గణిత ప్రతిభ పరీక్షలు
ములుగు: తెలంగాణ గణిత ఫోరం(టీఎంఎఫ్) ములుగు మండలశాఖ అధ్యక్షుడు సుతారి మురళీధర్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)లో విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి ఇనుగాల సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రశ్నపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గణితంపై పట్టుసాధిస్తే భవిష్యత్‌లో ఎలాంటి పోటీ పరీక్షలైనా సులభంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఈ పరీక్షల్లో మొదటిస్థానంలో కృష్ణవంశీ(జెడ్పీహెచ్‌ఎస్, కోయగూడెం), శ్రావణి(జెడ్పీహెచ్‌ఎస్, దేవగిరిపట్నం), హిమవర్ష(జెడ్పీహెచ్‌ఎస్, పత్తిపల్లి), గణేశ్(జెడ్పీహెచ్‌ఎస్, బాలుర ములుగు), రిత్విక్(మోడల్‌స్కూల్, బండారుపల్లి) నిలిచారు. ద్వితీయస్థానంలో భవ్యశ్రీ(జెడ్పీహెచ్‌ఎస్, అబ్బాపూర్), రాజేశ్(జెడ్పీహెచ్‌ఎస్, మల్లంపల్లి) నిలిచారు. ఈ కార్యక్రమంలో గణిత ఫోరం రాష్ట్ర సలహాదారుడు డాక్టర్ కందాల రామయ్య, హెచ్‌ఎం రాజేందర్, ములుగు మండల అధ్యక్షుడు పిట్టల మల్లయ్య, వెంకటశ్రీనివాస్, అరుణ, భారతి, అమీర్, రవీందర్, హమీద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment