నేడు పీఎఫ్ కార్యాలయం ముట్టడి
జయపురం: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని స్థానిక గగణాపూర్ సేవా పేపరుమిల్లు కార్మికులు, కంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారు. ప్రధానంగా పీఎఫ్ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బరంపురం పీఎఫ్ కమిషనర్ కార్యాలయాన్ని ఈ నెల 16వ తేదీన ముట్టడించనున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం పేపరుమిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులు బరంపురం బయలుదేరి వెళ్లారు. ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి నేతృత్వంలో కార్మిక నేతలు బసంత బెహర, సరోజ్ పండ, సుభాష్ బెహర, ఉమాశంకర శతపతి, కె.సత్యనారాయణ, సుధాకర హరిజన్, ప్రహ్లాద మల్లిక్, కె.హనుమంతరావు తదితరులు ఎర్ర జెండాలు చేత బట్టి బరంపురం బయలు దేరారు.
Comments
Please login to add a commentAdd a comment