తిరుమలగిరిలో సీఎం కాన్వాయ్‌ని తనిఖీ చేస్తున్న అధికారులు
తిరుమలగిరి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం పరిధిలోని ఈదులపర్రె తండా సమీపంలో ని చెక్‌పోస్టు వద్ద సీఎం కాన్వాయ్‌ని మంగళవారం స్టాటిస్టిక్ సర్వేలైన్ టీమ్(ఎస్‌ఎస్‌టీ) క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన సీఎం బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి జనగామ, తిరుమలగిరి మీదుగా ఈ కాన్వాయ్ వెళ్తోంది. ఇందులో బస్సుతో పాటు రెండు ఫార్చూనర్లు ఉన్నాయి.
కేసీఆర్ మాత్రం ఈ కాన్వాయ్‌లో లేరు. సీఎం హెలికాప్టర్‌లో వెళ్లారు. ఈ తనిఖీలో టీమ్ లీడర్ జాన్ మహ్మద్, వీరన్న, రమేష్, తానీషా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment