ముగిసిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ వాలీబాల్ టోర్నీ
తృతీయ స్థానంలో ఖమ్మం బాలబాలికల జట్లు
ఖమ్మం స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడల్లో భాగంగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన జూనియర్ బాలబాలికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో వరంగల్ జట్టు నిలవగా, ద్వితీయస్థానాన్ని మహబూబ్‌నగర్ జట్టు దక్కించుకుంది. తృతీయ స్థానంలో ఖమ్మం జట్టు నిలిచింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు టైటిల్ దక్కించుకోగా, రెండో స్థానంలో మహబూబ్‌నగర్ జట్టు నిలిచింది. ఖమ్మం జట్టు తృతీయస్థానం కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. అయా స్థానాలు దక్కించుకున్న క్రీడాకారులకు బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు త్వరలో అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.క్రిష్టాఫర్‌బాబు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.గోవిందరెడ్డి, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు కె.నర్సింహమూర్తి, నరేష్, షఫీక్ అహ్మద్, టెక్నికల్ చైర్మన్ గణపతి, కన్వీనర్ రవీందర్‌రెడ్డి, వాలీబాల్ కోచ్ ఎండీ. అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment