82 కిలోల గంజాయి పట్టివేత
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 82 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఎస్.రమేశ్ కథనం ప్రకారం.. ఒడిశాలోని మల్కన్‌గిరిలో కొనుగోలు చేసిన 82 కేజీల గంజాయిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన వ్యక్తులు.. కారులోని వెనుకసీట్ కింద ప్రత్యేక అర తయారు చేయించి భద్రపరిచారు. ఈ కారును ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆపి తనిఖీ చేసి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు మరికొన్ని వస్తువులు, కారును సీజ్ చేశారు. కాగా, గంజాయి విలువ రూ.41 లక్షలు ఉటుందని, మిగిలిన వస్తువుల విలువ రూ.9 లక్షలు ఉంటుందని, నిందితులు కొట్టపంజు బకోద్రి, అబ్దుల్ నిజాద్ గంజాయిని కేరళ తరలిస్తూ పట్టుబడ్డారని, వారిపై భద్రాచలం ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెల్లడించారు. దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, హరీశ్, విజయ్ ఉన్నారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment