నయన మనోహరం..
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
మామిడికుదురు: సంక్రాంతి ‘కళ’ ఉట్టిపడింది.. అహో అద్భుతహః అనేలా కట్టిపడేసింది. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిచేలా అప్పనపల్లి శ్రీబాల బాలాజీస్వామి క్షేత్రంలో సోమవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యం, కొమ్మ దాసరి, బుడ బుక్కల, సోదెమ్మ, గంగిరెద్దుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు, కేరళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఈ సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భోగి మంట వేసి సందడి చేశారు. 500 మీటర్ల భోగి పిడకల దండ ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో వివిధ పుష్పాలతో రూపొందించిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment