వేతనం రికవరీకి కలెక్టర్ ఆదేశం!
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా సంక్షేమ శాఖలో స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ లిటరసీ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసి రాజీనామా చేసిన సుజాతకు సంబంధించిన పీజీ సర్టిఫికెట్ నకిలీది అని ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆ నివేదికను కలెక్టర్ పంపించారు. ఈ మేరకు సంబంధిత నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన సుజాతపై క్రిమినల్ కేసు పెట్టి జీతం రికవరీ చేయమని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై డీడబ్ల్యూఓను వివరణ అడిగేందుకు ప్రయత్నం చేయగా ఫోన్ ఎత్తలేదు.
Comments
Please login to add a commentAdd a comment