‘మహాలక్ష్మి’తో కోట్ల రూపాయలు ఆదా..
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహా లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు కోట్ల రూపాయల మేర ఆదా అయ్యాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ములుగు బస్టాండ్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్–2 డిపో మేనేజర్ జోత్స్నతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిందన్నారు. ఇప్పటి వరకు రూ.114.3 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం వినియోగించుకోవడం ద్వారా రూ.3856.40 కోట్ల రవాణా చార్జీలను ఆదా చేసుకున్నారన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఏటూరునాగారంలో బస్‌డిపో మంజూరు కావడమే కాకుండా జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బానోత్ రవిచందర్‌ను ఆర్టీసీ అధికారులు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్
Comments
Please login to add a commentAdd a comment