పోలీస్ సంక్షేమమే ప్రథమ కర్తవ్యం
మెదక్ మున్సిపాలిటీ: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీస్‌శాఖ పనిచేస్తుందని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కవాతు ప్రాంగణం, సెల్యూట్ బేస్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు మంచి పరేడ్‌గ్రౌండ్ రావడం శుభసూచికం అన్నారు. క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం అలవాటు పడుతుందన్నారు. పోలీస్ సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సరెండర్ లివ్‌ల బిల్లుల కోసం రూ. 200 కోట్లు, ఆరోగ్య భద్రత కోసం రూ. 75 కోట్లు విడుదలైనట్లు వివరించారు. అమీన్‌పూర్, రాయపోల్, చేగుంట, నార్సింగి, మండల కేంద్రాల్లో కొత్త భవనాల నిర్మాణంతో పాటు నూతన మండల కేంద్రాల్లో పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి నిబద్ధత, క్రమశిక్షణ గల అధికారి అని కొనియాడారు. తాను నిర్మల్ ఏసీపీగా ఉన్నప్పుడు ఆయన కడెం ఎస్సైగా పనిచేశారని గుర్తుచేశారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. పోలీసుల మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. టీఏ, డీఎల్ కూడా రావడం లేదని.. దీనిని మొదటి ప్రాధాన్యతగా చూడాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కొన్ని పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని, కొత్త పోలీస్‌స్టేషన్లు సైతం కావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీలు పనిచేయడం లేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు, జిల్లాలోని అన్ని మండలాల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
డీజీపీ డాక్టర్ జితేందర్
జిల్లాలో కొత్త పోలీస్‌స్టేషన్ల
ఏర్పాటుకు చర్యలు
నక్సల్స్, నార్కోటిక్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం
నక్సల్స్, నార్కోటిక్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసులను త్వరితగతిన ఛేదించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డయల్ 100 సేవలందించేందుకు 2,000 వాహ నాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సైబర్ క్రైమ్‌తో రూ. 180 కోట్లు రికవరీ చేశామన్నారు. రూ. 300 కోట్లను వేరే అకౌంట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు వివరించారు. ప్రపంచస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ 24గంటలు సేవలందిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment