ముత్తారం(మంథని): ముత్తారం మండలానికి చెందిన మల్యాల బాలయ్య బ్యాంకు ఖాతా నుంచి రూ.97 వేలు సైబర్ నేరగాళ్లు మాయం చేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈనెల 8న బాలయ్య ఎస్‌బీఐ అకౌంట్‌లో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.1.45లక్షలు జమయ్యాయి. 10న రాత్రి 9 గంటల సమయంలో ఎస్‌బీఐ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, ఖాతా వివరాలు అడుగుతుండగానే అకౌంట్ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు అకౌంట్‌లో మొదట రూ.45వేలు, తర్వాత మరో రూ.45వేలు జమయ్యాయి. అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రూ.90 వేలు, మరో అకౌంట్ నుంచి రూ.7వేలు విత్ డ్రా అయినట్లు మెస్సేజ్ రావడంతో బాధితుడు 1930 నంబరుకు ఫోన్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment