ఫారెన్ టూర్‌లో విజయ్-రష్మిక.. అది నిజమేనా? | Rashmika Vijay Devarakonda Spotted Turkey Together Pics Viral | Sakshi
Sakshi News home page

Rashmika Vijay Devarakonda: ఒకేచోట రష్మిక-విజయ్.. ఫ్యాన్స్ కనిపెట్టేశారు!

Published Sun, Oct 8 2023 4:03 PM | Last Updated on Sun, Oct 8 2023 4:57 PM

Rashmika Vijay Devarakonda Spotted Turkey Together Pics Viral - Sakshi

టాలీవుడ్ లవ్ బర్డ్స్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ-రష్మిక మళ్లీ జంటగా కనిపించారు. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. అలానే సోషల్ మీడియాలో రష్మిక ఇలా పోస్ట్ పెట్టగానే.. రౌడీ హీరో ఫ్యాన్స్ అలా అలెర్ట్ అయిపోయారు. ఫొటో, వీడియో చూసి ఓ విషయాన్ని కనిపెట్టారు. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!)

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో 'యానిమల్', 'పుష్ప 2' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక. అలాంటిది తాజాగా తను గతంలో టర్కీ వెళ్లిన ఫొటో, వీడియోని పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. ట్రావెలింగ్‌ని మిస్ అవుతున్నానని క్యాప్షన్ పెట్టింది. అయితే అదే ప్లేసులో విజయ్ దేవరకొండ ఉన్న ఫొటోస్‪‌ని నెటిజన్స్ బయటపెట్టారు. ఇద్దరూ ఈ టూర్ కి కలిసే వెళ్లారని అంటున్నారు.

తాము ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని విజయ్-రష్మిక చెబుతున్నారు. కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో మాల్దీవులు టూర్‌కి కూడా కలిసే వెళ్లారు. వేర్వేరుగా ఆ ఫొటోలు పోస్ట్ చేశారు. కానీ ఫ్యాన్స్‌కి అసలు విషయం అర్థమైపోయింది. ఇప్పుడు కూడా రష్మిక పాత ఫొటోల్ని పోస్ట్ చేయడంతో విజయ్ రిలేషన్‌లోనే ఉందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది రష్మిక చెబితేనే బెటర్!

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement