కంటి ఆపరేషన్ల నిర్వహణ అభినందనీయం
భద్రాచలంఅర్బన్: ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం అభినందనీయమని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మధుసూదనశాస్త్రి పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో.. యూఎస్‌ఏలోని ఎస్‌ఆర్ వాసవి అసోసియేషన్ సహకారంతో మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. ఉచితంగా 700 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో 857 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం, కళ్లజోళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు బాలాజీ, ఎస్.ఎల్.కాంతారావు, భానుప్రసాద్, కామేశ్వరరావు, లయన్స్‌క్లబ్ సభ్యులు రాజారెడ్డి, సూర్యనారాయణ, చారుగుళ్ల శ్రీనివాస్, ఆఫ్లాల్మిక్ అధికారులు జి.సంజీవరావు, వి.శ్రీనివాసరెడ్డి, తిరుమల్‌రావు, మారుతి కళాళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment