రాజంపేట టౌన్: అనారోగ్యం బారిన పడటంతో వైద్యం చేయించుకునేందుకు కుటుంబ సభ్యుల సహాయంతో కారులో తిరుపతికి వెళుతున్న అథ్లెటిక్ కోచ్ హరికృష్ణమరాజు (39)ను దురదృష్టం వెంటాడింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా వున్నాయి. స్పోర్ట్ అథారిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) విభాగంలో రాజంపేట అథ్లెటిక్ కోచ్‌గా హరికృష్ణమరాజు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నాడు.
ఆయన గత కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతుండేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం చేయించేందుకు ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున కారులో చైన్నెకి తీసుకెళుతుండగా.. రాజంపేట బైపాస్‌రోడ్డులో ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో హరికృష్ణమరాజుకు కాలు విరగడంతోపాటు ఛాతి కారులోని ముందు సీటుకు బలంగా కొట్టుకుంది.
అలాగే అతని తండ్రి రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ నరసింహరాజుకు పక్కటెముకలు విరిగాయి. ఇదే ప్రమాదంలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, హరికృష్ణమరాజు భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. ఇదిలావుంటే తీవ్రంగా గాయపడిన తండ్రి కొడుకులను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. సోమవారం రాత్రి హరికృష్ణమరాజుకు శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆ హాస్పిటల్ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయాసుపత్రికి తీసుకెళ్లగా ఆయన అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుని స్వగ్రామమైన రాజంపేట మండలం ఎల్లాగడ్డలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలావుంటే బుధవారం జరిగే మృతుని అంత్యక్రియలకు తండ్రి నరసింహరాజును ప్రత్యేక వాహనంలో తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.
నిత్యం ఉదయం ఆరు గంటలకే ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానానికి వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే హరికృష్ణమరాజు ఇక లేరు అన్న చేదు నిజాన్ని ఆయన శిష్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. హరికృష్ణమరాజు మృతి పట్ల ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పోలా శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐపీ జి.భానుమూర్తిరాజు, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.షామీర్‌బాషా తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment