ఇవి మనుషులు తినే తిండి గింజలేనా?
సాక్షి బళ్లారి: ఇవి మనుషులు తినే తిండి గింజలేనా, వీటినే రేషన్ షాపులకు సరఫరా చేసి పేదలకు అందజేస్తున్నారా? అంటూ ఆహార పౌరసరఫరాల శాఖాధికారులను ఉప లోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప నిలదీశారు. గత మూడు రోజుల నుంచి ఆయన వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసి ఆయా శాఖల అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పౌరసరఫరాల శాఖ గోదామును సందర్శించి మరింత అసహనం, ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను తీవ్ర స్థాయిలో చెమటలు పట్టించారు. పేదలకు రేషన్ షాపుల ద్వారా అందజేస్తున్న జొన్నలను పరిశీలించారు. దాదాపు 48 వేల జొన్నల సంచులను ఉంచిన గోదాములో బస్తాలను పరిశీలించారు. గోదాములో వేల సంచులను నిల్వ ఉంచి ప్రతి నెల పేదలకు సరఫరా చేస్తున్న వాటిని ఎలా ఉన్నాయో పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. జొన్నలు చేతిలో పట్టుకొంటే పురుగులు వస్తున్నాయని, పిండి అవుతున్నాయని, ముక్కిపోయాయని అన్నారు.
సమస్యలకు పరిష్కారమే ధ్యేయం
బళ్లారి అర్బన్: తమ పరిధిలో సమర్పించే ఫిర్యాదులు, సమస్యలకు పరిష్కారం కల్పించడమే లోకాయుక్త ప్రధాన ఉద్దేశమని ఉప లోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప పేర్కొన్నారు. స్థానిక అతిథి గృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమాశంలో ఆయన మాట్లాడారు. ఉప లోకాయుక్త కార్యనిర్వహణ పరిధిలోని జిల్లాలో 274 కేసులకు గాను 87 వివిధ రకాల కేసులను ఫిర్యాదు దారులు, ప్రతివాదుల సమక్షంలో విచారణ జరిపి పరిష్కరించినట్లు తెలిపారు. రెండు రోజులుగా ఫిర్యాదులు, విజ్ఞప్తుల విచారణ వేళ 177 కొత్త ఫిర్యాదుల విచారణ చేపట్టామన్నారు. వీటిలో 68 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. 97 మిగిలిన ఫిర్యాదుల విచారణలో కూడా 19 ఫిర్యాదుల కేసులను పరిష్కరించామన్నారు. బళ్లారి జిల్లాలో ఈ నెల 16 నుంచి 18 వరకు వివిధ చోట్ల ఆకస్మికంగా పర్యటించి అక్కడి స్థితిగతులను పరిశీలించి తగిన సలహాలు, సూచనలను అధికారులకు సూచించానన్నారు. జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఎస్పీ డాక్టర్ శోభారాణి, అధికారులు పాల్గొన్నారు.
అధికారులపై తీవ్ర స్థాయిలో
ధ్వజమెత్తిన వైనం
ఉప లోకాయుక్త జడ్జి వీరప్ప
Comments
Please login to add a commentAdd a comment