కశింకోట (అనకాపల్లి): స్థానికంగా రంగు రంగుల గాలి పటాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వస్తుందంటే వీటిని ఎగుర వేయడానికి యువకులు ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం సంక్రాంతి ముందు, తర్వాత సెలవు రోజుల్లో పిల్లలు ఉత్సాహంగా గాలిపటాలు ఎగుర వేసి ఆనందంగా గడుపుతారు. శారదా తీరం, చెరువు గట్టు, విశాలమైన వీధులు, ఇళ్లపైన గాలిపటాలను ఎగుర వేసి ఆనందిస్తుంటారు. గరుడ పక్షి, సీతాకోక చిలుక రూపాల్లో ఆకర్షణీయంగా తయారు చేసిన గాలిపటాలను విక్రయిస్తున్నారు. అయితే ఇవి అందంగా ఉన్నప్పటికీ ధరలు మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. పరిమాణాన్ని అనుసరించి కనీసం రూ.60 నుంచి రూ.460 వరకు విక్రయిస్తున్నామని దుకాణదారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment