నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
పార్వతీపురం టౌన్: నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 31 రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడవరాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాలను అతివేగంగా నడిపినా, బైక్ రేసులు నిర్వహించినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్ధరాత్రి ఒంటి గంట తరువాత ప్రజలెవ్వరూ రహదారులపై తిరగరాదన్నారు. మైనర్లుకు వారి తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదన్నారు. డిజే/లౌడు స్పీకర్లతో పెద్ద శబ్ధం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకల పేరుతో మందుగుండు సామగ్రిని కాల్చడం, ప్రదర్శించడం లేదా ఉపయోగించినా నిబంధనలు అతిక్రమణ కిందకు వస్తుందన్నారు. మహిళలు, యువతులను వేధించడం, ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిపై కేసులు నమోదుచేస్తామని పేర్కొన్నారు. ప్రభు త్వం నిర్దేశించిన సమయం వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయా మద్యం షాపులు, బార్లపైన చర్యలు తప్పవన్నారు. హాటళ్లు, రెస్టారెంట్లలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవన్నారు.
● నూతన సంవత్సర వేళ ఒంటి గంట తరువాత రోడ్లపై తిరగొద్దు
● ఎస్పీ మాధవ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment