ములకలపల్లి: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ కె.రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని చాపరాలపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6 వేల నగదు, 5 మోటార్ సైకిళ్లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలి నుంచి పరారైన మరో నలుగురి గురించి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. క్యాక్రమంలో కానిస్టేబుళ్లు తిరుపతిరావు, రవికుమార్, రమణ, చిచ్ని, భాస్కర్, తేజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment