బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను శుక్రవారం వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వేగవంతమైన ప్రపంచంలో డిజిటల్ అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు విజయం సాధించడానికి సాధ్యమైనంత వనరులను అందించడమే మా లక్ష్యం అన్నారు. కంప్యూటర్ ల్యాబ్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, నెట్‌వర్కింగ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి రంజిత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment