విచారణ కమిటీ | - | Sakshi
Sakshi News home page

విచారణ కమిటీ

Published Sun, Jan 26 2025 7:26 AM | Last Updated on Sun, Jan 26 2025 7:25 AM

విచార

విచారణ కమిటీ

డీటీసీ లైంగిక వేధింపులపై

సాక్షి ప్రతినిధి, కడప : మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైఎస్సార్‌ జిల్లా ఉప రవాణా అధికారి చంద్రశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు వెనకడుగు వేస్తున్నారా? ఈక్రమంలోనే రాజీ ప్రయత్నాలు ఆరంభించారా! అంటే విశ్లేషకులు అవును అనే సమాధానమిస్తున్నారు. మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి తలుపు తట్టే స్థాయికి చేరిన డీటీసీకి రక్షణగా రాష్ట్ర స్థాయి అధికారి అండదండలుగా నిలుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రాథమిక నివేదిక తప్పుదారి పట్టినట్లు తెలుస్తోంది. వెరసి జిల్లా స్థాయి విచారణ కమిటీ తెరపైకి వచ్చినట్లు సమాచారం.

ఇంటర్నల్‌ కమిటీ ఏర్పాటు

డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణాధికారిగా జేటీసీ కృష్ణవేణిని నియమించారు. బాధిత ఉద్యోగి, ఆమె భర్త నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి నివేదిక శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, రవాణాశాఖ కమిషనర్‌కు అందించినట్లు సమాచారం. జేటీసీ నివేదికను పరిశీలించిన కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆపై ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి కన్వీనర్‌గా ముగ్గురు సీనియర్‌ మహిళాధికారులు, ఒకరు ఎన్జీఓతో కూడిన ఇంటర్నల్‌ కమిటీ నియమించినట్లు సమాచారం. వాస్తవాలను పరిశీలించి మూడు రోజులల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. బాధిత మహిళా ఉద్యోగి సైతం ఫిర్యాదుకు వెనుకంజ వేయడం కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మరో మహిళా ఉద్యోగికి ఉన్నతాధికారి ద్వారా లైంగిక వేధింపులు లేకుండా ఉండాలంటే చట్టాన్ని ఆశ్రయించాలనే డిమాండ్‌ మహిళాలోకం నుంచి వ్యక్తమవుతోంది.

రాష్ట్ర స్థాయి అధికారి అండదండలు

డీటీసీ చంద్రశేఖరరెడ్డికి అండగా రవాణాశాఖలో పెద్ద ఎత్తున రాజీ ప్రయత్నాలు ఆరంభమైనట్లు సమాచారం. ఆ శాఖలో కీలకంగా ఉన్న రాష్ట్ర స్థాయి అధికారి సైతం ఈ వ్యవహారంలో అండగా నిలుస్తోన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి అధికారి అండదండలు ఉండటంతోనే ప్రాథమిక నివేదిక అస్తవ్యస్తంగా వెళ్లినట్లు తెలుస్తోంది. నిద్రలో నడిచే అలవాటు ఉన్న కారణంగానే డీటీసీ చంద్రశేఖరరెడ్డి.. ఆ ఇంటికి వెళ్లినట్లు నివేదికలో పొందు పర్చడం వివాదస్పదంగా మారినట్లు సమాచారం. జిల్లా మహిళాధికారుల నేతృత్వంలో ఫైవ్‌ ఉమెన్‌ కమిటీలో వాస్తవాలు నిగ్గుతేలాల్సిన అవసరం ఉంది. ఆ మేరకే కలెక్టర్‌ తదుపరి చర్యలకు సిఫార్సు సిద్ధం కానున్నట్లు సమాచారం.

ఇన్‌చార్జ్‌ డీటీసీగా ప్రసాద్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: జిల్లా ఉప రవాణాశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా ప్రసాద్‌ను నియమించారు. ఈయన అన్నమయ్య జిల్లాలో డీటీఓగా పని చేస్తున్నారు. ఇక్కడ డీటీసీగా పని చేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి మహిళా ఉద్యోగిపై లైగింక వేధింపులకు పాల్పడటంతో.. ఆయనను రవాణా శాఖ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

జేటీసీ నివేదికను తప్పు పట్టిన జిల్లా కలెక్టర్‌

డీటీసీపై విచారణకు ఐదుగురు మహిళా అధికారుల కమిటీ

రాజీ చేసేందుకు ఇతర జిల్లాల అధికారుల ప్రయత్నాలు

వివాదాస్పద అధికారిగా పేరు

ఓ మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి డీటీసీ చంద్రశేఖరరెడ్డి తలుపు తట్టారు. గమనించిన ఆమె తన భర్తకు ఫోన్‌ ద్వారా విషయం తెలియజేయడం, ఆయన డీటీసీకి ఫోన్‌ చేయడంతో అక్కడి నుంచి చంద్రశేఖరరెడ్డి జారుకున్నారు. ఆ తర్వాత సదరు మహిళా ఉద్యోగి భర్త రవాణా శాఖ కార్యాలయాలనికి వచ్చి డీటీసీ దూషించడంతోపాటు చితక బాదేందుందుకు ప్రయత్నించారు. తోటి ఉద్యోగులు అడ్డుకొని సర్దుబాటు చేయగా, డీటీసీ కాళ్ల బేరానికి వచ్చినట్లు సమాచారం. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షేపితమై ఉన్నాయి. రెండు నెలల కిందట కడపలో బాధ్యతలు చేపట్టిన డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి అనతికాలంలోనే వివాదాస్పద అధికారిగా మారారు. రెండు నెలల కాలంలోనే మహిళా ఉద్యోగినులను వేధించడం పరిపాటిగా మారింది. ఈయన పని చేసిన గుంటూరు, శ్రీకాకుళం, బాపట్ల, కావలి, నెట్లూరు జిల్లాల్లో ఇదే తీరులో మహిళా ఉద్యోగుల పట్ల లైంగికంగా వేధించిన ఆరోపణలున్నాయి. అయినా కూడా సత్వర చర్యలు చేపట్టేందుకు ఆశాఖలో కీలక అధికారి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
విచారణ కమిటీ 1
1/2

విచారణ కమిటీ

విచారణ కమిటీ 2
2/2

విచారణ కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement