పాకిస్థాన్‌లో హీరో నాగార్జునని పోలిన వ్యక్తి.. లక్షల్లో నెల సంపాదన! | Pakisthan Food Vlogger Look Like Nagarjuna Earns Lakhs From Social Media, Know About Him In Telugu - Sakshi
Sakshi News home page

Nagarjuna: నాగ్ పోలికలు.. లక్షలు సంపాదిస్తున్న పాక్ వ్లాగర్!

Published Tue, Mar 12 2024 10:36 AM | Last Updated on Tue, Mar 12 2024 11:49 AM

 Pakisthan Food Vlogger Look Like Nagarjuna Earns Lakhs - Sakshi

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. ఇది నిజమా కాదా అని పక్కనబెడితే కొందరు వ్యక్తుల్ని చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది. ఇప్పుడు అలానే పాకిస్థాన్‌లోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. దీనికి కారణం ఏంటంటే అతడు.. తెలుగు స్టార్ హీరో నాగార్జునలా ఉండటమే. కేవలం పోలికల ఉండటం ఇతడికి ప్లస్ అయింది. అలానే నెలకు లక్షలు సంపాదిస్తున్నాడట.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?)

2019 నుంచి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్న పాకిస్థాన్‌లో జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారీ మాస్ అనే వ్యక్తికి ఒకానొక సందర్భంలో తాను ఇండియన్ యాక్టర్ నాగార్జునలా ఉన్నట్లు ఎవరో చెప్పారు. దీంతో సదరు వ్యక్తి.. మన నాగార్జున గురించి తెలుసుకున్నాడు. కాస్త అతడిలా మేకప్ చేసుకుని షార్ట్ వీడియోస్ చేశాడు. ఇప్పుడు మాత్రం ఫుడ్ వ్లాగింగ్ చేస్తున్నాడు.

పాకిస్థాన్‌లో ఫుడ్ వ్లాగర్‌గా ఫేమ్ తెచ్చుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తాను నాగార్జున పోలికలతో ఉండటం బాగా కలిసొస్తుందని, ఫుడ్ వీడియోలు చేసుకుంటూ నెలకు రూ.4-5 లక్షల వరకు సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన జీవితం హ్యాపీగా ఉందని అన్నాడు. ఏదేమైనా నాగ్ పోలికలు ఉండటం మనోడికి బాగా ప్లస్ అయింది. లక్షలు సంపాదించుకుంటున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement