సైకిల్‌పై వెళ్లమంటాం
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరమని ఇక్కడికి వచ్చినంక తెలిసింది. పిల్లలు అల్లరి చేస్తే వాహనం ఇచ్చాం. కానీ, ఇకనుంచి ఇవ్వము. పని ఉంటే సైకిల్, లేకుంటే నడిచి వెళ్లమని చెబుతాం.
– బిపాషా, సిరిసిల్ల
ఇంకోసారి బైక్ ఎక్కనివ్వను
మా ఊరిలో ఓ పెద్ద మనిషికి బైక్ అవసరం అంటే వాళ్ల ఇంటి నుంచి మావాడు తీసుకెళ్లి, పోలీసులు పట్టుబడ్డాడు. పిల్ల లు వాహనాలు నడపడం ప్రమాదకరమని ఎస్పీ సారు చెప్పారు. ఇంకోసారి బైక్ ఎక్కనివ్వను.
– యానా రాజేశం, సిరిసిల్ల
ప్రజలు సహకరించాలి
వాహనాలు నడిపిన పిల్లలను పట్టుకుంటే తల్లిదండ్రులు విడిచిపెట్టాలని పైరవీలు చేయిస్తున్నారు. సంబంధిత పోలీసు అధికారులపై కోపగిస్తున్నారు. భవిష్యత్తు తరం ప్రమాదానికి గురికావొద్దనే మేము నాలుగు రోజులు తనిఖీలు చేశాం. మార్పు వస్తే అందరికీ మంచిది. ప్రజలు సహకరించాలి.
– అఖిల్ మహాజన్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment