండియా ప్రొడక్షన్లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. IMDBలోనూ 7.8 రేటింగ్ , బుక్ మై షోలో 8.2 రేటింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. చక్కటి హాస్యంతో కూడిన ఈ సినిమాని కుటుంబం మొత్తం కలిసి వీక్షించవచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
ఫన్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు వి. జయశంకర్ సమర్పణలో రవిపొలిశెట్టి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టైటిల్ లోగో విడుదల పాత్రికేయుల చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ చిత్రం థియేటర్స్‌లో గట్టిగా సౌండ్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్ రైడ్ చిత్రం’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘పాతిక రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఇది మా యూనిట్‌కు, వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు రవి పొలిశెట్టి. -
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ' టైటిల్ పోస్టర్ చూశారా?
బిగ్ బాస్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్ శేరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం నేటితో విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సారథి స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను జర్నలిస్ట్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. హీరో వీజే సన్నీ మాట్లాడుతూ.. 'నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్ వచ్చాయి. `సౌండ్ పార్టీ` టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అమెరికాలో ఉంటూ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా పూర్తి చేయడానికి సహకరించారు. కచ్చితంగా సౌండ్ పార్టీ థియేటర్లో గట్టిగా సౌండ్ చేస్తుందని నమ్ముతున్నా' అన్నారు. నటుడు శివన్నారాయణ మాట్లాడుతూ...``సౌండ్ పొల్యూషన్ లేని సౌండ్ పార్టీ ఇది. ప్రతి సన్నివేశం, డైలాగ్ ఎంతో బాగా రాసుకున్నాడు దర్శకుడు. మా జయశంకర్ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉంటూ సినిమాను ముందుకు నడిపించారు`` అన్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత రవి పొలిశెట్టి మాట్లాడుతూ... 'ఇది మా మొదటి తెలుగు సినిమా. USAలో ఆంగ్ల చలన చిత్రాలు, మ్యూజిక్ వీడియోలను నిర్మించడంలో మునుపటి అనుభవం ఉన్నందున, తెలుగు సినిమా వైపు వచ్చాను. 25 కంటే ఎక్కువ స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ప్రతిభావంతుడైన సంజయ్ శేరీ తో "సౌండ్ పార్టీ` సినిమా చేశాము. సినిమా షూటింగ్‌ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశాం. ఆగస్ట్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం' అన్నారు. చదవండి: జయసుధ సోదరి కూడా నటి అని తెలుసా? కానీ.. -
ఇకపై నవ్వించే సినిమాలే చేస్తాను
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో ‘అన్‌స్టాపబుల్’ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నామంటూ ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఇచ్చిన తీర్పే రియల్ బ్లాక్ బస్టర్.. ఇకపై నేను అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా తీసి, థియేటర్లో రిలీజ్ చేయడం తేలికైన విషయం కాదు. రజిత్ రావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు’’ అన్నారు. ‘‘అన్‌స్టాపబుల్ 2’ని రత్నబాబు దర్శకత్వంలోనే చేస్తున్నాం’’ అన్నారు రజిత్ రావు.