అర్హుల గుర్తింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాల లబ్ధిదారుల ఎంపికలో అర్హుల గుర్తింపు ప్ర క్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఆయా పథకాల అమలుపై బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, త హసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో జిల్లాస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ఆయా పథకాల అమలును ప్రారంభిస్తుందన్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలనను ప్ర ణాళిక ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు 18004 251939 ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఎంపీడీవోలు ప్రత్యేక యాప్ సర్వేపై సూపర్‌చెక్ నిర్వహించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులు బాధ్యతతో పని చేస్తూ అర్హులకు లబ్ధిచేకూర్చేలా చూడాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఏవో శ్రీధర్, డీఆర్‌డీవో రాథోడ్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షి షా
Comments
Please login to add a commentAdd a comment