ప్రకృతి సాగు లాభదాయకం.. ●
● వెలుగు ఏపీఎం శ్రీనివాస్
డెంకాడ: ప్రకృతి సాగు విధానంలో పంటలు పండించడం ఎంతో లాభదాయకమని, దిగుబడులు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయని వెలుగు ఏపీఎం శ్రీనివాస్ అన్నారు. మండలంలోని డెంకాడ, అమకాం గ్రామాల్లో ప్రకృతి సాగులో పండించిన కూరగాయల స్టాల్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఓం శ్రీనివాస్, ఎఫ్‌పీజీ ఏపీఎం గురుమూర్తి మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగించి పంటలు సాగు చేయడం వల్ల పంటలు కలుషితమవుతాయన్నారు. సేంద్రియ ఎరువులు వినియోగించడం వల్ల ఆరోగ్యకరమైన దిగుబడులు వస్తాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు ప్రతి సోమవారం వెలుగు కార్యాలయం వద్ద దిగుబడులు విక్రయిస్తారని, ఈ స్టాళ్లను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment