wikipedia
-
ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు: వికీపీడియా
భారత ప్రభుత్వం నుంచ తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వికీపీడియా తాజాగా వెల్లడించింది. వికీపీడియాలో ఎడిటింగ్ పద్దతులు, కంటెంట్‌లో ఖచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి గత రెండు రోజుల్లో ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని వికీపిడియా ఫౌండేషన్ పేర్కొంది. ఈ మేరకు వికీపీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. వికీపీడియా లాభాపేక్ష లేని సంస్థ అని,ా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఖర్చు లేకుండా లక్షలాది మందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుందన తెలిపారు.‘ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు మా సైట్‌కు కంటెంట్‌ను అందిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 850 మిలియన్లకు పైగా భారతీయులకు మా సైట్ ఉపయోగపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వీక్షకుల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. ఇందులో వాలంటీర్లు వారికి తెలిసిన సమాచారాన్ని సైట్లో అప్లోడ్ చేయరు. విశ్వసనీయ వార్తాసంస్థలు, ప్రముఖ ప్రచురణ సంస్థల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మా ఆర్టికల్స్లోను విశ్వసిస్తారు. వికీపీడియాలోని ఎడిటింగ్ పద్ధతులు, కంటెంట్‌లోని కచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. మా సంస్థలోని తటస్థ నిబంధనలను సంపాదకీయులు ఆచరిస్తారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనేకమంది వాలంటీర్లు మా సంస్థలో భాగమై ఉన్నారు. ఏ ఆర్టికల్ అయినా విస్తృత సమాచారంతోనే రాస్తాం. ఆ సమాచారానికి సంబంధించిన సోర్సుల వివరాలు కూడా ఆర్టికల్ పేజీల్లో పేర్కొంటాం’ అని తెలిపారు. కాగా ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. -
వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్లో కచ్చితత్వం లేని కూడిన సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కాగా ఇటీవలే వికీపీడియాపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించే విధంగా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో రూ. 2 కోట్ల పరువునష్టం దావా వేసింది. దీనిపై కోర్టు కూడా వికీపీడియాకి చీవాట్లు పెట్టింది. ‘కోర్టు ధిక్కార నోటీసులు’ కూడా జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారత్ తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
స్థానిక భాషలో సమాచారం కోసం సంస్థల సహకారం
ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ద్వారా సమాచారం అందించే వికీమీడియా ఐఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2024’ను నిర్వహించింది. ఇటీవల మూడు రోజుల పాటు సాగిన ఈ సమ్మిట్‌లో స్థానిక భాషలోని సమాచారాన్ని ఇతర భాషలో అందించేందుకు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు విద్యార్థులు ప్రధానపాత్ర పోషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గనడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 130 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.దేశంలో వివిధ భాషలు మాట్లాడుతున్న వారికి ఈ సమ్మిట్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోందని ఐఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాధికా మామిడి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐ4భారత్, బిట్స్ పిలానీ, సీఐఎస్, ఐఐఐటీ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ నిపుణులు కలిసి దేశీయ భాషల్లో కంటెంట్ అభివృద్ధిపై మాట్లాడారు. రియల్‌టైమ్ కంటెంట్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమయ్యే సాంకేతికతపై చర్చించారు. వికీమీడియా ఫౌండేషన్ అనుసరిస్తున్న కొన్ని ఫీచర్లు, సాధనాలపై మాట్లాడారు. మొబైల్ ఎడిటింగ్, వాయిస్, ఇమేజ్ ఆధారిత స్క్రిప్ట్‌లు, వికీమీడియా కమ్యూనిటీలు, వర్క్‌షాప్‌లతో వివిధ అంశాలపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: 100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్భారతీయ భాషల్లో వివిధ విభాగాలకు చెందిన సమగ్ర కంటెంట్‌ను అందించాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు అనువుగా ఆన్లైన్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అందులో వికీమీడియా, వికీపీడియా వంటి సంస్థలు విద్యార్థుల సాయం తీసుకుంటున్నాయి. ఫలితంగా ఓపెన్స్సోర్స్ టూల్స్ ద్వారా నేరుగా కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు వారి సహకారాన్ని కోరుతున్నాయి. -
నచ్చకపోతే భారత్‌లో పనిచేయవద్దు: వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో హైకోర్టు.. వికిపీడియాకు గురువారం ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని హైకోర్టు తెలిపింది.కాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐను వికీపీడియా తన పేజీలో ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొంది. దీంతో వికీపీడియా తన ప్లాట్‌ఫారమ్‌లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. తమ గురించి తప్పుడు సమాచారం ఎడిట్ చేసింది వికీపీడియా, దాని ఎడిటర్లు కాదని, ముగ్గురు బయటి వ్యక్తులు అని పేర్కొంది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.అయితే వికీపీడియాలో ఈ సవరణలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు సదరు సంస్తను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలును వెల్లడించలేదని ఏఎన్ఐ తెలిపింది. దీనిపై వికీపీడియా స్పందిస్తూ.. తమ వైపు నుంచి కొన్ని పత్రాల సమర్పణ పెండింగ్‌లో ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారి వివరాల వెల్లడికి ఆలస్యం అయిందని కోర్టుకు తెలిపింది.అయితే వికీపీడియా సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రతివాది భారతదేశంలో ఒక సంస్థ కాకపోవడం ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. వికీపీడియాను బ్లాక్ చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము.. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి ఇక్కడ పని చేయవద్దు’ అంటూ మండిపడింది.తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసిది. అంతేగాక వచ్చే విచారణలో కంపెనీ ప్రతినిధి తప్పక హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
‘ఆ జాబితాలో చాట్ జీపీటి టాప్.. ఇండియా నుంచి ఏడు’
సాధారణంగా ఏ విషయానైనా సంపూర్ణంగా తెలసుకునేందుకు అందరూ వికీపీడియా మీదనే ఆధారపడుతూ ఉండటం తెలిసిందే. అయితే.. అందులో అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు, సమాచారం అందుబాటులో ఉంటుంది. 2023లో వికీపీడియాలోని సమాచారాన్ని ఎంత మంది చదివారో దాని సంబంధించిన.. నివేదికను తాజాగా వికీపీడియా ఫౌండేషన్ విడుదల చేసింది. 2023 ఏడాదిలో అధికంగా చదివిన పలు ఆంగ్ల ఆర్టికల్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. విడుదల చేసిన జాబితాలో గణాంకల ప్రకారం మొత్తం 25 ఆర్టికల్స్‌లు వార్షిక నివేదికలో చోటు సంపాదించుకోగా.. అందులో భారత్‌కు చెందినవి ఏడింటికి చోటు దక్కటం గమనార్హం. వికీపీడియా విడుదల చేసిన వివరాల ప్రకారం.. సుమారు 8.4 బిలియన్ పేజ్ వ్యూస్ సాధించిన అర్టికల్స్‌లో టాప్‌లో ఐదు నిలిచాయి. చాట్ జీపీటీ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. 2023లో చోటుచేసుకున్న మరణాలు, 2023 క్రికెట్ ప్రపంచ కప్(3వ స్థానం), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (4వ స్థానం), హాలీవడ్ సినిమా ఓపెన్ హైమర్ ఐదో స్థానంలో చోటు సంపాధించింది. అదేవిధంగా ఆరో స్థానంలో క్రికెట్ ప్రపంచ కప్, ఏడో స్థానంలో జే.రాబర్ట్ ఓపెన్‌హైమర్, జవాన్ మూవీ (8వ స్థానం), 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(9వ స్థానం) పఠాన్( 10వ స్థానం). ది లాస్ట్ ఆఫ్ అస్ (TV సిరీస్)(11వ స్థానం), టేలర్ స్విఫ్ట్(12వ స్థానం), బార్బీ మూవీ(13వ స్థానం), క్రిస్టియానో రొనాల్డో( 14 స్థానం), లియోనెల్ మెస్సీ( 15వ స్థానం), ప్రీమియర్ లీగ్( 16వ స్థానం), మాథ్యూ పెర్రీ(17వ స్థానం), యునైటెడ్ స్టేట్స్( 18వ స్థానం), ఎలోన్ మస్క్(19వ స్థానం), అవతార్: ది వే ఆఫ్ వాటర్( 20వ స్థానం), india( 21 వ స్థానం), లిసా మేరీ ప్రెస్లీ( 22 స్థానం), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ ( 23వ స్థానం), ఉక్రెయిన్‌పై రష్యా దాడి( 24వ స్థానం), ఆండ్రూ టేట్( 25వ స్థానం)లో చోటు దక్కించుకున్నాయి. ఈ వివరాల నివేదిక జనవరి 1 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమేనని వికీపీడియా ఫౌండేషన్ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టాప్ 5లో చోటు సంపాదించటం విశేషం. అదే విధంగా షారుక్‌ఖాన్ నటించిన జవాన్, పఠాన్ బాలీవుడ్ సినిమాలు రెండు టాప్ టెన్‌లో నిలిచాయి. -
‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
టెక్ కంపెనీల మధ్య నిత్యం పోటీ ఉంటుంది. వినియోగదారులకు అందించే సేవలతో పాటు ఇతర విషయాల్లో ఆ సంస్థల యజమానుల్లో ఆ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా వికీపిడియా సహవ్యవస్థాపకుడు జిమ్మీవేల్స్ ఎలాన్‌మస్క్ సారధ్యంలోని ఎక్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి చాట్‌బాట్స్ ఆధారిత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) వికీపిడియా డేటాను ఉపయోగిస్తున్నాయని, మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ డేటాను కాదని జిమ్మీ వేల్స్ అన్నారు. పోర్చుగల్‌లోని లిస్బన్లో జరిగిన వెబ్ సమ్మిట్‌లో జిమ్మీ వేల్స్ మాట్లాడారు. ఎలాన్‌మస్క్, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. సరైన సమాచారానికి ఎక్స్ నమ్మదగిన వేదిక కాదన్నారు. ట్విట్టర్‌కు (ఎక్స్) బదులు ఎల్ఎల్ఎంలు వికీపిడియా డేటాను వినియోగించడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా మస్క్ ఆఫర్ చేస్తున్న ఏఐ చాట్‌బాట్ గ్రోక్ గురించి తానిప్పటివరకూ వినలేదని వేల్స్ చెప్పారు. మరోవైపు ఎలన్ మస్క్ ఇటీవల వికీపిడియాపై చేసిన వ్యాఖ్యలపై డిబేట్ సాగింది. వికీపీడియా తన వెబ్సైట్ పేరును డికీపీడియాగా మార్చుకోవాలని మస్క్ సూచించారు. తన సూచనకు అనుగుణంగా వారు పేరు మారిస్తే ఆ వెబ్‌సైట్‌కు మిలియన్ డాలర్లు ఇస్తానని మస్క్ వ్యాఖ్యానించారు. -
వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?
ఈ డిజిటల్ ప్రపంచంలో దేని గురించి అయినా సమాచారం కావాంటే వెంటనే గూగుల్‌లో సర్చ్ చేస్తాం. ఔనా! వెంటనే ముందుగా వికీపీడియా ఆ తర్వాత మిగతా సైట్ల నుంచి దానికి సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తాయి. కానీ వికీపీడియా ప్రతిదాని గురించి సమాచారం ఇచ్చింది గానీ మహిళా శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను చాలా తక్కువగానే అందించింది. ఆ లోటు భర్తి చేసేలా మహిళా శాస్రవేత్తలు బయోగ్రఫీని వికీపీడియాలో ఉంచి అందరికీ తెలిసిలే చేసింది. ఈ రంగంలో మహిళలు ఎక్కువమంది వచ్చేలా ఇన్ఫర్మేషన్ ఉంచింది ఓ మహిళా. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరామె? ఎలా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించింది? బ్రిటన్‌కి చెందిన జెస్సికా వేడ్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో భౌతిక శాస్త్ర విభాగం మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత అందులోనే పీహెచ్డీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు మహిళలు పీహెచ్డీ దాక వచ్చే వాళ్లే అరుదని అర్థమైంది. ఆ తర్వాత ఆమె భౌతిక శాస్త్రవేత్తగా, టెలివిజన్లు, సోలార్ ప్యానెల్లు వంటి ఆప్టికల్ ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా పనిచేసేలా కార్బన్-ఆధారిత సెమీ-కండక్టర్లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తుంది. తన పరిశోధనలకు సంబంధించి 15 మంది విస్తృత బృందంలో ఓ ఐదుగురు వ్యక్తుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుండగా అందులో తన తోపాటు మరొక మహిళా శాస్త్రవేత్త తప్పించి మిగతా అంతా పురుషులే. అప్పుడే ఆమెకు అస్సలు మహిళా శాస్త్రవేత్తలు ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న మెదిలింది. దీనికి తోడు వికీపీడియాలో కూడా మహిళా శాస్త్రవేత్తల గురించి ఆశించినంత స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతగా లేకపోవడం ఆమెను బాధించింది. అసలు దీనికి ప్రధాన కారణంగా తల్లిదండ్రలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే ఏదో రకంగా డిగ్రీ సంపాదించి సెటిల్ అయితే చాలనుకుంటారు. పైగా వారే ఈ రంగంలోకి రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు గమనించింది. ఆ జిజ్క్షాశ జెస్సికాను మహిళా శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్ని వికీపీడియాలో ఉంచే ప్రాజెక్టును చేపట్టాలే చేసింది. ఇలా సుమారు వెయ్యికిపైగా మహిళా శాస్త్రవేత్తల ప్రొఫెల్స్‌ను అందించింది. ఇప్పటి వరకు ఆమె స్వయంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) తదితన నేపథ్యాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా శాస్త్రవేత్తలే కాకుండా ఉనికిలో లేని మహిళా శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోగ్రఫీని కూడా ఉంచింది. సైన్సు వంటి రంగాల్లో మహిళలు లేరంటూ గగ్గోలు పెట్టడం కాదు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించి వారిని ఆన్లైన్లో కనపడేలా చేయాలి. దీన్ని చూసైనా యువత ఈ రంగాల్లో రావడానికి ఆయా మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా ఎంచుకోవచ్చు లేదా అందుకు దోహదపడొచ్చు అనే లక్ష్యంతోనే ఇలా శోధించి మరీ రాస్తున్నాను అని చెప్పుకొచ్చింది జెస్సికా. ఒక్కో ప్రొఫైల్ అందించాలంటే కొన్ని గంటల సమయం పడుతున్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఎజెండాతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపింది. ఈ కృషికిగాను జెస్సికాను వికీపీడియా ఎన్నో అవార్డులు, పతకాలతో సత్కరించింది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
పేరు మారిస్తే.. రూ.100 కోట్లిస్తా!
అపర కుబేరుడు, ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఏదో ఒక అంశంపై నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అలాంటి మస్క్ తాజాగా వికీపీడియా సంస్థకు భారీ ఆఫర్ చేశారు. మానవాళికి తెలిసిన విజ్ఞానాన్నంతా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందగలిగే ప్రపంచాన్ని ఊహించండి’ అంటూ జిమ్మీ వేల్స్ అతి తక్కువ మంది వాలంటీర్లతో వికీపీడియాను రూపొందించారు. ఇప్పుడీ ఈ వికీపీడియా యూజర్ల నుంచి విరాళాలు సేకరించడంపై మస్క్ వ్యంగంగా స్పందించారు. ఓ బూతు పేరును సూచించి.. వికీపీడియాకు బదులు తాను ప్రతిపాదించిన పేరు పెట్టాలని మస్క్ కోరారు. తన ప్రతిపాదనను అంగీకరిస్తే రూ.100 కోట్లు ఇస్తానని కూడా ఆఫర్ చేశారు. నేనేమీ ఫూల్‌ని కాదు మస్క్ ట్వీట్‌తో ఓ యూజర్ వికీపీడియా పేరు మార్చిన తర్వాత మళ్లీ పాతపేరునే (వికీపీడియా) అప్డేట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అందుకు మస్క్ ‘నేనేమీ ఫూల్ కాదు. ఏడాది వరకు ఆపేరు అలాగే ఉంచాలి. మార్చడానికి వీలు లేదని రిప్లయి ఇచ్చారు. అంత డబ్బు ఎందుకు మరొక పోస్ట్‌లో.. వికీమీడియా ఫౌండేషన్‌కి ఎందుకు అంత డబ్బు కావాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వికీపీడియాను ఆపరేట్ చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరం లేదు. మీరు మీ ఫోన్లో టెక్ట్స్‌ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి, అంత డబ్బు దేనికి? ఇక యూజర్లని డబ్బులు ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని మస్క్ ప్రశ్నించారు. -
అరచేతిలో స్వతంత్రం
ఒక్కోసారి చేతిలో ఖాళీ ఉంటుంది. కానీ ఆ ఖాళీకి సార్థకత తెచ్చేలా చేయగలిగిందేమీ తోచదు. అప్పుడు ఆడుకోవడానికి ఆన్లైన్ అనేది మంచి గేమ్. అందరినీ వ్యసనపరులను చేసే ఆన్లైన్ గేమ్స్ గురించి కాదు; ఆన్లైన్తోనే ఆడుకోవడం! దీనికి గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ట్విట్టర్ లాంటివన్నీ పనిముట్లు. ఒకదాన్లోంచి ఇంకోదాన్లోకి గెంతుతూ, కొత్త విషయాలకు ద్వారాలు తెరుచుకుంటూ వెళ్లడం సరదాగా ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి గ్రంథాలయాలను చుట్టేయాలి. అంత శ్రమ లేకుండా మన అరచేతిలోనే ఆ భాండాగారం ఉంది. ఎక్కడినుంచి మొదలు పెట్టాలనే సమస్య అయితే ఉంటుంది. ఇది వ్యక్తిగత ఎంపిక. ఉదాహరణకు ప్రపంచ సినిమాను ఇష్టపడే ఏ స్నేహితుడో ఈ పేరును డ్రాప్ చేసివుంటాడని అనుకుందాం: ‘హిరోషిమా మాన్ అమౌర్’. ఈ ఒక్క హింటు మీదే ఎన్నో విషయాలు పోగేయవచ్చు. హిరోషిమా అంటే అర్థమౌతోంది; తర్వాతి పదాలు? గూగుల్ ఎందుకుంది? మాన్ అంటే ఫ్రెంచ్‌లో ‘నా’. అమౌర్ అంటే ప్రేమ. రెండో ప్రపంచ యుద్ధపు బీభత్సాన్ని చిత్రించిన సినిమా ఇది. కానీ ఆ బీభత్సం కథాకాలానికి సుదూర గతం. యుద్ధం మనుషుల మనసుల్లో ఎంత లోతైన గాయాలను చేసిందో జ్ఞాపకాల తలపోత ద్వారా చెప్పిన సినిమా. దీర్ఘ కవిత లాంటి సినిమా. పేరులేని అతడు, ఆమె జరిపే ఏకాంత సంభాషణ. ఇదంతా సినిమా చూస్తే అర్థమౌతుంది. సినిమాకు బయటి సంగతులు? ప్రపంచ సినిమా గతిని మార్చిన ‘న్యూ ఫ్రెంచ్ వేవ్’కు ఈ సినిమా ఒక శక్తిమంతమైన చేర్పు. 1959లో వచ్చింది. ఈ వేవ్‌లో శిఖరంగా చెప్పే ‘బ్రెత్లెస్’ కంటే ఏడాది ముందే విడుదలైందని తెలియడం అదనపు విశేషం. ఇదొక ఫ్రెంచ్–జపనీస్ ఉమ్మడి నిర్మాణం. తగినట్టుగానే ‘ఆమె’ ఫ్రెంచ్ నటి, ‘అతడు’ జపనీస్ నటుడు. ఎమాన్యుయెల్ రివా, ఎయిజీ ఒకాడా. వీళ్ల విశేషాలేమిటి? రివా సరిగ్గా తొంభై ఏళ్లు బతికి 2017లో చనిపోయింది. ఆమె కవయిత్రి, ఫొటోగ్రాఫర్. ఇంకా చాంటెయూజ్. అంటే బార్ లేదా స్టేజ్ మీద పాడే నైట్‌క్లబ్ సింగర్. వీటన్నింటికంటే ఆకట్టుకునే విశేషం, ఆమె మరో సుప్రసిద్ధ సినిమా– ‘అమౌర్’. రెండిట్లోనూ ప్రేమ ఉంది చూశారా? అది విదేశీ భాషా చిత్రం విభాగంలో 2012లో ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచ్ సినిమా. ఈమెను ఇక్కడ వదిలేసి ‘అతడి’ దగ్గరికి వెళ్తే– ఓహో! ఈ ఎయిజీ ఒకాడా 1964లో వచ్చిన జపనీస్ కల్ట్ సినిమా ‘వుమన్ ఇన్ ద డ్యూన్స్’లో హీరోనట! అందుకేనా ఆ రెండింట్లోనూ ఒకే రకమైన మగటిమి నవ్వు ఉంటుంది! ఇలాంటి నవ్వు బహుశా యూకియో మిషిమా ఇష్టపడతాడు. ఈయనెందుకు వచ్చాడు మధ్యలో? అదే 1960ల్లో ఆయన్ని సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరిస్తుందనుకున్నారు. కండలు తీరి మంచి దేహదారుఢ్యంతో ఉండే మిషిమా వేషధారణ, జీవనశైలి ఒక యోధుడిని తలపించేది. జపనీస్ సాహిత్యం ‘సుకుమార హృదయ’ సంబంధి అనీ, దాన్ని తాను ‘మగటిమి’ దిశగా లాక్కెళ్తున్నాననీ అనేవాడు. ఇంతకీ మనం దర్శకుడి గురించి వాకబు చేయనేలేదు. ఆయన పేరును ఫ్రెంచ్ ఉచ్చారణలో అలె రెనీ అనాలట. ఈ రెనీకి సంబంధించిన విశేషాలేమిటి? 1922లో జన్మించాడు. అంటే పోయినేడాదే శతజయంతి ఉత్సవాలు ముగిశాయి. దీనికంటే ముఖ్యమైనది, ప్రపంచ మేటి డాక్యుమెంటరీల్లో ఒకటిగా చెప్పే ‘నైట్ అండ్ ఫాగ్’కు దర్శకత్వం వహించడం! 1956లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో శవాల గుట్టలుగా మిగిలిన యూదుల దయనీయ గాథను కడుపులో తిప్పేంత దగ్గరగా చూపుతుంది. ఏ హేతువుకూ అందని దుర్మార్గం దాని పరాకాష్ఠకు చేరినప్పుడు మనిషనేవాడు కేవలం శవాల గుట్టల్లో కొన్ని గుర్తుపట్టని ఎముకలుగా మాత్రమే మిగిలిపోయే అత్యున్నత విషాదాన్ని చిత్రిస్తుంది. దర్శకుడిని వదిలేసి, ఆ సినిమాకు రచయితగా ఎవరు చేశారో చూద్దాం. మార్గ్యూరైట్ డురాస్. ఈమె ఫ్రెంచ్ రచయిత్రి. ‘ఫిడెలిటీ’(పాతివ్రత్య) భావాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నావిడ అని తెలియడం ఈమెకు సంబంధించి కొట్టొచ్చినట్టు కనబడే విశేషం. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆ జాబితాలో ఏమైనా ఉండనీ, ‘ఇండియన్ సాంగ్’ అనే పేరున్న సినిమాకు దర్శకత్వం వహించారని తెలియడం భారతీయ మెదడును ఆకర్షిస్తుంది. ఆమె భావాలకు తగినట్టే భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి భార్య తాలూకు వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. గొప్ప సినిమా ఏం కాదని విమర్శకులు చెబుతున్నారు, కానీ దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఎటూ ఆటను హిరోషిమాతో మొదలుపెట్టాం కాబట్టి, మళ్లీ అక్కడికే వద్దాం. ఆ మహా విషాదాన్ని గుర్తుచేస్తూ ఇటీవలే ‘ఒపెన్‌హైమర్’ సినిమా వచ్చింది. అణుబాంబు పితగా అపఖ్యాతి పొందిన రాబర్ట్ ఒపెన్‌హైమర్ నేతృత్వంలో తయారు చేసిన బాంబులనే హిరోషిమా, నాగసాకి నగరాల మీద వరుసగా 1945 ఆగస్ట్ 6, 9 తేదీల్లో వదిలింది అమెరికా. మరింత ఘోర చేదు వాస్తవం ఏమిటంటే, జపాన్ను లొంగదీసుకోవడం కోసం అమెరికా ఈ బాంబులు వేయలేదు; అప్పటికే జపాన్ ఓటమి అంచున ఉంది. కేవలం తన అణుపాటవ శక్తిని ప్రపంచానికి చాటడం కోసం ఈ బాంబుల్ని జారవిడిచింది. దీనివల్ల సుమారు మూడున్నర లక్షల మంది క్షణాల్లో బూడిదయ్యారు. లక్షల మంది ఏళ్లకేళ్లు దాని పర్యవసానాలు అనుభవించారు. మూలమూలల్లోని సమాచారం ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండటమే ఈ ఆధునిక కాలంలో నిజమైన స్వతంత్రం. ఆ ఉన్న సమాచారంతో ఏం చేస్తామనేది మన వివేకం! -
వికీపీడియా ఓనర్‌కు భారీ షాక్ ఇచ్చిన రష్యా
మాస్కో: ఆన్లైన్ ఎన్క్లోపీడియాగా పేరున్న వికీపీడియాకు రష్యా భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఫేక్ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది. ఈ మేరకు వికీపీడియా ఓనర్ అయిన వికీమీడియా ఫౌండేషన్‌కు 2 మిలియన్ల రూబుల్స్(24 వేల డాలర్లపైనే.. మన కరెన్సీలో 20 లక్షల రూపాయలకు పైమాటే) జరిమానా విధించింది. ఉక్రెయిన్‌లో రష్యా మిలిటరీ వ్యవహారాలకు సంబంధించిన తప్పుడు సమాచారం తొలగించని కారణంగానే ఈ జరిమానా విధిస్తున్నట్లు మాస్కో కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. స్వతంత్ర సమాచారం పేరిట వికీపీడియాలో సమాచారం పొందుపరుస్తుండడంపై రష్యా తీవ్ర అసహనంతో ఉంది. ఈ క్రమంలో వికిపీడియాకు జరిమానాల మీద జరిమానాలు విధిస్తూ వెళ్తోంది. అయితే.. వికీమీడియా మాత్రం వికీపీడియా స్టాండర్స్‌కు తగ్గట్లుగానే, పక్కా సమాచారన్ని పొందుపరుస్తున్నట్లు చెబుతూ వస్తోంది. -
ఆంగ్ల వికీపీడియాకు దీటుగా..‘తెలుగు ‘వికీ’కి వందనం!..
సాక్షి, అమరావతి: మనకు ఏదైనా సమాచారం అవసరమైతే మొదటగా వెదికేది వికీపీడియా. ప్రపంచంలో ఎటువంటి సమాచారాన్నైనా ఒక్క క్లిక్‌తో మనకు అందిస్తుంది వికీపీడియా. ఇప్పుడు వికీపీడియా తెలుగులోనూ విశ్వ విజ్ఞానాన్ని అందిస్తోంది. మధురమైన తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేస్తూనే.. ప్రపంచ విశేషాలను తెలుగు వారికి అందిస్తోంది ‘తెలుగు వికీపీడియా’. తొలినాళ్లలో ఎవరూ గుర్తించని ఈ ‘అద్భుత తెలుగు సమాచార వేదిక’ ఆంగ్ల వికీపీడియాను సైతం అధిగమిస్తోంది. దేశంలోని ఇతర భారతీయ భాషల వికీపీడియాలు కూడా ఇవ్వలేనంతగా తెలుగులో ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని సమకూరుస్తోంది. ఈ క్రమంలోనే 2016లో తెలంగాణలో, తాజాగా ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత వాటి భౌగోళిక సరిహద్దుల వివరాలను ఒకచోట చేర్చి సమగ్రమైన రూపాన్ని తెలుగు వికీపీడియన్లు అందించడం విశేషం. 2003లో డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ, 2006 నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందిస్తోంది. 27వేలకుపైగా గ్రామాల సమాచారం ఆంగ్ల వికీపీడియాలో వేలాది మంది లక్షల వ్యాసాలు రాస్తుంటారు. కానీ తెలుగు వికీపీడియాలో రాసే వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. ఐతేనేం.. ఆ కొద్దిమందే సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 27 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలు, వాటి మండలాలు, జిల్లాలపై వ్యాసాలు రాయడం ఒక చరిత్ర. ఈ సమాచారం ఒక్క తెలుగు వికీలో తప్ప ఎక్కడా లభించదు. ఈ మొత్తం సమాచారాన్ని ముద్రిస్తే 60 వేల పేజీల గ్రంథం అవుతుంది. దీనిని ఎవరైనా ఉచితంగా వినియోగించుకోవచ్చు. అడ్మిన్ల పర్యవేక్షణలో.. తెలుగు వికీపీడియాలో ఖచ్చితమైన సమాచారానికి మాత్రమే చోటు లభిస్తుంది. ఔత్సాహికుల్లో అనుభవజ్ఞులు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ నిత్యం వ్యాసాలను పరిశీలిస్తుంటారు. పొరపాట్లు ఉంటే వాటిని సరి చేస్తూ పాఠకులకు చేరవేస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ ద్వారా అడ్మిన్లను ఎంపిక చేయడం, అవసరమైతే తొలగించడం కూడా చేస్తారు. తెలుగు వికీలో 14 మంది అడ్మిన్లుగా పని చేస్తున్నారు. ప్రపంచంతో పాటు భారతదేశ రాష్ట్రాలు, జిల్లాల సమాచారం తెలుగులో అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల అనువాద వ్యాసాలను కూడా పెంచుతున్నారు. మీరూ వికీపీడియన్ కావొచ్చు వెబ్సైట్లో ఖాతాను సృష్టించుకోవడం లేదా గెస్ట్‌గా అయినా ఎవరైనా వికీపీడియన్‌గా మారవచ్చు. ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెన్నేమ్తో కూడా వ్యాసాలు అందించవచ్చు. కొత్తగా వచ్చిన వారికి ఒక గురువును కూడా జత చేస్తారు. వారి సూచనలతో నెమ్మదిగా అక్షర దోషాలను గుర్తించడం, వ్యాసాలు రాయడం అలవాటు చేస్తారు. ప్రతి వికీపీడియా వ్యాసానికి ప్రత్యేక శైలి ఉంటుంది. దానిని అనుసరించే వ్యాసాలు రాయాలి. మారుమూల గ్రామాల్లోని విశేషాలు, సంస్కృతితో పాటు ఎవరైనా సామాజిక కోణంలో స్వయంగా తీసిన ఫొటోలు కూడా పొందుపరచవచ్చు. ముఖ్యంగా ఇవి.. ► ఆంగ్ల వికీలో ఇప్పటి వరకు 66.10లక్షల వ్యాసాలు నాలుగు బిలియన్లకుపైగా పదాలతో ఉన్నాయి. నిత్యం ఎన్నో అప్డేట్లు వస్తున్నాయి ► కానీ, తెలుగు వికీలో సమాచారం ఆశించినంత స్థాయిలో లేదు. తెలుగులో 80,778 వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. ► వాస్తవానికి వందల సంఖ్యలో ఔత్సాహికులు స్వచ్ఛందంగా తెలుగు వికీపీడియాకు వ్యాసాలు రాస్తుండగా, ఇందులో నిత్యం పని చేసే వారు 50 మంది లోపే. ► తెలుగు వికీపీడియన్లలో రిటైర్డ్ ఉద్యోగులు, ఔత్సాహిక తెలుగు ప్రేమికులు, గృహిణులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు ఇలా అనేక వర్గాలు పని చేస్తూ తెలుగు పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ► 2014లో విజయవాడలో జరిగిన తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 80 మంది వికీపీడియన్లు హాజరయ్యారు. ఇందులో 20 మంది ఇతర భాషల వారు ఉన్నారు. 2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవంలో 80 మంది వరకు పాల్గొన్నారు. మరింత బలోపేతానికి కృషి నేను ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూ తెలుగు వికీపీడియాకు పని చేస్తున్నాను. ప్రభుత్వాలు విడుదల చేసిన డేటాపై ఆధారపడి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వాడి జిల్లాలు, మండలాల సరిహద్దులు, మ్యాపులను స్వయంగా తయారు చేశాం. ఈ పేజీల్లో రాసిన ప్రతి అంకె, ప్రతి సమాచారమూ ఖచ్చితత్వంతో ఉండేలా చూస్తాం. ఆధారాన్ని ప్రతి పేజీలోనూ మూలాలుగా చూపిస్తాం. అంతేకాదు.. ఏ పేజీలోనైనా ఏదైనా సమాచారం తప్పుగా ఉందనో, అసలు లేదనో మీరు గమనిస్తే, మీరే స్వయంగా మార్పులు చెయ్యవచ్చు. తెలుగు వికీపీడియాలో ఉన్న సమాచారానికి కాపీరైట్ ఉండదు. తెలుగు వికీపీడియా బలోపేతానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. – పవన్ సంతోష్, తెలుగు వికీపీడియన్, విజయవాడ -
Wikipedia: వికిపీడియాను బ్యాన్ చేసిన పాకిస్తాన్.. ఎందుకంటే..?
ఇస్లామాబాద్: ప్రముఖ వెబ్సైట్ వికిపీడియాను బ్యాన్ చేసింది పాకిస్తాన్. తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మతాన్ని అగౌరపరిచేలా ఉన్న కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని 48 గంటలు గడువు ఇచ్చినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాక్ టెలికం శాఖ ఈమేరకు చర్యలు తీసుకుంది. సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లను బ్యాన్ చేయడం పాకిస్తాన్లో తరచూ జరగుతూనే ఉంది. 2012లో ఏకంగా 700 యూట్యూబ్ లింకులను బ్లాక్ చేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా కంటెంట్ ఉందని ఆరోపిస్తూ ఈ చర్యలు తీసుకుంది. పాక్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా వికిపీడియా కూడా ఈ జాబితాలో చేరింది. మతానికి సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఆ సంస్థకు పాక్ ప్రభుత్వం నోటీసులు పంపింది. తమ ఆదేశాలు పాటించకపోతే వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. అయినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసింది పాక్ ప్రభుత్వం. అయితే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని పులువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్దమని, సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు, పరిశోధకులు, సమాజంలోని వర్గాలపై ప్రభావం పడుతుందని డిజిటల్ హక్కుల కారకర్త ఉసామా ఖిల్జీ అన్నారు. మరోవైపు వికిపీడియా సంస్థ కూడా దీనిపై స్పందించింది. తమ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన సంపదను పాక్ ప్రజలు కోల్పోతారని, దేశ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండదని పేర్కొంది. చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. -
ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితేనే వారిపై కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కథనాలు వెలువరించిన వికీపీడియా మాతృసంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు 2 మిలియన్ రబుల్స్(రూ.26 లక్షలు) జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు సంబంధించిన ఆర్టికల్స్‌ను తొలగించాలని రష్యా డిమాండ్ చేసినట్లు చెప్పారు రష్యాలోని వికీమీడియా ఫౌండేషన్ చీఫ్ స్టానిస్లావ్ కోజ్లోవ్స్కీ. వాటిని తొలగించకపోవటం వల్లే జరిమానా విధించిందని, దీనిపై వికీమీడియా ఫౌండేషన్ అప్పీలు చేస్తుందని వెల్లడించారు. మరోవైపు.. వికీపీడియాలో ప్రచురించిన రెండు ఆర్టికల్స్ కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అవి ‘రష్యా దండయాత్ర సమయంలో ఉక్రెయిన్ ప్రజల అహింసాత్మక ప్రతిఘటన’, ‘రష్యా 2022 ఉక్రెయిన్ దండయాత్ర సమాచారం’. ఉక్రెయిన్‌పై చేపట్టిన యుద్ధాన్ని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌గా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది రష్యా. గతంలో ఏప్రిల్ 26 వికిమీడియా ఫౌండేషన్‌కు మొత్తం 5 మిలియన్ రబుల్స్ జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురించటంపైనే ఆ చర్యలు తీసుకుంది పుతిన్ సర్కార్. ఇదీ చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి -
అర్ష్‌దీప్ సింగ్ ఖలిస్తాని అంటూ పోస్టులు..వికిపీడియాకు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు
-
వికీపీడియా హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!
ప్రముఖ వెబ్సైట్ వికీపీడియా సోమవారం రోజున హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వస్తోన్నాయి. డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం స్వస్తిక్(జర్మన్ నాజీ పార్టీ జెండా) చిత్రాలతో తాత్కాలికంగా భర్తీ చేయబడినట్లు తెలుస్తోంది. వికీపీడియా పేజీలను ఒపెన్ చేస్తుంటే జర్మన్ నాజీ పార్టీ జెండాలు కన్పించాయని యూజర్లు తెలిపారు. చాలా మేరకు ప్రముఖుల వికీపీడియా పేజీలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) హ్యాకింగ్‌కు గురైన వికీపీడియా పేజీల్లో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, సింగర్స్ ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్, మడోన్నా వికీపీడియా పేజీల్లో ఎరుపు వర్ణంలోని జర్మన్ నాజీ పార్టీ జెండా స్వస్తిక్ గుర్తు కన్పించిందని కొత్త మంది యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాకండా జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో, జోసెఫ్ స్టాలిన్ పేజీలు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వికీపీడియాను ఎలాంటి లాభాపేక్షలేకుండా వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా హ్యాకింగ్‌పై వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..ప్రముఖ స్టార్స్, సింగర్స్ వికీపీడియా పేజీల్లో కొద్ది క్షణాలపాటు జర్మన్ నాజీ పార్టీ జెండా కన్పించినట్లు నిర్థారించారు. కాగా వికీపీడియా వెబ్సైట్లపై జరిగిన హ్యాకింగ్‌ను వీకీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు కేవలం ఐదు నిమిషాల్లో తిప్పికొట్టిన్నట్లు వెల్లడించారు. (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!) Has Wikipedia been hacked? I'm opening new tabs and they're coming up with swastikas / Nazi flags??? pic.twitter.com/i0498octaZ — Ben Travis (@BenSTravis) August 16, 2021 -
షాకింగ్ న్యూస్.. శేఖర్ మాస్టర్ని చంపేసిన గూగుల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పుల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. స్టెప్పులతో వెండితెరపై, పంచ్‌లతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతాడు. అందుకే టాలీవుడ్లో ఏ కొరియోగ్రాఫర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ శేఖర్ మాస్టర్ సొంతం. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్‌కి గూగుల్ షాకిచ్చింది. గూగుల్ శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే.. ఆయన ఫోటోతో పాటు పుట్టిన రోజు 1963 అని, చనిపోయిన రోజు జూలై 8,2003 అని వస్తుంది. ఇది చూసి శేఖర్ అభిమానులు అవాక్కాయ్యారు. అసలు విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ జేవీ శేఖర్ని అందరూ మాస్టర్ శేఖర్ అని పిలిచేవారు. దాదాపు 50పైగా చిత్రాల్లో నటించిన ఆయన జూలై 8, 2003లో మరణించారు. ఆయన వికీపీడియాలో గూగుల్ పొరపాటున కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటోని అప్లోడ్ చేసింది. గూగుల్ చేసిన తప్పు పట్ల శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
వికీపీడియాపై సంచలన వ్యాఖ్యలు చేసిన కో-ఫౌండర్..!
మనకు ఏదైనా కావాల్సిన విషయంపై మరింత సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ను అడిగేస్తాము. గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్ మాత్రమే. మనం సెర్చ్ చేసే విషయాలకు సంబంధించిన వాటిని గూగుల్ చూపిస్తోంది. ఇంటర్నెట్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలంటే మనలో చాలా మంది ఎన్సైక్లోపీడియా వికీపీడియాను ఉపయోగిస్తాం. వికీపీడియాతో పలు విషయాలను తెలుసుకొని మన సందేహాలను నివృత్తి చేసుకుంటాం. మనలో చాలా మంది వికీపీడియాలో చూశాం కదా..!అని కచ్చితంగా ఆయా సమాచారం నిజమై ఉంటుందని అనుకుంటాం. తాజాగా వికీపీడియా అందించే సమాచారంపై లారీ సాంగెర్ మాట్లాడారు. నమ్మదగిన సోర్స్ కాదు..! వికీపీడియా అందించే సమాచారం సరియైనదా..కాదా..! అనే విషయంపై వికీపీడియా కో ఫౌండర్ లారీ సాంగెర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికీపీడియా సైట్ అందించే సమాచారం నమ్మదగిన సోర్స్‌గా భావించరాదని హెచ్చరించారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను చేశారు. అంతేకాకుండా వికీపీడియాను గత కొన్ని రోజులుగా కొంత మంది తమ స్వప్రయోజనాలకోసం, ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వికీపీడియా అనేది ఒక ఓపెన్ సోర్స్ సైట్. ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌పై వికీపీడియాలో ఉన్న ఆర్టికల్‌ను ఉదాహరణగా చూపించారు. ఈ ఆర్టికల్‌లో జో బైడెన్‌పై రిపబ్లికన్ల దృష్టికోణం తక్కువగా కనిపిస్తుంది. రిపబ్లికన్ల కోణంలో జో బైడెన్‌పై ఆర్టికల్ దొరకదని పేర్కొన్నారు. నిర్దిష్ట విషయాల గురించి వ్యాఖ్యలు చేయడానికి, వాటి సమాచారాన్ని సైట్లో ఉంచేందుకు పలు కంట్రిబ్యూటర్స్‌ను వికీపీడియా అనుమతిస్తుంది. అంటే నిర్ధిష్ట విషయాలపై సమాచారాన్ని అందించే సమాచారం కంట్రిబ్యూటర్ల దృష్టికోణంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. వారు అందించే సమాచారం ఎల్లప్పుడు వాస్తవంగా ఉండదన్నారు. వారు అందించే సమాచారంపై వికీపీడియా ఓ కంట చూస్తోందని పేర్కొన్నారు. వికీపీడియా ఇప్పుడు ప్రపంచంలో ఎంతో ప్రభావం చూపిస్తుందని అందరికీ తెలుసు. దీంతో కొంతమంది చెప్పే సమాచారం వెనుక పెద్ద గేమ్ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. వికీపీడియా ఎల్లప్పుడు నిజమైన సమాచారాన్నే ఇస్తుందనీ నమ్మొచ్చా...! అంటే అది నిజమైన సమాచారామా..కాదా! అనేది యూజర్లపై ఆధారపడి ఉంటుందని లారీ సాంగెర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
అఖిల్ అమెరికన్ నటుడంటోన్న గూగుల్! షాక్‌లో ఫ్యాన్స్
నేడు(గురువారం) అక్కినేని వారసుడు అఖిల్ బర్త్‌డే. దీంతో పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సక్సెస్‌కు హార్డ్‌వర్క్‌ను మించిన ఫార్ములా లేదు. నువ్వు ఆ నీ కష్టాన్ని నమ్ముకున్నావని నేను నమ్ముతున్నాను. ఎన్నో విజయాలు నీ సొంతం కావాలని, నీ కలలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే.. అని ట్వీట్ చేశాడు చిరంజీవి. దీనికి అఖిల్ బదులిస్తూ.. మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి థ్యాంక్స్ అనే చిన్నపదం సరిపోదు. నేను నా వంతు శ్రమిస్తూనే ఉంటా. థ్యాంక్స్ యూ వెరీ మచ్ సర్ అని రాసుకొచ్చాడు. I can’t thank you enough for your encouraging words. I just hope I can live up to them. Thank you very much sir 🙏🏻 https://t.co/ThedrCbfOJ — Akhil Akkineni (@AkhilAkkineni8) April 8, 2021 సిసింద్రీతో కెరీర్ మొదలు పెట్టిన అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. కానీ ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న కసితో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాగానే కష్టపడుతున్నాడు. అయితే అఖిల్ గురించి గూగుల్ ఓ కొత్త విషయాన్ని బయటపెట్టింది. అఖిల్ తెలుగు యాక్టర్ కాదంటోంది. అతడు అమెరికన్ యాక్టర్ అని చెప్తోంది గూగుల్ వికీపీడియా. నిజానికి అఖిల్ అమెరికాలోనే పుట్టాడు. కానీ తను పెరిగింది మాత్రం ఇక్కడే. పైగా నటించింది కూడా తెలుగు చిత్రాల్లోనే. కానీ వికీపీడియా మాత్రం అతడిని అమెరికన్ నటుడిగా గుర్తించడంతో షాకవుతున్నారు అభిమానులు. ఇదిలా వుంటే అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్". అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూన్ 19న విడుదల కానుంది. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు అఖిల్. గురువారం అఖిల్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సిగరెట్ చేతిలో పట్టుకుని రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడీ యంగ్ హీరో. చదవండి: ఏజెంట్’ ఫస్ట్‌లుక్.. సూపర్ స్టైలిష్‌గా అఖిల్ అల్లు అర్జున్ కెరీర్లో భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలు.. -
ఫ్యాన్స్‌కు షాక్ : గూగుల్‌లో కృతిశెట్టి పేరు సెర్చ్ చేయగానే..
తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది ఈ బ్యూటీ. దీంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ తికమకపెడుతుంది. కృతిశెట్టి పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే..ఆమె పేరు అద్వైతగా చూపిస్తుంది. అలాగే కృతిశెట్టి పేరుతో మరో హీరోయిన్ ప్రోఫైల్ ఓపెన్ అవుతోంది. అంతేకాకుండా అద్వైత ప్రొఫైల్‌లో ఆమె ఆరు తమిళ సినిమాల్లో నటించినట్లు చూపిస్తుంది. నిజానికి ఉప్పెన ఫేం కృతి శెట్టికి హీరోయిన్గా ఇది డెబ్యూ మూవీ. దీంతో ఇన్ని చిత్రాలలో ఎప్పుడు నటించిందని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీంతో అసలు నిజమైన కృతిశెట్టి ఎవరు? ఈ అద్వైతకు ఉప్పెన ఫేం కృతి శెట్టి ఏమవుతారు అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి పేరుతో ఇంతకుముందు కూడా ఓ హీరోయిన్ ఉన్నారు. అయితే సినిమాల్లో పెద్దగా రాణించకపోవడంతో ఆమె తన పేరును అద్వైతగా మార్చుకుంది. మొన్నటి ఉప్పెన ఫేం కృతిశెట్టికి వికీపీడియాలో ప్రొఫైల్ లేదు. దీంతో ఆమె పేరును సెర్చ్ చేస్తే అద్వైత ప్రొఫైల్ ఓపెన్ అయ్యేది. ప్రస్తుతం కృతి శెట్టి పేరున ప్రొఫైల్ క్రియేట్ అయినప్పటికీ ఆ పేరు సెర్చ్ చేస్తే మాత్రం రెండు ప్రొఫైల్స్, రెండు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో గూగుల్ మమ్మల్పి కన్ఫ్యూజ్ చేసేస్తుందంటూ ఆమె ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. ప్రస్తుతం కృతిశెట్టి నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుహీరో రామ్‌కు జోడీగానూ ఓ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది. చదవండి : వైరల్ : 'బేబమ్మ' డ్యాన్స్ వీడియో చూశారా? నితిన్ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు -
తెలుగు వికీపిడియాలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనే ’వికీపీడియా’లో తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగులో అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం కొద్దిమంది ఔత్సాహికులు వికీపీడియా లో రాష్ట్ర సమాచారం తెలుగులో పొందుపరుస్తుండగా, దీనిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఔత్సాహికులు, నిపుణు లు, జర్నలిస్టులు, భాషాభిమానుల సహకారం తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇటీవల ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించి, ఇంటర్న్నెట్పై ఆసక్తి చూపుతున్న వారిని ఎంపిక చేసింది. తెలుగు వికీని ఎలా ఉపయోగించుకోవాలి? సమాచారం సేకరణ, ఉన్న వివరాల్లో లోపాలు సరిదిద్దడం వంటి అంశాలపై వీరికి వర్చువల్ విధానంలో ఫిబ్రవరి 1 నుంచి శిక్షణ ఇస్తోంది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్నీ వికీ వ్యాసాల్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర అవతరణ తర్వాత భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాల్లోని సమాచారాన్నీ తెలుగులో అందుబాటులోకి తెస్తారు. గ్రామీణులకూ చేరేలా స్థానిక భాషలో సమస్తం... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘టీ ఫైబర్’ప్రాజెక్టు ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇంటర్నెట్లో వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని తెలుగులో అందుబాటులోకి తేవడంపైనా దృష్టి సారించింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో రాష్ట్రంలోని వివిధ రంగాలు, అంశాల సమాచారం స్థానిక భాషలో అందుబాటులోకి తెస్తోంది. వికీపీడియాలో ఇంగ్లిషులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ట్రిపుల్ ఐటీ భాగస్వామ్యంతో కేంద్ర ఐటీ శాఖ ‘ఇండిక్ వికీ ప్రాజెక్టు’చేపట్టింది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ఐటీ శాఖ కూడా భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు వికీపీడియాలో సమాచార లభ్యత, సముదాయ అభివృద్ధి, శిక్షణ, అవగాహన, సాంకేతికత, పరిశోధన తదితర కోణాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. తెలుగులో 70 వేల పేజీల సమాచారం.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 438 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, ఇందులో మన దేశం నుంచి 56 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇది దేశ జనాభాలో 40 శాతం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 28 భాషల్లో భారత్‌వి ఎనిమిది ఉన్నా, వికీపీడియాలో మాత్రం భారతీయ భాషల్లో సమాచారం అంతంత మాత్రంగానే ఉంది. ఇందులోనూ అత్యధికంగా హిందీ, తమిళం, బెంగాలీలో అందుబాటులో ఉండగా తెలుగు నాలుగో స్థానంలో ఉంది. వికీపీడియాలో లక్షల కొద్ది పేజీల సమాచారం అందుబాటులో ఉండగా, హిందీలో 1.34 లక్షల పేజీలు, తెలుగులో సుమారు 70 వేల పేజీల సమాచారం మాత్రమే ఉంది. స్థానిక భాషలో సమాచారం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, పర్యాటక విశేషాలు, ప్రముఖుల సమాచారం తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. -
వండ్రంగి పని చేస్తూ.. హిందీ కంటెంట్ కింగ్ అయ్యాడు
డాక్టర్‌ను కాబోయి యాక్టర్నయా అంటుంటారు కొందరు నటులు. అలాగే 22 ఏళ్ల రాజు జంగిడ్ కార్పెంటర్‌గా కెరీర్ మొదలుపెట్టి వికీపీడియా కంటెంట్ సమీక్షకుడుగా ఎదిగాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా థడియా అనే కుగ్రామంలో పేదరికంలో జన్మించిన రాజు చదువుకుంటూనే వండ్రంగి (కార్పెంటర్) పనిచేసేవాడు. ఇటుపని అటు చదువుతోపాటు రాజుకు వికీపీడియాలో ఆర్టికల్స్ చదవడం ఒక అలవాటుగా ఉండేది. దీంతో తనకు దేనిగురించైనా సమాచారం కావాలంటే వెంటనే వికీమీద పడిపోయేవాడు. అయితే తన మాతృభాష హిందీ కావడంతో హిందీలోనే కంటెంట్‌ను వెతికేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి తన గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి వికీలో వెతకగా ఎక్కడా సమాచారం దొరకలేదు. రాజ్యభాష అయిన హిందీలో సమాచారం ఎక్కువగా లేకపోవడం ఏంటీ అనుకుని.. వికీలో హిందీ భాషలో మరింత సమాచారం అందుబాటులో ఉండాలని భావించి వికిపీడియా వలంటీర్‌గా చేరి హిందీలో ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాడు. అలా తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే కంటెంట్ రైటర్‌గా మారాడు. అలా రాసే క్రమంలో తన ఊరి చుట్టుపక్కల సమాచారాన్ని అక్కడి అధికారులతో మాట్లాడి వికీపీడియాలో పోస్ట్ చేసేవాడు. రాజు పదో తరగతి పూర్తయినా తన ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాలేదు. దీంతో చదువు మానేసి వడ్రంగి పనిలో చేరాడు. పనిచేస్తూనే వీలు దొరికినప్పుడల్లా వికీ ఆర్టికల్స్‌ను రాస్తూ, పేజీలను ఎడిట్ చేసేవాడు. రాజు పనితనం నచ్చడంతో తన పరిస్థితి తెలుసుకున్న వికీపీడియా నిర్వాహకులు అతడికి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందించారు. ఇక అప్పటినుంచి రాజు హైక్వాలిటీ కంటెంట్ ఇవ్వడంతోపాటు వికీపీడియా ఎడిటర్‌గా ఎన్నో సైబర్ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాడు. ఇప్పటిదాక రాజు 57 వేల వికీపీడియా పేజీలను ఎడిట్ చేయడంతోపాటు 1,880 ఆర్టికల్స్‌ను రాశాడు. మనలో ఎన్ని నైపుణ్యాలున్నా పరిస్థితులతో పోరాడకపోతే గెలవలేమని చెబుతున్నాడు రాజు. ‘2013, 2014 సంవత్సరాలలో వికీలో ఆర్టికల్స్‌ను అప్లోడ్ చేసేవాడిని. కానీ వికీ అడ్మిన్లు నా ఆర్టికల్స్‌ను బ్లాక్ చేసేవాళ్లు. అలా ఎన్నోసార్లు జరిగిన తరువాత.. అసలు వికీవాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అవి మాత్రమే అప్లోడ్ చేసేవాడిని. ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్ ద్వారా 150 నుంచి 200 పదాల ఆర్టికల్స్‌ను రాసేవాడిని. అయితే కీబోర్డు చాలా కష్టంగా అనిపించేది. ఆ తరువాత ల్యాప్‌టాప్ రావడంతో 400 పదాలకు పైగా ఆర్టికల్స్‌ను రాయగలిగాన’ని రాజు చెప్పాడు. 2017లో కార్పెంటర్ ఉద్యోగం మానేసిన రాజు మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగించి బిఏ డిగ్రీ పట్టాపుచ్చుకున్నాడు. సైబర్ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వికీ స్పెషల్ ప్రాజెక్ట్ ‘వికీ స్వస్థ’కు పనిచేస్తున్నాడు. ఇందులో హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ రాస్తూనే ఇతర రంగాలకు చెందిన ఆర్టికల్స్ ను అందిస్తున్నాడు. హిందీలో వికీ క్రికెట్ ప్రాజెక్ట్ ప్రారంభించి 700 ఆర్టికల్స్‌ను కంట్రిబ్యూట్ చేశాడు. హిందీలో క్రికెట్‌కు సంబంధించిన ఆర్టికల్స్ తక్కువగా ఉండటంతో మంచి సమాచారం అందిస్తున్న ఈ ప్రాజెక్టు సక్సెస్ అయింది. కాగా ఇండియాలో హిందీ వికీలో మొత్తం 11 మంది మాత్రమే యాక్టివ్ కంట్రిబ్యూటర్లుగా ఉన్నారు. వీరిలో రాజు ఒకడు కావడం విశేషం. -
సోషల్ మీడియాకు సంకెళ్లా?..ట్రంప్ ఉత్తర్వులపై వికీపీడియా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణకు ట్రంప్ త్వరలో ఆదేశాలిస్తారన్న వార్తలపై వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడానికి అధ్యక్షుడికి అధికారాల్లేవని, ఒకవేళ ట్రంప్ అలాంటి ఆదేశాలిస్తే అవి న్యాయబద్ధం కావని చెప్పారు. యూఎస్ రాజ్యాంగానికి జరిగిన తొలి సవరణ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. అయితే రాజకీయకారణాలతో ఏదైనా సాకులు చెప్పి భావస్వేచ్ఛను నియంత్రించేందుకు ప్రయత్నించే జిత్తులు ప్రభుత్వాల వద్ద ఉంటాయన్నారు. కానీ ఇలా నియత్రించే యత్నాలు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని, ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి ప్రజలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసుకునేందుకు సాధనాలని చెప్పారు. గతంలో ప్రజాభిప్రాయాన్ని కంట్రోల్ చేయాలని పరోక్షంగా యత్నించిన ఫేస్బుక్ ప్రస్తుతం ప్రజాభిప్రాయ స్వేచ్ఛ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను దుర్వినియోగం చేయడం కూడా మనం చూశామన్నారు. ఇలాంటివి జరగకుండా సదరు ప్లాట్‌ఫామ్స్ చర్యలు తీసుకోవాలని సూచించారు. వికీపీడియాలో ఉంచే సమాచారాన్ని పూర్తిగా నమ్మదగిన వర్గాల నుంచే సేకరిస్తామని, ఇందుకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇందుకోసం టాప్ ర్యాంకింగ్ ఉన్న పత్రికలు, మ్యాగజైన్ల నుంచి రిఫరెన్స్ తీసుకుంటామన్నారు. ఉదాహరణకు ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైనా చెత్త మాట్లాడితే దాన్ని సోర్స్‌గా అంగీకరించమన్నారు. -
మాతృభాషకు ప్రాధాన్యం తెలుగు వికీపీడియా సదస్సు–2020లో వక్తలు
రాయదుర్గం: విజ్ఞానమంతా ఆంగ్లంలోనే నిక్షిప్తమై ఉందని, దాన్ని అనువదించి భవిష్యత్తు తరాలకు అందించాలంటే మాతృభాష తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని వికీపీడియా సదస్సు–2020లో వక్తలు అభిప్రాయపడ్డారు. వికీపీడియాలో ప్రస్తుతం దాదాపు 72 వేల వరకూ ఉన్న వ్యాసాలను ఏడు లక్షలకు పెంచాలని సదస్సులో తీర్మానించారు. గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ–హైదరాబాద్‌లోని కోహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ (కేసీఐఎస్) ఆడిటోరియంలో శనివారం ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. వికీపీడియాలో వ్యాసాలు పెంచడం కోసం ప్రత్యేక యంగ్ బ్రిగేడ్‌ను తయారు చేసేందుకు ట్రిపుల్ఐటీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక శాఖ ద్వారా అనేక చారిత్రక, భాషా, పండుగల కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటుతున్నామని పేర్కొన్నారు. వికీపీడియాలోనే కాకుండా ఎక్కడైనా మాట్లాడే భాష, రాసే భాష వేర్వేరుగా ఉండాలని అనుకుంటారనీ, కానీ మాట్లాడే భాషలోనే రాయడం మంచిదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక విజ్ఞానం పెరగడంతో మనిషి మేధస్సు పెరిగినా మనస్సు మాత్రం పెరగడం లేదని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం డిజిటల్ లిటరసీ సమస్య ఉందని, వికీపీడియాలో ఏడు మిలియన్ల ఇంగ్లిష్ వ్యాసాలుంటే అవి అమెరికా, యూరోప్ వాళ్లు రాసినవేనని ట్రిపుల్ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. వికీపీడియాపై ఉచిత శిక్షణ ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో ఉచితంగా ప్రతీ శుక్రవారం వికీథాన్ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, ప్రతీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వికీపీడియాపై శిక్షణ నిర్వహిస్తున్నామని ట్రిపుల్ఐటీ ఆర్ అండ్ డీ మాజీ డీన్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ చెప్పారు. తెలుగు వికీపీడియాలో వ్యాసాల సంఖ్య గణనీయంగా òపెంచేందుకు హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ఐటీలో ప్రాజెక్టు తెలుగు వికీ పేరిట ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజేనారాయణన్ తెలిపారు. ఈ సదస్సులో ఇంకా ట్రిపుల్ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనిరాజు, వెంకటేశ్వర్లు, దిలీప్‌కొణతం, ప్రవీణ్ గరిమెల్ల, ప్రాజెక్టు తెలుగు వికీ బృందం, పలువురు మేధావులు, ట్రిపుల్ఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
వికీపీడియాలో పచ్చ దొంగలు
-
బీసీజీపై వికీపీడియాలో దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) వాస్తవ సమాచారం నెటిజన్లకు తెలియకుండా టీడీపీ మద్దతుదారులు వికీపీడియాలో ఆ పేజీని ఎడాపెడా మార్చివేశారు. రెండురోజుల్లోనే 12 సార్లు అందులోని సమాచారాన్ని మార్చి అది వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిల కంపెనీ అని, బఫూన్ కన్సల్టెన్సీ అని తప్పుడు సమాచారాన్ని జోడించారు. బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు వికీపీడియా పేజీని చూడగా ఈలోపే దాన్ని ఇష్టానుసారం మార్చి ఆ సంస్థపై దుష్ప్రచారానికి పూనుకున్నారు. బీసీజీ సమాచారాన్ని పూర్తిగా మార్చివేయడంతో ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వికీపీడియా యాజమాన్యం తప్పుడు సమాచారాన్ని సరిచేసింది. (చదవండి: ముగ్గురి నోట అదే మాట!)