రీ ఓపెన్ వినతుల పట్ల కలెక్టర్ ఆగ్రహం
● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 163 వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: వినతులు రీ ఓపెన్ అయిన సంబంధిత శాఖల అధికారులపై కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమ్యల పరిష్కార వేదికలో ఆయనతో పాటు డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, మురళి తదితరులు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 163 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో వినతుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. సంతృప్తికర రీతిలో పరిష్కరించక మళ్లీ రీ ఓపెన్ అవుతున్నాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడకుండా ఉన్న వినతులు కూడా ఉన్నాయని, అధికారులు వినతులు వెంటనే చూడని ఎడల చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. సీఎంఓకు పంపే మినిట్స్‌లో వారి పేర్లను నమోదు చేస్తామని తెలిపారు. ఆర్థికేతర వినతులన్నింటికీ తగు పరిష్కారం చూపాలని ఫార్వర్డ్ చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 17 ఫిర్యాదులు
విజయనగరం క్రై మ్: ప్రజల సమస్యల తక్షణ పరిష్కారానికి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ వకుల్ జిందల్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ప్రజల నుంచి 17 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ ఎస్.శంకరరావు, ఎస్బీ సీఔ ఎ.లీలారావు, ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment