కొనసాగుతున్న రైల్వే గేట్ మరమ్మతులు
నవీపేట: నవీపేట మండల కేంద్రంలో బా సర రహదారిపై గల ప్రధాన రైల్వే గేట్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 26న ప్రారంభమైన పనులు 30 వరకు కొనసాగనున్నాయి. దీంతో నిజామాబాద్ నుంచి బాసర రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా రు. ఇరుకుగా ఉన్న దర్యాపూరు చెరువు కట్ట పై నుంచి రాకపోకలు సాగించారు. ట్రాఫి క్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 22వ రోజు సమ్మెలో భాగంగా ఉద్యోగులు శనివారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు భిక్షాటన చేశారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా షాపులలో, పాదాచారులను భిక్షం అడిగి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రాజు, భూపేందర్లు పేర్కొన్నారు. పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు క్రమశిక్షణతో పని చేస్తున్నా కనీస వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో తెలపాలన్నారు. ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని లేని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి ప్రసాద్ , మహిళా అధ్యక్షురాలు గంగామణి, సుప్రజా, రాజు విద్యాసాగర్, పవిత్రన్, అప్సర్ ,సంతోష్, గిరీష్, రమేష్, మోహన్, జలంధర్, రాజమణి, రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment